new cabinet list
-
Modi 3.0: మంత్రులు–శాఖలు
సీనియర్లకు మళ్లీ అవే శాఖలు... కేబినెట్ కూర్పుపై మోదీ ముద్ర -
కాసేపట్లో కాబోయే మంత్రులకు మోదీ తేనేటి విందు
సాక్షి, ఢిల్లీ: నరేంద్ర మోదీ సారధ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రి వర్గంపై ఒక అంచనా వచ్చేసింది. కేబినెట్లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ తన నివాసంలో నూతన మంత్రి వర్గ సభ్యులకు తేనేటి విందు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు లభించింది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కాల్స్ వెళ్లాయి. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్‌రావ్ జాదవ్‌లకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ సీనియర్లు రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, జితేంద్రసింగ్, శర్బానంద సోనోవాల్, జ్యోతి రాధిత్య సింధియాలకు సైతం కబురు వెళ్లినట్లు సమాచారం.మంత్రి మండలిలో కిషన్‌రెడ్డి , బండి సంజయ్ చోటు దక్కింది. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో వారు బయలుదేరి వెళ్లారు. ఇంకా ఎవరెవరికి కాల్స్ వెళ్లాయనేదానిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం కర్తవ్యపథ్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
కేబినెట్లో ఎవరెవరో...!
న్యూఢిల్లీ: మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కించుకునేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి సొంతగా మెజారిటీ రాని నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ కూర్పులో ఎన్డీఏ మిత్రపక్షాలకు పెద్దపీట వేయడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రులుగా పార్టీలవారీగా పలువురి పేర్లు విని్పస్తున్నాయి... బీజేపీ అమిత్ షా మళ్లీ హోం, రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ శాఖల బాధ్యతలు చేపట్టవచ్చంటున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీ, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, నిత్యానంద రాయ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, కిరెన్ రిజిజు కూడా మంత్రులుగా కొనసాగే వీలుంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకుంటే మంత్రిగా చాన్సున్నట్టు చెబుతున్నారు. వీరితో పాటు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ (తెలంగాణ), పురందేశ్వరి (ఏపీ), ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షెకావత్, బస్వరాజ్ బొమ్మై, పీసీ మోహన్, గోవింద్ కర్జోల్, దుష్యంత్ సింగ్, సురేశ్‌గోపీ, శాంతను ఠాకూర్, జితేంద్ర సింగ్, జుగల్ కిశోర్ శర్మ, శర్బానంద సోనోవాల్, బైజులీ కలితా మేధి, బిప్లవ్ దేబ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.జనసేన వల్లభనేని బాలÔౌరి పేరు విని్పస్తోంది.జేడీ(యూ) మూడు కేబినెట్, ఒకట్రెండు సహాయ బెర్తుల కోసం పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం పట్టుబడుతున్నట్టు సమాచారం. రెండు కేబినెట్ పదవులు దక్కవచ్చని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. పార్టీ మాజీ చీఫ్ లలన్‌సింగ్‌తో పాటు భారతరత్న కర్పూరీ ఠాకూర్ కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ పేర్లు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది.టీడీపీ కనీసం నాలుగు కేబినెట్ పదవులు కోరుతోంది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం మోదీతో పాటు ప్రమాణం చేయడం ఖాయమని చెబుతున్నారు. రూ.5,705 కోట్ల ఆస్తులతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించిన పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డి.ప్రసాదరావు, టి.కృష్ణప్రసాద్ పేర్లు కూడా విని్పస్తున్నాయి.ఆరెల్డీ పార్టీ చీఫ్ జయంత్ చౌదరికి బెర్తు ఖాయమంటున్నారు.శివసేన రెండు బెర్తులు అడుగుతోంది. పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పేరు గట్టిగా విని్పస్తోంది. ఆయన మాత్రం తన బదులు పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టించిన ఇతరులకు అవకాశం దక్కాలంటున్నారు. ఎల్జేపీ కనీసం ఒక్క బెర్తు ఖాయంగా కని్పస్తోంది. పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేయవచ్చని చెబుతున్నారు. జేడీ(ఎస్) హెచ్.డి.కుమారస్వామికి వ్యవసాయ శాఖ కోరుతోంది.అప్నాదళ్ (ఎస్) అనుప్రియా పటేల్‌కు మళ్లీ స్థానం దక్కేలా ఉంది. -
తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్లే..
పట్నా/మీర్జాపూర్: ఏదో నామమాత్రంగా జేడీ(యూ)కి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామనడంతోనే తాము కేంద్రంలో చేరకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. మంత్రివర్గంలో జేడీ(యూ)ను కూడా చేరేలా నితీశ్‌ను ఒప్పించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పలుసార్లు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తగినన్ని మంత్రిపదవులు ఇవ్వకపోతుండడంతో నితీశ్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. జేడీ(యూ)కు ఒక మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా చెప్పగా, తమ పార్టీకి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని నితీశ్ పట్టుబట్టినట్లు సమాచారం. లేదంటే ఆ ఒక్క పదవి కూడా వద్దని తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ నుంచి నితీశ్ శుక్రవారం పట్నా తిరిగొచ్చారు. అనంతరం నితీశ్ మాట్లాడుతూ ఎన్డీయేతో లేదా బీజేపీతో తమకు విభేదాలేమీ లేవనీ, తాము మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘మేం మోదీ ప్రభుత్వంతోనే ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా. పార్టీలో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని చెప్పారు. ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), మరో సహాయమంత్రి పదవులను జేడీయూ డిమాండ్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్నాదళ్‌దీ అదే దారి.. మంత్రిపదవి విషయంలో అసంతృప్తి కారణంగానే ఉత్తరప్రదేశ్‌లోని అప్నాదళ్ (ఎస్) పార్టీ కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ నాయకురాలు అనుప్రియా పటేల్ గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆమె కేబినెట్ హోదా పదవి ఆశించారనీ, అయితే సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) కూడా దక్కకపోతుండటంతో ఈసారి మంత్రిపదవిని అనుప్రియ వద్దనుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
ఆ 4 శాఖలు ఎవరికి?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వరసగా రెండోరోజు బుధవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొత్త మంత్రివర్గానికి తుది రూపు ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం సైజు 60 వరకు ఉండొచ్చనే సమాచారం నేపథ్యంలో నాలుగు కీలక శాఖలు హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు ఎవరికి దక్కుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీనియర్ మంత్రుల్లో చాలామందికి తిరిగి కేబినెట్లో స్థానం దక్కుతుందని, వారితో పాటు కొన్ని కొత్త ముఖాలు ఉంటాయని తెలుస్తోంది. బీజేపీకి తగిన రాజకీయ వ్యూహాన్ని రచించి భారీ విజయాన్ని చేకూర్చినట్టుగా ప్రశంసలందుకుంటున్న అమిత్ షా తొలిసారిగా కేంద్ర కేబినెట్లో చేరి కీలక శాఖను దక్కించుకుంటారనే ఊహాగానాలు సాగుతున్నా దీనిపై స్పష్టతలేదు. వచ్చే ఏడాదిలోగా పలు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగు చాన్సుంది. పాత కేబినెట్లోని ప్రధాన సభ్యులందరికీ తిరిగి అవకాశం వస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజ్‌నాథ్, గడ్కారీ, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్లు కొనసాగే అవకాశం ఉంది. అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు గడించిన స్మృతీ ఇరానీకి మంచి శాఖ దక్కే అవకాశం ఉంది. తోమర్ స్పీకర్‌గా కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఒడిశా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్న బీజేపీ బలాన్ని కొత్త కేబినెట్ ప్రతిబింబించవచ్చనే సంకేతాలు ఉన్నాయి. అనారోగ్య కారణాల వల్లే ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ సుష్మాస్వరాజ్‌కు మోదీ కొత్త కేబినెట్లో చోటు దక్కవచ్చని పార్టీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శివసేన, జేడీయూలకు చెరో రెండు ఇక మిత్రపక్షాల విషయానికొస్తే శివసేన, జేడీ(యూ)లకు ఒక కేబినెట్, మరొక సహాయమంత్రి చొప్పున రెండేసి బెర్తులు దక్కే వీలుంది. లోక్ జన్‌శక్తి, శిరోమణి అకాలీ దళ్ పార్టీలకు చెరొక పదవి రావచ్చు. బుధవారం అమిత్ షాతో బిహార్ సీఎం నితీశ్ భేటీ అయ్యారు. కేబినెట్లో జేడీ(యూ) ప్రాతినిధ్యంపై ఉభయులూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వంలో తమ ప్రతినిధిగా పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ పేరును సిఫారసు చేస్తూ ఎల్జేపీ ఇప్పటికే తీర్మానం ఆమోదించింది. గత మంత్రివర్గంలో భాగస్వామి కాని ఏఐఏడీఎంకే ఒక సీటు గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ తమిళనాడులో అధికారంలో ఉండటం, కీలక ద్రవిడ మిత్రపక్షం కావడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ నేత ఒకరికి స్థానం కల్పించవచ్చు. కర్ణాటక నుంచి సదానందగౌడ, ప్రహ్లాద్ జోషిల పేర్లు, మహారాష్ట్ర నుంచి గడ్కారి, జవదేకర్, సురేశ్ప్రభులతో పాటురావు సాహెబ్ దాన్వే పేరు ఖరారైనట్లు సమాచారం. బీజేపీ అధ్యక్ష రేసులో నడ్డా, భూపేందర్ అరుణ్ జైట్లీ కేబినెట్లో చేరలేనని స్పష్టం చేయడంతో.. కీలకమైన ఆర్థిక శాఖపై ఊహాగానాలు మొదలయ్యాయి. జైట్లీ స్థానంలో బాధ్యతలు చేపట్టి ఎన్నికల ముందు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ పదవికి ప్రధాన పోటీదారు కావచ్చని తెలుస్తోంది. ఇక గాంధీనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన అమిత్ షా కనుక కేబినెట్లో చేరితే.. జేపీ నడ్డా, భూపేందర్ యాదవ్ బీజేపీ అధ్యక్షుడి రేసులో మొదటిస్థానంలో ఉంటారని తెలుస్తోంది. మంత్రులు, మంత్రుల శాఖలపై బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
ఆశలు గల్లంతు!
► జిల్లాకు దక్కని రెండో మంత్రి పదవి ► మంత్రివర్గ విస్తరణలోప్రకాశానికి మొండిచేయి ► ఒకే ఒక్కడు శిద్దా రాఘవరావు ► మాగుంటకు మొండిచేయి ► ఫలించని దామచర్ల, డేవిడ్‌రాజుల ప్రయత్నాలు ► డీలా పడిన ఆశావహులు ► ఇన్చార్జి మంత్రి రావెలపై వేటు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తాజా మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాకు మొండిచేయి చూపారు. సమీకరణలు, కూడికలు.. తీసివేతల తర్వాత ఇన్నాళ్లూ జిల్లాను ఊరిస్తూ వచ్చిన రెండో మంత్రి పదవి చివరి నిమిషంలో చేజారి పోయింది. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ముఖ్యంగా పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, తీవ్రంగా ప్రయత్నించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు అమాత్య పదవికోసం తనవంతు ప్రయత్నాలు సాగించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజులకు చివరికు నిరాశ మిగిలింది. దీంతో వారి వర్గీయులు డీలా పడ్డారు. జిల్లాకు మరో మంత్రి పదవి దక్కకపోడంతో పార్టీ శ్రేణులు ఉసూరుమన్నారు. జిల్లా నుంచి మంత్రి శిద్దా రాఘవరావు కేబినెట్లో ఏక్ నిరంజన్‌గా మిగిలారు. ఫలించని ప్రయత్నాలు..: ప్రకాశం జిల్లాకు తాజా విస్తరణలో రెండో మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు భావించారు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రాగానే ప్రకాశం జిల్లాకు మంత్రి పదవిపై ఊహాగానాలు అధికమయ్యాయి. ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల తన సమీప బంధువైన కేంద్రమంత్రి ద్వారా మంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకూ ప్రయత్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతును సైతం కూడా గట్టి ఆయన గట్టి ప్రయత్నమే చేసినట్లు సమాచారం. మరోవైపు యర్రగొండుపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు కూడా ఎస్సీ కోటాలో మంత్రి పదవి చేజిక్కి తనవంతు ప్రయత్నాలు సాగించారు. చివరి నిమిషంలో బాబు వీరందరి ఆశల్ని గల్లంతు చేశారు. మాగుంట వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి..: ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి ఖాయమన్న సంకేతాలు వచ్చినప్పటికీ కుల సమీకరణల్లో భాగంగా చివరి నిమిషంలో ఆయనకు పదవి దక్కలేదని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో అదే జిల్లాకు చెందిన మాగుంటకు పదవి దక్కలేదు. ఒక దశలో సోమిరెడ్డికి మండలి చైర్మన్ పదవి కట్టబెట్టి మాగుంటకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తరువాత మాగుంటకు మండలి చైర్మన్ పదవి ఇచ్చి సోమిరెడ్డికి మంత్రి పదవి కట్టబెడతారన్న వార్తలు వెలువడ్డాయి. చంద్రబాబు సోమిరెడ్డి వైపే మొగ్గు చూపడంతో మాగుంట ఆశలకు గండి పడింది. దీంతో ఆయన వర్గీయులు నిరాశ చెందారు. అడగక పోయినా పదవి ఇస్తున్నట్లు ప్రచారం చేసిన అధిష్టానం చివరి నిమిషంలో మొండిచేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అనుకూలించని కుల సమీకణలు..: ఇక దామచర్ల గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉన్న కేంద్రమంత్రి వద్దకు తన అనుచరులు వెళ్లి తనకు మంత్రి పదవి వచ్చేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. సమీకరణలు అనుకూలించక పోవడంతో తన సామాజికవర్గానికి చెందిన దామచర్లకు పదవి ఇచ్చేందుకు బాబు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే డేవిడ్‌రాజు సామాజికవర్గం నుంచి రిజర్వుడు కోటాలో పోటీ ఎక్కువ ఉండడంతో ఆయన ఆశలూ ఫలించలేదు. ఒకే ఒక్కడు శిద్దా..: జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వక పోవడంతో ప్రస్తుత మంత్రి శిద్దా రాఘవరావు జిల్లాకు ఒకేఒక్క మంత్రిగా మిగిలారు. ప్రస్తుతం ఆయన పరిధిలో ఉన్న రవాణాశాఖ లేదా రోడ్ల భవనాలశాఖల్లో ఒక దానిని తప్పించి మరో శాఖ అప్పగించనున్నట్లు సమాచారం. జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెలకు ఉద్వాసన...: ఎట్టకేలకు జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు మంత్రి పదవి ఊడింది. రావెల పనితీరు పట్ల చాలా కాలంగా ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం ఉంది. తాజా విస్తరణలో రావెలను తప్పిస్తారన్న ప్రచారం జోరుగా జరిగింది. అనుకున్నట్టే చివరకు సీఎం ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించారు.