హీరో విశాల్ (Vishal) ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజ్‌కు నోచుకోవడం గమనార్హం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశాల్ బక్కచిక్కిపోయి వణుకుతూ కనిపించాడు. మైక్ పట్టుకున్నప్పుడు అతడి చేతులు వణకడంతో పాటు మాట కూడా తడబడుతూ వచ్చింది. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు విశాల్‌కు ఏమైందని ఆందోళన చెందారు.
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విశాల్
ఈ క్రమంలో విశాల్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం అతడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ విశాల్ సినిమా ఈవెంట్‌కు రావడాన్ని పలువురూ అభినందిస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించాలని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేశారు.
ఆరు నెలలకోసారి దూరం?
తాజాగా విశాల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. మదగజరాజ సినిమా (Madha Gaja Raja Movie) ప్రీమియర్ షోకు హాజరైన విశాల్.. తన హెల్త్ అప్‌డేట్ ఇచ్చాడు. మా నాన్నగారి సంకల్పం వల్లే నేను ధృడంగా ఉండగలుగుతున్నాను. ఆయన ఇచ్చిన శక్తి వల్లే నా జీవితంలో ఎదురైన అడ్డంకులను దాటగలుగుతున్నాను. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మూడు, ఆరు నెలలకోసారి సినిమాలకు దూరంగా ఉంటున్నానని, సరిగా పని చేయట్లేదని అంటున్నారు. ఎన్ని మాటలన్నా నేను మరింత శక్తి కూడదీసుకుని మీ ముందుకొస్తాను.
(చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)
ఇప్పుడు బానే ఉన్నాను
నేను అనారోగ్యంగా ఉండటం చూసి అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు నేను బాగున్నాను. చూడండి, నా చేతులు కూడా వణకడం లేదు. నా ఆరోగ్యం బాగుంది. మీరు చూపించిన ప్రేమకు తుదిశ్వాస వరకు రుణపడి ఉంటాను. మీ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చాడు.
ఆ సినిమాతో హీరోగా క్రేజ్
కాగా విశాల్.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండ కోడి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇంది తెలుగులో పందెం కోడిగా విడుదలవగా ఇక్కడ కూడా హిట్‌గా నిలిచింది. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్ ఇవన్, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్, ఎనిమీ, సండకోడి 2, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు.
ఎయిట్ ప్యాక్‌తో విశాల్
మార్క్ ఆంటోని మూవీలో అదరదా పాట.. విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమాలోని మై డియర్ లవరూ సాంగ్ కూడా అతడే పాడటం విశేషం. ఇందులో విశాల్ ఎయిట్ ప్యాక్స్‌లో కనిపిస్తాడని డైరెక్టర్ సుందర్ తెలిపాడు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సుందర్ మాట్లాడుతూ.. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలని హీరోకు చెప్పాను. కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్‌గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది.
#Vishal Watching #MadhaGajaRaja Special Premiere 💯
pic.twitter.com/sb9XNuvrt0— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) January 11, 2025
Comments
Please login to add a commentAdd a comment