కాసేపట్లో కాబోయే మంత్రులకు మోదీ తేనేటి విందు | Phone Calls To Those Who Got A Place In The Central Cabinet From PMO, See Details Inside | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్‌లో చోటు.. మోదీ తేనీటి విందు.. ఆ ఎంపీలకు పీఎంవో ఫోన్‌ కాల్స్‌

Published Sun, Jun 9 2024 10:19 AM | Last Updated on Sun, Jun 9 2024 11:02 AM

Phone Calls To Those Who Got A Place In The Central Cabinet

సాక్షి, ఢిల్లీ: నరేంద్ర మోదీ సారధ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రి వర్గంపై ఒక అంచనా వచ్చేసింది.  కేబినెట్‌లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్‌ కాల్స్‌ వెళ్తున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ తన నివాసంలో నూతన మంత్రి వర్గ సభ్యులకు తేనేటి విందు ఇవ్వనున్నట్లు సమాచారం. 

ఇక.. కేంద్ర కేబినెట్‌లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు  చోటు లభించింది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కాల్స్ వెళ్లాయి. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్‌రావ్‌ జాదవ్‌లకు ఫోన్‌ కాల్స్‌ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ సీనియర్లు రాజ్ నాథ్ సింగ్ , నితిన్‌ గడ్కరీ, పియూష్ గోయల్, జితేంద్రసింగ్‌, శర్బానంద సోనోవాల్, జ్యోతి రాధిత్య సింధియాలకు సైతం కబురు వెళ్లినట్లు సమాచారం.

మంత్రి మండలిలో కిషన్‌రెడ్డి , బండి సంజయ్‌ చోటు దక్కింది. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో వారు బయలుదేరి వెళ్లారు. ఇంకా ఎవరెవరికి కాల్స్‌ వెళ్లాయనేదానిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం కర్తవ్యపథ్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement