Breadcrumb
AP Cabinet 2022 Live Updates: ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం
Published Mon, Apr 11 2022 10:13 AM | Last Updated on Mon, Apr 11 2022 1:29 PM
Live Updates
ఏపీ నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్డేట్స్
గ్రూపు ఫోటో.. తేనీటి విందు..
ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంత్రులు గ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులు తేనీటి విందుకు హాజరయ్యారు.
సీఎం జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రులు వీరే
అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఉషాశ్రీ చరణ్, మేరుగ నాగార్జున, రాజన్న దొర, ఆర్కే రోజా, విడదల రజిని.
రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కించుకుంది వీరే..
అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్ , సీదిరి అప్పలరాజు, తానేటి వనిత.
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
విడదల రజిని ప్రమాణస్వీకారం
చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని ఏపీ నూతన కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై గెలుపొందారు.
తానేటి వనిత ప్రమాణస్వీకారం
కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తానేటి వనిత ఏపీ నూతన కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. 2009లో మొదటిసారి గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
సీదిరి అప్పలరాజు ప్రమాణస్వీకారం
పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఏపీ నూతన కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. 2007 నుంచి పలాస ప్రాంతంలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. 2019లో పలాస నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆర్కే రోజా ప్రమాణస్వీకారం
నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ నూతన కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. 2014, 2019లో నగరి నుంచి గెలుపొందారు. 2020 నుంచి ఏపిఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు.
రాజన్న దొర ప్రమాణస్వీకారం
సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర ఏపీ నూతన కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. 2009 నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో సాలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012-13 మధ్య ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు.
పినిపే విశ్వరూప్ ప్రమాణస్వీకారం
అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్ ఏపీ నూతన కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. 1989లో రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఉమ్మడి ఏపీలో పశుసంవర్ధకశాఖ మంత్రిగా పనిచేశారు. సీఎం జగన్ కేబినెట్లో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం
పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ నూతన కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.
మేరుగ నాగార్జున ప్రమాణస్వీకారం
వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఏపీ కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. 2019లో వేమూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉషాశ్రీ చరణ్ ప్రమాణస్వీకారం
కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ఏపీ కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నారాయణ స్వామి ప్రమాణ స్వీకారం
గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నారాయణస్వామి ఏపీ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో గంగాధరనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఏపీ కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం
తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఏపీ కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 2016లో తణుకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో తణుకు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏపీ కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2015 నుంచి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జోగి రమేష్ ప్రమాణ స్వీకారం
పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ ఏపీ కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన కృష్ణా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
గుమ్మనూరు జయరాం ప్రమాణస్వీకారం
ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 2014, 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి కార్మికశాఖ మంత్రిగా మంత్రిగా ఉన్నారు. 2006 జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు.
గుడివాడ అమర్నాథ్ ప్రమాణ స్వీకారం
అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ ఏపీ కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014-2019 మధ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
ధర్మాన ప్రసాదరావు ప్రమాణ స్వీకారం
శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1980లో రాజకీయ ప్రవేశం చేశారు. వైఎస్సార్ కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా చేశారు. 2010-13 వరకు ఆర్ అండ్ బి మంత్రిగా పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యే, 3సార్లు మంత్రిగా పనిచేశారు.
దాడిశెట్టి రాజా ప్రమాణ స్వీకారం
తుని నియోజకవర్గం ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగశ్వేరరావు (దాడిశెట్టి రాజా) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా సేవలు అందించారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం
రామచంద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సీఎం జగన్ కేబినెట్లో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు. 2001 నుంచి 2006 వరకు రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్ ప్రమాణ స్వీకారం
డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహించారు.
బూడి ముత్యాల నాయుడు ప్రమాణ స్వీకారం
మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు బలమైన బీసీ నాయకుడిగా పేరుంది. మాడుగుల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం
చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.
ఆదిమూలపు సురేష్ ప్రమాణ స్వీకారం
మంత్రిగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అంజాద్ బాషా ప్రమాణ స్వీకారం..
మంత్రిగా అంజాద్ బాషా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం
మంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు.
వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్
మంత్రి వర్గ ప్రమాణస్వీకార వేదిక వద్దకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ సచివాలయానికి బయలుదేరారు.
కొత్త వారు 14 మందికి స్థానం..
సరిగ్గా 34 నెలల రెండు రోజులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్నారు. అధికారం చేపట్టిన కొత్తలోనే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తానని సీఎం బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కొంత జాప్యం చోటుచేసుకున్నప్పటికీ, ఈ నెల 7వ తేదీన 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకుంటుండగా, కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు.
కొత్త, పాత మంత్రులకు తేనీటి విందు
ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగుతారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందు ఉంటుంది. కాగా, ఆదివారం రాత్రి కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించింది. అంతకు ముందే గవర్నర్ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు 24 మంది మంత్రుల శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని పేర్కొన్నారు.
అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లు
అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదువుతారు. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. ‘ముఖ్యమంత్రి మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు.. సోమవారం ప్రమాణ స్వీకారం చేయడానికి విచ్చేయాలి’ అని ఆహ్వానించారు.
కొలువు తీరనున్న కొత్త మంత్రివర్గం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరనుంది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకు ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.31 గంటలకు తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదిక సిద్ధమైంది.
Related News By Category
Related News By Tags
-
ఈనెల 29న ఏపీ కేబినేట్ సమావేశం
విజయవాడ: ఈనెల 29వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది.
-
ఈ నెల 22న ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ఈ నెల 22న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం...
-
టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారు: స్పీకర్ తమ్మినేని
సాక్షి, అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం జరిగిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ ...
-
అధికారం పవర్ కాదు.. బాధ్యత
సాక్షి, అమరావతి: అధికారమన్నది పవర్ కాదని, అది ఒక బాధ్యత అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార...
-
అత్యధికులు విద్యాధికులే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో అత్యధికులు విద్యాధికులు ఉన్నారు. ఎండీ (జనరల్) ఒకరు, పీహెచ్‌డీలు చేసిన వారు ఐదుగురు, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయే...
Comments
Please login to add a commentAdd a comment