గుకేశ్‌కు రజనీకాంత్‌ సన్మానం.. గిఫ్ట్‌ ఇచ్చిన శివకార్తికేయన్‌ | Chess Champion D Gukesh Gets Gifts From Rajinikanth, Sivakarthikeyan | Sakshi
Sakshi News home page

చెస్‌ ఛాంపియన్‌ను అభినందించిన తమిళ స్టార్స్‌.. సన్మానంతో పాటు..

Published Thu, Dec 26 2024 5:38 PM | Last Updated on Thu, Dec 26 2024 5:47 PM

Chess Champion D Gukesh Gets Gifts From Rajinikanth, Sivakarthikeyan

వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచిన డి గుకేశ్‌ (D Gukesh)కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అతడిని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth), హీరో శివకార్తికేయన్‌(Sivakarthikeyan) అభినందించారు. రజనీ.. గుకేశ్‌కు శాలువా కప్పడంతో పాటు పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ యోగి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. పిలిచి మరీ తనకు సమయం కేటాయించినందుకు రజీకాంత్‌కు గుకేశ్‌ ధన్యవాదాలు తెలిపాడు.

గిఫ్ట్‌ ఇచ్చిన హీరో
అటు శివకార్తికేయన్‌.. చెస్‌ ఛాంపియన్‌తో కేక్‌ కట్‌ చేయించి వాచ్‌ను గిఫ్ట్‌ ఇచ్చాడు. అంతేకాదు, స్వయంగా తనే అతడి చేతికి వాచీ ధరింపజేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను గుకేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ శివకార్తికేయన్‌ సర్‌ ఎంత మంచివారో.. తన బిజీ షెడ్యూల్‌లోనూ నాతో పాటు నా కుటుంబంతో ఉండేందుకు సమయం కేటాయించారు అని ఎక్స్‌ (ట్విటర్‌)లో తన సంతోషాన్ని పంచుకున్నాడు.

జగజ్జేతగా గుకేశ్‌
కాగా సింగపూర్‌ సిటీలో జరిగిన క్లాసికల్‌ ఫార్మాట్‌లో చెన్నైకి చెందిన 18 ఏళ్ల  గుకేశ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్‌ ఆట కట్టించి చదరంగం రారాజుగా అవతరించాడు.

 

 

 

చదవండి: సీఎంతో సినీ పెద్దల భేటి.. దిల్‌ రాజు ప్లాన్‌ బెడిసికొట్టిందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement