third time
-
ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై మంగళవారం పత్రికాసమావేశంలో మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో కలిసి అమిత్ సుదీర్ఘంగా మాట్లాడారు. జనగణన ఎప్పుడో త్వరలో చెప్తాం జనగణన ఎప్పుడు జరపబోయేది త్వరలోనే వెల్లడిస్తామని, ప్రకటన చేశాక సంబంధిత వివరాలను తెలియజేస్తామని అమిత్ చెప్పా రు. జనగణన, కులగణన తక్షణం జరపాలంటూ విపక్షాల నుంచి విపరీతమైన డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో అమిత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రైతుల కోసం రూ.15 లక్షల కోట్ల పథకాలు ‘‘రైతాంగం బాగు కోసం సాగురంగంలో 14 విభాగాల్లో రూ.15 లక్షల కోట్ల విలువైన పథకాలను ఈ 100 రోజుల్లో అమల్లోకి తెచ్చాం. వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు మౌలిక సాగు నిధి ఏర్పాటుచేశాం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి నిర్ణయం రైతుల కోసమే తీసుకున్నారు. మెరుగైన మౌలిక వసతులకు రూ.3 లక్షల కోట్లు కేటాయించాం.25వేలకు పైగా కుగ్రామాలకు రోడ్ల అనుసంధానం పెంచుతున్నాం. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించాం. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడ్డాం. ఆస్తుల దురి్వనియోగాన్నీ వక్ఫ్ (సవరణ) బిల్లు అడ్డుకుంటుంది. గత నెలలో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుంది’’ అని షా అన్నారు. -
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్‌కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్‌లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
వినయంగా ఉండండి.. కష్టపడి పని చేయండి
న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించకుండా వినయంగా ఉన్న నాయకులనే ప్రజలు అభిమానిస్తారని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకే వినయంగా ఉండాలని నూతన మంత్రులకు సూచించారు. రుజువర్తన, పారదర్శకత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చెప్పారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు మోదీ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనపై ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని అన్నారు. మీకు అప్పగించిన పనిని నిజాయతీగా పూర్తి చేయండి అని సూచించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరికీ తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొన్నారు. మంత్రులు అందరితో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను గౌరవించాలని చెప్పారు. అందరిని కలుపుకొనిపోవాలని, బృంద స్ఫూర్తితో పని చేయాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నులపండువగా...
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. దేశాధినేతల నుంచి రాజకీయ దిగ్గజాల దాకా వేడుకలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రముఖులు మొదలుకుని సినీ తారల దాకా తళుక్కుమన్నారు. 8,000 మందికిపైగా వీవీఐపీలు, వీఐపీలతో రాష్ట్రపతి భవన్ ఆవరణ కళకళలాడింది. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయిస్తుండగా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు, హర్షధ్వానాలతో మారుమోగింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్ కోవింద్ తదితరులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ నుంచి రజనీకాంత్ దాకా పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై అలరించారు. పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ దంపతులు, ముకేశ్ అంబానీ దంపతులు వేడుకకు హాజరయ్యారు. భిన్న మతాలకు చెందిన పెద్దలు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా నెగ్గిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానాకర్షణగా నిలిచారు. కేరళలోని త్రిసూర్ ఎంపీ, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయమన్నది తెలిసిందే. మోదీకి పలు రంగాల ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షల సందేశాలతో ఎక్స్ తదితర సోషల్ సైట్లు హోరెత్తిపోయాయి. ఏడుగురు దేశాధినేతలు: మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కు మార్ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్ర ధానమంత్రి త్సెరింగ్ టాగ్బే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ తదితరులు కార్యక్ర మంలో పాల్గొన్నారు. భారత్, మాల్దీవుల మ« ద్య సంబంధాలు బలహీనపడ్డ నేపథ్యంలో ముయిజ్జు హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడయ్యాకఆయన భారత్ రావడం ఇదే తొలిసారి.తెలుపు కుర్తా–చుడీదార్, నీలి రంగు జాకెట్లో... మెరిసిపోయిన మోదీవిశేష సందర్భాల్లో తన వస్త్రధారణతో ఆకట్టుకునే మోదీ ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుపు కుర్తా, చుడీదార్, దానిపై నీలి రంగు జాకెట్ ఎంచుకున్నారు. 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ చేసిన సందర్భంగా ఆయన క్రీం కలర్ కుర్తా, తెల్ల పైజామా, బంగారు రంగు జాకెట్ ధరించారు. 2019లో రెండోసారి ప్రధాని అయినప్పుడు తెలుపు రంగు కుర్తా, పైజామా, వాటిపై బంగారు రంగు జాకెట్ ధరించి ప్రమాణస్వీకారం చేశారు. పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు మోదీ రంగురంగుల తలపాగాలు ధరించి అలరిస్తుంటారు. -
కేబినెట్లో ఎవరెవరో...!
న్యూఢిల్లీ: మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కించుకునేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి సొంతగా మెజారిటీ రాని నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ కూర్పులో ఎన్డీఏ మిత్రపక్షాలకు పెద్దపీట వేయడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రులుగా పార్టీలవారీగా పలువురి పేర్లు విని్పస్తున్నాయి... బీజేపీ అమిత్ షా మళ్లీ హోం, రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ శాఖల బాధ్యతలు చేపట్టవచ్చంటున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీ, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, నిత్యానంద రాయ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, కిరెన్ రిజిజు కూడా మంత్రులుగా కొనసాగే వీలుంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకుంటే మంత్రిగా చాన్సున్నట్టు చెబుతున్నారు. వీరితో పాటు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ (తెలంగాణ), పురందేశ్వరి (ఏపీ), ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షెకావత్, బస్వరాజ్ బొమ్మై, పీసీ మోహన్, గోవింద్ కర్జోల్, దుష్యంత్ సింగ్, సురేశ్‌గోపీ, శాంతను ఠాకూర్, జితేంద్ర సింగ్, జుగల్ కిశోర్ శర్మ, శర్బానంద సోనోవాల్, బైజులీ కలితా మేధి, బిప్లవ్ దేబ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.జనసేన వల్లభనేని బాలÔౌరి పేరు విని్పస్తోంది.జేడీ(యూ) మూడు కేబినెట్, ఒకట్రెండు సహాయ బెర్తుల కోసం పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం పట్టుబడుతున్నట్టు సమాచారం. రెండు కేబినెట్ పదవులు దక్కవచ్చని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. పార్టీ మాజీ చీఫ్ లలన్‌సింగ్‌తో పాటు భారతరత్న కర్పూరీ ఠాకూర్ కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ పేర్లు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది.టీడీపీ కనీసం నాలుగు కేబినెట్ పదవులు కోరుతోంది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం మోదీతో పాటు ప్రమాణం చేయడం ఖాయమని చెబుతున్నారు. రూ.5,705 కోట్ల ఆస్తులతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించిన పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డి.ప్రసాదరావు, టి.కృష్ణప్రసాద్ పేర్లు కూడా విని్పస్తున్నాయి.ఆరెల్డీ పార్టీ చీఫ్ జయంత్ చౌదరికి బెర్తు ఖాయమంటున్నారు.శివసేన రెండు బెర్తులు అడుగుతోంది. పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పేరు గట్టిగా విని్పస్తోంది. ఆయన మాత్రం తన బదులు పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టించిన ఇతరులకు అవకాశం దక్కాలంటున్నారు. ఎల్జేపీ కనీసం ఒక్క బెర్తు ఖాయంగా కని్పస్తోంది. పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేయవచ్చని చెబుతున్నారు. జేడీ(ఎస్) హెచ్.డి.కుమారస్వామికి వ్యవసాయ శాఖ కోరుతోంది.అప్నాదళ్ (ఎస్) అనుప్రియా పటేల్‌కు మళ్లీ స్థానం దక్కేలా ఉంది. -
నేడు మోదీ మూడోసారి
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 3.0 ఆదివారం నుంచి మొదలుకానుంది. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సొంతంగా మెజారిటీ లేని నేపథ్యంలో మంత్రిపదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. శనివారం కూడా బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (16 సీట్లు), జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ (12 సీట్లు), శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (7 సీట్లు)లతో మంత్రి పదవులపై చర్చలు జరిపారు. పెద్దశాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు సైద్ధాంతికంగా కీలకమైన విద్య, సాంస్కృతిక శాఖలను బీజేపీయే అట్టిపెట్టుకుంటుందని భావిస్తున్నారు. మొదటి విడతలో మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయమంత్రి టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి పదవి లభిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం. రెండు పారీ్టలు టీడీపీ, జేడీయూలకు ఒక్కో కేబినెట్, ఒక్కో సహాయమంత్రి పదవులు ఇవ్వనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, సంజయ్ ఝాలలో ఒకరు కేబినెట్ మంత్రిగా, రామ్‌నాథ్ ఠాకూర్ సహాయమంత్రిగా ఆదివారం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. లోక్ జనశక్తి (రాంవిలాస్) నుంచి ఆ పార్టీ ఆధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు కేబినెట్లో చోటు దక్కనుంది. ఢిల్లీకి చేరుకున్న హసీనా మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్‌కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తెర్సింగ్ టోబ్గేలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ 3.0ను సెలబ్రేట్ చేసుకునేందుకు అమెరికాలోని 22 నగరాల్లో బీజేపీ మద్దతుదారులు ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్, జెర్సీ సిటీ, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, అట్లాంటా, హూస్టన్, డల్లాస్, షికాగో, లాస్ఏంజెలెస్, శాన్ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ– యూఎస్ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్ తెలిపారు. భారతీయ రైల్వేస్‌కు చెందిన పది మంది లోకో పైలట్లను ప్రమాణస్వీకారానికి ఆహా్వనించారు. ఇందులో భారత తొలి మహిళా లోకోపైలట్ సురేఖ యాదవ్ ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో వీవీఐపీలకు, కాబోయే మంత్రులకు ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం ముగిశాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అతిథులకు విందు ఇవ్వనున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు విధించారు. ఆది, సోమవారాల్లో దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. మాకింకా ఆహ్వానం రాలేదు: కాంగ్రెస్ మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదని పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి చెప్పారు. ఆహ్వానాలు వస్తే హాజరు కావడంపై ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
Stock market: మార్కెట్ యూటర్న్..
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఖరారు కావడంతో నేలక్కొట్టిన బంతిలా దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రా డేలో 2,456 పాయింట్ల ‘పోల్’వాల్ట్ చేసింది. నిఫ్టీ సైతం 786 పాయింట్లు జంప్‌చేసింది. దీంతో సెన్సెక్స్ తిరిగి 74,530 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 22,670ను దాటేసింది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 13 లక్షల కోట్లకుపైగా బలపడింది! ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున గత నాలుగేళ్లలోనే అత్యధిక స్థాయి పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టే వీలుండటంతో సెంటిమెంటు బలపడింది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉపక్రమించడంతో ఇండెక్సులు లాభాల పరుగు అందుకున్నాయి. సెన్సెక్స్ 2,303 పాయింట్లు జంప్‌చేసి 74,382 వద్ద నిలిచింది. నిఫ్టీ 736 పాయింట్లు పురోగమించి 22,620 వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్కు రూ. 13.22 లక్షల కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 408 లక్షల కోట్ల(4.89 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది!ఎఫ్‌పీఐ అమ్మకాలు బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 4.4%, 3% చొప్పున ఎగశా యి. కాగా.. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) తాజాగా రూ. 5,656 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 4,555 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 12,436 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 3,319 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. దీంతో బీఎస్ఈ మా ర్కెట్ విలువలో రూ. 31 లక్షల కోట్లకుపైగా తగ్గింది. బ్లూ చిప్స్ దన్ను...ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 6–2 శాతం మధ్య ఎగశాయంటే కొనుగోళ్ల జోరును అర్ధం చేసుకోవచ్చు! ప్రధానంగా మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ 4 శాతంపైగా బలపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ దిగ్గజాలలో దాదాపు అన్ని షేర్లూ లాభపడ్డాయి. అదానీ షేర్లు అప్మార్కెట్ల బౌన్స్‌బ్యాక్‌తో ఒక్క అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మినహా (–2.6%) అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో అత్యధికం మళ్లీ లాభపడ్డాయి. దీంతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 15.57 లక్షల కోట్లను అధిగమించింది. మేలో ‘సేవలు’ పేలవంన్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మేనెల్లో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ నెల్లో 60.8 వద్ద ఉన్న హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మే లో 60.2కు తగ్గింది. కాగా, కొత్త ఎగుమతుల ఆర్డర్లు 10 సంవత్సరాల గరిష్టానికి చేరడం హర్షణీయ పరిణామం. -
Lok Sabha Election Results 2024: 8 లేదా 9న ప్రమాణం!
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్లాల్ నెహ్రూ నెలకొలి్పన రికార్డును మోదీ సమం చేయబోతున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని సహా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, బుధవారం మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎన్డీయే–2 ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత 17వ లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఉదయం 11.30 గంటలకు జరిగిన కేబినెట్ భేటీలో మోదీ మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు ఒక భాగమేనని అన్నారు. నెంబర్ గేమ్ కొనసాగుతుందని చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు చేశామని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు. పదేళ్లలో మంత్రులంతా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరుల రాజీనామా లేఖలను సమరి్పంచారు. మోదీతోపాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించాలని మోదీని కోరారు. 17వ లోక్‌సభను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ చేసిన సిఫార్సు లేఖను రాష్ట్రపతి అందజేశారు. దీంతో 17వ లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో మోదీ భేటీ ప్రధాని మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మూడు కమలం పువ్వులున్న పుష్పగుచ్ఛాన్ని మోదీకి అందజేసి అభినందనలు తెలియజేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించినందుకు గుర్తుగా మూడు కమలం పువ్వులను ఇచి్చనట్లు తెలుస్తోంది. అలాగే మోదీ కూడా కొన్ని రకాల మిఠాయిలను ఉప రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ, దిగిపోతున్న మంత్రివర్గానికి రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీనికి హాజరయ్యారు. టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మిత్రపక్షాల సహాయంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి లభించలేదు. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో హస్తినలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయే నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలు ప్రతిపక్ష కూటమిలో చేరబోతున్నాయంటూ ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి. -
లండన్ మేయర్‌గా మూడోసారి సాదిక్ ఖాన్
లండన్: పాక్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్(53) లండన్ మేయర్‌గా భారీ మెజారిటీతో వరుసగా మూడోసారి గెలుపొందారు. మొత్తం ఓట్లలో 43.8 శాతం అంటే 10,88,225 ఓట్లు సాదిక్ ఖాన్‌కు పడగా కన్జర్వేటివ్ పారీ్టకి చెందిన ప్రధాన ప్రత్యర్ధి సుసాన్ హిల్‌కు 8,11,518 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగిన ఢిల్లీలో జన్మించిన వ్యాపారవేత్త తరుణ్ గులాటి ఓట్ల వేటలో విఫలమయ్యారు. మేయర్ పదవికి మొత్తం 13 మంది పోటీ పడ్డారు. లండన్ మేయర్ 89 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు. 2000వ సంవత్సరంలో పదవి ఏర్పాటయ్యాక వరుసగా మూడు పర్యాయాలు మేయర్‌గా ఎన్నికైన నేతగా సాదిక్ ఖాన్ రికార్డు సృష్టించారు. నాలుగేళ్ల పదవీ కాలానికిగాను 2016, 2020 ఎన్నికల్లో ఆయన మేయర్‌గా ఎన్నికయ్యారు. -
మోదీ మరోమారు ప్రధాని కావాలంటూ ప్రార్థనలు!
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అదే సమయంలో శ్రీరాముడు కొలువైన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని భగవంతుణ్ణి వేడుకుంటూ యాగాలు, ప్రార్థనలు ప్రారంభించారు. బాబ్రీ మసీదు కేసు న్యాయవాది ఇక్బాల్ అన్సారీ ఖురాన్ పఠించి, ప్రధాని మోదీ మూడవసారి ప్రధాని కావాలని వేడుకున్నారు. అలాగే జగద్గురు పరమహంస ఆచార్య.. మోదీ కోసం ప్రార్థనలు చేశారు. అయోధ్య మతపరమైన నగరమని, ఇక్కడి ప్రజల ప్రార్థనలు దేవతలు తప్పకుండా వింటారని, ఇక్కడ ఏ పూజ చేసినా, ప్రార్థించినా దైవం స్వీకరిస్తాడని ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. అయోధ్యలోని తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రధాని మోదీ పాలన దేశానికి, ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. అందుకే దేశ ప్రజలంతా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలన్నారు. -
Lok Sabha elections 2024: జూన్ నుంచి మూడో టర్ము
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జూన్ నుంచి తమ మూడో టర్ము పాలన మొదలవుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆ తర్వాత సాకారమయ్యే వికసిత భారత్ దేశ యువత కలలకు ప్రతిరూపంగా ఉంటుంది. దేశ రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించే పూర్తి హక్కులు వారికున్నాయి. వారి కలలే నా సంకల్పం.నా సంకల్పమే వికసిత భారతానికి హామీ. ఈ నయా భారత్‌లో చిన్న లక్ష్యాలకు చోటు లేదు. పెద్ద పెద్ద కలలు కంటూ వాటి సాకారానికి నిరి్వరామంగా కృషి చేస్తున్నాం. పదేళ్లుగా ఈ వేగం ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది’’ అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రూ.41 వేల కోట్లతో తలపెట్టిన 2,000 పై చిలుకు రైల్వే ప్రాజెక్టులకు సోమవారం ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.వీటిలో 27 రాష్ట్రాల పరిధిలో 554 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి, 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జి పనులున్నాయి. తెలంగాణలో రూ.230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లతో 17 రైల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లకు మోదీ భూమి పూజ చేశారు. రూ.221 కోట్లతో పూర్తయిన 3 రైల్ ఫ్లై ఓవర్, 29 రైల్ అండర్ పాస్‌లను జాతికి అంకితం చేశారు.కాంగ్రెస్ పాలనలో రైల్వే శాఖ రాజకీయ క్రీడలకు వేదికగా కునారిల్లిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. తమ పాలనలో పదేళ్లుగా ఆధునికతను అందిపుచ్చుకుని దూసుకుపోతోందన్నారు. ‘‘కొన్నేళ్లుగా భారత్ అన్ని రంగాల్లోనూ శరవేగంగా ప్రగతి సాధిస్తోంది. పన్నుల రూపేణా ప్రజలు చెల్లిస్తున్న ప్రతి రూపాయినీ వారి సంక్షేమానికే వెచి్చస్తున్నాం. గత కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌లను ప్రారంభించా’’ అని చెప్పారు.టెక్స్టైల్ రంగ ప్రగతికి సాయంటెక్స్టైల్ రంగానికి కేంద్రం అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ చెప్పారు. ‘‘దేశాభివృద్ధిలో ఆ రంగానిది కీలక పాత్ర వికసిత భారత లక్ష్యసాధనలో టెక్స్టైల్ రంగం పాత్రను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నాం’’ అన్నారు. భారత్ టెక్స్–2024ను మోదీ ప్రారంభించారు.‘‘వికసిత భారతానికి పేదలు, యువత, రైతులు, మహిళలు నాలుగు స్తంభాలు. వారందరికీ టెక్స్టైల్ రంగంలో గణనీయమైన పాత్ర ఉంటుంది’’ అని ఈ సందర్భంగా అన్నారు. 2014లో రూ.7 లక్షల కోట్లున్న భారత టెక్స్టైల్ రంగం విలువ ఇప్పుడు రూ.12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. నాలుగు రోజుల భారత్ ఎక్స్‌పోలో 100కు పైగా దేశాల నుంచి 3,500కు పైగా ఎగ్జిబిటర్లు, 3,000 పై చిలుకు కొనుగోలుదారులు, 40 వేల మందికి పైగా వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటున్నారు. -
Indian general election 2024: కాషాయ ప్ర‘దక్షిణం’..!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజ యాన్ని నమోదు చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్న బీజేపీ తన దృష్టినంతా దక్షిణా ది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కొరకరాని కొయ్యలా ఉన్న దక్షిణాది రాష్ట్రా లపై పట్టు సాధిస్తే కేంద్రంలో వరుస గా మూడోసారి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీకి నల్లేరుపై నడకే. ఉత్తరాదితో పోలిస్తే ముందునుంచీ సవాలుగానే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది... ఆరునూరైనా 60 దాటాల్సిందే...! కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలలో కలిపి మొత్తం 130 లోక్‌సభ స్థానాలున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కమలదళం పోటీ పడలేకపోతోంది. గత ఎన్నికల్లో కాషాయపార్టీ ఈ 130 సీట్లలో కేవలం 29 చోట్ల గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకుగాను నాలుగు చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడింది. ఈసారి మాత్రం దక్షిణాదిన ఎలాగైనా కనీసం 60 సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. బీజేపీ ఎత్తుగడలను ఇటీవలి కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బ తీశాయనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు 42.88 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36 శాతం ఓట్లకు పరిమితం కావడమే గాక రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించిన జేడీ(ఎస్)తో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను ఎలాగైనా సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసేలా వ్యూహాలు రచిస్తోంది. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇటీవలే ప్రధాని మోదీతో ఈ అంశమై చర్చలు జరిపారు. ఇక 2019లో నాలుగు లోక్‌సభ సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం రెట్టింపు చోట్ల గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని రెట్టింపునకు పెంచుకుని 14 శాతం ఓట్లు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లను కూడా డబుల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ఆశపడుతోంది. పదాధికారుల భేటీలో మోదీ, షా ద్వయం ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోశారు. కేరళలో... కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. వరుసగా 2104, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం ఎనిమిది సీట్లు సాధించాలని చూస్తోంది. గత ఎన్నికల్లో 12 శాతం ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25 శాతం ఓట్లు లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తన పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైనే ఆధారపడుతోంది. జనసేనతో పొత్తు కొనసాగినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 24 సీట్ల దాకా ఖాయమన్న వస్తాయన్న సర్వే సంస్థల వెల్లడి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఉత్తరాది నేతలకు బాధ్యతలు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా దిశగా వ్యూహ రచనకు బీజేపీ ఇప్పటికే టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, లాల్‌సింగ్ ఆర్య ఇందులో ఉన్నారు. రాష్ట్రాలవారీగా పార్టీ పరిస్థితులను అంచనా వేసి, తదనుగుణంగా గెలుపు వ్యూహాలను అధిష్టానం సిద్ధం చేసింది. వాటి అమలు బాధ్యతను గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ నేతలు కేశవ్ ప్రసాద్ మౌర్య, సునీల్ బన్సల్, స్వతంత్ర దేవ్ సింగ్, గుజరాత్‌కు చెందిన పర్ణేశ్ మోదీ, విజయ్ రూపానీ సేవలను కూడా వినియోగించుకోనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటుడు!
యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటుడు అలీ మర్చంట్. తాజాగా తన చిరకాల స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని వివాహం చేసుకున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అలీ.. ముచ్చటగా మూడోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!) వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. సినీతారల కోసం ప్రత్యేకంగా నవంబర్ 15 న ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. కాగా.. అలీ మర్చంట్ ఇంతకుముందే నటి సారా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే విడిపోయారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్‌ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. తాజాగా మూడోసారి తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు. కాగా.. అలీ 'యే రిష్తా క్యా కెహ్లతా హై', 'బాందిని', 'యే హై ఆషికి' వంటి సీరియల్స్‌లో నటించారు. అంతే కాకుండా లాక్అప్ -1 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆయన భార్య ఆండ్లీబ్ మోడల్‌గా రాణిస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్!) View this post on Instagram A post shared by Ali Mercchant (@alimercchant) -
లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ
కోల్‌కతా: దేశంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని, అరాచకం తప్పదని తృణమూల్ కాంగ్రెŠ పారీ్ట(టీఎంసీ) అధినేత, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచిందని మమత మండిపడ్డారు. బీజేపీ గనుక మళ్లీ గెలిస్తే ప్రజల నడుమ విద్వేషాలు మరింత రగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను అంతం చేశానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని సైతం మట్టికరిపిస్తానని చెప్పారు. వచ్చే ఏడాది జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లోనే జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. డిసెంబర్లో ఎన్నికలకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకులు ఇప్పటికే దేశంలోని అన్ని హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారని వెల్లడించారు. ఇతర పారీ్టలకు హెలికాప్టర్లు లభించకూడదన్నదే బీజేపీ ఎత్తుగడ అని విమర్శించారు. సోమవారం కోల్‌కతాలో టీఎంసీ యువజన విభాగం ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. -
Times Now Survey On 2024 Elections: మళ్లీ ఎన్డీయేనే..
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్ నౌ’సర్వే తేలి్చచెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయేకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఎన్డీయేలోని ప్రధానపక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతంపరంగా చూస్తే ఎన్డీయేకు 42.60శాతం, ఇండియాకు 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని తేలి్చంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు గాను దాదాపు మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని తేలి్చచెప్పింది. అంతేకాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగనున్నట్లు గుర్తించింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలు వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితికి(బీఆర్ఎస్) 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని సర్వే తెలియజేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 2 నుంచి 3, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నట్లు అంచనావేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు వైఎస్సార్సీపీ 24–25 ఎన్డీయే 0–1 ఇండియా 0 ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం వైఎస్సార్సీపీ 51.3 ఎన్డీయే 1.13 ఇండియా – తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు బీఆర్ఎస్ 9–11 ఎన్డీయే 2–3 ఇండియా 3–4 ఇతరులు 1 తెలంగాణలో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం బీఆర్ఎస్ 38.40 ఎన్డీయే 24.30 ఇండియా 29.90 ఇతరులు 7.40 జాతీయ స్థాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు (మొత్తం సీట్లు 543) కూటమి సీట్లు ఎన్డీయే 296–326 (ఓట్ల శాతం 42.60) ఇండియా 160–190 (ఓట్ల శాతం 40.20) పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆమ్ ఆద్మీ పార్టీ 5–7 ఇతరులు 70–80 ఏ కూటమికి ఎన్ని సీట్లు కూటమి సీట్లు ఓట్ల శాతం ఎన్డీయే 296–326 42.60 ఇండియా 160–190 40.20 మొత్తం సీట్లు 543 – ఏ పారీ్టకి ఎన్ని సీట్లు పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆప్ 5–7 ఇతరులు 70–80 -
PM Narendra Modi: మూడోసారీ మేమే...
న్యూఢిల్లీ: వరుసగా మూడో పర్యాయం ప్రధాని పదవిని చేపడతానని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తమ మూడో పర్యాయంలో మెరుగైన వృద్ధిరేటుతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ భారత్ తప్పకుండా పేదరిక నిర్మూలన సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినపుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా... ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. -
చరిత్రకెక్కిన జిన్‌పింగ్
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(69) సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశాధ్యక్షుడిగా, సైన్యాధిపతిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. జిన్‌పింగ్ ఎన్నికకు చైనా పార్లమెంట్ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ఆయన చైనా అధ్యక్షుడిగా, అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) చైర్మన్‌గా మరో ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారు. ఒకవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతుండడం, మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన జీవితకాలం ఇదే పదవిలో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం పార్టీ రాజ్యాంగాన్ని 2018లో సవరించారు. ఉపాధ్యక్షుడిగా హన్ జెంగ్ జిన్‌పింగ్‌ను మరోసారి దేశాధ్యక్షుడిగా, సీఎంసీ చైర్మన్‌గా నియమిస్తూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) చేసిన ప్రతిపాదనను రబ్బర్ స్టాంప్ పార్లమెంట్‌గా ముద్రపడిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) లాంఛనంగా ఆమోదించింది. పార్లమెంట్‌లోని 2,952 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. చైనాలో ఒక నాయకుడు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. జిన్‌పింగ్ కంటే ముందు పనిచేసిన అధ్యక్షులంతా రెండు పర్యాయాలే(10 సంవత్సరాలు) పదవీలో కొనసాగారు. చైనా మాజీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్పీసీ నియమించింది. గత ఏడాది అక్టోబర్ జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీలో జిన్‌పింగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. మావో జెడాంగ్ తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైజిన్‌పింగ్ రికార్డుకెక్కారు. దూకుడు పెంచుతారా? జిన్‌పింగ్ చేతిలో ప్రస్తుతం మూడు శక్తివంతమైన పదవులు ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరోసారి కుర్చీ దక్కడంతో జిన్‌పింగ్ దూకుడు పెంచే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా. పొరుగు దేశం భారత్‌పై ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందంటున్నారు. సెంట్రల్ కేబినెట్(స్టేట్ కౌన్సిల్)కు నేతృత్వం వహిస్తున్న చైనా ప్రధాని (ప్రీమియర్) లీ కెకియాంగ్ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో జిన్‌పింగ్‌కు సన్నిహితుడైన లీ కియాంగ్‌ను శనివారం ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా) -
చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా..
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (69) చరిత్ర సృష్టించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకుడు ఆయనే! బీజింగ్‌లోని ఆర్నేట్ గ్రేట్ హాల్లో ఆదివారం సీపీసీ 20వ సెంట్రల్ కమిటీ ప్లీనరీ జిన్‌పింగ్ అధ్యక్షతన జరిగింది. 203 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 168 మంది ప్రత్యామ్నాయ సభ్యులు పాల్గొన్నారు. జిన్‌పింగ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 24 మందితో సీపీసీ పొలిట్‌బ్యూరోకూ సెంట్రల్ కమిటీ ఆమోదముద్ర వేసింది. జిన్‌పింగ్ సహా ఏడుగురు సభ్యులతో అత్యంత శక్తిమంతమైన స్టాండింగ్ కమిటీనీ ఎన్నుకున్నారు. ఇందులో జిన్‌పింగ్ మద్దతుదారులకే స్థానం దక్కింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నికయ్యాయని జిన్‌పింగ్ స్వయంగా ప్రకటించారు. సీపీసీ షాంఘై అధ్యక్షుడు లీ ఖియాంగ్.. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. చైనా ప్రీమియర్ (ప్రధానమంతి) లీ కెఖియాంగ్ వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రీమియర్‌గా లీ ఖియాంగ్ బాధ్యతలు చేపడతారన్న ప్రచారం సాగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ.. చైనా ప్రజలకు వెన్నెముక ప్రపంచానికి చైనా అవసరం, చైనాకు ప్రపంచం అవసరం ఉందని షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉంటూ చైనా అభివృద్ధి చెందలేదని అన్నారు. అలాగే ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ప్రపంచానికి చైనా కావాలని చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థ నమ్మదగినది, స్వేచ్ఛాయుతమైనది అని పేర్కొన్నారు. పునాది బలంగా ఉందని వివరించారు. దేశ విదేశీ పెట్టుబడుల కోసం తలుపులు తెరిచి ఉంచామని వెల్లడించారు. సంస్కరణల విషయంలో స్థిరంగా ముందుకు కదులుతున్నామని చెప్పారు. సౌభాగ్యవంతమైన చైనా బాహ్య ప్రపంచం కోసం ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. మార్క్సిజం వైపు మొగ్గు చూపుతుండడంతోపాటు చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించారు. నూతన శకంలో సోషలిజం అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వందేళ్ల చరిత్ర ఉన్న.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ స్వయం సంస్కరణ ద్వారా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మన పార్టీ చైనా ప్రజలకు ఒక బలమైన వెన్నుముకగా మారాలన్నారు. ఘన కీర్తి కలిగిన చైనా అద్భుతమైన కలలతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తోందని జిన్‌పింగ్ వివరించారు. మార్గసూచి(రోడ్‌మ్యాప్) తయారు చేసుకున్నామని, శంఖం పూరించామని చెప్పారు. మన దేశానికి మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీకి పక్షపాతానికి తావులేని వాస్తవికమైన ప్రచారం కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మూడు అత్యున్నత పదవులు అత్యంత శక్తిమంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్‌గా జిన్‌పింగ్‌ను కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూర్ మరోసారి నియమించింది. ఆయనకు మూడు అత్యున్నత పదవులు దక్కాయి. దేశాధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా, సీఎంసీ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) జనరల్స్ ఝాంగ్ యుషియా, హీ వీడాంగ్‌ను సీఎంసీ వైస్ చైర్మన్లుగా నియమించారు. పలువురు సైనిక ఉన్నతాధికారులకు సెంట్రల్ మిలటరీ కమిషన్‌లో సభ్యులుగా అవకాశం లభించింది. ఆదివారం సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ (సీసీడీఐ) స్టాండింగ్ కమిటీ కార్యదర్శి, ఉప కార్యదర్శులు, సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 24 మందితో కూడిన సీపీసీ పొలిట్‌బ్యూరోలో మహిళలకు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత! -
జిన్‌పింగ్ మూడోస్సారి!
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (69) రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు నేడు లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. ఐదేళ్లకోసారి జరిగే వారం రోజుల కమ్యూనిస్టు పార్టీ సదస్సు శనివారం 205 మంది సెంట్రల్ కమిటీ సభ్యుల ఎన్నికతో ముగిసింది. ఆదివారం వీరంతా కలిసి 25 మంది పొలిటికల్ బ్యూరో సభ్యులను ఎన్నుకుంటారు. తర్వాత వారు దేశ పాలనా వ్యవహారాలన్నీ చక్కబెట్టేందుకు ఏడుగురు, లేదా అంతకంటే ఎక్కువ మందితో కీలకమైన స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటారు. వారిలోంచి ఒకరు ప్రధాన కార్యదర్శి పార్టీనీ, అధ్యక్ష హోదాలో దేశాన్నీ నడిపిస్తారు. జిన్‌పింగ్‌తో పాటు ఆయన మద్దతుదారులు చాలామంది సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ వరుసగా మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై అధ్యక్షునిగా కొనసాగడం లాంఛనమేనని పరిశీలకులు భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్అనంతరం పదేళ్లకు పైగా అధ్యక్ష పడవిలో కొనసాగనున్న తొలి నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక మావో మాదిరిగానే జీవితకాలం పదవిలో కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు. మావో అనంతరం చైనా అధ్యక్షులైన వారంతా పార్టీ నియమావళి ప్రకారం రెండుసార్లు పదవీకాలం పూర్తయ్యాక తప్పుకుంటూ వచ్చారు. కమిటీలో కుదుపులు పలువురు ప్రముఖులను ఇంటిదారి పట్టిస్తూ సెంట్రల్ కమిటీని భారీగా ప్రక్షాళించారు. జిన్‌పింగ్ తర్వాత నంబర్ టూగా కొనసాగుతున్న ప్రధాని లీ కీ కియాంగ్ (67), ఉప ప్రధాని హన్ జెంగ్ (68), నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ లీ జాన్షు (72), చైనీస్ పీపుల్స్ పొలికిటల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ చైర్మన్ వాంగ్ యాంగ్ (67) సహా పలువురు ప్రముఖులకు కమిటీలో చోటు దక్కకపోవడం విశేషం! పైగా వీరంతా పదవీకాలం ముగుస్తున్న జిన్‌పింగ్ సారథ్యంలోని ప్రస్తుత స్టాండింగ్ కమిటీలో సభ్యులు కూడా!! జిన్‌పింగ్‌కు మరిన్ని విశేషాధికారాలు కట్టబెడుతూ శనివారం సదస్సు తీర్మానాలను ఆమోదించింది. అనంతరం జిన్‌పింగ్ ప్రసంగించారు. ‘‘కష్టించేందుకు, గెలిచేందుకు భయపడొద్దు. చిత్తశుద్ధితో ముందుకు సాగాలి’’ అంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం!
జన చైనా అధినేతగా షీ జిన్‌పింగ్(69)ను వరుసగా మూడోసారి ఎన్నుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది. మరో ఐదేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగడం ఖాయమే. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితకాలం పదవిలో ఉండేలా అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) తీర్మానాన్ని ఆమోదించినా ఆశ్చర్యం లేదు. పార్టీ దివంగత నేత మావో జెడాంగ్ తర్వాత మూడుసార్లు చైనా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన నాయకుడిగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించబోతున్నారు. కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ సదస్సు ఈ నెల 16న జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిన్‌పింగ్ జాగ్రత్తగా ‘ఎన్నిక చేసిన’ 2,296 మంది ప్రతినిధులు పాల్గొంటారు. వీరంతా జిన్‌పింగ్‌కు మరోసారి పట్టంకడతారు. ప్రపంచ శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న డ్రాగన్ దేశంపై అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. చైనా దూకుడును అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతుండడం ఆసక్తికరంగా మారింది. ’పదేళ్ల పదవీ కాలం’ విధానానికి మంగళం చైనాలో ’పదేళ్ల పదవీ కాలం’ అనే నిబంధనకు కాలం చెల్లబోతోంది. ఇన్నాళ్లూ ’రెండు పర్యాయాలు.. ఒక్కోటి ఐదేళ్లు’ అనే విధానం కఠినంగా అమలయ్యింది. అంటే ఒక అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో కొనసాగడానికి వీల్లేదు. ఏకైక రాజకీయ పార్టీ ఉన్న చైనాలో ఏక వ్యక్తి ఆధిపత్యం అరాచకానికి దారితీస్తుందన్న అంచనాతో ఈ విధానం ప్రవేశపెట్టారు. మావో జెడాంగ్ మినహా జిన్‌పింగ్ కంటే ముందు అధికారంలో ఉన్న అధ్యక్షులంతా దీనికి కట్టుబడి ఉన్నారు. మావో జెడాంగ్ 1976 దాకా అధికారంలో కొనసాగారు. పాలనలో తన బ్రాండ్ అయిన ’జెడాంగ్ ఆలోచన’ను అమలు చేశారు. పెట్టుబడిదారులపై కఠిన ఆంక్షలు విధించారు. సాంస్కృతిక విప్లవం వంటి ప్రయోగాలు చేశారు. జెడాంగ్ పాలనలో చైనా దాదాపు దివాలా దశకు చేరుకుంది. అనంతరం సర్వోన్నత నాయకుడిగా పేరుగాంచిన డెంగ్ జియావోపింగ్ అధికారంలోకి వచ్చారు. మావో విధానాలకు మంగళం పాడుతూ తనదైన ఆర్థిక విధానాలకు తెరతీశారు. ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు. ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉంటే దేశానికి ముప్పేనన్న అంచనాతో ’పదేళ్ల పదవీ కాలాన్ని, 68 ఏళ్ల వయోపరిమితిని’ ప్రవేశపెట్టారు. 1982లో జరిగిన సీపీసీ 12వ జాతీయ సదస్సులో వీటికి ఆమోదం లభించింది. ఆ తర్వాత జియాంగ్ జెమిన్, హూ జింటావో అధికారంలోకి వచ్చారు. వారి హయాంలోనే చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ‘నూతన మావో’ జిన్‌పింగ్ 31953 జూన్ 15న జన్మించిన షీ జిన్‌పింగ్ 2008 నుంచి 2013 వరకూ హూ జింటావో హయాంలో చైనా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అటు పిమ్మట సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) చైర్మన్‌గా మారారు. 2013 మార్చి 14న ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ 7వ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి నిరాటంకంగా కుర్చీని అధిరోహిస్తున్నారు. సైన్యం, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా జిన్‌పింగ్ నియంత్రణలోకి వచ్చాయి. మూడున్నర దశాబ్దాల తర్వాత ‘వన్ లీడర్’ పాలన మొదలయ్యింది. పదేళ్ల పదవీ కాలం నిబంధన ప్రకారం 2023లో ఆయన పాలన ముగిసిపోవాలి. కానీ, ‘నూతన మావో’ కావాలన్నది జిన్‌పింగ్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఆయన సాధించినట్లేనని చెప్పుకోవచ్చు. ► జిన్‌పింగ్ మరింత శక్తివంతమైన నాయకుడిగా అవతరించబోతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పదేళ్లలో అధికారాన్ని జిన్‌పింగ్ కేంద్రీకృతం చేశారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు. మాజీ అధినేతలతో పోలిస్తే ఎక్కువ అధికారాలను అనుభవిస్తున్నారు. ► జిన్‌పింగ్‌కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి జోంగ్‌షున్ జైలుపాలయ్యారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న యువత గ్రామాల్లో రైతులతో కలిసి జీవించాలని మావో ఆదేశించడంతో 1969లో జిన్‌పింగ్ షాన్షీ ప్రావిన్స్‌లోని ఓ మారుమూల పల్లెకు చేరుకున్నారు. అక్కడ ఓ గుడిసెలోనే ఆరేళ్లపాటు జీవనం సాగింది. ► పల్లె జీవితం తర్వాత జిన్‌పింగ్ బీజింగ్‌లోని తిసింగ్‌హువా యూనివర్సిటీలో చేరారు. స్కాలర్‌షిప్‌తో చదువుకున్నారు. తర్వాత చైనా రక్షణశాఖలో మూడేళ్లపాటు పనిచేశారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం నాటికి ఆదే పావిన్స్ గవర్నర్‌గా ఎదిగారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్ బీజింగ్ కౌంటీ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ► 2002లో జెజీయాంగ్ ప్రావిన్స్‌లో పార్టీ చీఫ్‌గా, 2007లో షాంఘైలో పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో శక్తివంతమైన స్టాడింగ్ కమిటీలో సభ్యుడిగా చేరారు. ► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పేరును ప్రతిపాదిస్తూ 2012లో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించారు. ► తైవాన్ విషయంలో అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తైవాన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాలో కలిపేసుకుంటామని జిన్‌పింగ్ చెబుతున్నారు. ► చైనాలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, మీడియాపై ఆంక్షలు సర్వసాధారణంగా మారాయి. ► హాంకాంగ్‌లో శాంతియుత నిరసనలను కఠినంగా అణచివేశారు. ► జిన్‌పింగ్ అమల్లోకి తీసుకొచ్చిన ‘జీరో–కోవిడ్’ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాక్డౌన్లు కాదు, స్వేచ్ఛ కావాలంటూ జనం నినదిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
త్రివిక్రమ్-మహేశ్‌బాబు సినిమా షూటింగ్ అప్పుడే..
‘అతడు’ (2005), ‘ఖలేజా’(2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండోవారం నుంచి ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. తొలుత ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ‘మహర్షి’ చిత్రం తర్వాత మహేశ్‌బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ఇది. చినబాబు (ఎస్.రాధాకృష్ణ) నిర్మిస్తున్న ఈ మూవీ 2023 ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. -
ఎదురులేని నేతగా జిన్‌పింగ్
బీజింగ్: డ్రాగన్ దేశంపై అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(68) మరింత పట్టు బిగించారు. చైనా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆయన వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమమైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) సాధించిన విజయాలను, జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా సాధించిన ఘనతలను, అభివృద్ధిని ప్రస్తుతిస్తూ అధికార సీపీసీ 19వ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీలో చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ చరిత్రలో ఇలాంటి తీర్మానం చేయడం ఇది మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. రాజధాని బీజింగ్‌లో ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సీపీసీ ప్లీనరీ గురువారం ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో కీలకమైన అంశాలపై చర్చించారు. కమ్యూనిస్టు పార్టీ శుక్రవారం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనుంది. ప్లీనరీలో జిన్‌పింగ్ సీపీసీ కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో తరపున వర్క్ రిపోర్టు సమర్పించారు. తీర్మానం ముసాయిదాపై మాట్లాడారు. సీపీసీ 20వ జాతీయ సదస్సును(ఐదేళ్లకోసారి జరుగుతుంది) 2022లో జూలై తర్వాత నిర్వహించనున్నారు. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ఎంపికను ఆ సదస్సులో అధికారికంగా ఆమోదించనున్నారు. ఆయన ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, చైనా త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌గా(సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్), దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మూడు అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆ వెంటనే మరోసారి అదే పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లే. చైనాలో మూడుసార్లు అధ్యక్ష పదవిని అధిష్టించే అవకాశం ఇప్పటిదాకా ఎవరికీ దక్కలేదు. 2018లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం జిన్‌పింగ్ జీవితకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే వెసులుబాటు కూడా ఉంది. -
ముచ్చటగా మూడోసారి
నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో ‘శివమణి’ సూపర్’ చిత్రాలు తెరకెక్కాయి. మూడోసారి ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుందన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చేస్తున్నారు. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు పూరి జగన్నాథ్ తన తొలి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫైటర్’తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాక పూరి, నాగార్జున చిత్రం సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. -
కోల్‌కతాకే ఐఎస్ఎల్ కిరీటం
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ చరిత్రలో అట్లెటికో డి కోల్‌కతా జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఆరో సీజన్ ఫైనల్లో కోల్‌కతా 3–1 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. దాంతో ఐఎస్ఎల్ టైటిల్‌ను అత్యధికంగా మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఆరు సీజన్లు జరగ్గా... అందులో కోల్‌కతా (2014, 2016, 2019–20), చెన్నైయిన్ రెండు సార్లు (2015, 2017–18), బెంగళూరు ఒకసారి (2018–19) విజేతలుగా నిలిచాయి. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో నిర్వహించిన ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కోల్‌కతా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదల్లేదు. కోల్‌కతా ప్లేయర్ జావీ (10వ, 90+3వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... గార్సియా (48వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. చెన్నైయిన్ తరఫున వాల్‌స్కీస్ (69వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో చెన్నైయిన్ ప్లేయర్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలను కోల్‌కతా గోల్ కీపర్ అరిందామ్ భట్టాచార్య సమర్థవంతంగా అడ్డుకున్నాడు. సీజన్ చాంపియన్ కోల్‌కతాకు రూ. 8 కోట్లు... రన్నరప్ చెన్నైయిన్ రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. 15 గోల్స్ సాధించిన చెన్నైయిన్ ఆటగాడు వాల్‌స్కీస్‌కు ‘గోల్డెన్ బూట్’ అవార్డు దక్కింది. గోల్డెన్ గ్లవ్ అవార్డును బెంగళూరు ఎఫ్‌సీ గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు గెల్చుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ సుమీత్ (కోల్‌కతా)... ‘హీరో ఆఫ్ ద లీగ్’గా హ్యూగో బౌమౌస్ (గోవా ఎఫ్‌సీ) నిలిచారు.