AP Cabinet Ministers
-
‘గ్యారెంటీ’ అప్పు రూ.5,200 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రూ.5,200 కోట్ల రుణం పొందేందుకు పౌరసరఫరాల సంస్థ, ఏపీ మార్క్ఫెడ్లకు అనుమతినిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతుల మేలు కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత రబీలో ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపులతో పాటు 2024–25 సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ రుణాన్ని వినియోగిస్తామని తెలిపింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.అప్పులు మినహా మరో మార్గం లేదు..రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇటీవలే రూ.1,000 కోట్లు విడుదల చేశాం. మరో రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపు కోసం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రూ.2 వేల కోట్ల రుణం పొందేందుకు పౌర సరఫరాల సంస్థను అనుమతిస్తూ గత నెల 28వ తేదీన ప్రభుత్వం జీవో నెం.6 జారీ చేసింది. ఈ రుణం కోసం ప్రభుత్వ హామీ కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–25లో ధాన్యం కొనుగోలు కోసం వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి ప్రభుత్వ హామీతో రూ.3,200 కోట్ల కొత్త రుణం కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలను సవరించి మెరుగైన విధానం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు మేలు చేసేందుకు అప్పులు చేయడం మినహా మరో మార్గం లేదు. ఉచిత పంటల బీమా స్థానంలో మెరుగైన పంటల బీమా పథకాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఏర్పాటయ్యే కమిటీ నెల రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక, గనుల పాలసీలు రద్దుఏపీ ల్యాండ్ టైటిలింగ్ 2022 చట్టం రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇసుక, గనుల పాలసీ 2019, మరింత మెరుగైన ఇసుక విధానం 2021ని రద్దు చేయడంతో పాటు వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్æ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం 2024 తెస్తాం. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా, ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తూ ఈ నెల 8న జారీ చేసిన జీవో నెం.43 ర్యాటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రానికి గుల్బెంకియన్ అవార్డు రావటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో అమలులో ఉన్న ప్రకృతి సాగును 2029 నాటికి కనీసం 20 లక్షల హెక్టార్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.కౌన్సిల్లో బలం లేదు.. నిజమే‘‘కౌన్సిల్లో మాకు బలంలేని మాట వాస్తవమే. అయితే అసెంబ్లీలో చేసిన చట్టాలను కౌన్సిల్ అడ్డగించే అవకాశం లేదు కదా?’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి మద్దతిచ్చిన టీడీపీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించగా నాడు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇచ్చారని ఎదురు ప్రశ్నించారు. హౌసింగ్‌లో అక్రమాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సంపద సృష్టి విషయంలో కట్టుబడి ఉన్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ మొదలైందని మంత్రి చెప్పారు. కేవలం నెల రోజుల్లో రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. భూముల ధరలు కనీసం రూ.ఐదారు లక్షలకు పైగా పెరిగాయన్నారు. ఎయిర్, రైల్ ట్రాఫిక్ 30 శాతం పెరిగిందన్నారు.ఇసుకలో తలదూర్చొద్దు!ఇసుక వ్యవహారాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి కొంతకాలం సజావుగా సాగనివ్వాలన్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో వివిధ రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉందని, వచ్చే 3 నెలలకు కోటి టన్నుల ఇసుక అవసరమని చెప్పారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు కొత్త విధానాన్ని తెద్దామన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటన విషయం ప్రస్తావనకు రావడంతో కొన్ని విషయాలు వాళ్లతో మాట్లాడాల్సి ఉందని, అవన్నీ బయటకు చెప్పలేనని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ కార్యక్రమాలను కొందరు సరిగా జనంలోకి తీసుకెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఆగస్టు ఒకటో తేదీన ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీలో అందరూ పాల్గొనాలని సూచించారు.ఐదు రోజులు అసెంబ్లీఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును ఈ సమావేశాల్లోనే పెడదామని చెప్పారు. పంటల బీమా పథకం అమలు కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసం చేసిందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ.1,600 కోట్లు రుణం తెచ్చి రూ.వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారని, మిగతాది ఎక్కడుందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రేషన్ బియ్యం ఎగుమతి చేసి అక్రమాలకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించినట్లు తెలిసింది. కిలో రూ.43 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన సూచించగా వచ్చే మంత్రివర్గం సమావేశం నాటికి దీంతోపాటు భూ అక్రమాలపైనా విచారణకు ఆదేశించడంపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. -
చంద్రబాబు సంతకాలపై కేబినెట్లో కీలక చర్చ
-
ఏపీ కొత్త మంత్రులు వీళ్లే..
-
కొలువుదీరిన కొత్త మంత్రివర్గం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా మరో 24 మంది బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. గన్నవరం ఐటీ పార్కు వద్ద కేసరపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముందుగా చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ సహా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, రజనీకాంత్, చిరంజీవి సహా పలువురు సినీ స్టార్లు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు, చంద్రబాబు దంపతులు ఆశీనులయ్యారు. వేదికకు ఎడమ వైపు కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు కూర్చోగా, కుడివైపు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు కూర్చున్నారు. చంద్రబాబుతో ఉదయం 11.33 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం చంద్రబాబును వేదికపైనే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖుల వద్దకెళ్లి చంద్రబాబు నమస్కారం చేశారు. చంద్రబాబు తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. అనంతరం పవన్ ప్రధాని, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు తన సోదరుడు, మెగా స్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. ఆ తర్వాత వరుసగా నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి. బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబు సహా 24 మంది దైవ సాక్షిగా ప్రమాణం చేయగా, ఎన్ఎండీ ఫరూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పదాలను ఉచ్ఛరించడంలో ముగ్గురు మంత్రులు తడబడ్డారు. వాసంశెట్టి సుభాష్ తడబాటుకు లోనై కొన్ని పదాలు పలకలేకపోయారు. కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్థన్‌రెడ్డి కూడా తడబాటుకు లోనయ్యారు. ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు మంత్రివర్గ సభ్యులతో ప్రధాని మోదీ గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయన్ను ప్రత్యేకంగా సన్మానించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ వేదికపై తన సోదరుడు ఉన్నారని చెప్పగా ప్రధాని మోదీ చిరంజీవి వద్దకు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. మోదీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులను పైకి లేపి సభికులకు అభివాదం చేయడం విశేషం. చంద్రబాబు రజనీకాంత్‌ను చూపించగా మోదీ ఆయనకు నమస్కరించి పలకరించారు. వేదికపై ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర కేంద్ర మంత్రులకు మోదీ అభివాదం చేశారు. ప్రమాణం చేసిన తర్వాత పలువురు మంత్రులు తనకు పాదాభివందనం చేయబోతుండగా ప్రధాని వారించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన సమీపంలోని ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఒడిశాకు పయనమయ్యారు. హాజరైన ప్రముఖులు వీరే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జితన్ రామ్ మంజి, చిరాగ్ పాశ్వాన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రులు జయంత్ చౌదరి, అనుప్రియా పాటిల్, రామ్‌దాస్ అథవాలే, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తదితరులు కూడా హాజరయ్యారు. -
చంద్రబాబు కేబినెట్.. వాళ్లకు మాత్రం హ్యాండ్!
అమరావతి, సాక్షి: చంద్రబాబు మరోసారి తన మార్క్ ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో 24 మంత్రి స్థానాలకుగానూ.. ఏకంగా 17 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు. అయితే జనసేనకు 3, బీజేపీ 1 మంత్రి పదవి ఇచ్చి మిగిలినవన్నీ తన పార్టీకే కేటాయించుకున్నారు. అయితే.. మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశలో ఉన్న మాజీలకు, ఆశావహులకు చంద్రబాబు మాత్రం మొండిచేయి చూపించారు. గత అర్ధరాత్రి కేబినెట్ జాబితా వెలువడ్డాక వాళ్లు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఈ జాబితాను పరిశీలిస్తే చాలా పెద్దదిగానే ఉంది. మూడు పార్టీలకు చెందిన సీనియర్ల జాబితా పరిశీలిస్తే.. కళా వెంకట్రావ్, గంటా శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు,ధూళిపాళి నరేంద్ర, గద్దె రామ్మోహన్, చింతమనేని ప్రభాకర్లకు కేబినెట్లో చోటు దక్కలేదు. అలాగే.. కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్ రాజు, రఘురామ కృష్ణంరాజు, మండలి బుద్ధప్రసాద్, కూన రవికుమార్, నక్కా కోటంరెడ్డి, బోండా ఉమా, కొలికిపూడి, జీవీ, వేమిరెడ్డి, అఖిలప్రియ, మాధవిరెడ్డి, పరిటాల సునీతకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. అయితే.. ఈ జాబితా నుంచే స్పీకర్‌గా ఒకరికి అవకాశం దక్కేలా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్సార్సీపీ నుంచి చేరి పోటీ చేసి నెగ్గిన ఆనం నారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథిలకు మాత్రం అవకాశం ఇచ్చారు. అదే పార్టీ నుంచి వచ్చిన కోటంరెడ్డి, గుమ్మనూరు జయరాం మాత్రం ఛాన్స్ దక్కలేదు. మంత్రి పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్న వీళ్లలో కొందరు నిరాశలో ఉన్నట్లు వాళ్ల వాళ్ల అనుచర గణాలు చెబుతున్నాయి. మరి వీళ్ల అసంతృప్తిని చంద్రబాబు ఎలా చెరిపేస్తారో చూడాలి.ఇదీ చదవండి: ఆ ఒక్క మంత్రి పదవి కూడా టీడీపీకేనా? -
ఏపీ మంత్రుల జాబితా విడుదల
-
ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు మంగళవారం అర్ధరాత్రి దాటాక కొలిక్కి వచ్చింది. కేబినెట్లో చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అవకాశం దక్కగా.. ఈ జాబితాలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు కూడా చాన్స్ ఇచ్చారు. జనసేనకు మొత్తం మూడు, బీజేపీకి ఒకటి చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపారు. ఈ మంత్రులు కూడా నేడు చంద్రబాబుతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారికి చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే మంత్రివర్గంలో 8 బీసీ, 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. ఏపీ కేబినెట్ ఇదే.. 1. నారా చంద్రబాబు నాయుడు (కమ్మ) 2. కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన–కాపు) 3. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ) 4. కొల్లు రవీంద్ర (బీసీ) 5. నాదెండ్ల మనోహర్ (జనసేన–కమ్మ) 6. పి.నారాయణ (కాపు) 7. వంగలపూడి అనిత (ఎస్సీ) 8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ–బీసీ) 9. నిమ్మల రామానాయుడు (కాపు) 10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (మైనారీ్ట) 11. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి) 12. పయ్యావుల కేశవ్ (కమ్మ) 13. అనగాని సత్యప్రసాద్ (బీసీ) 14. కొలుసు పార్థసారధి (బీసీ 15. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ) 16. గొట్టిపాటి రవి (కమ్మ) 17. కందుల దుర్గేష్ (జనసేన–కాపు) 18. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) 19. బీసీ జనార్దన్ రెడ్డి (రెడ్డి) 20. టీజీ భరత్ (వైశ్య) 21. ఎస్.సవిత (బీసీ) 22. వాసంశెట్టి సుభాష్ (బీసీ) 23. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ) 24. మండిపల్లి రామ్ ప్రసాద్‌రెడ్డి (రెడ్డి) 25. నారా లోకేశ్ (కమ్మ) -
ఆ పదవే కావాలి.. పట్టుబడుతున్న పవన్?!
విజయవాడ, సాక్షి: మరో రెండు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర కేబినెట్లో బెర్తుల కోసం ఢిల్లీ పర్యటనతో బిజిబిజీగా గడిపిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ కూర్పు కోసం కసరత్తులు ముమ్మరం చేయబోతున్నారు. టీడీపీతో పాటు మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు ఏయే శాఖలు కట్టబెట్టాలో అనేదానిపై ఆ పార్టీల నేతలతో ఇవాళ్టి నుంచే మంతనాలు కొనసాగించే ఛాన్స్ కనిపిస్తోంది.అయితే.. ప్రధాన మిత్రపక్షం జనసేన నాలుగు మంత్రి పదవులకు తగ్గకూడదనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం పవన్‌కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారంటూ తాజాగా ఓ జాతీయ మీడియా వెబ్సైట్ కథనం ఇచ్చింది. ఆదివారం మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి భార్యతో సహా వెళ్లిన పవన్ ఈ మాట అన్నారని సదరు వెబ్సైట్ ప్రచురించగా.. దానిని బాబు అనుకూల మీడియా సైతం తాజాగా ధృవీకరించడం విశేషం. డిప్యూటీ సీఎం పదవితో పాటు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలన్నది పవన్ ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నాదెండ్ల మనోహర్, పులవర్తి అంజిబాబు, మండలి బుద్ధ ప్రసాద్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, అరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వర ప్రసాద్ లు మంత్రి పదవుల రేసులో ప్రధానంగా ఉన్నారు. మరోవైపు.. చిరు, నాగబాబులతో పవన్‌కు సిఫార్సులు వెళ్తున్నాయనే ప్రచారం ఒకటి నడుస్తోంది. ఈ ఊహాగానాల లెక్కన జనసేనలో పవన్‌తో పాటు ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కనుందన్నమాట. మరోవైపు.. కొత్త మంత్రి వర్గంలో చోటు కోసం బీజేపీ సైతం కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం టీడీపీకి రెండు కేబినెట్ పోస్టులు ఇచ్చింది బీజేపీ. అలాగే.. ఇక్కడా అదే ఫార్ములా పాటించాలని టీడీపీ అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరఫున బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌కు ఆ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇక మరో మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ తప్పదనే చర్చ మొదలైంది. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లలో ఎవరికో ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు.. పార్థసారథి(ఆదోని), ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు)లు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు టీడీపీ కోటాలోనూ పేర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సీనియర్లను అసంతృప్తిపర్చకుండా కేబినెట్‌ను రూపకల్పన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు స్పష్టం అవుతోంది. -
విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన: సీఎం జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది కేబినెట్. ఈ సందర్బంగా సీఎం జగన్ వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని తెలిపారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్బంగా పరిపాలనా రాజధాని విశాఖ గురించి ప్రస్తావిస్తూ సమావేశంలో సీఎం కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు సీఎం జగన్. అలాగే ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామన్నారు. ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం -
అర్చకులకు వంశపారంపర్య హక్కులు.. స్వరూపానందేంద్ర స్వామి స్పందన ఇదే..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. అర్చకుల వంశపారంపర్య హక్కులపై ఏపీ కేబినెట్ తీర్మానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు. అసెంబ్లీలో చట్టబద్దంగా నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరం అన్నారు. అర్చక కుటుంబాల దశాబ్దాల కల నెరవేర్ఛడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. అర్చక వృత్తికి బ్రాహ్మణులు దూరమవుతున్న సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామంగా స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది. సీఎం జగన్‌కు ఏపీ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే అర్చకులకు పదవీ విరమణ లేకుండా వీలైనంత కాలం పనిచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఏపీ అర్చక సమాఖ్య సీఎం జగన్‌కు బుధవారం కృతజ్ఞతలు తెలిపింది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ అంటూ అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణకూ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
ఇటీవల మరణించిన సినీ ప్రముఖులకు ఏపీ కేబినెట్ నివాళులు
ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నివాళులర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మంత్రివర్గం మౌనం పాటించింది. -
ఈనెల 29న ఏపీ కేబినేట్ సమావేశం
విజయవాడ: ఈనెల 29వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. -
ఈ నెల 22న ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ఈ నెల 22న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
కొలువుల ఖిల్లా నెల్లూరు జిల్లా.. కృష్ణపట్నం వద్ద రూ.5,783 కోట్లతో..
పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న జిల్లా.. కొలువుల ఖిల్లాగా మారనుంది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందుకు బీజాలు పడ్డాయి. సింహపురి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు. జిల్లా నలుదిశలా సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నాలు ముమ్మరయ్యాయి. లక్షలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. నిర్దిష్టమైన పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది. క్రిస్‌సిటీకి కేంద్ర పర్యావరణ అనుమతులు సాధించింది. బయో ఇథనాల్ ఫ్లాంట్, వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. సాక్షి, నెల్లూరు: విశాల సముద్రతీరం.. అత్యధిక విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు.. అందుబాటులో రహదారి, జల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్న జిల్లా పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం తప్ప.. పారిశ్రామిక జాడల్లేని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీజాలు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణపట్నంపోర్టుకు అనుబంధంగా క్రిస్ సిటీకి ఏర్పాటుకు అన్ని అనుమతులు లభించాయి. క్రిబ్కో పరిధిలో బయో ఇథనాల్ ప్లాంట్, నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో రూ.100 కోట్లతో ఆస్పత్రి, మెట్ట ప్రాంతం ఉదయగిరిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యువతకు ఉద్యోగాల వెల్లువ జిల్లాలో యువతకు వెల్లువగా ఉద్యోగాలు రానున్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్ సిటీ ఏర్పాటు కానుంది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 2.96 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు, 1.71 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దక్కనుంది. తొలి దశలో రూ.1,500 కోట్లతో 2,006 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం పర్యావరణ అనుమతులు, కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అనుమతులు లభించాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) పరిధిలో రూ.560 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాకాశాలు లభించనున్నాయి. చదవండి: (AP: పరిశ్రమలకు భారీ ఊరట.. ఆంక్షలు ఎత్తివేత) ఆక్వా ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నారాయునిపాళెం నుంచి తడ వరకు 169 కిలో మీటర్ల మేర సముద్ర తీరం ఉంది. సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న 2 లక్షల మంది మత్స్యకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 46 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతుంది. రెట్టింపు స్థాయిలో ఎగుమతి చేసుకునే అవకాశాలను అందిపుచ్చుకునే చర్యలను చేపట్టుతోంది. అక్వా ఉత్పత్తులు ఆర్బీకేలకు అనుసంధానం చేసి ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం అడుగులు పడ్డాయి. ఉదయగిరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో ఉదయగిరి ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు ప్రాంగణంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్ట ప్రాంతంలో వ్యవసాయ యూనివర్సిటీ అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగానికి ప్రయోజనకారిగా మారనుంది. విద్యార్థులకు యూనివర్సిటీ అందుబాటులోకి రావడమే కాకుండా పరిశోధనలు ద్వారా అదునాతున వంగడాలు మెట్ట ప్రాంతం ఉన్నతికి యోగ్యకరంగా మారనుంది. రూ.100 కోట్లతో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కేటాయిస్తూ నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు వద్ద నూతన ఆస్పత్రి నిర్మాణానికి 4 ఎకరాలు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం చొరవతో పారిశ్రామికాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కృష్ణపట్నంలో క్రిస్‌సిటీ, సర్వేపల్లి వద్ద క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కావడం శుభ పరిణామం. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ మంత్రి అయిన కొద్ది రోజులకే రూ.560 కోట్లతో ప్లాంటు మంజూరు కావడం గర్వంగా ఉంది. ఈ ప్లాంటు వల్ల సుమారు 500 మందికి ఉద్యోగ, ఉపా«ధి అవకాశాలు లభిస్తాయి. యువతకు ఇది సంతోకరమైన విషయం. – రాగాల వెంకటేశ్వర్లు, రైతు, కృష్ణపట్నం పారిశ్రామిక ప్రగతి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పలు పరిశ్రమలు రాగా, ప్రస్తుతం కృష్ణపట్నంలో క్రిస్ సిటీ, సర్వేపల్లి వద్ద క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్‌తో పాటు కొడవలూరు మండలంలోకి మరో పరిశ్రమ రావడంతో జిల్లా పారిశ్రామికంగా ప్రగతి పథంలో నడుస్తుంది. భవిష్యత్‌లో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుంటారు. – తలతోటి ప్రసన్నకుమార్, చంద్రశేఖర్‌పురం, కొడవలూరు మండలం ఉపాధి అవకాశాలు మెండు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పరిశ్రమలు వస్తున్నాయి. దీంతో మావంటి విద్యను అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది. ముఖ్యంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. ఇది అభినందనీయం. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తే మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – కాగోల్లు పవన్, బీటెక్ విద్యార్థి, దండిగుంట, విడవలూరు మండలం -
టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారు: స్పీకర్ తమ్మినేని
సాక్షి, అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం జరిగిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పెద్ద మానవతావాది అని స్పీకర్ కొనియాడారు. కేబినెట్లో అణగారిన వర్గాలకు సీఎం జగన్ గొప్ప అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బీసీలకు దామాషా పద్దతిన పెద్ద ఎత్తున రాజాధికారం ఇచ్చారని తెలిపారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్దిదారుల ఇంటి వద్దకే చేరుస్తున్నారని తెలిపారు. టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారని అన్నారు. కేబినెట్లో అందరికీ సమాన న్యాయం జరిగిందని స్పీకర్ పేర్కొన్నారు. -
Balineni Srinivas Reddy: జగనన్న మాటే.. వాసన్న బాట
తమ అభిమాన నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రిమండలిలో చోటు దక్కకపోవడంతో జిల్లాలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. బాలినేని వారిస్తున్నా.. ప్రకాశం జిల్లాతోపాటు, బాపట్ల జిల్లా పరిధిలోని పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గం పలువురు నేతలు పదవులను త్యజించేందుకు సిద్ధమయ్యారు. ‘‘పదవులు ముఖ్యం కాదు..అధినేత మాటే శిరోధార్యం..జిల్లాలో పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు పాటు పడదాం..’’ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఆయన సీఎంతో భేటీ అయిన తర్వాత క్యాడర్‌కు సర్ది చెప్పారు. 'సాక్షి, ఒంగోలు: ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. నాయకులు, క్యాడర్ అహర్నిశలు పార్టీ అభ్యున్నతికి పాటు పడ్డారు. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్నింటా పార్టీ సత్తాచాటింది. జెడ్పీ ఎన్నికల్లో అయితే ప్రతిపక్షాలకు ఒక్కటంటే ఒక్కస్థానం కూడా లేకుండా పోయింది. ఇంత కీలకంగా ఉన్న జిల్లా నుంచి జగన్మోహన్రెడ్డి తొలి మంత్రి మండలిలో బాలినేని శ్రీనివాసరెడ్డి చోటు దక్కించుకున్నారు. మంత్రిగా జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారు. ఎన్నో కీలక ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కృషిచేశారు. మరో వైపు పార్టీ పటిష్టానికి సైతం తన వంతు కృషి చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చారు. బాలినేనికి రెండో విడత రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఖాయమని అభిమానులంతా భావించారు. అయితే సామాజిక సర్దుబాటుల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని నేతలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. బాలినేని వారిస్తున్నా వినకుండా తమ పదవులకు రాజీనామా చేసేందుకు ముందుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు చేశారు. పార్టీ అధినాయకులు బాలినేనితో దఫ..దఫాలుగా చర్చలు జరుపుతున్న సమయంలో వీరు మరింత ఆందోళనకు గురయ్యారు. చలో విజయవాడ అంటూ పరుగుపెట్టారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కరణం బలరామకృష్ణమూర్తి, నాగార్జునరెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, ఇతర కీలక నేతలు విజయవాడలో బాలినేనిని కలిశారు. సుదీర్ఘ చర్చలు జరిపారు. చదవండి: (పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదు..) అంతా టీ కప్పులో తుపానులా.. అయితే ఇదంతా టీ కప్పులో తుపానులా అంతా సర్దుమణిగిపోయింది. సోమవారం సాయంత్రం సీఎం జగన్మోహన్రెడ్డితో బాలినేని సుదీర్ఘ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, అధినేత ఆదేశాలే శిరోధార్యమన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ క్యాడర్ సంయమనం పాటించాలంటూ పిలుపునిచ్చారు. ‘‘అభిమాన నేత అనగానే ఎవరికైనా సహజంగానే భావోద్వేగాలు ఉంటుంటాయి. ఆ కోణంలోనుంచే తమలో ఆందోళన నెలకొందని, అంతే తప్ప తాము పార్టీకి వ్యతిరేకం కామంటూ’’నేతలు స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపు మేరకు పార్టీ అభ్యున్నతికి పాటు పడతామని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత స్పష్టం చేశారు. మంత్రి పదవి కన్నా 2024లో పార్టీ గెలుపే మనకు ముఖ్యమని వాసన్న స్పష్టం చేశారని, ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాలతో తాను, కార్పొరేటర్లు అంతా మా రాజీనామాలను ఉపసంహరించుకుంటున్నామని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు జెడ్పీటీసీ భవనం శ్రీలక్ష్మి, చినగంజాం జెడ్పీటీసీ ఆసోది భాగ్యలక్ష్మి, ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి, కారంచేడు జెడ్పీటీసీ యార్లగడ్డ రజనీ, ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు, సంతమాగులూరు ఎంపీపీ అట్లా చిన వెంకటరెడ్డి, ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి తదితరులు తమ రాజీనామా నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జగన్న మాటంటే తమకు వేదవాక్కు అని, ఆయన మాటను జవదాటే ప్రశ్నేలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నా, వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా తమకు ఎంతో ఇష్టమని, అంతా ఒకటే కుటుంబ సభ్యులమని పేర్కొన్నారు. -
సీఎం జగన్ కేబినెట్లోని మంత్రులు.. వారి శాఖలు (ఫోటోలు)
-
అధికారం పవర్ కాదు.. బాధ్యత
సాక్షి, అమరావతి: అధికారమన్నది పవర్ కాదని, అది ఒక బాధ్యత అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నదే సీఎం జగన్ ముఖ్య విధానమని తెలిపారు. ఇందులో ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం అన్నది లేదన్నారు. అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే సాఫీగా సాగుతోందని తెలిపారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉందని స్పష్టంచేశారు. సోమవారం తాత్కాలిక సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పదవులు దక్కలేదన్నది నాయకుల అసంతృప్తి కాదని, వారి అనుచరుల తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనని చెప్పారు. అధికారం వారి నాయకుడికి రావాలన్నదే అనుచరుల బాధ అని, అక్కడి నుంచి అసంతృప్తి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారని తెలిపారు. ఆవేశంతో కొంత మంది రాజీనామాలు అనే మాట వచ్చి ఉంటుందన్నారు. ఇదంతా తాత్కాలికమేనన్నారు. పరిమిత సంఖ్యలో ఉన్న పోస్టుల్లో అందరికీ న్యాయం చేయడం కొంత ఇబ్బందికరమేనని చెప్పారు. అనుచరుల బాధను అధినేత అర్థం చేసుకుంటారన్నారు. చాలా మంది నేతలు స్పోర్టివ్‌గా తీసుకున్నారని చెప్పారు. బీసీలకు పెద్ద పీట వేసిన విషయాన్ని అందరూ గమనించాలన్నారు. ఓ వర్గం మీడియా కుట్రపూరితంగా దీనిపై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. 2014లో చంద్రబాబు 25 మంత్రి పదవులు ఉన్నా, 19 మందినే ఎందుకు నియమించుకున్నారని ప్రశ్నించారు. ఆయన కుమారుడి కోసం మరో ఐదు పోస్టులు భర్తీ చేశారన్నారు. ఇవన్నీ మరిచి ఇవాళ టీడీపీ నేతలు అడ్డగోలు కామెంట్లు చేస్తూ శునకానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ బాధ్యతలు, రీజినల్ కోఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేస్తారని, వాళ్లూ కీలకంగా మారతారని తెలిపారు. మంత్రివర్గం, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ఎన్నికల టీమ్‌గా ఉంటారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వీరంతా పార్టీని విజయపథంలో నడిపిస్తారని ఆయన చెప్పారు. -
సామాజిక విప్లవానికి నాంది పలికిన సీఎం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సామాజిక విప్లవానికి నాంది పలికారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. జగన్ దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకున్నారని, దేశ చరిత్రలో తొలిసారిగా 70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి సామాజిక విప్లవానికి నాంది పలికారని చెప్పారు. సోమవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ఏకంగా రూ.1.32 లక్షల కోట్లు సీఎం జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. 31లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, 17 వేల జగనన్న కాలనీలతో ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నారని చెప్పారు. 14ఏళ్లు సీఎం చేసిన చంద్రబాబు పేదలకు కట్టిన ఇళ్లు ఎన్ని అని ప్రశ్నించారు. ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చారా అని అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్లో కింది స్థాయి నుంచి మార్పులు చేస్తూ పేదవాడి గడప వద్దకే పాలన తెస్తున్న సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. బాబుకు చెప్పుకోవడానికి ఒక్క మంచీ లేదన్నారు. మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పరిపాలన లేదు అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, సాహు మహరాజ్, పెరియార్ రామస్వామి, జగ్జీవన్ రామ్ కన్న కలలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పాలన జరగదని చెప్పారు. అణచివేతకు గురైన వర్గాల ఉన్నతి కోసం ఇంత చేస్తున్న సీఎం జగన్‌ని అభినందించాల్సింది పోయి, టీడీపీ, చంద్రబాబు, ఎల్లో మీడియా ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన బాబు కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు చోటు కల్పించలేదన్నారు. బాబు కేబినెట్లో బడుగు బలహీన వర్గాలకు కేవలం 42 శాతం ఇస్తే... సీఎం జగన్ తొలి కేబినెట్లో 60 శాతం, ఇప్పుడు 70 శాతం పదవులు ఇచ్చారని తెలిపారు. -
అణగారిన వర్గాలకు రాజ్యాధికారం
సాక్షి,అమరావతి: దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, సామాజిక కోణంలో ఊహకు కూడా అందని విధంగా మంత్రివర్గం ఏర్పాటు జరిగిందని బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీల శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు ఏపీలో రాజ్యాధికారం దక్కిందని చెప్పారు. అందుకే దీన్ని సామాజిక కేబినెట్ అని చెబుతున్నామన్నారు. రాజ్యాధికారం కోసం ఎందరో మాటలు చెప్పారని, దాన్ని సాకారం చేసింది మాత్రం సీఎం జగన్ అని తెలిపారు. నూతన మంత్రివర్గంలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. అంటే 70 శాతం ఉన్నారని చెప్పారు. బీసీలు, మైనారిటీలు 11 మంది, ఎస్సీలు ఐదుగురు, ఒక ఎస్టీ ఉన్నారని తెలిపారు. ఇది ఒక సామాజిక విప్లవంగా చెప్పవచ్చన్నారు. అందుకే చంద్రబాబుకు, టీడీపీకి దిక్కు తోచక అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీసీలకు చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏమి చేశారు, ఈ 34 నెలల పాలనలో జగన్ ఏమి చేశారో చర్చకు సిద్ధమని అన్నారు. బాబుకు, టీడీపీ వారికి ధైర్యముంటే చర్చకు రావాలన్నారు. బీసీలకు జగన్ అత్యంత ప్రాధాన్యం రాష్ట్రంలో ఉన్న దాదాపు 139 బీసీ కులాల వారిని గతంలో ఏ ప్రభుత్వమూ గుర్తించలేదని చెప్పారు. కానీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం జగన్ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీసీల ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. టీడీపీ హయాంలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. పనికి రాని పని ముట్లు ఇచ్చారని, అవి ఉపయోగపడకపోగా వాటిలోనూ టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని చెప్పారు. బీసీ కార్పొరేషన్ల గురించి బాబు ఆలోచించలేదన్నారు. గతంలో బీసీలకు మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసి వారు బాగా చదువుకొనేలా చూశారని తెలిపారు. చంద్రబాబు సీఎం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరు గార్చారన్నారు. పేదలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సి వచ్చేదన్నారు. అందులో అంతులేని అవినీతి జరిగేదని చెప్పారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలన ఇంటి గడప వద్దనే అందుతోందన్నారు. ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ అవుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో 2100 ప్రొసీజర్లు ఉంటే, వాటిని బాబు 1000కి తగ్గించారన్నారు. జగన్ సీఎం కాగానే ఆరోగ్యశ్రీలోకి దాదాపు 2500 ప్రొసీజర్లు తెచ్చారని తెలిపారు. -
ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర దృశ్యాలు
సాక్షి, అమరావతి: సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ► ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా తొలిసారి మంత్రి పదవి దక్కిన పీడిక రాజన్న దొర రెండు గంటలు ముందుగానే వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికి ఇంకా సహచర ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోవడంతో అధికారులు, విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ► తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సంతకం చేయకుండా రావటాన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్ సైగ చేయడంతో సంతకం చేసి సీఎం, గవర్నర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ► బొత్స సత్యనారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనవద్ద ఉన్న పెన్నుతో సంతకం చేస్తుండగా ప్రొటోకాల్ అధికారులు తమ పెన్నుతో సంతకం చేయాలని కోరారు. ► మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా 9మంది మంత్రులు సీఎంకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరిలో బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కె.నారాయణస్వామి, కేవీ ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని ఉన్నారు. ► ఆరేకే రోజా ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కాళ్లకు నమస్కరించడమే కాకుండా చేతిపై ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ► దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజన్న దొర, రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కార్యకర్తలు ఈలలతో హుషారెత్తించారు. ► ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో పలువురిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భుజం తట్టి అభినందించారు. -
అత్యధికులు విద్యాధికులే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో అత్యధికులు విద్యాధికులు ఉన్నారు. ఎండీ (జనరల్) ఒకరు, పీహెచ్‌డీలు చేసిన వారు ఐదుగురు, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్లు, బీటెక్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు, ఎనిమిది మంది గ్రాడ్యుయేట్లు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇంటర్మీడియట్ చదివిన వారు ముగ్గురు, పదో తరగతి వరకు చదివిన వారు ఇద్దరున్నారు. ► పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వైద్యుడు. ఆయన ఎండీ (జనరల్ మెడిసిన్) చదివారు. ► విద్యుత్, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఏ చదివాక.. సోషియాలజీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకున్నారు. ► వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలు పీహెచ్డీ చేసి డాక్టరేట్ సాధించారు. ► మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ ఎమ్మెస్సీ చదివి.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్‌పై పీహెచ్డీ చేస్తున్నారు. ► వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని ఎంబీఏ చదివారు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు బీటెక్ చదివారు. ► జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. హోంమంత్రిగా ఎస్సీ మహిళలు.. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖను కేటాయించారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా మహిళను నియమించడం అదే తొలిసారి. అలాగే, 2019, మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన కేబినెట్లో హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ మేకతోటి సుచరితకు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళను నియమించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఇక పునర్వ్యవస్థీకరణ ద్వారా సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా మళ్లీ ఎస్సీ వర్గానికే చెందిన మహిళ తానేటి వనితను నియమించడం గమనార్హం. -
‘సామాజిక’ సాధికారత
సాక్షి, అమరావతి: పునర్ వ్యవస్థీకరణ ద్వారా సామాజిక మహా విప్లవాన్ని ఆవిష్కరిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన నూతన మంత్రివర్గం సోమవారం కొలువుదీరింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై 25 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత గవర్నర్, కొత్త, పాత మంత్రులు, అతిథులకు సీఎం వైఎస్ జగన్ తేనీటి విందు (హైటీ) ఇచ్చారు. రాష్ట్రంలో సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరిస్తూ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నలుగురిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారినే నియమించాలన్న సీఎం జగన్ సూచన మేరకు కె.నారాయణస్వామి, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషాలకు డిప్యూటీ సీఎంల హోదాను గవర్నర్ కల్పించారు. గత మంత్రివర్గంలోనూ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ కేటాయించడం తెలిసిందే. ఇక ఓసీ (కాపు) సామాజిక వర్గం నుంచి కొట్టు సత్యనారాయణను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. హోంశాఖ మంత్రిగా తానేటి వనితకు అవకాశం కల్పించి మరోసారి ఎస్సీ వర్గానికి చెందిన మహిళనే నియమించారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలో దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితను హోంశాఖ మంత్రిగా సీఎం జగన్ నియమించడం తెలిసిందే. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాక్ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంత్రుల గ్రూప్ ఫొటో ప్రధాన శాఖలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.. పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దఎత్తున భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఆయా వర్గాల్లో అట్టడుగు ప్రజానీకానికి సంక్షేమాభివృద్ధి ఫలాలను చేరవేసి ప్రగతి పథంలో సాగాలన్నది సీఎం జగన్ ఆశయం. అందులో భాగంగా గత మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి చోటు కల్పిస్తే తాజా మంత్రివర్గంలో అంతకు మించి 17 మందికి స్థానం కల్పించారు. అంతేకాకుండా అత్యంత ప్రధానమైన రెవెన్యూ, విద్య, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, పౌరసరఫరాలు, రవాణా, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమం తదితర కీలక శాఖలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించడం గమనార్హం. ఎస్సీలకు సమున్నత స్థానం.. సామాజిక న్యాయాన్ని చేతల్లో ఆచరిస్తూ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి సీఎం వైఎస్ జగన్ చోటు కల్పించారు. శాఖల కేటాయింపులోనూ ఎస్సీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. గత మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కె.నారాయణస్వామిని మళ్లీ అదే పదవిలో నియమించి ఎక్సైజ్ శాఖ కేటాయించారు. కొత్త మంత్రివర్గంలోనూ మళ్లీ ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తానేటి వనితను హోంమంత్రి పదవిలో నియమించారు. అత్యంత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను ఆదిమూలపు సురేష్‌కు కేటాయించారు. రవాణాతోపాటు సాంఘిక సంక్షేమ శాఖలను ఎస్సీ వర్గాలకే కేటాయించి ఆయా వర్గాలను సమున్నతంగా గౌరవించారు. గిరిజనులకు గౌరవం.. మంత్రివర్గంలో గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. ఆ వర్గానికి చెందిన పీడిక రాజన్నదొరను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖను రాజన్నదొరకు కేటాయించడం ద్వారా ఆ వర్గాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేశారు. బీసీలకు పెద్దపీట.. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్ అని ఆచరణలో చూపించిన సీఎం జగన్ మైనార్టీలతో కలిపి ఆ వర్గాలకు గత మంత్రివర్గంలో ఎనిమిది మందికి చోటు కల్పిస్తే కొత్త మంత్రివర్గంలో 11 మందికి అవకాశమిచ్చారు. బీసీ వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. మైనార్టీ వర్గానికి చెందిన అంజాద్‌బాషాను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, విద్య, పశు సంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, గృహ నిర్మాణం తదితర కీలక శాఖలను బీసీ వర్గాలకే అప్పగించారు. చేతల్లో మహిళా సాధికారత.. మహిళా సాధికారతపై చిత్తశుద్ధిని సీఎం వైఎస్ జగన్ మరోసారి చాటుకున్నారు. గత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పిస్తే.. కొత్త మంత్రివర్గంలో నలుగురికి చోటు కల్పించారు. మహిళా మంత్రులకు అత్యంత కీలక శాఖలు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన తానేటి వనితను నియమిస్తే.. కీలకమైన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖను విడదల రజనీకి కేటాయించారు. ఉషా శ్రీచరణ్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖను, ఆర్కే రోజాకు పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాలను శాఖను కేటాయించి మహిళా సాధికారతపై మరో అడుగు ముందుకేశారు. కార్యక్రమం సాగిందిలా.. తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై 25 మందితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11.26 నిమిషాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక ప్రాంగణానికి చేరుకోగా ఆ వెంటనే గవర్నర్ కూడా వచ్చారు. గవర్నర్‌కు సాదరంగా స్వాగతం పలికి ప్రమాణ స్వీకార వేదికపైకి ముఖ్యమంత్రి తోడ్కొని వచ్చారు. జాతీయ గీతాలాపన అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం 11.31 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. బిశ్వభూషణ్ హరిచందన్ ... అనే నేను అంటూ అచ్చ తెలుగులో గవర్నర్ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. అభినందించిన గవర్నర్ అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదవగా గవర్నర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 12.29 గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రులు గ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే తేనేటి విందుకు హాజరయ్యారు. అక్షర క్రమంలో తొలుత అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా చివరిగా విడదల రజని ప్రమాణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆది మూలపు సురేష్, ఉష శ్రీచరణ్ ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేయగా మిగతా వారంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అంజాద్‌బాషా తెలుగులో అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకర్షించింది. మిగతా వారంతా దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లి నమస్కరించి ఆశీస్సులు పొందారు. నూతన మంత్రులను గవర్నర్ అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మండలి చైర్మన్ మోషేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, పుష్ప శ్రీవాణి, శంకర నారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల ఇన్చార్జ్, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు హాజరయ్యారు. వివిధ నియోజకవర్గాల నుంచి హాజరైన ప్రజలు, అనుచరులు మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రుల కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు.. అంబటి రాంబాబు (సత్తెనపల్లి), అంజద్ బాషా షేక్ బేపారి (కడప), ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాలనాయుడు (మాడుగుల), బుగ్గన రాజేంద్రనాథ్ (డోన్), చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (రామచంద్రాపురం), దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) (తుని), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), గుడివాడ అమరనాథ్ (అనకాపల్లి), గుమ్మనూరి జయరామ్ (ఆలూరు), జోగి రమేష్ (పెడన), కాకాని గోవర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి), కారుమూరి వెంకట నాగేశ్వరరావు (తణుకు), కొట్టు సత్యన్నారాయణ (తాడేపల్లిగూడెం), కె. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు), కేవీ ఉష శ్రీచరణ్ (కళ్యాణదుర్గం), మేరుగు నాగార్జున (వేమూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పినిపే విశ్వరూప్ (అమలాపురం), పీడిక రాజన్నదొర (సాలూరు), ఆర్కే రోజా (నగరి), సీదిరి అప్పలరాజు (పలాస), తానేటి వనిత (కొవ్వూరు), విడదల రజని (చిలకలూరిపేట) అనే నేను.. మంత్రులుగా పేర్ల అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన అంబటి రాంబాబు, అంజాద్ బాషా షేక్ బేపారి, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, గుమ్మనూరి జయరామ్, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, కె.నారాయణస్వామి, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, పీడిక రాజన్నదొర, సీదిరి అప్పలరాజు -
ఏపీ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..
-
ఏపీ కొత్త ఉప ముఖ్యమంత్రులు వీరే
-
AP: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. అంబటి రాంబాబు : జలవనరుల శాఖ ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం) ఆదిమూలపు సురేష్ : మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్మెంట్ బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం) బుగ్గన రాజేంద్రనాథ్ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ దాడిశెట్టి రాజా (రామలింగేశ్వర రావు) : రోడ్లు, భవనాల శాఖ ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ గుడివాడ అమర్నాథ్ : పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్ శాఖ, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ జోగి రమేష్ : గృహనిర్మాణ శాఖ కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం) నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ (డిప్యూటీ సీఎం) ఉషాశ్రీ చరణ్ : స్త్రీ శిశు సంక్షేమ శాఖ మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ పినిపే విశ్వరూప్ : రవాణా శాఖ రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం) ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ విడదల రజిని : ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖలు వీళ్లలో అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్ , సీదిరి అప్పలరాజు, తానేటి వనితలు రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. -
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల ప్రమాణం (ఫొటో గ్యాలరీ)
-
అన్నకోసం ప్రాణాలైనా అర్పిస్తా..
-
AP: ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులు ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని నూతన మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. కేబినెట్లో మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. సీఎం జగన్ అప్పజెప్పిన పనిని బాధ్యతగా చేస్తానని తెలిపారు. చదవండి: ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే.. అదృష్టంగా భావిస్తున్నాం: రాజేంద్రనాథ్ సీఎం వైఎస్ జగన్ కేబినెట్లో పనిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని మంతి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మూడేళ్లు సమర్ధవంతంగా పాలన కొనసాగిందన్నారు. అన్ని వర్గాలకు సముచితస్థానం కల్పిస్తూనే కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం కావాలనే బురద జల్లేందుకు యత్నిస్తోందన్నారు. మంచి పేరు తెచ్చుకుంటా: అంబటి రాంబాబు మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. సీఎం వైఎస్.జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుంటానని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. వైఎస్. జగన్ టీమ్ లీడర్.. తామంతా మెంబర్స్. మంచి చేసినా చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు ఏనాడు మంత్రులకు విలువ ఇవ్వలేదన్నారు. టీడీపీ చేయలేని అద్భుత కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారు. చిత్తశుద్ధిగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటానని అంబటి రాంబాబు అన్నారు. ఎప్పటికీ మర్చిపోను: ఆర్కే రోజా సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోనని ఆర్కే రోజా అన్నారు. జగనన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశమిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేబినెట్లో మహిళ మంత్రిగా ఉండటం తన అదృష్టం అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పని చేస్తానన్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పని చేస్తానన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. సీఎం జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: మంత్రుల ప్రమాణ స్వీకారం.. తొలుత ప్రమాణం చేసింది ఆయనే..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార ఘట్టంలో భాగంగా మొదట సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు అంబటి రాంబాబు ఏపీ కేబినెట్‌గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో చివరగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్లో పాత మంత్రులను 11 మందిని కొనసాగించగా.. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. ప్రమాణస్వీకారం చేసినవారిలో మొదటి నుంచి చివరకు.. ►అంబటి రాంబాబు, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, పి. రాజన్నదొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజిని (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం) -
కాకాని గోవర్థన్ రెడ్డి అనే నేను..
-
జోగి రమేష్ అనే నేను..
-
గుమ్మనూరు జయరాం అనే నేను..
-
గుడివాడ అమర్ నాథ్ అనే నేను..
-
ధర్మాన ప్రసాద్ రావు అనే నేను..
-
దాడిశెట్టి రాజా అనే నేను..
-
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అనే నేను..
-
బూడి ముత్యాలనాయుడు అనే నేను..
-
బుగ్గన రాజేంద్రనాథ్ అనే నేను..
-
బొత్స సత్యనారాయణ అనే నేను..
-
ఆదిమూలపు సురేష్ అనే నేను..
-
అంజాద్ బాషా అనే నేను..
-
అంబటి రాంబాబు అనే నేను..
-
అడగకుండానే సీఎం జగన్ వరం ఇచ్చారు: జోగిరమేష్
-
కొత్త మంత్రివర్గంపై వెల్లంపల్లి స్పందన
-
నాకు ఏ శాఖ ఇచ్చినా ఒకే..
-
ఆ కుటుంబానికి తరతరాలు రుణపడి ఉంటా: మేరుగు నాగార్జున
-
ప్రమాణ స్వీకారానికి సిద్దమౌతున్న మంత్రులు
-
చరిత్రలో ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యం సీదిరి అప్పలరాజు సొంతం
సాక్షి, శ్రీకాకుళం: మంత్రి సీదిరి అప్పలరాజు చరిత్ర సృష్టించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను మంత్రిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.సమర్థమైన పనితీరు, చక్కటి వాగ్ధాటి ఆయనకు కలిసొచ్చాయి. పలాస నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యత సంతరించకుంది. అంతా అనూహ్యమే సీదిరి రాజకీయ ప్రవేశమే అనుహ్యం. వైద్యవృత్తిలో ఉంటూ 2017లో వైఎస్సార్సీపీ ఆహ్వానం మేరకు రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీలో చేరడమే తరువాయి క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. కిడ్నీ రోగుల బాధలు తెలుసుకునేందుకు కవిటి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి, ఆ తర్వాత పలాస నియోజకవర్గకర్తగా నియమితులై రాజకీయాల్లో దూసుకుపోయారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో పాతుకుపోయి ఉన్న నేతల పునాదులు కదిల్చారు. టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషపై 16,247 ఓట్ల అధిక్యంతో తొలి పర్యాయంలోనే రికార్డు విక్టరీ సాధించారు. నేపథ్యం.. పేరు: డాక్టర్ సీదిరి అప్పలరాజు నియోజకవర్గం: పలాస స్వస్థలం: దేవునల్తాడ తల్లిదండ్రులు: దాలమ్మ, నీలయ్య (లేటు) పుట్టినతేదీ: ఫిబ్రవరి 22, 1980 విద్యార్హతలు: ఎండీ జనరల్, ఎంఈడీ సతీమణి: శ్రీదేవి సంతానం: కుమారులు ఆర్నవ్ వర్మ, ఆరవ్ వర్మ జిల్లా: శ్రీకాకుళం రాజకీయ నేపథ్యం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి చిన్నవయసులో 26 ఏళ్లకే విశాఖపట్నం లోని కేజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2007 డిసెంబర్ 14న పలాస–కాశీబుగ్గ పట్టణంలో సేఫ్ హాస్పిటల్ స్థాపించి వైద్యుడిగా కొనసాగుతూ దాదాపు 12 సంవత్సరాల పాటు వైద్యునిగా సేవలు అందించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు 2017 ఏప్రిల్ 19న వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పలాస నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన గౌతు కుటుంబంపై విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. జూలై 22, 2020న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. చదవండి: (Dharmana Prasada Rao: ఎట్టకేలకు నెరవేరిన ధర్మాన కోరిక) -
Dharmana Prasada Rao: ఎట్టకేలకు నెరవేరిన ధర్మాన కోరిక
సాక్షి, శ్రీకాకుళం: ఐదుసార్లు ఎమ్మెల్యే, గత ప్రభుత్వాల మంత్రివర్గంలో కీలక పదవులు. ఉత్తరాంధ్ర అగ్రశ్రేణి రాజకీయనాయకుల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. సుదీర్ఘ అనుభవానికి సరైన సమయంలో గుర్తింపునిస్తూ వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి ధర్మానకు కొత్త కాకపోయినప్పటికీ వైఎస్సార్ తనయుడి కేబినెట్లో పనిచేయాలన్న కోరిక నెరవేరింది. ప్రత్యేకమైన నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఓ ప్రత్యేకమైన నాయకుడు లోతైన విషయ పరిజ్ఞానం, విషయాన్ని సుస్పష్టంగా చెప్పగల నేర్పు, ఇరిగేషన్ అంశాలపై విశేషమైన అవగాహన, రాజకీయాల్లో ఎత్తుకుపై ఎత్తు వేయగల చతురత ఆయన సొంతం. ప్రజా సమస్యలను క్షుణ్ణంగా వివరించడమే కాకుండా వారి ఆవేదనను కళ్లకు కట్టినట్టు ప్రసంగించే నేర్పరి కావడంతో ఆయనకు స్థానికంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ధర్మానకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినవారు ఇప్పుడు ఆనందంతో గంతులు వేస్తున్నారు. నేపథ్యమిదీ.. పేరు: ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గం: శ్రీకాకుళం అర్బన్ స్వస్థలం: మబగం తల్లిదండ్రులు: సావిత్రమ్మ (లేట్), రామలింగంనాయుడు (లేట్) పుట్టినతేదీ: మే 21, 1958 విద్యార్హతలు: ఇంటర్మీడియట్ సతీమణి: గజలక్ష్మి సంతానం: కుమారుడు రామమనోహరనాయుడు జిల్లా: శ్రీకాకుళం రాజకీయ నేపథ్యం: 1983లో మబగం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ప్రజాజీవితంలోకి అడుగు పెట్టారు. 1987లో పోలాకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991–94 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1994లో ఓడిపోయిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోను, అనంతర మంత్రివర్గాల్లోను 2013 వరకు పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. చదవండి: (ఆ అంశాలే ఆదిమూలపు సురేష్‌కు మరో అవకాశం కల్పించాయి..) -
Live Blog: ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం
-
సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోను: రోజా
-
మంత్రి వర్గంలో చోటు.. కెరీర్‌పై ఆర్కే రోజా కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగనన్నతోనే ఉంటానని, ఆయన కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మహిళా పక్షపాత సీఎం క్యాబినెట్లో మహిళ మంత్రిగా చోటు దక్కడం నా అదృష్టం. సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే నా విధి. నన్ను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు జగనన్న మంత్రిగా చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను. మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్లలో ఇక చెయ్యను' అని నగరి ఎమ్మెల్యే రోజా ప్రకటించారు. చదవండి: (RK Roja: రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఆమెకు సరిలేరు) -
AP New Cabinet: డబుల్ ధమాకా
సమర్థతకు, నమ్మకానికి, విశ్వసనీయతకు వైఎస్ జగన్ సర్కారు పెద్దపీట వేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన వారిద్దరికీ తగిన ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ (కొప్పెలవెలమ)కు చెందిన బూడి ముత్యాలనాయుడికి, కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్కు మంత్రులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు. అందరూ ఊహించినట్లుగానే పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న వెంటే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిద్దరికీ కొత్త కేబినెట్లో చోటు దక్కింది. వార్డు మెంబర్ నుంచి విప్‌గా ఎదుగుతూ.. ఇప్పుడు మంత్రిగా బూడి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎదుగుతూ తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు గుడివాడ అమర్నాథ్. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. సంబరాల వాతావరణంలో పార్టీ శ్రేణులు సందడి చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ మరింత బలోపేతం కానుంది. సాక్షి, విశాఖపట్నం: సంబరాలు మిన్నంటాయి. అభిమాను ల సందడి ఆకాశమే హద్దుగా సాగింది. మిఠాయిలు, బాణసంచా వెలుగులు, అభినందన పూమాలలు.. పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. అనకాపల్లి జిల్లా నుంచి ఇద్దరికి కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కడం వైఎస్సార్సీపీ శ్రేణులకు డబుల్ ధమాకాలా నిలిచింది. ఉదయమంతా శ్రీరామనవమి వేడుకల్లో గడిపిన వారంతా మధ్యాహ్నం నుంచీ గంతులు, కేరింతలతో సందడి చేశారు. నమ్మకానికి మారుపేరు... సర్పంచ్‌గా పనిచేసిన తన తండ్రి బాటలోనే బూడి ముత్యాలనాయుడు వార్డు మెంబరు నుంచి ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు చేపట్టి 2014లో మాడుగుల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, శాసనసభా పక్ష ఉపనేతగా వ్యవహరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2014లో వైఎస్సార్సీపీ రెండు ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకోగా.. ఒక ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో బూడిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జగనన్న వెంటే నిలిచారు. ఆయనతో ఊపిరి ఉన్నంతవరకు ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. ఆ నమ్మకం 2019 ఎన్నికలో ఎమ్మెల్యేగా భారీ విజయా న్ని తీసుకొచ్చింది. అనంతరం ప్రభుత్వ విప్‌గా మూడేళ్లు వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త కేబినేట్లో మంత్రిగా అవకాశం కల్పించారు. తండ్రికి తగ్గ తనయుడిగా... : పేరుకు తగ్గట్టుగానే తన తండ్రి గుడివాడ గుర్నాథరావులాగే గుడివాడ అమర్నాథ్ పోరాటయోధుడిగా నిలిచారు. తండ్రికి తగ్గ తనయునిగా జిల్లాలో చురుకైన యువ రాజకీయ నేతగా ఎదిగారు. అమర్నాథ్ది రాజకీయ కుటుంబం. తాత గుడివాడ అప్పన్న ఎమెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు గుడివాడ గుర్నాథరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఆయన తనయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవి వరించింది. తాత నుంచి వారసత్వ రాజకీయం ఉన్నా.. గుడివాడ అమర్నాథ్ తనంతట తానే రాజకీయంగా ఎదిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వైఎస్సార్సీపీ వెంటే నిలిచారు. జగన్మోహన్రెడ్డికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు. 2014లో వైఎస్సార్సీపీ ఓటమిపాలై అత్యంత కష్టకాలంలో ఉన్న సమయంలో రాజకీయ దిగ్గజాలు పార్టీకి దూరమయ్యారు. ఆ సమయంలోనే యువకుడైన అమర్నాథ్ జిల్లా పార్టీ పగ్గాలను అందుకొని వైఎస్సార్సీపీని ముందుకు నడిపించారు. సీనియర్లను, యువకులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతం అవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. 2007లో విశాఖ కార్పొరేటర్‌గా 22 సంవత్సరాల వయస్సులోనే ఎన్నికయ్యారు. 2008లో జిల్లా ప్రణాళిక సంఘం సభ్యునిగా వ్యవహరించారు. 2018 నుంచి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల్ని చేపట్టారు. జిల్లాలోని కీలకమైన రైల్వేజోన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగానూ, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగానూ పనిచేసిన అమర్నాథ్ అనకాపల్లి అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేశారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మూడు జిల్లాల్లో సంబరాలు... ఉమ్మడి విశాఖ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్లిద్దరినీ మంత్రులుగా ప్రకటించడంతో మూడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎంకు ధన్యవాదాలు నన్ను నమ్మి మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఎలాంటి బాధ్యత అప్పగించినా..దానిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి..మరోవైపు వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కృషిచేస్తాను. ప్రభుత్వం అందించే ప్రతి ఫలాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తాను. సీఎం జగనన్న అడుగుజాడల్లో...నా తండ్రి దారిలో ప్రజల కోసం పనిచేస్తాను. – గుడివాడ అమర్నాథ్ సైనికుల్లా పనిచేస్తాం... కొత్త కేబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాను. మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేస్తాం. ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాను. వార్డు మెంబర్‌గా రాజకీయ అరంగేట్రం చేశాను. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చారు. ఇప్పుడు మంత్రిని చేశారు. నా తుది శ్వాస ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటా... ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తా. – బూడి ముత్యాలనాయుడు -
ఏపీ మంత్రి వర్గంలోకి నూతనంగా ఎంపికైనవారు(ఫోటోలు)
-
అమాత్య యోగం.. అద్వితీయం.. కీలక నేతలకు కేబినెట్లో స్థానం
సాక్షి, ఏలూరు: సీనియార్టీకి సముచిత స్థానం, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా జిల్లాలో కీలక నేతలకు మంత్రి పదవులు దక్కాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలకు తొలిసారి కేబినెట్లో చోటు దక్కగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తానేటి వనితకు మరలా అమాత్య యోగం దక్కింది. నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముదునూరు ప్రసాదరాజుకు చీఫ్ విప్‌గా అవకాశం రాగా మొత్తంగా కేబినెట్లో జిల్లాకు కీలక ప్రాధాన్యం దక్కింది. అంకితభావానికి పెద్దపీట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు యధావిధిగా మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాదిరిగానే ఇప్పుడూ ప్రాధాన్యమిచ్చారు. ఈసారి అదనంగా ప్రభుత్వ విప్ పదవిని కూడా అప్పగించారు. పార్టీపై విధేయత, పాల నపై అంకితభావం చూపిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ యాదవ), తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనా రాయణ (కాపు), కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత (ఎస్సీ), న రసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు (క్షత్రి య)కు పదవియోగం దక్కింది. సామాజిక కూర్పు లు, పార్టీల విధేయత ఇలా పలు అంశాలను ప్రామా ణికంగా తీసుకుని మంత్రి పదవులకు ఎంపిక చేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి. తొలిసారిగా కేబినెట్లోకి.. తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు తొలిసారి కేబినెట్లో చోటుదక్కించుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా ప్రాంతాల్లో బాణసంచా కాల్పులు, మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగాయి. తణుకులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి చరిత్రలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజకు మా త్రమే కేబినెట్లో అవకాశం దక్కగా.. ఈసారి ఇందుకు భిన్నంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు వనిత, కొట్టు, కారుమూరి, ముదునూరి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, పార్టీకి విధేయులుగా ఉంటూ పాలనలో తమ మార్కును చూపిస్తున్నారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు, ఒకరికి చీఫ్ విప్ పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా నూతన పశ్చిమగోదావరిలో ఇద్దరికి అవకాశం రాగా ఏలూరు జిల్లాలో ఎవరికీ చాన్స్ దక్కలేదు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యానికి జై‘కొట్టు’ తాడేపల్లిగూడెం: సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ని రంతరం ప్రజలను వె న్నంటి ఉండే గుణంతో బలమైన నాయకుడిగా ఎదిగారు ప్రభుత్వ హా మీల అమలు కమిటీ చై ర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. 1994 నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పలు సమస్యలపై పోరాడారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సందర్భంలో పట్టణంలో అ భివృద్ధి ఎలా ఉంటుందో ల్యాండ్ మార్కులతో చేసి చూపించారు. 