Remo
-
కొడుకు చనిపోయినా షూటింగ్లో పాల్గొన్నా: వాల్తేరు వీరయ్య విలన్
సినిమాలో విలనిజం బాగా పండితేనే హీరోయిజం ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది. అందుకే సినిమాల్లో హీరోలెంత ముఖ్యమో విలన్లు కూడా అంతే ముఖ్యం. ఇక ఫైట్ సీన్లలో వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఎంత కష్టమైనా పడతానంటున్నాడు విలన్ రెమో అలియాస్ రహీమ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విలన్‌గా రాణిస్తున్నాడు రెమో. ఇప్పటివరకు దాదాపు వందకుపైగా సినిమాల్లో నటించాడు. 18 ఏళ్లలో దాదాపు ప్రధాన హీరోలందరితోనూ నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి ఉండేది. వెంకీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పొద్దున్నుంచి రాత్రివరకు అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాను. నన్ను గమనించిన రవితేజ.. టెర్రరిస్టువా? ఏంది? అలా చూస్తున్నావని అడిగితే యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పాను. సినిమాలు చేయాలంటే మంచి బాడీ ఉండాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి అని చెప్పాడు. నేను ఏడ్చుకుంటూ వెళ్తుంటే రవితేజ పిలిచి తన నెంబర్ ఇచ్చాడు. ఫిట్‌గా అయి, యాక్టింగ్ నేర్చుకున్నాక ఫోన్ చేయమన్నాడు. ఆ నెంబర్ వల్లే నేనీ స్థాయికి వచ్చాను. మహేశ్‌బాబు, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు చేశా. డీజే షూటింగ్లో ఓ ఫైట్ సీన్లో అల్లు అర్జున్‌కు, నాకు గాయాలయ్యాయి. నేను బాగా కష్టపడ్డానని నన్ను పోస్టర్లలో వేయించారు. ఆ పోస్టర్ వైరల్ అవడంతో తర్వాత 35 సినిమాలు చేశా. పుష్ప 2లో ఆయనతో మళ్లీ కనిపిస్తా. మొదటిసారి మెగాస్టార్‌తో కలిసి నటిస్తున్నా. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో నటించే ఛాన్స్ వచ్చింది. కాకపోతే అప్పుడు నా జీవితంలో ఓ విషాదం జరిగింది. నా భార్య, బాబుకు ఆరోగ్యం బాలేకపోతే ఆస్పత్రిలో జాయిన్ చేశాను. బాబును ఐసీయూలో ఉంచారు. ఆరోజు నన్ను వాల్తేరు వీరయ్య షూటింగ్‌కు పిలిచారు. వెళ్లకపోతే ఛాన్స్ మిస్ అవుతుందేమోనన్న భయంతో వెళ్లాను, డైలాగ్స్ చెప్పాను. ఇంతలో బాబు చనిపోయాడంటూ ఫోన్ కాల్.. ఫస్ట్ డే షూటింగ్... ఉండాలా? వెళ్లిపోవాలా? అర్థం కాలేదు. షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లాను. నెక్స్ట్ డే కూడా సెట్స్‌కు వెళ్లాను' అంటూ విషాద ఘటనను పంచుకున్నాడు విలన్ రెమో. చదవండి: యాంకరింగ్‌కు బ్రేక్? స్పందించిన బ్రేక్ -
ప్రేమించిన అమ్మాయిని కన్ఫ్యూజ్ చేస్తే?!..
సినిమా : రెమో తారాగణం : శివ కార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య, సతీష్, కేఎస్ రవికుమార్, యోగి బాబు, రాజేంద్రన్ కథ : శివ (శివకార్తికేయన్) ఓ ఔత్సాహిక నటుడు. ఎప్పటికైనా రజినీకాంత్‌లా ఓ గొప్ప సూపర్‌స్టార్ అవ్వాలనేది అతడి ఆశయం. ఓ సారి కేఎస్ రవికుమార్ తీయబోతున్న కొత్త సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళతాడు. అయితే ప్రేమకు సంబంధించిన సీన్లు నటించటంలో అతడు ఫేయిలవుతాడు. ఆ సమయంలోనే డాక్టర్ కావ్య(కీర్తి సురేష్) ప్రేమలో పడతాడు. కొద్దిరోజుల తర్వాత ప్రపోజ్ చేయటానికి కావ్య ఇంటికి వెళతాడు. ఆమెకు ఎంగేజ్మెంట్ జరుగుతుండటంతో బాధతో వెనక్కు తిరిగివస్తాడు. ఆ తర్వాత నర్సు గెటప్‌లో కేఎస్ రవికుమార్ దగ్గరకు వెళతాడు. అప్పుడు కూడా ఆడిషన్ ఫేయిల్ అవుతుంది. రెమో చిత్రంలోని ఓ దృశ్యం ఆ బాధలో ఉన్నపుడే నర్సు రెమో(రెజీనా మోత్వానీ)గా కావ్యకు పరిచయం అవుతాడు. రెమోకు తను పనిచేసే ఆసుపత్రిలోనే కావ్య ఉద్యోగం ఇప్పిస్తుంది. కావ్యను మళ్లీ తన జీవితంలోకి పంపటం దేవుడిచ్చిన రెండో అవకాశంగా భావించిన శివ! ఆమెను ఎలాగైనా కన్ఫ్యూజ్ చేసి తన ప్రేమలో పడేయ్యాలనుకుంటాడు. ఆమె వెంటే ఉంటూ ఆమెను నిత్యం కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అయితే రెమో వేషంలో ఉన్న శివ, కావ్యను కన్ఫ్యూజ్ చేసి తనను ప్రేమించేలా చేసుకుంటాడా? అప్పటికే ఎంగేజ్మెంట్ అయిన కావ్య, శివ ప్రేమలో పడుతుందా? ఎంగేజ్మెంట్ కాదనుకుని శివకు ఓకే చెబుతుందా? లేదా? అన్నదే మిగితా కథ. రెమో చిత్రంలోని ఓ దృశ్యం విశ్లేషణ : 2016లో విడుదలైన రెమో ఫుల్లెన్త్ రొమాంటిక్ కామెడీ సినిమా. రజినీ మురగన్ సినిమాతో లవర్స్‌గా ప్రేక్షకులను మెప్పించిన శివకార్తికేయన్, కీర్తి సురేష్‌ల జోడీ మరో సారి ఆకట్టుకుంది. లవ్ సీన్స్‌లో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగుంటుంది. ప్రియురాలిని దక్కించుకోవటానికి అమ్మాయి గెటప్‌లో హీరో పడే కష్టాలు మనల్ని బాగా నవ్విస్తాయి. సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా ఆద్యాంతం అలరిస్తూ సాగిపోతుంది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
యంగ్ హీరో సినిమాకు రెహమాన్ మ్యూజిక్
తమిళ సినిమా: నటుడు శివకార్తికేయన్‌తో సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ చేతులు కలపనున్నారా? దీనికి అవుననే బదులే వస్తోంది. రజనీమురుగన్, రెమో, వేలైక్కారన్ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తి కేయన్. మోహన్‌రాజా దర్శకత్వంలో తాజాగా నటించిన వేలైక్కారన్ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. రెమో చిత్రంలో అందమైన అమ్మాయిగా అలరించి న శివకార్తికేయన్ వేలైక్కారన్(పనివాడు)లో తన పనితనాన్ని చాటుకున్నారు. తాజాగా పొన్రా మ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో నటి సమంత కథానాయకిగా నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం శివకార్తీకేయన్‌కు 12వ చిత్రం. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 24ఏఎం.స్టూడియోస్ సంస్థ అధినేత ఆర్డీ.రాజా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథా చిత్రంగా తెరకెక్కనుందట. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత భాణీలను అందించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో తన అభిమానులకు వెల్లడించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. శివకార్తికేయన్ ఈ చిత్రంతో తొలిసారిగా ఏఆర్.రెహ్మాన్‌తో కలిసి పని చేయనున్నారన్న మాట. -
రెమో సంస్థలో నివీన్ పౌలీ
తమిళసినిమా: మలయాళ నటుడు నివీన్‌పౌలీ కోలీవుడ్‌లోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే మాలీవుడ్‌లో ప్రేమమ్ చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నివీన్ పౌలీ ప్రస్తుతం అక్కడ నయనతారతో రొమాన్స్ చేస్తున్నారు. ఈయన తాజాగా శివకార్తీకేయన్ సంస్థలో పాగా వేయనున్నారు. శివకార్తీకేయన్ హీరోగా రెమో చిత్రాన్ని నిర్మించిన 24 ఏఎం స్టూడియోస్ అధినేత ఆర్డీ.రాజా ప్రస్తుతం అదే నటుడితో వేలైక్కారన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో ఆర్డీ.రాజా తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. తన సంస్థలో తెరకెక్కనున్న మూడవ చిత్రంలో కథానాయకుడిగా నివీన్ పౌలీని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి నవదర్శకుడు ప్రభు రాధాకృష్ణన్ మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ విషయంపై మంగళవారం ఓ ప్రకటనలో తెలుపుతూ దర్శకుడు ప్రియదర్శన్,సంతోష్‌శివన్‌లవద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన ప్రభు రాధాకృష్ణన్‌లో మంచి ప్రతిభ ఉందన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ చాయాగ్రహకుడు పీసీ.శ్రీరామ్ పని చేయనుండటం సంతోషకరమైన విషయం అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 24 ఏఎం.స్టూడియో ద్వారా దర్శకుడిగా పరిచయం కానుండడం సంతోషంగా ఉందని దర్శకుడు ప్రభు రాధాకృష్ణన్ అన్నారు. చిత్ర నిర్మాణంపై మంచి అవగాహన ఉన్న నిర్మాత ఆర్డీ.రాజాలో మంచి కథకుడు ఉన్నాడని, ఈ చిత్రానికి కథను ఆయనే అందించారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. -
ఇది మా హీరోకు మంచి ఎంట్రీ!
‘‘రెమో’ చిత్రానికి మొదటి మూడు రోజులు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు పరిస్థితుల్లో కూడా మా ‘రెమో’ మంచి వసూళ్లతో ఆడుతుండటం హ్యాపీ’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. శివ కార్తికేయన్, కీర్తీ సురేశ్ జంటగా భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెమో’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో అందించిన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. టాలీవుడ్లో శివకార్తికేయన్ ఎంట్రీకి ఓ మంచి మూవీ అయింది’’ అన్నారు. ఈ చిత్ర సమర్పకుడు ఆర్.డి. రాజా మాట్లాడుతూ-‘‘తమిళంలో ‘రెమో’ సూపర్ హిట్ అయింది. మంచి కథను, కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మక ంతో ‘దిల్’ రాజు సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాం. ఇక్కడ మేము ఊహించిన దానికంటే మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. -
వారితో రాజీ కుదిరిందా?
విజయాలు తమ వెంటే సమస్యలను తెచ్చిపెడతాయన్నది నటుడు శివకార్తికేయన్ విషయంలో మరోసారి రుజువైంది. మాన్‌కరాటే, రజనీమురుగన్, రెమో అంటూ వరుస విజయాలతో మరో స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయిన నటుడు శివకార్తికేయన్. అలాంటి నటుడే రెమో చిత్ర సక్సెస్ మీట్ వేదికపై తమ పని తమను చేసుకోనివ్వండి అంటూ కంట తడిపెట్టారు. అదే శివకార్తికేయన్‌పై ముగ్గురు నిర్మాతలు ఫిర్యాదు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. యువ నిర్మాత జ్ఞానవేల్‌రాజా అయితే శివకార్తికేయన్ తనకు చిత్రం చేయకపోతే తనకు ఆత్మహత్య మినహా వేరే దారి లేదని అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. వీటికి సంబంధించి వివరాల్లోకెళ్లితే శివకార్తికేయన్ రెమో చిత్రానికి ముందే స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్‌రాజాకు, ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, వేందర్ మూవీస్ సంస్థకు చిత్రాలు చేస్తానని అడ్వాన్సలు తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది.అయితే తాను స్టూడియోగ్రీన్ సంస్థ నుంచి మినహా వేరే సంస్థ నుంచి అడ్వాన్స తీసుకోలేదని శివకార్తికేయన్ స్పష్టం చేశారు.అయితే పైన చెప్పిన మూడు సంస్థల నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిలో నటుడు శివకార్తికేయన్‌పై ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై నిర్మాతల మండలి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. శివకార్తికేయన్ ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసి స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాకు ఒక చిత్రం,ఆ తరువాత ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, వేందర్ మూవీస్ సంస్థలకు కలిసి ఒక చిత్రం చేసే విధంగా రాజీ కుదిరినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా వెల్లడించలేదన్నది గమనార్హం. -
హిట్ ఖాయం..నేను గ్యారంటీ! - ‘దిల్’ రాజు
‘‘ ‘రెమో’ చిత్రం హిట్ టాక్‌తో తమిళంలో మంచి వసూళ్లు సాధిస్తోంది. అందుకే, ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు ఆసక్తి చూపా. ఈ నెలలోనే తెలుగులో ‘రెమో’ పేరుతోనే విడుదల చేస్తాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు. శివ కార్తికేయన్, కీర్తి సురేశ్ జంటగా భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెమో’. అనిరుధ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీ, ట్రైలర్‌ను హీరోయిన్ సమంత విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో శివకార్తికేయన్ చేసిన లేడీ గెటప్ అలరిస్తుంది. శ్రీమణి మీనింగ్‌ఫుల్‌గా లిరిక్స్ రాశారు. అనిరుధ్ చక్కటి సంగీతం అందించాడు. పాటలు డబ్బింగ్‌లా కాకుండా స్ట్రెయిట్ సాంగ్స్‌లా సహజంగా ఉన్నాయి. డబ్బింగ్ చిత్రాలకు కూడా స్ట్రెయిట్ మూవీ ఫీలింగ్ తీసుకురావడం నాకు తెలిసి ఒక్క ఎ.యం. రత్నంగారికే సాధ్యమైంది. ఆ తర్వాత ఈ చిత్రానికి అన్నీ అలా కుదరడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం హిట్ అవుతుంది. అందుకు నాది గ్యారంటీ’’ అన్నారు. ‘‘ఇదొక కలర్‌ఫుల్ ఎంటర్టైనర్. ఇప్పడొస్తున్న చిత్రాలకు వైవిధ్యంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండనుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని శివ కార్తికేయన్ అన్నారు. ఈ వేడుకలో కీర్తీ సురేశ్, దర్శకులు భాగ్యరాజ్ కణ్ణన్, కేఎస్ రవికుమార్, కెమేరామ్యాన్ పీసీ శ్రీరాం, సంగీత దర్శకుడు అనిరుధ్, నటి శరణ్య తదితరులు పాల్గొన్నారు. -
రెమో తెలుగు ఆడియో రిలీజ్
-
శివకార్తికేయన్‌తో మరోసారి!
ప్రస్తుత సీనిమాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న చిత్రాల కథానాయకుల్లో యువ నటుడు శివకార్తికేయన్ ఒకరు. ఒక్కో చిత్రంతో తన స్థాయిని పెంచుకుంటూ అనతి కాలంలోనే క్రేజీ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్ ఇటీవల విడుదలైన రెమో చిత్రంతో హీరోగా చాలా ఎత్తుకు ఎదిగారని చెప్పవచ్చు. అంతే కాదు ప్రముఖ కథానాయికలు శివకార్తికేయన్‌తో కలిసి నటించడానికి ఆసక్తి చూపుతున్నారన్నది గమనార్హం. తాజాగా మోహన్‌రాజా దర్శకత్వంలో నటించడానికి సిద్ధమతున్నారు. రెమో చిత్ర నిర్మాత ఆర్డీ.రాజానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో శివకార్తికేయన్ సరసన అగ్ర నటి నయనతార నటించనున్నారు. ఈ చిత్రం తరువాత శివకార్తికేయన్ వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం ఫేమ్ పోన్‌రామ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో ఆయనతో నటి సమంత రొమాన్స చేయనున్నారు. ఇలా వరుసగా ప్రముఖ కథానారుుకలతో నటిస్తున్న శివకార్తికేయన్ తదుపరి నటి హన్సికతో నటించడానికీ రెడీ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే శివకార్తికేయన్‌తో నటించిన తొలి క్రేజీ నాయకి హన్సికనే. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం మాన్ కరాటే మంచి విజయాన్ని సాధించింది. అలాంటి హిట్ జంట మరోసారి కలిసి నటించనున్నారన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు ఇండ్రు నేట్రు నాళై వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రవికుమార్ తాజాగా శివకార్తీకేయన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో నాయకిగా నటి హన్సికను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం 2017 చివర్లో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా శివకార్తికేయన్‌కు జంటగా రెండో సారి నటిస్తున్న నాయిక హన్సికనే అవుతుంది. నటి కీర్తీసురేశ్ ఆయనతో వరసగా రజనీమురుగన్, రెమో చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. -
‘దిల్’ రాజు టీచర్.. రెమోని పాస్ చేస్తారు!
‘‘నిర్మాతగా 25వ చిత్రం చేస్తున్నాను. ఇప్పటివరకూ ఒక్క రీమేక్ కూడా నిర్మించలేదు. ‘రెమో’ తమిళ ట్రైలర్ చూసి రీమేక్ చేయాలనిపించింది. తమిళ నిర్మాత రాజాగారు ‘రెమో’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను మా సంస్థ ద్వారా విడుదల చేయమని అడగ్గానే అంగీకరించాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శివ కార్తికేయన్, కీర్తీ సురేశ్ జంటగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఆర్.డి.రాజా నిర్మించిన తమిళ చిత్రం ‘రెమో’ తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది. ఆర్.డి.రాజా సమర్పణలో ‘దిల్’ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ - ‘‘రాజుగారు నిర్మించిన ‘బొమ్మరిల్లు’ చాలా ఇష్టం. ఆయన సంస్థ ద్వారా తెలుగులోకి పరిచయం కావడం ఎగ్జయిటింగ్‌గా, ఓ ఎగ్జామ్‌లా ఉంది. ‘దిల్’ రాజు వంటి నిర్మాత ఇక్కడ టీచర్‌గా ఉన్నప్పుడు, ‘రెమో’ ఎగ్జామ్ పాసవుతాడాని ఆశిసున్నా’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో హీరో అద్భుతంగా నటించాడు. పీసీ శ్రీరామ్ కెమేరా వర్క్, అనిరుధ్ సంగీతం ప్లస్ పాయింట్స్. తమిళంలో సుమారు 70 కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. ‘వైశాలి’, ‘ఓకే బంగారం’ తర్వాత మా సంస్థ ద్వారా విడుదల చేస్తోన్న మూడో డబ్బింగ్ చిత్రమిది. హ్యాట్రిక్ కొడతాం’’ అన్నారు. ‘‘తెలుగు, తమిళ సినిమాలు నాకు రెండు కళ్లు’’ అన్నారు పీసీ శ్రీరామ్. సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బక్కియరాజ్ కన్నన్ పాల్గొన్నారు. -
రెమోకు పన్ను మినహాయింపా?
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పెరంబూర్: రెమో చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపును వర్తింపజేయడంపై వివరణ ఇవ్వాల్సిందిగా మద్రాసు హైకోర్టు ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖకు నోటీసులు జారీ చేసింది. శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటించిన చిత్రం రెమో. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రంపై స్థానిక చూలెమైడుకు చెందిన వరదరాజన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అందులో ఆయన పేర్కొంటూ తాను ఈ నెల ఏడో తేదీన రెమో చిత్రం చూడడానికి నగరంలోని ఒక సినిమా థియేటర్‌కు వెళ్లానన్నారు.రూ 120 ధర చెల్లించి టికెట్ కొన్నానన్నారు.అప్పుడే రెమో చిత్రానికి ప్రభుత్వం పన్ను మినహాయింపును వర్తింపజేసిందని తనకు తెలిసిందన్నారు. తమిళ భాషను, తమిళ సినిమాను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2005లో పలు రాయితీలను ప్రకటించిందన్నారు. అప్పటి నుంచి తమిళంలో పేర్లు కలిగిన చిత్రాలకు వినోదపు పన్నును మినహాయిస్తూ వస్తోందన్నారు.కాగా శివకార్తీకేయన్ నటించిన చిత్రం రెమో తమిళ భాషకు చెందిన టైటిల్ కాదన్నారు. అది లాఠిన్ భాషకు చెందిన పదం అని పేర్కొన్నారు. తమిళ ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వహిస్తున్న చంద్రమౌళినే అదే శాఖలో అదనపు ప్రధాన కార్యద ర్శిగానూ వ్యవహరిస్తున్నారని, రెమో అన్న పేరు తమిళ భాషకు చెందింది కాదని తెలిసినా ఆ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపును వర్తింపజేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న ధనాన్ని ప్రభుత్వానికి చేరకుండా చిత్ర నిర్మాతకు లబ్ధిచేకూర్చుతున్నారన్నారు. రెమో చిత్రానికి వర్తింపజేసిన వినోదపు పన్నును రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు శనివారం న్యాయమూర్తి శివజ్ఞానం సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ కేసు విషయంలో ప్రభుత్వ ఆదాయ శాఖ ప్రధాన కార్యదర్శి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసి మరు విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు. -
రెమోకు సూపర్‌స్టార్ ప్రశంసలు
రెమో చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసలు లభించాయి. శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటించిన చిత్రం రెమో. నవ నిర్మాత ఆర్డీ.రాజా నిర్మించిన ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదలై విశేష ప్రజాదరణ పొందుతోంది. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటించిన కబాలి, విజయ్ నటించిన తెరి చిత్రాల తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రెమో రికార్డు సాధించింది. ఈ చిత్రం తమిళనాడులోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరుతుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. కాగా రెమో చిత్రాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ తనను, నటుడు శివకార్తికేయన్‌ను ప్రశంసించారని నిర్మాత ఆర్డీ.రాజా ట్విట్టర్లో పేర్కొన్నారు. రజనీకాంత్ వీరాభిమానినైన తనకు ఆయన ప్రశంసలు దక్కడం జీవితంలో పడిన కష్టాలను మరిపించాయని నిర్మాత పేర్కొన్నారు. కాగా ఆర్డీ.రాజా తాజాగా శివకార్తీకేయన్ హీరోగా మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రారంభం కానుంది. -
సమస్యలు సృష్టిస్తున్నారు
సమస్యలు సృష్టిస్తున్నారంటూ నటుడు శివకార్తికేయన్ కంటతడి పెట్టారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తికేయన్. ఈయన నటించిన తాజా చిత్రం రెమో. కీర్తీసురేష్ నాయకిగా నటించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ పరిచయం అయ్యారు. శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని ఒక నక్షత్ర హోటల్లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ తాను నటించిన రజనీమురుగన్ చిత్రం విడుదల సయమంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొందో అందరికీ తెలిసిందేనన్నారు. ఒక చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అది విడుదలవుతుందో, లేదో తెలియని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. నిజానికి అంత బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక రెమో చిత్రానికి అలాంటి సమస్యలనే ఎదుర్కోవలసివచ్చిందన్నారు. తాను గానీ, ఇతర చిత్ర యూనిట్‌గానీ చిత్రం చూసిన తరువాత మరో విధంగా చేస్తే బాగుండని అనుకుని ఉండవచ్చని,అయితే ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ రెమోపై నమ్మకం కలిగిన వ్యక్తి నిర్మాత రాజానేనని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. డబ్బు సంపాదించుకుని ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చునని, అయితే తాము అలా అనుకోవడం లేదనిఅన్నారు. మంచి చిత్రం చేసి ప్రేక్షకులను అలరింపజేయాలన్నదే తమ భావన అని తెలిపారు. తాము ఎవరి సాయం కోరుకోవడం లేదన్నారు. కొత్త కొత్త ఆలోచనలతో మంచి కథా చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని ఆశిస్తున్నామనిఅందువల్ల దయచేసి తమను పని చేసుకోనివ్వండి అంటూ కంటతడి పెట్టారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తప్పు చే స్తే బాధ పడవచ్చునని, తాము ఎలాంటి తప్పు చేయడం లేదని,కష్టపడి పని చేసుకుంటున్నామని అన్నారు. అందుకే ఆ బాధ అనిపిస్తోందని పేర్కొన్నారు. నటి కీర్తీసురేశ్,అనిరుద్, కేఎస్.రవికుమార్, చాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్ పాల్గొన్నారు. -
విజయం ఎవరిని వరిస్తుందో?
విజయదశమికి నాలుగు రోజుల ముందుగానే కోలీవుడ్‌కు పండగ వచ్చేసింది. సాధారణంగా దసరా, దీపావళి, క్రిస్మ్స్, సంక్రాంతి పర్వదినాల్లో ప్రజల్లో ఎంత పండగ వాతావరణం నిండుకుంటుందో, అంతే సందడి చిత్ర పరిశ్రమలోనూ ఏర్పడుతుంది. ఆయా రోజులు సెలవు దినాలు కావడంతో జనం ముఖ్యంగా యువత సినిమాలు చూడడానికి అధిక ఆసక్తి చూపుతుంటారు. అందుకు తగ్గట్టుగానే సినీ దర్శక నిర్మాతలు తమ చిత్రాలు ఆ సమయాల్లో విడుదల చేయాలని కోరుకుంటారు.ప్రత్యేకించి దసరాకు పాఠశాలలు అధిక సెలవులు రావడంతో చదువుకునే పిల్లలు కూడా సినిమాలపై దృష్టి పెడతారు. ఇక సినిమా ప్రియులు ఉండనే ఉంటారు. దీంతో థియేటర్లు పిన్నపెద్దలతో కళకళలాడుతుంటాయి. నిర్మాతలు, బయ్యర్ల గల్లాపెట్టెలు గలగలలాడుతుండడానికి ఇన్ని కారణాలున్నాయి. అలా కలెక్షన్లను దోచుకోవడానికి ఈ దసరా పండగను పురస్కరించుకుని రెమో, రెక్క, దేవి మూడు తమిళ చిత్రాలతో పాటు ప్రేమమ్ అనే తెలుగు చిత్రం కూడా సిద్ధం అయ్యింది. ఇక వీటి వివరాలు చూస్తే.. రెమో... నటుడు శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ఇది.పలు ప్రత్యేకతలతో శుక్రవారం తెరపైకి రానుంది. శివకార్తికేయన్ అందమైన నర్సుగా కనిపించడం రెమోలోని ప్రధాన ప్రత్యేకత. ఇక రజనీమురుగన్ చిత్రం తరువాత మరో సారి చిరునవ్వుల చిన్నది కీర్తీసురేశ్ శివకార్తికేయన్‌తో జత కట్టిన చిత్రం ఇది. ఈ చిత్రానికి నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.అనిరుద్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ వంటి ప్రముఖ చాయాగ్రహకుడు ఈ చిత్రానికి పని చేయడం మరో విశేషం. రెమో చిత్రంపై ఇటు పరిశ్రమలోనూ,అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో చిత్రం రెక్క. నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించిన చిత్రం రెక్క. ఇందులో ఆయనకు జంటగా నటి లక్ష్మీమీనన్ తొలి సారిగా జత కట్టారు. రతన్‌శివ దర్శకుడు.డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. విజయ్‌సేతుపతి నటించిన పక్కా మాస్ కథా చిత్రం కనుక సహజంగానే రెక్కపై అంశనాలు భారీగానే ఉంటాయి. ఇక మూడో చిత్రం దేవి. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా సుధీర్ఘ విరామం తరువాత కథానాయకుడిగా నటించి, ఐ.గణేశ్‌తో కలిసి సొంతంగా నిర్మించిన చిత్రం దేవి. ఇందులో మిల్కీబ్యూటీ నాయకిగా నటించారు. విజయ్ దర్శకత్వం వహించిన తొలి హారర్‌తో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రం దేవి. దీంతో దేవి చిత్రం కూడా రెమో, రెక్క చిత్రాలతో పోటీ పడుతోంది. ఈ ముక్కోణపు పోటీలో ఏ చిత్రానికి ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పడతారో అన్నది మరి కొద్ది గంటల్లోనే తెలిపోనుందన్నమాట. ఇక నాలుగో చిత్రంగా తెలుగు చిత్రం ప్రేమమ్ తమిళనాట ఇదే రోజు విడుదల కానున్నదన్నది గమనార్హం. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్,అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నాయికలుగా నటించారు. ఈ చిత్రం ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు. ఇది మలయాళంలో ఇదే పేరుతో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది చెన్నైలోనూ అధిక థియేటర్లలో విడుదల కానండడం విశేషం. -
దిల్‌రాజు బ్యానర్లో రెమో తెలుగు వర్షన్
స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాల మీద కూడా దృష్టి పెట్టిన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, మరో తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురానున్నాడు. ఓకె బంగారం సినిమాను తెలుగులో రిలీజ్ చేసి ఘనవిజయం సాధించిన రాజు, ఈ సారి ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ సినిమాతో ఓ కోలీవుడ్ యంగ్ హీరోను గ్రాండ్‌గా తెలుగులో లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. తమిళనాట వరస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ రెమో. హీరో లేడి నర్స్ గెటప్‌లో కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను శైలజ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ సాధించిన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన మేడం సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో రెమో కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు దిల్ రాజు. తెలుగులో కూడా రెమో పేరుతోనే రిలీజ్ కానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
శివకార్తికేయన్ రెమో చూడాలని ఉంది
తన చిత్రానికి పోటీగా విడుదలవుతున్న శివకార్తికేయన్ నటించిన రెమో చిత్రం విజయం సాధించాలని నటుడు విజయ్‌సేతుపతి అన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం రెక్క. రతన్‌శివ దర్శత్వం వహించిన ఈ చిత్రాన్ని కామన్‌మ్యాన్ ప్రొడక్షన్ పతాకంపై బి.గణేశ్ నిర్వించారు.లక్ష్మీమీనన్ నాయకిగా నటించిన ఈ చిత్రంలో సతీష్,హరీష్‌ఉత్తమన్, దర్శకుడు కేఎస్.రవికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆయుధపూజ సందర్భంగా వచ్చేనెల తొలి వారంలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి మట్లాడుతూ రెక్క పక్కా కమర్షియల్ కథా చిత్రం అన్నారు. ఇలాంటి చిత్రం చేయాలన్నది తన కల అని పేర్కొన్నారు. ఈ చిత్రం తనకు చాలా కిక్ ఇచ్చింద న్నారు. నటి లక్ష్మీమీనన్ చాలా సెన్సిబుల్ నటి అని పేర్కొన్నారు. ఈ చిత్రంతో పాటు శివకార్తికేయన్ నటించిన రెమో కూడా విడుదలవుతోంది. మీ చిత్రం దానికి పోటీగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తానేప్పుడూ ఏ చిత్రాన్ని పోటీగా భావించనని, శివకార్తికేయన్ రెమో చిత్రంలో బాగా నటించారని, ఆ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. రెమో చిత్రాన్ని చూడాలన్న ఆసక్తి తనకు కలుగుతోందని పేర్కొన్నారు.అయితే తమ చిత్రం రెక్క కూడా బాగా వచ్చిందని, సెలవు రోజుల్లో విడుదలవుతున్నాయి కనుక రెండు చిత్రాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని విజయ్‌సేతుపతి అన్నారు. నటుడు సతీష్, హరీష్‌ఉత్తమన్, దర్శకుడు రతన్‌శివ, నిర్మాత గణేశ్, ఎడిటర్ ప్రవీణ్ పాల్గొన్నారు. -
యూట్యూబ్‌లో రెమో రికార్డ్
తమిళ యంగ్ హీరో శివకార్తీకేయన్ లీడ్ రోల్లో నటిస్తున్న రెమో టీజర్ యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టించింది. రెమో లేడి గెటప్‌లో కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే పది లక్షల వ్యూస్ సాధించింది. నటుడు కావలనుకునే వ్యక్తి ఓ దర్శకుణ్ని ఆకట్టుకోవటం కోసం ఆడవేశం వేసి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శివకార్తీకేయ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అట్లీ శిష్యుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీ మురుగన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన శివకార్తీకేయన్, ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ చేయనున్నారు. -
రెమో కోసం నవ్వొద్దు
రెమో చిత్రం కొసం నవ్వొద్దు అనగానే ఏదేదో ఊహించుకుంటున్నారా? చాలా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం రెమో. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఆయనకు జంటగా కీర్తీసురేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. 24 ఎఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఒక మీడియో ఆల్బమ్‌ను తయారు చేశారు. అందులో పాట పల్లమే సిరిక్కాదే(నవ్వొద్దే). అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు ఇదే చిత్ర నిర్మాత నివీన్ హీరోగా నిర్మిస్తున్న చిత్ర దర్శకుడు రాధాకృష్ణన్ కాన్సెప్ట్‌ను తమారు చేశారు. అర్జున్ కనుంగ, శ్రీనిధి వెంకటేశ్ పాడిన ఈ పాటలో శివకార్తికేయన్, కీర్తీసురేశ్, సంగీతదర్శకుడు అనిరుద్, గాయకులు అర్జున్ కనుంగ, శ్రీనిధి వెంకటేశ్, ఇన్నో చెంగ, యరియ, శశాంక్, విజయ్, కెబజెరిమియా నటించారు. ఈ ప్రచార మ్యూజిక్ వీడియోను తమిళం,ఆంగ్లం భాషల్లో రూపొందించారు. తమిళ వెర్షన్‌ను ఈ నెల 18 సాయంత్రం ఆరు గంటలకు సోనీ చానల్ వైటీ, ట్విట్టర్ ద్వారాను విడుదల చేయనున్నారు. ఒక వారం తరువాత ఆంగ్ల మ్యూజిక్ వీడియోను ఎంటీవీ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
డిసౌజాకోసం సర్ ప్రైజ్ ఫ్లాష్ మాబ్!
ముంబైః ఉత్తమ నృత్య దర్శకుడు, ఫిల్మ్ మేకర్ రెమో డిసౌజా కు ఫ్లాష్ మాబ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. యాక్టర్ ఫైసల్ ఖాన్, డ్యాన్సర్స్ కున్వర్ అమర్, సిద్ధేష్ పాయ్ లతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షో.. 'డ్యాన్స్ ప్లస్' సీజన్ టు సెట్ లో ఆర్టిస్టులకు సైతం ప్రత్యేక అనుభూతిని పంచారు. డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షో.. సీజన్ టు సెట్ కు వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాను సహ నృత్యకారులు ఫ్లాష్ మాబ్ ప్రదర్శనతో సర్ ప్రైజ్ చేశారు. మెంటర్స్ శక్తి మోహన్, పునిత్ జె పాఠక్, ధర్మేష్ యలండే కూడా ఫ్లాష్ మాబ్ లో చేరి ఉత్సాహంగా నృత్యం చేశారు. అంతేకాదు పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్స్ తోపాటు, ఆర్టిస్టులు, హోస్ట్.. రాఘవ్ జూయల్ సైతం ఫ్లాష్ మాబ్ లో పాల్గొని రెమో పాపులర్ సాంగ్స్.. 'బడ్తమీజ్ దిల్', 'దిల్లీవాలీ గర్ట్ ఫ్రెండ్' కు హుషారెత్తించేట్టు స్టెప్పులేస్తూ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. డ్యాన్స్ ప్లస్ నిర్వాహకులు నన్ను పిలిచి రెమో గారి ఫ్లాష్ మాబ్ గురించి చర్చించారని, ఆమాట అనడమే అదృష్టంగా భావించిన తాను వెంటనే సరేనని చెప్పేశానని డ్యాన్సర్ అమర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది డ్యాన్సర్లను, కొరియోగ్రాఫర్లను తయారు చేసిన రెమో డిసౌజా కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని, అందుకే ఆయనకోసం ఫ్లాష్ మాబ్ అంటే మరోమాట లేకుండా ఒప్పేసుకున్నానని అమర్ ఓ ప్రకటనలో చెప్పారు. స్పెషల్ పెర్ఫామెన్స్ గురించీ ఏమీ తెలియకపోయినా.. గొప్ప నృత్యకారుడైన రెమో, సూపర్ జడ్జి.. డ్యాన్స్ ప్లస్ సీజన్ 2 లో ఉండటం కంటెస్టెంట్లకు అదే గొప్ప వరం అంటూ అమర్ అభివర్ణించారు. అయితే తనకోసం డ్యాన్సర్లు ప్రత్యేకంగా ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఎంతో ఆనందాన్నిస్తుందంటూ ఈ సందర్భంలో రెమో తెలిపారు. విద్యార్థులంతా తనకు కేవలం స్టూడెంట్స్ గా మాత్రమే కాదని, వారంతా తన పిల్లల్లాంటివారని, తన జీవితంలో ఓ భాగమని రెమో అన్నారు. తనవల్లే ఇక్కడవరకూ వచ్చామని విద్యార్థులు చెప్పినా.... వారివల్లే నేనిక్కడున్నానని నేనంటాను అంటూ చెప్పడం.. ఆయన నిరాడంబరతను వ్యక్తం చేస్తోంది. -
అతిథిగా లక్కీ నాయకి
సినిమాల్లో హిట్ పెయిర్‌గా కొందరు ముద్ర పడతారు. అలా పేరు తెచ్చుకున్న జంటల్లో శివకార్తికేయన్, శ్రీదివ్య ఒకరు. వీరిద్దరి కెరీర్‌ను అనూహ్యంగా పెంచేసిన చిత్రం వరుత్తపడాదవాలిభర్ సంఘం. అదే విధంగా ఈ జంట కలిసి నటించిన మరో చిత్రం కాక్కీసట్టై. ఇదీ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. దీంతో శివకార్తికేయన్, శ్రీదివ్య హిట్ పెయిర్‌గా ముద్ర పడింది. తాజాగా శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం రెమో. ఇందులో ఆయనకు జంటగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా ఇంతకు ముందు రజనీమురుగన్ చిత్రంలో శివకార్తీకేయన్‌తో జత కట్టారన్నది గమనార్హం. రెమో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవలే చిత్ర నిర్మాత డి.రాజా గ్రాండ్‌గా నిర్వహించి చిత్ర హైప్‌ను ఇంకా పెంచేశారు. ఇందులో శివకార్తికేయన్, లక్కీ హీరోయిన్ శ్రీదివ్య అతిథిగా దర్శనమీయనున్నారన్నది కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలు ఇటీవలే చిత్రీకరించినట్లు తెలిసింది. ఇందుతో శివకార్తికేయన్ అందమైన అమ్మాయిగా కనిపించనున్నారన్న విషయం తెలిసిందే. దర్శకుడు కేఎస్.రవికుమార్ చిత్రంలోనూ దర్శకుడిగానే నటిస్తున్నారు. దీంతో ఇదేదో సినిమా నేపథ్యంలో సాగే చిత్రం అనిపిస్తోంది కదూ. ఈ విషయాలన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రెమో చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా భాగ్యరాజ్కన్నన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
ఆమె అతడే..!
హీరోలు ఆడ వేశాలు వేయటం సౌత్ ఇండస్ట్రీలో తరుచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ జనరేషన్ హీరోలు పెద్దగా అలాంటి రిస్క్ చేయకపోయినా, సీనియర్ హీరోలందరూ అడపాదడపా ఆడ వేషంలో కనిపించిన వారే. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి టాప్ స్టార్లు చిన్న పాత్రలో మెరిస్తే, కమల్ హాసన్, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు సినిమా అంతా ఆడ వేషంలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇదే తరహా ప్రయోగానికి రెడీ అవుతున్నాడు కోలీవుడ్ యంగ్ హీరో. ఇప్పటి వరకు మాస్ మసాలా సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో శివకార్తీకేయన్ ఇప్పుడో ప్రయోగం చేస్తున్నాడు. తన తాజా చిత్రం రెమోలో లేడీ గెటప్‌లో అలరించనున్నాడు. ఇన్నాళ్లు ఇది రూమరే అని భావించినా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేశారు. నర్సు గెటప్‌లో కనిపిస్తున్న శివకార్తీకేయన్‌ను ఎవరైన చెపితే కాని గుర్తుపట్టలేనట్టుగా తయారు చేశారు. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా భాగ్యరాజ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా అక్టోబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
బాలికను బెదిరించి రెమో బుక్కయ్యాడు
పనాజి: 'అది అరబిక్ కడలందం' అంటూ తెలుగు సినీ సంగీత ప్రియులకు పరిచయమైన ప్రఖ్యాత పాప్ గాయకుడు రెమో ఫెర్నాండెజ్ (62) పై గోవాలో కేసు నమోదైంది. తన కొడుకుపై ఫిర్యాదు చేసిన ఓ బాలికను బెదిరించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని కేసును ఉపహంహరించుకోవాలని రెమో బెదిరించాడని, భయపెట్టి, దుర్భాషలాడాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి జివ్బా దాల్వి తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం రెమోకు అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నామని తెలిపారు. డిశెంబర్ 2వ తేదీన రెమో కొడుకు జోనాద్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి ఓ బాలికను గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె గోవాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడంటూ జోనాద్ పై మపుసా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ప్రమాదం జరిగిన మరునాడు రెమో ఆ అమ్మాయిని బెదిరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ప్రస్తుతం యూరోప్ ట్రిప్ లో ఉన్న రెమో ఈ ఆరోపణలను ఖండించాడు. వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అతడు మండిపడ్డాడు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నాడు.