న్యూఢిల్లీ: మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కించుకునేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి సొంతగా మెజారిటీ రాని నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ కూర్పులో ఎన్డీఏ మిత్రపక్షాలకు పెద్దపీట వేయడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రులుగా పార్టీలవారీగా పలువురి పేర్లు విని్పస్తున్నాయి...
బీజేపీ
అమిత్ షా మళ్లీ హోం, రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ శాఖల బాధ్యతలు చేపట్టవచ్చంటున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీ, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, నిత్యానంద రాయ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, కిరెన్ రిజిజు కూడా మంత్రులుగా కొనసాగే వీలుంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకుంటే మంత్రిగా చాన్సున్నట్టు చెబుతున్నారు.
వీరితో పాటు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ (తెలంగాణ), పురందేశ్వరి (ఏపీ), ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షెకావత్, బస్వరాజ్ బొమ్మై, పీసీ మోహన్, గోవింద్ కర్జోల్, దుష్యంత్ సింగ్, సురేశ్‌గోపీ, శాంతను ఠాకూర్, జితేంద్ర సింగ్, జుగల్ కిశోర్ శర్మ, శర్బానంద సోనోవాల్, బైజులీ కలితా మేధి, బిప్లవ్ దేబ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
జనసేన
వల్లభనేని బాలÔౌరి పేరు విని్పస్తోంది.
జేడీ(యూ)
మూడు కేబినెట్, ఒకట్రెండు సహాయ బెర్తుల కోసం పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం పట్టుబడుతున్నట్టు సమాచారం. రెండు కేబినెట్ పదవులు దక్కవచ్చని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. పార్టీ మాజీ చీఫ్ లలన్‌సింగ్‌తో పాటు భారతరత్న కర్పూరీ ఠాకూర్ కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ పేర్లు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది.
టీడీపీ
కనీసం నాలుగు కేబినెట్ పదవులు కోరుతోంది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం మోదీతో పాటు ప్రమాణం చేయడం ఖాయమని చెబుతున్నారు. రూ.5,705 కోట్ల ఆస్తులతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించిన పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డి.ప్రసాదరావు, టి.కృష్ణప్రసాద్ పేర్లు కూడా విని్పస్తున్నాయి.
ఆరెల్డీ
పార్టీ చీఫ్ జయంత్ చౌదరికి బెర్తు ఖాయమంటున్నారు.
శివసేన
రెండు బెర్తులు అడుగుతోంది. పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పేరు గట్టిగా విని్పస్తోంది. ఆయన మాత్రం తన బదులు పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టించిన ఇతరులకు అవకాశం దక్కాలంటున్నారు.
ఎల్జేపీ
కనీసం ఒక్క బెర్తు ఖాయంగా కని్పస్తోంది. పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేయవచ్చని చెబుతున్నారు.
జేడీ(ఎస్)
హెచ్.డి.కుమారస్వామికి వ్యవసాయ శాఖ కోరుతోంది.
అప్నాదళ్ (ఎస్)
అనుప్రియా పటేల్‌కు మళ్లీ స్థానం దక్కేలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment