రెమోకు సూపర్‌స్టార్ ప్రశంసలు | Sivakarthikeyan reveals what Rajinikanth told him after watchi | Sakshi
Sakshi News home page

రెమోకు సూపర్‌స్టార్ ప్రశంసలు

Published Thu, Oct 20 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

రెమోకు సూపర్‌స్టార్ ప్రశంసలు

రెమోకు సూపర్‌స్టార్ ప్రశంసలు

 రెమో చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసలు లభించాయి. శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటించిన చిత్రం రెమో. నవ నిర్మాత ఆర్‌డీ.రాజా నిర్మించిన ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదలై విశేష ప్రజాదరణ పొందుతోంది. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటించిన కబాలి, విజయ్ నటించిన తెరి చిత్రాల తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రెమో రికార్డు సాధించింది. ఈ చిత్రం తమిళనాడులోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు.
 
  కాగా రెమో చిత్రాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ తనను, నటుడు శివకార్తికేయన్‌ను ప్రశంసించారని నిర్మాత ఆర్‌డీ.రాజా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రజనీకాంత్ వీరాభిమానినైన తనకు ఆయన ప్రశంసలు దక్కడం జీవితంలో పడిన కష్టాలను మరిపించాయని నిర్మాత పేర్కొన్నారు. కాగా ఆర్‌డీ.రాజా తాజాగా శివకార్తీకేయన్ హీరోగా మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement