Pradeep Chandra
-
నమస్తే హైదరాబాద్
ఎంతో చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరాన్ని నేపథ్యంగా తీసుకొని పి.సి.క్రియేషన్స్ పతాకంపై ‘నమస్తే హైదరాబాద్’ అనే పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి చిమ్మని మనోహర్ దర్శకుడు. చిత్రవిశేషాలను మనోహర్ తెలియజేస్తూ– ‘‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక తెలంగాణ దర్శకుడిగా నేను రూపొందిస్తున్న పూర్తి స్థాయి యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు. చిత్రసంగీతదర్శకుడు ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ – ‘‘మంచి పాటలివ్వడానికి స్కోప్ ఉన్న కథ ఇది. తెలంగాణ యువతలో మంచి సంగీత జ్ఞానం ఉంది. అందుకే నూతన గాయనీ గాయకులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో పలువురు సింగర్స్‌కు ఆడిషన్స్ నిర్వహించాం’’ అన్నారు. నూతన నటీనటులతో రూపొందనున్న ఈ చిత్రానికి కెమెరా: వీరేంద్ర లలిత్, నిర్మాత: ప్రదీప్‌చంద్ర, కథ–స్క్రీన్‌ప్లే–మాటలు–దర్శకత్వం: చిమ్మని మనోహర్. -
కొత్త పీఆర్సీ..!
రాష్ట్ర తొలి వేతన సవరణ సంఘం ఏర్పాటుకు సర్కారు నిర్ణయం ► మాజీ సీఎస్ ప్రదీప్‌చంద్ర నేతృత్వంలో కమిషన్ ►ఆరు నెలల్లో నివేదిక.. 2018 జూలై ఒకటి నుంచి అమలు ►పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచే ప్రతిపాదన ►పీఆర్సీపై వచ్చే నెల తొలివారంలో ప్రత్యేక సమావేశం ► 2015లో ఇచ్చిన ఫిట్మెంట్ ఉమ్మడి రాష్ట్రంలోని పీఆర్సీదే సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ కమిషన్) ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. వచ్చే నెల తొలి వారంలోనే కమిషన్‌ను నియమించాలని.. వచ్చే ఏడాది జూలై నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపును అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదననూ పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆగస్టు మొదటి వారంలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. ఆ ఫిట్మెంట్ పాత పీఆర్సీదే.. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో ప్రభుత్వం ఏకంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించినా..అది ఉమ్మడి రాష్ట్రంలో వీకే అగర్వాల్ చైర్మన్‌గా ఉన్న పదో పీఆర్సీ అమలు సమయానికి సంబంధించినదే. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేయనున్న వేతన సవరణ సంఘం రాష్ట్రంలో మొదటి పీఆర్సీ కానుంది. 2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదో పీఆర్సీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. ఆ పీఆర్సీ అమలు సమయం మేరకు 2013 జూలై ఒకటో తేదీ నుంచే వర్తింపజేసింది. రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉన్న కాలాన్ని నోషనల్‌గా పరిగణించి.. ఆవిర్భావం నాటి నుంచి నగదు రూపంలో పీఆర్సీ బకాయిలను చెల్లిస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్‌చంద్ర ఆధ్వర్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే రిటైరైన సీనియర్ ఐఏఎస్ ప్రదీప్‌చంద్రను పీఆర్సీ చైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. పదో పీఆర్సీ అమలు సమయంలో, తెలంగాణ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ రూపకల్పనలోనూ ప్రదీప్‌చంద్ర కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, వేతన సంబంధిత వ్యవహారాల్లో ప్రదీప్‌చంద్రకు అనుభవాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లకోసారి.. ఉమ్మడి రాష్ట్రంలో 1998 జూలై నుంచి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను అమలు చేస్తున్నారు. దాని ప్రకారం పదో పీఆర్సీ కాల పరిమితి 2018 జూలై ఒకటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ తేదీ కంటే ఏడాది ముందుగానే ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిషన్ దాదాపు ఆరు నెలల పాటు కసరత్తు చేస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వివిధ అంశాలపై ఉద్యోగుల అభిప్రాయాలను, ప్రతిపాదనలను స్వీకరిస్తుంది. వాటన్నింటినీ అధ్యయనం చేసి సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. ఇక ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నివేదికను పరిశీలించి.. ఏయే ప్రతిపాదనలను ఆమోదించాలి, వేటిని పక్కనబెట్టాలి, ఏయే ప్రతిపాదనలను సవరించాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటుంది. అయితే మొత్తంగా 2018 జూలై నుంచి ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమల్లోకి తేవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నాయి. పదవీ విరమణ వయసు పెంపు! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాలన్న ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఆ రాష్ట్ర ప్రభుత్వం 58 ఏళ్ల నుంచి నుంచి 60 ఏళ్లకు పెంచింది. అప్పటి నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణలోనూ అమలు చేయాలని సర్కారుపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు పదవీ విరమణ అంశాన్ని సైతం ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలని, సాధ్యాసాధ్యాలను పరిశీలనకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
దళిత జాతిని అవమానిస్తున్న సీఎం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా బాధ్యతలు నిర్వర్తించిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర పదవీ కాలాన్ని పొడిగించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానపర్చారని, ఇది దళిత జాతికి జరిగిన అవ మానంగా భావిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శనివారం సూర్యాపేటలో విలేక రులతో మాట్లాడుతూ పదవీ కాలాన్నీ కేంద్రం పొడిగించలేదన్న మంత్రి ఈటల రాజేందర్ ప్రకటనపై వ్యాఖ్యను ఆయన ఖండించారు. ఇది దద్దమ్మ ప్రకటనగా అభివర్ణించారు. సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు అంశంపై ప్రతిపక్షాలు నిలదీస్తాయని సీఎం అసెంబ్లీకి హాజరు కాలేదని ఆరోపించారు. -
నేను రనౌట్ అయ్యా..
► వీడ్కోలు కార్యక్రమంలో మాజీ సీఎస్ ప్రదీప్ చంద్ర సంచలన వ్యాఖ్యలు ►షెడ్యూల్డ్ కులాల వారికి గుర్తింపు రాదన్న అపవాదు రాకుండా చూడండి ►అలా అయితే యువ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్య ►ఆయన సేవలను సీఎం వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం: మంత్రులు సాక్షి, హైదరాబాద్: ‘అందరూ క్రికెట్ గురించి మాట్లాడారు. నేను వన్‌డౌన్ లో బ్యాటింగ్‌కు వచ్చానని సీఎం అన్నారు. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యా. కొన్నిసార్లు ఇలా జరుగు తుంది. ఇందులో మీ తప్పేం ఉండదు. ఒక్కో సారి ముందుకెళ్లిన తర్వాత వెనక్కి మళ్లీ చూడ టం కుదరదు. ఈ పరిస్థితుల నుంచి రాజకీయ ప్రతిఫ లం ఆశిస్తున్న వారూ ఉన్నారు. ప్రభుత్వం వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజాయతీ, చిత్తశుద్ధి, అర్హత గల వారికి గుర్తింపు, గౌరవం లభించదన్న సందేశం వెళ్లకుండా చూడండి. మంచి పనిమంతు లైనప్పటికీ ఎస్సీలకు గుర్తింపు లభించదన్న అపవాదు రాకుండా చూడండి. ఈ అపవాదు యువ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయ గలదు. దీనిపై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలి. ప్రభుత్వానికి వినమ్రతతో చేస్తున్న విజ్ఞప్తి ఇది.’ అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నవంబర్ 30న రాష్ట్ర రెండో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్‌చంద్ర నెల రోజులే పదవిలో కొనసాగారు. పదవీ కాలం పొడిగింపునకు కేంద్రం అంగీకరించకపోవడంతో ప్రదీప్ చంద్ర డిసెంబర్ 31న పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుధవారం సచివాలయంలో ప్రదీప్‌చంద్రను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే పై వాఖ్యలు చేశారు. కాగా, ప్రదీప్ చంద్ర సేవలను వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్–ఐపాస్ రూపకల్పనలో ప్రదీప్ చంద్ర బృందం ఎంతో కృషి చేసిందని ప్రశంసించారు. ఏ సమస్య తోనైనా ప్రదీప్‌చంద్రను సంప్రదిస్తే సానుకూల దృక్పథంతో చక్కటి పరిష్కారం చూపేవారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొనియా డారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సలహాదారులు ఏకే గోయల్, రాంలక్ష్మణ్, పాపారావు, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నరేందర్ రావు, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రదీప్ చంద్రకు వీడ్కోలు సభ
-
నేడు మాజీ సీఎస్ ప్రదీప్‌చంద్రకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రకు సచివాలయంలో బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. డీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఉద్యోగులు హాజరు కావాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. -
కొత్త సీఎస్ ఎస్పీ సింగ్
► ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. బాధ్యతల స్వీకరణ ► నెల రోజులకే పదవీ విరమణ పొందిన ప్రదీప్ చంద్ర ► పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌పై బదిలీ వేటు ► మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఏకే ఖాన్ నియామకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్ (ఎస్పీ సింగ్) నియమితులయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయనను సీఎస్‌గా నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. నవంబర్ 30న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ చంద్ర పదవీకాలం శనివారంతో పూర్తయింది. కేవలం నెల రోజుల పాటే ఆయన సీఎస్‌గా కొనసాగారు. వాస్తవానికి మరో మూడు నెలల పాటు ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ అనుమతి రాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు కూడా మిగతా కేంద్రం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త సీఎస్ నియామకం అనివార్యమైంది. దీంతో కొత్త సీఎస్ నియామకంపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి... ప్రదీప్‌చంద్ర తర్వాత సీనియారిటీ జాబితాలో ఉన్న ఐఏఎస్ అధికారి ఎస్పీ సింగ్‌కు అవకాశం కల్పించారు. సీఎస్ పదవి కోసం ఎస్పీ సింగ్‌తో పాటు సీనియర్ ఐఏఎస్‌లు ఎంజీ గోపాల్, ఎస్కే జోషి, ఆర్ఆర్ ఆచార్య, వీకే అగర్వాల్‌ల పేర్లు సైతం ముఖ్యమంత్రి పరిశీలించినట్లు తెలిసింది. అయితే అనుభవమున్న అధికారి కావడం, వచ్చే ఏడాది జనవరి నెలాఖరు వరకు సర్వీసు ఉండడంతో ఎస్పీ సింగ్ నియామకానికి మొగ్గు చూపినట్లు సమాచారం. వివిధ శాఖల్లో చురుకైన పాత్ర 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ సింగ్ బీహార్‌కు చెందిన వారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేశారు. స్పెషల్ సీఎస్ హోదా కూడా పొందారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ‘మిషన్ భగీరథ’ప్రాజెక్టు పురోగతిలో చురుకైన పాత్ర పోషించారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సింగ్ నూతన సీఎస్‌గా నియమితులైన ఎస్పీ సింగ్ ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ సింగ్ మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని.. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి బృహత్తర లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారని, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పేదలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సింగ్‌కు పలువురు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. అరవింద్‌కుమార్‌పై బదిలీ వేటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి వరకు పరిశ్రమల శాఖతో పాటు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన అరవింద్‌కుమార్... ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి తీవ్ర నష్టకరమంటూ వేలెత్తి చూపారు. ఇంధన శాఖ నుంచి బదిలీకి ఒక రోజు ముందు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ స్వయంగా ఈఆర్సీకి లేఖ రాశారు. ప్రభుత్వానికి తెలియకుండా ఈ లేఖ రాయడాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నట్లు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అరవింద్‌కుమార్‌ను అంతగా ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేసిట్లుగా అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. సలహాదారుగా ఏకే ఖాన్ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి, శనివారం రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా నియమించింది. ఏకే ఖాన్ సేవలను వినియోగించుకోవాలని భావించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
సీఎస్ పదవీకాలం పొడిగింపు
మూడు నెలలు పొడిగించేందుకు కేంద్రం అనుమతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయ వర్గాలు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖిక సమాచారం అందించాయి. ఒకట్రెండు రోజుల్లో కేంద్ర సిబ్బంది వ్యవ హారాలు, శిక్షణ విభాగం(డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇటీవలే సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్‌చంద్ర ఈ నెలాఖరున రిటైర్ కావాల్సి ఉంది. కొత్త రాష్ట్రం కావటంతో పాటు ఐఏఎస్ అధికారుల కొరత, సీనియర్ అధికారుల సేవలు అవసరమని సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎస్ ప్రదీప్‌చంద్ర పదవీ కాలాన్ని 3 నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రదీప్‌చంద్ర సీఎస్‌గా కొనసాగనున్నారు. -
అధికారులకు సెలవులు బంద్
అసెంబ్లీ సమావేశాలపై సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే శాసన సభ, శాసనమండలి ఆరో విడత సమావేశాల సందర్భంగా సభ్యులడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల సందర్భంగా అధికారులు పర్యటనలు, సెలవుల్లో వెళ్లవద్దని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలపై గురువారం సచివాలయంలో సీఎస్ సమీక్ష జరిపారు.ఆ ప్రశ్నలపై ఆయా శాఖల కార్యదర్శులు హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకొని వెంటనే సమాధానాలు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 21న మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఈ ప్రశ్న లకు రూపొందించిన వెబ్‌సైట్‌ను ప్రదర్శించారు. జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు వెంటనే పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం సమావేశాలకు అన్ని శాఖలు ముఖ్యమైన అంశాలతో ప్రత్యేక నోట్‌ను క్లుప్తంగా సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖల తరఫున సభలకు హాజరయ్యే అధికారులు తమకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు వెంటనే నోట్ చేసుకోవాలని, ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. వేరే శాఖలకు చెందిన ప్రశ్నలు వస్తే వాటిని సంబంధిత శాఖ అధికారులకు బదిలీ చేయాలని కోరారు. కార్యదర్శులు జిల్లాల పర్యటనకు వెళ్లి అభివద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని, కలెక్టర్లకు మార్గదర్శనం చేయాలని సీఎస్ సూచించారు. తమ శాఖ కార్యకలాపాలు జరిగే జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు -
సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు!
డీవోపీటీకి సీఎం కేసీఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని 3 నెలలపాటు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ) లేఖ రాశారు. రాష్ట్ర సాధారణ పరిపాలనా విభాగం గురు వారం ఈ లేఖను డీవోపీటీకి పంపించింది. కొత్త రాష్ట్రం కావడంతో పాటు ఐఏఎస్ అధికారుల కొరత ఉండటంతో సీనియర్ అధికారుల సేవలు అవసరమని సీఎం భావిస్తున్నారు. అందుకే సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తే ఐఏఎస్ అధికారుల సర్వీసును 3 నెలల పాటు పొడిగించే వీలుంది. అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు నిబం దనల ప్రకారం ఈ వెసులుబాటు ఇచ్చే అధికారం కేంద్రం పరిధిలో ఉంటుంది. రాష్ట్ర తొలి సీఎస్ రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని కేంద్రం ఇదే తరహాలో వరుసగా 2 సార్లు మూడు నెలల చొప్పున పొడిగించటం తెలిసిందే. తాజాగా ప్రదీప్ చంద్రకు మరో 3 నెలల పాటు సర్వీసు పొడిగించాలని కోరటంతో డిసెంబర్ 31న ముగియనున్న సీఎస్ పద వీకాలం వచ్చే ఏడాది మార్చి 31 దాకా కొనసాగే అవకాశాలున్నాయి. -
అభివృద్ధి పరుగులు పెట్టాలి
- సమగ్ర ప్రణాళికలు రూపొందించండి - జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 14న కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో మంగళ వారం సచివాలయం నుంచి ఆయన వీడి యో కాన్ఫరెన్స ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లాల్లోని ఆర్థిక, నీటి వనరులు, భౌగోళిక అంశాలు, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే ఐదేళ్లలో జిల్లాల స్వరూపం మారేలా ప్రణాళికలు ఉండాలని కలెక్టర్లకు సూచించారు. తమ జిల్లాల బలం, బలహీనతలు, వనరులు తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. అభివృద్ధికి ఎన్నారైల ద్వారా సహకారం పొందడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నో యువర్ డిస్ట్రిక్ట్‌లో భాగంగా జిల్లా ప్రజల గురించి పూర్తిగా అవగాహన ఉండాలని, పూర్తి సమాచారంతో డాటాబేస్ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల కొత్త బ్యాంకులు జిల్లాల్లో రోడ్నెట్వర్క్పై పూర్తి అవగాహనతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. రైల్వేస్టేషన్లు ఉన్న ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా స్థారుు ఇరిగేషన్ ప్రణాళికలను రూపొందించాలని, మిషన్ భగీరథ పనులపై దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకింగ్ నెట్వర్క్ లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఏటీఎంలు, పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త బ్యాంకుల ఏర్పాటు.. తదితర అంశాలపై నివేదికలు రూపొందించాలన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించి కేంద్రం అందించే ప్రోత్సాహకం అందుకోవడంలో జిల్లా కలెక్టర్లు ముందుండాలన్నారు. జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కువ మందికి ఉపాధి లభించేలా చూడాలని సూచించారు. మూతపడిన పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు. -
‘చిన్న నోట్లు కావాలని ఆర్బీఐని అడిగాం’
హైదరాబాద్: ప్రణాళిక ప్రకారం పాలన కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. ఉద్యోగులు, ప్రజల నుంచి సహకారం ఆశిస్తున్నట్టు ‘సాక్షి’తో చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తమేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయక తప్పదని అన్నారు. ప్రజల రోజువారి ఇబ్బందులను ఎప్పటికప్పుడు కేంద్రం, ఆర్బీఐ నివేదిస్తున్నామని తెలిపారు. చిన్న నోట్లు కావాలని ఈరోజు కూడా ఆర్బీఐని కోరినట్టు వెల్లడించారు. నోట్లు రాగానే గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తామన్నారు. రోజువారీ కూలీలు, చేతి వృత్తుల వారు డబ్బుల్లేకుండా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రదీప్ చంద్ర హామీయిచ్చారు. -
‘చిన్న నోట్లు కావాలని ఆర్బీఐని అడిగాం’
-
20 మంది ఐఏఎస్‌ల బదిలీ
• ప్రదీప్‌చంద్రకు సీసీఎల్ఏగా అదనపు బాధ్యతలు • రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంజీ గోపాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ ప్రదీప్‌చంద్రకు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పూర్తిస్థారుు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎస్‌గా రాజీవ్‌శర్మ పదవీ విరమణ నేపథ్యంలో పలు శాఖల్లో మార్పుచేర్పులు తప్పనిసరయ్యారుు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఐఏఎస్‌ల బదిలీలపై ప్రత్యేకంగా కసరత్తు చేశారు. బుధవారం సాయంత్రం ఈ ఉత్తర్వులు వెలువడ్డారుు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంజీ గోపాల్‌ను, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్‌మిశ్రాను నియమించారు. ఎస్సీ అభివృద్ధి విభాగం కార్యదర్శిగా పూర్తిస్థారుు అదనపు బాధ్యతలను అజయ్ మిశ్రాకు అప్పగించారు. వెరుుటింగ్లో ఉన్న చిత్రా రామచంద్రన్‌కు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. అశోక్ కుమార్‌ను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. సోమేశ్ కుమార్‌కు రెవెన్యూ (ఎకై ్సజ్, కమర్షియల్ టాక్స్) ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సునీల్‌శర్మకు రవాణా శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ కార్యదర్శి (ఇన్స్ట్యూషనల్ ఫైనాన్స)గా నియమించారు. ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న నవీన్ మిట్టల్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్మెంట్ విభాగపు కార్యదర్శిగా బదిలీ చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా, జీఏడీ(ఐఅండ్ పీఆర్) ఎక్స్ అఫిషియో సెక్రెటరీగా ఆయనకు ఉన్న అదనపు బాధ్యతలను యథాతథంగా కొనసాగించారు. వెరుుటింగ్లో ఉన్న బూసాని వెంకటేశ్వరరావుకు మత్స్యశాఖ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సవ్యసాచి ఘోష్‌ను యువజన సర్వీసుల కార్యదర్శిగా నియమించారు. గిరిజన శాఖ కార్యదర్శిగా మహేశ్‌దత్ ఎక్కాకు పోసింగ్ ఇచ్చారు. సాధారణ పరిపాలనా విభాగం (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హాకు సర్వీసెస్, హెచ్ఆర్ఎం కార్యదర్శిగా పూర్తిస్థారుు అదనపు బాధ్యతలు అప్పగించారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. వికారాబాద్ సబ్ కలెక్టర్ శ్రుతి ఓజాను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, జగిత్యాల సబ్ కలెక్టర్ కె.శశాంకను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. యువ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు 2014 బ్యాచ్ ప్రొబెషనరీ ఐఏఎస్‌లను వివిధ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. తాండూరు సబ్ కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా, బోధన్ సబ్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, మెట్పల్లి సబ్ కలెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫారూఖీ, నారాయణ్‌పేట సబ్ కలెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, ములుగు సబ్ కలెక్టర్‌గా వి.పి.గౌతమ్‌ను నియమించారు. -
రాజీవ్ శర్మ వారసుడు ఈయనేనా?
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగా, రాష్ట్రానికి కొత్త సీఎస్ గా ఎవరిని నియమిస్తారనే విషయం మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, కొత్త సీఎస్ గా ప్రదీప్ చంద్ర ఈ సాయంత్రం బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సీఎస్ పదవీ విరమణ అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారుగా రాజీవ్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నారు. -
తెలంగాణకు కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర!
-
కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర!
సీఎం తుది నిర్ణయం కోసం నిరీక్షణ - రేసులో ఎస్పీ సింగ్, ఎస్కే జోషీ,ఎంజీ గోపాల్, ఆర్ఆర్ ఆచార్య కూడా.. - నేడు పదవీ విరమణ చేయనున్న రాజీవ్‌శర్మ - ఘనంగా వీడ్కోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా ఎవరిని నియమి స్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఇంత కీలకమైన బాధ్యతలను సీఎం ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తి రేపుతోంది. సీనియారిటీ ప్రకారం రాజీవ్‌శర్మ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర రేసులో ముందున్నారు. అరుుతే మంగళవారం రాత్రి వరకు కూడా సీఎస్ నియామకానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలోనే ఉంది. దీంతో కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశముంది. సీఎం నిర్ణయం మేరకే.. సాధారణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఏఎస్‌లు సీఎస్ పోస్టింగ్‌కు అర్హులవుతారు. కానీ పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంపై ఆధారపడి ఈ నియామ కాలు జరుగుతుంటారుు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది అధికారులు స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్నారు. వారిలో కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్రను నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సైతం ఇందుకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కీలక శాఖలు నిర్వహించిన ప్రదీప్ చంద్ర రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులలో రాజీవ్‌శర్మ తర్వాత సీనియర్ ప్రదీప్ చంద్ర. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో పరిశ్రమలు, వాణిజ్య, ఆర్థిక శాఖలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనూ కీలక విభాగాల్లో.. విశాఖపట్నం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ కావడంతోపాటు వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ప్రదీప్ చంద్రనే సీఎస్‌గా నియమించే అవకాశాలున్నారుు. అరుుతే ఆయన పదవీకాలం డిసెంబర్ నెలాఖరునే ముగియనుంది. అంటే నెల రోజుల్లోనే పదవీ కాలం ముగియనుండటంతో ప్రదీప్ చంద్రకు అవకాశమిస్తారా..? తదుపరి జాబితాలో ఉన్న సీనియర్లను ఎంచుకుంటారా.. అన్నది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రదీప్‌చంద్ర తర్వాత సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్‌లు ఎస్పీ సింగ్, ఎస్కే జోషీ, ఎంజీ గోపాల్, ఆర్ఆర్ ఆచార్యల పేర్లు వినిపిస్తున్నారుు. కీలక బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్‌శర్మ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌శర్మ 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేయటంతో పాటు వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగానూ పనిచేశారు. ఏపీ పునర్విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీకి నోడల్ ఆఫీసర్‌గా కీలక భూమిక పోషించారు. పాలనలో మంచి అనుభవం ఉన్న నేపథ్యంలో పదవీ విరమణ అనంతరం కూడా రాజీవ్‌శర్మ సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణరుుంచారు. సీఎం సలహాదారుగా నియమించి, పరిపాలనా సంస్కరణల బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోం ది. ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నారుు. రాజీవ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు సీఎస్‌గా పదవీ విరమణ చేస్తున్న రాజీవ్ శర్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అధికారులతో పాటు మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎస్‌కు వీడ్కోలు పలకాలని స్వయంగా సీఎం కేసీఆర్ రెండ్రోజుల కిందటి కేబినెట్ భేటీలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ సీఎస్‌గా ఉన్న రాజీవ్‌శర్మ పనితీరును ప్రశంసించారు. మంత్రులతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు కూడా ఈ సందర్భంగా సీఎస్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది మే నెలాఖరుతోనే రాజీవ్‌శర్మ పదవీకాలం ముగిసింది. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్రం.. రెండు సార్లు మూడు నెలల చొప్పున ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. -
సీఎస్‌కు మంత్రివర్గం అభినందన
- రేపు వీడ్కోలు కార్యక్రమం - సీఎం సలహాదారుగా నియామకానికి ఆమోదం - కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర! - ఎవరవుతారో తనకే తెలియదన్న సీఎం!! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా అభినందించింది. బుధవారం ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో, సోమవారం జరిగిన కేబినేట్ భేటీలో మంత్రులంతా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. బుధవారం సచివాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సీఎస్‌గా రిటైరవుతున్న రాజీవ్ శర్మను సీఎం ప్రత్యేక సలహాదారుగా నియమించేందుకు కేబినేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. పాలనా సంస్కరణల బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారని తెలిసింది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఆయనకు ప్రత్యేక ఛాంబర్‌ను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కొత్త సీఎస్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రను నియమించే అవకాశాలున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించారుు. అరుుతే, తదుపరి ఎవరు సీఎస్ అవుతారో తనకే తెలియదని మీడియా సమావేశం అనంతరం ఒక ప్రశ్నకు బదులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు! -
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మార్పు!
సాక్షి, హైదరాబాద్: కీలకమైన బడ్జెట్ తయారీ, సమావేశాల సమయంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర 2 నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇటీవలే ప్రదీప్‌చంద్ర కాలి ప్రధాన నరంచిట్లడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన అమెరికాకు వెళ్తున్నారు. శుక్ర లేదా శనివారం ఆయన అమెరికాకు వెళ్లే అవకాశముంది. శస్త్రచికిత్స అనంతరం కనీసం 2 నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ సమయంలో ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వర్తించే అధికారి లేకపోవటంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోతున్నాయి. అందుకే ప్రదీప్ చంద్ర స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంజీ గోపాల్ పేరు సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. -
బోనాలకు 10 కోట్లు
-
రేపు అమెరికాకు జూపల్లి బృందం
హైదరాబాద్: ఈనెల (జూన్) 15 నుంచి 18 వరకు ఫిలడిల్ ఫియాలో జరిగే బయో ఇంటర్నేషనల్ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి బృందం ఆదివారం అమెరికాకు వెళ్లనుంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర కూడా వెళ్తారు. ఈ బృందం అమెరికాలో వారం రోజుల పాటు పర్యటించనుంది. తెలంగాణకు పెట్టుబడులే ధ్యేయంగా అమెరికా పర్యటించనున్నట్టు మంత్రి తెలిపారు. -
ఫైళ్లన్నీ పక్కకు!
హెచ్ఎండీఏలో స్తంభించిన పాలన కమిషనర్ లేక 35 ఫైళ్లు మూలకు.. కీలక ఫైళ్లను తిప్పిపంపిన ప్రదీప్ చంద్ర ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించని జనార్దన్‌రెడ్డి త్రిశంకు స్వర్గంలో మహా నగరాభివృద్ధి సంస్థ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసర ఫైళ్లను సైతం పరిశీలించే నాథుడే కరవయ్యాడు. రెండ్రోజుల వ్యవధిలోనే సుమారు 35 ఫైళ్లు మూలకు పడ్డాయి. ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న కె.ప్రదీప్ చంద్రను ప్రభుత్వం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ కమిషనర్ (ఎఫ్ఏసీ) బాధ్యతలను మునిసిపల్ అడ్మిస్ట్రేషన్ కమిషనర్/డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న బి.జనార్దన్‌రెడ్డికి అప్పగించింది. అయితే, వారం రోజులు గడిచినా ఇంతవరకు ఆయన బాధ్యతలను స్వీకరించకపోవడంతో హెచ్ఎండీఏలో ఎక్కడి ఫైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఇటీవలి వరకు అత్యవసర ఫైళ్లను ప్రదీప్ చంద్ర పరిశీలించి పరిష్కరిస్తుండటంతో పాలన సాఫీగా సాగింది. ఈ క్రమంలోనే గత శనివారం సుమారు 20 ఫైళ్లను సచివాలయంలోని ప్రదీప్ చంద్ర కార్యాలయానికి హెచ్ఎండీఏ అధికారులు పంపారు. వాటిలో ఒక్క ఫైల్‌ను కూడా ఆయన పరిశీలించకుండా తిప్పి పంపడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం ప్రదీప్ చంద్ర ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున హెచ్ఎండీఏకు చెందిన ఆర్థిక పరమైన ఫైళ్లకు అప్రూవల్ ఇస్తే.. ఆర్థిక శాఖలో మళ్లీ తానే వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. సాంకేతికంగా ఇందులో కొంత ఇబ్బందులు ఉన్నందున ఆ ఫైళ్లను చూసేందుకు ప్రదీప్ చంద్ర విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ 20 ఫైళ్లకు సోమవారం మరో 15 ఫైళ్లు తోడవ్వడంతో మొత్తం 35 ఫైళ్లు పెండింగ్‌లో పడిపోయాయి. వీటిలో 90 శాతం ఫైళ్లు ప్లానింగ్ విభాగానికి చెందినవే కావడంతో వాటిని పరిష్కరించక పోవడం వల్ల సంస్థకు ఫీజు రూపంలో రావాల్సిన ఆదాయం తాత్కాలికంగా నిలిచిపోయింది. తిరోగమనంలోకి.. హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం, ఇన్చార్జి కమిషనర్ కూడా బాధ్యతలు స్వీకరించక పోవడంతో సంస్థ తిరోగమనంలో పయనిస్తోంది. కీలకమైన ఆర్థిక ఫైళ్లు ఆగిపోవడం వల్ల ఆ ప్రభావం అన్ని విభాగాలపై పడుతోంది. ప్రధానంగా ప్లానింగ్, ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాల్లో రోజూవారీ కార్యకలాపాలు స్తంభించిపోతాయి. ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో ఎస్టీపీల నిర్వహణ, కరెంట్ బిల్లులు, జీతాలు, బకాయిలకు వడ్డీలు, ఇతర చెల్లింపుల వంటివి భారంగా మారి సంస్థ మనుగడే ప్రమాదంగా మారింది. ఎలాగూ ఫైళ్లు ఆగిపోతున్నాయి గనుక.. మిగతావి చేయడం ఎందుకన్న ఉద్దేశంతో సిబ్బంది నిర్లక్ష్యంగా పనులు పక్కకు పెట్టే ప్రమాదం ఉంది. జీహెచ్ఎంసీలో విలీనం..? త్వరలో హెచ్ఎండీఏను జీహెచ్ఎంసీలోకి విలీనం చేస్తున్నట్టు సోమవార ం ఓ చానెల్ (‘సాక్షి’ కాదు) వార్తాంశాన్ని ప్రసారం చేయడంతో హెచ్ఎండీఏ ఉద్యోగుల్లో అలజడి చెలరేగింది. ఇదెలా సాధ్యమంటూ.. సచివాలయం స్థాయి అధికారులను ఆరా తీశారు. యూనిఫైడ్ సర్వీసు రూల్స్ అమల్లోకి తేవడం ద్వారా ఇక్కడి సిబ్బందికి స్థానబ్రంశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏను ఏకంగా జీహెచ్ఎంసీలోనే విలీనం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, దీన్ని కొట్టిపారేయలేమని, హెచ్ఎండీఏపై సర్కారు లోతైన అధ్యయనం చేస్తుందని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ పరిధిలో భూ వినియోగ మార్పిడికి అనుమతిచ్చే విషయమై ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. -
పరిశ్రమలపై పెత్తనం ఎందుకు..?
ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ఒప్పుకోం పరిశ్రమల మంత్రికి తేల్చిచెప్పిన తెలంగాణ పారిశ్రామిక వేత్తలు 30 పారిశ్రామికవేత్తల సంఘాలతో జూపల్లి సమావేశం సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వాడలపై జీహెచ్ఎంసీ పెత్తనాన్ని తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఆస్తిపన్ను వసూళ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)లను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఇటీవలి కాలంలో కమిషనర్ సోమేశ్‌కుమార్ చేస్తున్న ప్రయత్నాలపై పారిశ్రామిక వేత్తలు విరుచుకుపడ్డారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే జీహెచ్ఎంసీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, పారిశ్రామిక వేత్తలను పీడించడమే ధ్యేయంగా వ్యవహరిస్తుందని తెలంగాణ పారిశ్రామిక వేత్తలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమల కమిషనర్ జయేష్ రంజన్‌లతో సోమవారం సచివాలయంలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం ఆధ్వర్యంలో 30 సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 700 కోట్ల మేర రాయితీలను విడుదల చేయడం, నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడంపై పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో పారిశ్రామిక వేత్తలపై జీహెచ్ఎంసీ చేస్తున్న పెత్తనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత జులై 22న కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమై ‘ఐలా’ను పటిష్టం చేస్తానని, పరిశ్రమలకు స్వయం ప్రతిపత్తి కాపాడుతామని హామీ ఇచ్చిన విషయాన్ని పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి గుర్తు చేశారు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా పరిశ్రమలపై గుత్తాధిపత్యాన్ని కార్పొరేషన్‌కు దఖలు చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు ఎస్.వి. రఘు, సుధీర్, పారిశ్రామిక వేత్తల సంఘాల ప్రతినిధులు ఎ.ఎల్.ఎన్.రెడ్డి(జీడిమెట్ల), ఎం.గోపాల్ రెడ్డి(చర్లపల్లి), జనార్దన్ రెడ్డి (పటాన్చెరు), నర్సింగ్‌రావు(మెదక్), మహిళా పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షురాలు సరిత, ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి రాజ మౌళి, ఎన్వీ నరేందర్, సూక్ష్మ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంతయ్య పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ తీరుపై ఆందోళన ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ వ్యవహరించడం పట్ల ఇతర సంఘాల ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆస్తిపన్ను పేరుతో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రకాల పన్నులు చెల్లిస్తూ పరిశ్రమలను నడుపుతున్న తమకు ఆస్తిపన్నును వాణిజ్య అవసరాల పేరుతో వసూలు చేయడం వల్ల నష్టపోతున్నామని మంత్రి జూపల్లికి వివరించారు. కంపెనీల్లో పనిచేసే కార్మికుల కోసం తాగునీటి కనెక్షన్లు తీసుకుంటే వాటికి కూడా వాణిజ్య అవసరాల టారిఫ్‌లో బిల్లులు వేస్తున్నారని తెలిపారు. ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం, ఆస్తిపన్ను, నీటి పన్నులకు సంబంధించి జీహెచ్ఎంసీ, పురపాలక శాఖలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న తెలంగాణ పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో వెయ్యి ఎకరాలు కేటాయించి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పరిశ్రమలతో సంబంధం ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మునిసిపల్ శాఖ, రిజిస్ట్రేషన్లు, పీసీబీ వంటి విభాగాల అధికారులతో మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను కోరారు. త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. -
పీఆర్సీ లేనట్టే!
* ఈ బడ్జెట్లో కష్టమే.. జాప్యం అనివార్యం * అందుకే కమిటీ వేశారంటూ ఉద్యోగుల్లో ఆందోళన * ఇప్పటికీ చర్చలు ప్రారంభించని హైపవర్ కమిటీ * ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు దాదాపు రూ. 200 కోట్లు * ఈ ఆర్థిక సంవత్సరంలో భారాన్ని భరించడం కష్టం * ఇక ఏప్రిల్‌లోనే పీఆర్సీ వస్తుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ * కుటుంబానికి ముగ్గురినే లెక్కగట్టడంపై అభ్యంతరాలు * ఏడాదిన్నర కిందటి ధరలతో ఖర్చులు పోల్చారని ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘జనవరి మూడో వారంలో పీఆర్సీపై ప్రకటన వస్తుంది. జనవరి నుంచే అమలు చేస్తాం. ఉద్యోగులు సంతృప్తి చెందేలా ప్రయోజనాలు కల్పిస్తాం.’ - గత నెల 30న సీఎం కేసీఆర్ ప్రకటన మరోవైపు.. ఈ నెల 12న పీఆర్సీపై హైపవర్ కమిటీ ఏర్పాటు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర చైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ కన్వీనర్‌గా ఇది ఏర్పాటైంది. పీఆర్సీ కమిషనర్ అగర్వాల్ ఇచ్చిన నివేదికలోని సిఫారసులను పరిశీలించడంతోపాటు ఉద్యోగ సంఘాలతోనూ ఈ కమిటీ చర్చలు జరుపుతుందని ప్రభుత్వం ప్రకటిం చింది. ఇంకోవైపు.. పీఆర్సీ అమలులో ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు రూ. 180 కోట్ల నుంచి రూ. 200 కోట్లు కావాలి. ఈ లెక్కన పీఆర్సీ చైర్మన్ చేసిన 29 శాతం ఫిట్‌మెంట్‌కే రూ. 3,500 కోట్లకుపైగా నిధులు అవసరం. ఈ మొత్తాన్ని ప్రస్తుత బడ్జెట్లో ఇచ్చే పరిస్థితి లేనేలేదు. వచ్చే బడ్జెట్లోకేటాయించి అమలు చేస్తేనే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. ఇక 37శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సి వస్తే రూ. 6,660 కోట్ల నుంచి రూ. 7,400 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అదే ఉద్యోగులు కోరుతున్నట్లు 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే రూ. 7,700 కోట్ల నుంచి రూ. 8,600 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని, అంత భారం ఇప్పుడు భరించడం కష్టమన్నది ఆర్థిక శాఖ వర్గాల వాదన. ఇవీ రాష్ట్రంలో పీఆర్సీ అమలు విషయంలో వివిధ పరిణామాలు. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే పీఆర్సీని ఇప్పట్లో అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఆర్థిక శాఖ కోణంలో చూస్తే పీఆర్సీ అమలు ఆలస్యమయ్యేలా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కొత్త బడ్జెట్లో నిధులను కేటాయించి, వచ్చే ఏప్రిల్‌లోనే అమల్లోకి తెచ్చే అవకాశముందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం చెప్పినట్లు ఈ నెలలోనే పీఆర్సీ అమల్లోకి వస్తుందని భావించినప్పటికీ అది ఆచరణకు నోచుకునే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆలస్యం తప్పదేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది. మరోవైపు హైపవర్ కమిటీ కూడా ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించలేదు. వచ్చే వారంలో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. అదీ అన్ని సంఘాలతో ఒకేసారి చర్చిస్తుందా లేక ఒక్కో సంఘంతో వేర్వేరుగా భేటీ అవుతుందా అన్నది తేలాల్సి ఉంది. పీఆర్సీ సిఫారసులపై శాఖలవారీగా ఉద్యోగుల్లో అనేక ఆందోళనలు, సమస్యలు ఉన్నాయి. వేతన స్థిరీకరణలో అన్యాయం జరిగిందన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాఖలవారీగానే సమావేశాలు నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంతో పీఆర్సీ అమలులో ఆలస్యం తప్పకపోవచ్చన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది. కమిటీ తేల్చేది చిన్న లోపాలనే! సాధారణంగా పీఆర్సీలో లోపాలపై, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులపై పునఃపరిశీలనకు అనామలీస్ కమిటీని వేయడం ఆనవాయితీ. హైపవర్ కమిటీలో ప్రధాన సమస్యలను తేల్చేదేమీ ఉండదన్నది సంఘాల భావన. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికే ఈ కమిటీ పరిమితమయ్యే అవకాశముంది. పైగా ఫిట్మెంట్, నగదు రూపంలో పీఆర్సీ అమలు తేదీల ఖరారు వంటి ప్రధానాంశాలపై ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినా మరింత జాప్యం జరుగుతుందేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. కనీస మూల వేతనం పెంపు, ఫిట్మెంట్ నిర్ణయం, నగదు రూపంలో వర్తింపు వంటి ప్రధాన అంశాలు సీఎం స్థాయిలోనే తేల్చాల్సి ఉంది. ఈ లెక్కన చిన్న చిన్న లోపాలపై హైపవర్ కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చల తర్వాత సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో మరోసారి సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని, ఇందుకు చాలా సమయం పట్టవచ్చని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇరకాటంలో సంఘాల నేతలు.. మూడో వారంలో పీఆర్సీ అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఇరకాటంలో పడ్డాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోన్న ఆందోళన ఉద్యోగ నేతల్లో వ్యక్తమవుతోంది. ఫిట్మెంట్, నగదు రూపంలో పీఆర్సీ అమలు తేదీ తదితర అంశాలపై ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయినా, అటు ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోయినా తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పీఆర్సీ అమలుకు సర్కారు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. కుటుంబమంటే నలుగురు! పదో వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) సిఫారసుల్లో భాగంగా కుటుంబానికి ముగ్గురు సభ్యులనే(మూడు యూనిట్లుగానే) పరిగణనలోకి తీసుకోవడాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కుటుంబమంటే ముగ్గురేనన్న నిర్వచనంతో వేతన స్థిరీకరణ చేయడం అశాస్త్రీయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కల ఆధారంగానే కనీస మూల వేతనాన్ని నిర్ధారించడం సరికాదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తగిన మార్పులు చేయించుకోవాలని ఉద్యోగవర్గాలు పట్టుదలగా ఉన్నాయి. పైగా 2013 జూలై 1కి ముందున ్న నిత్యాసవరాల ధరలనే పరిగణనలోకి తీసుకోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగినందున పీఆర్సీ నివేదికలో సిఫారసు చేసిన రూ. 13 వేల కనీస మూల వేతనాన్ని రూ. 15 వేలకు పెంచాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. తద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా లబ్ధి కలుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలోని జనాభా, కుటుంబాల సంఖ్య సరాసరి ఆధారంగా కుటుంబ నిర్వచనం ఉంటుంది. అయితే కుటుంబమంటే మూడు యూనిట్లేనని ఇంట ర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్(ఐఎల్సీ) తీర్మానించింది. ఈ మేరకే లెక్కలేసి పీఆర్సీ కమిషన్ నివేదిక అందించింది. అయితే జాతీయ కుటుంబ సర్వే ప్రకారం నలుగురిని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో తల్లిదండ్రులు, భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉంటు న్నా.. కనీసం నాలుగు యూనిట్లను పరిగణనలోకి తీసుకుని కనీస వేతనాన్ని నిర్ధారించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇద్దరు పిల్లల కయ్యే ఖర్చు ఒక పెద్ద వ్యక్తికంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఫీజుల రూపం లో భారీగా చెల్లించాల్సి వస్తున్నా పీఆర్సీ పట్టించుకోలేదని, కనీస మూల వేతనం రూ. 15 వేలు చేయాలని కోరుతున్నారు. కాగా, ఫిట్మెంట్తోపాటు నగదు రూపంలో వర్తింపు తేదీ విషయంలో ఉద్యోగుల్లో భారీ ఆశలు ఉన్నాయి. కానీ 37 శాతానికి మించి ఫిట్మెంట్ కష్టమేనని ప్రభుత్వవర్గాలు అంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఏ విషయంలోనూ వెనక్కి తగ్గవద్దంటూ సంఘాల నేతలకు ఉద్యోగులు గట్టిగా సూచిస్తున్నారు. ఇదేం లెక్క? ఒక్కో కుటుంబానికి నెలకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు తదితరాల కోసం రూ. 838 ఖర్చవుతుందని, నెలకు ఒక్కో కుటుంబానికి 42.75 కేజీల బియ్యం అవసరమని పదో పీఆర్సీ లెక్కలేసింది. కిలో బియ్యం ధరను రూ. 34.99గా పరిగణించింది. ఇక దుప్పట్ల మొదలు దుస్తుల వరకు అన్ని అవసరాలకు ఏటా రూ. 17 వేలు సరిపోతాయని పేర్కొంది. అలాగే ఒక్కో కుటుంబానికి నెలకు 18 లీటర్ల పాలతోనే సరిపెట్టింది. ఐఎల్సీ గణాంకాల ప్రకారమే పౌష్టికాహారం అందాలంటే నెలకు 75 లీటర్ల పాలు వినియోగించాలని, ఇలాంటి వాటిని పీఆర్సీ పట్టించుకోలేదని, వాస్తవిక అంచనాలతో లెక్కలుగట్టి కనీస వేతనాన్ని పెంచాలని ఉద్యోగవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
గుజరాత్‌కు మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ‘గుజ రాత్ వైబ్రాంట్ సమ్మిట్’లో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 12న మంత్రితోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర గుజరాత్ వెళ్లనున్నారు. -
మహబూబ్‌నగర్‌లో త్వరలో సోలార్ పార్క్
ఇంధన వనరుల పొదుపుతోనే రాష్ట్రం పురోగతి రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర పొదుపు పాటించిన 48 కంపెనీలకు అవార్డుల ప్రదానం సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్, సహజ, ఇంధన వనరుల పొదుపుతోనే రాష్ట్రం పురోగతి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ప్రదీప్‌చంద్ర అన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో విద్యుత్ పొదుపు అత్యంత ఆవశ్యకంగా మారిందన్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే భూ సేకరణ కూడా పూర్తయిందన్నారు. ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్2014 అంశంపై మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో 15వ జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశంలో విద్యుత్, ఇంధన వనరులను పొదుపు చేసిన 48 కంపెనీలకు అవార్డులను అందించారు. జనరల్, ఆటోమోబైల్, బిల్డింగ్, సిమెంట్, పవర్, పేపర్, షుగర్ విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన అశ్రీయ హోటల్స్ అండ్ ఎస్టేట్స్ ప్రై.లిమిటెడ్., టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డెక్కన్ పార్క్, విప్రో లిమిటెడ్, సీటీఆర్ఎల్ఎస్ డాటా సెంటర్ ప్రై.లిమిటెడ్‌లు ఉన్నాయి. అనంతరం ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ.. మారుతోన్న కాలంలో గ్రీన్ టెక్నాలజీ, ఇంధన పొదుపు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారినట్టు తెలిపారు. అందుకే పారిశ్రామిక పాలసీ రూపకల్పనలో గ్రీన్ టెక్నాలజీ, ఇంధన పొదుపునకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. ఇంధన, సహజ వనరుల పొదుపు అనేది వ్యక్తితో ముడిపడకుండా పారిశ్రామిక స్థాయిలో జరగాల్సిన అవసరముందని గుర్తుచేశారు. పరిశ్రమలు తమ కార్యకలాపాల వినియోగంలో పాత పద్ధతుల్లో కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ చైర్పర్సన్ వనితా దాట్ల, సీఐఐ గోద్రెజ్ జీబీసీ నేషనల్ అవార్డ్ స్కీమ్ చైర్మన్ ఎల్ఎస్ గణపతి, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నౌషద్ ఫోర్బ్స్ పాల్గొన్నారు. -
తెలంగాణలో రూ. 7 వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక వెలుగులు ఆరంభమయ్యాయి. పలు కంపెనీలు భారీగా విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. సుమారు రూ. 7 వేల కోట్లకుపైగా అదనపు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చినట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర గురువారం ‘సాక్షి’కి వివరించారు. దీనివల్ల దాదాపు 4 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల చేపట్టిన జిల్లాల పర్యటన అనంతరం పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం దూరదృష్టిని గమనించిన అనేక పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ప్రదీప్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేముల వద్ద అమెరికా-ఫ్రాన్స్ దేశాలకు చెందిన కోజెంట్ కంపెనీ గ్లాస్ బాటిళ్ల తయారీ యూనిట్‌ను ప్రస్తుతం రూ. 200 కోట్లతో ఏర్పాటు చేసింది. మరో రూ. 300-400 కోట్లతో దీన్ని త్వరలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. దేశంలోనే అతి పెద్ద సబ్బుల తయారీ యూనిట్ కూడా మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు కానుంది. జిల్లాలోని కొత్తూరు మండలంలో ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థ టైడ్, ఏరియల్ సబ్బుల తయారీ యూనిటును మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 900 కోట్లతో తమ కంపెనీని ఏర్పాటు చేసింది. విస్తరణలో భాగంగా రెండు మూడేళ్లలోనే సుమారు 3 వేల కోట్లతో అతిపెద్ద సబ్బుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తద్వారా 1500 మందికి ఉపాధి లభించనుంది. ఇక కొత్తూరు మండలంలోనే జాన్సన్ అండ్ జాన్సన్ సుమారు 47 ఎకరాల్లో రూ. 400 కోట్లతో ఏర్పాటు చేయనున్న తొలి యూనిట్‌కు సీఎం గురువారం శంకుస్థాపన చేశారు. వచ్చే 18 నెలల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభంకానుంది. డయపర్స్, సబ్బులు, బేబీ ఆయిల్, బేబీ షాంపుతో పాటు మెడికల్ ఉత్పత్తులను కూడా కంపెనీ చేపడుతోంది. అదనంగా 4 వేల కోట్లతో మరో 40 ఎకరాల్లో ప్లాంటును విస్తరిస్తామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. -
ప్రతి రెవెన్యూ భూమినీ పరిశీలించాలి
ఆదిలాబాద్ అర్బన్ : రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే నంబర్ ప్రకారం ప్రతి భూమినీ పరిశీలించాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమల మౌళిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ జయేశరంజన్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో దళిత బస్తీల ఏర్పాటుకు భూములను గుర్తించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనియ పేర్కొన్నారు. జిల్లాలోని రేషన్ కార్డులను ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని, ఇందుకు జిల్లాలో ఆయా సిబ్బందిని వినియోగించుకోవాలని సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రతి మండలంలోని గ్రామాల్లో సర్వే చేయాలన్నారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు వాటిని సర్వే ఫార్మాట్లో బుధవారంలోగా పంపాలని ఆదేశించారు. జిల్లాలో ఆధార్ సీడింగ్ 90 శాతం పూర్తి చేయాలని, చేయలేదంటే ఎలాంటి సమస్యలూ చెప్పకూడదని స్పష్టం చేశారు. 11 వేల ఎకరాలు పరిశ్రమలకు అనుకూలం : జేసీ అనంతరం సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ, పరిశ్రమలకు 11 వేల ఎకరాల భూమిని గుర్తించినట్లు వివరించారు. జిల్లాలో ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని, ఇప్పటి దాకా 3 లక్షల 41 వేల ఎకరాలు గుర్తించామని, 11,448 ఎకరాలు పరిశ్రమలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని వివరించారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో 10 వేల బోగస్ కార్డులు గుర్తించామని పేర్కొన్నారు. అలాగే మొక్కల పెంపకానికి అనువైన భూముల గురించి తెలిపారు. ఆర్డీవోలు అరుణశ్రీ, సుధాకర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కృష్ణ, అధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కే హీరో ప్లాంట్?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన రంగంలో తొలి ప్లాంటును చేజిక్కించుకోవడానికి రెండు రాష్ట్రాలూ పోటీపడ్డ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం పైచేయిగా ఉన్నట్టు తెలుస్తోంది. వాహన దిగ్గజం హీరో మోటో కార్ప్ దక్షిణాదిన ప్లాంటు పెట్టాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతోందని ప్రచారం జరిగినా చివరికి హైదరాబాద్ సమీపంలోని జహీరాబాద్‌లో ప్లాంటు స్థాపించడానికి హీరో కంపెనీ మొగ్గు చూపుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే కంపెనీకి చెందిన ముగ్గురు ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్లాంటుకు అనువైన స్థలాలను ఈ బృందం పరిశీలిస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ బృందం ఎంపిక చేసిన స్థలాలను మరో బృందం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కంపెనీకి కావాల్సినంత స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హీరో బృందం రావడాన్నిబట్టి చూస్తే ప్లాంటు జహీరాబాద్‌లో ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఏటా 15-20 లక్షల బైక్‌లు.. హీరో మోటో కార్ప్‌కు హర్యానాలో రెండు, ఉత్తరాఖండ్‌లో ఒక ప్లాంటు ఉంది. వీటి తయారీ సామర్థ్యం ఏడాదికి 69 లక్షల ద్విచక్ర వాహనాలు. రూ.400 కోట్లతో 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో 4వ ప్లాంటును రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తోంది. రాజస్థాన్ ప్లాంటులో కొద్ది రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం కానుందని సంస్థ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ ఇటీవలే తెలిపారు. 18 లక్షల యూనిట్ల సామర్థ్యం గల 5వ ప్లాంటు గుజరాత్లో నిర్మాణంలో ఉంది. కంపెనీ రూ.1,100 కోట్లు వెచ్చిస్తోంది. 2015-16లో ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఉత్తరాది నుంచే దక్షిణాదికి హీరో వాహనాలు సరఫరా అవుతున్నాయి. కోట్లాది రూపాయలు రవాణాకే వ్యయం అవుతోంది. దక్షిణాదిన ప్లాంటు వస్తే కంపెనీకి ఒక్కో వాహనానికి రూ.2 వేలు ఆదా అవుతుందని ప్రదీప్ చంద్ర తెలిపారు. ఆరవ ప్లాంటుకై కంపెనీ రూ.1,200-1,500 కోట్లు వెచ్చించనుందని చెప్పారు. ఏటా 15-20 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో ప్లాంటు రానుందన్నారు. జహీరాబాద్ అడ్వాంటేజ్... తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో స్థల కేటాయింపులు క్లిష్టంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ దక్షిణాదిన ఇతర రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద హీరో ప్లాంటు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడే మహీంద్రా ట్రాక్టర్ల తయారీ ప్లాంటు ఉంది. అలాగే వాహన విడిభాగాల పార్కును మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. విడిభాగాల లభ్యత సులభతరం అవుతుంది కాబట్టి హీరో మోటో కార్ప్‌కు ఈ ప్రాంతం కలిసి వస్తుంది. -
1,000 మెగావాట్ల సోలార్ క్షేత్రం
మహబూబ్‌నగర్ జిల్లాలో 6,000 ఎకరాల్లో తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అతిపెద్ద సోలార్ క్షేత్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 6,000 ఎకరాల్లో ఇది రానుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సహకారంతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దీనిని ఏర్పాటు చేయనుంది. 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటుకానున్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.ప్రదీప్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రణాళిక దశలో ఉందని, మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ విద్యుత్‌కు అపార అవకాశాలున్నాయని చెప్పారు. శుక్రవారమిక్కడ సీఐఐ పేపర్‌టెక్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో మెగావాట్‌కు రూ.6 కోట్ల వ్యయం అవుతుందని, జేవీ తరహాలో ప్రాజెక్టు ఉంటుందని అన్నారు. కాగితం పరిశ్రమకు మంచిరోజులు.. కలప కొరతతో సతమతమవుతున్న పేపర్ పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. తెలంగాణ జిల్లాల్లో చెట్ల పెంపకానికి కంపెనీలకు మరిన్ని భూములు అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు స్థల సేకరణ కు కావాల్సిన అనుమతులను ప్రభుత్వం వేగవంతంగా ఇవ్వనుంది. తెలంగాణలో నిరుపయోగంగా వేలాది ఎకరాల భూములున్నాయని ప్రదీప్ చంద్ర అన్నారు. వీటిని ఉపయోగంలోకి తేవడం ద్వారా గ్రామీణ ప్రజలకు, సొసైటీలకు మేలు చేకూర్చాలన్నది ప్రభుత్వ ల క్ష్యమని చెప్పారు. కంపెనీలు ముందుకు వస్తే కావాల్సిన అనుమతులకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని వివరించారు. పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేలా త్వరలో ప్రకటించనున్న ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుందని పేర్కొన్నారు. సిల్క్‌మార్క్ మాదిరిగా.. పట్టు వస్త్రాల నాణ్యతను తెలిపేలా ఉన్న సిల్క్‌మార్క్ మాదిరిగా ఇతర ఉత్పత్తులకూ మార్క్ ఉండాలని ప్రదీప్ చంద్ర అభిప్రాయపడ్డారు. తయారీ ప్లాంట్లకు కూడా ప్రమాణాలు ఉండాలన్నారు. మార్కు ఉన్న ప్లాంట్లలో తయారైన ఉత్పత్తులు నాణ్యమైనవిగా పరిగణిస్తారని వివరించారు. సీఐఐ జీబీసీ వంటి సంస్థలు ఇందుకు చొరవ తీసుకుని నాణ్యతా ప్రమాణాలను సూచించాలని కోరారు. మార్క్ ఉన్న ఉత్పత్తుల అమ్మకాలకు ఢోకా లేదని అన్నారు. కస్టమర్లకు కూడా నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని చెప్పారు. సీఐఐ గోద్రెజ్ జీబీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.రఘుపతి ఈ సందర్భంగా స్పందిస్తూ తగు విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
300 కోట్లతో ఫౌండ్రీ పార్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగర్ ఫౌండ్రీస్ అసోసియేషన్ మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫౌండ్రీ పార్క్ త్వరలోనే రూపుదిద్దుకోనుంది. శివంపేట మండలం నవాబ్‌పేట వద్ద 170 ఎకరాల్లో ఇది రానుంది. రెవెన్యూ శాఖ నుంచి త్వరలోనే ఏపీఐఐసీకి స్థలాన్ని బదలాయిస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర శనివారమిక్కడ తెలిపారు. పార్కులో శిక్షణ సంస్థ, కామన్ టెస్టింగ్ ఫెసిలిటీని పీపీపీ విధానంలో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సదరన్ ఇండియా ఫౌండ్రీమెన్ సదస్సులో చెప్పారు. మొత్తం 50 కంపెనీలు రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయని అసోసియేషన్ కార్యదర్శి ఎం.ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 10 వేలు, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. -
పిల్లల కలల్నే పెద్దలూ కనాలి
తల్లి లీగల్ ఎక్స్పర్ట్. తండ్రి వ్యవసాయం. పెద్దబ్బాయ్ బీకాం కంప్యూటర్స్. చిన్నబ్బాయ్ ఎం.ఎస్ అమ్మాయి మధుశాలిని! అదేంటి?! మధుశాలిని అన్నది పేరు కదా, క్వాలిఫికేషన్‌లా చెప్పారు! అవును. పేరే పెద్ద క్వాలిఫికేషన్. మధు ఫైన్ ఆర్ట్స్ చేశారు. కూచిపూడి నేర్చుకున్నారు. బొమ్మలు వేశారు. ఫ్యాషన్ మోడలింగ్ చేశారు. ప్రస్తుతం... తెలిసిందే, సినిమాల్లో నటిస్తున్నారు. తండ్రి మొక్కల పెంపకంలో మునిగిపోయారు కాబట్టి పిల్లల పెంపకమంతా తల్లి రాజకుమారే తీసుకున్నారు. ముఖ్యంగా ఆడపిల్ల పెంపకం! సెట్స్‌లో ఇప్పుడు కూతురికి తోడుగా ఉంటున్నట్లే... బాల్యం నుంచీ ప్రతి అడుగులోనూ తనకు తోడుగా ఉన్నారు రాజకుమారి. ‘‘పిల్లల్ని కంటాం. తర్వాత వారి కెరియర్ గురించి కలలు కంటాం. తప్పు లేదు కానీ, పిల్లల కలలు వేరేగా ఉన్నప్పుడు వారు కోరుకున్నదే చెయ్యనివ్వడం పెద్దల బాధ్యత’’ అంటారు రాజకుమారి. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కూతురికి ఆమె చేసిన దిశానిర్దేశమే ఈవారం ‘లాలిపాఠం’. తల్లిదండ్రులు... పిల్లల కెరీర్‌ను మలచగలరు కానీ నిర్ణయించలేరు అంటారు సినీనటి మధుశాలిని తల్లి రాజకుమారి. ‘‘మాకు ఫలానా ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి ఆ కోర్సునే చదవండి అని ఒత్తిడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. మా అమ్మాయి ఎనిమిదవ తరగతిలోనే ‘మెడిసిన్, ఇంజినీరింగ్ వద్దు, నాకు ఫైన్ ఆర్ట్స్ ఇష్టం’ అని చెప్పేసింది. పెద్దబ్బాయి ప్రదీప్ చంద్ర బీకామ్ కంప్యూటర్స్ చేశాడు. చిన్నబ్బాయి శరత్చంద్ర న్యూజిలాండ్‌లో ఎం.ఎస్ చదువుతున్నాడు. నేను లాయర్‌గా ఫ్యామిలీ కోర్టు కేసులు చూసేదాన్ని.చాలామంది ‘మేము పిల్లలందరినీ ఒకేలాగ పెంచాం, అందరూ బాగున్నారు, వీడే ఇలాగయ్యాడు’ అంటుంటారు. నిజానికి పిల్లలందరినీ ఒకేలా పెంచడం సాధ్యం కాదు. పిల్లలందరూ ఒకలా ఉండరు, ఒకరికి సున్నితంగా, ఒకరికి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. లక్షణాలను బట్టి వ్యవహరించాలి’’ అంటారామె. పిల్లల బాల్యం అంతా నేనే!! ‘‘మావారు వ్యవసాయం చూసుకుంటూ ఎక్కువగా జహీరాబాద్‌లోనే ఉంటారు. పిల్లలతో నేను హైదరాబాద్‌లో ఉండాల్సి రావడంతో మా పిల్లల బాల్యం అంతా నేనే కనిపిస్తాను. మధు విషయానికి వస్తే తను చిన్నప్పటి నుంచి దుస్తులను భుజం మీద వేసుకుని, నడుముకు చుట్టుకుని అద్దంలో చూసుకుంటూ ర్యాంప్ మీద నడుస్తున్నట్లు ఫీలవుతూ క్యాట్‌వాక్ చేసేది. ఫ్యామిలీ ఫొటోలు తీసుకుంటున్నప్పుడు కూడా తను వైవిధ్యమైన పోజులిచ్చేది. ఇవన్నీ చూసినప్పుడు మా అన్నయ్య సరదాగా ‘మధు మోడల్ అవుతుంది’ అనేవాడు. అయితే మధు తాను మోడలింగ్ చేస్తానన్నప్పుడు మాత్రం ఇల్లంతా ఒక్కసారిగా ‘మోడలింగ్.. ఆ!’ అని ఉలిక్కిపడింది. మన ఇంట్లో ఎవరైనా ఈ ఫీల్డులో ఉన్నారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. మధు ఇష్టమే మా వారి ఇష్టం! మాది మతాంతర వివాహం. మా వారు హమీద్ ఎవరినీ నొప్పించే మనిషి కాదు. మేమిద్దరం పరస్పర వైవిధ్యమైన నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లం కావడంతో మొదట్లోనే ఒక అవగాహనకు వచ్చేశాం. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవడం, ఒకరి పర్సనల్ స్పేస్‌ని మరొకరు ప్రభావితం చేయకపోవడం వంటి పరిణితి వచ్చేసింది. ఆయనైతే మధు ఇష్టాల దగ్గరికి వచ్చేటప్పటికి సంప్రదాయ పరిధులను అతిక్రమించడానికి కూడా సిద్ధమయ్యారు. మోడలింగ్ రంగాన్ని ఎంచుకోవడం, సినిమారంగ ప్రవేశం, వస్త్రధారణ వంటి అనేక విషయాల్లో ఆయన ఒక్కటొక్కటిగా తనను తాను సడలించుకుంటూ వచ్చారు. దేనికీ నో చెప్పేవారు కాదు. నటన హాబీ కాదు వృత్తి! నాకు మాత్రం మధుని కూచిపూడి డాన్సర్‌ని చేయాలని ఉండేది, నేర్పించాను కూడ. పెద్దయిన తర్వాత మధు సల్సా కూడా ప్రాక్టీస్ చేసింది. మోడల్‌గా ఫ్యాషన్ షోలు చేసింది. ఒకసారి మ్యాగజీన్ కవర్ పేజీ మీద మధు ఫొటో చూసిన ఇవివి సత్యనారాయణగారు ‘కితకితలు’ సినిమాలో హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారు. సినిమాలో చేయడమా మానడమా అనే డైలమా ఇంట్లో. తనకేమో సినిమాల్లో చేయాలని ఉంది. అప్పుడు మేమంతా తనకి కౌన్సెలింగ్ ఇచ్చాం. ‘ఇది హాబీలా చేసేది కాదు, ప్రొఫెషనల్‌గా ఉండాలి. పైగా సినిమా రంగంలో చాలా సులభంగా గాసిప్స్ పుడతాయి. వాటికి తట్టుకుని నిలబడగలగాలి. వాటిని ఎంత వరకు స్వీకరించాలో అంతవరకే తీసుకోవాలి. ప్రతి విషయానికీ అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పనిలేదు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా దానికి మొదటగా నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటూ ఆ తర్వాత కుటుంబానికి వివరిస్తే చాలు’ అని చెప్పాం. నీ స్థానంలో నేనే ఉంటే... మధు నిర్ణయం తీసుకునే ముందు చాలా విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తుంది. తనకు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి తమిళ ‘అవన్ - ఇవన్’ (తెలుగులో వాడు-వీడు) సినిమా విషయంలో ఎదురైంది. ఆ సినిమాకి కథాపరంగా హీరోయిన్ కొన్ని సీన్లలో గుండుతో కనిపించాలి. ఆ సినిమా కోసం గుండు చేయించుకుంటే మళ్లీ జుట్టు వచ్చే వరకు ఇతర ప్రాజెక్టులేవీ చేయడానికి వీలుకాదని ఆలోచనలో పడింది. అప్పుడు నేను ‘నీ స్థానంలో నేను ఉంటే గుండు గురించి ఆలోచించను, వెంటనే అంగీకరిస్తాను’ అనే ఒక్కమాటనే అన్నాను. తను వెంటనే ఓకే చెప్పింది. తర్వాత కథలో కొద్ది మార్పుల కారణంగా గుండు చేయించుకోవాల్సిన అవసరమే రాలేదు.మధు సినిమారంగంలో అడుగుపెట్టినప్పుడు మరీ చిన్నపిల్ల. అందుకే మధుకి తోడుగా వెళ్తుండేదాన్ని’’ అన్నారు రాజకుమారి. కళల కుటుంబమే కానీ... ‘‘కళారంగం మాకు కొత్తకాదు, కానీ సినిమా అంటే వచ్చే గుర్తింపు వేరు. మధు నటిగా మారిన తర్వాత మా చిన్నబ్బాయి ఫ్రెండ్స్ వచ్చి ఆటోగ్రాఫ్ అడిగేవారు. మా వాడు మాత్రం ‘అక్కా! నిన్ను ఆటోగ్రాఫ్ అడుగుతున్నారేంటి’ అని ఆశ్చర్యపోయేవాడు’’ అన్నారామె. ‘పిల్లలు తప్పుదారి పడతారేమో అనే సందేహం వచ్చినప్పుడు కొన్ని ఉదాహరణలతో ప్రమాదాలను వివరిస్తాను, అంతకు మించి వాళ్ల పర్సనల్ స్పేస్‌లోకి చొరపడను. పిల్లల ఫోన్ నా దగ్గరే ఉన్నా వాళ్లకు ఎవరి నుంచికాల్స్ వచ్చాయి, ఏ మెసేజ్‌లు ఉన్నాయని చూడను. మధు మూడీగా ఉంటే మా పెద్దబ్బాయి పసిగట్టేస్తాడు. మధు టెన్షన్ పడుతోంది, ఏంటో అడుగు అని పురమాయిస్తాడు’ అంటున్నప్పుడు రాజకుమారి ముఖంలో తల్లిగా గెలిచాననే తృప్తి కనిపించింది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మధుశాలిని నటించిన చిత్రాలు అందరివాడు, నా ప్రాణం కంటే ఎక్కువ, నాయకుడు, కితకితలు, ఒక విచిత్రం, ఆగంతకుడు, స్టేట్ రౌడీ. పళనియప్ప కల్లూరి (తమిళం), కింగ్, పాత్తినారు (తమిళం), కారాలు మిరియాలు, అవన్ ఇవన్ (తమిళం), డిపార్ట్మెంట్ (హిందీ), నాగవల్లి (కన్నడం), భూత్ రిటర్న్ (హిందీ), పొగ, హ్యాపీ జర్నీ, సత్య 2.