స్ట్రీట్ ఫైటర్‌గా..
తెరపై అందాలు ఒలకబోయడమేకాదు అవసరమొస్తే అడ్డు వచ్చిన వారిని కుళ్ల పొడవటానికైనా సిద్ధమేనంటోంది నటి లక్ష్మీ మీనన్. ఈ తరం హీరోయిన్లలో టాప్ పొజిషన్‌లో దూసుకుపోతున్న అమ్మడు ఈమేనని చెప్పక తప్పదు. అపజయం ఎరుగని హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ తాజాగా సిద్దార్ధ్‌తో నటించిన జిగర్ తండా చిత్రం కూడా హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. యువ హీరోలతో జమాయిస్తున్న ఈ కేరళ కుట్టి తాజాగా నటుడు శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది.
విజయపరంపర కొనసాగిస్తున్న నటుల్లో శివకార్తికేయన్ ఒకరు. ఈయనతో లక్ష్మీమీనన్ జత కట్టనున్న చిత్రానికి రజని మురుగన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. శివకార్తికేయన్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభంకానుంది. ఇందులో లక్ష్మీమీనన్‌ది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని, ఆమె ఈ చిత్రంలో స్ట్రీట్ ఫైట్ కూడా చెయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ, శివకార్తికేయన్‌తో జత కట్టనున్న విషయం నిజమేనని స్పష్టం చేసింది.
ఈ చిత్రంలో తన పాత్ర తన గత చిత్రాల పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. చిత్ర కథ దక్షిణ తమిళనాడు నేపథ్యంలో సాగుతోందని తెలిపింది. అక్టోబర్‌లో తానీ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్లు వెల్లడించింది. వరుత్తపడాదవాలిబర్ సంఘం ఫేమ్ పొన్‌రామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత, లింగుసామి సంస్థ తిరుపతి బ్రదర్స్ నిర్మించనుంది.