Vishal Clarification On Wedding Rumours With Lakshmi Menon; Tweet Viral - Sakshi
Sakshi News home page

Vishal-Lakshmi Menon: త్వరలో హీరోయిన్‌తో పెళ్లంటూ రూమర్స్‌.. ఎట్టకేలకు స్పందించిన హీరో

Aug 11 2023 12:56 PM | Updated on Aug 11 2023 1:36 PM

Vishal Respond on His Marriage Rumor - Sakshi

ఈ సారి లక్ష్మీ మీనన్‌తో నా పెళ్లి జరగబోతుందని ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. తనతో పెళ్లంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

కోలీవుడ్‌ హీరో విశాల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. హీరోయిన్‌ లక్ష్మీ మీనన్‌తో ఏడడుగులు వేయబోతున్నాడన్నది సదరు వార్త సారాంశం. తాజాగా ఈ రూమర్స్‌పై విశాల్‌ క్లారిటీ ఇచ్చాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. 'సాధారణంగా పుకార్లు, అసత్య ప్రచారాలపై నేను స్పందించను. ఎందుకంటే అలాంటివాటిపై స్పందించి కూడా టైం వేస్ట్‌ అనిపిస్తుంది. కానీ ఈ సారి లక్ష్మీ మీనన్‌తో నా పెళ్లి జరగబోతుందని ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. తనతో పెళ్లంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

మీరెలా చెప్తారు?
ఈసారి నేను రియాక్ట్‌ అవ్వడానికి గల ఏకైక కారణం.. అమ్మాయి పేరు ప్రస్తావించడం! ఆమె నటి అయినప్పటికీ తను కూడా ఒక అమ్మాయే కదా! తన పేరుప్రతిష్టలకు భంగం కలిగిస్తూ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను? ఎప్పుడు చేసుకుంటాను అనేది మీరెలా చెప్తారు? నిజంగా నా జీవితంలో శుభఘడియలు ప్రవేశించినప్పుడు నేనే స్వయంగా అందరికీ అధికారికంగా వెల్లడిస్తాను' అని ట్వీట్‌ చేశాడు. దీంతో విశాల్‌- లక్ష్మీ మీనన్‌ల పెళ్లి ప్రచారం వుట్టిదేనని తేలిపోయింది.

విశాల్‌ సినిమాల విషయానికి వస్తే..
ఇకపోతే ప్రస్తుతం విశాల్‌ మార్క్‌ ఆంటోని సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇది కాకుండా ఆయన చేతిలో మరో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఇందులో ఒకటి స్వయంగా విశాలే డైరెక్షన్‌ చేస్తున్నాడు. ఇప్పటివరకు తనలోని నటుడినే చూపించిన విశాల్‌ ఇప్పుడు తనలోని దర్శకుడి కోణాన్ని కూడా బయటపెడుతున్నాడు.

చదవండి: జైలర్‌ రికార్డు స్థాయి వసూళ్లు.. ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement