new cabinet
-
రక్షణ మంత్రిగా హెగ్సెత్
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఫాక్స్ న్యూస్ చానల్ హోస్ట్, మాజీ సైనికాధికారి పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా, కీలకమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను ఎంపిక చేశారు. సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్‌ను హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం చీఫ్‌గా, అర్కన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ (69)ని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారిగా నియమించాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి స్టీవెన్ విట్కాఫ్ను పశ్చిమాసియాకు తన ప్రత్యేక దూతగా నియమించారు. డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ తర్వాత అతి పిన్న వయస్కుడైన రక్షణ మంత్రిగా 44 ఏళ్ల హెగ్సెత్ రికార్డు సృష్టించనున్నారు. ఆయన జీవితమంతా సైనికుల కోసం, దేశం కోసం యోధుడిగా గడిపారంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇక క్రిస్టీది సరిహద్దు భద్రతపై ఏమాత్రం రాజీ పడని తత్వమంటూ కొనియాడారు. హెగ్సెత్ 2003లో సైన్యంలో చేరారు. ఇరాక్, ఆఫ్గానిస్తాన్‌లలో పని చేశారు. 2016 నుంచి ఫాక్స్ న్యూస్ వీకెండ్ మార్నింగ్ టాక్ షో నిర్వహిస్తున్నారు. ‘ది వార్ ఆఫ్ వారియర్స్’పేరుతో పుస్తకాలు రాశారు.సీఐఏ డైరెక్టర్‌గా సన్నిహితుడుకీలకమైన సీఐఏ డైరెక్టర్‌గా ఎంపికైన రాట్క్లిఫ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. భారత సంతతికి చెందిన కశ్యప్ (కాష్) పటేల్‌కు ఈ పదవి దక్కుతుందని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ‘‘2016 ఎన్నికలప్పుడు రష్యా కుట్ర అంటూ సాగిన తప్పుడు ప్రచారం డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పనేనని బయట పెట్టడం మొదలుకుని సత్యం కోసం, నిజాయితీ కోసం పోరాడిన యోధుడు జాన్ రాట్క్లిఫ్. అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ గురించి 51 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అబద్ధాలు చెప్పినా ఆయన మాత్రమే అమెరికన్ ప్రజలకు నిజం చెప్పారు’’అంటూ ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాట్క్లిఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2020లో ఆయన్ను అమెరికా అత్యున్నత గూఢచారిగా ధ్రువీకరించారు. -
కొనసాగుతున్న లీక్స్.. ఏపీలో ఎవరికి ఏ శాఖ అంటే..?
విజయవాడ, సాక్షి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కసరత్తులు ముగిశాయా? లేదంటే ఇంకా చర్చించాల్సి ఉందా? అసలు కూటమి పార్టీలు ఏ శాఖల కోసం పట్టుబట్టాయి? కీలక శాఖలను టీడీపీనే దక్కించుకోబోతోందా? త్యాగాల జనసేన శాఖల విషయంలో పంతం నెగ్గించుకుంటుందా? ఫలానా వాళ్లకు ఫలానా మంత్రిత్వ శాఖ అని లీకులు ఇస్తోంది ఎవరు?.. ఏపీలో కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారనేదానిపై ఈ సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక.. ఈ ప్రకటన ఉండనున్నట్లు అధికారిక సమాచారం. మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారని చెబుతున్నప్పటికీ.. మరోసారి పునఃసమీక్షిస్తారా? అనే చర్చా మొదలైంది.గురువారం ఆయన తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల పర్యటనలు ముగించుకున్నాక అమరావతికి తిరిగి రానున్నారు. సాయంత్రం సచివాలయం వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల ఫైల్స్పైనా సంతకాలు చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అయితే.. ఆ తర్వాతే ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారట. ఈ క్రమంలో గత రెండు రోజులుగా శాఖల కేటాయింపులపై లీకులు అందుతున్నాయి. ఇటు టీడీపీ శ్రేణులు.. అటు జనసేన.. ఇంకోవైపు ఎల్లో మీడియా సంస్థలు.. మంత్రిత్వ శాఖలపై గత రెండురోజులుగా వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. అందులో మొదటిది పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతారని. అయితే నిన్న మంత్రిగానే పవన్ కల్యాణ్ ప్రమాణం చేసినప్పటికీ.. అధికారికంగా డిప్యూటీ సీఎం అని ఎక్కడా ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆయన సోదరుడు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి అనే లీక్ ఇచ్చేశారు. ఇక.. జనసేనకు మూడూ కీలక శాఖలే ఉంటాయని టీడీపీ అనుకూల ప్రధాన మీడియా కథనం ఇచ్చింది. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు పేర్కొంది. అయితే.. పవన్ హోం శాఖ కోసం కూడా పట్టుబడుతున్నారంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు లీకులు అందుతున్నాయి. ఇక టీడీపీ శ్రేణులేమో.. ఐటీ శాఖ మరోసారి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ బాబుకే వెళ్లొచ్చని చెబుతున్నాయి. గతంలో.. 2014 టైంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్ ఈ శాఖను చేపట్టారు. అయితే టీడీపీలోనే మరో వర్గం లోకేష్‌కు ఈసారి ఇంకా ప్రాధాన్యం ఎక్కువ ఉన్న మంత్రిత్వ శాఖ దక్కుతుందని చెప్పుకుంటోంది. సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత రాత్రికి అధికారిక ప్రకటన. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ఫలానా మంత్రిత్వ శాఖ దక్కుతుందనే ప్రచారంలో ఉంటే.. మరో మిత్రపక్షం బీజేపీ మాత్రం ఒక్క మంత్రి పదవి పోస్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం. -
చంద్రబాబు కేబినెట్.. తెరపైకి కొత్త ఈక్వేషన్లు!
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గంపై కసరత్తులు కొనసాగుతున్నవేళ.. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, హోం శాఖ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్‌కు హోం శాఖ ఖరారైందన్న ప్రచారం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. చంద్రబాబు గతంలో కాపు డిప్యూటీ సీఎంకు హోంమంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడూ అదే ఫార్ములా అమలు చేయాలంటు జనసేన పట్టుబడుతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో కూడా కాపులకి అవకాశం దక్కని అంశాన్ని ప్రస్తావిస్తూ.. పవన్‌కు హోం శాఖ ఇచ్చి ఆ గ్యాప్‌ను బ్యాలెన్స్ చేయాలని డిమాండ్ జనసేన చేస్తోంది. ఇంకోవైపు హోం మంత్రి పదవి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకే అనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. అదే సమయంలో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడం, ఇప్పుడు జనసేన డిమాండ్‌తో అచ్చెన్నాయుడు మంత్రి పదవిపై సందిగ్థత నెలకొంది. దీంతో ఆయన టీడీపీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారా? అనే చర్చ నడుస్తోంది. కూటమిలో ఉన్న బీజేపీ డిమాండ్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీ కూడా కేబినెట్లో కీలక పోస్టులను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మంత్రి పదవులెవరికో?.. ఏపీలో కొనసాగుతున్న ఉత్కంఠమరోవైపు.. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు చేరారు. ఇది ఎమ్మెల్యేల్లో కొందరి అవకాశాల్ని దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్నవారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు. ఇక స్పీకర్ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ ముగ్గురూ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అయితే గతంలో తన సామాజిక వర్గానికే స్పీకర్పదవి ఇచ్చుకున్న చంద్రబాబు.. ఈసారైనా బీసీ, ఎస్సీలకు ఇస్తారా? లేదంటే మళ్లీ తన సామాజిక వర్గానికే ఇప్పించుకుంటారా?అనే సస్పెన్స్ కొనసాగుతోంది. -
Modi 3.0: ఎవరికి ఏ శాఖ?.. కొనసాగుతున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర కేబినెట్‌లోఎవరికి ఏ శాఖ అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం మంత్రి వర్గ సమావేశం జరుగనుంది ఈ లోపే మంత్రలకు శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. లేదంటే భేటీలోనే మంత్రి శాఖలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయనేదానిపై ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రా నుంచి ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. కిషన్‌రెడ్డి, రామ్మోహన్నాయుడుకి కేబినెట్లో చోటు దక్కగా, పెమ్మసాని, వర్మ, బండి సంజయ్‌కు సహాయ మంత్రులుగా బెర్త్‌లు దక్కాయి.ఇదీ చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్! -
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్!
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనేదానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?. మోదీ మార్క ఉండనుందా? అనే చర్చ మొదలైంది. ఇవాళ(సోమవారం, జూన్ 10) సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలోపు లేదంటే ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ మీద తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మరోవైపు.. భాగస్వామ్య పక్షాల ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో.. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోదీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్లో మోదీ మార్క్‌తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. ఇక.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్ చేశాయి. జేడీఎస్ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్ చేసినట్లు తెలియవస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే.. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.నిన్న రాత్రి 72 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో 30 మంది మంత్రివర్గంలోకి, ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా, అలాగే.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. 43 మంది మూడుకంటే ఎక్కువసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అలాగే.. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను తీసుకోవడం గమనార్హం. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో చోటు దక్కింది. విశేషం ఏంటంటే.. కేంద్ర కేబినెట్లో ఇంకా ఖాళీగానే 9 బెర్తులు ఉండడం. -
మోదీ కేబినెట్ లో తెలుగు మంత్రులు
-
కన్నులపండువగా...
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. దేశాధినేతల నుంచి రాజకీయ దిగ్గజాల దాకా వేడుకలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రముఖులు మొదలుకుని సినీ తారల దాకా తళుక్కుమన్నారు. 8,000 మందికిపైగా వీవీఐపీలు, వీఐపీలతో రాష్ట్రపతి భవన్ ఆవరణ కళకళలాడింది. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయిస్తుండగా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు, హర్షధ్వానాలతో మారుమోగింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్ కోవింద్ తదితరులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ నుంచి రజనీకాంత్ దాకా పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై అలరించారు. పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ దంపతులు, ముకేశ్ అంబానీ దంపతులు వేడుకకు హాజరయ్యారు. భిన్న మతాలకు చెందిన పెద్దలు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా నెగ్గిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానాకర్షణగా నిలిచారు. కేరళలోని త్రిసూర్ ఎంపీ, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయమన్నది తెలిసిందే. మోదీకి పలు రంగాల ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షల సందేశాలతో ఎక్స్ తదితర సోషల్ సైట్లు హోరెత్తిపోయాయి. ఏడుగురు దేశాధినేతలు: మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కు మార్ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్ర ధానమంత్రి త్సెరింగ్ టాగ్బే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ తదితరులు కార్యక్ర మంలో పాల్గొన్నారు. భారత్, మాల్దీవుల మ« ద్య సంబంధాలు బలహీనపడ్డ నేపథ్యంలో ముయిజ్జు హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడయ్యాకఆయన భారత్ రావడం ఇదే తొలిసారి.తెలుపు కుర్తా–చుడీదార్, నీలి రంగు జాకెట్లో... మెరిసిపోయిన మోదీవిశేష సందర్భాల్లో తన వస్త్రధారణతో ఆకట్టుకునే మోదీ ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుపు కుర్తా, చుడీదార్, దానిపై నీలి రంగు జాకెట్ ఎంచుకున్నారు. 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ చేసిన సందర్భంగా ఆయన క్రీం కలర్ కుర్తా, తెల్ల పైజామా, బంగారు రంగు జాకెట్ ధరించారు. 2019లో రెండోసారి ప్రధాని అయినప్పుడు తెలుపు రంగు కుర్తా, పైజామా, వాటిపై బంగారు రంగు జాకెట్ ధరించి ప్రమాణస్వీకారం చేశారు. పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు మోదీ రంగురంగుల తలపాగాలు ధరించి అలరిస్తుంటారు. -
52 మందితో మోడీ క్యాబినెట్
-
బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి
-
కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్
-
మంత్రి పదవి ఎవరెవరికి ?
-
కేంద్రమంత్రివర్గంలో చోటుపై ఏపీ కూటమి నేతల లెక్కలు
-
కాసేపట్లో కాబోయే మంత్రులకు మోదీ తేనేటి విందు
సాక్షి, ఢిల్లీ: నరేంద్ర మోదీ సారధ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రి వర్గంపై ఒక అంచనా వచ్చేసింది. కేబినెట్లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ తన నివాసంలో నూతన మంత్రి వర్గ సభ్యులకు తేనేటి విందు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు లభించింది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కాల్స్ వెళ్లాయి. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్‌రావ్ జాదవ్‌లకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ సీనియర్లు రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, జితేంద్రసింగ్, శర్బానంద సోనోవాల్, జ్యోతి రాధిత్య సింధియాలకు సైతం కబురు వెళ్లినట్లు సమాచారం.మంత్రి మండలిలో కిషన్‌రెడ్డి , బండి సంజయ్ చోటు దక్కింది. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో వారు బయలుదేరి వెళ్లారు. ఇంకా ఎవరెవరికి కాల్స్ వెళ్లాయనేదానిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం కర్తవ్యపథ్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
సెంట్రల్ క్యాబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట
-
కేంద్ర కేబినెట్ లో ఏపీకి 4 లేదా 5 మంత్రి పదవులు
-
మోదీ కొత్త క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ..
-
Lok Sabha Election Results 2024: 8 లేదా 9న ప్రమాణం!
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్లాల్ నెహ్రూ నెలకొలి్పన రికార్డును మోదీ సమం చేయబోతున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని సహా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, బుధవారం మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎన్డీయే–2 ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత 17వ లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఉదయం 11.30 గంటలకు జరిగిన కేబినెట్ భేటీలో మోదీ మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు ఒక భాగమేనని అన్నారు. నెంబర్ గేమ్ కొనసాగుతుందని చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు చేశామని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు. పదేళ్లలో మంత్రులంతా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరుల రాజీనామా లేఖలను సమరి్పంచారు. మోదీతోపాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించాలని మోదీని కోరారు. 17వ లోక్‌సభను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ చేసిన సిఫార్సు లేఖను రాష్ట్రపతి అందజేశారు. దీంతో 17వ లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో మోదీ భేటీ ప్రధాని మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మూడు కమలం పువ్వులున్న పుష్పగుచ్ఛాన్ని మోదీకి అందజేసి అభినందనలు తెలియజేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించినందుకు గుర్తుగా మూడు కమలం పువ్వులను ఇచి్చనట్లు తెలుస్తోంది. అలాగే మోదీ కూడా కొన్ని రకాల మిఠాయిలను ఉప రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ, దిగిపోతున్న మంత్రివర్గానికి రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీనికి హాజరయ్యారు. టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మిత్రపక్షాల సహాయంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి లభించలేదు. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో హస్తినలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయే నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలు ప్రతిపక్ష కూటమిలో చేరబోతున్నాయంటూ ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి. -
వైఎస్ఆర్ నా రోల్ మోడల్
-
రిషి కేబినెట్లోకి మరో భారత సంతతి మహిళ
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కొత్తగాకేబినెట్లోకి క్లెయిర్ కౌటిన్హో(32) అనే భారత సంతతి మహిళా సభ్యురాలిని చేర్చు కున్నారు. ఇంధన భద్రత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మెన్తోపాటు క్లెయిర్ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారే. రక్షణ మంత్రి బెన్ వాలెస్ రాజీనామాతో ఆ బాధ్యతలను ఇంధన మంత్రి గ్రాంట్ షాప్స్కి అప్పగించారు. షాప్స్ నిర్వహించిన శాఖను క్లెయిర్‌కు ఇచ్చారు. ఈస్ట్ సర్రే నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. -
సీఎం సిద్ధరామయ్యకు ఆర్థికం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకుని, ముఖ్యమైన నీటిపారుదల, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ విభాగాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కేటాయించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతోపాటు 8మంది మంత్రులు ఈ నెల 20న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. శనివారం కొత్తగా 24 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. వీరిలో గతంలో హోం శాఖను నిర్వహించిన జి.పరమేశ్వరకు తిరిగి అదే శాఖను కట్టబెట్టారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖను ఎంబీ పాటిల్‌కు, కేజే జార్జికి విద్యుత్ శాఖను కేటాయిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థిక శాఖతోపాటు కేబినెట్ వ్యవహారాలు, పరిపాలన సిబ్బంది వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ తదితర ఇతరులకు ఇవ్వని శాఖలు సీఎం సిద్ధరామయ్య వద్దే ఉన్నాయి. శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి వనరులు, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ శాఖలను ఇచ్చారు. హెచ్‌కే పాటిల్‌కు న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు, లెజిస్లేషన్, పర్యాటక శాఖలు, కేహెచ్ మునియప్పకు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలను కేటాయించారు. రామలింగారెడ్డికి రవాణా, ముజ్రాయ్ శాఖలను ఇచ్చారు. హెచ్‌సీ మహదేవప్పకు సాంఘిక సంక్షేమం, సతీశ్ జర్కిహోళికి పబ్లిక్ వర్క్స్ శాఖలను అప్పగించారు. శివానంద పాటిల్‌కు టెక్స్టైల్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బాధ్యతలు కేటాయించారు. దినేశ్ గుండూరావుకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, రెవెన్యూ శాఖను కృష్ణ బైరెగౌడకు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. ఏకైక మహిళా మంత్రి లక్ష్మి ఆర్ హెబ్బాల్కర్కు మహిళ, శిశు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ సాధికారిత శాఖ ఇచ్చారు. -
ఆస్ట్రేలియాలో 13 మంది మహిళా మంత్రులు
కెన్బెరా: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసె తన కేబినెట్లో మహిళలకు పెద్ద పీట వేశారు. రికార్డు స్థాయిలో 13 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఆనీ అలీ అనే ముస్లిం కూడా ఉన్నారు. దేశ చరిత్రలో తొలి ముస్లిం మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. అయ్యారు. కెన్బెరాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లీ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. లేబర్ పార్టీకి చెందిన ఆంటోని ప్రధాని అయిన 11 రోజుల తర్వాత 30 మందితో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. ఇలాంటి ఒక సమీకృత ప్రభుత్వానికి సారథిగా ఉండడం గర్వంగా ఉందని ఆంటోని ట్విటర్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఎంత భిన్నత్వంతో కూడుకొని ఉందో, తన కేబినెట్ కూడా అంతే భిన్నంగా ఉందన్నారు. -
ఫ్రాన్స్ ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్
పారిస్: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్ నియమితులయ్యారు. దేశప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. 1991–92లో ఎడిత్ క్రేసన్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పని చేశారు. బోర్న్గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. త్వరలో అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి బోర్న్ నూతన మంత్రివర్గాన్ని నియమిస్తారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రభుత్వానికి చెందిన ఆర్‌ఏటీపీ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. 2017లో మాక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ పార్టీలో చేరారు. ఫ్రాన్స్‌లో అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయ్యేలోపు ప్రధానులు మారుతూనే ఉంటారు. కార్మిక మంత్రిగా ఆమె తెచ్చిన సంస్కరణలకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు బోర్న్ సత్తాకు పరీక్షగా నిలవనున్నాయి. -
‘కుటుంబీకులు’ లేకుండా... లంక కొత్త కేబినెట్
కొలంబో: కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్త నిరసనలతో సతమతమవుతున్న శ్రీలంకలో సోమవారం పాత ప్రధాని మహింద రాజపక్స సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మొత్తం 17 మందితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సోదరుడు మహింద (72) మినహా కేబినెట్లో తమ కుటుంబీకులెవరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. గత మంత్రివర్గంలో సభ్యులైన మరో సోదరుడు చమల్, మహింద కుమారుడు నమల్, అల్లుడు శశీంద్ర తదితరులను పక్కన పెట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాని విడివిడిగా జాతినుద్దేశించి మాట్లాడారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని వ్యవస్థలో సమూల మార్పు తీసుకొస్తామని గొటబయ ధీమా వెలిబుచ్చారు. స్వచ్ఛమైన, సమర్థమైన పాలన అందించేందుకు సహకరించాల్సిందిగా మహింద కోరారు. మరోవైపు అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం నుంచి వారంపాటు నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ కార్యకలాపాలను కూడా సస్పెండ్ చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం నుంచి మరింత పెరిగాయి. సంక్షోభం నేపథ్యంలో మార్చి నుంచి శ్రీలంక రూపాయి విలువ 60 శాతానికి పైగా పడిపోయింది. -
ఏపీలో సామాజిక విప్లవానికి సీఎం జగన్ నాంది
-
ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే: తిప్పేస్వామి
మడకశిర(సత్యసాయి జిల్లా): మంత్రి పదవి రాలేదని తనకు అసంతృప్తి లేదని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. సోమవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రాణం ఉన్నంత వరకు తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆశయమన్నారు. మంత్రి పదవి దక్కక పోవడంతో తాను అసంతృప్తితో ఉన్నట్లు మీడియా అసత్యప్రచారం చేసిందన్నారు. తాను 40 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబం వెంటే ఉన్నానని పేర్కొన్నారు. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. తనకు వైఎస్సార్ 1999లో చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014, 2019లో మడకశిర ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారని తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కుటుంబానికి విశ్వాస పాత్రుడిగా ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని కోరారు. -
ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తా
తగరపువలస (విశాఖపట్నం): సీఎం వైఎస్ జగన్ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేసే ప్రశ్నేలేదన్నారు. చిట్టివలస బంతాట మైదానంలో సోమవారం జీవీఎంసీ భీమిలి జోన్‌కు చెందిన 363 మంది వలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర అవార్డుల కింద ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు అదనపు అర్హత మాత్రమేనని చెప్పారు. శక్తియుక్తులన్నీ ఉపయోగించి భీమిలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో త్వరలో భీమిలిలో రూ.25 కోట్లతో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్, సీఎస్ఆర్ నిధులతో ఆర్టీసీ కాంప్లెక్స్ హామీ నెరవేరిస్తే 95% ఎన్నికల హామీలు నెరవేర్చినట్టేనని చెప్పారు. విద్యుత్ సమస్యలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు పెద్ద వయసు, అనుభవం ఉన్నా జగన్‌లా పెద్ద మనసు లేదన్నారు. ఇన్నాళ్లు జగన్ కేబినెట్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నూరుశాతం మంచివారని చెప్పారు. టీడీపీ నేతలు వలంటీర్లను హేళన చేశారని గుర్తుచేశారు. వలంటీర్లే లేకుంటే కరోనా కాలంలో మరిన్ని ప్రాణాలు పోయేవని ఆయన పేర్కొన్నారు. -
అధికారం పవర్ కాదు.. బాధ్యత
సాక్షి, అమరావతి: అధికారమన్నది పవర్ కాదని, అది ఒక బాధ్యత అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నదే సీఎం జగన్ ముఖ్య విధానమని తెలిపారు. ఇందులో ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం అన్నది లేదన్నారు. అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే సాఫీగా సాగుతోందని తెలిపారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉందని స్పష్టంచేశారు. సోమవారం తాత్కాలిక సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పదవులు దక్కలేదన్నది నాయకుల అసంతృప్తి కాదని, వారి అనుచరుల తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనని చెప్పారు. అధికారం వారి నాయకుడికి రావాలన్నదే అనుచరుల బాధ అని, అక్కడి నుంచి అసంతృప్తి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారని తెలిపారు. ఆవేశంతో కొంత మంది రాజీనామాలు అనే మాట వచ్చి ఉంటుందన్నారు. ఇదంతా తాత్కాలికమేనన్నారు. పరిమిత సంఖ్యలో ఉన్న పోస్టుల్లో అందరికీ న్యాయం చేయడం కొంత ఇబ్బందికరమేనని చెప్పారు. అనుచరుల బాధను అధినేత అర్థం చేసుకుంటారన్నారు. చాలా మంది నేతలు స్పోర్టివ్‌గా తీసుకున్నారని చెప్పారు. బీసీలకు పెద్ద పీట వేసిన విషయాన్ని అందరూ గమనించాలన్నారు. ఓ వర్గం మీడియా కుట్రపూరితంగా దీనిపై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. 2014లో చంద్రబాబు 25 మంత్రి పదవులు ఉన్నా, 19 మందినే ఎందుకు నియమించుకున్నారని ప్రశ్నించారు. ఆయన కుమారుడి కోసం మరో ఐదు పోస్టులు భర్తీ చేశారన్నారు. ఇవన్నీ మరిచి ఇవాళ టీడీపీ నేతలు అడ్డగోలు కామెంట్లు చేస్తూ శునకానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ బాధ్యతలు, రీజినల్ కోఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేస్తారని, వాళ్లూ కీలకంగా మారతారని తెలిపారు. మంత్రివర్గం, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ఎన్నికల టీమ్‌గా ఉంటారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వీరంతా పార్టీని విజయపథంలో నడిపిస్తారని ఆయన చెప్పారు. -
పొలిటికల్ కారిడార్ 11th April 2022
-
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల ప్రమాణం (ఫొటో గ్యాలరీ)
-
ఏపీ నూతన కేబినెట్: పేర్ని, కొడాలి ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వందకు వంద శాతం తాను సంతృప్తిగానే ఉన్నానన్నారు. సీఎం జగన్ ఏ పని అప్పజెప్పినా బాధ్యతగా చేస్తానని పేర్ని నాని అన్నారు. చదవండి: ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే.. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తోనే ఉంటానన్నారు. సీఎం జగన్ ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారని కొడాలి నాని అన్నారు. -
అన్నకోసం ప్రాణాలైనా అర్పిస్తా..
-
ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరారు. 25 మంది మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులు తేనీటి విందులో పాల్గొన్నారు. చదవండి: AP: మంత్రుల ప్రమాణ స్వీకారం.. తొలుత ప్రమాణం చేసింది ఆయనే.. మంత్రులుగా అంబటి రాంబాబు, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ, చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, పి.రాజన్న దొర, ఆర్కే రోజా, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, విడదల రజినీ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఉషాశ్రీ చరణ్ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాకాని గోవర్థన్ రెడ్డి అనే నేను..
-
జోగి రమేష్ అనే నేను..
-
గుమ్మనూరు జయరాం అనే నేను..
-
గుడివాడ అమర్ నాథ్ అనే నేను..
-
ధర్మాన ప్రసాద్ రావు అనే నేను..
-
దాడిశెట్టి రాజా అనే నేను..
-
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అనే నేను..
-
బూడి ముత్యాలనాయుడు అనే నేను..
-
బుగ్గన రాజేంద్రనాథ్ అనే నేను..
-
బొత్స సత్యనారాయణ అనే నేను..
-
ఆదిమూలపు సురేష్ అనే నేను..
-
అంజాద్ బాషా అనే నేను..
-
అంబటి రాంబాబు అనే నేను..
-
Live Blog: ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం
-
AP New Cabinet: జగన్ మార్క్.. సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కేబినెట్ పునర్వవస్థీకరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అగ్రాసనం వేశారు. కేబినెట్ కూర్పులో పార్టీ అజెండా ప్రకారం ఎస్సీ, బీసీ వర్గాలకు మూడొంతులు ప్రాతినిధ్యం కల్పిస్తూనే సామాజిక సమతూకాన్ని కూడా పాటించారు. తొలి కేబినెట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించగా జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడుతున్న కేబినెట్లో ప్రాతినిధ్యం నాలుగుకు పెరిగింది. పార్టీపై నిబద్ధత, పనితీరు, సీనియారీటీ, నాయకత్వ పటిమ, సమర్థతలే కొలమానంగా మంత్రుల ఎంపిక జరిగింది. రెండేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల టీమ్‌గా సీఎం కేబినెట్లోకి ఏరికోరి మంత్రులను తీసుకున్నారు. జిల్లాల విభజన తరువాత ఏర్పడ్డ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం లభించడంపై జిల్లాల్లో పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలుతున్నాయి. తొలి కేబినెట్లో మంత్రులుగా ఉన్న పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనితలకు మరోసారి చోటు కల్పించారు. కాకినాడ జిల్లా నుంచి ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తొలిసారి కేబినెట్లో అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం కలి్పంచగా ఎస్సీల నుంచి ఇద్దరికి, బీసీల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. నాలుగోసారి మంత్రిగా విశ్వరూప్ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడైన విశ్వరూప్ నాలుగోసారి మంత్రి అవుతున్నారు. 2009లో వైఎస్ కేబినెట్లో తొలిసారి మంత్రిగా నియమితులైన విశ్వరూప్ వైఎస్ మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో కూడా కొనసాగారు. మంత్రిగా పదవీ కాలం ఆరు నెలలుండగానే మహానేతతో ఉన్న అనుబంధంతో పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి కోనసీమలో ఎస్సీ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల్లో మంచి పట్టు సాధించి సమర్థత కలిగిన నేతగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తొలి కేబినెట్లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్లోకి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. విశ్వరూప్‌ను కేబినెట్లో కొనసాగించడం ద్వారా కోనసీమ జిల్లాలో బలమైన సామాజికవర్గాల పరంగా మంచి ముద్ర వేస్తారని నేతలు విశ్లేషిస్తున్నారు. విశ్వరూప్ వివాదరహితుడిగా ఉండడం రెండోసారి మంత్రి పదవి దక్కడానికి ఒక కారణమైంది. మరోసారి కేబినెట్లోకి వేణు బీసీ సంక్షేమశాఖా మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రెండోసారి కేబినెట్లోకి తీసుకున్నారు. వేణు ఎంపిక ద్వారా బలహీనవర్గాలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి సీఎం సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడిగా ఆయన ఉండేవారు. కోనసీమలో రాజోలు ప్రాంతానికి చెందిన వేణు సమర్థతను గుర్తించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడిగా చేశారు. అనంతరం ఓదార్పు యాత్రలో జగన్మోహన్రెడ్డి వెంట నడిచిన వేణు నాటి నుంచి పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. శెట్టిబలిజల్లో బలమైన నేతగా ఉన్న వేణును రామచంద్రపురం నుంచి పోటీచేయించి ఎమ్మెల్యేను చేసి తొలి కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి కేబినెట్లో కూడా ప్రాతిని«ధ్యం కలి్పంచడం ద్వారా ఆ సామాజికవర్గానికి సముచిత స్థానం దక్కింది. వేణు వాగ్ధాటితో పార్టీ వాణిని బలంగా వినిపించడం, బీసీ సంక్షేమశాఖను సమర్థంగా నిర్వహించడం కూడా కలిసి వచ్చింది. శ్రమించిన వనితకు మరో చాన్స్ కొవ్వూరు నియోజకవర్గం ఏర్పాటు తరువాత తొలి మహిళా ఎమ్మెల్యే, మంత్రిగా తానేటి వనితకు రెండోసారి సీఎం జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో అవకాశం కలి్పంచారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరిన వనిత అప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించారు. సాధారణ గృహిణిగా ఉన్న వనిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీ ప్రగతిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019లో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యే అయిన వనిత తొలి కేబినెట్లో స్త్రీశిశుసంక్షేమశాఖ మంత్రిగా సమర్థవంతమైన సేవలందించారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా మహిళలకు ఆది నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొవ్వూరు నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఉన్న వనితకు మంత్రి పదవి కట్టబెట్టారు. సమర్థత, పార్టీలో సామాజిక సమతూకాలను బేరీజు వేసుకుని వనితకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది. నిబద్ధతకు గుర్తింపు మూడు దశాబ్దాలపాటు తునిలో రాజకీయాలను శాసించిన యనమల వంటి రాజకీయ వటవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసిన తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాను ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్లో తొలిసారి తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో ఒక సైనికుడిలా పనిచేస్తూ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటిమతో పార్టీని విజయ పథం వైపు నడింపించడం తాజా మంత్రి వర్గంలో తీసుకోవడానికి దోహదం చేసింది. వాస్తవానికి తొలి కేబినెట్లోనే చాన్స్ దక్కుతుందని పార్టీ శ్రేణులు ఆశించాయి. చివరకు వివిధ సమీకరణల్లో ప్రభుత్వ విప్ లభించింది. అప్పుడే మలివిడత కేబినెట్లో బెర్త్ ఖాయమైంది. అందుకు అనుగుణంగానే కాకినాడ జిల్లా నుంచి రాజాను మంత్రి పదవి వరించింది. తుని నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు యనమల సోదరుడిపై గెలుపొందడమే కాకుండా నియోజకవర్గ టీడీపీ నేతలకు సింహస్వప్నంగా నిలిచారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులతో వేధింపులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీని వీడి పారీ్టలోకి రావాలని పలు ప్రలోభాలకు గురిచేసినా లెక్క చేయకుండా పార్టీ పైన, అధినేత జగన్‌పైన ఎంతో విశ్వాసంతో పార్టీ వెన్నంటి నిబద్ధతతో నిలవడం కలిసి వచ్చింది. కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలుంటే ఆరు నియోజకవర్గాల నుంచి కాపు సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మలి కేబినెట్లో రాజాకు అవకాశం కల్పించి ఆ సామాజిక వర్గానికి పెద్ద పీటేశారు. తునిలో ఆ సామాజికవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం ఇదే ప్రథమం. మంత్రి పదవి కూడా జగన్మోహన్రెడ్డి కేబినెట్లో దక్కడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆ సామాజికవర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోనసీమకు జోడు పదవులు... జిల్లాల విభజన తరువాత కోనసీమకు జోడు పదవులు దక్కాయి. జిల్లాల పునర్విభజన తరువాత దాదాపు ఒకో జిల్లాకు ఒకో మంత్రి పదవి దక్కిన క్రమంలో కోనసీమ జిల్లాకు ఒకేసారి రెండు బెర్త్‌లు దక్కాయి. ఆ రెండు కూడా ఎస్సీ, బీసీలకే కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానం తేటతెల్లం అవుతోంది. కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు›కావడంతో ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యింది. అమలాపురం నుంచి విశ్వరూప్, రామచంద్రపురం నుంచి వేణులను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా సీనియర్లను కొనసాగించినట్టయింది. వైఎస్సార్ సీపీకి తొలి నుంచి వెన్నంటి నిలుస్తోన్న ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు ఈ కేబినెట్లో సముచిత స్థానం కల్పించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బీసీలు, కాపులు, మాల, మాదిగలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడంపై పార్టీ శ్రేణుల్లోనే కాకుండా మూడు జిల్లాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
అమాత్య యోగం.. అద్వితీయం.. కీలక నేతలకు కేబినెట్లో స్థానం
సాక్షి, ఏలూరు: సీనియార్టీకి సముచిత స్థానం, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా జిల్లాలో కీలక నేతలకు మంత్రి పదవులు దక్కాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలకు తొలిసారి కేబినెట్లో చోటు దక్కగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తానేటి వనితకు మరలా అమాత్య యోగం దక్కింది. నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముదునూరు ప్రసాదరాజుకు చీఫ్ విప్‌గా అవకాశం రాగా మొత్తంగా కేబినెట్లో జిల్లాకు కీలక ప్రాధాన్యం దక్కింది. అంకితభావానికి పెద్దపీట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు యధావిధిగా మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాదిరిగానే ఇప్పుడూ ప్రాధాన్యమిచ్చారు. ఈసారి అదనంగా ప్రభుత్వ విప్ పదవిని కూడా అప్పగించారు. పార్టీపై విధేయత, పాల నపై అంకితభావం చూపిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ యాదవ), తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనా రాయణ (కాపు), కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత (ఎస్సీ), న రసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు (క్షత్రి య)కు పదవియోగం దక్కింది. సామాజిక కూర్పు లు, పార్టీల విధేయత ఇలా పలు అంశాలను ప్రామా ణికంగా తీసుకుని మంత్రి పదవులకు ఎంపిక చేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి. తొలిసారిగా కేబినెట్లోకి.. తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు తొలిసారి కేబినెట్లో చోటుదక్కించుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా ప్రాంతాల్లో బాణసంచా కాల్పులు, మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగాయి. తణుకులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి చరిత్రలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజకు మా త్రమే కేబినెట్లో అవకాశం దక్కగా.. ఈసారి ఇందుకు భిన్నంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు వనిత, కొట్టు, కారుమూరి, ముదునూరి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, పార్టీకి విధేయులుగా ఉంటూ పాలనలో తమ మార్కును చూపిస్తున్నారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు, ఒకరికి చీఫ్ విప్ పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా నూతన పశ్చిమగోదావరిలో ఇద్దరికి అవకాశం రాగా ఏలూరు జిల్లాలో ఎవరికీ చాన్స్ దక్కలేదు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యానికి జై‘కొట్టు’ తాడేపల్లిగూడెం: సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ని రంతరం ప్రజలను వె న్నంటి ఉండే గుణంతో బలమైన నాయకుడిగా ఎదిగారు ప్రభుత్వ హా మీల అమలు కమిటీ చై ర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. 1994 నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పలు సమస్యలపై పోరాడారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సందర్భంలో పట్టణంలో అ భివృద్ధి ఎలా ఉంటుందో ల్యాండ్ మార్కులతో చేసి చూపించారు. 2004లో దివంగత వైఎస్సార్ సారథ్యంలో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఐదేళ్ల పదవీ కాలంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. పీసీసీ సభ్యునిగా, మెంబర్ ఆఫ్ ఎస్యూరెన్స్ కమిటీ ఏపీ లెజిస్లేటివ్, మెంబర్ ఆఫ్ హౌస్ కమిటీ ఇరిగ్యు లారిటీస్ ఆఫ్ మిల్క్‌డైరీస్ సభ్యునిగా పనిచేశారు. గత సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన 2019లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజ యం సాధించారు. ప్రభుత్వ హామీల అమలు కమి టీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1955 అక్టోబర్ 19న కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి దంపతులకు ఆ యన జన్మించారు. భార్య సౌదామిని, ఇద్దరు కుమారులు బాలరాజేష్, విశాల్, కుమార్తె కంచన్ ఉన్నా రు. పుస్తకాలు చదవడం, బ్యాడ్మింటన్ ఆడటం ఆయన అలవాట్లు. నిత్యం యోగా చేస్తుంటారు. అందరివాడు.. కారుమూరి తణుకు అర్బన్ : తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. వి ద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లపాటు సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్ సారథ్యంలో 2009లో తణుకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత కాలంలో వైఎస్సార్ పార్టీలో చేరి 2014లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరలా 2019 ఎన్నికల్లో తణుకు నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ న్యూ అలుమ్నీ అసోసియేషన్ వెస్ట్ బ్రుక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లా యీస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. మీ ఇంట్లో మంత్రిగా ఉంటా.. ‘నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే మంత్రి పదవి ఇచ్చి నన్ను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది సీఎం జగన్. బీసీ నేతగా నన్ను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎప్పటిలాగే నియోజకవర్గంలో ప్రజానీకానికి అందుబాటులోనే ఉంటూ మీ ఇంట్లో మంత్రిగానే ఉంటాను’ అని ఆయన స్పష్టం చేశారు. విధేయతలో రా‘రాజు’ నరసాపురం: పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసి విధేయతలో రారాజుగా నిలిచారు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. దివంగత సీఎం వైఎస్సార్ స్ఫూర్తితో 2002లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అంచెలంచెలుగా ముందుకు సాగారు. యలమంచిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప తేడాతో పరాజయం పొందారు. ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం ఎమ్మెల్యే అప్పటినుంచి 2009 వరకూ నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా గెలుపొందారు. వైఎస్సార్ అకాల మరణం అనంతరం జరిగిన పరిణామాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచి 2012లో ఎమ్మె ల్యే పదవిని త్యాగం చేశారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అతిస్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. మరలా 2014లో ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా వ్యవహరించి నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజర్టీతో గెలుపొందారు. 1974 మే 29న సత్యనారాయణరాజు, వెంకట సరోజినీదేవి దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు భార్య శారదావాణి, కుమారుడు శ్రీకృష్ణంరాజు, కుమార్తె సింధూజ ఉన్నారు. -
AP New Cabinet: అంజద్‌బాషాను రెండోసారి వరించిన మంత్రిపదవి
కడప కార్పొరేషన్: కడప గడపకు మరోమారు మంత్రి హోదా దక్కింది. సమర్థత, విశ్వాసం, సామాజిక సమతుల్యత నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషాకు రెండోసారి అరుదైన అవకాశం లభించింది. ఈయనను మంత్రివర్గంలోకి తీసుకొని ముస్లీం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రపీఠం వేశారు. శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, రాష్ట్ర రాజధానికి ఎమ్మెల్యే అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లాయి. వ్యాపారవేత్తగా కడప వాసులకు సుపరిచితుడైన అంజద్‌బాషా 2005లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, వైఎస్ కుటుంబాన్ని అనుసరిస్తూ వైఎస్సార్సీపీ పార్టీలో క్రియాశీలక భూమిక పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కడప నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికై వైఎస్సార్సీపీ ఉన్నతికి కృషి చేశారు. అనంతరం 2014లో శాసనసభకు పోటీచేసే అవకాశం దక్కింది. కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో ఆపార్టీ అధికారం చేజేక్కించుకోలేకపోయింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, ప్రత్యక్ష పోరాటాల్లో తనవంతు పాత్రను పోషించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. తర్వాత వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా ఎంపికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల మేనిఫేస్టో కమిటీ మెంబర్‌గా అంజద్‌బాషా నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన ఆయన మరోమారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆనక ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆయనకు రెండవసారి మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విధేయుత..విశ్వాసం..సమర్థత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల విశ్వాసం, ముస్లీం మైనార్టీ వర్గీయుడైనా అత్యంత సమర్థత కల్గిన నాయకుడుగా ఎస్బి అంజద్‌బాషా గుర్తింపు దక్కించుకున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకపోగా, వైఎస్సార్ జిల్లాలో ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే దిశగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టిన అటువైపు మొగ్గు చూపకుండా విశ్వాసంగా ఉండడం, పార్టీ కోసం శక్తికి మించి శ్రమించడం ఇవన్నీ కలిసివచ్చాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పాతవారిని తొలగించి కొత్తవారిని మంత్రులుగా తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణల నేపథ్యంలో అంజద్‌బాషాను మళ్లీ మంత్రిపదవి వరించిందని పరిశీలకులు భావిస్తున్నారు. చేపట్టిన పదవులు అంజద్‌బాషా మదీనా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్‌గా,బుఖారియా విద్యాసంస్థ ఉపాధ్యక్షుడిగా, అల్ హజ్ ఎస్బి అబ్దుల్ ఖాదర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి, హరూన్ ఛారిటబుల్ ట్రస్టు, నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూల్ అల్యూమిని అసోషియేట్లకు అధ్యక్షుడిగా ఉన్నారు. హౌస్ మసీదు కమిటీ కోశాధికారిగా, ఏపీ ముస్లిం కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా, ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా, కడప మున్సిపల్ కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2005లో కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్సీపీ కడప సమన్వయకర్త. 2014లో వైఎస్ఆర్సీపీ తరుపున పోటీ చేసి 45వేలపైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2016లో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు. 2018లో జనరల్ సెక్రెటరీ,2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్. సార్వత్రిక ఎన్నికల్లో 54వేల మెజార్టీతో విజయం సాధించారు. కుటుంబ నేపథ్యం కడప జిల్లా సిద్దవటంకు చెందిన జనాబ్ ఎస్బి హరూన్ సాహెబ్ 1935 నుంచి 1953 వరకు సుమారు 18 సంవత్సరాలు సిద్దవటం సర్పంచ్‌గా పనిచేశారు. సిద్దవటంలో హరూన్ సాహెబ్ అందించిన సేవలకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. హరూన్ సాహెబ్ కుమారుడైన అబ్దుల్ ఖాదర్ పెద్ద కుమారుడే ఎస్బి అంజద్‌బాషా. 1963లో వారి కుటుంబం వ్యాపార పరమైన సౌకర్యాల కోసం కడప నగరంలో స్థిరపడ్డారు. కడప, కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వీరికి వ్యాపారాలు ఉన్నాయి. నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూలులో ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు. సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాగుణంతో అంజద్‌బాషా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సేవా తత్పరతను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2005లో కాంగ్రెస్ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు. కడపకు మరో అవకాశం.. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాకు మంత్రిహోదా దక్కడంతో కడప నియోజకవర్గానికి మరోసారి అవకాశం దక్కింది. ఇదివరకు కడప నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రి హోదా దక్కించుకున్న వారి జాబితాలో అంజద్‌బాషా రెండోసారి చేరారు. ఎస్ రామమునిరెడ్డి(1983), సి రామచంద్రయ్య(1985), డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాషా(1999), ఎస్ఎండీ అహమ్మదుల్లా (2009), ఇదివరకు మంత్రి పదవులు అలంకరించారు. తాజాగా 2019లో అంజద్‌బాషాకు ఆ హోదా దక్కింది. ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది. కడప నుంచి మంత్రి హోదా దక్కించుకున్న వారిలో ఈయన ఐదో ఎమ్మెల్యే కాగా, గడిచిన 3 పర్యాయాలు పరిశీలిస్తే పదేళ్లకు ఓమారు కడప నియోజకవర్గానికి మంత్రి హోదా దక్కుతూ రావడం మరో విశేషం. -
ఇది సామాజిక కేబినెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక మహా విప్లవం తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించిన ధీరోదాత్తుడు సీఎం జగన్ అని కొనియాడారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని మరోసారి నిరూపించారని చెప్పారు. అన్ని రంగాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగ లేదన్నారు. ఈసారి 25 మంది మంత్రుల్లో 70% బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారన్నారు. మొదటి నుంచి వైఎస్సార్సీపీ ఈ వర్గాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. చంద్రబాబు ఏ సందర్భంలోనూ బీసీలకు న్యాయం చేయలేదని, ఏనాడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండలేదన్నారు. ఇప్పటి వరకు కేబినెట్లో ముగ్గురు మహిళలుండగా ఈసారి నలుగురికి అవకాశం ఇచ్చారన్నారు. ఇది ఎన్నికల కోసం చేసిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కాదని తెలిపారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. సామాజిక న్యాయం నినాదం కాదు.. నిజం ► సామాజిక న్యాయం అన్నది నినాదం కాదని, నిజం చేసిన ఏకైక సీఎం జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు బీసీలకు పదవులిస్తున్నారు. అన్నీ పరిశీలించాకే కేబినెట్ తుది జాబితా ఇచ్చారు. ► తరతరాలుగా పేదరికంలో ఉన్న వర్గాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఏర్పాటైనప్పటి నుంచి మనసా వాచా కర్మణా అడుగులు వేస్తోంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టింది మొదలు ఇదే విధానంతో ముందుకు వెళ్తున్నారు. ► పాదయాత్ర సమయంలో అన్ని బీసీ కులాలతో సమావేశమై.. వారి ఇబ్బందులపై అధ్యయనం చేయించి, ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేసి బీసీలకు తాను చేయబోయే మంచి గురించి జగన్ వివరించారు. 2019లో అధికారంలోకి రాగానే వాటిని ఆచరణలో పెట్టారు. ► గత కేబినెట్లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, 11 మంది ఓసీలకు అవకాశం కల్పించడం విప్లవాత్మక చర్య. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు కేబినెట్‌తో పోలిస్తే ఇది చాలా గొప్పది. బాబు బీసీలకు ఏమీ చేయలేదు. చంద్రబాబు అడ్డగోలుగా కేబినెట్‌ను నడిపారు ► సోమవారం ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను పరిశీలిస్తే సీఎం జగన్.. బీసీలకు 10, ఎస్టీ 1, మైనారిటీ 1, ఎస్సీలకు 5 స్థానాలు కేటాయించారు. బీసీలకు ఆత్మబంధువు అని చెప్పుకునే చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదు. ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం తప్ప. ► 2014లో 19 మందితో చంద్రబాబు ఆ వర్గాల వారికి 12 పదవులు మాత్రమే ఇస్తే.. ఇవాళ మేము 17 పదవులు ఇచ్చాం. నాడు ఎస్టీ, మైనార్టీలకు చోటే లేదు. అప్పుడు ఓసీ వారు 11 మంది కాగా, మిగిలిన అన్ని వర్గాల వారు కేవలం 8 మంది మాత్రమే. ► చంద్రబాబు తన కుమారుడిని కేబినెట్లోకి తీసుకోవడం కోసమే మంత్రి వర్గంలో మార్పులు చేశారు. 19 మందిలో ఐదుగురిని తీసేసి, 11 మందిని కొత్తగా తీసుకుని మొత్తం 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఓసీలు 15 మంది ఉన్నారు. చంద్రబాబు ఇలా అడ్డగోలుగా కేబినెట్‌ను నడిపారు. అందరూ అర్థం చేసుకుని సహకరిస్తున్నారు.. ► మొదటి నుంచీ సీఎం జగన్ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు 70 శాతానికి పెంచారు. గతంలో ముగ్గురు మహిళలు ఉండేవారు. ఈ రోజు నలుగురుకి అవకాశం కల్పించారు. ► నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తూ ఏకంగా చట్టమే చేశారు. ఇది ఎన్నికల కోసం చేసింది కాదు. ఈ విషయాన్ని మేధావులు అందరూ గమనించాలి. ► కేబినెట్ పదవి అన్నది అధికారమే తప్ప హక్కు కానేకాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 25 కేబినెట్ బెర్తులు మాత్రమే ఉన్నాయి. అందరికీ మంత్రులుగా అవకాశం రాదు. కొంత మందికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం. పదవి వస్తే ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదు. రాకపోతే ప్రాధాన్యత ఇవ్వనట్లు అసలే కాదు. ఈ విషయాన్ని అందరు ఎమ్మెల్యేలూ అర్థం చేసుకుని, సహకరిస్తున్నారు. ► దివాళా తీసిన టీడీపీ ఎక్కడ అలజడి రేగుతుందా.. అని ఎదురు చూస్తోంది. అసంతృప్తి ఉన్నట్లు ఎల్లో మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మా పార్టీలో అసంతృప్తికి చోటు లేదు. అవకాశం రాలేదనుకుంటే పొరపాటే ► రాబోయే ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించే నాయకులను జిల్లా స్థాయిలో కొంత మందిని, రాష్ట్ర స్థాయిలో మరికొంత మందిని వాడుకుంటాం. రకరకాల బాధ్యతలు ఇచ్చి ప్రా«ధాన్యత కల్పిస్తాం. అవకాశం రాలేదని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ► ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకు బీ ఫారం ఇచ్చి గెలిపించుకున్నది సీఎం జగన్ మాత్రమే. అందరిపై సీఎం జగన్‌కు ఒకే రకమైన అభిప్రాయం ఉంది. రాగద్వేషాలకు అతీతంగా కేబినెట్ కూర్పు చేశారు. జిల్లాలు, సామాజిక వర్గాలను బట్టి కూర్పులో ప్రాధాన్యత ఇచ్చారు. ► మహాయజ్ఞంలా రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది. వెనుకబడిన వర్గాలకు మొదటిసారిగా భారీ స్థాయిలో మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామికి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ముదునూరు ప్రసాదరాజు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్‌గా కొడాలి నానిని నియమించి ప్రాధాన్యత కల్పించారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అందరిని బ్యాలెన్స్ చేయడంలో సీఎం జగన్ సఫలీకృతం అయ్యారు. ► సీఎం దృష్టిలో పార్టీ పదవి, మంత్రి పదవి రెండూ ఒక్కటే. ఎక్కడైనా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తే నాయకులు సర్ది చెబుతున్నారు. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. -
ఏపీ నూతన కేబినెట్‌కు గవర్నర్ ఆమోదం
సాక్షి, విజయవాడ: నూతన మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారం (ఏప్రిల్ 11) ఉదయం 11 గంటల 31 నిమిషాలకు వెలగపూడి సచివాలయం ఆవరణలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రి వర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గతంలో మంత్రులుగా పనిచేసిన 11 మంది తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు నూతన మంత్రులకు గవర్నర్ శాఖలు కేటాయించనున్నారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) -
Jogi Ramesh: ముక్కు సూటితత్వం.. నిలదీసే లక్షణం..
ఎన్టీఆర్ జిల్లా: ముక్కు సూటితత్వం, ప్రశ్నించే గళం, నిలదీసే లక్షణం.. ఇవీ నాయకుడిగా జోగి రమేష్‌ను నిలబెట్టాయి. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ బీసీల అభివృద్ధి కోసం జరిగిన ఉద్యమాల్లో ముందు నిలిచారు. కృష్ణా జిల్లా ( ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా) ఇబ్రహీంపట్నంలో 1970లో జోగి మోహనరావు, పుష్పవతి దంపతులకు పుట్టిన జోగి రమేష్ బీఎస్సీ చదువుకున్నారు. జోగి రమేష్‌కు భార్య - శకుంతల దేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు జోగి రమేష్. కృష్ణాజిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా వివిధ పదవుల్లో పని చేశాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కాగిత వెంకట్రావు పై 1192 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగి రమేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారు. 2019లో పెడన నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. టీడీపీ అభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్ పై 7839 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో జోగి రమేష్‌ను పలు మార్లు లక్ష్యంగా చేసుకుంది తెలుగుదేశం. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపడానికి వెళ్లినప్పుడు జోగి రమేష్‌పై భౌతిక దాడికి ప్రయత్నించింది. ఆ ఘటనలో ఆయన కారును ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. -
Merugu Nagarjuna: పదునైన గళం.. అలుపెరుగని పోరాటం
గుంటూరు: ప్రజా ఉద్యమాల్లో సుదీర్ఘ ప్రస్థానం, దళిత సమస్యలపై అలుపెరుగని పోరాటం, అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా అడుగులేయడం.. ఇవి గుంటూరు జిల్లాలో మేరుగ నాగార్జున గురించి స్థానికులు చెప్పే మాటలు. దళితుల జీవితాలు చదువులతోనే మారతాయని ప్రతీ చోట చెప్పే మేరుగ నాగార్జున.. పార్టీ ఎజెండాను బలంగా వినిపించగల సత్తా ఉన్న నాయకుడు. స్వయంగా ఉన్నత చదువులు చదివిన మేరుగ నాగార్జున.. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించారు. సమస్య వచ్చిందంటే చాలు రాత్రనక, పగలనక ప్రజల్లోకి దూసుకెళ్లే తత్వం ఉన్న మేరుగ నాగార్జున ఇప్పుడు మంత్రిగా తన పరిధిని మరింత విస్తృతం చేసుకోబోతున్నారు. నేపథ్యం మేరుగు నాగార్జున జూన్ 15, 1966లో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించాడు. వెల్లటూరులోనే పదో తరగతి వరకు చదివాడు. 1982లో ఇంటర్మీడియట్, 1985లో రేపల్లె లోని ఏబిఆర్ డిగ్రీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 1987లో ఎం.కామ్, 1989లో ఎంఫిల్, 1994లో పి.హెచ్.డి పూర్తి చేశాడు. ఉద్యమ జీవితం విద్యార్థి జీవితం నుంచే ఉద్యమాలకు ఆకర్షితుడయిన మేరుగ నాగార్జున.. కాలేజీ రాజకీయాల్లో చైతన్యంగా ఉండేవాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ప్రస్థానం 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేమూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఎస్సీ & ఎస్టీ కమిషన్‌కు చైర్మన్ గా నియమితుడయ్యారు. 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గా పని చేశాడు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న వేమూరు నియోజకవర్గం నుంచి 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ప్రజా సమస్యలపై పదునైన గళం దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యలు చేసినప్పుడు.. కడిగిపారేశారు మేరుగ నాగార్జున. 40 ఏళ్ల అనుభవం దళితులను అవమానించడమేనా అని ప్రశ్నించిన మేరుగ నాగార్జున.. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని బలంగా డిమాండ్ చేశారు. -
RK Roja: రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఆమెకు సరిలేరు
నిజ జీవిత కథలు సినిమాలు అవుతాయి. కానీ సినిమా కథలు జీవితంగా మారుతాయన్న దానికి నిదర్శనం. ఒకే వ్యక్తి వేర్వేరు రంగాల్లో రాణించడం కూడా రోజాకే చెల్లుబాటయింది. సినీ నటిగా ఎంత పేరు తెచ్చుకుందో, బుల్లి తెర వ్యాఖ్యాతగా అంతే స్థాయిలో రాణించిన రోజా… రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేశారు. కుటుంబ నేపథ్యం రోజా అసలు పేరు శ్రీలత. 17/ 11 /1972న జన్మించారు. తండ్రి కుమారస్వామి రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కి వలస వెళ్లారు. రోజా నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ అందుకున్నారు. కొన్ని సంవత్సరాలు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు చిత్రం ద్వారా సినిమాలకు పరిచయమయ్యారు రోజా. దానికంటే ముందు తమిళచిత్రం చంబరతి చిత్రంలో నటించారు. ఆ సినిమా తమిళంలో మ్యుజికల్ హిట్. తెలుగులో చేమంతి కింద డబ్ చేశారు. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణి రూపొందించాడు. ఆయనతోనే ప్రేమలో పడిపోయిన రోజా పెద్దల అంగీకారంతో దంపతులయ్యారు. వీరికి కుమార్తె అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు. రాజకీయ ప్రస్థానం 2004లో రాజకీయాల్లోకి వచ్చిన రోజా నగరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి వారి చెంగారెడ్డి పై పోటీ చేశారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోటీ చేశారు కానీ ఫలితం దక్కలేదు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో చేరిన రోజా.. ఆ తర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు నగరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత గాలి ముద్దుకృష్ణనాయుడు పై విజయం సాధించిన రోజా.. 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ పై గెలిచి సత్తా చాటారు. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా,ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఆర్కే రోజా.. ఏ మాత్రం తేడా వచ్చినా విపక్షాలను తూర్పూరపట్టగలరు. తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేయడంలో ఆమెకు సరిలేరు. 2020 నుంచి రెండేళ్ల పాటు ఏపిఐఐసి చైర్ పర్సన్ గా పనిచేశారు. -
Vidadala Rajini: ఆమె ఒక సంచలనం... ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ..
జీవితంలో ఊహించనన్ని మలుపులు సినిమాలో కనిపిస్తాయి కానీ.. అందుకు సాక్షాత్తు నిదర్శనం విడదల రజని. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాదు.. అందుకు తగ్గట్టుగా రాణించడం, తనకు తానుగా నాయకురాలిగా ఎదగడం, ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో నాయకురాలిగా నిలబడడం లాంటి ఎన్నో ఘటనలు విడదల రజనీ జీవితంలో కనిపిస్తాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలవడమే ఒక సంచలనం అయితే... 32 ఏళ్లకే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విడదల రజనీ జీవితంలో మరో విశేషం. అతి తక్కువ కాలంలో ప్రజల్లో మంచి అభిమానం సంపాదించుకున్న విడదల రజనీకి సోషల్ మీడియాలో లక్షలాది అభిమానులున్నారు. నేపథ్యం హైదరాబాద్‌లో 24-06-1990న పుట్టిన విడదల రజనీ.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాదు మల్కాజ్గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రజనీ 2011లో బి.ఎస్.సి. పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేసిన రజనీ... విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజనీకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. అమెరికా జీవితం భర్త కుమారస్వామితో కలిసి సాఫ్ట్‌వేర్‌లో పని చేసిన విడదల రజనీ.. మెరుగైన అవకాశాల కోసం భారతీయ యువతలాగే అమెరికా బాట పట్టారు. భర్తతో కలిసి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీ నేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్‌గా సేవలు అందించారు. సమాజసేవ కోసం ఏపీకి తిరుగు పయనం కొన్నాళ్లు అమెరికాలో ఉండి ఏపీకి తిరిగి వచ్చిన విడదల రజనీ.. 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. సొంత మనుషులు, సొంత గ్రామానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో వీఆర్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 2018వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి, అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొట్ట తొలి బీసీ మహిళగా చరిత్ర సృష్టించారు. శాసనసభ వేదికగా.. తనదైన శైలిలో వివిధ ప్రజా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై గళం విప్పారు రజనీ. ఉత్సాహంగా ఉండడం, నిత్యం ప్రజల్లో ఉండడం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండడం రజనీకి కలిసొచ్చిన అంశాలు. -
AP New Cabinet: నూతన కేబినెట్‌పై సజ్జల కీలక ప్రెస్‌మీట్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'వైఎస్ జగన్ మొదటి కేబినెట్ సామాజిక విప్లవం. ఇప్పుడు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ద్వారా సామాజిక మహావిప్లవం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశాం. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారు. బీసీలంటే బ్యాక్వార్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ క్లాస్ మరోసారి నిరూపించాం. అన్ని రంగాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. సీఎం జగన్ తొలి కేబినెట్లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చోటిచ్చారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ సారి 25 మందిలో 70 శాతం బడుగు బలహీనవర్గాలే. మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకు పెద్దపీట వేస్తోంది. చంద్రబాబు హయాంలో 48 శాతమే బడుగు బలహీనవర్గాల వారున్నారు. చంద్రబాబు ఏ సందర్భంలోనూ బీసీలకు న్యాయం చేయలేదు. ఇప్పటివరకు కేబినెట్లో ముగ్గురు మహిళలుండగా ఈసారి నలుగురికి అవకాశం ఇచ్చారు. ఇది ఎన్నికల కోసం చేసిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కాదు. మన పార్టీ మొదట నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తోంది' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) -
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
-
రండి.. మంత్రివర్గంలో చేరండి
తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక బెయిలౌట్ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రతిపక్షాలకు ప్రభుత్వ ఏర్పాటునకు పిలుపు ఇచ్చాడు. అంతా కలిసి కేబినెట్ ఏర్పాటు చేద్దామంటూ పిలుపు ఇచ్చాడు. అఖిలపక్ష ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంపై నెలకొన్న ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ఈ మేరకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ఏర్పాటునకు ముందుకు రావాలంటూ ఆయన అన్ని పార్టీలకు సందేశం పంపారు. ఈ మేరకు రాజపక్స ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. నిరసనలు తారాస్థాయికి చేరుతున్న క్రమంలో.. కొత్త కేబినెట్‌పై ఇవాళే ఓ కొలిక్కి రావాలని అధ్యక్ష భవనం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక.. లంక కేంద్ర కేబినెట్లోని 26 మంత్రులంతా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సైతం సోమవారం తన పోస్టుకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని పదవిని వీడని మహీంద రాజపక్స.. సోమవారం ఉదయం అధ్యక్ష భవనానికి చేరుకుని రాజకీయం మొదలుపెట్టాడు. మొత్తం ఐదుగురు రాజపక్స కుటుంబ సభ్యులు మంత్రివర్గంలో ఇదివరకు ఉన్నారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స(రక్షణ మంత్రిగా), ప్రధాని మహీంద రాజపక్స, ఇరిగేషన్ మినిస్టర్ చామల్ రాజపక్స, బసిల్ రాజపక్స, ప్రధాని మహీంద తనయుడు నమల్ రాజపక్స క్రీడాశాఖ మంత్రిగా ఉన్నారు ఇంతకాలం. అంతేకాదు.. ఇతర ప్రధాన పోస్టింగ్‌లోనూ కుటుంబ పాలనే నడుస్తోంది అక్కడ. దీంతో దోచుకున్న సొమ్మును ఈ కష్టకాలంలో ప్రజల కోసం ఖర్చు చేయాలంటూ ప్రజలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు అధ్యక్షుడి కేబినెట్ ఆఫర్ పట్ల ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయనేది తెలియాల్సి ఉంది. ప్రతిపక్ష నేత సాజిత్ మాత్రం మంత్రుల రాజీనామాను ఓ మెలోడ్రామాగా అభివర్ణించడం విశేషం. -
సరికొత్త ప్రయోగం: విజయ్ రూపానీ మంత్రివర్గంలోని వారికి నో ఛాన్స్
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని కూడా సిద్ధం చేశారు. గుజరాత్ కొత్త మంత్రులు గురువారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 24 మంది మంత్రులతో కూడిన కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వారందరితో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం జరిగింది. అయితే ఈసారి అంతా కొత్తవారే మంత్రులుగా నియమితులు కావడం విశేషం. గుజరాత్ మంత్రివర్గంతో సరికొత్త ప్రయోగం బీజేపీ చేపట్టింది. విజయ్ రూపానీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారెవరికీ కూడా కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. 2022 ఎన్నికలకు భూపేంద్ర పటేల్ ఈ టీమ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామాతో గుజరాత్లో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. చదవండి: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు కొత్త మంత్రులు వీరే.. గజేంద్ర సిన్హ్ పర్మార్, రాఘవ్జీ మక్వానా, వినోద్ మొరాడియా, దేవభాయ్ మాలం, హర్ష్ సంఘ్వీ, ముఖేశ్ పటేల్, నిమిష సుతార్, అర్వింద్ రాజ్యాని, కుబేర్ దిన్‌దాన్, కీర్తిసిన్హ్ వాఘేలా, జగ్జీశ్ పంచాల్, బ్రిజేశ్ మెర్జా, జితూ చౌదరి, మనీశ వకీల్, కానూ భాయ్ దేశాయ్, కీర్తిసిన్హ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్‌సిన్హ్ పర్మార్, అర్జున్ సిన్హ్ చౌహాన్, రాజేంద్ర త్రివేది, జితూ వాఘానీ, రిషికేశ్ పటేల్, రాఘవ్జీ పటేల్, పూర్ణేశ్ మోదీ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపి గుజరాత్ మార్క్ పాలనను కొనసాగించాలని ఆకాక్షించారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం -
కర్ణాటక హోం మంత్రిగా జ్ఞానేంద్ర
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కొత్త కేబినెట్లో మంత్రులకు శనివారం శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖను మొదటిసారిగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. గత యడియూరప్ప ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులను తిరిగి అవే శాఖలను అప్పగించారు. కీలకమైన ఆర్థిక శాఖను సీఎం బొమ్మై తన వద్దే ఉంచుకున్నారు. దీంతోపాటు, ఇంటెలిజెన్స్, కేబినెట్ వ్యవహారాలు, బెంగళూరు అభివృద్ధి, కేటాయించని ఇతర శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. బెంగళూరు నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ‘బెంగళూరు డెవలప్మెంట్’ శాఖను నగరానికి చెందిన సీనియర్ మంత్రికి అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ, పోటీదారులు ఎక్కువ కావడం వల్లే సీఎం ఎవరికీ ఈ పోస్టును కేటాయించలేదని భావిస్తున్నారు. కాగా, శాఖల కేటాయింపుపై ఆనంద్ సింగ్, ఎంటీ బీ నాగరాజ్ బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్య పరిష్కరిస్తానని సీఎం బొమ్మై తెలిపారు. కాగా, వీరిద్దరూ గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును వీడి, బీజేపీ సర్కారు ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. కర్ణాటక సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన కేబినెట్లోని 29 మందికి మంత్రిత్వ శాఖలు కేటాయించారు. గత యడియూరప్ప కేబినెట్లోని 23 మందితోపాటు కొత్తగా ఆరుగురికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా కీలకమైన హోం శాఖను కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. మొదటిసారిగా కేబినెట్లో చోటు దక్కిన జ్ఞానేంద్రకు ఈ విధంగా జాక్‌పాట్ తగిలింది. అదేవిధంగా, ముఖ్యమైన విద్యుత్ శాఖతోపాటు కన్నడ, సాంస్కతిక శాఖను వి.సునీల్‌కుమార్‌కు కేటాయించారు. పాత వారిలో 17 మందికి గత శాఖలనే కొనసాగించగా, వీరిలో 8 మంది కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. అరగా జ్ఞానేంద్ర, సునీల్ కుమార్ సహా కొత్తగా చేర్చుకున్న వారికి, బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలున్నాయి. మిగతా నలుగురిలో.. కె.ఎస్. ఈశ్వరప్పకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు, ఆర్–అశోకకు రెవెన్యూ, కోటా శ్రీనివాస పూజారికి సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, బీసీ నగేశ్‌కు ప్రాథమిక, సెకండరీ విద్య దక్కాయి. -
కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్థేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంత్రిత్వశాఖల కేటాయింపు తర్వాత తొలిసారిగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుండగా.. మంత్రుల మండలి రాత్రి 7 గంటలకు సమావేశం కానుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రధాన మంత్రి కేంద్ర మంత్రివర్గ సమావేశాలతో పాటు మంత్రుల మండలి సమావేశాలను జరపడం సర్వసాధారణం. నిన్న జరిగిన సమావేశంలో 15 మంది క్యాబినెట్ మంత్రులు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఇక ఏడుగురు మంత్రుల క్యాబినెట్ ర్యాంకుకు పెంచారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో 43 మంది నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. -
మోదీ కేబినెట్లో భారీ ప్రక్షాళన
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తాజా కేబినెట్లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఈ మేరకు పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్, విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దేవశ్రీ చౌదరి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి సంజయ్ ధోత్రే, కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియోలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 12 మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. వరుసగా.. 1.సదానందగౌడ 2.రవిశంకర్‌ప్రసాద్ 3.థావర్‌చంద్ గెహ్లాట్ 4.రమేశ్ పోఖ్రియాల్ 5.హర్షవర్థన్ 6. ప్రకాశ్ జవదేకర్ 7.సంతోష్‌కుమార్ గాంగ్వార్ 8.బాబుల్ సుప్రియో 9.సంజయ్ దోత్రే 10.రతన్‌లాల్ కతారియా 11.ప్రతాప్‌చంద్ర సారంగి 12.దేవశ్రీ చౌదరి -
కేజ్రీ.. ముచ్చటగా మూడోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(51) ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదానం వేదిక కానుంది. మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్ ఈసారి.. రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులు ఉంటారని ఆప్ నేత మనీశ్ సిసోడియా వెల్లడించారు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సుమిత్ నగల్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐఐటీ సీటు సాధించిన విజయ్ కుమార్, మొహల్లా క్లినిక్ డాక్టర్ ఆల్కా, బైక్ అంబులెన్స్ సర్వీస్ అధికారి యుధిష్టిర్ రాఠీ, నైట్ షెల్టర్ కేర్ టేకర్ సబీనా నాజ్, మెట్రో పైలట్ నిధి గుప్తా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి 1.25లక్షల మంది ప్రజలు తరలివస్తారని భావిస్తున్నామని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రధాని మోదీతోపాటు ఢిల్లీకి చెందిన బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రజలను ఆహ్వానించారు. రాంలీలా మైదానం, పరిసరాల్లో ఢిల్లీ పోలీసు, పారామిలిటరీ దళాలు, సీఆర్పీఎఫ్ కలిపి సుమారు 3 వేల మందిని మోహరించనున్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతోపాటు మైదానం చుట్టుపక్కల బ్యాగేజి స్కానర్లను, డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లను అమర్చారు. మైదానంలోపలా బయటా ‘ధన్యవాద్ ఢిల్లీ’ అంటూ కేజ్రీవాల్ ఫొటో ఉండే భారీ కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ జారీ చేసిన ఆదేశాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కోరారు. ఈ ఆదేశం నియంతృత్వాన్ని తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానిం చారు. ఉపాధ్యాయులకు తాము ఆహ్వానాలు పంపామేతప్ప, ఆదేశాలు కాదని ఆప్ నేత మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. కాబోయే మంత్రులకు కేజ్రీవాల్ విందు ఢిల్లీ అభివృద్ధి కార్యాచరణతోపాటు వచ్చే మూడు నెలల్లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కేజ్రీవాల్ కాబోయే మంత్రులతో చర్చించారు. గత మంత్రివర్గంలోని ఆరుగురికి శనివారం తన నివాసంలో కేజ్రీవాల్ విందు ఇచ్చారు. ఢిల్లీలో రెండు కోట్ల మొక్కలు నాటడం, యమునా నదిని శుద్ధి చేయడం, కాలుష్యం తగ్గించడం వంటి ప్రజలకిచ్చిన 10 హామీల అమలుకు రంగంలోకి దిగాలని సహచరులను కేజ్రీవాల్ కోరారని ఆప్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు. గత మంత్రివర్గంలో ఉన్న సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్ సహా ఆరుగురు మంత్రులు కేజ్రీవాల్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
6న కర్ణాటక కేబినెట్ విస్తరణ
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. కేబినెట్‌ను ఈనెల 6వ తేదీన విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ‘ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లో 13 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తారు’అని ఆదివారం సీఎం వెల్లడించారు. వీరిలో కాంగ్రెస్, జేడీఎస్ తదితర పార్టీల నుంచి బీజేపీలో చేరిన 10 మంది ఉన్నారని తెలిపారు. అన్ని ప్రాంతాలకు, కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం లింగాయత్‌లు 8 మంది, వొక్కలిగలు ముగ్గురు, ఎస్సీలు ముగ్గురు, ఇద్దరు ఓబీసీలు, బ్రాహ్మణ, ఎస్టీల నుంచి ఒక్కరు చొప్పున కేబినెట్లో ప్రాతినిధ్యం ఉంది. మంత్రివర్గం పరిమితి 34 మంది కాగా, ముఖ్యమంత్రి సహా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 18 మంది మంత్రులున్నారు. ఆరు నెలల క్రితం అధికారపగ్గాలు చేపట్టిన యడియూరప్ప కేబినెట్ విస్తరణపై రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ఎట్టకేలకు జనవరి 31వ తేదీన బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. -
ఫిన్‌ల్యాండ్ కేబినెట్లో 12 మంది మహిళలు
హెల్సింకి: ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ తన కేబినెట్లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30–35 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఆమె కేబినెట్లో ఏడుగురు పురుషులు కూడా ఉన్నారు. ఆర్థికం, విద్య, అంతర్గత వ్యవహారాలు వంటి ముఖ్యశాఖలన్నీ మహిళలకే అప్పగించారు. 34 ఏళ్ల వయసున్న సన్నా మారిన్ మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కొని నెగ్గారు. మారిన్‌కు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 70 ఓట్లు వచ్చాయి. ఫిన్‌ల్యాండ్‌లో అధికారంలో ఉన్న సెంటర్ లెఫ్ట్ సంకీర్ణ సర్కార్‌ను నడపడం ఆమె ముందున్న అతి పెద్ద సవాల్. ‘‘మర్యాద మన్ననల మధ్య ప్రతీ చిన్నారి ఎదుగుదల ఉండాలి. ఎవరైనా ఏదైనా సాధించేలా సమాజాన్ని నిర్మించడమే నా ధ్యేయం‘‘అని మారిన్ ట్వీట్ చేశారు. దేశంలో పోస్టల్ సమ్మెను ఎదుర్కోవడంలో విఫలమైనందుకు గతవారంలో అంటి రిన్నె ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మారిన్ పగ్గాలు తీసుకున్నారు. సెంటర్ పార్టీకి చెందిన కత్రి కులుమణి (32)కి ఆర్థిక శాఖ, గ్రీన్ పార్టీ నాయకురాలు మారియా ఒహిశాలో (34)కు అంతర్గత వ్యవహారాలు, లెఫ్ట్ కూటమి చైర్‌వుమెన్ లీ అండెర్సన్ (32)కు విద్యాశాఖ అప్పగించారు. కార్మికుల అసంతృప్తి జ్వాలలు, ఎటు చూసినా సమ్మెలు నడుస్తున్న వేళ ప్రధానిగా మారిన్ తన ఎదుట ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. -
యోగి కేబినెట్లో మరో 18 మంది
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండున్నరేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని బుధవారం విస్తరించింది. 18 మందికి కొత్తగా మంత్రిపదవులు దక్కగా, సహాయ మంత్రులుగా ఉన్న మరో ఐదుగురికి కేబినెట్ మంత్రులుగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుత మంత్రివర్గంలోని ఐదుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. 18 మంది కొత్త, 5 మంది పదోన్నతి పొందిన.. మొత్తం 23 మంది మంత్రుల చేత గవర్నర్ ఆనందీబెన్ పటేల్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ఈ 23 మందిలో ఆరుగురు కేబినెట్ మంత్రులుగా, మరో ఆరుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, ఇంకో 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన సురేశ్ రాణా, మహేంద్ర సింగ్, భూపేంద్రసింగ్ చౌదరి, అనిల్ రాజ్భర్లు గతంలో స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా ఉన్నవారే. కేబినెట్ మంత్రుల్లో కమల్ రాణి ఒక్కరే మహిళ. -
ఎట్టకేలకు యడియూరప్ప కేబినెట్
సాక్షి, బెంగళూరు: గత నెల 26వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఎట్టకేలకు మంగళవారం కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సుమారు నెల రోజులపాటు సాగిన తిరుగుబాటు పర్వం తరువాత కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును సాగనంపి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కడం తెలిసిందే. అనేక కసరత్తుల అనంతరం 17 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం మంగళవారం ఏర్పాటయింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ వజుభాయివాలా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాగా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. నాటి ముఖ్యమంత్రి, నేటి మంత్రి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన వీరశైవ–లింగాయత్, ఒక్కలిగ, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎక్కువ పదవులు దక్కాయి. 2008లో కర్ణాటక సీఎంగా పనిచేసిన జగదీశ్ శెట్టర్ ఈసారి మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్లీ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. మాజీ డిప్యూటీ సీఎంలు కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక కేబినెట్లో ఉన్నారు. మరో 16 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా 17 జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. -
ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి..
న్యూఢిల్లీ: గతంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత కొన్నేళ్లు కనిపించకుండాపోయి మళ్లీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం ద్వారా తెరపైకి వచ్చారు కొందరు ప్రముఖులు. అర్జున్ ముండా, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే తదితరులు అలాంటి వారిలో ఉన్నారు. వీరికి కేంద్రంలో మంత్రిపదవులు దక్కడం తెలిసిందే. అర్జున్ ముండా జార్ఖండ్‌కు, రమేశ్ పోఖ్రియాల్ ఉత్తరాఖండ్‌కు గతంలో సీఎంలుగా చేశారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన, అర్జున్ ఓడిపోవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. అర్జున్ గిరిజనుడు కావడం, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేందుకే ఆయనకు కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అలాగే అనేక ఆరోపణల కారణంగా 2011లో సీఎం పదవి కోల్పోయిన పోఖ్రియాల్‌ను ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచింది. 2014లో ఎంపీగా పోటీ చేయించగా, ఆయన గెలిచినా మంత్రిపదవి మాత్రం ఇవ్వలేదు. 2017లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచినా సీఎం పదవి దక్కలేదు. ఇప్పుడు మాత్రం పోఖ్రియాల్‌కు కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖను కేటాయించారు. జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయక వైద్యంలో పోఖ్రియాల్ మంచి నిపుణుడు. విద్యా వ్యవస్థలో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే పోఖ్రియాల్‌కు బీజేపీ ప్రభుత్వం హెచ్ఆర్డీ శాఖ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రహ్లాద్ పటేల్ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం 2014లో ప్రహ్లాద్‌ను మంత్రిగా నియమించలేదు. ప్రస్తుతం ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా నియమితులయ్యారు. ఇక ఫగ్గన్ సింగ్ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తే. గిరిజనుడైన ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలుత ఆయనకు మంత్రిపదవి దక్కినప్పటికీ ఆ తర్వాత పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్ బాల్యన్‌ది కూడా ఇదే పరిస్థితి. ఫగ్గన్ సింగ్, సంజీవ్‌లకు తాజా ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
కిషన్‌రెడ్డికి కీలక శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి కీలకమైన హోం శాఖను కేటాయిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. సహాయ మంత్రి పదవి అయినప్పటికీ అది హోం శాఖ కావడంతో కిషన్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించనున్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎల్.కె.అద్వానీ నంబర్ –2 హోదాలో ఉన్నారు. అప్పుడు ఆయన కేంద్ర హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో తెలంగాణలోని కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన సీహెచ్ విద్యాసాగర్ రావుకు హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించింది. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే. నరేంద్ర మోదీ తరువాత నంబర్ –2 స్థానంలో ఉన్న అమిత్‌షా ఇప్పుడు హోం మంత్రి. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించడం విశేషం. అమిత్‌షా వంటి బలమైన నాయకుడి నేతృత్వంలో కేంద్ర హోం శాఖలో సహాయ మంత్రి పదవి బాధ్యతలు స్వీకరిస్తుండడం కిషన్‌రెడ్డికి కలిసిరానుంది. హోం శాఖలో సరిహద్దు నిర్వహణ, దేశ అంతర్గత భద్రత, కశ్మీర్ వ్యవహారాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన తదితర విభాగాలు ఉన్నాయి. నిత్యానంద్కూ హోం శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. -
మోదీ..ముద్ర!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కొత్త కేబినెట్లో శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. అమిత్ షా, రాజ్‌నాథ్, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్.. తదితర కీలక నేతలకు మోదీ ఏ శాఖలు అప్పగించనున్నారనే దానిపై ఉత్కంఠ వీడింది. తన సన్నిహితులకు, విధేయులకు కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా తనదైన ముద్ర వేశారు. ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన హోం శాఖను ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి దారులు పరిచిన సన్నిహితుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అప్పగించారు. అదేవిధంగా, సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌కు రక్షణ శాఖను, నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ, గడ్కారీకి రోడ్డు రవాణా, రహదారుల శాఖతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలను అప్పగించారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రధాని మోదీతోపాటు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్, జైశంకర్ తదితరులు శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు. షా రాకతో..తగ్గనున్న ఎన్ఎస్ఏ ప్రాధాన్యం గత ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఎన్కే దోవల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఆయనే తీసుకునేవారు. కానీ, అమిత్ షా రాకతో ఈసారి ఆయన ప్రాధాన్యం తగ్గిపోనుంది. ప్రభుత్వంలో నంబర్–2గా మారనున్న అమిత్ షాయే రక్షణ సంబంధ విషయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. హోం మంత్రిగా అమిత్ షా కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370, 35 ఏ అంశాలతోపాటు ఉగ్రవాదం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మావోయిస్టుల ముప్పు, అస్సాం పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ వంటి వాటిపై ప్రముఖంగా దృష్టిసారించాల్సి ఉంది. అదేవిధంగా ప్రధానితోపాటు హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన ఎంతో కీలకమైన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ స్థానంలో అమిత్ షా, జై శంకర్ చేరారు. పలువురికి అదనపు బాధ్యతలు గత మంత్రి వర్గంలో రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయెల్‌కు ఈసారి వాణిజ్య, పరిశ్రమల శాఖ అదనంగా కేటాయించారు. ఆయనే నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖను మాత్రం కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న ప్రహ్లాద్ జోషికి ఇచ్చారు. జోషికి పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల శాఖను కూడా కేటాయించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆ పార్టీకి కంచుకోటగా భావించే అమేథీలో ఓడించిన స్మృతీ ఇరానీకి జౌళి శాఖతోపాటు ఈసారి మహిళా శిశు అభివృద్ధి శాఖలను ఇచ్చారు. గత మంత్రి వర్గంలో మాదిరిగానే ధర్మేంద్ర ప్రధాన్ ఈసారి కూడా పెట్రోలియం శాఖ ఇచ్చారు. దీంతోపాటు ఉక్కు మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించారు. రవి శంకర్ ప్రసాద్‌కు ఈసారి కూడా న్యాయ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాధ్యతలు ఇచ్చారు. దీంతోపాటు టెలికం శాఖను ఇచ్చారు. ప్రకాశ్ జవడేకర్‌కు ఈసారి పర్యావరణ శాఖతోపాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల బాధ్యతలను, నరేంద్ర సింగ్ తోమర్‌కు వ్యవసాయ శాఖతోపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ బాధ్యతలు ఇచ్చారు. జైట్లీ బాధ్యతలు నిర్మలకు.. నిర్మలా సీతారామన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అనారోగ్య కారణాలతో కేబినెట్‌కు దూరంగా ఉన్న సీనియర్ నేత, గత కేబినెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బాధ్యతలను ఈసారి నిర్మలకు కేటాయించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టనున్న రెండో మహిళా మంత్రిగా> ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. గతంలో ఇందిరాగాంధీ కొంతకాలం పాటు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. గత కేబినెట్లో ఆమెను రక్షణ మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. దౌత్యాధికారులకు అందలం ఊహించని విధంగా కేబినెట్లో చోటు దక్కించుకున్న విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జై శంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖ బాధ్యతలను అప్పగించారు. విదేశాంగ శాఖ బాధ్యతలను చేపట్టిన మొదటి దౌత్యాధికారి ఈయనే. ఏ సభలోనూ ఆయన సభ్యుడు కాదు. దీంతో నిబంధన ప్రకారం ఆరు నెలల్లోగా ప్రభుత్వం ఆయనకు సభ్యత్వం కల్పించే అవకాశం ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ చేసిన జై శంకర్..దౌత్యాధికారిగా విశేష అనుభవం గడించారు. రష్యా, చైనా, అమెరికాల్లో భారత్ తరపున వివిధ హోదాల్లో దౌత్యాధికారిగా సేవలందించారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కేబినెట్లో చోటు దక్కిన మాజీ దౌత్యాధికారి హర్దీప్ పూరికి పౌర విమానయాన, పట్టణాభివృద్ధి శాఖ(స్వతంత్ర హోదా)తోపాటు, వాణిజ్య పరిశ్రమల శాఖ బాధ్యతలు ఇచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్కే సింగ్‌కు విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ అప్పగించారు. టార్గెట్ 35ఏ కశ్మీర్‌పై అమిత్ షా గురి బీజేపీలో నంబర్ టూ స్థానంలో ఉన్న అమిత్ షా దేశానికి కొత్త హోం మంత్రి అయ్యారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, అక్రమ వలసలను అరికట్టడం నూతన హోం మంత్రి ప్రా«థమ్యాలు.అలాగే, ఎన్ఆర్సీ(జాతీయ పౌరసత్వ బిల్లు)ని దేశ మంతా అమలు పరచడం, జమ్ము,కశ్మీర్లో 35ఏ అధికరణను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు కూడా అమిత్ షా తీసుకునే అవకాశం ఉంది. 35ఎ అధికరణం కశ్మీరీలకు(స్థానికులు) ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పిస్తోంది. కశ్మీర్లో మహిళలు, శాశ్వత నివాసులు కానివారి పట్ల వివక్ష చూపుతున్న రాజ్యాంగంలోని 35ఎ అధికరణను రద్దు చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. 35 ఎ అధికరణ రాష్ట్రాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉందని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్లో ప్రజలందరి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలిచ్చే 370వ అధికరణను జనసంఘ్‌లో ఉన్నప్పటి నుంచీ అమిత్ షా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అక్రమ వలసలను అరికట్టడం కోసం ఎన్ఆర్సిని దేశమంతా అమలు చేస్తామని కూడా షా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హోం మంత్రిగా అమిత్ షా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. అపర చాణుక్యుడిగా పేరొందిన అమిత్‌షా మోదీకి అత్యంత విశ్వాస పాత్రుల్లో ఒకరు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా ఆ రాష్ట్ర హోం మంత్రిగా పని చేశారు. దేశంలో మావోయిస్టు హింస పెరుగుతుండటం, కశ్మీర్లో తీవ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరించడం షా ముందున్న ప్రధాన సవాళ్లని పరిశీలకులు అంటున్నారు. కశ్మీర్లో తీవ్రవాదాన్ని బలప్రయోగంతో అణచివేయాలా లేక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలా అన్నది నిర్ణయించడం ఆయన ఎదుర్కొనే మరో కీలకాంశం. సుప్రీం కోర్టు విధించిన గడువు జూలై 31 ఎన్ఆర్సి ప్రక్రియను పూర్తి చేయం, ఆంతరంగిక భద్రత పరిరక్షణ షా ముందున్న మరికొన్ని సవాళ్లు. -
...అను నేను!
