సీఎస్‌కు మంత్రివర్గం అభినందన
- రేపు వీడ్కోలు కార్యక్రమం
- సీఎం సలహాదారుగా నియామకానికి ఆమోదం
- కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర!
- ఎవరవుతారో తనకే తెలియదన్న సీఎం!!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా అభినందించింది. బుధవారం ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో, సోమవారం జరిగిన కేబినేట్ భేటీలో మంత్రులంతా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. బుధవారం సచివాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సీఎస్‌గా రిటైరవుతున్న రాజీవ్ శర్మను సీఎం ప్రత్యేక సలహాదారుగా నియమించేందుకు కేబినేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
పాలనా సంస్కరణల బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారని తెలిసింది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఆయనకు ప్రత్యేక ఛాంబర్‌ను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కొత్త సీఎస్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రను నియమించే అవకాశాలున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించారుు. అరుుతే, తదుపరి ఎవరు సీఎస్ అవుతారో తనకే తెలియదని మీడియా సమావేశం అనంతరం ఒక ప్రశ్నకు బదులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు!