విశాల్‌తో ముచ్చటగా... | Vishal and Lakshmi Menon for the Third Time? | Sakshi

విశాల్‌తో ముచ్చటగా...

Oct 24 2014 11:35 PM | Updated on Sep 2 2017 3:19 PM

విశాల్‌తో ముచ్చటగా...

విశాల్‌తో ముచ్చటగా...

నటీనటుల్లో కొన్ని జంటలు హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటాయిమరి కొందరు సంచలన జంటలుగా గుర్తింపు పొందుతాయిఈ అటు హిట్ పెరయినూ, ఇటు సెన్సేషనల్‌గానూ పేరొందిన

 నటీనటుల్లో కొన్ని జంటలు హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటాయిమరి కొందరు సంచలన జంటలుగా గుర్తింపు పొందుతాయిఈ అటు హిట్ పెరయినూ, ఇటు సెన్సేషనల్‌గానూ పేరొందిన జంట విశాల్, లక్ష్మీమీనన్. వీరిద్దరూ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం పాండియనాడు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రజాదరణ పొందింది. ఆ తరువాత వీరు నటించిన చిత్రం నాన్ శివప్పు మనిదన్. ఈ చిత్రం విజయం సాధించింది. అంతేకాదు ఈ చిత్రంలో విశాల్, లక్ష్మీమీనన్‌ల లిప్‌లాక్ సన్నివేశాలు కోలీవుడ్‌లో పెద్ద కలకలాన్నే సృష్టించాయి. అంతటితో ఆగలేదు విశాల్, లక్ష్మీమీనన్‌లమధ్య ప్రేమాయణం సాగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించారు.
 
 అయితే చర్చనీయాంశంగా మారిన అంశమేమిటంటే, ఈ జంట ముచ్చటగా మూడోసారి కలసి నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ జంట హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతుంటే దర్శకుడు సుశీంద్రన్ వీరితో సెకండ్ హిట్‌కు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం విశాల్ సుందర్ సి దర్శకత్వంలో ఆంబళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్. అదే విధంగా నటి లక్ష్మీమీనన్ ప్రస్తుతం కార్తీతో కొంబన్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో ధనుష్‌తో జోడి కట్టడానికి ఈ అమ్మడితో చర్చలు జరుపుతున్నారు. అయితే విశాల్‌తో మూడవసారి రొమాన్స్ చేసే చిత్రం డిసెంబర్‌లో మొదలవుతుందని నటి లక్ష్మీమీనన్ వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement