శివకార్తికేయన్ రెమో చూడాలని ఉంది | Censor board clears Sivakarthikeyan's Remo with a 'U' certificate | Sakshi
Sakshi News home page

శివకార్తికేయన్ రెమో చూడాలని ఉంది

Published Wed, Sep 28 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

శివకార్తికేయన్ రెమో చూడాలని ఉంది

శివకార్తికేయన్ రెమో చూడాలని ఉంది

తన చిత్రానికి పోటీగా విడుదలవుతున్న శివకార్తికేయన్ నటించిన రెమో చిత్రం విజయం సాధించాలని నటుడు విజయ్‌సేతుపతి అన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం రెక్క. రతన్‌శివ దర్శత్వం వహించిన ఈ చిత్రాన్ని కామన్‌మ్యాన్ ప్రొడక్షన్ పతాకంపై బి.గణేశ్ నిర్వించారు.లక్ష్మీమీనన్ నాయకిగా నటించిన ఈ చిత్రంలో సతీష్,హరీష్‌ఉత్తమన్, దర్శకుడు కేఎస్.రవికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆయుధపూజ సందర్భంగా వచ్చేనెల తొలి వారంలో తెరపైకి రానుంది.
 
 ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి మట్లాడుతూ రెక్క పక్కా కమర్షియల్ కథా చిత్రం అన్నారు. ఇలాంటి చిత్రం చేయాలన్నది తన కల అని పేర్కొన్నారు. ఈ చిత్రం తనకు చాలా కిక్ ఇచ్చింద న్నారు. నటి లక్ష్మీమీనన్ చాలా సెన్సిబుల్ నటి అని పేర్కొన్నారు. ఈ చిత్రంతో పాటు శివకార్తికేయన్ నటించిన రెమో కూడా విడుదలవుతోంది.
 
 మీ చిత్రం దానికి పోటీగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తానేప్పుడూ ఏ చిత్రాన్ని పోటీగా భావించనని, శివకార్తికేయన్ రెమో చిత్రంలో బాగా నటించారని, ఆ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. రెమో చిత్రాన్ని చూడాలన్న ఆసక్తి తనకు కలుగుతోందని పేర్కొన్నారు.అయితే తమ చిత్రం రెక్క కూడా బాగా వచ్చిందని, సెలవు రోజుల్లో విడుదలవుతున్నాయి కనుక రెండు చిత్రాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని విజయ్‌సేతుపతి అన్నారు. నటుడు సతీష్, హరీష్‌ఉత్తమన్, దర్శకుడు రతన్‌శివ, నిర్మాత గణేశ్, ఎడిటర్ ప్రవీణ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement