Chakra Actor Vishal Shocking Comments On His Marriage Rumours - Sakshi
Sakshi News home page

త్వరలో శుభవార్త చెప్తా: విశాల్‌

Published Thu, Feb 25 2021 3:01 PM | Last Updated on Thu, Feb 25 2021 3:14 PM

Vishal Breaks Silence On Wedding Rumours - Sakshi

యాక్షన్‌ సీన్లకు పెట్టింది పేరైన విశాల్‌ ఈ మధ్యే 'చక్ర' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఎప్పటిలాగే యాక్షన్‌ సన్నివేశాలు పుష్కలంగా ఉన్న ఇది అక్కడక్కడా అభిమన్యుడు సినిమాను గుర్తు చేస్తుంది. యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ను చేరుకుంటుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇదిలా వుంటే మరోసారి ఈ హీరో పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని విశాల్‌ దగ్గర ప్రస్తవించగా తానింకా సింగిలేనని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేశాడు.

"పెళ్లి అనేది ఎప్పుడు జరగాలని రాసి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు నేను కూడా తల వంచాల్సిందే. కానీ నేనో సక్సెస్‌ఫుల్‌ నటుడిగా, నిర్మాతగా మారతానని అస్సలు ఊహించలేదు. నా 16 ఏళ్ల ప్రయాణం ఇంత బాగా సాగుతుందనుకోలేదు. నా తర్వాతి ఇంటర్వ్యూలో మీకు తప్పకుండా ఓ శుభవార్త చెప్తా" అంటూ అభిమానులను డోలాయమానంలో పడేశాడు. కాగా విశాల్‌ 2019 మార్చిలో హైదరాబాదీకి చెందిన అనీశా అల్లాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఏమైందో తెలీదు కానీ ఈ జంట తర్వాత పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె మరొకరితో ఏడడుగులు వేసినట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇన్నాళ్లు తనలో నటనా కోణం చూపించిన విశాల్‌ 'తుప్పరివాలన్‌ 2'తో సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు.

చదవండి: Chakra Movie Review: 'చక్ర' వ్యూహంలో అభిమన్యుడు!

వచ్చే ఉగాదికి స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేస్తా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement