Lakshmi Menon
-
‘శబ్దం’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా హీరో నాని (ఫొటోలు)
-
జయం రవి హిట్ చిత్రానికి సీక్వెల్
చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు జయం రవి. ప్రస్తుతం ఈయన బ్రదర్, జీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో బ్రదర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా నటుడు జయం రవి 2016లో కథానాయకుడిగా నటించిన చిత్రం మిరుదన్. నటి లక్ష్మీమీనన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని శక్తి సౌందర్‌రాజన్ తెరకెక్కించారు. నటి అనికా సురేందరన్ నటుడు జయం రవికి చెల్లెలిగా నటించగా, నటి లక్ష్మీమీనన్ ఆయన్ని ప్రేమించే నాయకిగా నటించారు. ఆమె జోంబీ బారిన పడడంతో తనను కాపాడే ప్రయత్నంలో పోలీస్ అధికారి అయిన జయం రవి కూడా జోంబీగా మారే ఇతి వృత్తంతో రూపొందిన చిత్రం మిరుదన్. కాగా ఈ తరహా జోంబీల ఇతి వృత్తంతో ఆంగ్లంలోనే వచ్చాయి. అలా తొలిసారిగా దక్షిణాదిలో జోంబీల ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మిరుదన్. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా మిరుదన్ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆయన మొదలెట్టేశారట. వచ్చే ఏడాది ప్రఽథమార్థంలో మిరుదన్ 2 చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్నందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో నటుడు జయం రవి హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే హీరోయిన్గా నటి లక్ష్మీమీనన్‌నే నటింపజేస్తారా? లేక మరెవరినైనా ఎంపిక చేస్తారా? అన్నది వేచి చూడాలి. అయితే ఇటీవల నటి లక్ష్మీమీనన్‌కు సరైన అవకాశాలు లేవన్నది గమనార్హం. దీంతో మిరుదన్ 2 చిత్రంలో మరో నటి నాయకిగా నటించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. -
'శబ్దం' టీజర్ విడుదల.. మరో హిట్ ఖాయం
హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'శబ్దం'. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే 'వైశాలి' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆది పినిశెట్టి చాలా ఏళ్ల తర్వాత అరివళగన్ డైరెక్షన్లో 'శబ్దం' సినిమాలో నటించాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 7జి శివ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఆది పినిశెట్టితో పాటు ఈ చిత్రంలో లక్ష్మీ మేనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా క్రేజీగా ఉన్న ఈ ట్రైలర్‌ను తాజాగా విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ చిత్రం ఆత్మల వల్ల జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని టీజర్‌తో దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఆత్మల గురించి పరిశోధించే పాత్రలో ఆది కనిపించాడు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. హాంటెడ్ హౌస్‌లో అతీంద్రియ సంఘటనలు చుట్టూ టీజర్ నడిచింది. ముఖ్యంగా టీజర్లో థమన్ అందించిన ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయాని చెప్పవచ్చు. ఇందులోని బీజీఎమ్ చాలా కొత్తగా థమన్ అందించాడు. ముంబై, మున్నార్, చెన్నై తదితర ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం రూ.2కోట్ల బడ్జెట్‌తో 120ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించామని గతంలో చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పుడు అది టీజర్లో ప్రధాన హైలెట్‌గా నిలిచింది. టీజర్లో కెమెరామెన్ అరుణ్ బత్మనాభన్ ప్రతిభ మెరుగ్గానే ఉంది. ఈ సమ్మర్లోనే శబ్దం విడుదల కానుంది. -
స్కూల్లోనే ప్రేమలో పడ్డా.. కానీ అలా జరగలేదు: చంద్రముఖి నటి
కుంకీ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ నటి లక్ష్మీ మీనన్. ఆ తరువాత వరుసగా అవకాశాలు వరించడంతో బిజీగా మారిపోయింది. అలా పలు హిట్ చిత్రాలలో నటించిన ఈ అమ్మడు ప్లస్–2 పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే నటనకు విరామం తీసుకుంది. అదే లక్ష్మీమీనన్ చేసిన పెద్ద పొరపాటు. ఆమె తనకు తానుగా తీసుకున్న విరామం పర్మినెంట్‌గా మారింది. ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించినా అవి పెద్దగా ఆడలేదు. అలాంటిది గతేడాది చంద్రముఖి–2 చిత్రంలో మెరిసింది. ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. కాగా సమీప కాలంలో తమిళ నిర్మాతల మండలి ఇతర సినీ సంఘాలతో కలిసి నిర్వహించిన కలైంజర్- 100 కార్యక్రమంలో నటి లక్ష్మీమీనన్ ఓ పాటకు డాన్స్ చేసింది. అయితే తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన లక్ష్మి మీనన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మీరు ఎవరినైనా ప్రేమించారా? లేక మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? అన్న ప్రశ్నకు తన తొలి ప్రేమ అనుభవాన్ని వెల్లడించింది. తనను ఎవరూ ప్రేమించలేదని.. కానీ పాఠశాలలో చదువుతున్న సహ విద్యార్థితో తానే ప్రేమలో పడ్డానని చెప్పింది. అతను నచ్చడంతో నేరుగా అతని వద్దకు వెళ్లి తన ప్రేమ గురించి చెప్పానంది. కొన్ని రోజుల తరువాత అతను అంగీకరించాడని తెలిపింది. అయితే తామిద్దరం తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ఔటింగ్‌కు వెళ్లడం వంటివి జరగలేదని చెప్పింది. మేమిద్దరం కేవలం చదువుపైనే దృష్టి సారించి స్నేహితుల్లాగే ఉన్నామని తెలిపింది. ఎప్పుడో ఒకసారి కలిసి మాట్లాడుకునే వారమని చెప్పింది. అయితే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తరచూ కలుసుకునేవారిమని.. ఫోన్లో మాట్లాడుకునే వాళ్లమని చెప్పుకొచ్చింది. అలా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లమని వెల్లడించింది. అయితే పాఠశాల చదువు పూర్తయ్యాక మా మధ్య ప్రేమ కూడా కనిపించకుండా పోయిందని చెప్పింది. ఆ తరువాత ఇద్దరం తమ వృత్తిలో బిజీ అయిపోయామని చెప్పింది. కాగా.. అతను ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని చెప్పింది. దీంతో మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? అన్న ప్రశ్నకు ఇంట్లో వాళ్లు చూసిన వ్యక్తినే చేసుకుంటానని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by 𝐋𝐚𝐤𝐬𝐡𝐦𝐢 𝐌𝐞𝐧𝐨𝐧 (@lakshmimenon967) -
కమెడియన్‌తో జోడీ కట్టనున్న చంద్రముఖి 2 నటి
కుంకీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది మాలీవుడ్ భామ లక్ష్మీ మీనన్. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో ఈమెకు అవకాశాలు వరుస కట్టాయి. అలా విశాల్, విజయ్ సేతుపతి, విమల్ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకానొక సమయంలో విశాల్‌తో లవ్‌లో ఉందంటూ పుకార్లు కూడా వెలువడ్డాయి. హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయాలంటూ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే అదే ఆమె చేసిన పెద్ద తప్పిదంగా మారింది. సినీ పరిశ్రమ లక్ష్మీ మీనన్‌ను దాదాపు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ నటించటానికి సిద్ధం అని చెప్పినా ఆమె గోడును ఎవరూ పట్టించుకోలేదు. ఒకటీరెండు అవకాశాలు వచ్చాయి. కానీ పెద్దగా క్లిక్ అవలేదు. అలాంటిది ఇటీవల చంద్రముఖి– 2 చిత్రంలో సడన్‌గా మెరిసింది. ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించింది. ఈ సినిమా రిలీజైన తర్వాత గానీ అందులో లక్ష్మీమీనన్ నటించిందనే విషయం తెలియలేదు. తాజాగా ఈ బ్యూటీకి మరో అవకాశం వరించినట్లు సమాచారం. ప్రముఖ హాస్య నటుడు యోగిబాబుతో జతకట్టడానికి లక్ష్మీ మీనన్ సిద్ధమవుతోందని తెలిసింది. ఒక పక్క హీరోగానూ, మరో పక్క ప్రముఖ హీరోల చిత్రాల్లో హాస్య పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న యోగిబాబు సరసన నటించి లక్ష్మీ మీనన్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుందన్న మాట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: సలార్ కోసం కన్నడలో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన కేజీఎఫ్ విలన్ -
చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి
‘లాస్య విలసిత.. నవ నాట్యదేవత.. నటనాంకిత అభినయ వ్రత చారుధీర చరిత స్వాగతాంజలి.. స్వాగతాంజలి’ అంటూ సాగే పాట ‘చంద్రముఖి 2’ చిత్రంలోనిది. రాఘవా లారెన్స్, లక్ష్మీ మీనన్, కంగనా రనౌత్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రధారి కంగనా రనౌత్‌పై చిత్రీకరించిన ‘ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి’ పాట తెలుగు, తమిళ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. యం.యం. కీరవాణి స్వరకల్పనలో చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీనిధి తిరుమల పాడారు. ఇక రజనీకాంత్ హీరోగా జ్యోతిక, ప్రభు, నయనతార లీడ్ రోల్స్‌లో పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. -
Vishal-Lakshmi Menon: హీరోయిన్‌తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన విశాల్
కోలీవుడ్ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో ఏడడుగులు వేయబోతున్నాడన్నది సదరు వార్త సారాంశం. తాజాగా ఈ రూమర్స్‌పై విశాల్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. 'సాధారణంగా పుకార్లు, అసత్య ప్రచారాలపై నేను స్పందించను. ఎందుకంటే అలాంటివాటిపై స్పందించి కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఈ సారి లక్ష్మీ మీనన్‌తో నా పెళ్లి జరగబోతుందని ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. తనతో పెళ్లంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. మీరెలా చెప్తారు? ఈసారి నేను రియాక్ట్ అవ్వడానికి గల ఏకైక కారణం.. అమ్మాయి పేరు ప్రస్తావించడం! ఆమె నటి అయినప్పటికీ తను కూడా ఒక అమ్మాయే కదా! తన పేరుప్రతిష్టలకు భంగం కలిగిస్తూ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను? ఎప్పుడు చేసుకుంటాను అనేది మీరెలా చెప్తారు? నిజంగా నా జీవితంలో శుభఘడియలు ప్రవేశించినప్పుడు నేనే స్వయంగా అందరికీ అధికారికంగా వెల్లడిస్తాను' అని ట్వీట్ చేశాడు. దీంతో విశాల్- లక్ష్మీ మీనన్‌ల పెళ్లి ప్రచారం వుట్టిదేనని తేలిపోయింది. విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇకపోతే ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇది కాకుండా ఆయన చేతిలో మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి స్వయంగా విశాలే డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు తనలోని నటుడినే చూపించిన విశాల్ ఇప్పుడు తనలోని దర్శకుడి కోణాన్ని కూడా బయటపెడుతున్నాడు. Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless. The reason behind my response is only… — Vishal (@VishalKOfficial) August 11, 2023 చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు.. ఎంతంటే? -
ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !
కోలీవుడ్‌లో ప్రభు సాలమన్ దర్శకత్వం వహించిన 'కుమ్కీ' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో నటి లక్ష్మీ మీనన్ గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత జిగుర్తాండ, కుట్టిబులి, పాండియనాడు, నాన్ సికపు మన్మన్, కొంబన్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. విజయ్ సేతుపతి సరసన రెక్కై చిత్రంలో నటించి తమళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వేదాళంలో అజిత్‌కి చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. (ఇదే సినిమాకు రీమేక్‌గా చిరంజీవి 'భోళా శంకర్' వస్తున్న విషయం తెలిసిందే). వేదాళం తర్వాత కొన్నాళ్లుగా లక్ష్మీ మీనన్‌కు సినిమా అవకాశాలు రాలేదు. (ఇదీ చదవండి: రజినీ కంటే ఆ హీరోయిన్‌కి డబుల్ రెమ్యునరేషన్.. ఎవరో తెలుసా?) త్వరలో పెళ్లి చాలా రోజుల తర్వాత లక్ష్మీ మీనన్ ప్రస్తుతం చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తోంది. 27 ఏళ్ల నటి లక్ష్మీ మీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు విశాల్‌తో ఆమె పెళ్లి జరగబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడకపోవడంతో ఇంటర్నెట్లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పడుతుందని పలువురు తెలుపుతున్నారు. విశాల్‌తో ప్రేమ నటి లక్ష్మీ మీనన్ విశాల్‌తో కలిసి పాండియనాడు (పల్నాడు), ఇంద్రుడు, వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లో విశాల్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కానీ ఆ తర్వాత లక్ష్మీ మీనన్ విశాల్‌తో ఏ సినిమాలోనూ నటించకపోవడం గమనార్హం. ఈ సినిమాల పరిచయం నుంచి వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇంతవరకు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచారని, త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తాజాగ ఇరుకుటుంబాల పెద్దలకు తెలపడంతోనే ఈ వార్తలు ఇప్పడు ప్రచారంలోకి వచ్చాయని తెలుస్తోంది. -
‘శపథం’తో మళ్లీ వచ్చేస్తున్న లక్ష్మీ మీనన్!
తమిళ సినిమా: కుంకీ చిత్రంతో కోలీవుడ్‌ను తన వైపు తిప్పుకున్న నటి లక్ష్మీ మీనన్. ఆ తరువాత విశాల్, విజయ్ సేతుపతి, విమల్ వంటి కథానాయకులతో జతకట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మలయాళం కుట్టి కెరీర్ మంచి పీక్‌లో ఉండగానే ప్లస్–2 చదువును పూర్తి చేయాలంటూ నటనకు గ్యాప్ ఇచ్చింది. అదే ఈ అమ్మడు చేసిన పెద్ద పొరపాటు అని అ తరువాత తెలిసొచ్చినట్లుంది. కళ్లు తెరిచే సరికి అంతా తారుమారు అయ్యింది. అవకాశాలు పూర్తిగా దూరమయ్యాయి. విజయ్ సేతుపతితో రెక్క అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చినా, అది నిరాశ పరచడంతో లక్ష్మీ మీనన్ పూర్తిగా తెరమరుగై పోయింది. అలా 2016 తరువాత లక్ష్మీ మీనన్‌ను కోలీవుడ్ పట్టించుకోలేదు. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు నామమాత్రమే. అలాంటిది తాజాగా కొత్త చిత్రంతో తమిళంలో రీఎంట్రీ అవుతోంది. దర్శకుడు అరివళగన్ తాజాగా నటుడు ఆది పినిశెట్టి కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు ఈరమ్ అనే సక్సెస్ ఫుల్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. కాగా సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అరివళగన్ తన తాజా చిత్రాన్ని భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్నారు. దీనికి శపథం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా అరివళగన్ నిర్మాతగా మారడం విశేషం. దీన్ని ఆయన 7జీ ఫిలిమ్స్ శివతో కలిసి నిర్మిస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రంలో కథానాయకిగా నటి లక్ష్మీ మీనన్‌ను ఎంపిక చేశారు. దీనికి సంబంధించి నటి లక్ష్మీ మీనన్ ఫొటోతో పోస్టర్‌ను యూనిట్ వర్గాలు విడుదల చేశాయి. చిత్ర షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల ఎప్పుడు అన్నది త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన లక్ష్మీ మీనన్
అదృష్టం ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. హీరోయిన్ లక్ష్మీమీనన్‌కు అలాంటి అదృష్టమే పట్టిందనే టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. కుంకీ చిత్రంతో హీరోయిన్గా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ మలయాళ గుమ్మ ఆ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా విశాల్, కార్తీ, విమల్ వంటి నటులతో జత కట్టి విజయాలను అందుకుంది. మంచి ఫామ్‌లో ఉండగా పదో తరగతి పరీక్షలు రాయాలంటూ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అది కాస్తా లాంగ్ గ్యాప్ అయ్యింది. ఆ తరువాత ఒకటి, అర చిత్రాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో లక్ష్మీమీనన్ పేరు కోలీవుడ్‌లో దాదాపు మరుగున పడిపోయింది. అలాంటిది ఇప్పుడు సడన్ వార్తల్లో నానుతోంది. చంద్రముఖి–2 చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దర్శకుడు పూరి వాసు తెరకెక్కిస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నటి రాశీఖన్నాను నాయకిగా ఎంపిక చేసినట్లు మొదట ప్రచారం జరిగింది. ఆ తరువాత త్రిషను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వైరల్ అయ్యింది. తాజాగా ఆ లక్కీఛాన్స్ నటి లక్ష్మీమీనన్‌ను వరించినట్లు సమాచారం. -
‘ఆ చెత్త షోలో పాల్గొనేది లేదు’
చెన్నై : బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 4లో తాను పాల్గొనడం లేదని కోలీవుడ్ నటి లక్ష్మీ మీనన్ స్పష్టం చేశారు. అలాంటి చెత్త షోలో తాను పాల్గొనబోనని ఆమె తేల్చిచెప్పారు. ఇతరులు తిన్న ప్లేట్లు కడగడం,ఇతరులు వాడిన టాయిలెట్లు శుభ్రం చేయడం వంటి పనులు తాను చేయనని, ఇక ముందూ అలాంటి పనులు చేయనని చెప్పారు. బిగ్‌బాస్ షోలో తాను పాల్గొంటున్నట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. షో పేరుతో కెమెరా ముందు ఇతరులతో తాను ఫైట్ చేయాలనుకోనని తన ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో తెలిపారు. బిగ్‌బాస్ షోపై తాను స్పష్టంగా వివరణ ఇచ్చిన తర్వాత ఈ చెత్త షోలో తాను పాల్గొంటానని ఎవరూ ఊహాగానాలు చేయబోరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : స్వాతి దీక్షిత్ గురించి లాస్య చెప్పింది నిజమేనా? కాగా లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ప్లేట్లు కడిగేవారు, టాయిలెట్లను శుభ్రపరిచేవారిని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన స్టోరీపై పలువురు నెగెటివ్ మెసేజ్‌లు పంపుతున్నారని, ఇది తన అభిప్రాయమని..కొందరు ఈ షోను ఇష్టపడితే మరికొందరు ఇష్టపడరని లక్ష్మీ మీనన్ వివరణ ఇచ్చారు.ఇంటి వద్ద తన ప్లేట్లను తాను కడుగుతానని, తన టాయిలెట్‌ను తాను శుభ్రపరుస్తానని..కెమెరా ముందు అలాంటి పనలు చేయడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎవరినో బాధపెట్టేందుకు ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఇక కమల్ హాసన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తమిళ్ నాలుగో సీజన్ అక్టోబర్ 4 నుంచి ప్రసారం కానుంది. -
లక్ష్మీమీనన్ రీఎంట్రీ షురూ?
లక్ష్మీమీనన్ రీఎంట్రీ షురూ అయ్యిందన్నది తాజా సమాచారం. కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరచయమైన కేరళా కుట్టి లక్ష్మీమీనన్. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తరువాత వరుసగా అవకాశాలను రాబట్టుకుంది. కుట్టిపులి, పాండినాడు, కొంబన్ నాన్ సిగప్పు మణిదన్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అంతేకాదు పక్కింటిఅమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్న లక్ష్మీమీనన్ నటిగా మంచి ఫామ్‌లో ఉండగా చదువు, పరీక్షలు అంటూ నటనకు గ్యాప్ ఇచ్చింది. ఇది తన కెరీర్లో చేసిన పెద్ద పొరపాటు అని చెప్పక తప్పుదు. ఆ తరువాత ప్లస్‌టూ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాను. మళ్లీ నటిస్తాను అని చెప్పినా అవకాశాలు ముఖం చాటేశాయి. చదవండి: కరోనా ఎఫెక్ట్: నిఖిల్ వివాహం రద్దయ్యే ఛాన్స్ ఆ తరువాత విజయ్‌సేతుపతికి జంటగా రెక్క అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశపరచడంతో పాటు, అందులో అమ్మడు బాగా లావెక్కిందనే విమర్శలను మూటగట్టుకుంది. జయంరవితో మిరుదన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం 2016లో విడుదలైంది. అంతే ఆ తరువాత అక్ష్మీమీనన్ను తమిళ తెరపై చూడలేదు. కాగా ఆ మధ్య ప్రభుదేవాతో యంగ్ మంగ్ సంగ్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్ర నిర్మాణం ఏ స్థాయిలో ఉందనేది తెలియలేదు. కాగా చాలాకాలానికి అంటూ నాలుగేళ్ల తరువాత తాజాగా లక్ష్మీమీనన్ ఒక అవకాశాన్ని అందుకుంది. ఆమెకు కుట్టిపులి, కొంబన్ చిత్రాలతో సక్సెస్‌ను అందించిన దర్శకుడు ముత్తయ్యనే ఇప్పుడు రీఎంట్రీ కల్పిస్తున్నారు. ఈ దర్శకుడు తాజాగా నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా చిత్రం చేయనున్నారు. అందులో నటి లక్ష్మీమీనన్‌ను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా దర్శకుడు ముత్తయ్య ఇంతకుముందు గౌతమ్ కార్తీక్ హీరోగా దేవరాట్టం చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. అదేవిధంగా గౌతమ్‌మీనన్, లక్ష్మీమీనన్ జంటగా ఇంతకుముందు సిపాయ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదన్నది గమనార్హం. అన్నట్టు ఆ మధ్య బొద్దుగా బరువెక్కిన నటి లక్ష్మీమీనన్ ఇప్పుడు చాలా స్లిమ్‌గా తయారైంది. చదవండి: 'నా పార్టీ జెండా ఇంద్రధనుస్సు గుర్తు జామకాయ' -
శస్త్రచికిత్సతో స్లిమ్‌గా..
తమిళ సినిమా: కాస్త బొద్దుగా ఉన్న కథానాయికలు బరువు తగ్గి, మరింత నాజూగ్గా తయారవడానికి నోరు కుట్టుకుని, కసరత్తుతో నానా తంటాలు పడుతున్నారు. కోట్లు గడిస్తున్నా ఆహారపు కట్టుబాట్లంటూ డైట్ చేస్తున్నారు. అదీ మీరి కొందరు శస్త్ర చికిత్సకు వెనుకాడడం లేదు. తాజాగా నటి లక్ష్మీమీనన్ ఇదే బాట పట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ చిత్రం హిట్‌తో ఇక్కడ సెటిల్ అయిపోయింది, వరుసగా అవకావాలు అందిపుచ్చుకుంది. దీంతో కాస్త బొద్దుగా ఉన్నా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. పైగా నేనిలానే ఉంటాను అని స్టెట్మెంట్ కూడా ఇచ్చేసింది. అయితే అనూహ్యంగా అవకాశాలు తగ్గడంతో అమ్మడికి అందం గురించి గుర్తొచ్చినట్లుంది. కొత్తవారు దూసుకురావడంతో లక్ష్మీమీనన్‌ను కోలీవుడ్ దాదాపూ పక్కన పెట్టేసింది. ఆ మధ్య నటించిన రెక్క చిత్రంలో మరీ లావుగా కనిపించింది. ఇటీవల బరువు తగ్గే ప్రయత్నాలు మొదలెట్టిందట. వ్యాయామం, యోగా లాంటి కసరత్తులతో కాస్త బరువు తగ్గించుకున్న లక్ష్మీమీనన్‌కు ఫలితంగా ప్రభుదేవాతో యంగ్ మంగ్ ఛంగ్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అయితే ఇంకా స్లిమ్‌గా తయారవ్వాలన్న తలంపుతో బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తం మీద లక్ష్మీమీనన్ సోషల్ మీడియాకు విడుదల చేసిన ఫొటోల్లో చాలా స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించింది. అదేవిధంగా ఇప్పటి వరకు సంప్రదాయబద్ధంగా నటించిన లక్ష్మీమీనన్ ఇకపై గ్లామర్ పాత్రలకు సై అనేవిధంగా దర్శక నిర్మాతలకు హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
లక్ష్మీమీనన్‌కు లక్కీచాన్స్
అదృష్టం ఉండాలేగానీ ఒక ద్వారం మూసుకుంటే మరో ద్వారం తెరుచుకుంటుందన్నది నానుడి. ఇప్పుడు నటి లక్ష్మీమీనన్ది ఇదే పరిస్థితి. సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ కేరళాకుట్టి కెరీర్లో విజయాలున్నా, అవకాశాలు లేవు. కారణాలేమైనా ఇటీవల రాకరాక ఒక మంచి అవకాశం వచ్చింది. ఏఎం.రత్నం అంత పెద్ద నిర్మాత చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం వచ్చింది. కాస్త ఆలస్యమైనా సూపర్ ఆఫర్ వచ్చిందని లక్ష్మీమీనన్ తెగ సంబరపడి పోయారు. అయితే విధి వక్రించి గాయాల పాలవ్వడంతో ఆ చిత్రాన్ని వదులు కోవలసిన పరిస్థితి. ఆ చింతలో ఉన్న ఈ అమ్మడికి మరో లక్కీచాన్స్ వచ్చింది. అదే ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశం. దేవి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ప్రభుదేవా ఎంగ్ మంగ్ సుంగ్ అనే చిత్రంలో నటించనున్నారు. చైనీస్ టైటిల్ తరహాలో ఉన్న ఈ చిత్రంలో ప్రభుదేవా కుంగ్‌ఫూ మాస్టర్‌గా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఎంఎస్.అర్జున్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నాయకిగా నటి క్యాథరిన్ ట్రెసా నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ అవకాశం నటి లక్ష్మీమీనన్‌ను వరించింది. దీని గురించి దర్శకుడు అర్జున్ తెలుపుతూ ప్రభుదేవాకు జంటగా లక్ష్మీమీనన్ నటించనున్నారని తెలిపారు. ఆమె ఇందులో భరతనాట్య డాన్సర్‌గా గ్రామీణ పాత్రలో నటించనున్నారని చెప్పారు. ఇది 1970–80 ప్రాంతంలో జరిగే పిరియడ్ కథా చిత్రంగా ఉంటుందని అన్నారు. ప్రభుదేవాకు తండ్రిగా దర్శకుడు తంగర్‌బచ్చన్, స్నేహితుడిగా ఆర్జే.బాలాజీ నటించనున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్ ఈ నెల చివరిలో ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు. -
ఆ ఇద్దరు నో అంటేనే నాకీ చాన్స్
ఏ రంగంలోనైనా అవకాశాలు అంత సులభంగా రావు. అందుకు తగిన అర్హతలు ఉండాలి. ముఖ్యంగా సినీరంగంలో నేమ్, ఫేమ్ చాలా అవసరం.అలాంటి వారికి వద్దన్నా అవకాశాలు వచ్చిపడతాయి. ఉదాహరణకు నటి నయనతారనే తీసుకుంటే చేతి నిండా చిత్రాలు. మరికొందరు దర్శక నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా యువ నాయికల్లో నటి కీర్తీసురేశ్ మంచి క్రేజ్‌లో ఉన్నారు. ఆమె కాల్షీట్స్ లభించడం కష్టతరంగా మారింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే విజయ్ సేతుపతికి జంటగా నటించడానికి కీర్తీసురేశ్ కాల్షీట్స్ దొరకలేదని సమాచారం. వర్తమాన నటి రితికాసింగ్ కూడా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేకపోయారట. వారి అవకాశానిప్పుడు నటి లక్ష్మీమీనన్ అందుకున్నారు. విషయం ఏమిటంటే విజయ్‌సేతుపతి హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం కరుప్పన్ అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రేణిగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా క్రేజీ యువ నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేయాలనుకున్నారట. తనకు కాల్షీట్స్ లేకపోవడంతో నటి రితికాసింగ్‌ను ప్రయత్నించగా తనూ వేరే చిత్రం కమిటై ఉండడంతో అంగీకరించలేని పరిస్థితి కావడంతో ఆ అవకాశం నటి లక్ష్మీమీనన్‌ను వరించింది. నిజం చెప్పాలంటే గ్రామీణ యువతి పాత్రలకు పేటెంట్గా మారిన ఈ అమ్మడు కుంకీ, కుట్టిపులి, కొంబన్ చిత్రాల్లో మదురై యువతిగా చక్కగా ఇమిడిపోయారు. ఈ మధ్య విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రంలో కాస్త బొద్దుగా అనిపించడంతో అవకాశాలు లక్ష్మీమీనన్ దరి చేరడానికి వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. కరుప్పన్ చిత్రం కోసం లక్ష్మీమీనన్‌ను ఫొటో సెషన్‌కు పిలిచారట దర్శక నిర్మాతలు. అప్పుడు ఆమెను చూసిన చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయారట. కారణం భారీగా బరువు తగ్గి చాలా నాజూగ్గా తయారయ్యారట. అంతే కాదు కావాలంటే మరో ఐదు కిలోల బరువు తగ్గడానికి రెడీ అని చెప్పడంతో కరుప్పన్ చిత్ర హీరోయిన్ మీరే అంటూ లక్ష్మీమీనన్‌ను ఓకే చేసేశారట. అలా కీర్తీసురేశ్, రితికాసింగ్‌లను దాటి కరుప్పన్ చిత్ర అవకాశం లక్ష్మీమీనన్‌ను వరించిందని సమాచారం. అయితే ఈ అమ్మడికీ చిత్ర విజయం చాలా అవసరం అవుతుంది. -
ఆ ఇద్దరు నో అంటేనే నాకీ చాన్స్
ఏ రంగంలోనైనా అవకాశాలు అంత సులభంగా రావు. అందుకు తగిన అర్హతలు ఉండాలి. ముఖ్యంగా సినీరంగంలో నేమ్, ఫేమ్ చాలా అవసరం.అలాంటి వారికి వద్దన్నా అవకాశాలు వచ్చిపడతాయి. ఉదాహరణకు నటి నయనతారనే తీసుకుంటే చేతి నిండా చిత్రాలు. మరికొందరు దర్శక నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా యువ నాయికల్లో నటి కీర్తీసురేశ్ మంచి క్రేజ్‌లో ఉన్నారు. ఆమె కాల్షీట్స్ లభించడం కష్టతరంగా మారింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే విజయ్ సేతుపతికి జంటగా నటించడానికి కీర్తీసురేశ్ కాల్షీట్స్ దొరకలేదని సమాచారం. వర్తమాన నటి రితికాసింగ్ కూడా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేకపోయారట. వారి అవకాశానిప్పుడు నటి లక్ష్మి మీనన్ అందుకున్నారు. విషయం ఏమిటంటే విజయ్‌సేతుపతి హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం కరుప్పన్ అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రేణిగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రేజీ యువ నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేయాలనుకున్నారట. తనకు కాల్షీట్స్ లేకపోవడంతో నటి రితికాసింగ్‌ను ప్రయత్నించగా తనూ వేరే చిత్రం కమిటై ఉండడంతో అంగీకరించలేని పరిస్థితి కావడంతో ఆ అవకాశం నటి లక్ష్మి మీనన్ ను వరించింది. నిజం చెప్పాలంటే గ్రామీణ యువతి పాత్రలకు పేటెంట్గా మారిన ఈ అమ్మడు కుంకీ, కుట్టిపులి, కొంబన్ చిత్రాల్లో మదురై యువతిగా చక్కగా ఇమిడిపోయారు. ఈ మధ్య విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రంలో కాస్త బొద్దుగా అనిపించడంతో అవకాశాలు లక్ష్మి మీనన్ దరి చేరడానికి వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. కరుప్పన్ చిత్రం కోసం లక్ష్మి మీనన్ ను ఫొటో సెషన్ కు పిలిచారట దర్శక నిర్మాతలు. అప్పుడు ఆమెను చూసిన చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయారట. కారణం భారీగా బరువు తగ్గి చాలా నాజూగ్గా తయారయ్యారట. అంతే కాదు కావాలంటే మరో ఐదు కిలోల బరువు తగ్గడానికి రెడీ అని చెప్పడంతో కరుప్పన్ చిత్ర హీరోయిన్ మీరే అంటూ లక్ష్మి మీనన్ ను ఓకే చేసేశారట. అలా కీర్తీసురేశ్, రితికాసింగ్‌లను దాటి కరుప్పన్ చిత్ర అవకాశం లక్ష్మి మీనన్ ను వరించిందని సమాచారం. అయితే ఈ అమ్మడికీ చిత్ర విజయం చాలా అవసరం అవుతుంది. -
విజయ్ సేతుపతితో మరోసారి
నటి లక్ష్మి మీనన్ కు మరో అవకాశం వచ్చింది. రెక్క చిత్రం తరువాత మరో చిత్రానికి సంతకం చేయని ఈ కేరళ కుట్టికి తాజాగా లక్కీ ఛాన్సే లభించిందని చెప్పాలి. రెక్క చిత్రం హీరోతో రెండోసారి రొమాన్స్ చేసే అవకాశం వరించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి కాల్షీట్స్ డైరీ మూడేళ్ల వరకూ ఫుల్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పక్కన పెడితే ఆయన నటించిన కవన్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతి ప్రముఖ చిత్ర నిర్మాత ఏఎం.రత్నం సంస్థలో పని చేస్తున్నారు. ఇంతకు ముందు రేణిగుంట, 18 వయసు తదితర చిత్రాలను తెరకెక్కించిన పన్నీర్‌సెల్వం ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి కరుప్పన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది మదురై, తేని ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న కథా చిత్రం అని తెలిసింది. ప్రస్తుతం బర్నింగ్ అంశంగా మారిన జల్లికట్టు ఇతివృత్తంగా ఈ కరుప్పన్ చిత్రం ఉంటుందని సమాచారం. విజయ్‌సేతుపతి ఇందులో జల్లికట్టు వీరుడిగా నటిస్తున్నారట. ఇందులో ఆయనకు జంటగా బాక్సింగ్ నటి రితికాసింగ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మధురై యువతిగా రితికాసింగ్ రూపం సరిగా సెట్ కాదని భావించడంతో ఆమె చిత్రం నుంచి వైదొలగినట్లు, ఆ అవకాశం ఇప్పుడు నటి లక్ష్మిమీనన్ ను వరించినట్లు తెలిసింది. ఈ అమ్మడు ఇప్పటికే కొంబన్, సుందరపాండియన్, కుట్టిపులి చిత్రాలలో మదురై అమ్మాయిగా దుమ్మురేపారన్నది గమనార్హం. కరుప్పన్ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ చిత్రీకరణ ముమ్మరంగా జరుపుకుంటోందట. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని, రాంజీ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. -
బికినీకి సై
నటి లక్ష్మీమీనన్ మైండ్‌సెట్ మారిందా? తన సహ నటీమణులకంటే వెనుక పడ్డానని గ్రహించిందా? అవకాశాలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? తన తాజా మాటల్లో ఇలాంటి ప్రశ్నలు సాధారణ ప్రేక్షకుడికి కూడా తెలెత్తకపోవు. కొండవాసి యువతిగా కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళాకుట్టి ఆ చిత్ర విజయం తన జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత వరుస అవకాశాలు. వాటిలో తొంబై శాతం విజయాలు వరించడంతో తమిళచిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాంటి సమయంలో ఆపేసిన చదువును పూర్తి చేయాలంటూ నటనకు చిన్న విరామం తీసుకుంది. అది తనపై పెద్ద ప్రభావాన్నే చూపించిందనే చెప్పాలి. అజిత్‌కు చెల్లెలిగా వేదాళం చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. లక్ష్మీమీనన్‌కు మంచి పేరే వచ్చింది. అయినా అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్‌లో చిత్రాలను తగ్గించుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఈ మలయాళీ భామను అడిగితే అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. అయితే ఇకపై నటనపై అధిక శ్రద్ధ చూపాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రం ఏడో తేదీన తెరపైకి రానుందని, ఇందులో గ్లామరస్ పాత్రను పోషించానని తెలిపింది. అదే విధంగా విజయ్‌సేతుపతితో కలిసి నటించడం వినూత్న అనుభవంగా పేర్కొంది. తదుపరి జీవాకు జంటగా నెంజముండు నేర్మైయుండు చిత్రంలో నటించనున్నానని చెప్పింది. గ్లామర్‌కు సిద్ధం అయ్యానంటున్నారు ఈత దుస్తులు ధరించి నటిస్తారా? అన్న ప్రశ్నకు తాను స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఈత దుస్తులు ధరించి స్మిమ్ చేశానని, అలాంటిది సినిమాల్లో ఈత దుస్తుల్లో నటించడం ఒక లెక్కా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.తనకు ఇప్పటి వరకూ ఈత దుస్తుల్లో నటించే అవకాశం రాలేదని, అలాంటి సందర్భం వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అయితే నిజ జీవితంలో ఇప్పటి వరకూ బికినీ ధరింలేదని, అందువల్ల సినిమాల్లోనూ అలాంటి దుస్తులు ధరించనని తెలిపింది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు మోడరన్ దుస్తులు తన శరీరాకృతికి నప్పవు అని చెప్పుకొచ్చిన ఈ కేరళాకుట్టి ఇప్పుడు అలాంటి పాత్రలకు సిద్ధపడింది.రేపు బికినీ ధరించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. -
శివకార్తికేయన్ రెమో చూడాలని ఉంది
తన చిత్రానికి పోటీగా విడుదలవుతున్న శివకార్తికేయన్ నటించిన రెమో చిత్రం విజయం సాధించాలని నటుడు విజయ్‌సేతుపతి అన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం రెక్క. రతన్‌శివ దర్శత్వం వహించిన ఈ చిత్రాన్ని కామన్‌మ్యాన్ ప్రొడక్షన్ పతాకంపై బి.గణేశ్ నిర్వించారు.లక్ష్మీమీనన్ నాయకిగా నటించిన ఈ చిత్రంలో సతీష్,హరీష్‌ఉత్తమన్, దర్శకుడు కేఎస్.రవికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆయుధపూజ సందర్భంగా వచ్చేనెల తొలి వారంలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి మట్లాడుతూ రెక్క పక్కా కమర్షియల్ కథా చిత్రం అన్నారు. ఇలాంటి చిత్రం చేయాలన్నది తన కల అని పేర్కొన్నారు. ఈ చిత్రం తనకు చాలా కిక్ ఇచ్చింద న్నారు. నటి లక్ష్మీమీనన్ చాలా సెన్సిబుల్ నటి అని పేర్కొన్నారు. ఈ చిత్రంతో పాటు శివకార్తికేయన్ నటించిన రెమో కూడా విడుదలవుతోంది. మీ చిత్రం దానికి పోటీగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తానేప్పుడూ ఏ చిత్రాన్ని పోటీగా భావించనని, శివకార్తికేయన్ రెమో చిత్రంలో బాగా నటించారని, ఆ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. రెమో చిత్రాన్ని చూడాలన్న ఆసక్తి తనకు కలుగుతోందని పేర్కొన్నారు.అయితే తమ చిత్రం రెక్క కూడా బాగా వచ్చిందని, సెలవు రోజుల్లో విడుదలవుతున్నాయి కనుక రెండు చిత్రాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని విజయ్‌సేతుపతి అన్నారు. నటుడు సతీష్, హరీష్‌ఉత్తమన్, దర్శకుడు రతన్‌శివ, నిర్మాత గణేశ్, ఎడిటర్ ప్రవీణ్ పాల్గొన్నారు. -
నాలో కొత్త అందాలు చూస్తారు
చిత్ర విచిత్రమైన రంగం సినిమా అంటారు. ఇది ఎప్పడు ఎవరిని పెకైత్తుతుందో, ఎవరిని కిందపడేస్తుందో తెలియదు. తారల ప్రవర్తనా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. నటి లక్ష్మీమీనన్ విషయానికొస్తే కుంకీ చిత్రం కోలీవుడ్‌లో తన భవిష్యత్‌కు పునాదులు వేస్తుందని తనే ఊహించి ఉండరు. ఆ చిత్రంలో కొంచెం బొద్దుగా ఉన్నా లక్ష్మీమీనన్‌ను తమిళ ప్రేక్షకులు ఆదరించారు. దీంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలాంటి సమయంలో కాస్త లావుగా ఉన్నావు బరువు తగ్గమ్మా అన్న సన్నిహితుల హితవును ఖాతరు చేయలేదు. పైగా నేనింతే, సన్నబడడానికి కసరత్తులు చేయను, నోరు కట్టుకోను, నచ్చింది లాగించేస్తాను అని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. అందుకే ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుందంటారు. లక్ష్మీమీనన్‌కు పెద్దగా ఫ్లాప్‌లు లేవు. అయినా అంతగా అవకాశాలూ లేవు. ఈ పరిస్థితికి స్వయంకృతాపరాధమే కారణం కావచ్చు. ఆ మధ్య మంచి ప్రైమ్ టైమ్‌లో ఉండగా చదువు ముఖ్యం అంటూ నటనకు గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత వేదాళం చిత్రంలో చెల్లెలిగా నటించారు. ఆ చిత్రం హిట్ అయినా లక్ష్మీమీనన్ దాన్ని ప్లస్సో, మైనస్సో అని బేరీజు వేసుకునే లోపలే అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తరువాత అడపాదడపా అవకాశాలు రావడంతో లక్ష్మీమీనన్ పునరాలోచనలో పడ్డారని సమాచారం. ఆ మధ్య జయంరవితో మిరుదన్ చిత్రంలో నటించిన ఈ భామ ప్రస్తుతం విజయసేతుపతికి జంటగా రెక్క చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో జీవాతో నటించనున్న చిత్రం మినహా మరేమీ లేవు. దీంతో గత వైభవాన్ని చేజిక్కించుకోవడానికి దారులు వెతికుతున్న లక్ష్మీమీనన్ అందుకు అందాలు పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. గ్లామర్ విషయంలోనూ తన పంథా మార్చుకోవాలని భావించిన ఈ కేరళకుట్టి తాజాగా స్లిమ్‌గా తయారవడానికి తన మాతృగడ్డపై ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద చికిత్సను ఎంచుకున్నారట. 20 ఏళ్ల పరువంలోకి ఎంటరైన లక్ష్మీమీనన్ ఇకపై తనలో కొత్త అందాలను చూస్తారంటున్నారు. -
విజయదశమికి రెక్క
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాకు ప్రచారం చాలా అవసరం. అయితే అలాంటి ప్రచారాన్ని ప్రారంభించకుండానే కొన్ని చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి వాటిలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం రెక్క. అందుకు ఈ చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి ఒక కారణం కావచ్చు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన నటిస్తున్న తాజా చిత్రం రెక్క. ఆయనకు జంటగా లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. రతన్‌శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కామన్మ్మాన్ ప్రెజెంట్స్ పతాకంపై బి.గణేశ్ నిర్మిస్తుండగా డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు రతన్‌శివ తెలుపుతూ విజయ్‌సేతుపతి పర్ఫార్మెన్స్ నటుడిగానే అందరికీ తెలుసన్నారు. అలాంటి ఆయన్ని రెక్క చిత్రం పక్కా యాక్షన్ హీరోగా చూపిస్తుందన్నారు. ఇందులో ఆయన కుంభకోణానికి చెందిన యువకుడిగా నటించ గా నటి లక్ష్మీమీనన్ మదురై అమ్మాయిగా నటించారన్నారు. చిత్రం పేరుకు తగ్గట్టుగానే మదురై, కుంభకోణం, కారైకుడి, బ్యాంకాక్‌లను చుట్టి చిత్రీకరణను పూర్తి చేసుకుందని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర హక్కులను సొంతం చేసుకున్న శివబాలన్ పిక్చర్స్ అధినేత అక్టోబర్‌లో ఆయుధపూజ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి సుభా గణేశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
ఆ పాత్రలకు వాళ్లే స్ఫూర్తి
ఆ పాత్రలకు వాళ్లే స్ఫూర్తి అంటోంది నటి లక్ష్మీమీనన్. ఈ కుంకీ అమ్మడు ఎలాంటి పాత్రల్లో అయినా ఇట్టే ఇమిడిపోయి నటించి మంచి పేరు సంపాదించుకుంటోంది. ఇప్పటివరకూ నటించిన చిత్రాలన్నీ విజయం సాధించడంతో సక్సెస్ఫుల్ నాయకిగా ముద్ర పడింది. కుంకీ, సుందరపాండియన్, కుట్టిపులి, పాండియనాడు, మంజాపై, నాన్శివప్పుమనిదన్, కొంబన్, మిరుదన్ ఇలా లక్ష్మీమీనన్ నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. వీటిలో అధిక శాతం గ్రామీణ పాత్రల్లోనే తను నటించిందన్నది గమనార్హం. ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్న రెక్క చిత్రంలోనూ పల్లెటూరి అమ్మాయిగానే కనిపించనుంది. దీంతో గ్రామీణ పాత్రలకు లక్ష్మీమీనన్ కేరాఫ్‌గా మారింది. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఈ భామ బదులిస్తూ తను అలాంటి పాత్రల్లో ఒదిగిపోయి నటించడంతో అన్నీ ఆ తరహా పాత్రలే తనను వెతుక్కుంటూ వస్తున్నాయని అంది. తాను నటించిన చిత్రాల షూటింగ్ అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుండడంతో ఆయా ప్రాంత ప్రజల వేష భాషలను, ప్రవర్తనలను క్షుణ్ణంగా గమనిస్తుంటానని తెలిపింది. అవన్నీ అలానే మనసులో పదిల పరచుకుని పాత్రల ద్వారా వ్యక్తం చేస్తుంటానని చెప్పింది. ఇక్కడ తనను ఆకట్టుకున్న నటీమణులు చాలా మంది ఉన్నా.. నా నటనకు మాత్రం స్ఫూర్తి ప్రజలేనని పేర్కొంది. మధ్యలో గ్రామీణ పాత్రలు చేసి బోర్ కొడుతోందని స్టేట్మెంట్స్ ఇచ్చిన లక్ష్మీమీనన్ తాజా చిత్రం రెక్క కోసం మళ్లీ పల్లె పడుచుగా మారడం గమనార్హం. అయితే తనకు అలాంటి పాత్రలే వస్తున్నాయి ఏం చేయను చెప్పండి అంటోంది ఈ కేరళ కుట్టి. -
వారిద్దరి రొమాన్స్ కొత్తగా ఉంటుంది
రెక్క చిత్రంలో విజయ్‌సేతుపతి,లక్ష్మీమీనన్‌ల లవ్ రొమాన్స్ కొత్తగా ఉంటుందంటున్నా రు ఆ చిత్ర దర్శకుడు రత్నశివ. రేణిగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన ఈయన మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం రెక్క. విజయ్‌సేతుపతి,లక్ష్మీమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర విశేషాలను దర్శకుడి నుంచి తెలుసుకుందాం. రెక్క టైటిల్ గురించి వివరించండి? ఎవరికైనా ఒక పని చెప్పి త్వరగా వెళ్లి ర మ్మంటే నాకేమైనా రెక్కలున్నాయా ఎగిరి వెళ్లి రావడానికి అని అంటుంటారు.అయితే ఈ చి త్రంలో విజయ్‌సేతుపతి ఎలాంటి పని చెప్పి నా రెక్కలు మొలచినట్లు వేగంగా పూర్తి చేసేస్తుంటారు. అందుకే రెక్క అనే టైటిల్‌ను నిర్ణయించాం. అసలు రెక్క చిత్ర కథేంటి? కుంభకోణానికి చెందిన హీరోకు మదురైకి చెందిన ఒక యువతిని ఎత్తుకు రావాలనే కమిట్మెంట్ ఉంటుంది. ఆ అమ్మాయిని తీసుకొస్తుండగా ఆమె తన ప్రేమికురాలని తెలుస్తుంది. అప్పుడు హీరో తన అసైన్మెంట్ను పూర్తి చేస్తాడా? తన ప్రేమికురాలి చేయందుకుంటాడా అన్నది కథ. విజయ్‌సేతుపతి హీరో అంటేనే వైవిధ్యం ఎదురు చూస్తారు.మరి ఈ చిత్రంలో ప్రత్యేకత? నేను చెప్పింది అవుట్ లైన్ కథే.అది సాధారణంగా ఉందనిపించినా,కథనం జెట్‌స్పీడ్‌లో సాగుతుంది. విజయ్సేతుపతికీ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌గా ఉంటుంది. ఒక కమర్శియల్ ఎంటర్టెయిన్మెంట్ చిత్రానికి కావలసిన అన్ని అంశాలు రెక్క చిత్రంలో ఉంటాయి. విజయ్‌సేతుపతి న్యాయవాది పాత్ర అటగా? న్యాయవాది పట్టా పొంది ఊరిలోనే ఉండే పాత్ర. కోర్టుకు వెళ్లకుండా తను ఏం చేస్తారన్నదే చిత్ర కథ. నటి లక్ష్మీమీనన్‌ను మదురై అమ్మాయిగా చూపిస్తున్నారట? అవును. విజయ్‌సేతుపతి ప్రేయసీ. మంత్రి కూతురిగా చాలా మోడ్రన్ పాత్రలో లక్ష్మీమీనన్ చాలా బాగా చేస్తున్నారు. ఇతర చిత్రాల కంటే ఆమె ఈ చిత్రంలో చాలా అందంగా కనిపిస్తారు. అలా చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. విజయ్‌సేతుపతికి,లక్ష్మీమీనన్‌కు మధ్య లవ్ రొమాన్స్ చాలా కొత్తగా ఉంటుంది. చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారట? అవును. చిత్రంలో విలన్లుగా హరీష్ ఉత్తమన్, కబీర్సంగ్ నటిస్తున్నారు. విజయ్‌సేతుపతి తండ్రిగా దర్శకుడు కేఎస్.రవికుమార్, హాస్య పాత్రలో సతీష్ అంటూ చాలా మంది నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం గురించి? చిత్రానికి సంగీతం పక్కా బలం. ఇమాన్ మెలోడీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో అలాంటి పాటలు ఉంటాయి. చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యింది. -
గ్లామరస్ పాత్రలో లక్ష్మీమీనన్
యువతుల దుస్తుల్లో లంగా, ఓణీలనేవి ప్రస్తుతం గ్రామాలకే పరిమితం(అక్కడ కూడా అరుదుగానే)అయ్యి పోయాయని చెప్పవచ్చు.అలాంటిది ఇక మన కథానాయికలు మాత్రం ధరించడానికి ఎలా ఇష్టపడతారు చెప్పండి. యువ నటి లక్ష్మీమీనన్‌కు లంగా ఓణీలు ధరించి బోర్ కొట్టేసిందంటున్నారు. కుంకీ చిత్రంలో కొండవాసి పడుచుగా పరిచయమైన ఈ కేరళ కుట్టి అప్పటి నుంచి తాను నటించిన చిత్రాల్లో అధిక శాతం లంగా ఓణీతోనే కనిపించి మురిపించారు. కాగా వరుస విజయాలతో దూసుకొచ్చిన లక్ష్మీమీనన్ వేదాళం చిత్రంలో అజిత్‌కు చెల్లెలుగా నటించారు. అయినా నటిగా మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత మిరుదన్ చిత్రంలో జయంరవికి జంటగా నటించారు.ఆ చిత్రం బాగానే ప్రజాదరణ పొందింది. కానీ అవకాశాలు రాకో, వచ్చిన వాటిని తను అంగీకరించకో అమ్మడికి చిన్న గ్యాప్ వచ్చింది. దీంతో ప్రైమ్‌టైమ్‌లో ప్లేస్‌ను కోల్పోయారు. తాజాగా లైమ్‌టైమ్‌లోకి వచ్చారు. కారణం సక్సెస్ఫుల్ నటుడు విజయ్‌సేతుపతికి జంటగా రెక్క చిత్రంలో నటించే అవకాశాన్ని పొందడమే కావచ్చు. వా డీల్ చిత్రం ఫేమ్ రతన్‌శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మదురైలో జరిగిన షూటింగ్‌తో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. విశేషం ఏమిటంటే ఇందులో లక్ష్మీమీనన్ తొలిసారిగా గ్లామరస్ పాత్రను పోషిస్తున్నారట. పాత్ర బాగా నచ్చడంతో ఇష్టపడి మరీ నటిస్తున్నారట. అంతేకాదు ఇకపై లంగా, ఓణీ పాత్రలకు దూరం అంటున్నారని సమాచారం. అయితే తన ఈ మాటపై లక్ష్మీమీనన్ ఎంతవరకు నిలబడతారో వేచి చూడాల్సిందే. -
ధనుష్‌తో రొమాన్స్‌కు లక్ష్మీమీనన్ రెడీ
ఎంత క్రేజీ తారలైనా ఎప్పుడూ ఒకే జంట కలిసి నటిస్తే వారికే కాదు చిత్రం చూసేవారికీ బోర్ కొడుతుంది. రేర్ జంట కలయికలో అయితే ఆ చిత్రం చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అలాంటి ఒక కొత్త కలయికలో చిత్రం రాబోతోందన్నది తాజా సమాచారం. యువ నటుడు ధనుష్, వరుస విసయాలను కైవసం చేసుకుంటున్న నటి లక్ష్మీమీనన్‌ల కలయికలో ఒక చిత్రం తెరకెక్కనుందన్నదే తాజా సమాచారం. నటుడు ధనుష్ ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తొడరి, దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో కొడి చిత్రాలను పూర్తి చేశారు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోకి పాయుమ్ తూట చిత్రంలో నటిస్తున్నారు. నటి లక్ష్మీమీనన్ ప్రస్తుతం విజయ్‌సేతుపతి సరసన రెక్క చిత్రంతో పాటు జీవాకు జంటగా జెమినీగణేశన్ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ధనుష్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్.దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇరైవి చిత్రాన్ని పూర్తి చేసిన కార్తీక్‌సుబ్బరాజ్ ప్రస్తుతం ధనుష్, లక్ష్మీమీనన్‌లతో చేయనున్న చిత్ర స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
హాలీవుడ్ సినిమా ట్రైలర్‌లా ఉంది - హీరో నాని
‘‘ప్రచార చిత్రం కొత్తగా ఉంది. ఏదో హాలీవుడ్ సినిమా ట్రైలర్‌లా ఉంది. సినిమా ఎప్పుడు చూస్తానా? అనిపిస్తోంది. రవి తెలుగులో ఎప్పుడో రావాల్సింది. లేట్‌గా అయినా లేటెస్ట్గా వచ్చాడు’’ అని హీరో నాని అన్నారు. ‘జయం’ రవి, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మిరుథన్’. శక్తి సౌంద ర్రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘యమపాశం’ పేరుతో ఈ నెల 19న తెలుగులో విడుదల కానుంది. డి.ఇమాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను నాని విడుదల చేశారు. ‘‘నా కెరీర్లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన తొలి చిత్రమిది’’ అని ‘జయం’ రవి అన్నారు. దర్శకుడు ‘జయం’ రాజా, నిర్మాతలు ఎడిటర్ మోహన్ , జ్ఞాన్వేల్ రాజా పాల్గొన్నారు. -
అందుకే ఓకే చెప్పా!
2015లో వరుసగా హ్యాట్రిక్ కొట్టిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జయంరవినే. రోమియో జూలియెట్, తనీఒరువన్, భూలోకం చిత్రాల విజయాల త రువాత ఆయన నటిస్తున్న చిత్రం మిరుదన్. మూడు విజయవంతమైన చిత్రాల తరువాత వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.అలాంటి మిరుదన్ చిత్రాన్ని దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత మైఖెల్‌రాయప్పన్ నిర్మించిన చిత్రం మిరుదన్. లక్ష్మీమీనన్ తొలి సారిగా జయంరవితో జత కట్టిన ఈ చిత్రానికి డీ.ఇమాన్ స్వరాలు సమకూర్చారు. మిరుదన్ చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధం అవుతోంది. చిత్ర యూనిట్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ మాట్లాడుతూ మిరుదన్ చిత్రం లాంటి కథతో ఇంతకు ముందు భారతీయ చిత్రపరిశ్రమలోనే రాలేదని అన్నారు. ఇందులో జయంరవి ట్రాఫిక్ పోలీస్ అధికారిగా, లక్ష్మీమీనన్ డాక్టర్‌గాను నటించారని తెలిపారు. ఒక వైరస్ గురించి అవగాహన కలిగించే కథా చిత్రంగా మిరుదన్ చిత్రం ఉంటుందన్నారు. హాలీవుడ్ స్థాయిలో..చిత్ర నిర్మాత మైఖెల్ రాయప్పన్ మాట్లాడుతూ మిరుదన్ చిత్ర మేకింగ్ హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. రెఫరెన్స్ లేని కథ ఇప్పటి వరకూ కమర్షియల్ కథా చిత్రాల్లో నటించిన జయంరవి మిరుదన్ చిత్రంలో సరికొత్త కథా పాత్రలో నటించారు. దీని గురించి ఆయన తెలుపుతూ .కథ ఆద్యంతం ఊహలకు అందని మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతుందన్నారు. ఇందులో గ్లోబల్ పొల్యూషన్ గురించి అవగాహన కలిగించే చక్కని సందేశం కూడా ఉంటుందని తెలిపారు. ఇందులో నటించిన ప్రతి సన్నివేశం మంచి అనుభవం అని నటి లక్ష్మీమీనన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో రివైజింగ్ కమిటీకి వెళుతున్నట్లు నిర్మాత వెల్లడించారు.అయితే 19వ తేదీన చిత్ర విడుదల ఖాయం అనీ రాష్ట్ర వ్యాప్తంగా 400 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రం అదే రోజు తెలుగులోనూ తెరపైకి రానుందని దర్శకుడు వెల్లడించారు. -
సూపర్ హారర్!
ఈ ఆరునెలల్లో తమిళ పరిశ్రమలో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘తని ఒరువన్’ ఒకటి. ‘జయం’ రవి హీరోగా రూపొందిన ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో రామ్‌చరణ్ నటించనున్న విషయం తెలిసిందే. ‘తని ఒరువన్’ భారీ వసూళ్లు కురిపించడంతో ‘జయం’ రవి నటిస్తున్న తాజా చిత్రం ‘మిరుథన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జయం’ రవి, లక్ష్మీ మీనన్ జంటగా శక్తి సౌందర్యరాజన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. ఇది సూపర్ న్యాచురల్ హారర్ మూవీ అని తెలుగులోకి విడుదల చేయనున్న లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్, టైటిల్ లోగోలను త్వరలోనే ఆవిష్కరించనున్నామని కూడా చెప్పారు. -
విజయ్‌సేతుపతితో లక్ష్మీమీనన్
లక్కీ హీరోయిన్ లక్ష్మీమీనన్ నటుడు విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. వా డీల్ చిత్రం(ఇంకా విడుదల కాలేదు) ఫేమ్ రత్నశివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రెక్కై అనే పేరును నిర్ణయించారు. ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా ఆరెంజ్ మిఠాయ్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత బి.గణేశ్ తన కామన్‌మ్యాన్ ప్రెజెంట్స్ పతాకంపై నిర్మించినున్న తాజా చిత్రం రెక్కై. ఇది విజయ్‌సేతుపతి ఇంతకు ముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ప్రేమ, హాస్యం, యాక్షన్ తదితర కమర్షియల్ అంశాలతో కూడి ఉంటుందంటున్నారు దర్శకుడు రత్నశివ. ఇక పోతే ఇందులో నటి లక్ష్మీమీనన్ తన ఏజ్‌కు తగ్గ పాత్రను పోషించనున్నట్లు తెలిపారు. ఆమె ఇప్పటి వరకూ తన వయసుకు మించిన మెచ్యూర్డ్ పాత్రలనే చేశారన్నారు. ఈ రెక్కై చిత్రంలో చాలా యంగ్ యువతిగా నటించనున్నారన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటి జెనీలియా, లైలా వంటి బబ్లీ నాయికల కొరత ఉందన్నారు. తమ చిత్రంతో లక్ష్మీమీనన్ ఆ స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం విజయ్‌సేతుపతి ధర్మదురై, ఆండవన్ కట్టళై చిత్రాలతో నటిస్తున్నారని, అవి పూర్తి అయిన తరువాత తమ చిత్రం ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు. -
జెమినీ గణేశన్‌లో లక్ష్మీమీనన్
కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అంటే లక్ష్మీమీనన్‌నే. తొలి చిత్రం కుంకీ నుంచి ఇటీవల తెరపైకొచ్చిన వేదాళం వరకూ వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఏకైక నటి లక్ష్మీమీనన్. విక్రమ్‌ప్రభు, విమల్ లాంటి వర్ధమాన హీరోలతో అయినా, విశాల్, కార్తీ, అజిత్ లాంటి స్టార్ హీరోలతో అయినా లక్ష్మీమీనన్ నటించిందంటే ఆ చిత్రం హిట్టే అన్నంతగా పేరు సంపాదించుకుందీ మలయాళీ కుట్టి. నటిగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు చదువుకోవాలంటూ నటనకు గ్యాప్ ఇచ్చి ప్లస్‌టూ పరిక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. ఆ గ్యాప్ తన నట జీవితాన్ని దెబ్బ తీస్తుందని ఏమాత్రం భయపడలేదు.అలాగే కథానాయకిగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సమయంలో వేదాళం చిత్రంలో అజిత్‌కు చెల్లెలిగా నటించే అవకాశం వస్తే వెనుకా ముందు ఆలోచించకుండా ఆ పాత్ర చేయడానికి సమ్మతం చెప్పేసింది. అయినా లక్ష్మీమీనన్ కెరీర్‌కు వచ్చిన డోకా ఏమీలేదు. ఇప్పుడామె హీరోయిన్గా బిజీ అవుతోంది. ప్రస్తుతం జయంరవి సరసన మిరుదన్ చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా జీవాతో రొమాన్స్ చేసే అవకాశం లక్ష్మీమీనన్‌ను వరించింది. ఇంతకు ముందు ఈ చిత్రంలో నటి తమన్న నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు నటి లక్ష్మీమీనన్‌ను ఎంపిక చేశారు. పీటీ.సెల్వకుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ముత్తుకుమార్ దర్శకత్వం వహించనున్నారు.దీనికి జెమినీగణేశన్ అనే పేరును నిర్ణయించారు.ఇది రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం అని అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. జీవా ప్రస్తుతం పోకిరిరాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత జెమినీగణేశన్ చిత్రంలో పాల్గొననున్నారు. -
జయంరవి, లక్ష్మీమీనన్‌ల మిరుదన్
నటుడు జయంరవి, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్న చిత్రానికి మిరుదన్ అనే పేరును ఖరారు చేశారు.రోమియోజూలియట్, తనీఒరువన్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత జయంరవి తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. తాజాగా నిర్మాత మైఖెల్ రాయప్పన్ తన గ్లోబల్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు నాడోడిగళ్, గోరియపాలైయం, పట్టత్తు యానై హిట్ చిత్రాలను నిర్మించిన మైఖెల్ రాయప్పన్ నటుడు అధర్వ హీరోగా ఈటీ చిత్రాన్ని రూపొందించారు. ఇది త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం ఈయన నాణయం, నాయ్‌గళ్ జాగ్రత్తైవంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వంలో జయంరవి కథానాయకుడుగా మిరుదన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటి లక్ష్మీమీనన్ తొలిసారిగా జయంరవితో జతకడుతున్నారు. చిత్ర వివరాలను నిర్మాత వెల్లడిస్తూ చిత్ర షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల 18 నుంచి మొదలెట్టనున్నట్లు తెలిపారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో ఎన్నై అరిందాల్ చిత్రం ఫేమ్ బేబీ అనీగ, శీమాన్, కాళీ వెంకట్, ఆర్ఎన్ఆర్.మనోహర్ సాటై రవి,క్రేన్‌మనోహర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని నిర్మాత చెప్పారు. -
ధనుష్ డబుల్ ధమాకా
సినిమా కలర్ మారుతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల అభిరుచి మారుతుందనడం కంటే సినిమా పై వారి ఐక్యూ పెరుగుతోందనడం కరెక్ట్. సాంకేతిక అభివృద్ధితో వారితో సినిమా పరిజ్ఞానం పెంపొందుతోందనవచ్చు. ఏదేమయినా ఇప్పుడు సాదాసీదా చిత్రాలకు ఆదరణ లభించే ప్రసక్తే లేదు.దర్శక నిర్మాతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని చిత్రాలు చెయ్యాల్సిన పరిస్థితి. కొత్త సీసాలో పాత నీరు పోసినా కథనంలో కొత్తదనం, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో రెండు గంటలపాటు ప్రేక్షకుల్ని కథలో పయనించేలా చెయ్యాలి. ఇక హీరోల ద్విపాత్రాభినయం అనేది కొత్తేమి కాదు.అయితే ఈ ప్రక్రియలో ధనుష్‌ను కొత్తగా చూపిస్తానంటున్నారు యువ దర్శకుడు దురై సెంథిల్ కుమార్. సినిమాల్లో ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. అయితే నటుడు ధనుష్‌కు మాత్రం కొత్తే.ఆయన్ని అన్నదమ్ములుగా విభిన్నంగా చూపిస్తా నంటున్నారు యువ దర్శకుడు దురై సెంథిల్‌కుమార్. ఇంతకు ముందు ఎదుర్ నీశ్చల్, కాక్కిసట్టై వంటి సక్సెస్‌పుల్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన తాజాగా ధనుష్‌తో ఒక భారీ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు.ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. కాగా ఇందులో కథానాయికలు ఎవరన్నదే రకరకాల ప్రచారం జరుగుతోంది.ఇంతకు ముందు పెద్ద ధనుష్ సరసన బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది.అయితే ఆమె కాల్సీట్స్ లేవనడంతో ఇప్పుడా పాత్రకు నటి లక్ష్మీమీనన్‌ను ఎంపిక చేశారు. ఇక రెండవ ధనుష్‌కు జంట గా నటించే నటి అన్వేషణ ఫలించిందన్నది తాజా సమాచారం. ఆ పాత్రకు నటి షామిలిని ఎంపిక చేసినట్లు తెలిసింది. బాల నటిగా పలు చిత్రాలు చేసిన షాలిని కథానాయికగా తెలుగులో ఓయ్ అనే ఒక చిత్రం చేసినా తమిళంలో నటించలేదు. ఆ మధ్య కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో సుధీప్‌కు జంటగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది.అయితే ఆ చిత్రంలో నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. షామిలి నటించకపోవడానికి కారణాలు తెలియలేదు. ప్రస్తుతం విక్రమ్‌ప్రభు సరసన వీరశివాజీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా ధనుష్‌తో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద ధనుష్ లక్ష్మీమీనన్, షామిలి లతో డబుల్‌ఢమాకాకు సిద్ధం అవుతున్నారన్న మాట. చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. -
నేను అలా నటిస్తే తప్పేంటి?
అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అంటారే సరిగ్గా అలాంటి పరిస్థితే. నటి లక్ష్మీమీనన్‌కు ఎదురైంది. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్‌లో నెగ్గుకొచ్చిన ఈ మలయాళికుట్టికి తాజాగా గ్లామర్‌పై ఆశ పుట్టిందట. నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి సంచలనం సృష్టించిన లక్ష్మీమీనన్ ఈసారి అందాలారబోత తో కలకలం సృష్టించాలని భావించగా వేషం లభించిందట. ప్లస్-2 పాస్ అయిన కాలేజీకి వెళుతున్న ఈ కేరళకుట్టికి తాజాగా జయం రవికి జంటగా నటించే అవకాశం వచ్చింది. భలే చాన్స్‌లే అని చంకంత కొట్టుకున్న ఈ భామ ఈ చిత్రంలో దెయ్యం పాత్ర లభించిందట. శక్తి శరణ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. కాగా మాయ చిత్రంలో నయనతార, అరణ్మణై -2లో హన్సిక లాంటి వారు దెయ్యం కథా చిత్రాలలో నటించడంతో తాను నటించడంలో తప్పేంటి? ఆ తరహా చిత్రం ఒక అనుభవమేగా అని సరిపెట్టుకొందట. -
లక్ష్మీమీనన్‌పై శ్రుతిహాసన్ ఫైర్
ఇద్దరు హీరోయిన్లు ఒక చిత్రంలో నటిస్తుంటే వారి మధ్య ఈగో సమస్య తలెత్తడం సహజం. అయితే ఇక్కడ నటి శ్రుతిహాసన్, లక్ష్మీమీనన్‌ల మధ్య మరో రకమైన విభేదాలు తలెత్తాయనే ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. అసలు శ్రుతి టాప్ హీరోయిన్. లక్ష్మీమీనన్ ఎదుగుతున్న నటి. అలాంటిది వీరి మధ్య వైరం ఏమిటన్న ఆసక్తి కలగడం సహజం. అయితే వీరిద్దరూ కలసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్ర హీరో అజిత్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఎన్నై అరిందాల్ చిత్రం తరువాత ఆయన అజిత్ హీరోగా నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. వీరం చిత్రం తరువాత అజిత్‌ను శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఇందులో అజిత్ చెల్లెలిగా నటి లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ దర్శకుడు శివ ఇంతకుముందు చిత్రం వీరంలో అజిత్‌ను తమ్ముళ్లపై అపారప్రేమ ఉన్న అన్నయ్యగా చూపించి విజయం సాధించారు. ఈ చిత్రంలో చెల్లెల్ని ప్రాణంగా చూసుకునే అన్నయ్యగా చూపించబోతున్నట్లు సమాచారం. దీంతో అసలు విషయం అర్థం అయ్యే ఉంటుంది. చిత్రంలో అన్నా చెల్లెళ్ల సన్నివేశాలు బలమైనవిగా ఉంటాయని లక్ష్మీమీనన్ ఇందులో చెల్లెలి పాత్ర చేయడానికి అంగీకరించినట్లు కనిపించిన వారికంతా డప్పు కొట్టుకుంటోందట. చిత్రంలో హీరోయిన్ శ్రుతి పాటల సన్నివేశాలకే పరిమితం అని చిత్రంలో అజిత్ తరువాత బలమైన పాత్ర తనదేనని అందరకీ చెప్పుకుంటోందట. ఈ విషయం తెలిసి శ్రుతి లక్ష్మీమీనన్‌పై మండిపడుతున్నారని కోలీవుడ్ టాక్. -
లక్ష్మీమీనన్ పాసయిందోచ్
నటి లక్ష్మీ మీనన్ ప్లస్-2 పాసయ్యారు. పదో తరగతి చదువుతుండగానే సినిమా రంగంలోకి వచ్చేసిన నటి లక్ష్మీమీనన్. మొదట్లో మాతృభాషలో ఒకటి రెండు చిత్రాలు చేసినా ఆమెకు సినీ జీవితాన్ని ప్రసాదించింది మాత్రం తమిళ చిత్రపరిశ్రమనే చెప్పాలి. కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ కేరళా కుట్టికి ఆ తరువాత ఇక్కడ వెనక్కుతిరిగి చూసుకోవలసిన ఆవసరం ఏర్పడలేదు. పాండినాడు, మంజాపై, నాన్‌శివప్పుమణిదన్, కోంబన్ అంటూ వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గాపేరు సంపాదించుకుంది. అలాంటి లక్ష్మీమీనన్ కార్తితో కొంబన్ చిత్రాన్ని పూర్తి చేసి నటనకు చిన్న విరామం ఇచ్చి మధ్యలో ఆపేసిన చదువు పై దృష్టి సారించింది. అలా పట్టుదలతో చదివి ఇటీవల ప్లస్-2 పరిక్షలు రాసింది. ఈ పరిక్షా ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. లక్ష్మీమీనన్ 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె తల్లి తెలిపారు. -
సామి దర్శకత్వంలో లక్ష్మీమీనన్
దర్శకుడు సామి చిత్రంలో మరోసారి నటించడానికి నటి లక్ష్మీమీనన్ సిద్ధం అవుతున్నారా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. నిజం చెప్పాలంటే ఈ కేరళ కుట్టికి కోలీవుడ్‌లో విశేష ప్రచారం తెచ్చిపెట్టింది దర్శకుడు సామినే. మైనా చిత్రానికి ముందు లక్ష్మీమీనన్ సామి దర్శకత్వంలో సింధు సమవెళి చిత్రంలో నటించారు. ఇందులో మేనమామతో అక్రమ సంబంధం కలిగిన యువతిగా నటించారు. దీంతో చిత్రం విడుదల సమయంలో పెద్ద వివాదమే చెలరేగింది. దీంతో నటి లక్ష్మీమీనన్‌కు బోలెడు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. అయితే ఈ తరువాత అలాంటి చిత్రంలో నటించినందుకు బాధపడుతున్నట్లు ఈ అమ్మడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఆ తరువాత మైనాతో విజయాల బాటపట్టిన లక్ష్మీమనన్ మళ్లీ సామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇటీవల సామి దర్శకత్వం వహించిన కంగారు చిత్రం విడుదలైంది. దీంతో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రానికి పెణ్‌సామి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులోని కథానాయకి పాత్రకు నటి లక్ష్మీమీనన్ చక్కగా నప్పుతుందని త్వరలో ఆమెను కలిసి కథ వినిపిస్తానని సంచలన దర్శకుడు సామి అన్నారు. -
అజిత్ సరసన శ్రుతిహాసన్
ఎన్నై అరిందాల్ చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అజిత్ తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఆయనతో ఆరంభం, ఎన్నై అరిందాల్ వంటి భారీ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీ సాయిరామ్ ఫిలింస్ అధినేత ఎ ఎం రత్నం ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుందని సమాచారం. ఈ చిత్రానికి అచ్చమిల్లై అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అజిత్ సరసన శ్రుతిహాసన్ నటించనున్న ఈ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటి లక్ష్మీమీనన్ నటించనున్నారు. ఇంతకుముందు అజిత్ హీరోగా వీరం వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలు అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఈ చిత్రం కోసం ఒక థీమ్ మ్యూజిక్‌ను సమకూర్చారట. అది చిత్ర దర్శకుడు శివకు విపరీతంగా నచ్చేసిందట. ఈ ఏడాది సూపర్సాంగ్ ఇదేనంటూ అనిరుధ్‌ను ప్రశంసలతో ముంచేస్తున్నారట. ఈ చిత్రంలో సంతానం, తంబిరామయ్య, సూరి ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. అచ్చమిల్లై అంటే భయం లేదు అని అర్థం. ఈ టైటిల్ సహా పూర్తివివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక పూర్వకంగా వెల్లడించనున్నట్లు సమాచారం. కాగా ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్‌కు వారసుడు పుట్టిన సంతోషం కూడా తోడవ్వడంతో శుక్రవారం తన పుట్టిన రోజు విజయోత్సాహం, పుత్రోత్సాహంతో జరుపుకుంటున్నారు. -
శింబుతో రొమాన్స్‌కు లక్ష్మీమీనన్ రెడీ
శింబుతో రొమాన్స్‌కు నటి లక్ష్మీమీనన్ రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం.సంచలన నటుడు శింబుతో నటించిన హీరోయిన్లు అందరూ అగ్రకథా నాయికలయ్యారు. నయనతార, జ్యోతిక, త్రిష మొదలగు ప్రముఖ నాయికలు శింబుతో జోడి కట్టారు. తాజాగా లక్కీ హీరోయిన్ లక్ష్మీమీనన్ ఆయనతో స్టెప్స్‌కు సిద్ధం అవుతున్నారన్నది కోలీవుడ్ టాక్. శింబు నటించిన వేట్టైయన్నన్, వాలు, ఇది నమ్మ ఆళు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కావలసి ఉంది. వీటిలో వాలు చిత్రం మే నెల తొమ్మిదిన విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శింబు నటించిన చిత్రం తెరపైకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది. అయినా ఆయనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చం ఎంబదు వాడమయడా చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా తాజాగా మరో కొత్త చిత్రానికి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వణక్కం చెన్నై వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన క్రితిక ఉదయనిధి స్టాలిన్ తదుపరి శింబు హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో లక్ష్మీమీనన్ హీరోయిన్గా ఎంపికైనట్లు తెలిసింది. కోలీవుడ్‌లో తొలి చిత్రం కుంకి నుంచి ఇటీవల విడుదలైన కొంభన్ చిత్రం వరకు విజయ పరంపరను కొనసాగిస్తున్న లక్ష్మీమీనన్ స్టార్ హీరోయిన్ అంతస్తును మాత్రం పొందలేకపోయారు. శింబు చిత్రం ఆమెకు ఆ కొరత తీరుస్తుందేమో చూద్దాం. -
జయం రవితో రొమాన్స్‌కు సై
నటి లక్ష్మీమీనన్‌కు అవకాశాలు వరుసకడుతున్నాయి. ప్లస్-2 పరీక్షలు పూర్తి చేసి నటించడానికి నేను రెడీ..మీరు రెడీనా? అంటూ ఇటీవల దర్శక నిర్మాతలకు చిన్న సవాల్ లాంటిది విసిరిన ఈ కేరళ కుట్టి మళ్లీ నటనలో బిజీ అవుతున్నారు. అపజయాలు కన్నెత్తి చూడకపోవడం లక్ష్మీమీనన్ అదృష్టం అనే చెప్పాలి. కార్తీ సరసన నటించిన కొంభన్ చిత్రంలోను ఈమె మంచి మార్కులు కొట్టేయడంతో చిన్న గ్యాప్ తీసుకున్న మళ్లీ అవకాశాలు తలుపుతడుతున్నాయి. నటుడు అజిత్ తాజా చిత్రంలో చెల్లెలిగా నటించడానికి సమ్మతించినట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా జయం రవికి జంటగా నటించే అవకాశం వచ్చిందన్నది తాజా సమాచారం. జయంరవి ప్రస్తుతం అప్పాటక్కర్, రోమియో జూలియట్, తనీ ఒరువన్ చిత్రాల్లో నటిస్తున్నారు. త్రిషతో జతకట్టిన భూలోకం విడుదల కావలసి ఉంది. తాజాగా శక్తిరాజన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారని కోలీవుడ్ టాక్. సగాయం నాయిగళ్ జాగ్రత్తైచిత్రాలను తెరకెక్కించిన శక్తిరాజన్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈయన తొలి చిత్రం సగాయం ఆశించిన విజయం సాధించకపోయినా మంచి చిత్రం అనే ప్రశంసలను సినీ పండితుల నుంచి పొందింది. నాయిగళ్ జాగ్రత్తైచిత్రం వ్యాపార పరంగాను విజయం సాధించింది. ఇప్పుడీ జయం రవి, లక్ష్మీమీనన్‌ల చిత్రం కూడా వైవిధ్యభరితంగా ఉంటుందని భావించవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. -
ఇక నేను రెడీ
ఇక నేను రెడీ! మీరు రెడీయా! అంటున్నారు నటి లక్ష్మీమీనన్. చదువు కోసం సినిమాను కొంచెం దూరంగా పెట్టిన ఈ కేరళ కుట్టి ప్లస్-2 పరీక్షలు రాసేశారు. ఆ సమయంలో నటనకు ఫుల్స్టాప్, బెంగళూరులో మకాం అంటూ ఉన్నవి లేనివీ చాలానే రాసేశారు. ఇప్పుడు పరీక్షల సమయం అయిపోయింది. ఇక నటించడానికి నేను రెడీ? అవకాశాలు ఇవ్వడానికి మీరు రెడీనా? అంటూ ఛాలెంజ్ చేసే ధోరణిలో అంటున్నారు నటి లక్ష్మీమీనన్. పరీక్షల్లో మునిగిపోయి తాను నటించిన తాజా చిత్రం కొంబన్ కూడా చూడని ఈ నటి ఆ చిత్రం విడుదలై ప్రజాదరణ కూడా పొందడంతో ఇటీవల చిత్ర సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న లక్ష్మీమీనన్ మంచి జోష్‌లో కనిపించారు. తొలి చిత్రం కుంకి నుంచి కొంభన్ వరకు వరుస విజయాలును తన ఖాతాలో వేసుకుంటున్న ఈ లక్కీ బ్యూటీ ఈ మధ్య చదువుపై పూర్తి ఏకాగ్రత సారిస్తూ అవకాశాలను కూడా తిరస్కరించారు. ప్రస్తుతం మీరెలాంటి కథ చెప్పినా నా బుర్రకెక్కదు అంటూ దర్శక నిర్మాతలకు సున్నితంగానే నచ్చచెబుతూ వచ్చిన లక్ష్మీమీనన్ తాజాగా మీరు చెప్పే కథలు వినడానికి నేను రెడీ, కథలు వినిపించడానికి మీరు రెడీయా అంటూ అంటున్నారు లక్ష్మీమీనన్. కొంభన్ విజయంతో మళ్లీ ఆమెను ఎంపిక చేసుకోవడానికి పోటీ పడుతున్నట్లు సమాచారం. -
గాసిప్స్ డోస్ పెంచాలి
కొందరు నాయికలు గాసిప్స్‌కు దూరంగా ఉండేలా జాగ్రత్త పడతారు. మరికొందరు గగ్గోలు పెడతారు. ఇంకొందరు గాసిప్స్‌ను ఎంజాయ్ చేస్తారు. ఈ మూడవ కోవకు చెందిన నటి లక్ష్మీమీనన్. ఈ కేరళ కుట్టిపై ఇప్పటికే పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. అవిచాలవట. ఇంకా డోస్ పెంచాలంటోంది. ఈ కుంకి హీరోయిన్‌కు అదృష్టం తేనెతుట్టెలా పట్టిందనవచ్చు. తొలి చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన నాన్ శిగప్పు మనిదన్ చిత్రం వరకు వరుస విజయాలను అందుకుంది. తాజాగా కార్తీతో రొమాన్స్ చేసిన కొంభన్ గురువారం తెరపైకి వచ్చింది. నిజం చెప్పాలంటే విశాల్ తరువాత ఈ కేరళ కుట్టిస్టార్ హీరో సరసన నటించిన చిత్రం ఇదే. ఇందులో దక్షిణాది ప్రాంత పల్లెటూరి యువతిగా మరోసారి చీరకట్టులో కనిపించింది. ఇంత క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతున్న కెరీర్‌ను ప్లస్‌టూ పరీక్షల కోసం అంటూ బ్రేక్ ఇచ్చుకున్న లక్ష్మీమీనన్ ఇక నటనకు స్వస్తి చెప్పినట్లే, పై చదువుల కోసం బెంగళూరులో సెటిల్ అవబోతోందంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆమె కొన్ని చిత్రాలను నిరాకరించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో తన జానతనాన్ని ప్రదర్శిస్తూ నేను నటనకు స్వస్తి చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి నా కొచ్చిన అవకాశాలు నచ్చకపోవడంతోనే వాటిని తిరస్కరించాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే లంగా ఓణి పాత్రలు ధరించి బోర్ కొట్టేసింది. మూస పాత్రలు ధరించడం ఇష్టం లేదు. అంతకంటే ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. మాడ్రన్ గర్ల్ లాంటి పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను. అలాంటి నటనకు అవకాశం వున్న పాత్రలు లభిస్తే చేస్తాను. గ్లామర్‌గా నటిం చడానికి అభ్యంతరం లేదు. అవసరం అయితే అందుకు తగ్గట్టుగా తన శారీరకభాషను మార్చుకుంటాను. అయితే ప్రస్తుతానికి అందుకోసం ఎలాంటి కసరత్తులు చేయడం లేదు. నచ్చిన ఆహారం పుష్టిగా లాగించేస్తున్నాను. ఇక పాడడం గురించి అడుగుతున్నారు. అనూహ్యంగా వచ్చిన అవకాశాలతో ఒకటి రెండు పాటలు పాడాను. అంతేకాని అది నా వృత్తి కాదు. అలాగే నాపై ప్రచారం అవుతున్న గాసిప్స్ గురించి స్పందించాల్సిందిగా అడుగుతున్నారు. అలాంటివి చదివి ఎంజాయ్ చేస్తున్నాను. గాసిప్స్ డోస్ పెంచాలని కోరుకుంటున్నాను కూడా. ఎందుకంటే అవి బోలెడంత ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడతాయంటోది నటి లక్ష్మీమీనన్. -
వారి మాట వినను
కోలీవుడ్‌లో లక్కీ గర్ల్ అంటే ‘లక్ష్మీ మీనన్’ అంటారు ఎవరైనా. తొలి చిత్రం ‘కుంకి’ నుంచి అప్రతిహతంగా విజయాలను అందుకుంటున్న హీరోయిన్ ఈ కేర ళ కుట్టియే. పక్కింటి అమ్మాయిగా ఇమేజ్ను పొందిన లక్ష్మీ మీనన్ నాన్ సిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాలతో రొమాన్స్ చేసింది. నటిగా అనతి కాలంలోనే అనూహ్య గుర్తింపు పొందిన లక్ష్మీ మీనన్ అనూహ్యంగా తన దృష్టిని చదువుపై మళ్లించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం నట నకు గ్యాప్ ఇచ్చి ప్లస్ టూ పరీక్షలు రాయడంపై దృష్టి సారించిన ఈ నటి ఏప్రిల్ 5న పరీక్ష లు పూర్తవుతాయంటోంది. తదుపరి ఉన్న త విద్య కోసం బెంగ ళూరులో సెటిల్ అవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి ఆమెయ మాట్లాడుతూ, తాను బెంగళూరులో సెటిల్ అవుతానా లేదా అని చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉందని అంది. మే చివరి వారంలో రాను న్న ప్లస్ టూ రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. డిగ్రీలో ఏ సబ్జెక్ట్‌పై ఆసక్తి అని అడుగుతున్నారని, తనకైతే కామర్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. ఈ విషయమై ఇంట్లో వారు సూచనలు ఇస్తారా అన్న ప్రశ్నకు వారు జోక్యం చేసుకోరని అంది. ఒకవేళ జో క్యం చేసుకుని, ఏమైనా సూచనలు ఇచ్చినా వా రి మాటలను వినే ప్రసక్తే లేద ని లక్ష్మీ మీనన్ కరాఖండిగా చెప్పింది. ప్రస్తుతం ఈ భామ కార్తీ సరసన నటిం చిన కొంబన్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. అయితే ప్లస్ టూ లో రిజల్ట్స్ పాజిటివ్‌గా వ చ్చి చదువుపై దృష్టి సారించినా నటనను వదిలే ప్రసక్తి లేద ని లక్ష్మీ మీనన్ పేర్కొంది. -
మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ
కోలీవుడ్‌కు మాలీవుడ్ నాయకిల దిగుమతి కొనసాగుతోంది. ఆసిన్, నయనతారల నుంచి ఈ తరం లక్ష్మీమీనన్‌ల వరకు కోలీవుడ్‌లో జయించిన మలయాళీ భామలే. ఈ వరసలో తాజాగా అనుమోల్ చేరనుంది. ఈ అమ్మడు ఇప్పటికే మలయాళంలో మంచి నటిగా ప్రకాశిస్తోంది. కాగా పరిశ్రమలో సినీ ఎడిటర్లు దర్శకులైన సంఘటనలు అరుదు. అయితే దర్శకత్వానికి ఎడిటింగ్‌కు చాలా అనుబంధం ఉంటుంది. చిత్రీకరణలో దర్శకుడు ఆశించిన అవుట్‌పుట్ రాకపోయినా ఎడిటింగ్‌లో సాధ్యమైనంత వరకు తన భావాలకనుగుణంగా మలచుకోవచ్చు. ఎడిటింగ్‌లో అంత విషయం ఉందన్నమాట. ఎడిటింగ్‌లో నేర్పరి అయితే దర్శకత్వంలో సులభంగా రాణించవచ్చు. అలాంటి ధైర్యంతోనే ఏమో యువ ఎడిటర్ ఆంటోని మెగాఫోన్ పట్టడానికి సాహసిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన ఈయన మలయాళంలో మంచి విజయం సాధించిన షట్టర్ చిత్ర తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఇది ఒక వేశ్య ఇతివృత్తంతో కూడిన చిత్రం. మలయాళంలో ఈ పాత్రను సజిత మరత్తిల్ పోషించారు. కేరళ ప్రభుత్వ అవార్డును పొందిన ఈ చిత్ర తమిళ రీమేక్‌లో మలయాళకుట్టి అనుమోల్ నటించడానికి సిద్ధం అవుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటుడు సత్యరాజ్ ప్రముఖ పాత్రను పోషించనున్నారు. దర్శకుడు విజయ్ నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. -
పాపం లక్ష్మీ మీనన్!
మార్ఫింగ్ మాయాజాలం సినీతారలను వదలడం లేదు. ఆకతాయిల చేష్టలకు హీరోయిన్లు సిగ్గుతో చచ్చిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు శాండల్‌వుడ్ గుమ్మలు రాయ్‌లక్ష్మీ, కావ్యామాధవన్, హన్సికాహసన్ తుంటరోళ్ల పనులకు ఇబ్బందులు పడ్డారు. చివరకు వారే స్వయంగా మీడియా ముందుకు వచ్చి అవి తమవి కావని స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా లక్ష్మీ మీనన్ కూడా ఆ బాధితురాళ్ల జాబితాలో చేరిపోయింది. మార్ఫింగ్ చేసిన లక్ష్మీ మీనన్ బాతింగ్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మొబైల్ కెమెరాతో తీసిన ఈ వీడియోలో ఓ మహిళకు లక్ష్మి ముఖాన్ని అతికించి వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో అప్లోడ్ చేశారని సమాచారం! -
ఆరడుగులుంటే ...
కోలీవుడ్‌లో అతి తక్కువ మంది లక్కీ కథా నాయికల్లో లక్ష్మీమీనన్ ఒకరు. ఈ కేరళ కుట్టి సొంతగడ్డపై కూడా పొందలేనంత వరుస విజయాలను కోలీవుడ్‌లో సొంతం చేసుకున్నారు. తొలి చిత్రం కుంకితోనే దర్శకుడు ప్రభుసాల్మన్ ఈ అమ్మడి జాతకాన్ని మార్చేశారు. ఆ తరువాత పాండియనాడు, నాన్ సిగప్పు మనిదన్, మంజాపై అంటూ వరుస విజయాలతో లక్కీ హీరోయిన్గా గుర్తింపు పొందారు. నటుడు విశాల్‌తో చెట్టాపట్టాలంటూ వదంతులను ఎదుర్కొన్నా అవకాశాలు మాత్రం లక్ష్మీమీనన్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి. విశాల్‌తో ముచ్చటగా మూడోసారి కూడా నటించాల్సింది. అయితే ప్లస్-2 పరీక్షలు దగ్గర పడుతున్నాయంటూ ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు లక్ష్మీమీనన్ చెబుతున్నారు. కానీ విశాల్‌తో వదంతుల కారణంగానే ఆ చిత్ర అవకాశం చేయిజారిందన్నది కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం కార్తీతో కొంబన్ చిత్రంలో నటించనున్న లక్ష్మీమీనన్ తనది ప్రేమ వివాహమే అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. కాబోయే వరుడెలా ఉండాలన్న ప్రశ్నకు ఆరడుగుల అందగాడు, తన కంటే అధికంగా చదువుకున్న వాడు, సినీ పరిశ్రమకు చెందని వ్యక్తి అయివుండాలని బదులిచ్చారు. ఆరడగుల అందగాడు, సినిమా వాడై ఉండరాదన్న వ్యాఖ్యలను నటుడు విశాల్‌తో కలుపుతూ జరుగుతున్న ప్రచారానికి పుల్‌స్టాఫ్ పెట్టాలనే ఉద్దేశంతో ఆమె చెప్పారన్న టాక్ వినిపిస్తోందిప్పుడు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా...
చాలామంది హీరోయిన్లు అమ్మానాన్న చూసిన వరుడినే పెళ్లి చేసుకుంటానని చెబుతుంటారు. నిజంగా ప్రేమలో పడ్డా పెళ్లి జరిగే వరకు వారి నోట ఇలాం టి మాటే వస్తుంది. లక్ష్మీమీనన్ మాత్రం ధైర్యంగా తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని చెబుతోంది. కుంకీ నుంచి మంజాపై వరకు వరుస విజయాలను తన ఖాతా లో వేసుకుంది ఈ కేరళ కుట్టి. పాండియనాడు, నాన్‌సిగప్పు మనిదన్ చిత్రాల్లో విశాల్‌తో జతకట్టి ఆయనతో ప్రేమ నడుపుతోందంటూ వదంతులు ఎదుర్కొంది. అలాంటిదీ మధ్య కాస్త వెనుకబడిందనే చెప్పాలి. కారణం ప్లస్‌టూ పరీక్షలకు సిద్ధమవడమే అంటోంది. అందుకే సుశీంద్రన్ దర్శకత్వంలో విశాల్‌తో మూడవసారి కలిసి నటించే అవకాశాన్ని వదులుకుందట. ఆ అవకాశాన్నికాజల్ అగర్వాల్ అందుకుంది. ఈ మలయాళ బ్యూటీ కార్తీతో నటించిన కొంభన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. లక్ష్మీమీనన్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడు తూ తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని స్పష్టం చేసింది. అయితే పెళ్లి చేసుకోబోయే వ్యక్తి సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదని కుండబద్ధలు కొట్టింది. -
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
కథనాయికలు ఎవరైనా ఇద్దరు తాము స్నేహితులమని చెబితే నమ్మకండి అంటున్నారు యువ నటుడు విశాల్. ఈయన నటుడిగా కొన్నిసార్లు తడబడ్డారేమోగానీ నిర్మాతగా అపజయాన్ని ఎదుర్కొనలేదు. చిత్ర నిర్మాణంలో ఒక సైనికుడిలా పనిచేసి వరుస విజయాలను పొందుతున్నారు. విశాల్ కెరీర్లో తాజా చిత్రం ఆంబళ మరో సక్సెస్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఆయనతో మాటామంతీ.. ప్ర: ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం చిత్ర ప్రారంభం రోజునే విడుదల తేదీని ప్రకటిస్తుంది. ఈ మేరకే చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఇప్పుడు మీరు అదే విధానాన్ని అమలు పరుస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇందులో సాధ్యాసాధ్యాల గురించి చెప్పరూ? జ: చాలా శ్రమతో కూడుకున్న విషయం. నేను కష్టపడడమే కాకుండా సహ నటీనటులు, సాంకేతిక వర్గాన్ని శ్రమకు గురి చేస్తున్నానని చెప్పక తప్పదు. తాజా చిత్రం ఆంబళనే తీసుకుంటే గతేడాది సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించా. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకుడు సుందర్.సితో సహా అందరం రేయింబవళ్లు శ్రమించాం. ఇలా నాలుగు నెలల్లోనే చిత్రాన్ని పూర్తి చేయాలన్న గడువుతో ఇకపై చేయకూడదని నిర్ణయించుకున్నాను. అయితే చిత్రాల విడుదల తేదీలను ముందుగానే నిర్ణయించి పని చేయడం అనే విధానం ఇకపై కొనసాగుతుంది. ప్ర: ఇంతకు ముందు చిత్రాలు పాండియనాడు, నాన్ సిగప్పుమనిదన్ చిత్రాల నాయికి లక్ష్మిమీనన్, ఆంబళ చిత్ర హీరోయిన్ హన్సిక మధ్య పోలిక? జ: నిజం చెప్పాలంటే వారిద్దరిలోనూ వృత్తిపై ఆరాధన భా వం ఉంది. లక్ష్మీమీనన్ బీ, సీ అయితే హన్సిక Xఏ ’ సెంటర్స్ హీరోయిన్ అని చెప్పవచ్చు. లక్ష్మీమీనన్‌తో నన్ను కలుపుతూ చాలా వదంతుల ప్రచారం చేశారు. హన్సికతో కలుపుతూ ప్రచారం జరగలేదు. మరో విషయం ఏమిటంటే ఆంబళ చిత్రంలో నాకు జంటగా హన్సిక హీరోయిన్ అనుకున్నప్పు డు నా ఒంటి రంగు ఏమిటి? ఆమె రంగు ఏమిటి? అని ఆలోచించాను. ఇది సెట్ అవుతుందా? అన్న సందేహం కలిగింది. అయితే హన్సిక అలాంటి సందేహాన్ని పటాపంచలు చేసింది. ఆమెది సర్దుకుపోయే గుణం. ప్ర: సరే. ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు చేయడమే కష్టమంటున్నా రు. మీరు ఆంబళ చిత్రంలో హన్సిక, రమ్యకృష్ణ, కిరణ్, ఐశ్వ ర్య, పూనం బాజ్వా, మధురిమ, మాధవీలత అంటూ ఏకంగా ఏడుగురు హీరోయిన్లతో నటించడం గురించి ఏమంటారు? జ: నాకు ఇంతకుముందు తీరాద విళైయాట్టు పిళ్లై చిత్రంలో ఇలాంటి అనుభవం ఉంది. ఆ చిత్రంలో నీతూచంద్ర, సారాజైన్, తనుశ్రీ దత్తా తదితరులతో నటించి ఈ టెన్షన్ చాలురా బాబు అనిపించింది. మరో విషయం ఏమిటంటే ఇద్దరు కథానాయికలు తాము మంచి స్నేహితులమంటే నమ్మకండి. ఇద్దరు కథానాయకులు స్నేహితులమంటే అందులో నిజం ఉండవచ్చు. కథానాయికలకు ఎక్కువగా వారి దుస్తుల విషయంలోనే మనస్పర్థలు తలెత్తుతాయి. ఒకరి దుస్తులతో మరొకరు పోల్చుకుంటారు. అక్కడ నుంచే రాగద్వేషాలు మొదలవుతాయి. ప్ర: ఇద్దరు, ముగ్గురు హీరోలతో మీ సంస్థలో సులువుగా చిత్రాలు చేయగలుగుతున్నారా. ఇది ఎలా సాధ్యమవుతోంది? జ: ఇద్దరు, ముగ్గురు హీరోలు కలిసి నటిం చడానికి మొదట అందుకు సరైన కథ అమరాలి. ఒకవేళ అలాంటి కథ లభించినా పారి తోషికాలు భరించే శక్తి నిర్మాతలకు ఉండా లి. అది అంత సాధ్యం కాదు. ప్ర: మీ స్నేహితుడు ఆర్యను పలు కథానాయికలతో చేర్చి వదంతులు ప్రచారం అవుతున్నాయి. తను ప్రేమ వివాహం చేసుకుంటారా? జ: ఆర్య కచ్చితం గా తన తల్లిదండ్రులు నిశ్చయించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. ప్ర: సుందర్.సి దర్శకత్వంలో మీరింతకు ముందు నటించిన మదగజరాజ చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది? జ: ఆ చిత్రం ఎప్పుడు మొదలైనా విజయం సాధిస్తుంది. -
పొంగల్ కు కొంభన్
కొంభన్ చిత్రం పొంగల్ రేస్‌కు సిద్ధం అవుతోంది. కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కొంభన్. లక్ష్మీమీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పరుత్తివీరన్ తరువాత కార్తీ గ్రామీణ పాత్రలో నటిస్తున్న చిత్రం కొంబన్. చిత్ర ఆడియోను ఈ నెలలోనూ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో విక్రమ్, ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో ఆస్కా రవి నిర్మించిన ఐ చిత్రంతోపాటు అజిత్, త్రిష, అనుష్క హీరోహీరోయిన్లుగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎ ఎం రత్నం నిర్మిస్తున్న ఎన్నైఅరిందాల్, విశాల్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న ఆంబళ చిత్రాల్లో ఉన్నారుు. దీంతో ముక్కోణపు పోటీ నాలుగు చిత్రాలకు చేరింది. మరో విషయం ఏమిటంటే కమలహాసన్ నటించిన ఉత్తమవిలన్ చిత్రం కూడా సంక్రాంతికి తె రపైకి రానున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్ర విడుదల గురించి అధికార ప్రకటనరాలేదు. -
విశాల్‌తో ముచ్చటగా...
నటీనటుల్లో కొన్ని జంటలు హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటాయిమరి కొందరు సంచలన జంటలుగా గుర్తింపు పొందుతాయిఈ అటు హిట్ పెరయినూ, ఇటు సెన్సేషనల్‌గానూ పేరొందిన జంట విశాల్, లక్ష్మీమీనన్. వీరిద్దరూ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం పాండియనాడు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రజాదరణ పొందింది. ఆ తరువాత వీరు నటించిన చిత్రం నాన్ శివప్పు మనిదన్. ఈ చిత్రం విజయం సాధించింది. అంతేకాదు ఈ చిత్రంలో విశాల్, లక్ష్మీమీనన్‌ల లిప్‌లాక్ సన్నివేశాలు కోలీవుడ్‌లో పెద్ద కలకలాన్నే సృష్టించాయి. అంతటితో ఆగలేదు విశాల్, లక్ష్మీమీనన్‌లమధ్య ప్రేమాయణం సాగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించారు. అయితే చర్చనీయాంశంగా మారిన అంశమేమిటంటే, ఈ జంట ముచ్చటగా మూడోసారి కలసి నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ జంట హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతుంటే దర్శకుడు సుశీంద్రన్ వీరితో సెకండ్ హిట్‌కు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం విశాల్ సుందర్ సి దర్శకత్వంలో ఆంబళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్. అదే విధంగా నటి లక్ష్మీమీనన్ ప్రస్తుతం కార్తీతో కొంబన్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో ధనుష్‌తో జోడి కట్టడానికి ఈ అమ్మడితో చర్చలు జరుపుతున్నారు. అయితే విశాల్‌తో మూడవసారి రొమాన్స్ చేసే చిత్రం డిసెంబర్లో మొదలవుతుందని నటి లక్ష్మీమీనన్ వెల్లడించింది. -
మంచిపేరు తెచ్చుకోకపోయినా..
కేరళ కథానాయికలకు కేరాఫ్‌గా మారిందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రస్తుతం కోలీవుడ్‌కు దిగుమతి అయిన కేరళ నటీమణుల హవానే కొనసాగుతోంది. నయనతార నుంచి లక్ష్మీమీనన్ వరకు కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్లుగా విరాజిల్లుతున్నారు. తాజాగా మియా ఎంటరింగ్ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రం అమరకావ్యంతోనే ప్రశంసలు అందుకుంది. మంచి పేరు తెచ్చుకోకపోయినా పర్వాలేదంటున్న ఈ అమ్మడి సంగతేమిటో చూస్తే పోలా! పేరేంటి కొత్తగా ఉంది? నా అసలు పేరు జిమి జార్జ్. ఈ పేరు చాలామంది సరిగ్గా ఉచ్చరించలేపోతున్నారన్న విషయం నాకు తెలుసు. మలయాళంలో నేను నటించిన తొలి చిత్రం సెట్టాయిస్లో నా పాత్ర పేరు మియా. ఆ తరువాత ఆ పేరే నా పేరుగా మారింది. చిత్ర రంగ ప్రవేశం ఎలా జరిగింది? ప్రస్తుతం నేను కొట్టాయంలోని కళాశాలలో ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చదువుతున్నాను. షూటింగ్ ఉంటే కాలేజ్‌కు సెలవు పెట్టి నటిస్తున్నాను. చదువులో ఫస్ట్. అందుకే సినిమాల కంటే చదువుకే ప్రాముఖ్యతనిస్తాను. ఇక నటినెలా అయ్యానంటే 2011లో మిస్ కేరళ పోటీల్లో పాల్గొన్నాను. కేరళ ఫిట్నెస్ టైటిల్‌ను గెలుచుకున్నాను. భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం నృత్యాలు నేర్చుకున్నాను. చాలా స్టేజ్ ప్రోగ్రాంలు చేశాను. బహుమతులు గెలుచుకున్నాను. సినిమాల్లో కెళ్లు అంటూ స్నేహితులు ప్రోత్సహించారు. అలాంటి పరిస్థితుల్లో ఒక పత్రికలో ప్రచురితమైన నా ముఖ చిత్రం చూసి మలయాళ దర్శకుడు సెట్టాయిస్ అనే చిత్రంలో హీరోయిన్గా పరిచయం చేశారు. మీలో మంచి గాయని కూడా ఉన్నారట? నా కంఠం బాగుంటుంది. సంగీతం నేర్చుకున్నాను. మలయాళంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. తమిళంలో ప్రయత్నించలేదు. తమిళంలో అమరకావ్యం చిత్రంలో నటించిన అనుభవం? చాలామంచి అనుభవం. ఇక్కడ తొలి చిత్రంలోనే నటిగా ప్రతిభను చాటుకునే పాత్ర లభించింది. అదేవిధంగా మలయాళంలోనూ మోహన్‌లాల్, మమ్ముట్టి, సురేష్‌గోపి, జయరాం లాంటి ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. తమిళంలోను స్టార్ హీరోలతో నటించాలని ఆశిస్తున్నాను. డ్రీమ్ రోల్? మొదట ఎంఏ పూర్తి చేయాలన్నదే నా లక్ష్యం. ఇక నటిగా మంచి పాత్రలు ఎంపిక చేసుకుని నటించి అభిమానుల మనస్సుల్లో చోటు సంపాదించుకోవాలి. అధిక చిత్రాలు చేసే కన్నా ఒక్క చిత్రం చేసినా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా భావన. నాకు నచ్చిన నటీనటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, శోభన, రేవతిలా నేను వైవిధ్యభరిత పాత్రలు పోషించాలని ఆశిస్తున్నాను. ప్రేమ వ్యవహారం గురించి? చదువు, నటన ఈ రెండూ పూర్తి చేసిన తరువాతనే పెళ్లి గురించి మాట్లాడండని ఇంట్లో చెప్పేశాను. అందు వల్ల ప్రస్తుతం నా దృష్టి ప్రేమ వైపు సోకే అవకాశం లేదు. -
నచ్చినోళ్లతోనే....
కాలం కలిసొస్తే ఎన్ని కబుర్లైనా చెబుతారు. ప్రస్తుతం అలాంటి బడాయిలే పోతోంది నటి లక్ష్మీమీనన్. ఈ కుంకీ కథానాయకి చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కోలీవుడ్‌లో అపజయం ఎరగని హీరోయిన్గా లక్ష్మీమీనన్‌కు పేరుంది. తొలి చిత్రం కుంకి నుంచి ఈ మధ్య తెరపైకొచ్చిన మంజాపై వరకు ఆమె ఖాతాలో వరుస హిట్లే నమోదయ్యాయి. ఈ మలయాళి భామ ఈ విజయాలను ఎంజాయ్ చేస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటోంది. ఎవరెలా అనుకున్నా విజయాలు ప్రవర్తనలో మార్పుకు కారణం అవుతాయి. నటి లక్ష్మీమీనన్ ఇందుకు అతీతం కాదు. తొలుత అవకాశాలొస్తే చాలనుకున్న ఈ కేరళ కుట్టి ఆ తర్వాత మంచి కథా పాత్రలు కావాలని కోరుకుంది. అలాంటిది ఆమె తాజాగా తాను నటించే చిత్రాల్లో హీరోలు తనకు నచ్చిన వారై ఉండాలని షరతులు పెడుతోందట. ఇలాంటి కండీషన్ ఇంతకు ముందు ఏ నటి విధించి ఉండరు. ఇప్పటి వరకు రెండవ కేటగిరి హీరోల సరసన నటించిన ఈ అమ్మడిప్పుడు ప్రముఖ హీరోలు, మాస్ ఇమేజ్ కలిగిన హీరోలతో డ్యూయెట్లు పాడాలని ఆశిస్తోందని సమాచారం. దీంతో వర్ధమాన నటుల చిత్రాలను నిరాకరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అంతటితో ఆగకుండా తన ఆశను నెరవేర్చుకునే పనిలో భాగంగా ప్రముఖ నటులను పరిపరి విధాలుగా పొగడ్తలతో ముంచెత్తుతోంది. అలాగే తనకు తెలిసిన దర్శకులతో సిఫార్సు చేసుకునే పనిలో పడిందట. మరి అలాంటి ఈ నెరజాణ నటుడు కార్తి సరసన నటించే అవకాశాల్ని ఎందుకు జారవిడచుకుందోనంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
మరోసారి విశాల్‌తో..
నటుడు విశాల్, నటి లక్ష్మీమీనన్‌ల కాంబినేషన్ బాగానే వర్క్అవుట్ అయ్యింది. వీరి మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్ లాంటివికూడా బాగా కుదిరాయని చెప్పవచ్చు. కారణం ఈ జంట తొలిసారిగా నటించిన పాండియనాడు, మలిసారి నటించిన నాన్ శివప్పు మనిదన్ చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. దీంతో ఈ సంచలన జోడి ముచ్చటగా మూడోసారి కలిసి నటించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం హరి దర్శకత్వంలో పూజై చిత్రంలో నటిస్తున్న విశాల్ ఆ చిత్ర నిర్మాణం పూర్తి కానుండడంతో తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు ఈయన హీరోగా నటించి, సొం తంగా నిర్మించిన తొలిచిత్రం పాండియనాడు. చిత్రాన్ని తెరకెక్కించిన సుశీంద్రన్ ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనుండడం విశేషం. కాగా ప్రస్తుతం పూజై చిత్రంలో విశాల్‌కు జంటగా నటిస్తున్న శ్రుతిహాసన్‌నే ఈ చిత్రంలో నూ నటింప చేయడానికి ప్రయత్నించారు. అయితే వెంటవెంటనే విశాల్‌తో నటించడం బాగుండదనో, కాల్షీట్స్ సమస్య కారణంగానో శ్రుతిహాసన్ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దీంతో లక్ష్మీమీనన్ నటించడానికి రెడీ అవుతోంది. దీనిపై విశాల్ మాట్లాడుతూ పాండియనాడు వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత మళ్లీ సుశీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిపారు. హీరోయిన్‌కు మంచి అవకాశం ఉన్న పాత్ర కావడంతో శ్రుతి హాసన్ నటిస్తే బాగుంటుందని భావించిన మాట నిజమేనన్నారు. ఆమె ఈ చిత్రంలో పాత్రకు అంతగా నొప్పదనిపించిందన్నారు. తాను, లక్ష్మీమీనన్, సుశీంద్రన్‌లది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని పేర్కొన్నారు. అయినా చాలామంది నటీమణుల పేర్లు పరిశీలించిన తరువాత లక్ష్మీమీనన్‌నే బెటర్ అని, ఆమెను ఎంపిక చేసినట్లు నటుడు విశాల్ వివరించారు. -
పెళ్లితో పనేంటి?
పెళ్లింతో పనేంటి లాంటి చిత్రాలను తెరపై మాత్రమే చూశాం. అయితే నిజజీవితంలో పెళ్లితో పనేంటి? అని ప్రశ్నిస్తోంది నటి లక్ష్మీమీనన్. ఈ మలయాళ కుట్టి పెళ్లి చేసుకోని అరుదైన నటీమణుల పట్టికలో చేరనుందని ఆమె మాటల్లోనే తెలుస్తోంది. ఈ తరం హీరోయిన్స్‌లో విజయపథంలో దూసుకుపోతున్న నటి లక్ష్మీమీనన్. కోలీవుడ్‌లో కుంకీ చిత్రంలో హీరోయిన్గా పయనం ఆరంభించిన ఈ అమ్ముడు ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో యమ క్రేజ్‌లో ఉంది. ప్రేమ, పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ భామ బదులిస్తూ, ప్రస్తుతం తన దృష్టిఅంత నటనపైనే సారిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంది. సూర్యతో రొమాన్స్ చేయూలన్నది తన ఆశ అని అదే విధంగా విజయ్, అజిత్‌లతో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇకపోతే మలయాళంలో మమ్ముట్టి సరసన నటించాలన్నది తన చిరకాల కోరిక అని చెప్పింది. విశాల్‌తో నటించిన రెండు చిత్రాలు హిట్ అయ్యాయని చెప్పింది. ఆయనతో ఎలాంటి అసౌకర్యం కలగలేదని అంది. ఆయనతో లిప్‌లాక్ సన్నివేశంలో నటించిన ఈ భామ, చాలా సౌకర్యంగా ఉందనడంలో మర్మమేమిటో...? -
స్ట్రీట్ ఫైటర్‌గా..
తెరపై అందాలు ఒలకబోయడమేకాదు అవసరమొస్తే అడ్డు వచ్చిన వారిని కుళ్ల పొడవటానికైనా సిద్ధమేనంటోంది నటి లక్ష్మీ మీనన్. ఈ తరం హీరోయిన్లలో టాప్ పొజిషన్లో దూసుకుపోతున్న అమ్మడు ఈమేనని చెప్పక తప్పదు. అపజయం ఎరుగని హీరోయిన్గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ తాజాగా సిద్దార్ధ్‌తో నటించిన జిగర్ తండా చిత్రం కూడా హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. యువ హీరోలతో జమాయిస్తున్న ఈ కేరళ కుట్టి తాజాగా నటుడు శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. విజయపరంపర కొనసాగిస్తున్న నటుల్లో శివకార్తికేయన్ ఒకరు. ఈయనతో లక్ష్మీమీనన్ జత కట్టనున్న చిత్రానికి రజని మురుగన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. శివకార్తికేయన్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభంకానుంది. ఇందులో లక్ష్మీమీనన్ది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని, ఆమె ఈ చిత్రంలో స్ట్రీట్ ఫైట్ కూడా చెయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ, శివకార్తికేయన్‌తో జత కట్టనున్న విషయం నిజమేనని స్పష్టం చేసింది. ఈ చిత్రంలో తన పాత్ర తన గత చిత్రాల పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. చిత్ర కథ దక్షిణ తమిళనాడు నేపథ్యంలో సాగుతోందని తెలిపింది. అక్టోబర్‌లో తానీ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు వెల్లడించింది. వరుత్తపడాదవాలిబర్ సంఘం ఫేమ్ పొన్రామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత, లింగుసామి సంస్థ తిరుపతి బ్రదర్స్ నిర్మించనుంది. -
ఏ హీరోతో అయినా లిప్‌లాక్‌కు ఓకే
ఈతరం హీరోయిన్లో హీరోలతో యమ క్లోజ్‌గా ఉండే భామల్లో నటి లక్ష్మీ మీనన్ ఒకరనే ప్రచారం జరుగుతోంది. కుంకి, సుందర పాండియన్, వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో హీరోయిన్గా మంచి పేరుతోపాటు హోమ్లీ ఇమేజ్ను సంపాదించుకున్న లక్ష్మీ మీనన్ ఆ తరువాత తన శైలిని మార్చుకుంటూ వచ్చారు. నాన్ శిగప్పు మనిధన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి తన పక్కింటి అమ్మాయి ఇమేజ్ను బద్దలుకొట్టారు. అంతేకాదు హీరోలతో సన్నిహితంగా ఉంటేనే సన్నివేశాలు సహజంగా ఉంటాయని, లేకుంటే అసౌకర్యంగా ఉంటుందన్నారు. విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాలలో నటించడానికి మీ స్నేహమే కారణమా? అన్న ప్రశ్నకు, కథ డిమాండ్ చేస్తే ఏ ఇతర హీరోతో అయినా పెదవి ముద్దు సన్నివేశాల్లో నటిస్తానని నిస్సంకోశంగా అంటున్నారీ భామ. ఈమె సిద్దార్ధ్‌తో రొమాన్స్ చేసిన జిగరదండా చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
జిగర్తండా విడుదల వాయిదా
జిగర్తండా చిత్రం విడుదల వాయిదా పడింది. సిద్దార్థ్ లక్ష్మీ మీనన్ జంటగా నటించిన చిత్రం జిగర్తండా. పిజ్జా వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. గుప్తా కంపెనీ పతాకంపై ఎస్.కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసింది. దర్శక నిర్మాతల వివాదం కారణంగా చిత్రం విడుదలలో జాప్యం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. చిత్రం సెన్సార్ కట్స్ విషయంలో దర్శక నిర్మాతల మధ్య వివాదం ఏర్పడినట్లు సమాచారం. జిగర్తండా చిత్రానికి సెన్సార్ బృందం కొన్ని కట్స్‌తో యు సర్టిఫికేట్ ఇచ్చారు. ఎట్టకేలకు జిగరతండా చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడీ చిత్రం మరోవారం వెనక్కుపోతోంది. ఆగస్టు ఒకటిన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఎస్.కదిరేశన్ వెల్లడించారు. అందుకు కారణాన్ని ఆయన తెలుపుతూ ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం వేలై ఇల్లా పట్టదారి విజయవంతంగా ప్రదర్శితమవుతోందన్నారు. ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు, పంపిణీదారులు జిగర్తండా చిత్రం కూడా చాలా బాగా వచ్చిందని, కొంచెం గ్యాప్ ఇచ్చి విడుదలచేస్తే అధిక థియేటర్లలో ప్రదర్శించవచ్చునని సూచించడంతో వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జిగర్తండా చిత్రాన్ని ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత వివరించారు. -
నిర్మాతపై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం!
జిగర్థాండ (తెలుగు డబ్బింగ్: చిక్కడు దొరకడు) చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదలను తమకు చెప్పకుండా వాయిదా వేశారనే కారణంతో జిగర్థాండ నిర్మాత కదిరేశన్ పై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిగర్థాండ చిత్రం వాస్తవానికి జూలై 25 తేదిన శుక్రవారం తమిళనాడులో విడుదల కావాల్సి ఉంది. అయితే చెప్పపెట్టకుండా విడుదలను నిర్మాత వాయిదా వేశారని సిద్దార్థ్ అన్నారు. మీరెవరైనా కానివ్వండి.. ఇలాంటి డర్టీ గేమ్ ఆడకండి. సినిమాను విడుదల చేయడంలో ఆలస్యం కావొచ్చు. కాని మమ్మల్ని ఆపలేవు అని ట్వీట్ చేశారు. ఓ మంచి చిత్రాన్ని విడుదల కాకుండా ఆపడం మంచిది కాదని సిద్దార్థ్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పలు సందేశాలు పోస్ట్ చేయడం తాజా ఓ వివాదానికి దారి తీసింది. జిగర్థాండ చిత్రం కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఇతర సభ్యులు చాలా కష్టించి పనిచేశారని.. తమతో సంప్రదించకుండా.. కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా.. చిత్ర విడుదలను వాయిదా వేశారు అని ట్విటర్ లో తెలిపారు. జిగర్థాండ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నానని సిద్దార్థ్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. Whoever you are who aided in this dirty game, you can delay us you cannot stop us. A good film cannot be killed. #JIGARTHANDA — Siddharth (@Actor_Siddharth) July 21, 2014 Karthik, our whole team and I worked really hard for Jigarthanda.With no respect for us, without even discussing it with us...postponed. — Siddharth (@Actor_Siddharth) July 21, 2014 -
కోటిస్తే.. ఆరబోస్తా
సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అయితే అందులో గ్లామర్‌ను హీరోయిన్లు సాదకంగా వాడుకుంటూ పారితోషికాన్ని పెంచుకుపోతున్నారు. ప్రస్తుతం కొన్ని మంచి కథా చిత్రాలు వస్తున్న గ్లామర్ డిమాండ్ గ్లామర్దే. కాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన నటి లక్ష్మీమీనన్ కోటి రూపాయల పారితోషికం తీసుకునే హీరోయిన్ల క్లబ్లో చేరడానికి తహతహలాడుతుండటమేమిటి! కుంకి చిత్రంలో కొండవాసి పడతిగా మంచి అభినయాన్నే ప్రదర్శించిన ఈ మళయాళ భామ అలా మరో రెండు చిత్రాల్లో నటించిందో లేదో అప్పుడే గ్లామర్ ప్రదర్శనకు రెడీ అయిపోయింది. అదృష్టం తరుముకొస్తున్నట్లు ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదట్లో మోడ్రన్ దుస్తులు తన శరీరాకృతికి సరిపడవని, పక్కింటి అమ్మాయి ఇమేజ్ చాలని దీర్ఘాలు తీసిన లక్ష్మీమీనన్ నాన్ శిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాల్లో లీనమై నటించేసింది. అదేమంటే కథ డిమాండ్ మేరకే నటించాల్సి వచ్చిందని స్టేట్మెంట్స్ ఇచ్చేసింది. ఆ తరువాత ఎలాంటి చుంబనాలకైనా రెడీ అంటూ గేట్లు తెరిచేసింది. దీంతో దర్శక నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న లక్ష్మీమీనన్ తన పారితోషికాన్ని ఐదు లక్షలు, పది లక్షలు, అంటూ పెంచుకుంటూపోతోంది. ప్రస్తుతం అరకోటికి చేరిన లక్ష్మీమీనన్ ఇక తన పారితోషికం కోటి అంటోందట. కోటంటే మరి ఎక్కువ అంటున్న దర్శక నిర్మాతలతో కావాలంటే మరిన్ని ముద్దు సన్నివేశాల్లో, మరింత అందాలు ఆరబోయడానికి తాను రెడీ అని నిర్మాతల్ని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తుందట మాలీవుడ్ ముద్దుగుమ్మ లక్ష్మీమీనన్! -
వైవిధ్యమైన పాత్రలో విశాల్
వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో ఆసక్తిని కనబరిచే హీరోల్లో విశాల్ ఒకరు. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనాలు. ఈ నెల 20న మరో వైవిధ్యమైన పాత్రతో విశాల్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. సినిమా పేరు ‘ఇంద్రుడు’. అనూహ్యమైన సంఘటన కళ్ల ముందు జరిగినా కూడా ఠక్కున నిద్రలోకి జారిపోవడం ‘నార్కొలెప్సీ’ అనే వ్యాధి లక్షణం. ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ఈ సినిమాలో విశాల్ కనిపించబోతున్నారు. తిరు దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ చిత్రం ‘నాన్ సిగప్పు మనిదన్’కు ఇది అనువాద రూపం. ఈ నెల 20న ‘ఇంద్రుడు’ విడుదల కానుంది. లక్ష్మీమీనన్ కథానాయిక. నార్కొలెప్సీ వ్యాధి కారణంగా ఇందులో హీరోకు ఎలాంటి సమస్యలు తలెత్తాయి? వాటిని తను ఎలా ఎదుర్కోగలిగాడు? అనేది ఈ సినిమాలో ఆసక్తికమైన అంశమని దర్శకుడు చెబుతున్నారు. విశాల్, లక్ష్మీమీనన్‌ల కెమిస్ట్రీ తమిళనాట సంచలనం సృష్టించిందని, అయితే కథానుగుణంగానే వారితో ఆ హాట్సీన్స్ని తెరకెక్కించాల్సి వచ్చిందనితిరు తెలిపారు. శత్రువులను టార్గెట్ చేసి ఒక్కొక్కరినీ విశాల్ అంతం చేసే సన్నివేశాలు ఉద్రేకపూరితంగా ఉంటాయని ఆయన అన్నారు. యూ టీవీ మోషన్ పిక్చర్స్, విశాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో ఇనియా, శరణ్య ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్. -
ఈమె కూతా ఘనమే
ఇప్పుడు నటనకయినా, పాడటానికయి నా పెద్దగా కసరత్తు లేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పాడటానికి సం గీత సాధనతో కూడా పని లేకుండా పోయిం ది. కాస్త హస్కీ వాయిస్ ఉంటే చాలు పాడేయవచ్చు. గాయనీమణులైన నటీమణుల శాతం తక్కువే. హీరోల్లో అయితే రజనీ, కమల్, విజయ్, సూర్య, శింబు, ధను ష్, కార్తి, విశాల్, శివకార్తికేయన్, భరత్ అంటూ వరుసపెట్టి పాడేశారు. ఇలా తమిళంలో పాడిన హీరోయిన్లు ప్రస్తుతం లేరనే చెప్పాలి. ఆండ్రియా, మమతా మోహన్ దాస్, రమ్యా నంబీశన్ వంటి వారు గాయనీమణులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వీరందరూ ఇతర భాషలకు చెందిన వారేననన్నది గమనార్హం. వీరిలో రమ్యా నంబీశన్ కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. ఈమె మలయాళంలో పలు పాటలు పాడినా తొలిసారిగా పాండియనాడులో గళం విప్పారు. ఆ తరువాత డమాల్ డుమీల్ చిత్రంలో ఒక పాట పాడారు. ఇప్పుడీ జాబితాలో లక్ష్మీ మీనన్ చేరారు. కుంకీ నుంచి ఇటీవల విడుదలైన మంజాపై చిత్రం వరకు వరుస విజయాలనే తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఈ లక్కీ హీరోయిన్ తాజాగా గాయని అవతారమెత్తారు. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక ఊరుల రెండు రాజా చిత్రం కోసం ఐటమ్ సాంగ్ పాడేశారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఈ పాటను లక్ష్మీ మీనన్‌తో పాడాల్సి రావడంపై దర్శకుడు కన్నన్ తెలుపుతూ ఈ పాటకు హస్నిగా ఉండే వాయిస్ అవసరం అయ్యిందన్నారు. ఎవరితో పాడించాలన్న ఆలోచిస్తుండ గా డి.ఇమాన్ లక్ష్మీ మీనన్ పేరును సూచించారని చెప్పా రు. వెంటనే ఆమెను చెన్నైకి రప్పించి పాడించామని తెలి పారు. ఎక్కువ టేకులు తీసుకోకుండా రెండు గంటల్లో లక్ష్మీ మీనన్ పాడేశారని చెప్పారు. చాలా కాలం పాడాలనే ఆశ మనసులో ఉందని అది ఒరు ఊరుల రెండు రాజా చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందని లక్ష్మీ మీనన్ పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు డి.ఇమాన్, దర్శకుడు కన్నన్‌లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. డి.ఇమాన్‌కు హీరోయిన్లతో పాడించడం ఆనవాయితీగా మారింది. ఇంతకు ముందు ఆయన ప్రియాంక చోప్రా, మీనా, శృతిహాసన్, రమ్యా నంబీశన్ వంటి హీరోయిన్లతో పాడించారు. -
కంటతడి పెట్టా
మంజాపై చిత్ర కథ విన్నప్పుడే కంటతడి పెట్టానని చిత్ర నిర్మాత, దర్శకుడు లింగుసామి చెప్పారు. విమల్, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన చిత్రం మంజాపై. నటుడు రాజ్ కిరణ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా రాఘవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు లింగుసామి సమర్పణలో తిరుపతి బ్రదర్స్ పతాకంపై ఆయన సోదరుడు ఎన్.సుభాష్ చంద్రబోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ ఆరో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లింగుసామి మాట్లాడుతూ దర్శకుడు రాఘవన్ కథ చెప్పినప్పుడే తాను కంటతడి పెట్టానన్నారు. అంతగా కదిలించిన చిత్ర కథ ఇదన్నారు. తాతా మనవళ్ల ప్రేమానుబంధాలను ఆవిష్కరించిన చిత్రం మంజాపై అని చెప్పారు. తాతగా రాజ్‌కిరణ్, మనవడిగా విమల్ జీవించారని చెప్పారు. ఈ చిత్రం కచ్చితంగా ఇంతకు ముందు తమ సంస్థ నుంచి వచ్చిన కుంకీ, లక్కుఎన్ 18/9, గోలిసోడా చిత్రాల వరుసలో చేరుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశా రు. ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రం అని, దర్శకుడు రాఘవన్ చిత్రాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారని నటుడు రాజ్‌కిరణ్ తెలిపారు. జీఆర్ వెంకటేశ్, ఎ.నందకుమార్‌తో సహ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎన్.ఆర్.రఘునందన సంగీతాన్నందించారు. -
ధనుష్‌కు జంటగా లక్ష్మీమీనన్
నటి లక్ష్మీమీనన్‌ను అదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈ మలయాళీ బ్యూటీ హీరోయిన్గా తన స్థాయిని పెంచుకుంటూ పోతోంది. కుంకీ ప్రారంభమైన ఈ అమ్మడి విజయ పరంపర సుందర పాండియన్, కుట్టిపులి, పాండియనాడు, నాన్ శిగప్పు మనిధన్, అంటూ కొనసాగుతూనే ఉంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌తో జత కట్టే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ధనుష్ హీరోగా నటిస్తూ, తన ఉండరబార్ ఫిలింస్ పతాకంపై తాజాగా ఒక చిత్రం నిర్మించనున్నారు. దీనికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు పొల్లాదవన్, ఆడుగళం వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రానికి కాడు అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో సీనియర్ నటుడు పార్తిపన్ ఒక ముఖ్య పాత్రను పోషించనున్నారు. ఇప్పటికే పది రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ను చెన్నై ఈసీఆర్ రోడ్డులోని ఒక కళాశాలలో పది రోజులపాటు నిర్వహించినట్లు తెలిపారు. అయితే కాడు అనే టైటిల్ తాను సిద్ధం చేసుకున్న మరో చిత్రం కథ టైటిల్ అని వివరించారు. ధనుష్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదని చెప్పారు. -
ఎవరేమన్నా అనుకోనీ..
సక్సెస్ మనిషిలో చాలా మార్పు తీసుకొస్తుంది. అది నమ్మకాన్నేకాదు కించిత్ గర్వాన్ని పెంచుతుంది. విజయాన్ని తలకెక్కించుకోరాదంటారు. అయితే దాన్ని అమలుపరచడం అంత సాధ్యం కాదు. నిన్నగాక మొన్న వచ్చిన నటి లక్ష్మీమీనన్‌ను గమనిస్తే సక్సెస్ ఆమెలో ఎంత మార్పును, తెగింపును తీసుకొచ్చిందో అర్థం అవుతుంది. తొలి చిత్రం కుంకీ, సుందరపాండియన్, కుట్టిపులి, పాండియనాడు, నాన్ శిగప్పుమనిధన్, అంటూ వరుస విజయాలు ఆమె సొంతం చేసుకుంది. ఇటీవల ఇన్ని హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న నటి ఈమేనని చెప్పవచ్చు. అంతేకాదు మరో నాలుగైదు చిత్రాలతో ఈ అమ్మడి డైరీ ఫుల్‌గా ఉంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి లక్ష్మీమీనన్ తెలుపుతూ జిగర్తండా, మంజాపై చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయన్నారు. తాను అంచనాలు పెంచుకున్న మరో చిత్రం సిపాయి అని తెలిపారు. గౌతమ్ కార్తిక్‌తో రొమాన్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. తమది ముచ్చటైన జోడి అని పేర్కొన్నారు. ఇటీవలే ప్లస్ పాసయిన ఈ ముద్దుగుమ్మ చదువైనా నటనైనా ప్రణాళిక అంటూ ఏమీ ఉండదంటున్నారు. లిటరేచర్ ఆఫ్ కామర్స్‌లో ఉత్తీర్ణత పొంది డిగ్రీ పట్టా అందుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సినిమాలో మంచి పాత్ర అనిపిస్తేనే అంగీకరించాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇటీవల నాన్‌శిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో నటించిన లిప్‌లాక్ సన్నివేశాలు పెద్ద కలకలాన్నే పుట్టించాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఆ చిత్రంలో తమ మధ్య రొమాన్స్ సన్నివేశాలతోపాటు, కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యిందన్నారు. ఈ సన్నివేశాల్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారని కాబట్టి ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. అసలు అలాంటి ప్రచారం గురించి వినే టైమ్ కూడా తనకు లేదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఈ భామ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. -
ఈమె ముద్దు చాలా కాస్ట్లీ
ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? అంటూ పాత కాలపు హీరోలు పాడుకునేవారు. ఇప్పుడలాంటి అవసరం లేదు. ఇప్పుడు దాదాపు అన్ని చిత్రాల్లోనూ చుంబనాల దృశ్యాలుంటున్నాయి. లిప్‌లాక్‌లకు నేటి తరం హీరోయిన్లు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కాకపోతే వాటికంటూ ఒక రేటును డిమాండ్ చేస్తున్నారంతే. తాజాగా ఈ తరహా వ్యాపారంలో నటి లక్ష్మీ మీనన్ ముందంజలో ఉన్నారు. కుంకీ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ మలయాళ భామ ఆ చిత్రంలో ఒంటినిండా దుస్తులు ధరించి కొండ ప్రాంత పడుచుగా నిండుగా కనిపించింది. బొద్దుగా ముద్దు గా బాగుందనిపించింది. అదే సమయంలో కుంకీ చిత్రం విజయం సాధించడంతో కోలీవుడ్‌కు మరో పక్కింటి అమ్మాయిలా మంచి హీరోయిన్ లభించిందనుకున్నారు. అనుకున్నట్లుగానే లక్ష్మీ మీనన్ తదుపరి చిత్రాలు సుందరపాండియన్, కుట్టిపులి, పాండియనాడు చిత్రాల్లోనూ లంగా ఓణి, చీర అంటూ సంప్రదాయ బద్దంగా కనిపించింది. అయితే అన్ని చిత్రాల్లో లంగా ఓణిలను అంటిపెట్టుకుని సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ మడికట్టుకుని ఉంటే లాభం లేదనుకుందో ఏమో, ఆ తరువాత నటించిన నాన్ శిగప్పు మనిదన్ చిత్రంలో ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాల్లోనే రెచ్చిపోయి నటించేసింది. అంతేకాదు ఇకపై ఇలాంటి ముద్దు సన్నివేశాలకు, కురచ దుస్తులు ధరించి నటించే గ్లామరస్ పాత్రలకు రెడీ అంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేసింది. మరో విషయం ఏమిటంటే లక్ష్మీమీనన్ ప్రకటన ఆమె తల్లికి, దర్శక నిర్మాతలకు తెగ ఆనందాన్నిచ్చేసిందని సమాచారం. దీంతో కోలీవుడ్ దర్శక నిర్మాతలు లక్ష్మీమీనన్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటింపజేయడానికి సిద్ధం అయ్యారట. ఇక ఈ సంచలన నటి తల్లి మాత్రం ఒక్కో ముద్దు సన్నివేశానికి అదనంగా పది లక్షలు పారితోషికం చెల్లించుకోవాలంటూ డిమాండ్ చేసే పనిలో పడ్డారట. కొందరి అవసరం ఇంకొందరికి అవకాశం అంటే ఇదేనేమో. -
మధ్యలో నా ఊసెందుకు?
మీ ప్రేమ వ్యవహారాల మధ్యకు నన్నెందుకు లాగుతారంటున్నారు యువ నటి నందిత. అట్టకత్తి చిత్రం హీరోయిన్గా తెరపైకొచ్చిన ఈ అమ్మడు అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందారు. తొలి చిత్రమే నందితకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఎదిర్ నీచ్చల్ తదితర చిత్రాలతో పక్కింటి అమ్మాయి లాంటి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అన్నీ పల్లెటూరి పడుచు పాత్రలే చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన బాడీ లాంగ్వేజ్‌కు ఈ తరహా పాత్రలే నప్పుతాయంటున్నారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా నటిస్తున్న చిత్రం ముండాసుపట్టి. విష్ణువిశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సి.వి.కుమార్ సంస్థ తిరుకుమరన్, ఫాక్స్ స్టార్ స్టూడియో సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది. విశాల్, లక్ష్మీ మీనన్‌ల ప్రేమ వ్యవహారంపై విష్ణు విశాల్ ఇంతకు ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాన్ని ఈ సందర్భంగా విష్ణు విశాల్ ప్రస్తావిస్తూ విశాల్ తనపై ప్రతీకారం తీర్చుకున్నారని అన్నారు. ఎలా అన్న ప్రశ్నకు తనకూ నందితకు మధ్య ఏదో ఉన్నట్లు ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించి తాను ఆయనపై చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకున్నారని తెలిపారు. మరి మీకు నటి నందితకు మధ్య నిజంగా అలాంటిదేమయినా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం ఆమెనే అడగండన్నారు. దీంతో విశాల్‌కు లక్ష్మీమీన్కు మధ్య ఏముందో, వారితో తమకు ఏమిటి సంబంధమో తనకు తెలియదు మధ్యలో తననెందుకు లాగుతారు అంటూ నటి నందిత అన్నారు. -
విశాల్ 'ఇంద్రుడు' మూవీ స్టిల్స్
-
ఏ హీరోతోనైనా లిప్‌లాక్‌కు రెడీ
ఏ హీరోతోనైనా లిప్‌లాక్ కిస్‌లకు రెడీ అంటూ గేట్లు తెరిచేశారు యువ నటి లక్ష్మీమీనన్. నాన్ సిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో నటించిన పెదవి పెదవి చుంభన దృశ్యం ఒక పక్క కలకలం పుట్టిస్తోంది. ఈ పరిస్థితిలో ఈ భామ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. విశాల్, లక్ష్మీమీనన్ జంటగా నటిం చిన చిత్రం నాన్ సిగప్పు మనిదన్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, యూటీవీ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తిరు దర్శకుడు. చిత్రం ఈ నెల 11న తెరపైకి రానుంది. చిత్రంలో విశాల్, లక్ష్మీమీనన్ ముద్దు దృశ్యాలాంటి కొన్ని సన్నివేశాల కారణంగా చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిత్రంలో లిప్‌లాక్ దృశ్యాలను తొలగించినా పర్వాలేదని రీ సెన్సార్‌కు వెళ్లి యూ సర్టిఫికెట్ పొందనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విశాల్‌తో కలిసి నటించినట్లుగా ఇతర హీరోలతోను లిప్‌లాక్ సన్నివేశంలో నటిస్తారా? అని లక్ష్మీమీనన్‌ను అడగ్గా కథకు అవసరమైతే ఏ హీరోతోనైనా లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి సిద్ధమంటూ బదులిచ్చారు. -
లక్ష్మీమీనన్‌తో లవ్వా?
నటుడు విశాల్, లక్ష్మీమీనన్‌కు మధ్య లవ్వాట యమజోరుగా సాగుతోందని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇందుకు పలు కారణాలు చెబుతున్నారు. విశాల్, లక్ష్మీమీనన్ పాండియనాడు చిత్రంలో తొలిసారిగా రొమాన్స్ చేశారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ సెంటిమెంట్నో లేక ప్రేమతోనో తదుపరి చిత్రంలోను విశాల్ తనకు జంటగా లక్ష్మీమీనన్‌నే హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. నాన్ శిగప్పు మనిదన్ చిత్రం షూటింగ్లో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందనే గుసగుసలు ప్రచారం అయ్యాయి. అంతేకాదు ఈ చిత్రంలో వీరిద్దరూ గాఢమైన పెదవి చుంబనాలు చేసుకోవడం విశేషం. మరో విషయం ఏమిటంటే విశాల్ సన్నిహిత మిత్రులే లక్ష్మీమీనన్‌తో లవ్ అంటూ ఆట పట్టిస్తున్నారు. షూటింగ్లో ఆమెను తమ కంట పడకుండా కాపాడుకుంటూ వచ్చారంటూ ఆడియో ఆవిష్కరణ వేదిక పైనే విశాల్ మిత్ర బృందం పరిహాసమాడడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరందుకుంది. అయితే విశాల్ ఈ వదంతులను కొట్టి పారేశారు. లక్ష్మీమీనన్‌కు తనకు మధ్య ఉన్నది మంచి స్నేహమే అంటూ స్పష్టం చేశారు. వీరిద్దరూ నటించిన రెండో చిత్రం నాన్ శిగప్పు మనిదన్ ఏప్రిల్ 11న విడుదల కానుంది. -
లిప్ లాక్ కు అభ్యంతరం లేదు: లక్ష్మీ మీనన్
లిప్ లాక్ ఎలాంటి అభ్యంతరాలు లేవని దక్షిణాది తార లక్ష్మీ మీనన్ స్పష్టం చేశారు. త్వరలో విడుదల కానున్న నాన్ సిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్ కృష్ణతో లక్ష్మీ మీనన్ లిప్ లాకేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మీడియాతో లక్ష్మీ మీనన్ మాట్లాడుతూ.. స్కిప్ల్ లో భాగమై.. ప్రాధాన్యత కలిగి ఉంటే లిప్ లాక్ వెనుకాడను అని లక్ష్మీ మీనన్ వెల్లడించింది. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ ఆలోచించనని.. దర్శకుడు తిరు లిప్ లాక్ సీన్ గురించి చెప్పినపుడు తాను ఓకే అన్నాను అని తెలిపారు. అంతేకాని ప్రేక్షకులను కేవలం సినిమా థియేటర్ కు రప్పించడానికి తాను లిప్ లాక్ సీన్లు చేయను అని అన్నారు. నాన్ సిగప్పు మనిదన్ చిత్రం కోసం తొలిసారి విశాల్ తో కలిసి లిప్ లాక్ సీన్ లో పాల్గొన్నాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే. ప్రేక్షకులకు తప్పక నాన్ సిగప్పు మనిదన్ చిత్రం నచ్చుతుందని లక్ష్మీ మీనన్ వెల్లడించింది. నాన్ సిగప్పు మనిదన్ చిత్రం ఇంద్రుడు పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. -
లిప్‌లాక్‌కు ఓకే
సినీ తారలు పరిస్థితులకనుగుణంగా తమ మైండ్ సెట్‌ను మార్చుకుంటుంటారు. యువ నటి లక్ష్మీమీనన్ కుంకీ చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగంలో మెరిసిన ఈ మలయాళీ కుట్టి ఆ చిత్రంలో కొండప్రాంత వాసి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆ చిత్రం విజయంతో వరుసగా సుందరపాండియన్, పాండియనాడు, కుట్టిపులి అంటూ వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. ఈ చిత్రాలు సక్సెస్ కావడంతో లక్ష్మీమీనన్ రాశిగల నటిగా మారిపోయింది. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. మొన్నటి వరకు గ్లామర్ పాత్రలే బాడీ లాంగ్వేజ్‌కు నప్పుతాయి అంటూ చెప్పుకుంటూ వచ్చింది. పస్తుతం అన్నీ గ్లామర్ పాత్రల్నే పోషిస్తోంది. కాస్త బొద్దు ముద్దుగా ఉన్న ఈ అమ్మడి బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చుగా అంటే తానిట్టాగే ఉంటాను. ఇష్టం వచ్చినవి లాగించేస్తాను కూడా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆ తరువాత ఆ మాటలను మూటగట్టి అటకెక్కించి బరువు తగ్గి నాజూగ్గా తయారైంది. తాజా చిత్రం నాన్ సిగప్పు మనిదన్ చిత్ర ప్రచార చిత్రం, పాటలు చూస్తే ఆమె ఎంతగా బరువు తగ్గిందో అర్థం అవుతుంది. అంతేకాదు గ్లామర్‌కు దూరం అంటూనే ఇప్పుడు ఆ తరహా పాత్రలు విజృంభిస్తున్న ఈ బ్యూటీ లిప్‌లాక్‌లకు నో చెప్పింది. తాజాగా నాన్ శివప్పు మనిధన్ చిత్రంలో విశాల్‌తో యమ గాఢంగా పెదవి పెదవి కలిపేసి చుంభనాలు సన్నివేశంలో నటించేసింది. ఈ విషయం గురించి అడిగితే సినిమాల్లో లిప్‌లాక్‌కు తనకెలాంటి సమస్య లేదని బదులిచ్చింది. చిత్రకథకు అవసరం అయితే ముద్దులకు సిద్ధమే నంటోంది. నాన్ శివప్పు మనిగదన్ చిత్రంలో లిప్‌లాక్ ఆవశ్యకత గురించి దర్శకుడు తిరు వివరించడంతో ఓకే చెప్పానని తాను నటనకు బానిసనని చెప్పింది. పాత్రకు న్యాయం చేయడానికి ఎలాగైనా నటిస్తానని లక్ష్మీమీనన్ తన లిప్‌లాక్ చర్యలను సమర్థించుకుంటోంది. -
విశాల్ ఇంద్రుడు
తెలుగు, తమిళ భాషల్లో మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఇటీవల విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ అనే బేనర్‌ని ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థపై తొలి ప్రయత్నంగా విశాల్ నిర్మించిన ‘పాండియనాడు’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగులో ‘పల్నాడు’గా విడుదలైంది. ప్రస్తుతం విశాల్ ‘ఇంద్రుడు’ అనే చిత్రంలో హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్నారు. సిద్ధార్ధ్ రాయ్ కపూర్ ఓ నిర్మాత. విశాల్ సరసన ‘పల్నాడు’లో నటించిన లక్ష్మీమీనన్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. తిరు దర్శకుడు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. త్వరలో థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటలను చిత్రీకరించనున్నారు. పూర్తయినంతవరకు రషెస్ చూసిన బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఈ చిత్రం హిందీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవీ ప్రకాష్‌కుమార్ పాటలు స్వరపరచిన ఈ సినిమాకి రిచర్డ్ ఎన్ నాథన్ ఛాయాగ్రాహకుడు. -
ఇనియాతో చిందేస్తే సరిపోతుంది
నటి ఇనియాతో కలిసి విశాల్ చిందేస్తే చిత్రం పూర్తి అవుతుందంటున్నారు దర్శకుడు తిరు. ఇంతకుముందు విశాల్ హీరోగా తీరాద విళైయాట్టు పిళ్లై సమర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ యువ దర్శకుడు ముచ్చటగా మూడో సారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం నాన్ సిగప్పు మనిదన్. విశాల్, యూటీవీ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా లక్ష్మీ మీనన్ నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు పాండియనాడు వంటి హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాన్ సిగప్పు మనిధన్ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. చిత్రం గురించి దర్శకుడు తిరు మాట్లాడుతూ ఒక పాట, ఫైట్ సీక్వెన్స్ మినహా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపారు. విశాల్, ఇనియా, సుందర్, జగన్ పాల్గొననున్న ఈ పాటను త్వరలో మాధవరంలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు తీరాద విళైయాట్టు పిళ్లై, సమర్ చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించామన్నారు. అయితే నాన్‌సిగప్పు మనిదన్ చిత్ర షూటింగ్‌ను పూర్తిగా చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. అయితే రెండు పాటలు మాత్రం రాజస్థాన్, కులుమనాలి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించడం గమనార్హం. ఈ చిత్రాన్ని తెలుగులో ఇంద్రుడు పేరుతో విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. చిత్రంలో విశాల్ పేరు ఇంద్రన్ అని అందుకే తెలుగులో ఇంద్రుడు పేరు కరెక్ట్‌గా ఉంటుందని ఆ పేరు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. -
పిజ్జా దర్శకునితో యాక్షన్ డ్రామా
సిద్దార్థ్, లక్ష్మీమీనన్ జంటగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘జిగర్తతండా’ చిత్రం రూపొందుతోంది. తెలుగు వెర్షన్‌ని ఎస్.కె.పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఒక షెడ్యూలు మినహా చిత్రం పూర్తయింది. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘‘కార్తీక్ సుబ్బరాజ్ ప్రతిభ ఏంటో ‘పిజ్జా’తోనే అందరికీ అర్థమైంది. ఇదొక వినూత్న కథాంశం. నగర నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా’’ అని చెప్పారు. మరో నిర్మాత వి.ఎస్.రామిరెడ్డి మాట్లాడుతూ -‘‘ఇందులో సిద్దార్థ్ పాత్ర అన్ని వర్గాలకూ నచ్చే విధంగా ఉంటుంది. ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో కీలకపాత్ర చేయబోతున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ. -
సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా
'పిజ్జా'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'జిగర్తండా'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్నారు. ఎస్.కె. పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నితెలుగులో అందిస్తున్నాయి. ఒక షెడ్యూల్ మినహా ఈ చిత్రం పూర్తయ్యింది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సిద్ధార్ధ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి చెప్పారు. 'తొలి చిత్రం 'పిజ్జా'తో కార్తీక్ సుబ్బరాజ్ మంచి దర్శకునిగా నిరూపించుకున్నారని, మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సురేష్ కొండేటి తెలిపారు. వేసవి కానుకగా విడుదల చేయబోతున్న ఈ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. బాబీ సింహా, కరుణ, గురు సోమసుందరం, ప్రతాప్ పోతన్, సౌందర రాజా, వినోధిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్. -
లిప్‌లాక్‌కు ఓకే
ఆన్‌స్క్రీన్ హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాలిప్పుడు సర్వసాధారణం. అయినా అలాంటి సన్నివేశాలుంటే యువతకు క్యూరియాసిటీ కూడా ఎక్కువే. అందుకే అలాంటి సన్నివేశాలు రిపీట్ అవుతుంటాయి. ఇంతకుముందు ఈ తరహా లిప్‌లాక్ సన్నివేశాలకు కమలహాసన్‌ను ప్రత్యేకంగా చెప్పుకునేవారు. ఇప్పుడు చాలామంది నటులు ఇలాంటి ముద్దు సన్నివేశాలకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ డిమాండ్ పేరుతో సొమ్ము చేసుకునే ప్రయత్నంగా దీన్ని భావించక తప్పదు. ఇక అసలు విషయానికొస్తే ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా హోమ్లీ పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీమీనన్ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతికి చిహ్నం అయిన లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి ఓకే చెప్పడమే కాదు నటుడు విశాల్‌కు ఘాటుగా ముద్దు లిచ్చేసిందట. వీరిద్దరూ కలసి నటించిన పాండియనాడు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ పెయిర్ తాజాగా నాన్‌సిగప్పు మనిదన్ చిత్రంలో మరోసారి జత కడుతున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు దర్శకుడు. ఇందులో లిప్‌లాక్ సన్నివేశం గురించి దర్శకుడు కథ వినిపించినప్పుడే నటి లక్ష్మీమీనన్‌కు చెప్పారట. కథకు అవసరం అనిపించడంతో ఈ మలయాళి బ్యూటీ కూడా మరోమాట లేకుండా ఓకే చెప్పిందట. విశాల్, లక్ష్మీమీనన్‌ల మధ్య ఈ లిప్‌లాక్ సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారట. అయితే ఎలాంటి అసభ్యత, అశ్లీలం లేకుండా ఈ సన్నివేశాలను కళాత్మకంగా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. -
విశాల్ సరసన ఇనియ
యువ నటి ఇనియ నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. వాగైచూడవా చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ చిత్రంలో గ్రామీణ యువతిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం రాలేదు. తాజాగా అలాంటి మంచి అవకాశం వచ్చింది. పాండియనాడు వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత నటుడు విశాల్ నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం నాన్ శిగప్పు మనిదన్. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా లక్ష్మీ మీనన్ నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్రకు ఇనియను ఎంపిక చేశారు. ఇందులో ఆమెది చాలా క్రిటికల్ పాత్ర అట. కథకు కీలక పాత్ర కావడంతో రెండవ హీరోయిన్గా నటించడానికి అంగీకరించినట్లు ఇనియ పేర్కొంది. జనవరి నుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపింది. -
లక్ష్మీమీనన్‌పై ధనుష్ కన్ను
కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నటి లక్ష్మీమీనన్. చాలా తక్కువ హీరోల సరసన నటించిన ఈ భామ త్వరలోనే అందరి హీరోల హీరోయిన్ అవబోతోంది. షూటింగ్‌లకు సమయపాలన పాటిస్తూ చిత్ర ప్రచార కార్యక్రమాలకు క్రమం తప్పకుండా పాల్గొంటూ దర్శక నిర్మాతల వద్ద మంచి హీరోయిన్గా పేరు కొట్టేస్తున్న లక్ష్మీమీనన్‌పై స్టార్ హీరోల కన్ను పడుతోంది. వరుస సక్సెస్‌లతో విజయపథంలో పయనిస్తున్న ఈ కేరళ కుట్టిని తనకు జంటగా ఎంపిక చేయడానికి నటుడు ధనుష్ తన చిత్ర దర్శక నిర్మాతలను ఆదేశిస్తున్నట్లు సమాచారం. తొలి చిత్రం కుంకీతో విక్రమ్ ప్రభు సరసన, మలి చిత్రం సుందర్‌పాండియన్ చిత్రంలో శశికుమార్‌కు జంటగా, మూడో చిత్రంలో ఒక మెట్టు ఎక్కి విశాల్‌తో జతకట్టిన లక్ష్మీమీనన్ తాజాగా గౌతమ్ కార్తీ సరసన సిపాయ్, విశాల్ సరసన మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఇలా నటిగా మంచి పేరుతోపాటు పలు అవకాశాలు రావడంతో ఈ కేరళ కుట్టి సంతోషంతో తబ్బిబ్బైపోతోంది. అంతా బాగానే ఉంది గానీ ఈ లక్ష్మీ నానాటికీ బరువెక్కిపోతుండటంతో కాస్త ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోమని దర్శక, నిర్మాతలు సలహా లివ్వడంతో ప్రస్తుతం ఈ భామ బరువు తగ్గే పనిలో పడిందట. -
స్పీడ్ పెంచిన విశాల్
చిత్రాల విషయంలో విశాల్ వేగం పెంచారు. ఆయన హీరోగా నటించి నిర్మించిన చిత్రం పాండియనాడు. లక్ష్మీమీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా శనివారం తెరపైకి వచ్చింది. అలాగే విశాల్ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యూరు. రజనీకాంత్ నటించిన నాన్ శిగప్పు మనిద్ టైటిల్‌ను విశాల్ తన తాజా చిత్రానికి పెట్టారు. ఈ చిత్రాన్ని యూటీవీ సంస్థతో కలిసి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ చిత్రంలోనూ లక్ష్మీమీనన్‌నే హీరోరుున్. తిరు దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ కామెడీతో చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ చిత్రం నవంబర్ మూడో వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. షూటింగ్ ఏకధాటిగా నిర్వహించి సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నారు. దర్శకుడు తిరు చెప్పిన కథ విశాల్‌ను బాగా ఆకట్టుకోవడంతో వెంటనే నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు యూటీవీ సంస్థ నిర్వాహకులు ధనుంజయన్ పేర్కొన్నారు. నిర్మాతగా తన రెండో చిత్రమే యూటీవీ సంస్థతో కలిసి చేయడం ఆనందంగా ఉందని విశాల్ పేర్కొన్నారు. ఇది తన కెరియర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. తమన్ సంగీతం, రిచర్డ్ చాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. -
అతనిపై కోపంతో నేనే నిర్మాత అయ్యాను - విశాల్
‘‘సుశీంద్రన్ ఈ కథ చెప్పినప్పుడు ఉత్కంఠకు లోనయ్యాను. ముందు ఈ చిత్రం నిర్మాత వేరే వ్యక్తి. కానీ ఉన్నట్లుండి అతను తప్పుకున్నాడు. దాంతో అతనిపై కోపంతో నేనే నిర్మాతనయ్యా’’ అని విశాల్ అన్నారు. విశాల్ తమిళంలో నటించి, నిర్మించిన చిత్రం ‘పాండ్యనాడు’. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘పల్నాడు’ పేరుతో విడుదల కానుంది. డి.ఇమ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మంత్రి బాలరాజు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజ్, విశాల్‌కు అందించారు. ఈ సందర్భంగా విశాల్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘హీరోగా నేను చాలా సినిమాలు చేశాను. కానీ హీరోగా చేస్తూ నిర్మించిన చిత్రం మాత్రం ఇదే. నా గత చిత్రాలతో పోల్చి చూస్తే ప్రతి విషయంలోనూ ఈ సినిమా గొప్పగా ఉంటుంది. బిడ్డ పట్ల తండ్రి ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తాడో, అంతే జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఏ సినిమాకీ తీసుకోనన్ని జాగ్రత్తలు ఈ సినిమాకు తీసుకున్నాను. అనుకున్నట్లే అవుట్‌పుట్ చాలాబాగా వచ్చింది. ఇందులో భారతీరాజా నా తండ్రి పాత్ర పోషించారు. ఆయన కేరెక్టర్ సినిమాకే హైలైట్. ‘పందెంకోడి’ చిత్రం నాకెంత పేరు తెచ్చిందో, అంతే పేరు ఈ చిత్రం కూడా తెస్తుంది. నవంబర్ 1న దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. పూర్తి స్థాయిలో తెలుగు సినిమా చేయాలని నాకు ఎప్పట్నుంచో కోరిక. ‘పల్నాడు’ నిర్మాణ బాధ్యతలు కూడా నేనే తీసుకోవడం వల్ల తెలుగు సినిమా ప్రారంభించలేకపోయాను. జనవరి నెలలో శశి దర్శకత్వంలో నా తెలుగు సినిమా మొదలవుతుంది’’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి.కల్యాణ్, విక్రమ్‌గౌడ్, శశాంక్ వెన్నెలకంటి, సాహితి తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. లక్ష్మీమీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో తులసి, విక్రాంత్, సూరీ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ‘మిర్చి’ మది.