అర్ధరాత్రి దాటాక పేర్లు వెల్లడి
25లో జనసేనకు 3, బీజేపీకి 1 కేటాయింపు
టీడీపీ నుంచి 21 మందికి చాన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు మంగళవారం అర్ధరాత్రి దాటాక కొలిక్కి వచ్చింది. కేబినెట్‌లో చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అవకాశం దక్కగా.. ఈ జాబితాలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు కూడా చాన్స్ ఇచ్చారు. జనసేనకు మొత్తం మూడు, బీజేపీకి ఒకటి చొప్పున మంత్రి పదవులు కేటాయించారు.
మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపారు. ఈ మంత్రులు కూడా నేడు చంద్రబాబుతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారికి చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే మంత్రివర్గంలో 8 బీసీ, 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.
ఏపీ కేబినెట్ ఇదే..
1. నారా చంద్రబాబు నాయుడు (కమ్మ)
2. కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన–కాపు)
3. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ)
4. కొల్లు రవీంద్ర (బీసీ)
5. నాదెండ్ల మనోహర్ (జనసేన–కమ్మ)
6. పి.నారాయణ (కాపు)
7. వంగలపూడి అనిత (ఎస్సీ)
8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ–బీసీ)
9. నిమ్మల రామానాయుడు (కాపు)
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (మైనారీ్ట)
11. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి)
12. పయ్యావుల కేశవ్ (కమ్మ)
13. అనగాని సత్యప్రసాద్ (బీసీ)
14. కొలుసు పార్థసారధి (బీసీ
15. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ)
16. గొట్టిపాటి రవి (కమ్మ)
17. కందుల దుర్గేష్ (జనసేన–కాపు)
18. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ)
19. బీసీ జనార్దన్ రెడ్డి (రెడ్డి)
20. టీజీ భరత్ (వైశ్య)
21. ఎస్.సవిత (బీసీ)
22. వాసంశెట్టి సుభాష్ (బీసీ)
23. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ)
24. మండిపల్లి రామ్ ప్రసాద్‌రెడ్డి (రెడ్డి)
25. నారా లోకేశ్ (కమ్మ)
Comments
Please login to add a commentAdd a comment