‘మై నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఈశ్వర్‌కీ శపథ్ లేతా హూ కీ మై విధిద్వారా స్థాపిత్ భారత్‌కే సంవిధాన్ ప్రతి సచ్చీ శ్రద్ధా, ఔర్ నిష్టా రఖూంగా...’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులూ ప్రమాణం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా.. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ...’ అని ప్రమాణం చేశారు. దేశంలోని రాజ్యాంగబద్ధమైన పదవులను అధిష్టించే నేతలు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం ఈ తరహాలో ప్రమాణంచేయాలి. ఈ ప్రమాణస్వీకార సమయంలోనే అధికారిక రహస్యాలకు సంబంధించి మరో ప్రమాణం చేయాలి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ఆర్టికల్ 75(4) ప్రకారం ఈ రెండు ప్రమాణస్వీకారాలు చేశాకే ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు బాధ్యతలు చేపట్టాలి. కేంద్ర మంత్రి ప్రమాణం.. ‘...అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాననీ, కేంద్రమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తాననీ, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. అదే సమయంలో అధికారిక రహస్యాలకు సంబంధించి, ‘...అనే నేను కేంద్రమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని మరో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. కుర్తా–పైజామాదే అధిపత్యం రాష్ట్రపతిభవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా హిందీ ఆధిపత్యం నడిచింది. ప్రధాని మోదీ సహా మెజారిటీ మంత్రులు హిందీలో ప్రమాణస్వీకారం చేయగా, కొందరు మాత్రం ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఇక ఈ వేడుకకు హాజరైన ఎంపీల్లో చాలామంది సంప్రదాయ కుర్తా–పైజామాను ధరించి వచ్చారు. కొంతమంది మాత్రం షర్టులు–ఫ్యాంట్లు వేసుకొచ్చారు. మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి రాగానే సభికులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. -
అమిత్ షాకు ఆర్థిక శాఖ..?
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కేంద్ర ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు చెప్పినట్లు ఇండియా టుడే గురువారం వెల్లడించింది. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న జైట్లీ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోసారి మంత్రిపదవి చేపట్టే ఓపిక తనకు లేదని ఆయన ఇప్పటికే మోదీకి స్పష్టం చేశారు. మోదీ, రాజ్‌నాథ్ తర్వాత మూడో స్థానంలో అమిత్ షా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో మోదీ తర్వాత మంత్రివర్గంలో రెండో కీలక వ్యక్తి రాజ్‌నాథేననీ, ఆయన గతంలో చేపట్టిన హోం మంత్రి పదవిలో ఇప్పుడు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. జైట్లీ అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్నప్పుడు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్ పనిచేశారు. దీంతో ఆర్థిక మంత్రి పదవి గోయల్‌కు దక్కవచ్చని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాకు ఆర్థిక మంత్రిగా పనిచేసి, వృద్ధిని పరుగులు పెట్టించాలంటే అనుభవం అవసరం. అయితే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అమిత్‌షా ఇప్పుడు కేబినెట్లోకి రావడంతో కీలకమైన ఆర్థిక శాఖను ఆయన పార్టీ మాదిరే నేర్పుగా నడిపిస్తారని అంటున్నారు. గత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ కూడా ఆరోగ్య సమస్యల కారణంగానే ఈసారి పదవి చేపట్టబోవడం లేదు. దీంతో విదేశాంగ శాఖకు కూడా కొత్త మంత్రి రానున్నారు. గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్ 2018లో ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొంది ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరారు. అమెరికా, చైనాలకు భారత రాయబారిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో సుష్మ స్థానాన్ని జైశంకర్‌కు ఇవ్వొచ్చనే వార్తలు వస్తున్నాయి. అలాగే పియూష్ గోయల్‌కు రైల్వే శాఖను అలాగే ఉంచి, గడ్కరీకి మౌలిక సదుపాయాలు, గజేంద్ర సింగ్ షెకావత్‌కు వ్యవసాయ శాఖ కేటాయించే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రొటెం స్పీకర్‌గా మేనకా గాంధీ! 17వ లోక్‌సభ ఎన్నికల్లో తాత్కాలిక స్పీకర్‌గా మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ ఉంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మేనకాగాంధీ తాజా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి గెలుపోందారు. గత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్‌గా ఆమె ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ తొలి సమావేశానికి మాత్రమే స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అధికారం ప్రొటెం స్పీకర్‌కు ఉంటుంది. అలాగే లోక్‌సభకు స్పీకర్, ఉపస్పీకర్‌ను ఎన్నుకునే సమయంలోనూ ప్రొటెం స్పీకరే సభను నడిపిస్తారు. -
మోదీ 2.oలో కొత్త ముఖాలు వీరేనా!
సాక్షి, న్యూఢిల్లీ : 2019 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాగే దాదాపు 62 మందితో భారీస్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొత్త మంత్రివర్గంలో అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పియూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు ప్రమాణం చేయనున్నారు. కాగా ఈ సారి కొత్తవారికి స్థానం కల్పించడం విశేషంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మోదీ 2.0 లో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కొత్తవారి జాబితా అరవింద్ సావంత్ అనుప్రియ పాటిల్ రతన్ లాల్ కటారియా రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఆర్సీపీ సింగ్ జి కిషన్ రెడ్డి సురేష్ అంగడి ఏ రవీంద్రనాథ్ కైలాష్ చౌదరి ప్రహ్లాద్ జోషి సోమ్ ప్రకాష్ రామేశ్వర్ తెలీ సుబ్రత్ పాథక్ దేబశ్రీ చౌదరి రీటా బహుగుణ జోషి -
మోదీ రెండోసారి..
న్యూఢిల్లీ: దేశ, విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు వంటి సుమారు 8 వేల మంది విశిష్ట అతిథుల మధ్య కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. భారత ప్రధానిగా వరుసగా రెండోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ఈ వేడుక జరగనుంది. ఆయనతో పాటు 50–60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ వీరితో ప్రమాణంచేయిస్తారు. బిమ్స్టెక్ దేశాధినేతలు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, పలువురు స్వపక్ష, విపక్ష నేతలు, సీఎంలు, సినీ, క్రీడారంగ ప్రముఖులు హాజరుకానున్నారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనుందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి అశోక్ మాలిక్ చెప్పారు. తరలిరానున్న బిమ్స్టెక్ దేశాల అధినేతలు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియంట్, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ వంటి బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్) నేతలు తమ హాజరును ఇప్పటికే ధ్రువీకరించారు. థాయ్‌లాండ్‌కు ప్రత్యేక రాయబారి గ్రిసాడ బూన్రాక్ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే కిర్గిజ్ అధ్యక్షుడు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ సూరోన్‌బే జీన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ కూడా తాము హాజరుకానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మోదీ ఆహ్వానాన్ని వారు అంగీకరించినట్లు తెలిపాయి. వీరితో పాటు విపక్షాలకు చెందిన అనేకమంది నేతలు కూడా హాజరుకానున్నారు. కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద కేజ్రీవాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్, షారుక్ ఖాన్, కంగన రనౌత్, ద్రవిడ్, సైనా నెహ్వాల్, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, బిల్‌గేట్స్ తదితరులకు ఆహ్వానం అందింది. 8 వేల మంది ఇదే మొదటిసారి 2014లో కూడా మోదీ రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సార్క్ దేశాల అధినేతలతో పాటు 3,500 మందికి పైగా అతిథులు అప్పుడు హాజరయ్యారు. సాధారణంగా విదేశీ అతిథులు, ప్రభుత్వాధినేతలు వచ్చినప్పుడు వారి సత్కార కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అయితే 1990లో చంద్రశేఖర్, 1999లో వాజ్‌పేయిలు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. 8 వేల మంది అతిథులు హాజరుకావడం మాత్రం ఇదే మొదటిసారి. విదేశీ అతిథుల కోసం ‘దాల్ రైసీనా’ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ముఖ్య అథిథులు అందరికీ ‘పన్నీర్ టిక్కా’ వంటి ఉపాహారం అందజేస్తారు. ఆ తర్వాత 9 గంటలకు విదేశీ అతిథుల కోసం రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, బిమ్స్టెక్ దేశాల అధినేతలు తదితర 40 మంది అతిథులు విందులో పాల్గొంటారు. ఇతర ముఖ్య వంటకాలతో పాటు రాష్ట్రపతి భవన్ వంటశాలలో ప్రత్యేక వంటకమైన ‘దాల్ రైసీనా’ను అతిథులకు వడ్డించనున్నారు. దీని తయారీకి సుమారు 48 గంటల సమయం పడుతుందని, అందువల్ల మంగళవారమే ఇది ప్రారంభమైనట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి తెలిపారు. కాగా, మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు కలిపి దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించామని ఓ అధికారి చెప్పారు. నేను కేబినెట్లో చేరలేను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలని తాను కోరుకోవడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. అవసరమైతే సలహాలు ఇస్తానని తెలిపారు. మోదీకి రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఐదేళ్ల పాటు మోదీ సారథ్యంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో నేర్చుకున్నా. గత 18 నెలలుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి చేపట్టలేను. ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం. ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అని జైట్లీ తన లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిగానే మోదీకి జైట్లీ తన మనసులోని మాటను మౌఖికంగా వెల్లడించారు. 66 ఏళ్ల జైట్లీ బయటకు వెల్లడించని వ్యాధికి సంబంధించిన పరీక్షలు, చికిత్స కోసం గత వారం ఎయిమ్స్‌లో చేరారు. జనవరిలో అమెరికాలో సర్జరీ చేయించుకున్న జైట్లీ, గత నెలలో అధికార పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లినప్పుడు చికిత్స పొందారు. అంతకుముందు పలు సర్జరీలు జరిగాయి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ 47 ఏళ్ల వయస్సులో పార్లమెంటులో అడుగుపెట్టారు. జైట్లీ నివాసానికి మోదీ మంత్రివర్గంలో చేరలేనని లేఖ ద్వారా జైట్లీ తెలిపిన వెంటనే వెంటనే ప్రధాని మోదీ ఢిల్లీలోని జైట్లీ అధికార నివాసానికి వెళ్లారు. వీరి భేటీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. జైట్లీ కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. లేఖ అందినట్టుగా తెలియజేసిన మోదీ.. ఆర్థిక వ్యవస్థకు, జీఎస్టీ అమలుకు జైట్లీ చేసిన కృషిని అభినందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే జైట్లీ విజ్ఞప్తిని మోదీ అంగీకరించారా? లేదా? అన్నది తెలియలేదు. -
జూన్ 6 నుంచి లోక్‌సభ సమావేశాలు
న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ తొలిసమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకూ జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నెల 31న ప్రధాని మోదీ నేతృత్వంలో తొలిసారి సమావేశం కానున్న కేంద్ర కేబినెట్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. గురువారం ప్రధానిగా మోదీ, ఇతర కేంద్ర మంత్రుల చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ సమావేశాలు 6 రోజుల పాటు కొనసాగుతాయి. సమావేశాల్లో భాగంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లోక్‌సభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. -
మంత్రివర్గంలోకి అమిత్ షా..!
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా రంగం సిద్ధమయ్యింది. శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ 16వ లోక్‌సభ రద్దుకు సిఫారసు చేసింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, మిగతా కేంద్రమంత్రులు రా6ష్టపతిని కలసి రాజీనామాలు సమర్పించారు. కేంద్ర మంత్రివర్గం రాజీనామాలు సమర్పించే సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి వారిని విందుకు ఆహ్వానించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగాల్సిందిగా ప్రధానిని కోరినట్లు రాష్ట్రపతిభవన్ తెలిపింది. అంతకుముందు ప్రధాని గైర్హాజరీలో మోదీ నాయకత్వాన్ని, గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రులు ఒక తీర్మానం ఆమోదించారు. కాగా కొత్త మంత్రివర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 30న జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 3వ తేదీలోగా 17వ లోక్‌సభ కొలువుదీరాల్సి ఉంది. ఒకటీరెండు రోజుల్లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిని కలసి కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేయడంతో కొత్త సభ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. నేడు ఎన్డీయే సమావేశం మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు శనివారం సమావేశం కానున్నారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీ ముందే ఖరారైన నేపథ్యంలో లాంఛనపూర్వకంగా ఈ భేటీ జరగనుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అంతకుముందు పార్లమెంట్ హౌస్‌లో బీజేపీ ఎంపీలు సమావేశమవుతారు. ఎంపీలు తనను నేతగా ఎన్నుకున్న తర్వాత మోదీ వారినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. ఇలావుండగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు మే 28న మోదీ తన నియోజకవర్గం వారణాసిని సందర్శించే అవకాశం ఉందని పార్టీవర్గాలు వెల్లడించాయి. శుక్రవారం వారణాసి నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు మోదీని కలసి ఆయన ఎన్నికకు సంబంధించిన అధికారిక సర్టిఫికెట్‌ను అందజేశారు. సౌత్ బ్లాక్‌లో పీఎంఓ అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. ఈసారి మంత్రివర్గంలో అమిత్ షా లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించేందుకు బీజేపీ సిద్ధమైన నేపథ్యంలో అందరి దృష్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ఈసారి మోదీ మంత్రివర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమా పలు కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకునే పక్షంలో ఆయనకు హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ.. ఈ నాలుగు కీలక శాఖల్లో ఏదో ఒకటి అప్పగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వీరు కొత్త మంత్రివర్గం లో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు న్నాయి. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక శాఖతో కేబినెట్లో కొనసాగే అవకాశం కన్పిస్తోంది. అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై సంచలన విజయం సాధించిన స్మృతీ ఇరానీకి పార్టీ ముఖ్యమైన బాధ్యతనే అప్పగించవచ్చు. వీరితో పాటు సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్æ, నితిన్ గడ్కారీ, రవిశంకర్, గోయెల్, ప్రకాశ్ జవదేకర్లు కూడా కొనసాగవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షాల్లో శివసేన (18), జేడీ(యూ) (16)లు మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో వారికి కూడా చోటు దొరకవచ్చు. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల నుంచి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చే సూచనలున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సూర్యాస్తమయం అయినా వెలుగు కొనసాగుతుంది ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలంపై సూర్యాస్తమయం అయినా ప్రజల జీవితాలను కాంతివంతం చేసేందుకు దాని వెలుగు ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఓ కొత్త ఉదయం ఎదురుచూస్తోంది...’ అంటూ శుక్రవారం ఒక ట్వీట్లో మోదీ పేర్కొన్నారు. మనమందరం కలలుగన్న నవ భారత సృష్టికి, 130 కోట్ల మంది ప్రజల కలలు నెరవేర్చేందుకు తన ప్రభుత్వం మరింత కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. అడ్వాణీ, జోషీలతో మోదీ–షా భేటీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీమనోహర్ జోషీలను కలుసుకున్నారు. అమిత్ షాతో కలిసి తొలుత అడ్వాణీ ఇంటికెళ్లిన మోదీ, ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిపై కొద్దిసేపు చర్చించారు. సమావేశం అనంతరం మోదీ స్పందిస్తూ..‘ఈరోజు బీజేపీ విజయం సాధించిందంటే అడ్వాణీలాంటి గొప్ప వ్యక్తులు దశాబ్దాలపాటు కష్టపడి పార్టీని నిర్మించడమే కారణం. వీరంతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి సరికొత్తగా తీసుకెళ్లారు’ అని ట్వీట్ చేశారు. అనంతరం మోదీ, షా ద్వయం మురళీ మనోహర్ జోషి ఇంటికెళ్లారు. వీరిద్దరికి సాదరస్వాగతం పలికిన జోషి, మోదీకి శాలువాను బహూకరించారు. ఈ సందర్భంగా జోషికి పాదాభివందనం చేసిన మోదీ, తనవెంట తెచ్చిన స్వీట్స్‌ను అందించారు. దీంతో జోషి ధన్యవాదాలు తెలిపారు. ‘డా.మురళీమనోహర్ జోషి గొప్ప విద్యావేత్త. భారత విద్యావ్యవస్థను మెరుగుపర్చడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. నాతో పాటు చాలామంది కార్యకర్తలకు మార్గదర్శిగా వ్యవహరించిన జోషి, బీజేపీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేశారు’ అని మోదీ ప్రశంసించారు. ఈ సమావేశం అనంతరం జోషి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాలు బీజేపీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారని కితాబిచ్చారు. ఎన్నికల్లో విజయం అనంతరం తనకు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు పాంపియో, రష్యా అధ్యక్షుడు పుతిన్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, సౌదీ రాజు బిన్సల్మాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ నటీనటులు శిల్పాశెట్టి, మాధవన్, సంగీత దర్శకుడు రెహమాన్, సరోద్ విద్వాంసుడు అమ్జాద్ ఆలీఖాన్, బాక్సర్ మేరీకోమ్లకు ధన్యవాదాలు చెప్పారు. సీనియర్ నేత ఎల్కే అద్వానీ పాదాలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ -
కేసీఆర్ కేబినెట్ : అమాత్య యోగం ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. కొత్త కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే విషయంలో ఒకటికి రెండుసార్లు అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. సామాజిక లెక్కలు, ఉమ్మడి జిల్లాల వారీగా సమీకరణలను బేరీజు వేస్తున్నారు. మరోవైపు ఫెడరల్ ఫ్రం ట్‌తో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పాల నా పరంగా ఇబ్బంది లేకుండా ఆయన తన కొత్త బృందంలోని సభ్యులను ఎంపిక చేసుకునే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం తన ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీ పర్యటనలను ముగించుకుని గురువారం హైదరాబాద్‌కు వస్తున్నారు. శుక్రవారం నుంచి ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఢిల్లీ పర్యటన ఒకరోజు పొడిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత కేబినెట్ విస్తరణ చేయాలా.. అసెంబ్లీని సమావేశపరచి స్పీకర్ ఎన్నిక జరపాలా అనే విషయంలో ఆయన ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ముందుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీ పూర్తవుతాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ లో సమీకరణలు మరింత సులభం కానుందని సీఎం భావిస్తున్నారు. జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్న దృష్ట్యా ఆలోపే మంత్రివర్గ విస్తరణతోపాటు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉంది. మినీ కేబినెట్.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణలో 18 మందితోనే మంత్రివర్గం ఉండాలి. సీఎంగా కేసీఆర్, తొలి మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. ఇక మరో 16 మందికి అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల వరకు తక్కువ మందితోనే మంత్రివర్గాన్ని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుతం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మరో 8 లేదా 10 మందికి అవకాశం దక్కవచ్చని సమాచారం. ఇలా చేస్తే ఓసీలలో నలుగురు, బీసీలలో ఇద్దరు... ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరు వంతున కేబినెట్లో ఉండనున్నారు. శాసనసభ సిద్ధం... కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమానికి అనుగుణంగా శాసనసభ సిద్ధమైంది.అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే కార్యక్రమం నిర్వహించేలా అసెంబ్లీ అధికార యంత్రాంగం సిద్ధమైంది. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నికకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో అసెంబ్లీ మొత్తం కొత్త శోభను సంతరించుకుంది. రంగులు వేయడంతోపాటు విద్యుద్దీకరణ మరమ్మతులను పూర్తి చేశారు. సాంకేతికంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్పీకర్గాఎవరు? కొత్త ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఎవరిని వరించనుందనేది టీఆర్ఎస్లో ఆసక్తికరంగా మారింది. ఈ పదవి చేపట్టిన వారు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావనల నేపథ్యంలో దీనిపై ఎవరూ ఆసక్తి చూపడంలేదు.అంతర్గతంగా ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఎవరు అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని టీఆర్ఎస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీలో బీసీ వర్గానికి స్పీకర్ పదవికి కేటాయించినందున ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు.అలాగే సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, డి.ఎస్.రెడ్యానాయక్ పేర్లను ఈ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
వీరివీరి గుమ్మడిపండు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా గురువారం ప్రమాణం చేశారు. వారం రోజుల్లోపే పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. అయితే.. ఈసారి ఎవరికి కేబినెట్ బెర్తులు దక్కుతాయనేదానేదే ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు ఈసారి ఓడిపోయారు. వీరి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవడం ఖాయం. అయితే.. గతంలో ఉన్నవారిలో ఎందరికి మంత్రి పదవులు ఇస్తారనేదే మాజీల్లో ఉత్కంఠ రేపుతోంది. దీనికితోడు కొత్త వారిలో ఎందరికి, ఎవరెవరికి అవకాశం ఇస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. మంత్రులుగా తమ పేరును పరిశీలించాలని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. నేరుగా చెప్పకుండా మనసులోని మాటను అధినేతకు తెలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ కసరత్తు కొత్త జట్టు కూర్పుపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ కూర్పు పూర్తయిన తర్వాత.. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో మిగిలిన మంత్రుల ప్రమాణస్వీకారం జరగొచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికలో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం తెలంగాణలో సీఎం, మరో 17 మంది మంత్రులు ఉంటారు. కేసీఆర్, మహమూద్ అలీ గురువారం ప్రమాణం స్వీకారం చేశారు. మరో 16 మందికే కేబినెట్ బెర్త్ దక్కుతుంది. జిల్లాలు, సామాజిక లెక్కల ప్రకారం వీటిని భర్తీ చేయాల్సి ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), అజ్మీరా చందూలాల్ (ఎస్టీ–లంబాడ), పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన డీఎస్ రెడ్యానాయక్ (ఎస్టీ–లంబాడ), ఎర్రబెల్లి దయాకర్‌రావు (వెలమ)లకు కొత్త ప్రభుత్వంలో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ భారీ విజయాలను నమోదు చేసుకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో పువ్వాడ అజయ్ కుమార్ (కమ్మ) గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ఒకటే స్థానం వచ్చింది. ఆరు నెలల వరకు ఆ జిల్లా నుంచి ఎవరికీ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సామాజిక వర్గాల వారిగా.. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఎన్నికలలో ఓడిపోయారు. ఈ జిల్లా కోటాలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి పేర్లను సీఎం పరిశీలిస్తున్నారు. కేసీఆర్ పాత జట్టులో సభ్యులుగా ఉన్న వారిలో మార్పులు చేస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్)ల పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (ఎస్సీ)ని కొనసాగించే విషయంలో మార్పులు జరిగితే రాష్ట్రంలో హరీశ్ రావు తర్వాత రెండో అతిపెద్ద విజయం సాధించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ (మాదిగ)తోపాటు రసమయి బాలకిషన్ (మాదిగ)లలో ఒకరికి మంత్రి పదవి ఖాయమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కోటాలో మాల సామాజికవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ (మాల), చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను ఖరారు చేస్తే మహిళా కోటా సైతం భర్తీ కానుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మహిళా మంత్రి కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి (మెదక్), గొంగడి సునీత (ఆలేరు) పేర్లను టీఆర్ఎస్ అధినేత పరీశీలిస్తున్నారు. కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీ పూర్తయ్యాకే మంత్రి పదవుల విషయంలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులకు ప్రాబబుల్స్: ఆదిలాబాద్: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, బాల్క సుమన్, అజ్మీర రేఖానాయక్ నిజామాబాద్: పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి కరీంనగర్: కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ మెదక్: హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, హైదరాబాద్: తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావుగౌడ్, దానం నాగేందర్. రంగారెడ్డి: సీహెచ్ మల్లారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కేపీ వివేకానంద్. మహబూబ్‌నగర్: సి.లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్. నల్లగొండ: జి.జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, గొంగడి సునీత. వరంగల్: కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, దాస్యం వినయభాస్కర్. ఖమ్మం: పువ్వాడ అజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
22 మంత్రుల్లో 11 మంది మహిళలే..
పారిస్: ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ తన కేబినెట్‌ను సిద్ధం చేశారు. దాదాపు అన్ని వర్గాల వారికి ఆయన చోటు కల్పించారు. కన్జర్వేటివ్స్‌కు, సోషలిస్టులకు, కొత్తగా ఎన్నికైన వారికి ఆయన తన కేబినెట్లో స్థానం ఇచ్చారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేబినెట్ కూర్పులో లింగసమానత్వాన్ని పాటించారు. సగం మంది పురుషులను, సగం మంది మహిళలను తన ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించే మంత్రులుగా స్వీకరించారు. మొత్తం 22మంది మంత్రులతో కేబినెట్‌ను సిద్ధం చేసుకున్నా మెక్రాన్ అందులో 11 మంత్రి పదవులు మహిళలకే ఇచ్చి ఔరా అనిపించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎడ్వర్డ్ పిలిప్పే తనకు కాబోయే ప్రధానిగా ప్రకటించినాయన ప్రముఖ సోషియాలజిస్ట్ లయన్ మేయర్ గెరార్డ్ కొలంబోను తన ప్రభుత్వంలో రెండో స్థానం కల్పించి అంతర్గత వ్యవహారాలు కట్టబెట్టారు. ఇక రక్షణ బాధ్యతలను సిల్వీ గోలార్డ్కు అప్పగించారు. ఆమె మాజీ అధ్యక్షురాలు ఫ్రాంకోయిస్ హోలాండ్కు అత్యంత సన్నిహితులైన జియాన్ వెస్లీ డ్రియాన్ నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ఒలింపిక్ ఫెన్సింగ్ చాంపియన్ లారా ఫ్లెస్సెల్(45)కు క్రీడాశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇలా దాదాపుగా తన కేబినెట్లోకి తీసుకున్న వారికి గతంలో ఏ అంశాలపై పట్టుఉందో అందుకు తగినట్లుగానే శాఖలు కేటాయించారు. -
కోరిన కొలువు దక్కించుకున్న నారాయణ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కొత్త కేబినెట్లో కోరిన కొలువు దక్కించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి వద్దని మునిసిపల్ పరిపాలన శాఖను ఇప్పించుకోవడంలో విజయం సాధించాడని ఆయన సహచరులు అంటున్నారు. పార్టీలో నారాయణ హవా నడుస్తోందని, జెండా మోసిన వారికి, అధికారంలో లేకపోయినా పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేసిన వారిని పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ ఒక కార్పొరేట్ సంస్థలా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో నారాయణ పోటీ చేయక పోయినా ఆయనను పిలిచి మంత్రి వర్గంలో స్థానం కల్పించారని అంటున్నారు. అయితే నారాయణ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మునిసిపల్ పరిపాలన శాఖను కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్టు తెలిసింది. గత సంవత్సరం ఆఖరులో నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థల భవన నిర్మాణం సమయంలో ఒక శ్లాబు కూలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగక పోయినా, అప్పటి కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ విద్యా సంస్థలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని తెలిసింది. విద్యా సంస్థల కార్యాలయం ముందు ఆందోళనలు చేయించారు. దీంతో అప్పట్లో అసంతృప్తికి లోనైన నారాయణ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నించారని తెలిసింది. నిజానికి నారాయణ సహకారంతో కోస్తా జిల్లాల్లో టీడీపీ విజయం సాధించిందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. దీనికి కృతజ్ఞతగా నారాయణకు చంద్రబాబునాయుడు మంత్రి పదవి ఇచ్చారని చెబుతున్నారు. ఒక దశలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారని కూడా వార్తలు వ చ్చిన విషయం తెలిసిందే. అయితే నారాయణ తనకు మునిసిపల్ పరిపాలన శాఖ కావాలని పట్టుబట్టి ఇప్పించుకున్నారని సమాచారం. ఆయనకు మునిసిపల్ శాఖ దక్కనుండటంతో, నెల్లూరులోని మునిసిపల్ పరిపాలన సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఆనం ప్రోద్బలంతో నారాయణను వేధింపులకు గురి చేసిన అధికారులు, నారాయణకు మునిసిపల్ శాఖ రావడంతో, తమపై చర్యలు ఉంటాయని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, నారాయణకు మంత్రి పదవి దక్కడం, కోరిన శాఖను కేటాయించుకోవడంలో సఫలీకృతం కావడంతో మంత్రి పదవి ఆశించి, దక్కని సీనియర్ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే, ఆయనకు పదవి ఇవ్వడాన్ని తప్పు బట్టిన జిల్లాకు సీనియర్ నేతలు, ఇప్పుడు కోరిన మంత్రి పదవి ఇవ్వడంపై మరింతగా మండిపడుతున్నారు. ఏళ్ల తర బడి జెండాలు మోసి, నాలుగు సార్లు ఓడిపోయినా, పార్టీ ఉన్నతికి కృషి చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గత రెండు సార్లు గెలిచిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణను కాదని నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జెండాలు మోసిన వారిని కాదని, డబ్బులు ఇచ్చిన వారికే మంత్రి పదవులు కేటాయించే పక్షంలో కార్యకర్తలు ఎందుకు పని చేయాలని ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ దక్కుతుందనకుంటున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డికి నిరాశే మిగులుతోంది. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన రాజ్యసభ సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్టు సమాచారం. దీంతో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని విధాలా అసంతృప్తి వెళ్ల గక్కుతున్నారు. కంప్యూటర్ టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి - ఎమ్మెల్సీ విఠపు నెల్లూరు(టౌన్): గత ప్రభుత్వం పాఠశాలల్లో తొలగించిన కంప్యూటర్ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఆదిత్య డిగ్రీకళాశాలలో కంప్యూటర్ టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన విఠపు మాటాడుతూ కంప్యూటర్ విద్యతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుత సమాజానికి కంప్యూటర్ విద్య తప్పనిసరి అన్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం కంప్యూటర్ టీచర్లను తొలగించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది రోడ్డున పడ్డారని, ఇది బాధాకరమన్నారు. చంద్రబాబు తాను గెలిస్తే ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చారని తెలిపారు. కాబట్టి వారందరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం త్వరలో జరుగబోయే అసెంబ్లీలో చర్చిస్తానని తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. నూతన కమిటీ ఎన్నిక: ఎమ్మెల్సీ విఠపు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కంప్యూటర్ టీచర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్. శరత్‌చంద్రను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య కళాశాల కరస్పాండెంట్ ఆదిత్య, రాష్ట్రనాయకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయకులు చెంచ య్య, మురళి, మహిళా అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.