2004లో దివంగత వైఎస్సార్ సారథ్యంలో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఐదేళ్ల పదవీ కాలంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. పీసీసీ సభ్యునిగా, మెంబర్ ఆఫ్ ఎస్యూరెన్స్ కమిటీ ఏపీ లెజిస్లేటివ్, మెంబర్ ఆఫ్ హౌస్ కమిటీ ఇరిగ్యు లారిటీస్ ఆఫ్ మిల్క్‌డైరీస్ సభ్యునిగా పనిచేశారు. గత సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన 2019లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజ యం సాధించారు. ప్రభుత్వ హామీల అమలు కమి టీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1955 అక్టోబర్ 19న కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి దంపతులకు ఆ యన జన్మించారు. భార్య సౌదామిని, ఇద్దరు కుమారులు బాలరాజేష్, విశాల్, కుమార్తె కంచన్ ఉన్నా రు. పుస్తకాలు చదవడం, బ్యాడ్మింటన్ ఆడటం ఆయన అలవాట్లు. నిత్యం యోగా చేస్తుంటారు. అందరివాడు.. కారుమూరి తణుకు అర్బన్ : తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. వి ద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లపాటు సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్ సారథ్యంలో 2009లో తణుకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత కాలంలో వైఎస్సార్ పార్టీలో చేరి 2014లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరలా 2019 ఎన్నికల్లో తణుకు నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ న్యూ అలుమ్నీ అసోసియేషన్ వెస్ట్ బ్రుక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లా యీస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. మీ ఇంట్లో మంత్రిగా ఉంటా.. ‘నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే మంత్రి పదవి ఇచ్చి నన్ను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది సీఎం జగన్. బీసీ నేతగా నన్ను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎప్పటిలాగే నియోజకవర్గంలో ప్రజానీకానికి అందుబాటులోనే ఉంటూ మీ ఇంట్లో మంత్రిగానే ఉంటాను’ అని ఆయన స్పష్టం చేశారు. విధేయతలో రా‘రాజు’ నరసాపురం: పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసి విధేయతలో రారాజుగా నిలిచారు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. దివంగత సీఎం వైఎస్సార్ స్ఫూర్తితో 2002లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అంచెలంచెలుగా ముందుకు సాగారు. యలమంచిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప తేడాతో పరాజయం పొందారు. ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం ఎమ్మెల్యే అప్పటినుంచి 2009 వరకూ నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా గెలుపొందారు. వైఎస్సార్ అకాల మరణం అనంతరం జరిగిన పరిణామాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచి 2012లో ఎమ్మె ల్యే పదవిని త్యాగం చేశారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అతిస్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. మరలా 2014లో ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా వ్యవహరించి నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజర్టీతో గెలుపొందారు. 1974 మే 29న సత్యనారాయణరాజు, వెంకట సరోజినీదేవి దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు భార్య శారదావాణి, కుమారుడు శ్రీకృష్ణంరాజు, కుమార్తె సింధూజ ఉన్నారు. -
AP New Cabinet: అంజద్‌బాషాను రెండోసారి వరించిన మంత్రిపదవి
కడప కార్పొరేషన్: కడప గడపకు మరోమారు మంత్రి హోదా దక్కింది. సమర్థత, విశ్వాసం, సామాజిక సమతుల్యత నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషాకు రెండోసారి అరుదైన అవకాశం లభించింది. ఈయనను మంత్రివర్గంలోకి తీసుకొని ముస్లీం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రపీఠం వేశారు. శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, రాష్ట్ర రాజధానికి ఎమ్మెల్యే అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లాయి. వ్యాపారవేత్తగా కడప వాసులకు సుపరిచితుడైన అంజద్‌బాషా 2005లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, వైఎస్ కుటుంబాన్ని అనుసరిస్తూ వైఎస్సార్సీపీ పార్టీలో క్రియాశీలక భూమిక పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కడప నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికై వైఎస్సార్సీపీ ఉన్నతికి కృషి చేశారు. అనంతరం 2014లో శాసనసభకు పోటీచేసే అవకాశం దక్కింది. కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో ఆపార్టీ అధికారం చేజేక్కించుకోలేకపోయింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, ప్రత్యక్ష పోరాటాల్లో తనవంతు పాత్రను పోషించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. తర్వాత వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా ఎంపికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల మేనిఫేస్టో కమిటీ మెంబర్‌గా అంజద్‌బాషా నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన ఆయన మరోమారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆనక ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆయనకు రెండవసారి మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విధేయుత..విశ్వాసం..సమర్థత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల విశ్వాసం, ముస్లీం మైనార్టీ వర్గీయుడైనా అత్యంత సమర్థత కల్గిన నాయకుడుగా ఎస్బి అంజద్‌బాషా గుర్తింపు దక్కించుకున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకపోగా, వైఎస్సార్ జిల్లాలో ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే దిశగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టిన అటువైపు మొగ్గు చూపకుండా విశ్వాసంగా ఉండడం, పార్టీ కోసం శక్తికి మించి శ్రమించడం ఇవన్నీ కలిసివచ్చాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పాతవారిని తొలగించి కొత్తవారిని మంత్రులుగా తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణల నేపథ్యంలో అంజద్‌బాషాను మళ్లీ మంత్రిపదవి వరించిందని పరిశీలకులు భావిస్తున్నారు. చేపట్టిన పదవులు అంజద్‌బాషా మదీనా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్‌గా,బుఖారియా విద్యాసంస్థ ఉపాధ్యక్షుడిగా, అల్ హజ్ ఎస్బి అబ్దుల్ ఖాదర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి, హరూన్ ఛారిటబుల్ ట్రస్టు, నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూల్ అల్యూమిని అసోషియేట్లకు అధ్యక్షుడిగా ఉన్నారు. హౌస్ మసీదు కమిటీ కోశాధికారిగా, ఏపీ ముస్లిం కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా, ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా, కడప మున్సిపల్ కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2005లో కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్సీపీ కడప సమన్వయకర్త. 2014లో వైఎస్ఆర్సీపీ తరుపున పోటీ చేసి 45వేలపైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2016లో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు. 2018లో జనరల్ సెక్రెటరీ,2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్. సార్వత్రిక ఎన్నికల్లో 54వేల మెజార్టీతో విజయం సాధించారు. కుటుంబ నేపథ్యం కడప జిల్లా సిద్దవటంకు చెందిన జనాబ్ ఎస్బి హరూన్ సాహెబ్ 1935 నుంచి 1953 వరకు సుమారు 18 సంవత్సరాలు సిద్దవటం సర్పంచ్‌గా పనిచేశారు. సిద్దవటంలో హరూన్ సాహెబ్ అందించిన సేవలకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. హరూన్ సాహెబ్ కుమారుడైన అబ్దుల్ ఖాదర్ పెద్ద కుమారుడే ఎస్బి అంజద్‌బాషా. 1963లో వారి కుటుంబం వ్యాపార పరమైన సౌకర్యాల కోసం కడప నగరంలో స్థిరపడ్డారు. కడప, కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వీరికి వ్యాపారాలు ఉన్నాయి. నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూలులో ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు. సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాగుణంతో అంజద్‌బాషా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సేవా తత్పరతను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2005లో కాంగ్రెస్ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు. కడపకు మరో అవకాశం.. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాకు మంత్రిహోదా దక్కడంతో కడప నియోజకవర్గానికి మరోసారి అవకాశం దక్కింది. ఇదివరకు కడప నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రి హోదా దక్కించుకున్న వారి జాబితాలో అంజద్‌బాషా రెండోసారి చేరారు. ఎస్ రామమునిరెడ్డి(1983), సి రామచంద్రయ్య(1985), డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాషా(1999), ఎస్ఎండీ అహమ్మదుల్లా (2009), ఇదివరకు మంత్రి పదవులు అలంకరించారు. తాజాగా 2019లో అంజద్‌బాషాకు ఆ హోదా దక్కింది. ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది. కడప నుంచి మంత్రి హోదా దక్కించుకున్న వారిలో ఈయన ఐదో ఎమ్మెల్యే కాగా, గడిచిన 3 పర్యాయాలు పరిశీలిస్తే పదేళ్లకు ఓమారు కడప నియోజకవర్గానికి మంత్రి హోదా దక్కుతూ రావడం మరో విశేషం. -
మంత్రివర్గంలో స్థానం పొందిన దాడిశెట్టి రాజా ప్రొఫైల్..
పేరు: దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) జిల్లా: కాకినాడ నియోజకవర్గం: తుని స్వస్థలం: ఎస్.అన్నవరం తల్లిదండ్రులు: సత్యనారాయణమ్మ, శంకర్రావు పుట్టిన తేదీ: జూలై 19, 1975, విద్యార్హతలు: బీఏ సతీమణి: లక్ష్మీచైతన్య సంతానం: కుమారుడు శంకర్మల్లిక్, కుమార్తె ఆశ్రిత రాజకీయ నేపథ్యం: 2008లో ప్రజారాజ్యం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2010లో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ తుని నియోజకవర్గం కో ఆర్డీనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవకాశం దక్కించుకున్నారు. చదవండి: (సామాజిక మహా విప్లవం) -
ఏపీ నూతన కేబినెట్‌కు గవర్నర్ ఆమోదం
సాక్షి, విజయవాడ: నూతన మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారం (ఏప్రిల్ 11) ఉదయం 11 గంటల 31 నిమిషాలకు వెలగపూడి సచివాలయం ఆవరణలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రి వర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గతంలో మంత్రులుగా పనిచేసిన 11 మంది తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు నూతన మంత్రులకు గవర్నర్ శాఖలు కేటాయించనున్నారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) -
AP New Cabinet: చరిత్రను తిరగరాసిన నేత కాకాణి
రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో అదృష్టం కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వరించింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన రథసారథిగా జిల్లాలో పార్టీని ఏకతాటిపై నడిపించారు. మధ్యలో కొంత కాలం మినహా జిల్లా అధ్యక్షుడిగా, నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా రెండు దఫాలు వైఎస్సార్సీపీని విజయతీరానికి చేర్చారు. తల్లిదండ్రుల వారసత్వంగా రాజకీయ అరంగేట్రం చేసిన కాకాణి ఆది నుంచి ఓటమి ఎరుగని నేతగా ఎదిగారు. తన రాజకీయ చతురతతో ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో దిట్టగా నిలిచారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి చోటు దక్కింది. జిల్లాలో ఆశావహులున్నప్పటికీ అధిష్టానం ఎమ్మెల్యే కాకాణి వైపు మొగ్గు చూపింది. ఆది నుంచి పార్టీకి విదేయుడిగా, జిల్లాపై సమగ్ర అవగాహన, రాజకీయ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనే ధీశాలిగా ఆయనకు కలిసొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్పీపీ అధికారంలో రాగానే జిల్లా నుంచి దివగంత మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ మంత్రులుగా ప్రాతినిథ్యం వహించారు. మొదటి విడతలో నెల్లూరు జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పోర్టు ఫోలియోలు అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ జిల్లా తర్వాత ఆ స్థాయిలో మద్దతుగా నిలిచిన జిల్లా అంటే ప్రాణంగా భావిస్తున్నారు. రెండో విడతలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని ముందే ప్రకటించారు. ఆ మేరకు జిల్లా నుంచి ఈ విడతలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణికి అవకాశం దక్కింది. జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా అపార అనుభవం ఉన్న గోవర్ధన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. విధేయత, చతురత ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి పార్టీ పట్ల విధేయుత, రాజకీయ చతురతే మంత్రివర్గంలో స్థానం దక్కిందని చెబుతున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత నుంచి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి ఉండి నడిచారు. 2011లో వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జిల్లా బాధ్యతలు స్వీకరించారు. మళ్లీ రెండో దఫా 2015 నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీ నుంచి ఎటువంటి పిలుపు వచ్చినా వెంటనే స్పందిస్తూ అందుకు తగ్గట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రతిపక్షంలో అధికార టీడీపీపై దూకుడు తనం ప్రదర్శించేవారు. ఎప్పు డూ తనదైన శైలిలో వ్యంగోక్తులు విసురుతూ రాజకీయ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం జిల్లాలో 2006లో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా సైదాపురం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికతో కాకాణి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తన తండ్రి, దివంగత మాజీ సమితి ప్రెసిడెంట్ కాకాణి రమణారెడ్డి రాజకీయ వారసుడుగా తెరపైకి వచ్చిన గోవర్ధన్‌రెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో జెడ్పీ చైర్మన్ గా ఐదేళ్లు జిల్లాలో తన ప్రత్యేకత చాటుకున్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే జెడ్పీ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రత్యేక మెటీరియ ల్స్ తయారు చేసి విద్యను ప్రోత్సహించారు. తర్వాత వైఎస్సార్ కుటుంబం, వైఎస్సార్సీపీ వెంట నడిచి 2014, 2019లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీని రెండు సార్లు విజయతీరానికి చేర్చారు. 2014లో అప్పటి ఉమ్మడి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు, 2019లో 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. చరిత్ర తిరగరాసిన నేత ఈ జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండదనే నానుడి ఉంది. ఈ నానుడి చరిత్రను కాకాణి గోవర్ధన్‌రెడ్డి తిరగరాశారనే చెప్పాలి. జెడ్పీ చైర్మన్‌గా పని చేసిన ఆయన 2014, 2019లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. చదవండి: (Ushashri Charan: కంచుకోటను బద్దలు కొట్టి.. మంత్రి వర్గంలో..) -
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..
సాక్షి, అమరావతి: కొత్త, పాత కలయికతో 25 మందితో కొత్త మంత్రి వర్గం కూర్పును ఫైనల్ చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో చోటు దక్కింది. నూతన కేబినెట్లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. సీనియారిటీ పరంగా 11 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 14 మందికి అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే.. బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు. పాత, కొత్త మంత్రుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. గత కేబినెట్లో మంత్రులుగా ఉండి నూతన జాబితాలో చోటు దక్కించుకున్నవారు.. అంజాద్ భాషా (మైనార్టీ, కడప నియోజకవర్గం) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి, (పుంగనూరు నియోజకవర్గం) బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి, ఓసీ) కర్నూలు నియోజకవర్గం పినిపె విశ్వరూప్ (మాల, ఎస్సీ) గుమ్మనూరు జయరాం (బోయ, బీసీ) ఆలూరు నియోజకవర్గం నారాయణస్వామి (మాల, ఎస్సీ) గంగాధర నెల్లూరు నియోజకవర్గం బొత్స సత్యనారాయణ (తూర్పుకాపు, బీసీ) తానేటి వనిత (మాదిగ, ఎస్సీ) సీదిరి అప్పలరాజు (మత్స్యకార, బీసీ) వేణుగోపాలకృష్ణ (శెట్టిబలిజ, బీసీ) ఆదిమూలపు సురేష్ (ఎస్సీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గం) మంత్రి వర్గంలోకి నూతనంగా ఎంపికైనవారు.. గుడివాడ అమర్నాథ్ (కాపు, ఓసీ) దాడిశెట్టి రాజా (కాపు, ఓసీ) రాజన్నదొర (జాతాపు, ఎస్టీ) ధర్మాన ప్రసాదరావు పొలినాటి (వెలమ, బీసీ) జోగి రమేష్ (గౌడ, బీసీ) అంబటి రాంబాబు (కాపు, ఓసీ) సత్తెనపల్లి నియోజకవర్గం కొట్టు సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు (యాదవ, బీసీ) మేరుగ నాగార్జున (మాల, ఎస్సీ) బూడి ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ, బీసీ) విడదల రజని (ముదిరాజ్, బీసీ) చిలకలూరిపేట నియోజకవర్గం కాకాణి గోవర్ధన్‌రెడ్డి (రెడ్డి, ఓసీ) సర్వేపల్లి నియోజకవర్గం ఆర్కే రోజా (రెడ్డి, ఓసీ) నగిరి నియోజకవర్గం ఉషశ్రీ చరణ్ (కురబ, బీసీ) కళ్యాణదుర్గం నియోజకవర్గం -
AP Cabinet Reshuffle: కొడాలి నానికి కీలక పదవి
సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. కేబినెట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు. చదవండి: (ఏపీ నూతన కేబినెట్.. కొత్త మంత్రులు వీరే..) -
ఏపీ నూతన కేబినెట్.. కొత్త మంత్రులు వీరే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం త్వరలో ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా కొడాలి నానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. కేబినెట్ పైనల్ లిస్టు.. గుడివాడ అమర్నాథ్ దాడిశెట్టి రాజా బొత్స సత్యనారాయణ రాజన్నదొర ధర్మాన ప్రసాదరావు సీదిరి అప్పలరాజు జోగి రమేష్ అంబటి రాంబాబు కొట్టు సత్యనారాయణ తానేటి వనిత కారుమూరి నాగేశ్వరరావు మేరుగ నాగార్జున బూడి ముత్యాలనాయుడు విడదల రజిని కాకాణి గోవర్ధన్‌రెడ్డి అంజాద్ భాష పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పినిపె విశ్వరూప్ గుమ్మనూరు జయరాం ఆర్కే రోజా ఉషశ్రీ చరణ్ ఆదిమూలపు సురేష్ చెల్లుబోయిన వేణుగోపాల్ నారాయణస్వామి ►చీఫ్ విప్‌గా ప్రసాదరాజు ►డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ►ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు -
ఏపీ: మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించారు. ఈ ఖాళీలకు సంబంధించి కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 11న ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో 24 మంది మంత్రులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది: సజ్జల) -
పార్టీ బాధ్యతల కోసం అందరూ సిద్ధం
సాక్షి, అమరావతి: పార్టీ బాధ్యతలు చేపట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసిన 24 మంది మంత్రుల్లో ఏ ఒక్కరిలోనూ అసంతృప్తి లేనే లేదని, అదంతా ఎల్లో మీడియా సృష్టే అని స్పష్టం చేశారు. వాస్తవానికి పార్టీని మరింత బలోపేతం చేసి, రానున్న ఎన్నికల్లోనూ ఇదే రీతిలో ఘన విజయం సాధించడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన రోజునే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. మంత్రులుగా కొత్త వారికి అవకాశం కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే మొన్న మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ ముగిశాక మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారని చెప్పారు. తమకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తామని వారంతా ముక్త కంఠంతో తెలిపారన్నారు. ప్రస్తుత మంత్రుల్లో ఏడు నుంచి పది మంది లేదా ఐదుగురిని.. అనుభవం, సామాజిక సమీకరణాలు, జిల్లాల అవసరాల దృష్ట్యా కొనసాగించే అవకాశం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల్లో అసంతృప్తే లేనప్పుడు.. ఎవరిని బుజ్జగిస్తామని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ టీమ్‌లో సభ్యులేనని.. అందులో ఎవరికైనా మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చునని చెప్పారు. మంత్రివర్గం కూర్పుపై ఆదివారం మధ్యాహ్నం వరకు సీఎం జగన్ కసరత్తు చేస్తారని, ఆ తర్వాత కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపుతారన్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కిన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని తెలిపారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. ఆ తర్వాత కొత్త మంత్రులు, అతిథులకు తేనీటి విందు ఉంటుందని తెలిపారు. -
AP: గవర్నర్ కార్యాలయానికి మంత్రుల రాజీనామాలు
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రులు చేసిన రాజీనామాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి. కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. కాసేపట్లో గెజిట్ విడుదల కానుంది. చదవండి: (రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు) -
ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్, సీఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గతంలోనే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ని కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. చదవండి: (పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు) -
సీఎం జగన్ నిర్ణయమే పార్టీలోని ఎమ్మెల్యేలందరికీ శిరోధార్యం: శ్రీధర్ రెడ్డి
-
రాజీనామాల అసంతృప్తి.. మీడియా సృష్టి: చెల్లుబోయిన
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్ అంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేసిందని, అసంతృప్తి అనేది కేవలం మీడియా సృష్టేనని స్పష్టత ఇచ్చారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఏపీ కేబినెట్లో ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ తరపున ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పని చేస్తానని ఆయన అంటున్నారు. ‘‘ఏపీ కేబినెట్లో మంత్రులకి స్వేచ్చ లేదనే ప్రచారం అబద్దం. మాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు కాబట్టే సమర్థవంతంగా పనిచేయగలిగాం. కేబినెట్లో అన్ని వర్గాలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి చరిత్రకెక్కారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి రాజ్యసభ అవకాశం ఇచ్చి...అదే సామాజిక వర్గానికి చెందిన నాకు మంత్రి బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడు కూడా నాకు ఎటువంటి పగ్గాలు అప్పగించినా.. మరింత బాధ్యతగా పనిచేయడానికి సిద్దం’’ అని వేణుగోపాలకృష్ణ అన్నారు. ఏపీ మంత్రి వర్గంలో పని చేయడం తన అదృష్టం.. కేబినెట్ కూర్పు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిందని తెలిపారు. అయితే తొలి కేబినెట్ కూర్పు తరహాలోనే.. ఈసారి కూడా అన్ని వర్గాలకి సమ ప్రాధాన్యత ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. -
AP: సామాజిక అధికారం
సాక్షి, అమరావతి : సామాజిక న్యాయం అంటే ఎలా ఉంటుందో రాష్ట్రంలో దాదాపు మూడేళ్లుగా సాగుతున్న పాలన స్పష్టం చేస్తోంది. పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించినప్పుడే.. సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు ఆ వర్గాల్లో అట్టడుగున ఉన్న నిరుపేదలకు చేరుతాయన్నది సీఎం వైఎస్ జగన్ నమ్మకం. అప్పుడే వారు పురోభివృద్ధిలోకి వస్తారని.. ఇది సమసమాజ స్థాపనకు దోహదం చేస్తుందన్నది ఆయన విశ్వాసం. ఇందుకోసం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే నడుం బిగించారు. మంత్రివర్గం ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 60 శాతం పదవులు ఇస్తూ తొలి అడుగులోనే సరి కొత్త సామాజిక రాజకీయ విప్లవాన్ని సృష్టించారు. 34 నెలల్లో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పదవులనూ సింహ భాగం ఆ వర్గాలకే కేటాయిస్తూ ఎప్పటికప్పుడు సామాజిక న్యాయానికి సరి కొత్త నిర్వచనం ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం ఆ వర్గాలకు రిజర్వ్ చేస్తూ చట్టం చేశారు. అందులోనూ సరిగ్గా సగం... అంటే 50 శాతం మహిళలకు రిజర్వ్ చేస్తూ మరో చట్టం తీసుకొచ్చారు. వాటిని నిక్కచ్చిగా అమలు చేసి సామాజిక న్యాయమంటే ఇదేనని దేశానికి చాటి చెబుతున్నారని వివిధ రంగాల్లోని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాజాగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించడాన్ని అభినందిస్తున్నారు. నాడు మాటల్లో.. – రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జనసేన, బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చింది. టీడీపీకి బీసీలే వెన్నెముక అని చెప్పే చంద్రబాబు.. అది ఓట్ల కోసమేనని అనేక సార్లు బయటపడిపోయారు. – 2014 జూన్ 8న చంద్రబాబు తొలిసారిగా 19 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేస్తే.. అందులో కేవలం ఇద్దరు ఎస్సీలు, ఆరుగురు బీసీలకు స్థానం కల్పించారు. ఏకంగా 11 స్థానాలను అగ్రవర్ణాలకు ఇచ్చారు. అధికారం నుంచి దిగిపోయే వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల వారికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. – ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని ఎస్సీలను.. సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకోవడానికి వచ్చిన నాయి బ్రాహ్మణులను తోలుతీస్తానంటూ బెదిరించిన చంద్రబాబు.. సామాజిక న్యాయం పట్ల తనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందన్నది తానే బహిర్గతం చేసుకున్నారు. నేడు చేతల్లో.. – దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు (86 శాతం), 22 లోక్‌సభ స్థానాల (88 శాతం)ను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుని ఆఖండ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. – ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 60 శాతం మంత్రి పదవులు ఇస్తూ 2019 జూన్ 8న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించారు. హోం శాఖ మంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళను నియమించారు. – అత్యంత కీలకమైన హోం, రెవెన్యూ, జల వనరులు, విద్య, రహదారులు భవనాలు వంటి కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించి, వారికి పరిపాలనలో ప్రాధాన భాగస్వామ్యం కల్పించారు. – శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. శాసనమండలి చైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజును, వైస్ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళ జకియా ఖానంను నియమించారు. ఇదీ సామాజిక న్యాయమంటే – శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. – వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో వైఎస్సార్సీపీకి నాలుగు స్థానాలు దక్కితే.. అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. – జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆఖండ విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌లనూ క్వీన్ స్వీప్ చేసింది. 13 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవుల్లో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. – మండల పరిషత్ ఎన్నికల్లో.. 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67 శాతం పదవులను కేటాయించారు. – 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లోనూ అగ్రాసనం – రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. – వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. – 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. -
సామాజిక న్యాయానికే మరింత పెద్దపీట?
సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గరపడింది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. సామాజిక కూర్పు, అనుభవం, జిల్లాల అవసరాల ప్రాతిపదికన ప్రస్తుత మంత్రివర్గంలో 7 నుంచి 10 మందిని కొనసాగించే అవకాశముందని తెలిసింది. కొత్తగా 14 నుంచి 17 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక మంత్రివర్గం ఏర్పాటు నుంచి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు.. మేయర్లు, మండల పరిషత్ అధ్యక్షులు వరకూ అన్నింటా సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు.. 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. 2019, జూన్ 8న 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. నాటి కేబినెట్లో ఏడుగురు బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు, నలుగురు కాపులకు, నలుగురు రెడ్డి సామాజికవర్గం వారికి అవకాశం కల్పించారు. గిరిజన, మైనార్టీ, క్షత్రియ, వైశ్య, కమ్మ వర్గాల నుంచి ఒక్కొక్కొరికి స్థానం కల్పించారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చి సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురికి అవకాశం ఇస్తే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళలను హోంశాఖ మంత్రిగా సీఎం జగన్ నియమించారు. రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా.. సంక్షేమాభివృద్ధి పథకాలను ఆ వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి చేర్చి.. అభివృద్ధి పథంలోకి తేవాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత ప్రాధాన్యం ఇక రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్పుచేసి.. కొత్త వారితో ఏర్పాటు చేస్తానని.. పాత వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని మొదట్లోనే సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కానీ, కరోనా కారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొత్త కేబినెట్ కూర్పుకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. తొలుత మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యం కంటే.. ఇప్పుడు మరింత అధికంగా ప్రాధాన్యత దక్కుతుందని తెలిసింది. సామాజిక కూర్పు, జిల్లాల అవసరాలు ప్రాతిపదికన మంత్రివర్గం ఏర్పాటుచేస్తారని చెబుతున్నారు. ఆశావహులు వీరే.. ► బీసీ వర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, బూడి ముత్యాలనాయుడు, పొన్నాడ సతీష్‌కుమార్, విడదల రజని, జోగి రమేష్, కొలుసు పార్థసారధి, బుర్రా మధుసూదన్ యాదవ్, కరణం ధర్మశ్రీ, ఉషాశ్రీ చరణ్.. ► ఎస్సీ సామాజికవర్గం నుంచి కొండేటి చిట్టబ్బాయ్, తలారి వెంకట్రావు, ఎలీజా, రక్షణనిధి, మేరుగ నాగార్జున, కిలివేటి సంజీవయ్య, కోరుముట్ల శ్రీనివాసులు, జొన్నలగడ్డ పద్మావతి.. ► ఎస్టీ సామాజికవర్గం నుంచి కళావతి, పీడిక రాజన్నదొర, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి.. ► ఓసీ సామాజికవర్గాల నుంచి ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి ► మైనార్టీ వర్గం నుంచి హఫీజ్ ఖాన్, ముస్తఫా తదితరులు మంత్రివర్గంలో ఆశావహులుగా ఉన్నారు. -
ఏపీ కేబినెట్ చివరి భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. చివరి మంత్రి వర్గసమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ముఖ్యమైనవి.. ►జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్ సహా, అధికారులందరూ సమర్ధవంతంగా నిర్వహించారని ప్రశంసించిన మంత్రిమండలి సభ్యులు. అధికారులను అభినందిస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన కేబినెట్. ►2021–22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన స్వయం సహాయక సంఘాలకు వైయస్సార్ సున్నావడ్డీ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం. ►రాష్ట్రంలో కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటుచేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు చేసిన స్వల్పసవరణలకు కేబినెట్ ఆమోదం. ►కొత్తగా కొత్తపేట, పులివెందుల రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►7 మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ►8 మండలాలతో పులివెందుల రెవిన్యూ డివిజన్‌కు కేబినెట్ ఆమోదం. ►చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె మండలాలతో పులివెందుల డివిజన్. ►విభజించిన తర్వాతకూడా వైయస్సార్ కడప జిల్లాలో 36 మండలాల నేపథ్యంలో కొత్తగా పులివెందుల డివిజన్. ►12 పోలీసు సబ్డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం. ►జిల్లాల విభజన నేపథ్యంలో ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి కొనసాగిస్తూ ఆర్డినెన్స్. ►చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ►చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మిల్లెట్మిషన్ (2022–23 నుంచి 2026–27 వరకూ)కు కేబినెట్ ఆమోదం. ►ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్ డిగ్రీకాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పోస్టులు. ►దాదాపు 253 పోస్టులు (23 ప్రిన్సిపల్, 31 టీచింగ్, 199 నాన్‌టీచింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం. ►ప్రకాశంజిల్లా దర్శిలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ డిగ్రీకాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్‌టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ►శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ►పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం. ►సర్వే సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డుల డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ►రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటుకు సంబంధించి కీలక అడుగులు. ►ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్యసేవలు అందించనున్న ఆస్పత్రులకు భూముల కేటాయింపు. ►దీంట్లో భాగంగా, కాకినాడ అర్బన్ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం. ►కర్నూలు జిల్లా కల్లూరు గ్రామంలో అత్యాధునిక ఆస్పత్రికోసం 5 ఎకరాల భూమి కేటాయింపు. ►విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద అత్యాధునిక ఆస్పత్రికి ఏపీఐఐసీ ద్వారా కేటాయింపు. ►అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ గ్రామంలో 4 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే ఆస్పత్రికి కేటాయింపు. ►శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల భూమిని హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే అత్యాధునిక ఆస్పత్రికి కేటాయింపు. ►ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కు హోటల్ మరియు కన్వెన్షన్ సెంటర్ కోసం రాజమండ్రి అర్భన్ లో 6 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ►కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీకి 100 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 15.31 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం, కేబినెట్ ఆమోదం. ►ప్రభుత్వ ఐటీఐని ఏర్పాటు చేసేందుకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్. ►అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాల భూమి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేటాయింపు. ►విండ్ టర్బైన్ జనరేటర్లను ఏర్పాటుచేయనున్న ఐఓసీఎల్. ►కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో ఆగ్రోకెమికల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ విస్తరణకు 10.06 ఎకరాలు కేటాయింపు. ►కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్ నిర్మాణానికి 1.57 ఎకరాల భూమిని ఏపీఎస్ఆర్టీసికి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ►రంపచోడవరం మండలం పెద గడ్డాడలో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ►నిజాపంపట్నం మండలం దిండిలో పరిసవారిపాలెంలో 280 ఎకరాలను ఏపీ మత్స్యశాఖకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. ►మడ్క్రాప్ హేచరీస్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్న ఏపీ మత్స్యశాఖ. ►కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు 82.34 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాలను కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం. ►గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రిక విస్తరణకోసం 0.89 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ►నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూరుకు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ►ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం. -
మంత్రి పదవికి రాజీనామా: స్పందించిన అనిల్‌కుమార్ యాదవ్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ను ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. గురువారం మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 'సీఎం జగన్‌కు సైనికుడిగా పనిచేయడమే తనకు అత్యంత ఇష్టమని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అందరం సమిష్టిగా పనిచేసి 2024లో మళ్లీ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుదని చెప్పారు. అందులో భాగంగానే నేడు మంత్రులంతా చాలా సంతోషంగా రాజీనామాలు చేశామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. చదవండి: (మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు) రాజీనామాలపై మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. 'మంత్రులందరూ రాజీనామాలు చేశాం. మరికొందరికి మంత్రులుగా అవకాశం లభిస్తుంది. ఇక పార్టీ కోసం పనిచేసే గొప్ప అవకాశాన్ని సీఎం మాకు కల్పిస్తున్నారు. ఇదో గొప్ప అరుదైన క్షణమని' మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. చదవండి: (మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) -
పవన్‌కు చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న అప్పుపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం నగదును సీఎం విడుదల చేస్తారని వెల్లడించారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వైద్య సిబ్బందిని నియమించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మంత్రులందరూ రాజీనామా ఇచ్చినట్లు తెలిపిన పేర్నినాని.. సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తమ సామర్ధ్యాన్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తామన్నారని, ఇప్పుడున్న వారిలో కొంతమందికి మళ్లీ అవకాశం ఉండవచ్చన్నారు. ‘ఎనిమిది మండలాలతో పులివెందుల, ఏడు మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నాం. అదే విధంగా 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపాం. పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్‌లో కొత్తగా 12 ఉద్యోగాలకు ఆమెదం.. ఏపీ మిల్లెట్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం. తొగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌కు 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్‌పోస్టులు మంజూరు. దర్శి డిగ్రీ కాలేజ్‌లో 34 టీచింగ్ పోస్టులు మంజూరు. చదవండి: మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు పవన్ హాబీగా రాజకీయాలు చేస్తున్నారు. పవన్ ఫుల్‌టైమ్ పొలిటీషియన్ కాదు. ఆయన అవకాశ రాజకీయాలు చేస్తున్నారు.పవన్ మాటలనే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. పవన్ మాటలకు నిబద్ధత ఉందా.. మాటకు కట్టుబడ్డాడా.. పవన్‌లా మాట మార్చితే ప్రజలు మండిపడతారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబును కలిశాను అంటారు. ఆయనేమన్నా ఎన్నికల కమిషనరా? పార్టీ పెట్టి చంద్రబాబును కలవడం ఎందుకు. పవన్.. చెగువేరా.. పూలే అందరూ అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఫోటో పెట్టుకున్నాడు. పవన్‌కు చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం. 2014లో పవన్ ఎవరి పల్లకీ మోశాడు’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. చదవండి: మంత్రి పదవికి రాజీనామా అనంతరం కొడాలి నాని స్పందన ఇదే.. -
మంత్రి పదవికి రాజీనామా అనంతరం కొడాలి నాని స్పందన ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీ కేబినెట్ బేటీ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక అశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారని కొడాలి నాని ప్రశంసించారు. సీఎం సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు సంతృప్తి ఉందన్నారు. ఇకపై శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. చదవండి: మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు కాగా సామాజిక సమీకరణాల కారణంగా పాత మంత్రుల్లో అయిదారుగురు కేబినెట్లో కొనసాగే అవకాశం ఉందని అన్నారు. అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారని పేర్కొన్నారు. కొత్త కాబినేట్‌లో మీరు కొనసాగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా..తనకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు కొడాలి నాని తెలిపారు. చదవండి: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. రాజీనామా చేసిన మంత్రులు -
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. రాజీనామా చేసిన మంత్రులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. చివరి కేబినెట్ భేటీ సందర్భంగా.. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం జగన్ సహా కేబినెట్ మంత్రులు అభినందించారు. చదవండి: (Perni Nani: మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందు) -
మంత్రులకు ఇదే చివరి కేబినెట్..
-
Perni Nani: మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందు
సాక్షి, తాడేపల్లి: 36 అంశాల అజెండాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏపీ కేబినెట్ చివరి భేటీ సందర్భంగా మీడియాకు మంత్రి పేర్నినాని వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొడాలినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. తనకు మీడియా చేసిన సహాయం అమోఘమని, ఈ మూడేళ్ళలో మీడియా మిత్రులు అందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని పేర్కొన్నారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను అని మంత్రి పేర్ని నాని అన్నారు. చదవండి: (AP: మంత్రుల పేషీల్లో హడావుడి.. ఇవాళే రాజీనామా..?!) -
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
-
ఏపీ కేబినెట్ భేటీ.. మంత్రుల పేషీల్లో హడావుడి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత మంత్రులకు ఇదే చివరి కేబినెట్ భేటీ కావడంతో మంత్రుల పేషీల్లో హడావుడి నెలకొంది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులు రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రి వర్గానికి సంబంధించిన జాబితా ఈ నెల 10న వెలువడే అవకాశం ఉంది. చదవండి: (సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ)