Sivakarthikeyan
-
బన్నీ - అట్లీ మల్టీస్టారర్ లో శివకార్తికేయన్
-
సల్మాన్, శివకార్తికేయన్ పై మురుగదాస్ భారీ ఆశలు...
-
శివకార్తికేయన్ కొత్త సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్
శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ ప్రకటనతో పాటు అదిరిపోయే గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన శివ కార్తికేయన్. ఇప్పుడు మరో భారీ విజయంపై కన్నేశాడు. తన కెరీర్లో 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రానికి మదరాసి అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌లతో ఉంది.మదరాసి చిత్రంలో శివ కార్తికేయన్ పవర్‌పుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై శ్రీ లక్ష్మి ప్రసాద్, సుందర్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
'అమరన్' హీరో శివ కార్తీకేయన్ బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి.. హ్యాపీగా ఫీలయ్యా: శివ కార్తీకేయన్
ప్రతి వ్యక్తికి ఓ లవ్ స్టోరీ ఉంటుంది. కొంతమంది ప్రేమలో సక్సెస్ అయితే..మరికొంతమందికి విఫలం అవుతారు. అయితే సక్సెస్ అయినా కాకపోయినా సరే ఫస్ట్‌లవ్ అనేది ఓ మధుర జ్ఞాపకం. మొదటగా ప్రేమించిన అమ్మాయి/ అబ్బాయిని మర్చిపోలేం. అందరిలాగే తాను కూడా తన ఫస్ట్‌లవ్‌ని మర్చిపోలేనని అంటున్నాడు తమిళ హీరో శివకార్తీకేయన్(Sivakarthikeyan ). ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు శివకార్తికేయ. రీసెంట్గా ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీని చెప్పుకున్నాడు. తన ఫస్ట్‌లవ్ విఫలమైందని చెప్పారు. ‘కాలేజీ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. నాది వన్‌సైడ్ లవ్. ఆమెను కలిసి నా ప్రేమను వ్యక్తం చేయలేదు. కానీ దూరంగా చూస్తూనే ప్రేమించాడు. ఓ సారి ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవడం చూశాను. అప్పటి నుంచి ఆమెను చూడలేదు. నా ప్రేమ విషయం చెప్పకుండానే విఫలం అయింది. చాలా రోజుల తర్వాత ఓ షాపింగ్ మాల్లో ఆమెను మళ్లీ చూశాను. అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నది ముందు ప్రేమించిన వ్యక్తి కాదు. వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది. అది చూసి ‘మనకు దొరకని అమ్మాయి అతనికి కూడా దొరకలేదు(నవ్వుతూ..)’ అని సంతోషించాను’ అని శివకార్తీకేయ తన ఫెల్యూర్ లవ్‌స్టోరీని చెప్పుకొచ్చాడు.కాగా శివ కార్తికేయన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. 2010లో ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్ దాస్ జన్మించారు.సినిమాల విషయానికొస్తే.. శివ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒక సినిమాకు ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ ఫిబ్రవరి 17న నటుడు శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల కానుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శివకార్తీకేయన్ తో పాటు శ్రీలీల, అథర్వ, రవి మోహన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
శివ కార్తికేయన్‌పై భగ్గుమంటున్న 'శివాజీ గణేషన్' అభిమానులు
వరుస విజయాలతో కథానాయకుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్(Sivakarthikeyan). ఈయన కథానాయకుడుగా నటిస్తున్న 25వ చిత్రంలో నటుడు రవిమోహన్ ప్రతి నాయకుడిగాను, అధర్వ ముఖ్య పాత్రలోను, నటి శ్రీ లీల కథానాయకిగానూ నటిస్తున్నారు. సుధా కొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి 'పరాశక్తి' (Parasakthi)అనే టైటిల్ నిర్ణయించారు. ఇది దివంగత నటుడు శివాజీ గణేషన్(Sivaji Ganesan) కథానాయకుడు నటించిన తొలి చిత్ర టైటిల్ కావడం గమనార్హం. 1952లో విడుదలైన ఈ చిత్రం తమిళ సినీ చరిత్రను ఒక అధ్యాయంగా నిలిచిపోయింది. అలాంటి చిత్రం పేరు శివ కార్తికేయన్ నటిస్తున్న చిత్రానికి నిర్ణయించడంపై శివాజీ గణేషన్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ చిత్ర టైటిల్‌ను ఏవీఎం సంస్థ నుంచి పొందినట్లు శివకార్తికేయన్ చిత్ర వర్గం ఆధారాలతో సహా వెల్లడించింది. అయినప్పటికీ పరాశక్తి టైటిల్ మరో చిత్రానికి వాడుకోరాదంటూ ముఖ్య నగరాల్లో పోస్టర్లలతో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. వ్యవహారం వివాదంగా మారింది. చిత్ర బృందం ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. ఇదే టైటిల్ నటుడు సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ తాజా చిత్రం తెలుగు వెర్షన్‌కు పెట్టారు. అయితే ఈ టైటిల్ వివాదానికి దారి తీయడంతో ఆయన తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. -
కుమారుడి కోసం సొంతూరు వెళ్లిన శివ కార్తికేయన్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) తన చిన్న కుమారుడి చెవిపోగు వేడుకను సొంత గ్రామంలో ఘనంగా జరిపించారు. శివకార్తికేయన్, ఆర్తి దంపతులకు కూతురు ఆరాధన, కుమారుడు గుగన్ ఉన్నారు. గతేడాదిలో మూడోసారి మళ్లీ అబ్బాయే పుట్టాడు. తనకు పవన్ అని నామకరణం చేసినట్లు కూడా శివకార్తికేయన్ తెలిపాడు. అయితే, తాజాగా తన చిన్న కుమారుడి చెవిపోగు వేడుకను గ్రామస్థులు, అందరి బంధువుల సమక్షంలో జరిపించడం విశేషం. తమ కులదైవ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ఆయన జరిపించారు.శివకార్తికేయన్ సొంతూరు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా గూడవాసల్ తాలూకాలో ఉన్న తిరువీజిమిలై.. అక్కడే ఈ వేడుకను నిర్వహించారు. అయితే, శివకార్తికేయన్‌కు వివాహం కాకముందే ఉద్యోగం ఎతుక్కుంటూ చెన్నైకి వచ్చాడు. అలా మొదటిసారి ఒక టీవీ ఛానల్లో యాంకర్‌గా చేరి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఆపై తన దగ్గరి బంధువు అయిన ఆర్తిని ఆయన పెళ్లి చేసుకున్నారు. కెరీర్ పరంగా ఎంత స్థాయికి వెళ్లినప్పటికీ తన మూలాలను మరిచిపోలేదు. ఇప్పటికీ ఆయనకు అక్కడ సొంత ఇళ్లు ఉంది. తన స్వగ్రామంలోని వారి కుటుంబ ఆరాధ్య దైవం మహా మరియమ్మన్ ఆలయంలో తన బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మూడో సంతానమైన మగబిడ్డ చెవిపోగు వేడుకను నిర్వహించారు.ఆ తర్వాత తన గ్రామంలో ఉన్న అందరితో పాటు కలిసి భోజనం శివకార్తికేయన్ చేశారు. అమరన్ సినిమాతో తమ గ్రామానికి మరింత పేరు తీసుకొచ్చావాని శివకార్తికేయన్‌ను గ్రామస్తులు ప్రశంసించారు. ఆపై ఆయనతో ఫోటోలు దిగారు. ఎన్నో ఏళ్ల తర్వాత తన బంధువులను ఇలా కలవడంతో తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. అప్పుడప్పుడు తమ గ్రామానికి వస్తూ ఉండాలని ఆయనకు బంధువులు సూచించారు. ఇలా కుమారుడి కోసం అయినా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‘పరాశక్తి’గా శివ కార్తికేయన్శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. శివ కార్తికేయన్ 25వ చిత్రంగా రానున్నడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రవి మోహన్, అధర్వ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఆయనకు ఇది వందో చిత్రం కావడం విశేషం.தன் பூர்வீக திருவாரூர் கிராமத்தில் சிம்பிளாக சிவகார்த்திகேயன்! - இன்ப அதிர்ச்சியில் ஊர் மக்கள்#tiruvarur | #sivakarthikeyan | #cinema | #ThanthiTV pic.twitter.com/smKTfOiCzq— Thanthi TV (@ThanthiTV) February 4, 2025 -
నటన వదిలేయాలనుకున్నా..నా భార్య మాటలే నిలబెట్టాయి
తమిళ హీరో శివకార్తికేయన్ రాజ్‌కుమార్ పెరియసామి ’అమరన్’ తో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజిమెంట్‌లో కమీషన్డ్ ఆఫీసర్‌గా ఉన్న మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కధగా తీసిన అమరన్ చిత్రం మంచి రివ్యూలను అందుకొని సూపర్‌హిట్‌గా నిలిచింది. దాంతో తమిళనాడులో మరో సూపర్ స్టార్ అవతరించినట్టేనని సినీ విశ్లేషకులు తీర్మానించేశారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్... అఖమురుగదాస్ వెంకట్ ప్రభు వంటి ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు సంతకం చేశాడు.అలుపెరుగని యాత్ర...ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన శివకార్తికేయన్ సాధించిన విజయం...సాగించిన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి దాయకం. కాలేజీ రోజుల్లోనే స్టాండప్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్ నటుడు..కూడా. ఆ తర్వాత తొలుత స్టార్ విజయ్ టీవీ వేదికగా.. 2011లో టీవీ షోలను హోస్ట్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తన కెరీర్‌ను ప్రారంభించాడు నిదానంగా సినిమాల్లోకి వచ్చి మొదట్లో సహాయక పాత్రలను పోషించాడు, సినిమాల్లోకి వచ్చి పుష్కరకాలం పూర్తయిన తర్వాత గానీ అతనికి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, శివకార్తికేయన్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం నటన నుంచి నిష్క్రమించాలని భావించినట్లు వెల్లడించాడు, అయితే తన భార్య ఆర్తి చెప్పిన స్ఫూర్తి దాయకమైన మాటలే తనని నటన కొనసాగించడానికి ప్రేరేపించాయంటూ చెప్పుకొచ్చాడు.పరిశ్రమ మంచిదే...వ్యక్తులే....సినిమా పరిశ్రమలో కొందరు వ్యక్తులతో తనకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ, పరిశ్రమపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవని శివకార్తికేయన్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ఇబ్బందులతో సహా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. తన నటనా ప్రయాణాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నానన్నాడు. అయితే తన పోరాటాలు తన కుటుంబాన్ని ప్రభావితం చేయకూడదని ఎప్పుడూ కోరుకున్నానని, తన వారు సాధారణ జీవితాలను గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. తన ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో భార్య, అత్తమామలు, పిల్లలపై భారం వేయకూడదని భావించానని చెప్పాడు. అయితే భార్య మాటలతో స్ఫూర్తి పొంది... అడ్డంకులను అధిగమించడానికి మార్గాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఎంబిఎ గ్రాడ్యుయేట్ గా, అతను ఈ సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోగలిగాడు.కుమార్, చియాన్ తర్వాత నువ్వే...అన్న భార్యఇండస్ట్రీలో కొనసాగాలనే తన నిర్ణయంలో తన భార్య ఆర్తి ప్రోత్సాహం కీలక పాత్ర పోషించిందని ఈ అమరన్ హీరో వెల్లడించాడు. ‘ఇక్కడకి వచ్చేటప్పుము ’మీ దగ్గర ఏమీ లేదు, అయినా సరే మీరు ఇంత దూరం వచ్చారు. గత 20 ఏళ్లలో,కుమార్ (అజిత్) సార్ చియాన్ (విక్రమ్) సార్ తర్వాత, బయటి వ్యక్తి ఎవరూ ఈ పరిశ్రమలో పెద్దగా ఎదిగింది లేదు, కాని నువ్వు అది సాధించావ్. ’ఇది అంత తేలికైన పనిగా తీసిపారేయవద్దు.’మీ స్టార్డమ్ ప్రయోజనాలను మేం అనుభవిస్తున్నాం కాబట్టి,కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఎదుర్కోగలం’’ అని తన భార్య చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నాడు.సినీ పరిశ్రమలో తన ఎదుగుదల సమయంలో ఎదుర్కొన్న శత్రుత్వం సవాళ్ల గురించి కూడా శివకార్తికేయన్ చర్చించారు. ‘సామాన్యుడు‘ నుంచి విజయవంతమైన నటుడిగా తన ప్రయాణాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు బహిరంగంగా విమర్శించారని, పరిశ్రమలో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారని, గత ఐదేళ్లలో గణనీయమైన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రయాణం కొనసాగించానని ఘర్షణ లేకుండా ముందుకు సాగాలని కోరుకున్నానన్నాడు..అయితే నేటి తన విజయం విమర్శకులకు ఖండన అనుకోనక్కర్లేదని, సహకరించిన కష్టపడి పనిచేసే తన చిత్ర బృందాలకుు, తన పట్ల అంకితభావంతో ఉన్న అభిమానులకు అతని కథ నుండి ప్రేరణ పొందిన వారికి వేడుకగా మాత్రమే అనుకోవాలని వినమ్రంగా చెబుతున్నాడు. -
1965లో ఏం జరిగిందో చెప్పనున్న శివకార్తికేయన్
అయలాన్, మావీరన్ చిత్ర వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్‌కు తాజాగా అమరన్ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆయన, సాయిపల్లవి నటన పలువురి ప్రశంసలను అందుకుంది. కాగా ప్రస్తుతం శివకార్తికేయన్ తన 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. అదేవిధంగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో 24వ చిత్రాన్ని చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ హీరోగా నటించే 25వ చిత్రానికి మహిళా దర్శకురాలు సుధా కొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించాల్సి ఉంది. దీనికి పురనానూరు అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల సూర్య ఈ చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ను ఎంపిక చేశారు. ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనుండడం విశేషం. అదేవిధంగా మరో నటుడు అధర్వ ముఖ్యపాత్ర పోషించనున్నారు. నటి శ్రీలీల నాయకిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈమె ఈ చిత్రం ద్వారా నేరుగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. డాన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 1965లో జరిగే చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కాగా ఇంతకుముందు దీనికి పురనానూరు అనే టైటిల్‌ను నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా పేరును మార్చినట్లు, 1965 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
గుకేశ్‌ను సన్మానించిన రజనీకాంత్, శివకార్తికేయన్ (ఫోటోలు)
-
గుకేశ్‌కు రజనీకాంత్ సన్మానం.. గిఫ్ట్ ఇచ్చిన శివకార్తికేయన్
వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డి గుకేశ్ (D Gukesh)కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అతడిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) అభినందించారు. రజనీ.. గుకేశ్‌కు శాలువా కప్పడంతో పాటు పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ యోగి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. పిలిచి మరీ తనకు సమయం కేటాయించినందుకు రజీకాంత్కు గుకేశ్ ధన్యవాదాలు తెలిపాడు.గిఫ్ట్ ఇచ్చిన హీరోఅటు శివకార్తికేయన్.. చెస్ ఛాంపియన్‌తో కేక్ కట్ చేయించి వాచ్‌ను గిఫ్ట్ ఇచ్చాడు. అంతేకాదు, స్వయంగా తనే అతడి చేతికి వాచీ ధరింపజేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను గుకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శివకార్తికేయన్ సర్ ఎంత మంచివారో.. తన బిజీ షెడ్యూల్లోనూ నాతో పాటు నా కుటుంబంతో ఉండేందుకు సమయం కేటాయించారు అని ఎక్స్ (ట్విటర్)లో తన సంతోషాన్ని పంచుకున్నాడు.జగజ్జేతగా గుకేశ్కాగా సింగపూర్ సిటీలో జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి చదరంగం రారాజుగా అవతరించాడు. Thanks Superstar @rajinikanth sir for your warm wishes and inviting ,spending time and sharing your wisdom with us 🙏 pic.twitter.com/l53dBCVVJH— Gukesh D (@DGukesh) December 26, 2024 Had a great time with @Siva_Kartikeyan sir and he was kind enough to spend time with me and my family despite his busy schedule and enjoyed a lot! pic.twitter.com/GnnGx3wDs4— Gukesh D (@DGukesh) December 26, 2024చదవండి: సీఎంతో సినీ పెద్దల భేటి.. దిల్ రాజు ప్లాన్ బెడిసికొట్టిందా? -
రూ.150 కోట్ల బడ్జెట్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివ కార్తికేయన్. ఈయన ఇటీవల రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో హీరోగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు. ప్రస్తుతం శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటి శ్రీలీల నాయకిగా నటించనున్నారు. ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం. పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్స్‌లు పెరుగుతున్నాయి. అయితే, ఆమె సెలక్టెడ్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందకు వెళ్తుంది. ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. మరో ముఖ్య పాత్రలో నటుడు అధర్వ పోషించనున్నారు. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం కావడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రానికి రవి కె.చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీని గురించి నిర్మాత అధికారిక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో ఈ ఎస్.కె 25 చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని నిర్మాత ఆకాష్ భాస్కరన్ వ్యక్తం చేశారు. ఇది పీరియడ్ కాల కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీనికి పురనానూరు అనే టైటిల్ ఇంతకుముందే ఖరారు చేశారు అన్నది గమనార్హం. ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్లో రూపొందుతున్నట్లు సమాచారం. మల్టీ స్టార్స్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. -
సైనికా నీ స్ఫూర్తికి సెల్యూట్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘అమరన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అన్నది మనకి చాలావరకు వినోద సాధనం మాత్రమే. కొన్ని సినిమాలు వినోదంతోపాటు విషయ విశ్లేషణను అందిస్తే మరికొన్ని మాత్రం మనకు స్ఫూర్తిదాయకమవుతాయి. అటువంటి ప్రత్యేకమైన సినిమానే ‘అమరన్’. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు దేశభక్తి, లేక సైనికులకు సంబంధించిన సినిమాలు చూసి నిజంగా మనం ఇప్పటిదాకా ఏమైనా స్ఫూర్తి పొందామా అన్న విషయం ఆలోచించుకోవాలి. ప్రతిరోజూ మనకి కరెంట్ పోతేనో లేక టైమ్‌కి ఫుడ్ అందకపోతేనో లేదంటే సినిమాకి టికెట్లు దొరక్కపోతేనో ఎంతో చిరాకు పడిపోతాం.కానీ కనురెప్ప మూసినా, రోజుల తరబడి ఆహారం అందకపోయినా అనుక్షణం ప్రమాదం పొంచి ఉన్నా విపరీత వాతావరణ పరిస్థితుల్లో కూడా తమ వారందరికీ దూరంగా తమ ప్రాణాన్ని పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్న మన సైనికుల కష్టం నేడు ఎంత మందికి తెలుసు. ఓ సైనికుడు తన ము΄్పాతిక భాగం జీవితాన్ని డ్యూటీలోనే గడిపేస్తాడట. అలాగే తన కుటుంబాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి డ్యూటీ చేసేవాడు సైనికుడు. అటువంటి సైనికుడి కథే ఈ ‘అమరన్’. ఇదో వాస్తవ గాథ. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ 2014 సంవత్సరం ఏప్రిల్ 25న వీరమరణం పొందారు. అప్పటినుండి దేశమంతా ఆయన పేరు మార్మోగిపోయింది.అసలెవరీ ముకుంద్, అతను సైనికుడు ఎలా, ఎందుకు అయ్యాడు? అన్నదే ఈ ‘అమరన్’ సినిమా. 44 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన ఇతడు 2006 లెఫ్టినెంట్ స్థాయిలో ఉన్న ముకుంద్ ఆరేళ్ల లోపే మేజర్ స్థాయికి ఎదిగాడంటే అతని సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్పాత్రకు ప్రాణం పోశారు. ఆయనకు జోడీగా సాయి పల్లవి నటించారు. ఆమె కూడా తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. మంచి స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా మనల్ని కాసేపు మేజర్ జీవితంతో ప్రయాణ అనుభూతినిస్తుంది. ఈ సినిమాలో ముకుంద్ ధైర్యసాహసాలు, తెగువకు మించి అతని సైనిక స్ఫూర్తిని ఎంతో సవివరంగా చూపించారు దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ‘అమరన్’ తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రతిక్షణం మన కోసం తన వాళ్లని వదులుకుని ప్రాణత్యాగానికైనా వెనుకాడని మన అమర వీరుల దినోత్సవం అయిన ఈ జనవరి 30న కనీసం ఓ సెల్యూట్ అయినా చేద్దాం, అలాగే అందరితో చేయిద్దాం. ఎందుకంటే అంతటి అసమాన వీరులకు మనం ఇచ్చే చిన్నపాటి కృతజ్ఞత ఇదే. – ఇంటూరి హరికృష్ణ -
శివ కార్తికేయన్ తో జోడి కట్టనున్న శ్రీలీల..
-
డియర్ అక్క.. నువ్వు సాధించిన ఈ విజయం నాకు స్పూర్తి: శివకార్తికేయన్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా సోషల్‌మీడియా ద్వారా తన అక్క గౌరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక ఓమోషనల్ నోట్ రాశారు. ప్రస్తుతం నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా హీరో రేంజ్‌కు చేరుకున్నాడు. తను నటించిన రీసెంట్ హిట్ సినిమా అమరన్ బాక్సాఫీస్ వద్ద రూ. 330 కోట్లకు పైగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.శివకార్తికేయన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయినప్పటికీ చాలా సాధారణమైన జీవనశైలినే ఇష్టపడుతారు. ఈ క్రమంలో తాజాగా తన సోదరి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇలా పంచుకున్నారు. 'నా జీవితంలో ఆదర్శంగా నిలుస్తున్న ప్రియమైన అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత MBBS (డాక్టర్ కోర్సు) పూర్తి చేశావ్.. తల్లిగా నీ బాధ్యతలు చేస్తూనే 38 ఏళ్ల వయసులో MD వంటి ఉన్నతమైన కోర్సును పూర్తి చేసి గోల్డ్‌మెడల్ సాధించావ్. ఇప్పుడు 42 ఏళ్ల వయసులో FRCP సాధించావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ అధిగమిస్తూ విజయాన్ని అందుకున్నావ్.. ఈ సందర్భంలో మన నాన్న ఉండుంటే చాలా గర్వంగా ఉండేది అక్క' అంటూ తన సోదరి గురించి చెబుతూ ఆయన ఒక నోట్ విడుదల చేశారు.శివకార్తికేయన్ వివాహం కూడా తన దగ్గరి బంధువుల అమ్మాయి అయిన ఆర్తితో జరిగింది. 2010 ఆగస్టు 27న ఆర్తిని ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నాడు. శివకార్తికేయన్-ఆర్తి దంపతులకు ఒక కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) -
శివకార్తికేయన్, సుధా కొంగర మధ్య వివాదం..
నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయలాన్, మావీరన్,ఇటీవల విడుదలైన అమరన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా మరో మూడు చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందులో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి 'డాన్' చిత్రం ఫేమ్ సిబి.చక్రవర్తి డైరెక్షన్లో ఒక చిత్రం రానుంది. అదేవిధంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తన 25వ చిత్రంలో శివకార్తీకేయన్ నటించడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. పురనానూరు పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. కాగా ఈ చిత్ర షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అందులో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. అయితే, దర్శకురాలు సుధా కొంగర, నటుడు శివకార్తికేయన్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమో షూట్ రద్దు అయినట్లు సోషల్‌మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రోమో షూట్‌కు పూర్తి గడ్డంతో శివకార్తికేయన్ రావడం వల్ల సుధా కొంగర అభ్యంతరం చెప్పారట. గడ్డం తొలగించి రావాలని దర్శకురాలు సుధా కొంగర చెప్పడంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయట. అయితే, కథ చెప్పినప్పుడు గడ్డంతోనే ఉండాలని చెప్పారు కదా అంటూ శివకార్తికేయన్ కాస్త అసహనం చెందారట. లైట్ బియార్డ్తో ఉండాలని చెబితే.. పరుత్తివీరన్‌లో కార్తీ మాదిరి ఉంటే ఎలా అని దర్శకురాలు సుధా కొంగర అనడంతో తన అభ్యంతరాన్ని తెలిపి షూటింగ్ స్పాట్ నుంచి శివకార్తికేయన్ వెళ్లిపోయినట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించి మళ్లీ త్వరలోనే ప్రోమో షూట్ నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీల కోలీవుడ్‌కు పరిచయం కానున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. అదే విధంగా ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఓటీటీలో రూ. 300 కోట్ల సినిమా .. అధికారిక ప్రకటన
సూపర్ హిట్ సినిమా అమరన్ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ మూవీ నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది.భారీ అంచనాల మధ్య విడుదలై అమరన్ మూవీ డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. తమిల్తో పాటు తెలుగు,మలయాళం, కన్నడ,హిందీ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. -
ఓటీటీలో 'అమరన్' స్ట్రీమింగ్ తేదీని లాక్ చేశారా..?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’. థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్టింట ఒక వార్త ట్రెండ్ అవుతుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్,క సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే, అమరన్ మాత్రం స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు.భారీ అంచనాల మధ్య అక్టోబర్ 31న విడుదలై అమరన్ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా విడుదలై ఇప్పటికే నాలుగు వారాలు దాటింది అయనప్పటికీ కలెక్షన్స్ పరంగా కొన్ని చోట్ల రానిస్తుంది. దీంతో ఓటీటీ విషయంలో ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 5న నెట్‌ప్లిక్స్‌లో అమరన్ విడుదల కానుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఇదే తేదీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివకార్తికేయన్ కెరీర్లో టాప్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా అమరన్ నిలిచింది. -
'అమరన్'ని సత్కరించిన ఆర్మీ అధికారులు (ఫొటోలు)
-
'పుష్ప' ఎఫెక్ట్.. శ్రీ లీలకు తమిళ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్
టాలీవుడ్లో క్రేజీ నటిగా రానిస్తున్న శ్రీలీలపై కోలీవుడ్ మనసుపడుతుంది. పుష్ప ప్రమోషన్ కార్యక్రమంలో కిస్సిక్ అంటూ మెరిసిన ఈ బ్యూటీపై తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల దృష్టి పడింది. పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతలు శ్రీ లీలను తమ చిత్రాల్లో నటింపజేయడానికి ప్రయత్నాలు అప్పుడే మొదలెట్టారు. ఇప్పటికే నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన గోట్ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటింపజేసే ప్రయత్నం జరిగింది. ఐయితే అందులో నటించడానికి శ్రీ లీల ఆసక్తి చూపలేదనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు నటుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప –2 చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. అయితే తమిళంలో కథానాయకిగానే పరిచయం అవ్వాలని ఈ బ్యూటీ కోరుతున్నారని తెలిసింది. అలాంటి అవకాశం ఇప్పుడు శ్రీలీల తలుపు తట్టిందని సమాచారం. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్. ఇటీవల అమరన్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఈయన ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీని తరువాత సీబీ చక్రవర్తి, నెల్సన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కోలీవుడ్‌లో హీరోయిన్‌గానే ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న ఈ బ్యూటీ కల పుష్ప ఐటమ్ సాంగ్‌తో తీరనుందని తెలుస్తోంది. ఇదేవిధంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. నటుడు సూర్య నటించాల్సిన ఈ చిత్రం నుంచి ఆయన వైదొలగడంతో ఇప్పుడు ఆ పాత్రలో శివకార్తికేయన్ నటించనున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా ఈ చిత్రంలోనే నటి శ్రీలీలను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్రీలీల శివకార్తికేయన్‌కు జంటగా నటించానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు సమాచారం. -
అమరన్ టీమ్ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి: విద్యార్థి
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ విఘ్నేశన్ అనే విద్యార్థి చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్లు చేసి విసిగిస్తుండటంతో మానసిక వేదనకు లోనవుతున్నానన్నాడు.అసలేం జరిగిందంటే?అమరన్ సినిమాలోని ఓ సీన్లో సాయిపల్లవి హీరోకు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. అది నిజంగానే సాయిపల్లవి నెంబర్ అని భావించిన ఫ్యాన్స్ ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలో చూపించిన నెంబర్ తనదేనని విఘ్నేశన్ అనే ఇంజనీర్ విద్యార్థి తెలిపాడు.ఇది సాయిపల్లవి నెంబర్ అనుకుని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కాల్స్ చేస్తున్నారని వాపోయాడు. వరుస ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందన్నాడు. తన ఫోన్ నెంబర్ ఉపయోగించినందుకుగానూ అమరన్ టీమ్ రూ.1.1 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. మరి ఈ గొడవపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి!చదవండి: రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే? -
భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో.. అదేంటో తెలుసా?
శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.అయితే శివ కార్తికేయన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్మీ డ్రెస్‌లోనే తన ఇంటికెళ్లి భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటిపనితో ఫుల్ బిజీగా ఉన్న ఆయన భార్య ఆర్తి దగ్గరికి వెళ్లి సైలెంట్‌గా నిల్చున్నారు. ఇదేమీ గమనించని ఆర్తి తనపని చేసుకుంటూ అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. తన భర్తను ఆర్మీ డ్రెస్‌లో చూసిన ఆర్తి ఆశ్చర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. Sivakarthikeyan and his wife Aarthi 😍 pic.twitter.com/YcOC9eL5CG— SmartBarani (@SmartBarani) November 13, 2024 -
శివకార్తికేయన్ కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..?
మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన నటుడు శివకార్తికేయన్. అయితే, తాజాగా విడుదలైన అమరన్ మంచి విజయాన్ని సాధించడంతో పాటు, సినీ విమర్శకుల ప్రశంసలను పొందడం విశేషం. కాగా ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 23వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ఆయన పవర్‌పుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందని ఇటీవల ఓ భేటీలో నటుడు శివకార్తికేయన్ తెలిపారు. కాగా ఈ చిత్రంతో పాటు దర్శకుడు ఏఆర్.మురుగదాస్ హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా ఒక చిత్రం చేస్తున్నారు. అయితే శివకార్తికేయన్ చిత్రాన్ని ముందుగా పూర్తి చేసి ఆ తరువాత హిందీ చిత్రాన్ని పూర్తి చేయాలని భావించినట్లు తాజా సమాచారం. ఆ విధంగా ఇంకా పేరు నిర్ణయించని శివకార్తికేయన్ చిత్రానికి సింగనై అనే టైటిల్ పేరు ప్రచారంలో ఉంది. కాగా ఈ యాక్షన్ ఎంటర్టెయిన్ కథా చిత్రాన్ని 2025 మే నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. కాగా ఈ చిత్రం తరువాత శివకార్తికేయన్ సిబి.చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం, సుధా కొంగర దర్శకత్వంలో పురనానూరు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. -
విజయ్ వారసుడిగా చిన్న దళపతి శివకార్తికేయన్
-
శివ కార్తికేయన్ 'అమరన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
-
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అమరన్. వీరసైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆరు రోజుల్లో రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో బుధవారం నాడు హైదరాబాద్‌లో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో నితిన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.మా నాన్న కూడా..శివకార్తికేయన్ మాట్లాడుతూ.. అమరన్ సినిమాలో ముకుంద్ క్యారెక్టర్ చేయడానికి కారణం మా నాన్న. ఆయన పోలీసాఫీసర్. డ్యూటీలోనే మరణించారు. సినిమా రిలీజైనప్పటినుంచి నితిన్ ప్రతిరోజు కాల్ చేసి అప్డేట్స్ చెప్తూనే ఉన్నారు అని పేర్కొన్నాడు. అభిమానుల కోసం ఓ పాట కూడా పాడాడు. ఓ ప్రియా ప్రియా.. తెలుసా నీకైనా.. అంటూ నితిన్ ఇష్క్ సినిమాలోని పాటను రెండు లైన్లు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సినిమాఅమరన్ సినిమా విషయానికి వస్తే ఇందులో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
'అమరన్' మూవీ ట్విటర్ రివ్యూ
వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం అమరన్. కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్, సాయి పల్లవి జోడిగా నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, సోని పిక్చర్స్ సంస్థలు కలసి నిర్మించిన ఈ చిత్రానికి జీవీ. ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్లతో పాటు ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు వేశారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంన్నారు.ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటేనే అందరిచూపు అటువైపే ఉంటుంది. అందుకే సినిమా అభిమానులు అందరూ అమరన్ సినిమావైపు పడింది. శివకార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో అదరగొట్టాడని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఇందు రెబెకా జాన్ పాత్రలో సాయిపల్లవి నటన సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్‌పాయింట్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. మొదటి భాగంలో శివకార్తికేయన్, సాయిపల్లవి మధ్య వచ్చే ప్రతి సీన్ సూపర్ అంటూ మెంచుకుంటున్నారు.ఈ సినిమా భారత ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. దేశ సైనికుల ధైర్య సాహసాలను తెరపై చక్కగా దర్శకుడు ఆవిష్కరించారని కొనియాడారు. సినిమా చూస్తున్న ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి కలిగించే చిత్రం అమరన్ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.ఓవర్సీస్, తమిళనాడులో చాలా చోట్ల 'అమరన్' సినిమాను ఒకరోజు ముందుగానే వేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బ్లడ్ బాత్, ఆల్ఫా సన్నివేశాలు కిర్రాక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 'అమరన్'లో చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'తుపాకీ' సినిమాలో మెప్పించిన కొన్ని యాక్షన్ సీన్స్ లాంటివి ఇందులో కూడా ఉన్నాయంటూ హింట్ ఇస్తున్నారు. వార్ సీన్స్ కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ 15 నిమిషాల పాటు కన్నీళ్లను పెట్టిస్తుందని చాలామంది తెలుపుతున్నారు. ఆ సీన్లో సాయిపల్లవి తన యాక్టింగ్‌తో ఇరగదీసిందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.#Sivakarthikeyan𓃵 joins the Big league of #Rajinikanth #KamalHaasan #ajith #vijay from today 🔥🔥 #Amaran career defining movie for #SK @Siva_Kartikeyan pic.twitter.com/OqFuAOeiIU— Wetalkiess (@WeTalkiess) October 31, 2024Positive Reviews all over World ✅🌟#Amaran Blockbuster 💥 pic.twitter.com/booGzL9uiJ— Troll Unwanted Haters (@wanted_Hater67) October 31, 2024Amaran - 💔😭 🔥🔥#Amaran is undoubtedly one of the finest biographical films to hit the screens recently. Sai Pallavi delivered exceptional performances, making their characters unforgettable📈Sai Pallavi❤🦋> Full movie#USA #Amaran #AmaranFDFS #Sivakarthikeyan #SaiPallavi pic.twitter.com/ihiRu7Nhd2— Hari (@hariharanr0) October 31, 2024The first half of #Amaran is packed with emotion 🤌💥💥FOLLOW ✅️SK and Sai Pallavi acting 👌 , As usual GV cooked well 🎶 No Single lag till Now , Screen Play - Terrific ⚡#Sivakarthikeyan Last 15 Minutes of Interval " BLAST " 🔥#AmaranFDFS #BloodyBeggar #LuckyBaskhar pic.twitter.com/hPz9Xs1EP5— JD X PAGE (@holic2024) October 31, 2024#Amaran | Stunning FIRST HALF 🧨💥SK and Sai Pallavi acting 👌 , As usual GV cooked well 🎶 No Single lag till Now , Screen Play - Terrific ⚡ @Siva_Kartikeyan Last 15 Minutes of Interval " BLAST " 🔥 pic.twitter.com/MU5zjup8C6— Let's X OTT GLOBAL (@LetsXOtt) October 31, 2024#Amaran True tribute to Major Mukundan. Sai Pallavi & #Sivakarthikeyan are true emotion of the movie. Worth watching 🔥🫡. One of the best movies of SK— Cine Crick Madie (@diszzCinema) October 31, 2024 -
శివకార్తికేయన్ ‘అమరన్’ మూవీ HD స్టిల్స్
-
టాలీవుడ్ ను వదిలేయనున్న శ్రీలీల
-
సూర్య ప్లేస్‌లో శివకార్తికేయ.. ఓకే చెప్పిన శ్రీలీల!
కోలీవుడ్ నుంచి శ్రీలీలకు మళ్లీ కాల్ వెళ్లిందా అంటే తమిళ పరిశ్రమలో అవుననే మాట వినిపిస్తోంది. ఇంతకుముందు కూడా శ్రీలీలకు తమిళంలో అవకాశాలు వచ్చాయని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఈసారి ప్రచారంలో ఉన్న వార్త నిజం అని కోలీవుడ్ అంటోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించనున్నారన్నది ఆ వార్త సారాంశం. ‘గురు, ఆకాశం నీ హద్దు రా’ వంటి చిత్రాలతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధ కొంగర తెరకెక్కించనున్న చిత్రంలోనే శివ కార్తికేయన్, శ్రీలీల నటించనున్నారని సమాచారం. ఈ ఇద్దరూ పాల్గొనగా ఫొటోషూట్ కూడా జరిగిందట. త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందట చిత్రబృందం. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించాల్సి ఉండగా ఆయన తప్పుకున్న నేపథ్యంలో శివకార్తికేయన్‌ని తీసుకున్నారట. సూర్యతో ‘పురనానూరు’ అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నట్లు పేర్కొన్నారు. మరి.. శివ కార్తికేయన్‌తో అనుకుంటున్నది ఈ చిత్రమేనా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
చాలా అవకాశాలు కోల్పోయాను..!
సీతారామం చిత్రం పేమ్ నటి మృణాల్ ఠాకూర్ గురించి ఇప్పుడు పరిచయం అవసరం ఉండదనుకుంటా. ఈ బెంగాలీ బ్యూటీ మాతృభాషలోనే కాకుండా కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించారు. అయితే ఆయా చిత్రాల్లో రాని పేరు తెలుగులో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన సీతారామమ్ చిత్రంతో వచ్చింది. ఆ చిత్రంతో ఒక్క సారిగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అయ్యిపోయ్యారు. ఆ తరువాత నానితో జత కట్టిన హాయ్ నాన్నా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే విజయ్ దేవరకొండతో నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో తెలుగులో అవకాశాలు దూరం అయ్యాయనే చెప్పాలి. కాగా తమిళంలో నటుడు శివకార్తికేయన్‌కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకున్నారనే ప్రచారం జరిగింది. ఇకపోతే సీతారామమ్ వంటి చిత్రాల్లో హోమ్లీగా నటించిన మృణాల్ ఠాకూర్ ఆ తరువాత గ్లామర్ వైపు మొగ్గు చూపారు. ముద్దు సన్నివేశాల్లోనూ నటించి ఆమె తల్లిదండ్రులకు షాక్ ఇచ్చారు. అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని మృణాల్ ఠాకూర్ తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారట. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను సినిమాల్లో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నారు. దీంతో పలు అవకాశాలను కోల్పోయానన్నారు. ఆ తరువాత తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, తన తల్లిదండ్రులని పిలిచి లిప్‌లాక్ వంటి సన్నిహిత సన్నివేశాల్లో నటించడం తనకూ భయమేనని,అయితే ఈ రంగంలో అలాంటివి చాలా అవసరం అనీ, ఇది తన ఛాయిస్ కాదనీ వివరించి చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తరువాతనే ఈ అమ్మడు ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించడానికి రెడీ అంటున్నారట. -
వరుస ప్లాపులు అయిన నమ్ముతున్న స్టార్స్..
-
సింపుల్‌గా స్టార్ హీరో శివకార్తికేయన్ కుమారుడి బారసాల ఫంక్షన్ (ఫోటోలు)
-
శివకార్తికేయన్ కుమారుడి బారసాల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ దంపతులకు ఇటీవలే మూడో బిడ్డ జన్మించాడు. ఇప్పటికే వీరికి కూతురు ఆరాధన, కుమారుడు గుగన్ పుట్టగా మూడోసారి మళ్లీ అబ్బాయే పుట్టాడు. తాజాగా అతడికి బారసాల చేశారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేసిన హీరో.. పిల్లవాడికి పవన్ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. అలాగే తన భార్య గురించి చెప్తూ ఎమోషనలయ్యాడు.'ఆర్తి.. ఆపరేషన్ థియేటర్లో పిల్లల్ని కనేటప్పుడు నువ్వు ఎంత నరకం చూశావో నేను కళ్లారా చూశాను. ఆ బాధను భరిస్తూ నాకు అందమైన ప్రపంచాన్ని ఇచ్చినందుకు ఎప్పటికీ నీకు కృతజ్ఞుడినై ఉంటాను. లవ్యూ..' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. చివర్లో ఆరాధన- గుగన్ - పవన్ అంటూ తన ముగ్గురి పిల్లల పేర్లు ప్రస్తావించాడు. క్షణాల్లోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.కాగా శివకార్తికేయన్ 2010లో బంధువులమ్మాయి ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2013లో ఆర్తి, 2021లో గుగన్ జన్మించారు. ఇకపోతే యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివకార్తికేయన్ తర్వాత హీరోగా మారాడు. మహావీరుడు, ప్రిన్స్, అయలాన్ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) చదవండి: 'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది! -
కోలీవుడ్ స్టార్ హీరోతో నేషనల్ క్రష్ రొమాన్స్!
తమిళ హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ రష్మికా మందన్నా జంటగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హీరో శివ కార్తికేయన్, దర్శకుడు సిబీ చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన కాలేజ్ క్యాంపస్ డ్రామా ‘డాన్’ (2022) హిట్ మూవీగా నిలిచింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నారనే ప్రచారం కూడా కోలీవుడ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత రష్మికా మందన్నా పేరు వినిపించింది. ఆ తర్వాత కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి రాగా.. ఫైనల్‌గా కన్నడ బ్యూటీ రుక్ష్మిణీ వసంత్ హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్నారు. మరి... ప్రచారంలో ఉన్నట్లుగా ఈసారైనా శివ కార్తికేయన్, రష్మికల జోడీ సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
సౌత్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ ప్రముఖ నటీనటులు ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారిస్తున్నారు. జాకీష్రాఫ్, సంజయ్‌దత్, బాబీ డియోల్ వంటి స్టార్ నటులు దక్షిణాదిలో విలన్‌గా లేదంటే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా దక్షిణాది తెరపై మెరవబోతున్నట్లు ఓవార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ తమిళ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్.దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ తన 23వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు బిజుమీనన్, తుపాకీ చిత్రం ఫేమ్ విద్యుత్ జమ్వాల్ ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా సిఖిందర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే సల్లూభాయ్‌ను తమిళంలో శివకార్తికేయన్‌తో చేస్తున్న చిత్రంలో అతిథి పాత్రలో నటింపజేస్తున్నట్లు టాక్. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ -
సైనికుడిగా తమిళ స్టార్.. ఆరోజే రిలీజ్!
లోకనాయకుడు కమల్ హాసన్ నటుడిగా, నిర్మాతగా చాలా బిజీగా ఉన్నారు. ఈయన శంకర్ దర్శకత్వంలో నటించిన ఇండియన్–2 జులై 12వ తేదీన తెరపైకి రానుంది. అలాగే తెలుగులో ప్రభాస్ కథానాయకుడుగా నటించిన కల్కి చిత్రంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు. ఇది ప్రతినాయకుడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే నెలలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే మణిరత్నం దర్శకత్వంలో థగ్‌లైఫ్ చిత్రంలో కమల్ నటిస్తున్నారు. మరో పక్క నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. అందులో ఒకటి అమరన్. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఇందులో సాయిపల్లవి హీరోయిన్. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.శివకార్తికేయన్ ముకుందన్ అనే సైనికుడిగా పవర్ఫుల్ పాత్ర పోషించిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం జమ్ముకశ్మీర్ ప్రాంతాల్లో జరుపుకుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అమరన్ సెప్టెంబర్ 27న తెరపైకి రానుంది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
మూడోసారి తండ్రి కాబోతున్న హీరో? వీడియో వైరల్
హీరో శివకార్తికేయన్ త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. శివకార్తికేయన్- ఆర్తి దంపతులకు ఇదివరకే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలాకాలం తర్వాత వీరు మూడో బిడ్డ కోసం ప్లాన్ చేశారన్నది లేటెస్ట్ గాసిప్. తాజాగా ఓ అభిమాని తనయుడి బర్త్‌డేకు శివకార్తికేయన్ భార్య ఆర్తి, కూతురు ఆరాధనతో సహా వెళ్లాడు. జూనియర్ శివకార్తికేయన్?అయితే ఈ వీడియోలో ఆర్తికి కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. దీంతో జనాలు అది బేబీ బంప్ అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలో మరో జూనియర్ శివకార్తికేయన్ రాబోతున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా శివకార్తికేయన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే 2010లో ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్ దాస్ జన్మించారు.పెళ్లి తర్వాతే సినిమాల్లోకి..శివకార్తికేయన్ హీరో మాత్రమే కాకుండా సింగర్ అన్న విషయం తెలిసిందే! ఆ మధ్య ఆరాధాన సైతం కనా అనే కన్నడ మూవీలో వాయడి పేట పుల్ల అనే సాంగ్ ఆలపించి సెన్సేషన్ అయింది. ఇక శివకార్తికేయన్ సినిమాల విషయానికి వస్తే అతడు నటించిన అమరన్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో అతడు మేజర్ ముకుంద్ వరదరాజన్‌గా కనిపించనున్నాడు. తర్వాత ఏఆర్ మురుగదాస్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. Recent video of our #Prince @Siva_Kartikeyan anna , #AarthiSK Anni & little angel #AaradhanaSK on a birthday function🤩🎉Extremely happy to see our lovely #AarthiSK Anni pregnant 🥳😇Very much excited to welcome 3rd little one👶🏻❤🧿#PrinceSK #GuganDossSK pic.twitter.com/FUf11Ki8EP— SK THANGACHI (@jannathulrahmat) May 30, 2024 చదవండి: పిచ్చి కూతలు కూసేముందు నీ కాపురమేమైందో చూసుకో: నటి -
టాలెంటెడ్ లేడీ డైరెక్షన్లో శివకార్తికేయన్
మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇంతకుముందు సుధా కొంగర సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 2020లో విడుదలైన ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం విదితమే. కాక సుధా కొంగర తాజాగా సూర్య హీరోగా మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు. దీనికి పురనానూరు అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన 2 డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాణానికి చాలా సమయం అవసరం అవుతుందని అందువల్ల చిత్ర నిర్మాణాన్ని వాయిదా వేస్తున్నట్లు దర్శకురాలు సుధా కొంగర, నటుడు సూర్య కలిసి ప్రకటన చేశారు. అలాంటిది తాజాగా దర్శకురాలు సుధా కొంగర తన తాజా చిత్రాన్ని నటుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రసారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. కాగా నటుడు శివ కార్తికేయన్ అమరన్ చిత్రాన్ని పూర్తిచేసి ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తన 23వ చిత్రాన్ని చేస్తున్నారు. అదేవిధంగా సుధా కొంగర సూరరై పోట్రు చిత్రానికి రీమేక్ అయిన సర్ఫరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో సూర్య కథానాయకుడిగా నటించిన పురనానూరు చిత్రం పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. -
రష్మికకు ఆఫర్ల వరద.. చేతిలో ఇన్ని సినిమాలున్నాయా?
కన్నడలో కిరాక్ పార్టీ అనే చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించిన రష్మిక మందన్నా తర్వాత నేషనల్ క్రష్‌గా మారారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రముఖ నటుల సరసన నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తున్నారు. చేతినిండా చిత్రాలు ఉన్నా మరిన్ని అవకాశాలు ఈమె వైపే చూస్తుండడం విశేషం. రష్మిక చేతినిండా సినిమాలు..ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో చావ, సికిందర్ చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా తెలుగులోనూ విజయ్‌దేవరకొండతో మరోసారి కొత్త చిత్రంలో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే తమిళంలో ఈమె నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ఇక్కడ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న రష్మిక మందన్నకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. కోలీవుడ్‌లో మరో ఛాన్స్అలా త్వరలో సూర్యకు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమెను మరో అవకాశం వరించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించనున్న నూతన చిత్రంలో రష్మికను హీరోయిన్గా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫిల్మీదునియాలో టాక్. శివ కార్తికేయన్ ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మిస్తున్న అమరన్ చిత్రం పూర్తి చేసి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శివకార్తికేయన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో డాన్ ఒకటి. ఈ మూవీ ద్వారా సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయమయ్యారు. శివకార్తికేయన్‌తో వన్స్మోర్ఆ తర్వాత ఆయన రజనీకాంత్‌కు కథను సిద్ధం చేశారు. ఆ చిత్రంలో రజనీకాంత్ నటిస్తారని ప్రచారం జరిగినా, అది కార్య రూపం దాల్చలేదు. ఆ తర్వాత టాలీవుడ్ హీరో నానికి కథ చెప్పారు, అదీ వర్కౌట్ కాలేదు. దీంతో సిబి చక్రవర్తి తన తొలి చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ తోనే మరో చిత్రం చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో రష్మికను భాగం చేయాలనుకుంటున్నారట!చదవండి: 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు..? -
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
మదుబాణకడై, వట్టం చిత్రాల ఫేమ్ కమల్ కన్నన్ తెరకెక్కించిన తాజా చిత్రం కొరంగు పెడల్. కాళీ వెంకట్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో సంతోష్ వేల్మురుగన్, వీఆర్.రాఘవన్, ఎం.జ్ఞానశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు రాశీ అళగప్పన్ రాసిన సైకిల్ అనే చిరు కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్జీ ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్, సవిత కలిసి నిర్మించారు. జిబ్రాన్ సంగీతం, సునీల్ భాస్కర్ ఛాయాగ్రహణం అందించారు.జీవితంలోని సంఘటనలు..హీరో శివకార్తికేయన్‌కు చెందిన ఎస్కే.ప్రొడక్షన్స్ సంస్థ సమర్పించడం విశేషం. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న కురంగు పెడల్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాళీవెంకట్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదన్నారు. తన జీవితంలోని పలు సంఘటనలను ఈ చిత్రం గుర్తు చేసిందన్నారు. కురంగు పెడల్ చిత్రంలోని కురంగు అనే పాట గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడం విశేషం అన్నారు.కనెక్ట్ అయిపోయాచిత్ర నిర్మాత సవితా మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను వినగానే తాను దీనికి కనెక్ట్ అయిపోయానన్నారు. సైకిల్ అనేది మన ఎదుగుదలలో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు చాలా స్వతంత్రాన్ని ఇచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు కమల్‌కన్నన్ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకుల్లోకి చేరడానికి ముఖ్య కారణం శివకార్తికేయన్. ఇందులో పని చేసిన వారంతా తమ సొంత చిత్రంగా భావించారని, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. We have had a fantastic response to the special screening of our #KuranguPedal. Book your tickets now and experience the nostalgic ride in theaters starting tomorrow. #KuranguPedalFromTomorrowpic.twitter.com/TcD5vezHwz— Sivakarthikeyan Productions (@SKProdOffl) May 2, 2024 -
రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన హీరో శివకార్తికేయన్
తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళం అందించారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. నడిగర్ భవన నిర్మాణ కోసం ఇప్పటికే కోలీవుడ్ టాప్ హీరోలు తమ వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న హీరో విశాల్.. భవన నిర్మాణం కోసం విరాళాలు సేకరించే పనిలో గత కొన్ని నెలలుగా ఉన్నారు. ఆయన పిలుపుతో కమల్ హాసన్,విజయ్,సూర్య,కార్తీ వంటి స్టార్ హీరోలు తమ వంతుగా సాయం అందించారు. తాజాగా శివకార్తికేయన్ కూడా రూ. 50 లక్షలు విరాళం అందించారు. ఇప్పటికే రూ.40 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి కాగా, నిర్మాణ పనులకు మరో రూ.25 కోట్లు అవసరం ఏర్పడటంతో నటీనటుల సంఘం తరపున బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే రూ.12.5 కోట్లు డిపాజిట్ చేస్తే రూ.30 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు సరిపడ మొత్తాన్ని ఏర్పాటు చేసే పనిలో విశాలు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. Actor #Sivakarthikeyan donated Rs 50Lakh from his personal fund towards the construction of New Nadigar Sangam Building. He handed the cheque to South Indian Artistes' Association President M.Nasser and Treasurer Si.Karthi.#NadigarSangam #siaa@actornasser @VishalKOfficial… pic.twitter.com/vGfoTURb0t — Ramesh Bala (@rameshlaus) April 23, 2024 -
ఈ ముగ్గురు సినిమా స్టార్స్ ధరించిన 'కరుంగలి దండ' గురించి తెలుసా..?
చాలామంది ప్రముఖులు తమ మెడలో స్పటిక,రుద్రాక్ష, కరుంగలి మాల ఇలా వారి నమ్మకం కొద్ది వివిధ దండలు ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ లోకేష్ కనగరాజ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి వారు కరుంగలి దండను తమ మెడలో ఎప్పటికి ధరించే ఉంటారు. వారు పలు వేదికల మీదికి వెళ్లినా సరే ఈ దండను మాత్రం తొలగించరు. అంతలా ఈ కరుంగలి దండకు వారు ప్రాముఖ్యత ఇస్తారు. అది ఎందుకు ధరిస్తున్నారో అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కారణం ఏమిటంటే..: లోకేష్ కనగరాజ్ 'విక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఒక సందర్భంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాధానికి గురయ్యాను. అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు ఈ కరుంగలి దండను ఇచ్చాడు. అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి సమాచారం తెలియదు. కానీ ఈ దండను ధరించమని అతను చెప్పడంతో నేను తీసుకున్నాను. ఇక నుంచి నీకు అన్నీ మంచే జరుగుతాయి.. ఎలాంటి ప్రమాధాలు జరగవు అని చెప్పాడు. నాకు అలాంటి వాటి పట్ల పెద్దగా నమ్మకం లేదు. కానీ ఆయన కోరిక మేరకు ఆ మాలను ధరించాను. కానీ ఆ సమయం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎంతో పేరుప్రతిష్ఠలు వచ్చాయి. దీంతో ఆ దండను నేను ఎప్పడూ తొలగించలేదు.' అని ఆయన చెప్పారు. కరుంగాలి మాల అంటే.. కరుంగలి అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఆ చెట్టు కాండం నుంచి ఈ దండను తయారు చేస్తారు. జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగాలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాలన ధరిస్తారని చెబుతారు.వ్యాపారస్తులతో పాటు నిరుద్యోగులు, జాబ్ హోల్డర్లు కూడా ఈ దండను ధరిస్తారు. అందుకే ఈ దండలకు భారీ డిమాండ్ పెరిగింది. ఆన్లైన్లో దొరికే మాలలన్నీ డూప్లికేట్ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గర మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. తమిళనాడులోని సోలైమలై కొండల దిగువన ఈ ఆలయం ఉంది. మదురై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఉన్నారు. శివకార్తికేయన్, ధనుష్ కూడా కరుంగాలి అభిమానులే కరుంగలి మాలను కోలీవుడ నుంచి శివకార్తికేయన్, ధనుష్ కూడా ధరిస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఈ దండ గురించి మాట్లాడుతూ.. 'ఈ కరుంగలి మాల ధరించిన సమయం నుంచి నా జీవితం మారిపోయింది. సినిమాల పరంగా మంచి అవకాశాలు దక్కాయి.' అని చెప్పాడు. పలుమార్లు ఈ ఆలయానికి ధనుష్ కాలినడక ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. -
గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హోమ్లీ హీరోయిన్
గ్లామర్ లేనిదే సినిమా లేదు అని చెప్పవచ్చు. ఇక చాలా మంది ఈతరం హీరోయిన్లు గ్లామర్‌ను నమ్ముకునే గడిపేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనకు అవకాశం ఉన్న పాత్రలకే తమ ప్రాధాన్యం అంటుంటారు. అయితే నటించేది మాత్రం గ్లామరస్ పాత్రల్లోనే. తాజాగా నటి ప్రియాంక మోహన్ కూడా ఇదే బాట పట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కన్నడ భామ మాతృభాషలో ఒకటి రెండు చిత్రాలు చేసిన తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నాని సరసన నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించింది. అందులోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈ అమ్మడిని అక్కడ పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటు ప్రియాంక మోహన్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం హిట్‌తో శివకార్తికేయన్‌తో మరోసారి డాన్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఈ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. అలా పాపులరైన ప్రియాంక మోహన్‌కు స్టార్ నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వచ్చింది. ఆయనతో ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాలన్నింటిలోనూ ఈ అమ్మడు హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. దీంతో అలాంటి ఇమేజ్‌కు పరిమితమైంది. అలాంటిది ఇటీవల ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఒక సామాజిక బాధ్యత కలిగిన పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. తాజాగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి జయం రవికి జంటగా నటిస్తున్న బ్రదర్ చిత్రం. మరొకటి డాన్స్ మాస్టర్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే చాలా గ్యాప్ తరువాత తెలుగులో పవన్‌కల్యాణ్‌తో జత కట్టే అవకాశాన్ని పొందినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ప్రియాంక మోహన్ గ్లామర్ గోదాలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రత్యేకంగా ఫొటో షూట్ చేసుకుని దిగిన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తోంది. అలా తాజాగా బెడ్ రూమ్‌లో ఫొటో షూట్ చేసుకున్న గ్లామరస్ చిత్రాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇవి గ్లామర్ పాత్రలకు గ్నీన్ సిగ్నలా అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇలాంటి గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. వీటి వల్ల కూడా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. నటి ప్రియాంక మోహన్ గ్లామరస్ ఫొటోలకు ఇది కూడా ఒక కారణం అయ్యింటుందనేది ట్రోల్ అవుతోంది. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
కోలీవుడ్ హీరోతో కుర్చీ మడతపెట్టిన శ్రీలీల
తమిళ హీరో శివకార్తికేయన్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కమల్ హాసన్ నిర్మాతగా తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న అమరన్ చిత్రం కాగా, మరొకటి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ సైనికుడిగా పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న SK23వ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ రెండూ కమర్షియల్ ఫార్మాట్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాలు కావడం గమనార్హం. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శివకార్తికేయన్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలతో డ్యాన్స్ చేశాడు. వీళ్లు డ్యాన్స్ చేసింది సినిమాలో కాదు.. ఓ స్టేజీపై! ఇటీవల తిరుచ్చిలోని ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న శివకార్తికేయన్, శ్రీలీల గుంటూరు కారంలోని కుర్చీని మడత పెట్టి అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. #PrinceSK and #Sreeleela shakes legs for #KurchiMadathaPetti !🔥🕺🏻💃🏻 This combo would shatter the screens ! Make it happen @Siva_Kartikeyan naahh!💥❤️#Amaran #SK23 pic.twitter.com/Nya09oDRq9 — ꜰᴀᴢɪʟ🖤 (@SKFazil_) March 23, 2024 చదవండి: పెళ్లి తేదీతో పాటు కాబోయే భర్త ఎవరో చెప్పిన బర్రెలక్క -
తొలిసారి రొమాంటిక్ సాంగ్‌లో సాయిపల్లవి
మావీరన్, అయలాన్ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే అంగీకరించే నటి సాయిపల్లవి. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అమరన్. నటుడు కమలహాసన్ తన రాజకమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న అమరన్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో నటుడు శివకార్తికేయన్ సైనికుడిగా నటిస్తున్నారు. ఆయనకు సతీమణిగా సాయి పల్లవి నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ కాశ్మీర్లో 3 నెలల పాటు చిత్రీకరణను జరుపుకుంది. మరో పది రోజుల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి అవుతుందని యూనిట్ సభ్యుల సమాచారం. కాగా మిగిలిన షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాలలో నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఇందులోని ఒక రొమాంటిక్ గీతాన్ని శివకార్తికేయన్, సాయి పల్లవిపై చిత్రీకరించనున్నట్లు తెలిసింది. రొమాంటిక్ సాంగ్స్‌లలో సాయిపల్లవి ఇప్పటి వరకు కనిపించింది లేదు. కానీ ఇందులో కథ అవసరం మేరకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైన సాయిపల్లవి కొన్ని బార్డర్స్ ఎప్పటికీ దాటదని తెలిసిందే.తదుపరి నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్‌లో అమరన్ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో శివకార్తికేయన్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభమై చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా దీంతో పాటు శివకార్తికేయన్ మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం.Thank you for the wishes that came in today ❤️#VirataParvam will always be close to my heart ❤️And Vennela says hi 🥰 pic.twitter.com/aS4sqnTQLR— Sai Pallavi (@Sai_Pallavi92) June 17, 2023 -
నా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు: స్టార్ హీరో ఎమోషనల్
కోలీవుడ్‌లో స్వయం కృషితో స్టార్‌గా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్. ఒక టీవీ యాంకర్‌గా కెరియర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నటుడిగా పరిచయమై సపోర్టింగ్ పాత్రలు చేస్తూ ఆపై హీరోగా ఎదిగారు. ధనుశ్ కథానాయకుడిగా నటించిన మూడో చిత్రంలో శివ కార్తికేయన్ ఆయనకు ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనం కొత్తి పరవై చిత్రం ద్వారా హీరోగా అవతారం ఎత్తారు. అలా ఇప్పటికి 20 చిత్రాల్లో కథానాయకుడుగా నటించారు. ఇందులో పలు చిత్రాలు సూపర్ హిట్ కాగా అభిమానులు మెచ్చిన స్టార్‌గా ఎదిగారు. తాజాగా నటిస్తున్న 21వ చిత్రం అమరన్. నటి సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో శివ కార్తికేయన్ సైనిక కమెండోగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం చాలా కసరత్తులు చేశారు. చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.60 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. శివ కార్తికేయన్ నటించిన చిత్రాలన్నింటిలో అత్యధిక మొత్తానికి ఓటీటీ హక్కులు అమ్ముడుపోయిన చిత్రం ఇదే కానుంది. ఇంతకుముందే శివ కార్తికేయన్ నటించిన మావీరన్ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ.33 కోట్లు చెల్లించింది. దీంతో అమరన్ చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. శివ కార్తికేయన్ ఆదివారం తన అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ‘మీరు దేని గురించి ఆలోచించకండి. మీ కోసం నేనున్నాను. నాకు అంతా మీరే. జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నా. వాటి బాధ ఉంటుంది. కొన్ని మీకు తెలిసినా, చాలా విషయాలు తెలియదు. సమస్యలు చెప్పుకోవడానికి నాకు నాన్న లేరు. సపోర్ట్ చేయడానికి అన్నయ్య లేరు. నాకిప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా అంతా మీరే’. అంటూ నటుడు శివకార్తికేయన్ భావోద్వేగానికి గురయ్యారు. -
తొలిసారి రొమాంటిక్ గా సాయి పల్లవి.. శివ కార్తికేయన్ తో కలిసి
-
మృణాల్ అనుకుంటే రుక్మిణి బంపరాఫర్ పట్టేసింది!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరి దశ తిరుగుతుందో అస్సలు చెప్పలేం. అలా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లక్ మారేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ప్లానింగ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్-హీరో కాంబోతో కలిసి నటించేందుకు ఓకే చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన భామ రుక్మిణి వసంత్. గతేడాది రెండు పార్టులుగా రిలీజైన ఈ సినిమాలో రుక్మిణి యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే తెలుగు నుంచి కూడా బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ వేటికి ఓకే చెప్పకుండా ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా శివకార్తికేయన్ కొత్త మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తొలుత ఈ సినిమాలో పూజాహెగ్డే లేదా మృణాల్ ఠాకుర్ హీరోయిన్లుగా నటిస్తారనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రుక్మిణి బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోంది. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా సరే ఏ మాత్రం తొందరపడకుండా మూవీస్ చేయాలని చూస్తోంది. ఈమె ప్లానింగ్ చూస్తున్న నెటిజన్స్.. మరో రష్మిక అవుతుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) -
‘అరి’ రీమేక్‌పై స్టార్ హీరోల గురి?
తెలుగు దర్శకులు సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలిసిన కథలే అయినా..వాటికి కొత్త నేపథ్యాన్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన పురాణాలు, ఇతిహాసాల కథల్ని వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలాంటి చిత్రాలకు టాలీవుడ్లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు నిదర్శనం కార్తికేయ, హనుమాన్, కాంతారా, ఓ మై గాడ్ సినిమాలే. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తాజాగా మరో చిత్రం రాబోతుంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఈ సినిమా విడుదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల కాకముందే దీని రీమేక్‌పై పలువురు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘అరి’పై శివకార్తికేయన్ గురి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శివకార్తికేయన్. ఆయన ఇటీవల అయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్లో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ హీరో కన్ను ఇప్పుడు అరిపై పడింది. అయలాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన శివకార్తికేయన్‌కి దర్శకుడు జయశంకర్ ‘అరి’ ట్రైలర్ చూపించాడు. అది శివకార్తికేయన్‌కు విపరీతంగా నచ్చడంతో.. సినిమా మొత్తం చూశాడట. అందులోని కృష్ణుడు పాత్ర అతన్ని బాగా ఆకట్టుకుందట. ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తే.. కృష్ణుడు పాత్రలో తాను నటిస్తానని జయశంకర్‌కి చెప్పాడట. అరి తెలుగులో రిలీజై.. హిట్ అయితే మాత్రం అది కచ్చితంగా తమిళ్లో రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హిందీ రీమేక్‌లో అభిషేక్? ఒక హీరో మాస్ క్యారెక్టర్ చేయడానికి ఎంత ఇష్టపడతాడో అలాగే కృష్ణుడి పాత్రను చేయడానికి అంతే ఆసక్తి చూపుతాడు. ఇక నార్త్‌లో అయితే కృష్ణతత్వం కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన కార్తికేయ 2 సౌత్‌లో కంటే నార్త్‌లో బాగా ఆడింది. ‘అరి’ కూడా అలాంటి చిత్రమే కావడంతో.. హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్‌లో నటించడానికి అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపుతున్నాడట. ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే అభిషేక్‌ని కృష్ణుడిగా చూడొచ్చు. ‘అరి’పై ప్రముఖుల ప్రశంసలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రీలీజ్‌కు రేడీగా ఉంది అరి సినిమా. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులకు చూపించారు మేకర్స్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌తో పాటు చినజీయర్ స్వామి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌పై ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్( ఇస్కాన్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు. -
గ్రహాంతరవాసి వస్తున్నాడు
తమిళ చిత్రం‘అయలాన్’ తెలుగులో విడుదల కానుంది. శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అయలాన్’. కోటపాడి జె. రాజేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న తమిళ్లో విడుదలైంది. ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు గంగ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ ప్రకటించింది. ‘‘ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘అయలాన్’. ఏలియన్ (గ్రహాంతర వాసి) ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి సినిమా మాదే. వీఎఫ్ఎక్స్ షాట్స్‌కి సుమారు రెండేళ్లు పట్టింది. తమిళ్లో కేవలం నాలుగు రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చూపించాలని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కోటపాడి జె. రాజేశ్. -
ధనుష్, శివకార్తికేయన్, విజయ్ లో సంక్రాంతి విన్నర్ ఎవరంటే...?
-
పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్, అయలాన్ మూవీ
-
ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్: స్టార్ హీరో
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అయలాన్. ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా కనిపించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య అయలాన్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా శివకార్తికేయన్ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. శివకార్తికేయన్ మాట్లాడుతూ.. 'అయలాన్ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇతర చిత్రాలను బ్రహ్మాండంగా రూపొందించడం శంకర్ తరువాత రవికుమారే ఉంటారు. ఆర్థిక సమస్యల కారణంగా చిత్ర నిర్మాణం కాస్తా ఆలస్యమైంది. అయలాన్ చిత్ర షూటింగ్‌ను 75 శాతం పూర్తి చేసిన తరువాత ఈ చిత్రం ఎలా వస్తుందో మాకు అర్థమైపోయింది. దీంతో చిత్రాన్ని పక్కన పెట్టలేకపోయామని చెప్పారు. ఈ చిత్రాన్ని రాజీ పడకుండా చేశామని చెప్పారు. అయలాన్ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. కాగా.. ప్రస్తుతం రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో నటిస్తున్నట్లు శివకార్తికేయన్ వెల్లడించారు. ఈ సినిమాలో నటి సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తైనట్లు తెలిపారు. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు శివకార్తికేయన్ చెప్పారు. ఇందులో మృణాల్ ఠాగూర్ నాయకిగా నటిస్తున్నారని తెలిపారు. కాగా.. రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో తాను నటించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని శివకార్తికేయన్ తెలిపారు. తాను రజనీకాంత్‌కు అభిమానిని అని వెల్లడించారు. అయితే ఆయనతో కలిసి నటించడం లేదని స్పష్టం చేశారు. -
స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్ చేతిలోకి 'అయలాన్'.. విడుదల తేదీ ప్రకటన
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'అయలాన్'. ఏలియన్స్ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా ఇందులో నటిస్తుంది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతికి తెలుగులో భారీగా సినిమాలు ఉన్నాయి. దీంతో కొద్దిరోజుల క్రితం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఒక సమావేశం నిర్వహించారు. అన్నీ సినిమాలు ఒకేసారి రావడంతో థియేటర్ల కొరత ఏర్పడుతుందనే కారణంతో రవితేజ ఈగల్ సినిమాను వాయిదా వేశారు. ఈగల్ సినిమాకు పోటీ లేకుండా సింగల్ తేదీని ఇస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అందుకు ఈగల్ టీమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా సంక్రాంతి రేసులోకి శివ కార్తికేయన్ అయలాన్ చిత్రం వచ్చేసింది. జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్‌లో నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని. ఆయనతో పాటుగా సీడెడ్‌లో ఎన్.వీ ప్రసాద్, వెస్ట్ ఉషా పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటూ.. ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయా ఏరియాల్లో వీరందరూ కూడా చాలా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్స్‌గా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో అయలాన్ చిత్రంతో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా ఉంది. థియటర్ల కొరతు ఉండటంతో ధనుష్ తెలుగులో వాయిదా వేసుకున్నాడు.. చివర్లో ఉనూహ్యంగా శివ కార్తికేయన్ రేసులోకి వచ్చేశాడు. ఇంతలా పోటీ పడతున్న ఈ చిత్రాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరో వేచి చూడాల్సిందే. -
సంక్రాంతి రేసు నుంచి రెండు టాప్ సినిమాలు ఔట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది 'సార్' చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇప్పుడు అదే జోష్‌ను 2024 కొత్త ఏడాదిలో కొనసాగించాలని ఆయన 'కెప్టెన్ మిల్లర్'గా సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్ వేసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కూడా ఇప్పటికే ప్రకటించింది. సంక్రాంతి బరిలోనే మరో తమిళ హీరో శివకార్తికేయన్ 'అయలాన్' చిత్రం కూడా ఉంది. (ఇదీ చదవండి: భారత్ సినిమాలపై పాక్ ప్రముఖ హీరో రియాక్షన్) ధనుష్, శివకార్తికేయన్ ఇద్దరు కూడా తెలుగులో గుర్తింపు ఉన్న హీరోలే.. దీంతో వీరి సినిమాలకు టాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఉంది. కానీ ఈ సంక్రాంతికి టాలీవుడ్లో తెలుగు స్ట్రైట్ చిత్రాలు గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టంగానే మారింది. అలాంటిది డబ్బింగ్ చిత్రాలు అయిన కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలకు థియేటర్లు దొరకడం కష్టంగానే ఉంది. దీంతో ఆ రెండు చిత్రాల మేకర్స్ సినిమా విడదల విషయంలో యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్‌ను మాత్రం వాయిదా వేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జనవరి నెలలోనే సంక్రాంతి తర్వాత ఈ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ మూవీల మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకడం కష్టంగా ఉందని ఆయన ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ఎలా థియేటర్లు ఇవ్వగలుగుతామని ఆయన అన్నారు. దీనిని బట్టి చూస్తే కెప్టెన్ మిల్లర్, అయాలాన్కు సంక్రాంతికి రావాడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. -
ఈ మూవీ కోసం ఒక్క పైసా తీసుకోని హీరో!
హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం అయలాన్. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఆర్.రవికుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కొటపాటి జయం రాజేశ్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని, నీరవ్‌షా చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రామాన్ని చైన్నెలో నిర్వహించారు. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరింది ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ.. తెలుగులో బాహుబలి, కన్నడంలో కేజీఎఫ్ చిత్రాల మాదిరి తమిళంలో అయలాన్ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో రక్తంతో కూడిన హింసాత్మక సంఘటనలు గానీ, తుపాకీ శబ్దాలు గానీ, అశ్లీల సన్నివేశాలు గానీ ఉండవన్నారు. ఆబాలగోపాలం చూసి ఆనందించే విధంగా సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా అయలాన్ ఉంటుందన్నారు. అదే విధంగా ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని, ఈ చిత్రం కోసం తాను ఒక పాటను కూడా రాసినట్లు చెప్పారు.తనకు చిన్న తనం నుంచి కార్టూన్, గ్రాఫిక్స్ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు. ఇతర సినిమాలతో పోల్చనుగానీ.. ఆ తరహాలో ఒక చిత్రాన్ని మనం చేయగలమా? అన్న ప్రశ్న ఎప్పుడూ తలెత్తేదన్నారు. దానికి సమాధానమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రం చేస్తే ఆ తరువాత మరిన్ని ఇలాంటి చిత్రాలు వస్తాయని భావించామన్నారు. దురదృష్టవశాత్తు ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాతకు పలు సమస్యలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించడానికి తాను పారితోషికం కూడా వద్దు.. చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేయమని చెప్పానన్నారు. ఇతర చిత్రాలతో పోల్చను కానీ, అయలాన్ తమిళ చిత్రపరిశ్రమలో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు, టీజర్ కంటే ట్రైలర్ ఇంకా అదిరిపోతుందని శివకార్తికేయన్ పేర్కొన్నారు. చదవండి: విజయకాంత్ మరణం.. విశాల్ కన్నీటి పర్యంతం! -
ట్రెండ్ మార్చిన రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ట్రెండ్ మార్చారు అనిపిస్తుంది. 50 ఏళ్ల సినీ పయనం, 170 చిత్రాల అనుభవం. ఈయన తాజాగా నటించిన జైలర్ చిత్రం కూడా అనూహ్య విజయాన్ని సాధించింది. రజనీకాంత్ హీరోగా నటించిన ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ అతిథులుగా మెరిశారు. ఒక సూపర్‌స్టార్ చిత్రంలో ఇందరు స్టార్లు నటించడం నిజంగా విశేషమే. ఇలా ఈ చిత్రం నుంచే రజనీకాంత్ ట్రెండ్ మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. జైలర్ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈయన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో షూటింగును ప్రారంభించనున్నట్లు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. కాగా ఇందులో కూడా రజనీకాంత్‌తో పాటు యువ నటులు ముఖ్యపాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఇందులో శివకార్తికేయన్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం. ఇందులో మలయాళ భామ మంజువారియర్ రజనీకాంత్‌తో జతకట్టడానికి రెడీ అవుతున్నట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ క్రేజీ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
శివకార్తికేయన్ సినిమా.. రంగంలోకి పాన్ ఇండియా స్టార్లు!
ప్రస్తుతం మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు శివకార్తికేయన్. ఇటీవల ఈయన నటించిన మావీరన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు.. విశ్వ నటుడు కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి శివకార్తికేయన్ సిద్ధమవుతున్నారు. కార్తికేయన్‌తో సీతారామం బ్యూటీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను గత సెప్టెంబర్‌లోనే నిర్మాతలు ప్రకటించారు. ఇందులో సీతారామం చిత్రం ఫేమ్ మృణాల్‌ఠాగూర్ కథానాయికగా నటించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అదేవిధంగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నట్లు తాజా సమాచారం. నటుడు మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు తుపాకీలో విలన్‌గా.. ఇప్పుడు.. ఇకపోతే విద్యుత్ జమ్వాల్ ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారన్నది గమనార్హం. కాగా అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: ‘మంగళవారం’ మూవీ రివ్యూ -
శివకార్తికేయన్ చేసిన పనివల్లే ప్రియాంకా మోహన్ బొద్దుగా అయిందా?
తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్న కన్నడ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. 2019లో ఒందు కథై హేల అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకగా పరిచయమైన నటి ఈమె. ఆ వెంటనే టాలీవుడ్లో నాని 'గ్యాంగ్ లీడర్' ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో పాగా వేసింది. ఇక్కడ శివకార్తికేయన్ సరసన డాక్టర్ చిత్రంలో నటించి దాంతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ఏకంగా సూర్యతో రొమానన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశ పరిచినా ప్రియాంక మోహన్‌కు పెద్దగా నష్టం జరగలేదు. ఆ వెంటనే మరోసారి శివకార్తికేయన్‌తో డాన్ చిత్రంలో జతకట్టే అవకాశం వరించింది. లక్కీగా ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అలా లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ తాజాగా ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ అమ్మడికి మరోసారి తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా నానితో 'సరిపోదా శనివారం' అనే చిత్రం ద్వారా రెండో సారి జతకట్టనుంది. ఆ సినిమా పూజా కార్యక్రమంలో ఆమె కొంచెం బొద్దుగా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు వస్తుండటంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. అందులో ముఖ్యంగా నటుడు శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ ఆయనతో తాను రెండు చిత్రాలు చేసినట్లు చెప్పింది. శివ కార్తికేయన్‌కు ఒక ఎడిక్ట్ ఉందని, ఆయన స్వీట్స్ ఎక్కువగా తింటారని చెప్పింది. షూటింగ్ స్పాట్లో కూడా స్వీట్స్ తింటూ పక్కనున్న వారికి కూడా ఇస్తారని చెప్పింది. అలా ఆయన తనను కూడా స్వీట్స్ తినమని ఒత్తిడి చేసే వారని చెప్పింది. అలా ఒక హీరో అయ్యుండి కూడా బరువు పెరుగుతాననే భయం కూడా శివకార్తికేయన్‌కు ఉండదని నటి ప్రియాంకా మోహన్ పేర్కొంది. అలా పరోక్షంగా తను ఎందుకు బొద్దుగా అయిందో ఇలా చెప్పకనే చెప్పిందా బ్యూటీ.. కాగా దక్షిణాది భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తరచూ తన గ్లామరస్ ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ ట్రెండింగ్ అవుతోంది. -
శివకార్తికేయన్ నన్ను దారుణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి పని చేసే ప్రసక్తే లేదంటున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్. గతంలో శివకార్తికేయన్‌కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడీ హీరో. అయితే వీరి మధ్య ఏమైందో ఏమో కానీ సడన్‌గా అతడి సినిమాలకు పని చేసేదే లేదంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'శివకార్తికేయన్‌తో ఈ జన్మలో కలిసి పని చేయను. వ్యక్తిగత కారణాల వల్ల అతడితో మళ్లీ కలిసి పని చేయలేను. ఎందుకంటే అతడు నాకు నమ్మకద్రోహం చేశాడు. తర్వాతి జన్మలో నేను మళ్లీ సంగీత దర్శకుడిగా, అతడు నటుడిగా పుడితే అప్పుడు కలిసి పనిచేస్తామేమో! ఈ జన్మకు మాత్రం అది జరగదు. అతడు నన్ను దారుణంగా మోసం చేశాడు. ఆ విషయం గురించి అతడిని నిలదీశాను కూడా! కానీ తనేమన్నాడనేది నేను చెప్పలేను. నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అతడి గురించి ఏదీ చెప్పలేకపోతున్నాను. జనాలేమనుకుంటారన్న భయం నాకు లేదు. నేనేంటో నాకు పూర్తిగా తెలుసు' అని చెప్పుకొచ్చాడు. ఇతడి వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేస్తున్నాయి. కాగా డి. ఇమ్మాన్ ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. విశ్వాసం సినిమాకుగానూ ఆయన ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు. తమిళన్, మైనా, కుంకీ.. ఇలా అనేక సినిమాలకు పని చేశాడు. శివకార్తికేయన్‌తో చివరగా 'నమ్మ వీటు పిల్లై' సినిమాకు పని చేశాడు. చదవండి: శుభశ్రీ అవుట్.. రతిక రోజ్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఎలా వాడుకుంటుందో.. -
ఏలియన్ తో శివకార్తికేయన్..ప్రయోగం సక్సెస్ అవుతుందా..
-
ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు అంటూ భార్య ఫోటో షేర్ చేసిన శివకార్తికేయన్
శివకార్తికేయన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన భార్య ఆర్తి కోసం ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నారు. నటుడు శివకార్తికేయన్-ఆర్తి జంట ఈరోజు 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు, ఉదయం నుండి చాలా మంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.రెమో, డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగ ఆయన 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (ఇదీ చదవండి; శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను: శ్రీలీల) కోలీవుడ్‌లో విజయ్ టీవీ ద్వారా బుల్లితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించి వెండితెరపై విజయవంతంగా అడుగుపెట్టిన నటుడు శివకార్తికేయన్ తన ఎదుగుదలతో యావత్ సినీ ప్రపంచం వెనక్కి తిరిగి చూసేలా చేశాడు. ఒకవైపు తన డ్రీమ్ వైపు పయనిస్తున్న నటుడు శివకార్తికేయన్ అదే సమయంలో 2010 ఆగస్టు 27న తన బంధువైన ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. శివకార్తికేయన్-ఆర్తి దంపతులకు ఒక కుమార్తెతో పాటు కుమారుడు ఉన్నారు. వారిద్దరూ కూడా తమ ఫ్యామిలీ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 13 సంవత్సరాల వైవాహిక జీవితం తన 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శివకార్తికేయన్ తన భార్య ఆర్తి కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నాడు. తన భార్యతో కలిసి దిగిన సంతోషకరమైన ఫోటోను 'ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు... విష్ హ్యాపీ వెడ్డింగ్ డే' అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంలో, శివకార్తికేయన్ అభిమానులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు శివకార్తికేయన్ ప్రయాణం మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శివకార్తికేయన్, బుల్లితెరపై పాపులర్ హోస్ట్‌గా ఉంటున్న సమయంలోనే మెరీనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో వచ్చిన '3' సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత కేడి బిల్లా కిల్లాడి రంగా, మనంకోటి పక్షి, ఒప్పో నెచ్చిల వంటి హిట్లతో అంచెలంచెలుగా అభిమానులను సంపాదించుకున్నాడు. 2016లో రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు తదుపరి సినిమా ఏమిటి? సూపర్‌హిట్ చిత్రాలను అందిస్తూ అంచెలంచెలుగా తమిళ చిత్రసీమలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎదిగిన శివకార్తికేయన్ తెలుగు పరిశ్రమలో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఎస్కె 23 సినిమాపై దృష్టి సారించాడు. ఇంతకుముందు శివకార్తికేయన్-అదితి శంకర్ నటించిన మావీరన్ సూపర్ హిట్ అయ్యి 100 కోట్లు దాటింది. 'మండేలా' దర్శకుడు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన మావీరన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) -
సినిమా సూపర్ అంటూ రజనీ రివ్యూ.. ఆనందంలో హీరో
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం మావీరన్. హీరోయిన్ అదితి శంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్ మడోన్ దర్శకత్వంలో శాంతి పిక్చర్స్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ చిత్రం విడుదలై 25 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా శివకార్తికేయన్ బుధవారం ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో మావీరన్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. జైలర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ, చిత్ర విడుదల కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన మావీరన్ చిత్రాన్ని చూడలేకపోతారేమోనని చాలా నిరుత్సాహపడ్డానన్నారు. అయితే ఇటీవల మావీరన్ చిత్రాన్ని చూసిన రజనీకాంత్.. తనకు ఫోన్ చేసి చిత్రం చాలా బాగుందని అభినందించారన్నారు. ఇది తనతో పాటు యూనిట్ సభ్యులందరికీ ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పారు. మావీరన్ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశానని, చాలా గ్రాండ్‌గా, సూపర్బ్‌గా ఉందని రజనీ ప్రశంసించారన్నారు. చాలా డిఫరెంట్ కథా చిత్రాలను ఎంచుకుంటున్నావు కదా అని అభినందించారన్నారు. ఈ సందర్భంగా ఒక అభిమానిగా రజనీకాంత్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే తానీ రంగంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. కాగా ఈయన ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతున్న తన 21వ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ❤️❤️❤️🙏🙏🙏#Maaveeran #JAILER #SuperstarRajinikanth @rajinikanth sir #VeerameJeyam #BlockBusterMaaveeran pic.twitter.com/0EMO7yUSI2 — Sivakarthikeyan (@Siva_Kartikeyan) August 9, 2023 చదవండి: స్నేహ చేసిన పనికి కంగారుపడుతున్న ఫ్యాన్స్.. అలాంటివి చేయొద్దని విజ్ఞప్తి -
నెలలోపే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా
మరో స్టార్ హీరో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నెలలోపే.. స్మాల్ స్క్రీన్ పై సందడికి టైమ్ ఫిక్స్ చేసుకుంది. దీంతో మూవీ లవర్స్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. వచ్చిన వెంటనే చూసేయాల్సిందేనని ఫిక్సయిపోతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎప్పుడు ఏ ఓటీటీలో రానుందనే ఇప్పుడు చూసేద్దాం. టాక్ ఓకే కానీ శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. పలు డబ్బింగ్ సినిమాలతో మనల్ని అలరిస్తున్న ఇతడు.. గతంలో 'జాతిరత్నాలు' అనుదీప్ తో కలిసి 'ప్రిన్స్' చేశాడు. అది సక్సెస్ కాలేదు. దీంతో తమిళంలో మాత్రమే నటిస్తున్నాడు. అలా జూలై 14న 'మావీరన్' (తెలుగు 'మహావీరుడు')గా థియేటర్లలోకి వచ్చాడు. కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) ఓటీటీ తేదీ ఈ సినిమాలో శివకార్తికేయన్ తోపాటు అదితి శంకర్, యోగిబాబు, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ వారం 23 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో క్రేజీ మూవీ వచ్చి చేరింది. కథేంటి? సత్య(శివకార్తికేయన్) ఓ కార్టూనిస్ట్. మహావీరుడు పేరుతో కామిక్ స్టోరీస్ రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. ఓ సందర్భంలో ఉంటున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి చనిపోవాలనకుంటాడు. దెబ్బలు తగిలి ప్రాణాలతో బయటపడతాడు. అప్పటినుంచి అతడికి ఓ అజ్ఞాత గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో సత్య జీవితంలో ఏం జరిగింది? ఈ స్టోరీలో జర్నలిస్ట్ చంద్ర(అదితి శంకర్), మంత్రి ఎమ్ఎమ్ సూర్య(మిస్కిన్) ఎవరు? చివరకు ఏమైందనేదే స్టోరీ. OFFICIAL: #Maaveeran To Stream from Aug 11 on Prime..⭐#Sivakarthikeyan | #AditiShankar | #MadonneAshwin pic.twitter.com/DY9ErvJ8t1 — Laxmi Kanth (@iammoviebuff007) August 7, 2023 (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) -
మృణాల్ తమిళ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతో కలిసి
Mrunal Thakur First Tamil Movie: హీరో-హీరోయిన్-డైరెక్టర్.. ఎవరైనా సరే ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ చాలు. కెరీర్ సాలీడ్‌గా సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఎన్ని హిట్, ఫ్లాప్స్ వచ్చినా అవి ఆటుపోటు లాంటివే, కొన్నాళ్లకు సర్దుకుంటాయి. నటి మృణాల్ ఠాకూర్ జీవితం ఇంతే. మోడలింగ్ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. పలు యాడ్స్‌లో నటించింది. అనంతరం సినిమాల్లోకి వచ్చింది. పలు మరాఠీ , హిందీ చిత్రాల్లో నటించినా రాని క్రేజ్ 'సీతరామం' అనే ఒక్క తెలుగు చిత్రంతో వచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) ప్రస్తుతం హిందీ, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ మృణాల్ బిజీగా ఉంది. కాగా తెలుగులో నాని 'హాయ్ నాన్న' మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కొత్త సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా మృణాల్‌ని ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు. శివకార్తికేయన్ 'మావీరన్' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో.. కమలహాసన్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఇది పూర్తయిన తర్వాత శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో చిత్రం మొదలు కానుంది. రజనీకాంత్‌తో చేసిన 'దర్బార్' ఫ్లాప్ దెబ్బతో మురుగదాస్ మరో మూవీ చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు శివకార్తికేయన్‌తో చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి వెళ్లబోతన్న చిత్ర ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
ఈ పిల్లవాడు ఇప్పుడు స్టార్ హీరో, అతడి వెనకాలున్న పాప అతడి భార్యే!
ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? చిన్న బాబును ఎత్తుకున్న పిల్లాడు కోలీవుడ్‌లో టాప్ హీరో.. అతడి వెనకాల నుదుటన విభూతితో పింక్ డ్రెస్‌లో ఉన్న చిన్నారి ప్రస్తుతం అతడి భార్య! వీరిద్దరూ తమిళనాట సెలబ్రిటీ కపుల్.. ఇంకా అర్థం కాలేదా? అతడు శివకార్తికేయన్, ఆమె ఆర్తి. సోషల్ మీడియాలో ఈ దంపతుల చిన్ననాటి ఫోటో వైరల్ తెగ వైరలవుతోంది. ఈ హీరో విషయానికి వస్తే.. శివకార్తికేయన్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించాడు. అందరి పెదాలపై నవ్వులు పూయించే టాలెంట్ కార్తికేయన్ సొంతం. ఇది గమనించిన స్నేహితులు ఓ కామెడీ షోలో పాల్గొనమని సూచించాడు. సరే, వారి మాట ఎందుకు కాదనాలి? అనుకున్నాడే ఏమో కానీ ఓ రాయేద్దామనుకున్నాడు. కళక్క పోవతు యారు అనే కామెడీ షోలో పార్టిసిపేట్ చేయగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ షో విజేతగా అవతరించాడు. ఆ తర్వాత షార్ట్ ఫిలింస్ చేశాడు. ముగప్పుటగం, ఐడెంటిటీ, కురాహి 786, 360° వంటి లఘుచిత్రాలు చేశాడు. అతడిలోని ప్రతిభను గుర్తించిన ఏగన్ చిత్రబృందం అదే సినిమాలో శివకార్తికేయన్‌కు ఓ చిన్న రోల్ ఇచ్చింది. కానీ ఎడిటింగ్‌లో అతడి పాత్రను తీసేశారు. దీంతో వెండితెరపై కనిపించాలన్న అతడి కలకు ఆదిలోనే హంసపాదు పడింది. ఆ తర్వాత డైరెక్టర్ పాండిరాజ్ 'మెరీనా' సినిమాతో అతడిని వెండితెరకు హీరోగా పరిచయం చేశాడు. ఈ మూవీ శివకార్తికేయన్‌కు మంచి గుర్తింపు తీసుకురావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తక్కువకాలంలోనే స్టార్ హీరోగా పేరు గడించాడు. ‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్ చేస్తూ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హీరోగా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, నిర్మాతగానూ సత్తా చాటాడు. తన బంధువులమ్మాయి ఆర్తిని 2010 ఆగస్టు 27న పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధన, కుమారుడు గుగన్ దాస్ అని ఇద్దరు సంతానం. కౌసల్యా కృష్ణమూర్తి తమిళ వర్షన్ కనాలో శివకార్తికేయన్ తన కూతురితో కలిసి ఓ పాట పాడాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా నటించిన మావీరన్ జూలై 14న రిలీజ్ కానుంది. అయాలన్ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) చదవండి: క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించిన సుచిత్రా కృష్ణమూర్తి సెలబ్రిటీల బాడీగార్డు నెల జీతం లక్షల్లో.. ఏడాదికి కోట్లల్లోనే! -
శివ కార్తికేయన్ ‘మహావీరుడు’మూవీ స్టిల్స్
-
డైరెక్టర్ శంకర్ కూతురు గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రముఖ డైరెక్టర్ శంకర్ వారసురాలు ఆదితి శంకర్. ఆమెకు ఒక అక్క ఐశ్వర్య శంకర్, ఒక తమ్ముడు అర్జిత్ శంకర్ ఉన్నారు. ఈమె శ్రీరామచంద్ర యూనివర్సిటీలో వైద్య విద్య చదివింది. కానీ రాణిస్తోంది మాత్రం సినీ రంగం. మధ్యలో సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు. ఈమెలోని గాయని చలాకీ తనానికే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: ఆ యాడ్ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ) నటనపై ఆసక్తితో హీరోయిన్గా మారి తొలి చిత్రం కోలీవుడ్‌లో విరుమాన్లో గ్రామీణ యువతిగా జీవించారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా వస్తున్న చిత్రం మావీరన్. ఇందులో పాత్రికేయురాలిగా నటించారు. శివకార్తికేయన్ కథానాయకుడు. జాతీయ ఉత్తమ అవార్డు దర్శకుడు అశ్విన్ మడోనా దర్శకుడు. చిత్రం ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి) ఇది 'మహావీరుడు' పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. అలా రెండవ చిత్రంతోనే ఆదితి శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. కాగా ఈ బ్యూటీ జులై 6వ తేదీన తన 26వ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో ఇది తనకు ప్రత్యేక పుట్టిన రోజు అని పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా మావీరన్ చిత్రంలో ఆదితి శంకర్ పాడిన బంగారుపేటలోనా... అనే పాట నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
శివ కార్తికేయన్ 'మహావీరుడు' ట్రైలర్ విడుదల
రెమో, డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన శివ కార్తికేయన్ కథానాయకుడిగా... మడోనా అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మావీరన్'. తెలుగులో 'మహావీరుడు'గా రానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ ఇందులో హీరోయిన్. అరుణ్ విశ్వ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చివరి దశకు చేరుకుందని దర్శకుడు మడోనా అశ్విన్ తెలిపారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను వారు విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై 14న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకొస్తోంది. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. శివ కార్తికేయన్, అదితి మధ్య కెమిస్ట్రీ అందరినీ మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. కొద్దిరోజుల క్రితమే బంగారు పేటలోన... అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు. భరత్ శంకర్‌తో కలిసి అదితి శంకర్ ఆలపించిన ఈ పాటను సంగీత దర్శకులు రెహమాన్ రచించడం విశేషం. ఈ పాట విడుదలైన రోజు నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది. -
టాప్ డైరెక్టర్‌తో శివకార్తికేయన్.. హీరోయిన్గా సీతారామం బ్యూటీ!
కోలీవుడ్‌లో వేగంగా ఎదిగిన హీరో శివకార్తికేయన్. ప్రారంభంలో కీర్తిసురేష్, ఆనంది వంటి వర్తమాన నటీమణులతో నటించిన ఈయన ఆ తర్వాత హన్సిక, నయనతార వంటి క్రేజీ హీరోయిన్లతో నటించే స్థాయికి ఎదిగారు. అదేవిధంగా శివకార్తికేయన్ ఇప్పటికి హీరోగా 19 చిత్రాలు చేశారు. వాటిలో అధిక భాగం హిట్ చిత్రాలే. ఆ మధ్య డాక్టర్, డాన్ వంటి చిత్రాలు వరుసగా సూపర్ హిట్ అయినా, ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం అశ్విన్ మడోనా దర్శకత్వంలో మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు. అదితిశంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంపై శివకార్తికేయన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో సాయిపల్లవి నాయకిగా నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. అయితే శివకార్తికేయన్ మరో చిత్రానికి కమిట్ అయినట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన దర్బార్ చిత్రం తర్వాత ఈ దర్శకుడు మరో చిత్రం చేయలేదు. అదేవిధంగా శివకార్తికేయన్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దానికి ఇప్పుడు టైమ్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీలో శివకార్తికేయన్‌కు జంటగా మృణాల్ ఠాకూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమ్మడు తెలుగులో నటించిన సీతారామం చిత్రంతో బాగా పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. ఈమె శివకార్తికేయన్‌తో జతకట్టే విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చదవండి: మెగా ప్రిన్సెస్‌కు ఘనస్వాగతం.. ఫోటో షేర్ చేసిన ఉపాసన -
మహేశ్ బాబు, అల్లు అర్జున్‌ల బాటలో శివకార్తికేయన్... కొత్త బిజినెస్!
కోలీవుడ్‌లో తక్కువకాలంలోనే స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు శివకార్తికేయన్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన డాన్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే తెలుగులోనూ అభిమానులను సంపాదించుకోవాలన్న ఆశతో నటించిన ప్రిన్స్ చిత్రం నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన మావీరన్ చిత్రం జూలై 14న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అశ్విన్ మడోనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై శివకార్తికేయన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇది తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదల కానుంది. ఇదిలా ఈ మధ్య నటీనటులు, దర్శకులు ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు. దర్శకుడు అమీర్ ఇటీవలే ఒక కాఫీ షాపును ప్రారంభించారు. నయనతార, ప్రియ భవానీ శంకర్ వంటి వారు కూడా ఇతర వ్యాపారాల్లో రాణిస్తున్నారు. తాజాగా శివకార్తికేయన్ కూడా ఇతర వ్యాపారంలోకి దిగుతున్నట్టు తాజా సమాచారం. ఈయన ఒక మల్టీ ఫ్లెక్స్ థియేటర్‌కు భాగస్వామి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ గ్రూప్ సంస్థతో కలిసి చైన్నెలో ఒక మల్టీఫ్లెక్స్ థియేటర్ ప్రారంభించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఏషియన్ గ్రూప్ సంస్థ ఇప్పటికే టాలీవుడ్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి వారి భాగస్వామ్యంలో మల్టీఫ్లెక్స్ థియేటర్లు ప్రారంభించిందన్నది గమనార్హం. చదవండి: ఆర్జీవీ ఆఫీస్.. బ్రూస్లీ నుంచి బూతు బొమ్మల దాకా -
ప్రమోషన్స్‌కు సిద్ధమైన మహా వీరుడు, అప్పుడే ఆడియో లాంచ్
శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మావీరన్. దర్శకుడు శంకర్ వారసురాలు ఆదితిశంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో యోగిబాబు, దర్శకుడు మిష్కిన్, సరిత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత, మండేలా చిత్రం ఫేమ్ మడోనా అశ్విన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తుండగా శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో జూలై 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగులో మహావీరుడు పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి డబ్బింగ్‌ను శివకార్తికేయన్ ఇటీవలే పూర్తి చేశారు. కాగా చిత్ర విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం. భరత్ శంకర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూలై 2న భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు సమాచారం. చైన్నెలోని సాయిరాం కాలేజీలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నటుడు శివకార్తికేయన్ ఇంతకుముందు నటించిన రెండు చిత్రాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇదే కాలేజీలో నిర్వహించారన్నది గమనార్హం. చదవండి: సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్ -
శివ కార్తికేయన్, సాయి పల్లవి కొత్త సినిమా వేడుక (ఫొటోలు)
-
కోలీవుడ్ హీరోతో సాయిపల్లవి.. కొత్త సినిమా ప్రారంభం
శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా కొత్త సినిమా షురూ అయింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఎస్కే 21’ (శివకార్తికేయన్) అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చెన్నైలో జరిగిన ఓ వేడుకలో ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘దేశభక్తి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది. ‘మేజర్’ లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన సోనీ పిక్చర్స్ మరోసారి దేశం గర్వించే వీరుల కథతో ‘ఎస్కే 21’ని నిర్మిస్తోంది. ఈ సినివ షూటింగ్ కాశ్మీర్‌లోని అద్భుతమైన లొకేషన్లలో శుక్రవారం ప్రారంభమైంది’’ అన్నారు. జూలైలో మహావీరుడు... శివ కార్తికేయన్, అదితీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘మహావీరుడు’. తమిళంలో ‘మహావీరన్’ పేరుతో రూపొందింది. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించారు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మింన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ త్రాన్ని జూలై 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటింంది. -
షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరో.. ట్వీట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమిళంతో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు మాంచి క్రేజ్ ఉంది. రెమో, డాక్టర్, డాన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్ గతేడాది జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగులో ప్రిన్స్ అనే సినిమాను చేశారు. ప్రస్తుతం మహావీరన్ అనే సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శివ కార్తికేయన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ట్విటర్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 'మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. సినిమా అప్డేట్స్ నా టీమ్ షేర్ చేస్తుంది. త్వరలోనే తిరిగి వచ్చేస్తాను' అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ బ్రేక్ ఎందుకన్నది మాత్రం ఆయన రివీల్ చేయలేదు. చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ My dear brothers and sisters, I am taking a break from twitter for a while. Take care, and i will be back soon 👍😊 P.S: All updates on the films will be shared here by my team. pic.twitter.com/Nf4fdqXRTy — Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 30, 2023 -
దీపావళికి శివకార్తికేయన్ ‘అయలాన్’
శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా నిర్మించారు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఫస్ట్ లుక్ విడుదల చేసింది యూనిట్. (చదవండి: అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంక చోప్రా) ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ– ‘‘అయలాన్’ అంటే ఏలియన్ అని అర్థం. ఇంతకుముందు కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి. అయితే, ఏలియన్ ప్రధాన పాత్ర నేపథ్యంలో దక్షిణాది భాషల్లో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు.. మా ‘అయలాన్’ తొలి చిత్రం అవుతుంది. ఈ చిత్రంలో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఇన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా మాదే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ సమయం పడుతోంది’’ అన్నారు. ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నీరవ్ షా, సంగీతం: ఏఆర్ రెహమాన్. -
నా నటనలో రజినీకాంత్ ఛాయలుంటాయి
తమిళ సినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆగస్టు 16, 1947. ఈ చిత్రం ద్వారా నటి రేవతి కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓం ప్రకాష్ బట్, నర్శీరామ్ చౌదరితో కలిసి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన చిత్రం ఇది. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు ఎన్ఎస్ పొన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటరో సోమవారం రాత్రి నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా నటుడు శివకార్తికేయన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... తనకు సీనియర్ నటుడు కార్తీక్ అంటే చాలా ఇష్టం అని, ఆయన చాలా స్వీటెస్ట్ పర్సన్ అని పేర్కొన్నారు. అదేవిధంగా గౌతమ్ కార్తీక్‌ను కలిసిన చాలా కాలం తర్వాత తాను కార్తీక్‌ను కలిశానని, ఆయన చాలా అందగాడని పేర్కొన్నారు. ఆయన నటనలో ఇతర ఏ నటుల ఛాయలు ఉండవని, అయితే తన నటనలో మాత్రం రజనీకాంత్ చాయలు ఉంటాయని శివకార్తికేయన్ పేర్కొన్నారు. కాగా తన పయనం దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రంతోనే మొదలైంది అన్నారు. అది ఏఆర్ మురుగదాస్‌కు నిర్మాతగా తొలి చిత్రమని తెలిపారు. ఆ చిత్ర ప్రారంభోత్సవానికి తాను వ్యాఖ్యాతగా వ్యవహరించానన్నారు. ఆ తర్వాత ఆయన నిర్మించిన మాన్ కరాటే చిత్రంలో తాను కథానాయకుడిగా నటించానని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్మించిన ఈ చిత్రానికి తాను అతిథిగా విచ్చేశానని అదేవిధంగా త్వరలో మరో ఇంపార్టెంట్ స్టెప్పును వేయబోతున్నట్లు చెప్పారు. అది త్వరలోనే జరుగుతుందని అన్నారు. కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. -
శివ కార్తికేయన్ లేటెస్ట్ సాంగ్.. 500మందితో డ్యాన్స్
హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం తెలుగులో మహావీరుడు పేరుతో విడుదల కానుంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ భారీ ఎత్తున దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి మండేలా చిత్రం ఫేమ్ మడోనా అశ్విన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలోని సీన్ ఆ సీన్ అనే పాట గ్లింప్సెస్‌ను విడుదల చేశారు. 30 సెకన్ల నిడివితో కూడిన ఈ పాటలో నటుడు శివకార్తికేయన్ ఎనర్జిటికల్ డాన్స్ చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది. కాగా ఈ పాటలో 500కు పైగా నృత్య కళాకారులు 150 మందికి పైగా చిత్ర బృందం పాల్గొనడం విశేషం. గీత రచయితలు కపిలన్, లోకేష్ రాసిన ఈ పాటకు భరత్ శంకర్ సంగీత బాణీలు కట్టారు. శోబీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. కాగా ఈ పాటలో చెన్నైకు చెందిన 500కు పైగా నృత్య కళాకారులను నటింప చేయడంపై చిన్ని ప్రకాష్, బాబు తదితరులు మావీరన్ చిత్ర కథానాయకుడు నటుడు శివకార్తికేయన్, దర్శకుడు మడోనా అశ్విన్, నిర్మాత అరుణ్ విశ్వకు అభినందనలు తెలిపారు. కాగా ప్రస్తుతం శివకార్తికేయన్, మిష్కిన్, సునీల్ పాల్గొంటున్న ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
హీరో కాకముందు శివ కార్తికేయన్ ఏం చేసేవారో తెలుసా?
నటుడు శివ కార్తికేయన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన పేరు ఇప్పుడు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రాచుర్యం పొందింది. కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలలో ఒకరుగా రాణిస్తున్న శివ కార్తికేయన్ ఆరంభ దశలో టీవీ యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఈయన ఆ తర్వాత సినీ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రం మనంకొత్తి పరవై తోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు విజయవంతంతమైన చిత్రాల్లో నటించి స్టార్ డమ్‌ను పెంచుకుంటూ వచ్చారు. ఈయన ఇటీవల నటించిన డాక్టర్, డాన్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత నటించిన తెలుగు చిత్రం ప్రిన్స్ మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ప్రస్తుతం అయిలాన్, మావీరన్ చిత్రాల్లో నటిస్తున్నారు. మావీరన్ చిత్రానికి మడోనా అశి్వన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా శివ కార్తికేయన్ నటుడుగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో మావీరన్ చిత్ర యూనిట్ షూటింగ్ స్పాట్లో శివకార్తికేయన్‌ను అభినందిస్తూ యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి సందడి చేశారు. కాగా, ప్రిన్స్ చిత్ర నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. దీని తెలుగు వెర్షన్‌కు మహావీరుడు అనే టైటిల్‌ను నిర్ణయించారు. -
ఆగిపోయిన శివకార్తికేయన్ సినిమా? నిర్మాతల క్లారిటీ!
శివకార్తికేయన్ హీరోగా నటించిన ప్రిన్స్ దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఈయన మావీరన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో కథానాయకగా పరిచయమైన విషయం తెలిసిందే. ఇది ఆమెకు రెండో చిత్రం. కాగా 'మండేలా' చిత్రం ద్వారా పరిచయమైన మడోనా అశ్విన్ ఈ చిత్రానికి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్, నటి సరిత ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇదు అయాన్ సినిమాటోగ్రఫీ, భరత్ శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. అయితే మావీరన్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై స్పందించిన నిర్మాతల వర్గం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. అందులో తమ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని పేర్కొన్నారు. అసత్యాలు తాత్కాలికమేనని, నిజమే గెలుస్తుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. చదవండి: వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా మనోడే జమున చాలా పొగరుబోతు, ఇంట్లోకి కూడా రానివ్వదు -
ప్రిన్స్ నష్టాలు.. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులిచ్చి ఆదుకున్న హీరో
శివకార్తికేయన్ నటించిన ద్విభాషా చిత్రం ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, డి.సురేశ్ బాబు, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. తెలుగు, తమిళంలో అక్టోబర్ 21న రిలీజైన ఈ మూవీ వసూళ్లు రాబట్టడంలో ఫెయిలైంది. ఫలితంగా అంచనాలు తప్పి రెండు చోట్లా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో రూ.12 కోట్ల మేర నష్టాలు వచ్చాయట! అయితే ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు హీరో శివకార్తికేయన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు వారు నష్టపోయిన మొత్తంలో సగం వెనక్కు ఇచ్చేశాడట. అంటే దాదాపు ఆరు కోట్ల మేర వారికి తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఉక్రెయిన్ నటి మారియా ర్యాబోషప్క హీరోయిన్గా నటించగా తమన్ సంగీతం అందించాడు. చదవండి: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వారిసు ట్రైలర్ ముంబైలో డూప్లెక్స్ ఇల్లు అమ్మేసిన హీరోయిన్ -
శివకార్తికేయన్ చిత్రానికి అవతార్ టీం?
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మైమరిపిస్తున్నాయి. ఆ చిత్రానికి బలం నేపథ్య సంగీతం, విజువల్ ఎఫెక్ట్సే. అలాంటి చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు కొందరు ఇప్పుడు తమిళ చిత్రం అయలాన్‌కు పనిచేస్తున్నట్లు సమాచారం. నటుడు శివ కార్తికేయన్ ఇంతకుముందు నటించిన డాక్టర్, డాన్ చిత్రాల విజయాలకు తాజాగా నటించిన ప్రిన్స్ చిత్రం బ్రేక్ వేసింది. దీంతో తదుపరి నటిస్తున్న అయలాన్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ఆయనకు జంటగా రకుల్ ప్రీతిసింగ్ నటిస్తుండగా, ఇషా గోపికర్, భానుప్రియ, యోగి బాబు, బాల శరవణన్, కరుణాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రానికి పనిచేసిన హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కొందరు పనిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో అయలాన్ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
ఓటీటీలో ప్రిన్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
హీరోహీరోయిన్లు శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క జంటగా నటించిన చిత్రం ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుస్కూర్ రామ్మోహనరావు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా కథేంటంటే.. శివకార్తికేయన్ ఓ స్కూలు టీచర్. అదే స్కూల్లోని ఇంగ్లీష్ టీచర్ మరియాను ప్రేమిస్తాడు. ఇతడు ఇండియన్ అబ్బాయి, అక్కడ ఆమె బ్రిటీష్ అమ్మాయి కావడంతో వీరి ప్రేమకు రెడ్ సిగ్నల్ పడుతుంది. దీంతో ఇది ప్రేమ పోరాటంలా కాకుండా రెండు దేశాల మధ్య పోట్లాటగా మారుతుంది. మరి ఆనంద్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే అసలు కథ. ‘All Indians are my brothers and sisters’#PrinceOnHotstar from November 25, Only on @DisneyPlusHSTel. Here's the trailer ▶️ https://t.co/uGjmaidbTq@Siva_Kartikeyan @anudeepfilm @maria_ryab @SureshProdns @SVCLLP @ShanthiTalkies @manojdft @Cinemainmygenes #Sathyaraj pic.twitter.com/VuFtGeWLLz — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 15, 2022 చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఇటీవల ఆపరేషన్ సక్సెస్.. అంతలోనే నటి పరిస్థితి విషమం -
ప్రిన్స్ రివ్యూ: జాతిరత్నాలు డైరెక్టర్ నవ్వించాడా?
టైటిల్: ప్రిన్స్ తారాగణం: శివకార్తికేయన్, మరియా, సత్యరాజ్, ప్రేమ్‌జీ తదితరులు దర్శకుడు: అనుదీప్ కేవి సంగీతం: తమన్ సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస నిర్మాతలు: సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుష్కర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ: అక్టోబర్ 21, 2022 ఒక సినిమా విజయం సాధించిందంటే ఆ డైరెక్టర్ బాధ్యత రెట్టింపు అవుతుంది. తర్వాతి సినిమా అంతకు మించి విజయాన్ని సాధించేలా తీయాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా నెక్స్ట్ ఎలాంటి మూవీ తీస్తారోనని ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. అలాంటి పరిస్థితే ఎదురైంది దర్శకుడు కేవీ అనుదీప్‌కి. గతేడాది జాతిరత్నాలు మూవీతో ఊహించనంత సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న అనుదీప్ ఈసారి ప్రిన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. మరి అనుదీప్ మరోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? ప్రిన్స్ మూవీ ఎలా ఉంది? ఓసారి చూసేద్దాం.. కథ: ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వారసుడు ఆనంద్(శివకార్తికేయన్). ఇతడో స్కూలు టీచర్. హీరో తండ్రి విశ్వనాథ్(సత్యరాజ్) కులమతాలకు వ్యతిరేకి, అందరూ కలిసి ఉండాలనుకునే వ్యక్తి. ఇక హీరో తన స్కూల్లోనే మరో టీచర్(బ్రిటీష్ అమ్మాయి) అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)తో లవ్‌లో పడతాడు. ఇంగ్లండ్‌కు చెందిన జెస్సిక తండ్రికి ఇండియన్స్ అంటేనే గిట్టదు. దీంతో వారి ప్రేమకు అతడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు. రానురానూ ఇద్దరి మధ్య లవ్‌స్టోరీ కాస్తా రెండు దేశాల మధ్య వార్‌లా మారుతుంది. మరి ఆనంద్ ప్రేమ సక్సెస్ అయిందా? అతడిని ఊరి నుంచి ఎందుకు గెంటేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: ప్రిన్స్ సినిమాలో మూడు కోణాలు ఉన్నాయి. కామెడీ, లవ్ స్టోరీ, మానవత్వం అనే అంశాలను టచ్ చేశాడు డైరెక్టర్. అనుదీప్ అంటేనే కామెడీ కాబట్టి ఎక్కువగా కామెడీనే నమ్ముకున్నాడు. కానీ అక్కడక్కడా కామెడీ పండించే సీన్లను సాగదీయడం కొంత చిర్రెత్తిస్తుంది. ముఖ్యంగా బాటిల్ గార్డ్ ఎపిసోడ్ చూసిన జనాలకు అరె ఏంట్రా ఇది అనిపిస్తుంది. లవ్ సీన్స్ కొన్నిచోట్ల అమాయకత్వం ఉట్టిపడుతూ బాగుంటాయి. అనుదీప్ టేకింగ్, శివకార్తికేయన్ నటన రెండూ కరెక్ట్‌గా సరిపోయాయి. కానీ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు మాత్రం రొటీన్ ఫార్మాట్లోనే వెళ్లినట్లు అనిపించక మానదు. ఫస్టాఫ్ అక్కడక్కడ బాగుంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం తన ట్రేడ్ మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు అనుదీప్. డైలాగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్‌లో హీరో దేశభక్తి కంటే హ్యుమానిటీనే గొప్పదని చెప్పే స్పీచ్ బాగుంటుంది. అనుదీప్ ఎంచుకున్న కాన్సెప్ట్ సీరియస్‌గా కనిపించినా దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలోనే డీల్ చేశాడు. ఏం చేసినా ఏం రాసినా అంతా నవ్వించడం కోసమే అన్నట్లు ఉంటుందీ చిత్రం. మరీ జాతిరత్నాలు రేంజ్లో కాకపోయినా కామెడీ ఇష్టపడేవారికి ప్రిన్స్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే? శివ కార్తికేయన్ అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ పాత్ర సినిమాకే హైలెట్. ప్రేమ్ జీ పంచులతో ఎంటర్టైన్ చేశాడు. హీరోయిన్ మరియా లుక్, నటన ఫ్రెష్‌గా ఉంది. అనుదీప్ కామెడీ చేస్తూనే మనుషులంతా ఒక్కటేనని సింపుల్‌గా చెప్పాడు. ప్రధాన పాత్రల మాటలు ఫన్ క్రియేట్ చేస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి. తమన్ అందించిన సంగీతం కొంతవరకు ఆకట్టుకుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్లు సాగదీయకుండా కట్ చేస్తే బాగుండేది. ఓవరాల్‌గా ప్రిన్స్.. నో లాజిక్.. ఓన్లీ కామెడీ మ్యాజిక్! చదవండి: సర్దార్ మూవీ రివ్యూ సౌత్ సినిమాలు చేయాలనుంది -
ఆ ఐడియా నన్ను ఎక్సయిట్ చేసింది..అందుకే ‘ప్రిన్స్’ చేశా: హీరో
శివకార్తికేయన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్టైనర్ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక గా నిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న 'ప్రిన్స్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరో శివకార్తికేయన్ మీడియాతో ముచ్చుటించారు. ఆ విశేషాలు.. తెలుగులో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారా ? ప్రిన్స్ ఎలా మొదలైయింది ? ఒక ఆర్టిస్ట్ గా అన్ని చోట్ల సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాలని, ప్రశంసలు అందుకోవాలని ఉంటుంది. ప్రిన్స్ విషయానికి వస్తే.. ఫన్ సినిమాలు తగ్గిపోతున్నాయి. నా వరకూ కామెడీ సినిమాలు చేయడం చూడటం చాలా ఇష్టం. ఇలాంటి సమయంలో నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్ ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా నచ్చింది. తర్వాత అది 'ప్రిన్స్' గా మారింది. ప్రిన్స్ యూనివర్షల్ సబ్జెక్ట్. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉంటాయి. అనుదీప్ కథ చెప్పినపుడు ఏ పాయింట్ మిమ్మల్ని ఎక్సయిట్ చేసింది ? అనుదీప్ జాతిరత్నాలు చూశాను. అనుదీప్ రాసుకునే పాత్రల్లో స్వచ్చమైన అమాయకత్వం ఉంటుంది. పాత్రలు ఊహించని విధంగా రియాక్ట్ అవుతాయి. ప్రిన్స్ స్టొరీ ఐడియా చాలా ఎక్సయిట్ చేసింది. ఒక ఇండియన్ బ్రటిష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో మనుషులు మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేమ,పెళ్లి విషయాల్లో వారిది ఒక ఖచ్చితమైన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని బ్రేక్ చేసే ఆలోచన చాలా ఎక్సయిట్ చేసింది. ఇందులో సత్యరాజ్ గారి పాత్ర కూడా నన్ను ఎక్సయిట్ చేసింది. సత్యరాజ్ పాత్ర తన కొడుకుతో 'మన కులం, మతం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు' అని చెబుతుంది. చాలా యూనిక్ క్యారెక్టర్ ఇది. డబ్బింగ్ మీరే చెప్పారా ? లేదండీ. తెలుగు భాషపై పూర్తిగా పట్టురానిదే డబ్బింగ్ చెప్పకూడదని నా అభిప్రాయం. డైలాగ్ మాడ్యులేషన్ చాలా ముఖ్యం. అది భాషపై పట్టుసాధిస్తేనే వస్తుంది. అనుదీప్ తో కొంచెం తెలుగు మాట్లాడుతుంటాను. అయితే సొంతగా డబ్బింగ్ చెప్పే అంతా తెలుగు ఇంకా రాలేదు. వరుణ్ డాక్టర్ లో మీ బాడీ లాంగ్వేజ్ చాలా సెటిల్ద్ గా ఉంటుంది. ప్రిన్స్ లో ఎలాంటి బాడీ లాంజ్వేజ్ ఉంటుంది? వరుణ్ డాక్టర్ డార్క్ కామెడీ. నిజ జీవితానికి పోలిక లేని సినిమా. నా పాత్రలో చిన్న స్మైల్, ఎమోషన్ కూడా ఉండదు. కానీ దాని నుంచే హ్యుమర్ పుడుతుంది. రియల్ లైఫ్ లో అలా నవ్వకుండా ఒక్క అరగంట కూడా ఉండలేను(నవ్వుతూ). ప్రిన్స్ క్యారెక్టర్ తో రిలేట్ చేసుకోగలను. అనుదీప్ తనదైన బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేశారు. ప్రతి సీన్ ని అనుదీప్ తెలుగులో నటించి చూపించిన తర్వాతే యాక్ట్ చేసేవాడిని. తొలి సారి తెలుగు సినిమా చేయడం ఎలా అనిపించింది ? ప్రిన్స్ ప్రాజెక్ట్ ఒక సవాల్ తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో రాశారు. తెలుగు స్క్రిప్ట్ ని తమిళ్ చేయడం ఒక సవాల్ గా తీసుకొని వర్క్ చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భవిష్యత్ లో కూడా ద్విభాష చిత్రాలు చేయాలనే ఆలోచన ఉంది. విజయ్, వంశీ పైడిపల్లి గారితో సినిమా చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ - శంకర్ గారు కలసి పని చేస్తున్నారు. రెండు పరిశ్రమలో కలసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. కేజీఎఫ్,ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సౌత్ పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉంది. మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది ? ఒక కథ ఎంపిక చేసినప్పుడు గత చిత్రం గురించి అలోచించను. గత చిత్రంలో కామెడీ వర్క్ అవుట్ అయ్యిందని మళ్ళీ అవే ఎలిమెంట్స్ ఉండే కథ ఎంపిక చేయాలని అనుకోను. కథలో సెల్లింగ్ పాయింట్ చూస్తాను. ప్రేక్షకులు ఈ కథని ఎందుకు చూడాలి, ఇందులో కొత్తదనం ఏమిటి, విమర్శకులు దిన్ని ఎలా చూస్తారు ? ఇలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటాను పదేళ్ళ జర్నీ అలా జరిగింది ? టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సోలో హీరోగా ఎదిగాను. ప్రతి అనుభవం నా కెరీర్ కి ఉపయోగపడింది. ఈ పదేళ్ళలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను. మీ జర్నీని తెలుగులో నాని గారితో పోల్చుతారు కదా ? అవును. నాని గారు కూడా యాంకర్ గా సహాయ దర్శకుడిగా పని చేశారు. నేను కూడా పని చేశాను. ప్రేక్షకులు కూడా మేము సిమిలర్ గా కనిపిస్తామని చెబుతుంటారు. నాని గారిది కూడా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ప్రిన్స్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ? ప్రిన్స్ కథలో బ్రిటిష్ కనెక్షన్ ఉంది. ఒక కింగ్ డమ్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ప్రిన్స్ అని పిలుస్తుంటారు. అలా ఈ చిత్రానికి 'ప్రిన్స్' అని పేరు పెట్టాం. ప్రిన్స్ నిర్మాతలు గురించి ? సురేష్ ప్రొడక్షన్ లెజెండ్రీ ప్రొడక్షన్ హౌస్. తమిళ్ లో కూడా గొప్ప గొప్ప సినిమాలు చేసిన చరిత్ర వారిది. సురేష్ ప్రొడక్షన్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి కారణం సునీల్ గారు. బీగినింగ్ నుంచి చాలా ప్రోత్సహించారు. శాంతి టాకీస్ అరుణ్ చాలా సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ ని చేశాను. తెలుగులో ఏ దర్శకులతో కలసి పని చేయాలని అనుకుంటున్నారు ? రాజమౌళి గారు. ఆయనతో కలసి పని చేయాలని అందరికీ ఉంటుంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కొత్తగా చేయబోతున్న చిత్రాలు ? మడోన్నే అశ్విన్ 'మహావీరుడు' చేస్తున్నా. -
శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
దీపావళికి థియేటర్లో ‘ప్రిన్స్’ సందడి
డాక్టర్, డాన్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు శివకార్తికేయన్. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ప్రిన్స్. ఈ చిత్రంతో ఈయన దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్నారు. విశేషం ఏమిటి ఇంతకుముందు తన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శివకార్తికేయన్ ఈ చిత్రంతో నేరుగా వారి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అవును తమిళం, తెలుగు భాషలలో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని జాతి రత్నాలు చిత్రం ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్నారు. చదవండి: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ ఈ చిత్రం ద్వారా ఉక్రెయిన్ దేశానికి చెందిన మరియా అనే నటి కథానాయకిగా పరిచయం అవుతోంది. నటుడు సత్యరాజ్, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని పిపిలికా పిలాయ్ అనే పాటలు ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు ఆదివారం అధికారికపూర్వకంగా ప్రకటించారు. దీంతో పాటు చిత్ర పోస్టర్‌ను విడుదల చేస్తూ అక్టోబర్ 21,20200 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా నటుడు శివకార్తికేయన్ ఈ చిత్రంలో టూరిస్ట్ గైడ్‌గా నటిస్తున్నట్లు సమాచారం. -
శివ కార్తికేయన్ 'ప్రిన్స్' నుంచి సెకండ్ సింగిల్ అవుట్
నటుడు శివకార్తికేయన్ డాన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ప్రిన్స్'. ఈ చిత్రం ద్వారా తొలిసారి నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగు, తమిళం భాషల్లో రపొందుతున్న ఈ చిత్రానికి జాతి రత్నాలు చిత్రం ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా ఉక్రెయిన్ దేశానికి చెందిన మరియ రియా పోషస్క పరిచయం కావడం విశేషం. నటుడు సత్యరాజ్, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.తమన్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణ అందిస్తున్నారు. కాగా దీనిని అరుణ్ విశ్వకు చెందిన శాంతి టాకీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ ఎల్ బి, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని పింపిలిక్కీ పిలాప్పీ అనే పాటను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పెన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ప్రిన్స్ చిత్రం నుం జెస్సికా ఉన్ బాయ్ ఫ్రెండ్ పదవి ఎనక్కా అనే పాటను విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోందని, ఇప్పటికే మిలియన్లకు పైగా ప్రేక్షకులు ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా చిత్రం దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
డైరెక్టర్ శంకర్ కూతురు హీరోయిన్గా శివకార్తికేయన్ కొత్త సినిమా
తమిళసినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్, డాన్ చిత్రాలతో విజయాలు అందుకున్న ఆయన ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ప్రిన్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో చిత్రానికి క్లాప్ కొట్టారు. దీనికి ‘మావీరన్’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో దర్శకుడు శంకర్ వారసురాలు ఆదితి శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈమెకిది రెండో సినిమా. కార్తీ నటించిన విరుమాన్ చిత్రంతో కథానాయికగా అదితి శంకర్ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా తొలి చిత్రం విడుదలకు ముందే అదితి మరో చిత్రంలో అవకాశం దక్కించుకోవడం విశేషం. కాగా శాంతి టాకీస్ సమర్పణలో అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివకార్తికేయన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుధవారం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విదు అయన్న ఛాయాగ్రహణంను, భరత్ శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
సీనియర్ కమెడియన్ రీ ఎంట్రీ ? స్వయంగా హీరోనే ఇంటికి వెళ్లి అడగడంతో..
తమిళసినిమా: సీనియర్ హాస్యనటుడు గౌండ్రమని రీ ఎంట్రీ షురూ అయిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసినా ఈయనకు దర్శకుడు భారతీరాజా 16 వయదినిలే చిత్రంలో రజనీకాంత్‌కు మిత్రుడి పాత్రను ఇచ్చి ఆయన దశ తిరిగేలా చేశారు. ఆ తరువాత ప్రముఖ కమెడియన్‌గా ఎదిగి కొన్ని చిత్రాల్లో హీరోగానూ నటించారు. ముఖ్యంగా గౌండ్రమని, సెంథిల్ జంట వినోదాల విందే అని పేరు తెచ్చుకున్నారు. అలా కోలీవుడ్‌లో గౌండమని హవా 2000 ఏడాది వరకు వెలిగింది. ఆ తరువాత చిత్రాల సంఖ్య తగ్గించుకుంటూ వచ్చారు. ఆయన చివరగా 2016లో వాయ్మ్ అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత నటనకు దూరంగా ఉంటున్న ఈయన తాజాగా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్ తాజాగా నటిస్తున్న చిత్రాల్లో మావీరన్ ఒకటి. మడోనా అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌కు మహావీరుడు అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా ఇందులో నటుడు గౌండ్రమని హాస్య పాత్రలో నటించనున్నారని తెలిసింది. నటుడు శివకార్తికేయన్ స్వయంగా గౌండ్రమని ఇంటికి వెళ్లి ఆయనను నటించమని కోరారట. చదవండి: Divya Bharathi: బికినీ ఫొటోషూట్‌తో 'బ్యాచ్‌లర్' హీరోయిన్ రచ్చ.. -
నాగ చైతన్య ద్విభాషా చిత్ర షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
-
వినాయక చవితికి కాదు దీపావళికి ‘ప్రిన్స్’ వస్తున్నాడు
వినాయక చవితికి రావాల్సిన ప్రిన్స్ దీపావళికి వస్తున్నాడు. తమిళ హీరో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు కేవీ అనుదీప్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘ప్రిన్స్’. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పణలో డి. సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ‘ప్రిన్స్’ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మంగళవారం ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, సహనిర్మాత: అరుణ్ విశ్వ. -
ప్రిన్స్‌గా రాబోతున్న హీరో శివకార్తికేయన్
సీమ రాజా, శక్తి, రెమో, డాక్టర్ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో శివకార్తికేయన్. ప్రస్తుతం అతడు అనుదీప్ కేవి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా ప్రిన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు శివకార్తికేయన్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సైతం వదిలారు. ఇందులో హీరో చేతిలో గ్లోబ్ పట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఈ సినిమాను సురేశ్ బాబు, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నారు. Here's the first look of #PRINCE 🇮🇳🕊🇬🇧#PrinceFirstLook@anudeepfilm #MariaRyaboshapka #Sathyaraj sir @MusicThaman @manojdft @premji @Cinemainmygenes @SVCLLP @SureshProdns @ShanthiTalkies @Gopuram_Cinemas #NarayandasNarang @AsianSuniel @SBDaggubati @puskurrammohan @iamarunviswa pic.twitter.com/NbLSADkdv8 — Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 9, 2022 చదవండి: పూజా హెగ్డేకు ఘోర అవమానం బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు -
కోలీవుడ్‌కి కియారా.. ఆ హీరోతో ఫస్ట్ మూవీ!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తమిళంలో ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శివ కార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు కియారా అద్వానీని సంప్రదించి, కథ కూడా వినిపించారట దర్శకుడు. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు కియారా అద్వానీ. -
ఓటీటీకి శివకార్తికేయన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘డాన్’, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఆయన తాజాగా నటించిన చిత్రం డాన్. మే 13న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజై రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూళు చేసి రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ ఈ మూవీ విడుదలై మూడు వారాలు పైనే అవుతున్న నేపథ్యంలో డాన్ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయబోతుంది. డాన్ మూవీని నెట్‌ఫ్లిక్స్ భారీ ఢిల్కు సొంతం చేసుకున్నట్లు సమాచారం. జూన్ 10 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య, సముద్రఖని కీలక పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్, శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. చదవండి: మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్, వీడియో వైరల్ It's time to put on your dancing shoes and do the Jalabulajangu with us, because the DON is arriving on June 10th! 🎉🕺🥳#DonOnNetfix pic.twitter.com/5hQbfTuJ3I — Netflix India South (@Netflix_INSouth) May 28, 2022 -
అలా అయితేనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తా: హీరో శివకార్తికేయన్
Sivakarthikeyan About Pan India Movies: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా నటించిన డాన్ చిత్రం ఈ రోజు ప్రపపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల నేపథ్యంలో గురువారం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా చిత్రాలపై స్పందించాడు. ఐడియా కొత్తగా ఉంటేనే పాన్ ఇండియా చిత్రాలలో నటించడానికి తాను సిద్ధమని అన్నాడు. అనంతరం డాన్ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని, దర్శకుడు కథ చెప్పగానే కాలేజీ రోజులు గుర్తుకు రావడంతో వెంటనే నటించడానికి ఒకే చెప్పానన్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ఐలాన్ చిత్రాన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి తన ఎస్.కె.ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం -
నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్ వీడియో వైరల్
‘నువ్వు టైమ్, రాత, విధి... అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే... నేను మగపిల్లాడిని కాదుగా.. ఆడపిల్లను’ అంటూ సాయిపల్లవి డబ్బింగ్ చెబుతున్న వీడియో సోమవారం విడుదలైంది. మే 9న ఈ బ్యూటీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న త్రిభాషా (తెలుగు, కన్నడ, మలయాళం) చిత్రం ‘గార్గీ’ లుక్, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. (చదవండి: సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు) ఈ వీడియోలోనే తెలుగు, కన్నడ భాషల్లో సాయి పల్లవి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు సాయిపల్లవి మరో సినిమా అప్డేట్ కూడా వచ్చింది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ బేనర్లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందనున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. వెన్నెల రెండుసార్లు జన్మించింది రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి చేసిన ‘వెన్నెల’ పాత్రను ఉద్దేశించి ‘సోల్ ఆఫ్ వెన్నెల’ పేరుతో ‘వెన్నెల రెండుసార్లు జన్మించింది. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు. అడవి తల్లి ఒడిలో ఒకసారి ఆశయాన్ని ఆయుధం చేసినట్టు.. అతని ప్రేమలో మరొకసారి..’ అంటూ వీడియోను విడుదల చేశారు. -
కమల్ హాసన్ నుంచి అది నేర్చుకున్నా: సాయిపల్లవి
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి బర్త్‌డే నేడు(మే 9). ఈ సందర్భంగా తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే గార్గి అనే కొత్త సినిమాకు సంబంధించి గ్లింప్స్ వీడియో షేర్ చేసింది సాయిపల్లవి. తాజాగా మరో మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. తమిళ స్టార్ శివకార్తికేయన్ 21వ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు వెల్లడించింది. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది సాయిపల్లవి. 'ఈ సమావేశంలో కమల్ హాసన్ నుంచి ఉత్తమ నటిగా మారేందుకు అవసరమైన మెళకువలు నేర్చుకుంటాననుకున్నాను. కానీ, మంచి వ్యక్తిగా మారేందుకు అవసరమైన విలువలను తెలుసుకుని వెళ్లాను. నిజంగా ఈ మీటింగ్ నాకెంతో ప్రత్యేకం' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సినిమాను రాజ్‌కుమార్ ఫిలింస్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్, టర్మెరిక్ మీడియా సంయుక్తంగా నిర్మించనున్నాయి. This meeting had me hoping that I’d learn lessons to become a better actor from “The Kamal sir” himself but I walked out of there, subconsciously picking up traits that will make me a better person. This was special! Thank you @ikamalhaasan sir! I’m happy to be a part of this! https://t.co/rNqi8k82c6 — Sai Pallavi (@Sai_Pallavi92) May 9, 2022 నేచురల్ బ్యూటీ సాయిపల్లవి బర్త్‌డే స్పెషల్ ఫొటోలు ఇక్కడ చూడండి చదవండి: పిచ్చి ముదిరింది, శూర్పణఖ అంటూ రెచ్చిపోయిన నటరాజ్ బికినీలో కేక్ కట్ చేసిన ఆమిర్ ఖాన్ కూతురు, ఫొటోలు వైరల్ -
‘శివకార్తికేయన్ చేసిన ఒక్క ఫోన్‌కాల్ నా జీవితాన్నే మార్చేసింది’
తమిళ సినిమా : ఆ విషయంలో తాము పూర్తిగా సక్సెస్ అయ్యామని హీరో శివకార్తికేయన్ అన్నారు. ఈయన తాజా చిత్రం డాన్. నటి ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, సముద్రఖని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సిబిచక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్, శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈనెల 13వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం ముందస్తు ప్రసార కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి చెన్నైలో ఘనంగా నిర్వహించారు. శివకార్తికేయన్ చేసిన ఒక్క ఫోన్‌కాల్ తన జీవితాన్ని మార్చేసిందని, ఆయన తన నిజ జీవితానికి, రీల్ జీవితానికి ప్రాణం పోశారని సిబిచక్రవర్తి పేర్కొన్నారు. చిత్రాన్ని ప్రారంభించే ముందు లైకా ప్రొడక్షన్స్‌కు టేబుల్ ప్రాపర్టీని అందించాలని సంకల్సించామని, ఆ విషయంలో సక్సెస్ అయ్యామని చిత్ర కథా నాయకుడు శివకార్తికేయన్ పేర్కొన్నారు. ఇది ప్రతి కళాశాల విద్యార్థిని ప్రతిబింబించే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కి చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేయడం మరింత సంతోషంగా ఉందన్నారు. -
క్రేజీ న్యూస్.. రజనీకాంత్ మూవీలో యంగ్ హీరో
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'బీస్ట్' సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారం ఈ సినిమాలో యంగ్ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. గతంలో ఆయనకి 'డాక్టర్' సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ హిట్ ఇచ్చాడు. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఆ సినిమాకి శివకార్తికేయన్ నిర్మాత కూడా. అందుకే మరోసారి నెల్సన్ మూవీలో చేసేందుకు శివ కార్తికేయన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
హీరో శివకార్తికేయన్‌కు నిర్మాత షాక్.. అపరాధం విధించాలని పిటిషన్
Gnanavel Raja Petition Of Sivakarthikeyan For Mister Local Movie Loss: తమిళ హీరో శివకార్తికేయన్‌కు ప్రముఖ నిర్మాత, గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజా షాక్ ఇచ్చారు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తానని రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని మద్రాస్ హైకోర్టులో శివకార్తికేయన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మిగిలిన రూ. 4 కోట్లు చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్ కోరాడు. ఈ కేసుపై గురువారం (మార్చి 31) మద్రాస్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో శివ కార్తికేయన్ వల్ల తాను రూ. 20 కోట్లు నష్టపోయినట్లు తెలుపుతూ పిటిషన్ దాఖళు చేశాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. చదవండి: నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు తనకు మిస్టర్ లోకల్ కథ అసలు నచ్చలేదని, చెప్పిన వినకుండా తనతో బలవంతగా ఈ సినిమా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చాడని జ్ఞానవేల్ రాజా తెలిపాడు. అందుకే ఈ సినిమాను నిర్మించినానని పటిషన్లో పేర్కొన్నాడు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతుండగా, ఇప్పుడే తనపై కేసు ఎందుకు పెట్టాడని ప్రశ్నించాడు. తాను నష్టపోయినందుకు శివకార్తికేయన్‌కు అపరాధం విధించి, తనపై ఉన్న కేసును కొట్టివేయాల్సిందిగా జ్ఞానవేల్ రాజా కోరాడు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: సినిమాకు ఎల్లలు లేవు – శివ కార్తికేయన్ -
నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు
SivaKarthikeyan Files Petition Against KE Gnanavel Raja: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కోర్టు మెట్లెక్కాడు. ప్రముఖ నిర్మాత కె. ఇ. జ్ఞానవేల్ రాజా తనకు రెమ్మ్యునరేషన్ ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తామని జూలై 6, 2018న ఒప్పందం చేసుకుని, రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపాడు. మూడేళ్లైనా రూ. 4 కోట్లు ఇవ్వలేదన్నాడు. ఇచ్చిన రూ. 11 కోట్లకు కూడా టీడీఎస్ కట్టలేదని, రూ. 91 లక్షలు టీడీఎస్ కింద కట్ అయ్యాయని పేర్కొన్నాడు. తన కేసు పరిష్కారమయ్యే వరకూ నిర్మాత జ్ఞాన్వేల్ రాజా తన తదుపరి సినిమాలైన 'రెబల్', 'చియాన్ 61', 'పాతు తాల'కు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని కోర్టును కోరాడు శివ కార్తికేయన్. అలాగే ఈ సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ కోసం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు, లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి హక్కులు బదిలీ చేయకుండా చూడాలని అభ్యర్థించాడు. ఈ కేసు మళ్లీ గురువారం విచారించనున్నారు. కాగా శివకార్తికేయన్.. రెమో, హీరో, వరుణ్ డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల 'బీస్ట్' మూవీ నుంచి అదరగొట్టిన సూపర్ హిట్ సాంగ్ 'అరబిక్ కుతు'కు లిరిక్స్ అందించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లల్ 'అయాలాన్' విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి రవి కుమార్ దర్శకత్వం వహించారు. -
Arabic Kuthu: అసలు ఆ పాటను ఎలా రాశాడబ్బా?
Vijay Beast Arabic Kuthu Song Lyricist Details: గంటలో మిలియన్న్నర వ్యూస్.. అంతే రేంజ్లో లైక్స్. సినిమా వాళ్లంటే పడిచచ్చే తమిళ తంబీలు, విజయ్ ఫ్యాన్స్ హోల్‌సేల్‌గా బీస్ట్ ‘అరబిక్ కుతు’ సాంగ్ పాటకి ఫిదా అయిపోతున్నారు. చాలాకాలం గ్యాప్ తర్వాత విజయ్ స్టైలిష్ స్టెప్పులేయడంతో ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతున్నారు. బీస్ట్ సినిమా కోసం సాంగ్‌కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్, స్టైలిష్ స్టెప్పులు కంపోజ్ చేసిన జానీ మాస్టర్‌కు మాత్రమే కాదు.. పాట రాసిన హీరో శివకార్తికేయన్కే మేజర్ క్రెడిట్ ఇవ్వాలంటున్నారు విజయ్ అభిమానులు. యస్.. టీవీ నటుడి నుంచి కష్టపడి నెమ్మది నెమ్మదిగా స్టార్ హీరోగా ఎదిగాడు శివకార్తికేయన్. ఇండస్ట్రీలో ఇగో లేని హీరోగా అతనికి పేరుంది. అందుకే అతడంటే కోలీవుడ్‌లో మాత్రమే కాదు.. మిగతా భాషల్లోనూ అతనికి అభిమానులు ఎక్కువే. ఈ క్రమంలో హీరోగా, ప్రొడ్యూసర్‌గా, నిర్మాతగా, సింగర్‌గా.. గేయ రచయితగానూ తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంతకు ముందు కొలమావు కోకిల కోసం యోగిబాబు ‘కళ్యాణ వయసు’ సాంగ్, డాక్టర్ కోసం ‘చెల్లమ్మ, సో బేబీ’, సూర్య Etharkkum Thunindhavan కోసం ‘సుమ్మ సుర్రును’ లాంటి హిట్ సాంగ్స్ రాశాడు. ఇప్పుడు బీస్ట్ కోసం అరబిక్ టచ్‌తో అరబిక్ కుతు సాంగ్ అందించాడు. నిజానికి ఈ పాట షార్ట్ టైంలో ఆకట్టుకోవడానికి, అంచనాలు పెంచుకోవడానికి కారణం.. శివకార్తికేయన్ ఇచ్చిన అరబిక్ టచ్. ఇందుకోసం తానేమీ అరబిక్‌ను అవపోసన, బట్టీ పట్టలేదని అంటున్నాడు శివకార్తికేయన్. తాజాగా ఓ మీడియా బైట్‌లో మాట్లాడుతూ.. జస్ట్.. అరబిక్ హమ్మింగ్ పదాలను సేకరించి.. వాటికి తమిళ పదాలు మేళవించి రాశానని చెప్పాడు. అలా అరబిక్ కుతుకు తన పని తేలికయ్యిందని అంటున్నాడు శివకార్తికేయన్. ఇక ఈ సాంగ్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సాంగ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ను సినీ గేయ రచయిత, దివంగత న ముత్తుకుమార్(ఎన్నో అర్థవంతమైన పాటల్ని రాసిన ముత్తుకుమార్.. 2016లో జాండిస్‌తో చనిపోయారు) కుటుంబానికి అందజేసి మంచి మనసు చాటుకున్నాడు నటుడు శివకార్తికేయన్. దీంతో సోషల్ మీడియాలో ఈ యంగ్ హీరోను తెగ పొగిడేస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషన్ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో రాబోతున్న బీస్ట్.. ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. జొనిత గాంధీతో కలిసి అనిరుధ్ పాడిన అరబిక్ కుతు సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి. సాంగ్ హిట్‌ను సంగతి కాసేపు పక్కనపెడితే.. తెలుగు మీమ్స్ పేజీలు ఈ సాంగ్ లిరిక్స్‌లోని పదాలతో ట్రోలింగ్ చేస్తూ నవ్వులు పంచుతున్నారు. -
కమల్ హాసన్‌తో సోనీ సంస్థ ఒప్పందం
కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, సోనీ ఫిలిమ్స్ పిక్చర్స్ సంస్థ సంయుక్తంగా తమిళంలో చిత్రాలు నిర్మించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థలు తొలి ప్రయత్నంగా శివకార్తికేయన్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. దీనికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను పొంగల్ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. అందులో సోనీ ఫిలిమ్స్ పిక్చర్స్ సంస్థతో కలిసి చిత్రం చేయడం గర్వంగా భావిస్తున్నట్లు కమల్ హాసన్‌తో పేర్కొన్నారు. కమల్ హాసన్ సంస్థతో కలిసి శివకార్తికేయన్ హీరోగా తమిళంలోనూ చిత్రాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని సోనీ సంస్థ నిర్వాహకుడు అన్నారు. -
‘డాక్టర్’గా వస్తున్న శివకార్తికేయన్
శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘డాక్టర్’. గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్కె ప్రొడక్షన్స్‌తో కలిసి కోటపాడి జె. రాజేష్ నిర్మించారు. అక్టోబర్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. జె. రాజేష్ మాట్లాడుతూ– ‘‘మాస్ ఎంటర్టైనర్ చిత్రమిది. శివకార్తికేయన్‌తో మేం తీసిన ‘శక్తి’ హిట్ అయి, మంచి లాభాలు తీసుకొచ్చింది. ‘డాక్టర్’ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఇందులో డాక్టర్ వరుణ్ పాత్రలో శివకార్తికేయన్ నవరసాలు చూపించారు. ఎన్నో ఒడిదొడుకుల తర్వాత మా చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నెల్సన్. -
తండ్రైన తమిళ స్టార్.. భార్యకు కన్నీటితో థ్యాంక్స్
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య ఆర్తి సోమవారం (జూలై 12న) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శివకార్తికేయన్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. "18 ఏళ్ల తర్వాత ఈ రోజు మా నాన్న నా చేయి పట్టుకున్నాడు, అది కూడా నా కొడుకు రూపంలో. ఎన్నో ఏళ్ల నుంచి మోస్తూ వస్తున్న బాధను నా భార్య నేడు పోగొట్టింది. ఆమెకు కన్నీటితో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు" అని ట్వీట్ చేశాడు. దీనికి తండ్రి ఫొటో ముందు తన చేయిని అప్పుడే పుట్టిన బాబు పట్టుకుని ఉండగా క్లిక్‌మనిపించిన ఫొటోను జత చేశాడు. ఇది చూసిన అభిమానులు కుట్టి శివకార్తికేయన్ వచ్చేశాడోచ్ అంటూ #KUTTYSK అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. శివకార్తికేయన్, ఆర్తి దంపతులకు 2013లో ఆరాధన అనే కూతురు జన్మించింది. పాప పుట్టిన ఎనిమిదేళ్ల తర్వాత కొడుకు జన్మించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక సినిమాల విషయానికి వస్తే శివకార్తికేయన్ ప్రస్తుతం 'డాన్' సినిమా చేస్తున్నాడు. అతడు హీరోగా నటించిన 'డాక్టర్' సినిమా త్వరలోనే థియేటర్లో లేదా ఓటీటీలో రిలీజ్ కానుంది. 18 வருடங்களுக்குப் பிறகு இன்று என் அப்பா என் விரல் பிடித்திருக்கிறார் என் மகனாக…என் பல வருட வலி போக்க தன் உயிர்வலி தாங்கிய என் மனைவி ஆர்த்திக்கு கண்ணீர்த்துளிகளால் நன்றி🙏 அம்மாவும் குழந்தையும் நலம்🙏👍❤️😊 pic.twitter.com/oETC9bh6dQ— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 12, 2021 -
'డాక్టర్' మూవీ దారెటు? థియేటర్? లేదా ఓటీటీ?
Sivakarthikeyan: కరోనా కారణంగా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా, జనాలు గడప దాటి అక్కడివరకు వస్తారన్న నమ్మకం కూడా కనిపించడం లేదు. పైగా థియేటర్లో రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ఓటీటీ ట్రాక్ ఎక్కుతుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు ఆశగా చూస్తున్నారు. కొన్ని సినిమాలైతే నేరుగా ఓటీటీలో రిలీజై మంచి హిట్లు సాధించాయి. అలా తాజాగా తమిళ చిత్రం డాక్టర్ కూడా ఓటీటీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హాట్‌స్టార్ మంచి రేటుకు తీసుకున్నట్లు సమాచారం. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా మెప్పించింది. ప్రస్తుతం శివకార్తికేయన్.. విజయ్ హీరోగా బీస్ట్ చిత్రం చేస్తున్నాడు. చదవండి: Mandira Bedi: వీకెండ్లో భార్య, స్నేహితులతో రాజ్ కౌశల్ సందడి -
పేద విద్యార్థి కల నెరవేర్చిన శివకార్తికేయన్
తమిళ సినిమా: పేద విద్యార్థి డాక్టర్ కలను నటుడు శివకార్తికేయన్ సాకారం చేశారు. తంజావూర్ జిల్లా, పేరావురణి సమీపంలోని పూకొల్లై ప్రాంతానికి చెందిన దంపతులు గణేషన్, చిత్ర కార్మికులు. ఈ దంపతులకు కూతురు సహానా పేరావురణి ప్రభుత్వ బాలల ఉన్నత విద్యాలయంలో ప్లస్‌టూ చదువుకుంది. వీధిలైట్ల కాంతిలో చదువుకున్న సహానా పరీక్షల్లో 600లకు 524 మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందింది. గజ తుపాన్ కారణంగా ఇల్లు కూలిపోవడంతో వీధి లైట్ల వెలుతురులో చదువుకొని ప్లస్‌టూలో అత్యధిక మార్కులు సాధించింది. దీంతో సహానా డాక్టర్ అవ్వాలని కలలు కంది. ఈమె గురించి గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ఒక తమిళ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. అది చూసిన తంజావూర్ కలెక్టర్ అన్నాదురై ఆమె ఇంటికి వెళ్లి రెండు సోలార్ లైట్లను కొనిఇచ్చి, ఇతర ఖర్చులు రూ.10 వేలు సాయం చేశారు. ఈ విషయం శివకార్తికేయన్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే తంజావూరులోని ప్రైవేట్ నీట్ కళాశాలలో శిక్షణ పొందడానికి సహానాకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో సహానా 273 మార్కులను తెచ్చుకొని తిరుచ్చిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరింది. (శశికళ ఆశలు అడియాశలు..!) ఈ సందర్భంగా వైద్య విద్యార్థి సహానా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ కావాలన్న తన కల కు పలువురు ప్రాణం పోశారని పేర్కొంది. ముఖ్యంగా నటుడు శివకార్తికేయన్ సాయంతోనే తన డాక్టర్ కల నెరవేరిందని చెప్పింది. ఆయన తన వైద్యవిద్యకు అయ్యే ఖర్చు అంతా భరిస్తానని చెప్పారని తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి 7.5 శాతం రిజర్వేషన్ కల్పించడం కూడా తన డాక్టర్ కల సాకారానికి కారణమని సహానా పేర్కొంది. -
క్యాన్సర్‌తో కమెడియన్.. చేయూతనిచ్చిన హీరోలు
తమిళనాడు: తన కామెడితో తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు తవసి కొంతకాలంగా మాయదారి మహమ్మారితో బాధపడుతున్నారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయనకు క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆయన బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనందగా మారిపోయారు. దీంతో ఆయన చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ తవసి కుమారుడు అరుముగన్ కోలీవుడ్ పెద్దలను ఆర్జించాడు. దీంతో ఆయనను ఆర్థికంగా ఆదుకునేందుకు తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, సూరిలతో పాటు మరికొంత మంది పరిశ్రమ పెద్దలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్ అసోయేషన్తో రూ. 25వేల చెక్‌ను తవసి కుటుంబానికి అందించినట్లు సమాచారం. (చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్) అంతేగాక విజయ్ సేతుపతి, తన స్నేహితుడైన సుందర్ రాజ్‌తో కలిసి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. అయితే ఇందులో సుందర్ రాజ్ తన వంతుగా పది వేలు ఇవ్వగా.. నటుడు సూరి నిత్యవసర సరుకులు అందించారు. ఇక ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ ఇప్పటి తవసికి వైద్య ఖర్చులను చూసుకున్నట్లు సమాచారం. అయితే స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్న తవసి ప్రస్తుతం ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో అయనకు పైపు ద్వారా పళ్ల రసాలను ఆహారంగా ఇస్తున్నారు. కాగా తవసి ‘సువరాపాండియన్’, ‘వరుతాపాధ వాలిబార్ సంగం’, ‘రజిని మురుగన్’ తదితర చిత్రాల్లో సహా నటుడిగా నటించి నటుడిగా గుర్తింపు పొందారు. (చదవండి: ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం..) -
తప్పుడు వార్తలపై రకుల్ గరం
సౌతిండియన్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. గతంలో మెడికల్ షాప్‌కు వెళ్లగా, మద్యం దుకాణానికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై చాలా కూల్‌గా సమాధానం ఇచ్చారు రకుల్. అయితే ప్రస్తుతం తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, రకుల్ జంటగా తమిళంలో ‘అయాలన్’ అనే చిత్రం రూపొందుతోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొంత వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. (‘అప్పటి నుంచే ఆ అలవాటు ఉంది’) అయితే ఇప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలకు రకుల్ ఝలక్ ఇచ్చిందని, కరోనా కారణంగా షూటింగ్లలో పాల్గొనని చెప్పడంతో ఆమెను చిత్రం నుంచి తప్పించారనే వార్తలు తమిళ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై రకుల్ మండిపడ్డారు. 'బాధ్యతాయుతమైన జర్నలిజం మనకు ఎప్పుడు వస్తుంది? వాస్తవాలను చెక్ చేసుకుని రాయడం అన్నది మీడియా ఎప్పుడు ప్రారంభిస్తుంది? నాకూ షూటింగ్ చేయాలనే వుంది. అసలు ఎవరు ఎక్కడ షూటింగులు జరుపుతున్నారో చెప్పండి?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వార్తలపై చిత్ర దర్శకుడు రవికుమార్ కూడా స్పందించారు. రకుల్‌ను తమ సినిమా నుంచి తీసేశారనే వార్త అవాస్తమని కొట్టిపారేశాడు. (‘నిన్నే పెళ్లాడతా’ సాంగ్: మంచు లక్ష్మి ట్వీట్) When will we have responsible journalism. When will media start checking facts . 😂 stooping so low just for some extra hits 🤷♀️ plz tell me who is starting shoot and where @BOWorldwide cos I am dying to work 🤣 https://t.co/41YPxWAcYX — Rakul Singh (@Rakulpreet) June 26, 2020 Thankyou so much for the kind words 🙏🏻🙏🏻yessss can’t wait to start shoot soon 💪🏻💪🏻 https://t.co/ceLigQztbP — Rakul Singh (@Rakulpreet) June 26, 2020 -
విద్యా వ్యవస్థను ప్రశ్నించే ‘శక్తి’
టీవీలో వీడియో జాకీ(వీజే)గా కెరీర్ స్టార్ట్ చేసి, అతి తక్కువ సమయంలో క్రేజీ స్టార్‌గా ఎదిగిన తమిళ హీరో శివ కార్తికేయన్. తమిళనాట సూపర్ ఫాలోయింగ్ ఉన్న అతను 'రెమో', 'సీమ రాజా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడిగా మారాడు. ఆయన తాజాగా నటించిన సినిమా 'హీరో'. తమిళనాడులో గతేడాది డిసెంబర్లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని నిర్మాత కోటపాడి జె.రాజేష్ 'శక్తి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైనెమెంట్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. 'అభిమన్యుడు' దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ 'శక్తి'కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణీ ప్రియదర్శన్ కథానాయిక. విద్యావ్యవస్థ మీద సినిమా అంటే ఆ చిత్రమే గుర్తొస్తుంది నిర్మాత కోటపాడి జె.రాజేష్ మాట్లాడుతూ "సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రజల్లో ప్రస్తుత విద్యావ్యవస్థ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో తీశాం. తమిళనాడులో విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలను. మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కరెంట్ సినారియో గురించి చర్చించిన సినిమా 'శక్తి'. ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సినిమా అంటే 'జెంటిల్మెన్' గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థను సరిచేయడానికి 'జెంటిల్మెన్' వస్తే 'శక్తి'లా ఉంటాడు. 'అభిమన్యుడు'లో బ్యాంక్ మోసాల గురించి చర్చించారు. ఈ సినిమాలో విద్యావ్యవస్థ గురించి చర్చించారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ భిన్నమైన పాత్ర చేశారు. అతనీ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు అర్జున్ ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్.. ఆయన సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ దక్షిణాది సినిమాకు కొత్త అయినప్పటికీ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రివ్యూల్లో ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగులో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకని, ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్నాం. ఈ నెల 22 నుంచి తెలంగాణలో థియేటర్లు రీ ఓపెన్ అవుతాయని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో ఓ సినిమా, సంతానం హీరోగా మరో సినిమా చేస్తున్నాం. మా నిర్మాణ సంస్థలో మరో రెండు సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మంచి కథ వస్తే తెలుగులోనూ సినిమా చేయాలని చూస్తున్నాం" అన్నారు. ఈ చిత్రానికి రచన: పి.యస్.మిత్రన్, పార్తిబన్, సవారి ముత్తు, ఆంటోనీ భాగ్యరాజ్, సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: జార్జి.సి.విలియమ్స్, ఎడిటింగ్: రూబెన్, మాటలు: రాజేష్ ఎ మూర్తి, పాటలు : రాజశ్రీ సుధాకర్. -
‘సిస్టమ్‌ను మార్చడానికి హీరో కావాలి’
కౌసల్యాకృష్ణమూర్తి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘హీరో’. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘శక్తి.. ది సూపర్ హీరో’ పేరుతో విడుదల చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. యాక్షన్, ఎమోషన్, డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలతో సాగే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చదువు ప్రాముఖ్యత చెప్తూ, విద్య పేరుతో జరిగే వ్యాపారం నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'చదువుతో వ్యాపారం చేసేవాడిని కాదు .. చదువుకున్న వాళ్లతో వ్యాపారం చేసేవాడిని'. 'స్వయంగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడూ సూపర్ హీరోనే', ‘మన విద్యావిధానంలో అందరు చదువుకోవచ్చు కానీ అందరు సాధించలేరు. ఈ సిస్టమ్‌ను మార్చడానికి ఒక కామన్ మ్యాన్‌గా ఉండే సరిపోడు.. ఒక హీరో కావాలి’, ‘ఒక మనిషిని నాశనం చేయవచ్చు.. వాడి శిలా విగ్రహాన్ని నాశనం చేయవచ్చు.. కానీ వాడి ఐడియాలను, ఐడియాలజీస్ని ఎవడూ నాశనం చేయలేదు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంఈ నెల 20న సినిమా విడుదల కానుంది. -
హీరోకు టైమ్ ఫిక్స్
‘హీరో’కు టైమ్ ఫిక్స్ చేశారు. నటుడు శివకార్తికేయన్‌కు అర్జెంట్‌గా ఒక హిట్ అవసరం. ఆయన ఇటీవల నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను అందుకోలేదు. ముఖ్యంగా ఇటీవల నయనతారతో కలిసి నటించిన మిస్టర్ లోకల్ చాలా నిరాశ పరిచింది. ఎంత స్టార్ వ్యాల్యూ ఉన్నా కథలో విషయం లేకపోతే ప్రేక్షకులు తిరష్కరిస్తారనడానికి ఈ చిత్రం ఒక నిదర్శనం. అయితే శివకార్తికేయన్ నిర్మాతగా హ్యాపీగానే ఉన్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాలలో హీరో ఒకటి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం విశాల్ కథానాయకుడిగా ఇరుంబుతిరై వంటి సంచలన విజయాన్ని సాధించిన చిత్ర దర్శకుడు మిత్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం హీరో. నటుడు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి కల్యాణి ప్రియదర్శన్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా తరువాత దుల్కర్‌సల్మాన్‌తో వాన్, శింబు సరసన మానాడు చిత్రాల్లో నటించడానికి ఓకె చెప్పారు కల్యాణీ. కాగా హీరో చిత్రంలో మరో నాయకిగా ఇవనా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, రోబోశంకర్, ప్రేమ్‌కుమార్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రాన్ని కేజీఆర్ స్టూడియోస్ కోట్టపాటి జే.రాజేశ్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా చిత్రకరణ దశలో ఉంది. తాజాగా చిత్ర నిర్మాతలు హీరో చిత్ర విడుదల తేదీని వెల్లడించారు. చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. హీరో చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపారు. దీంతో నటుడు శివకార్తికేయన్ హీరో చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. దీని తరువాత పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో అనుఇమాన్యుల్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
స్నేహితుల కోసమే!
నెంజముందు నేర్మైయుండు ఓడు రాజా చిత్రాన్ని స్నేహితుల కోసమే నిర్మించినట్లు నటుడు శివకార్తికేయన్ పేర్కొన్నారు. హీరోగా బిజీగా ఉన్న ఈయన ఎస్కే.ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం చేపట్టి తొలి ప్రయత్నంగా కనా చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అయ్యారు. ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటి ఐశ్వర్యరాజేశ్ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల నాయకి గా దూసుకుపోతున్నారు . ఆ చిత్రం ద్వారా తన చిరకాల మిత్రుడు అరుణ్రాజా కామరాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. కాగా మలి ప్రయత్నంగా నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రాన్ని నిర్మించారు. ఇందులో తన స్నేహితులైన యూ ట్యూబ్ టీమ్‌ను వెండితెరకు పరిచయం చేశారు. బుల్లితెర నటుడు రియోను హీరోగా పరిచయం చేశారు. షిరిన్ కంచ్వాలా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఆర్జే.విఘ్నేశ్, రాధారవి, నాంజిల్ సంపత్ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ వేణుగోపాల్ దర్శకత్వం వహించాడు. షబ్బీర్ సంగీతం, యుకే.సెంథిల్‌కుమార్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం జూన్ 14న విడుదలై మంచి ప్రేక్షకాదరణను పొందింది. దీంతో చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఓ హోటల్లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివకార్తికేయన్ మాట్లాడుతూ.. నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందడం సంతోషాన్నిచ్చిందన్నారు. తన స్నేహితులను ప్రోత్సహించేందుకే ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలిపారు. చిత్రం విడుదలైన తరువాత తామంతా థియేటర్లకు వెళ్లి అక్కడ ప్రేక్షకుల స్పందనను చూసి చాలా ఆనందించామన్నారు. చిత్రం చూసిన నటుడు రియో తండ్రి బాగుందంటూ కొడుకుని కౌగిలించుకున్నప్పుడు ఆయన కంటి నుంచి ఆనంద భాష్పాలు కురిశాయన్నారు. అప్పుడు తనకు తన తండ్రి కళ్ల ముందు నిలిచారని శివకార్తికేయన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తన నిర్మాణంలో వాళ్ అనే చిత్రం రూపొందుతోందని వెల్లడించారు. -
హ్యాండిచ్చిన రష్మిక!
ప్రతిభ కంటే ముఖ్యంగా సినీరంగంలో హీరోయిన్లకు లక్ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రతిభ ఉండీ పైకి రానివారెందరో ఉన్నారు. అయితే ఇక్కడ విజయాలే కొలమానం. వాటిని అందుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఆ తరువాతనే పని, ప్రతిభ. అందుకే ఏ హీరో, హీరోయిన్ అయినా, దర్శకుడైనా మొదట్లో ఒక్క అవకాశం అంటూ ఎక్కే మెట్లు, దిగే మెట్లు అంటూ చెప్పులరిగేలా నిర్మాణ సంస్థల కార్యాలయాలకు తిరుగుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నటి రష్మిక మందన్న కోలీవుడ్‌లో ఒక చిత్రంలో నటించడానికి సమ్మతించి తరువాత సారీ అనేశారట. ఇదే ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్న న్యూస్. రష్మిక శాండిల్‌వుడ్‌కు చెందిన నటి. మాతృభాషలో కథానాయకిగా కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అయితే ప్రేమ, బ్రేక్ అప్ లాంటి అంశాలతో బాగానే వార్తల్లో నానింది. అలాంటిది టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం గీతాగోవిందం ఈ అమ్మడి తలరాతను ఒక్కసారిగా మార్చేసింది. ప్రస్తుతం అక్కడ క్రేజీ హీరోయిన్. ఏకంగా విజయ్‌తో నటిస్తుందనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే అలాంటివి వదంతులకే పరిమితం అయినా, తాజాగా కార్తీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో స్టార్ హీరో శివకార్తికేయన్‌తో నటించడానికి అంగీకరించారని సమాచారం. దర్శకుడు విఘ్నేశ్ శివన్, నటుడు శివకార్తికేయన్‌ల కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీస్ కియారా, శ్రద్ధాకపూర్లలో ఒకరిని ఎంపిక చేయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఫైనల్‌గా రష్మికను ఎంపిక చేశారట. శివకార్తికేయన్‌తో నటించడానికి అంగీకరించిన రష్మిక ఆ తరువాత సారీ చెప్పి వైదొలగినట్లు టాక్ వైరల్ అవుతోందిప్పుడు. తాజాగా తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో నటించే అవకాశం రావడంతో, శివకార్తికేయన్ చిత్రానికి కాల్షీట్స్ సమస్య తలెత్తడంతో టాటా చె ప్పేసినట్లు సమాచారం. సరే తెలుగులో పెద్ద అవకాశం రావడంతో కోలీవుడ్‌లో శివకార్తికేయన్‌తో నటించే అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధం అయ్యిందనుకుందాం. అయితే ఈ అమ్మడు చెప్పే కారణం ఏమిటో తెలుసా? శివకార్తికేయన్ చిత్రంలో తన పాత్రకు ఎక్కువ స్కోప్ లేకపోవడంతోనే ఆ చిత్రాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారట. -
శివకార్తికేయన్‌తో సై అంటారా?
శివకార్తికేయన్ కన్ను మరోసారి బాలీవుడ్ బ్యూటీస్‌పై పడిందా? ఇందుకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇటీవల నటించిన సీమరాజా, మిస్టర్ లోకల్ చిత్రాలు నిరాశపరిచాయి. అయినా మళ్లీ విజయాన్ని అందుకుంటాననే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులేస్తున్నానని శివకార్తికేయన్ ఇటీవల పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఈయన రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక తాను నిర్మించిన నెంజముండు నేర్మై యుండు ఓడు రాజా చిత్రం ఈ నెల 24న తెరపైకి రానుంది. తన నిర్మాణ సంస్థలో మరో చిత్రానికి కూడా రెడీ అయ్యిపోయారు. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి శివకార్తికేయన్ ఇప్పటికే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. దీన్ని లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలను కడుతున్నారు. ఇంతకు ముందు విఘ్నేశ్‌శివన్ తెరకెక్కించిన నానుమ్ రౌడీదాన్, తానా సేర్నద కూటం చిత్రాలకు అనిరుదే సంగీతాన్ని అందించాడు. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మూవీలో శివకార్తికేయన్‌కు జంటగా నటి నయనతారనే నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ కన్ను ముంబై బ్యూటీస్‌పై పడిందని సమాచారం. తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న అలియాభట్‌ను శివ కార్తికేయన్ సరసన నటింపజేసే పనిలో ఉన్నారట. ఒక వేళ ఆ అమ్మడు కాకపోతే కియారా అద్వానిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్లో శివకార్తికేయన్‌తో జత కట్టడానికి సై అనే బ్యూటీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. మరో విషయం ఏమిటంటే అలియాభట్ గానీ, కియారా అద్వాని గానీ ఇప్పటి వరకూ కోలీవుడ్‌లో పరిచయం కాలేదు. అలాంటిది శివకార్తికేయన్ సరసన కోలీవుడ్ ఎంట్రీకి వీరు సుముఖత చూపిస్తారా లేదా అన్నది చూడాలి. -
వినోదభరితంగా మిస్టర్ లోకల్
మిస్టర్ లోకల్ చిత్రం వినోదమే ప్రధానంగా ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ తెలిపారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞావేల్‌రాజా నిర్మించిన చిత్రం మిస్టర్‌లోకల్. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి రాజేశ్.ఎం దర్శకుడు. హిప్ ఆప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు రాజేశ్.ఎం మాట్లాడుతూ శివకార్తికేయన్ హీరోగా స్టూడియోగ్రీన్ పతాకంపై చిత్రం చేయడం నిశ్చయం అయినప్పుడు తనకు మంచి విజయవంతమైన చిత్రం ఇవ్వాలని నిర్మాత జ్ఞానవేల్‌రాజా కోరారన్నారు. ఇక నటుడు శివకార్తికేయన్ మద్యం తాగే సన్నివేశాలు, అలాంటి పాటల సన్నివేశాలు, మహిళలను కించపరచే అంశాలు లాంటివి లేకుండా వినోదాత్మక చిత్రం కావాలని అడిగారన్నారు. దీంతో అలాంటివేవీ ఈ మిస్టర్ లోకల్ చిత్రంలో ఉండవని చెప్పారు. కుటుంబ సమేతంగా చూసి ఆనందించే క్లీన్ ఎంటర్టెయినర్ గా మిస్టర్ లోకల్ ఉంటుందని తెలిపారు. చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ ఇది చాలా సింపుల్ కథాంశంతో కూడిన కాలక్షేప చిత్రంగా ఉంటుందని తెలిపారు. టీవీ రంగంలో ఉండగానే దర్శకుడు రాజేశ్‌తో కలిసి పనిచేయాలని ఆశ పడ్డానన్నారు. ఆయన తెరకెక్కించిన ఎస్ఎంఎస్ చిత్రంలో తానూ ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పానని అన్నారు. ఇక రాజేశ్ సెట్ చేసి ఇచ్చిన చిత్రమే వరుత్తపడాద వాలిభర్ సంఘం అని తెలిపారు. అది తన కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. నయనతారతో రెండవసారి కలిసి నటించిన చిత్రం మిస్టర్ లోకల్ అని తెలిపారు. ఇంతకు ముందు వేలైక్కారన్ చిత్రంలో కలిసి నటించామని, అయితే ఆ చిత్రంలో ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయిందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నయనతార చిత్రం అంతా ఉంటారని తెలిపారు. ఇకపై ఆరు నెలలకొకసారి మంచి మంచి చిత్రాలతో మిమ్మల్ని కలుస్తానని శివకార్తికేయన్ చెప్పారు. -
మళ్లీ పిలుపొచ్చింది
కోలీవుడ్ నుంచి హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌కి మళ్లీ కబురొచ్చింది. రెండేళ్ల క్రితం విశాల్ ‘తుప్పరివాలన్ (2017)’లో నటించిన అనూ ఇప్పుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా నటించనున్నారు. ‘అజ్ఞాతవాసి (2018), నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018), శైలజారెడ్డి అల్లుడు’ (2018) చిత్రాల్లో నటించిన అనూ ఇమ్యాన్యుయేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తర్వాత తెలుగులో వేరే సినిమాలు సైన్ చేయలేదీ బ్యూటీ. అయితే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా అంగీకరించారామె. ఇందులో ఐశ్వర్యా రాజేష్ మరో హీరోయిన్గా నటిస్తారు. భారతీరాజా, సముద్రఖని, నటరాజన్, ఆర్కే సురేశ్, యోగిబాబు, సూరి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తారు. రూరల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
ఓట్లేసిన తారలకు పాట్లు
పెరంబూరు: ఓట్లేసిన తారలు కొందరు ఇప్పుడు పాట్లకు గురవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు దాదాపుగా ప్రశాంతంగా జరిగాయనుకుంటున్న సమయంలో కొందరు ఓట్లేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో నటుడు శివకార్తికేయన్, అజిత్, శ్రీకాంత్ వంటి వారి ఓటు హక్కును వినియోగించుకున్న విధానం విమర్శలకు తావిచ్చింది. దీంతో కొందరు పోలింగ్ అధికారులకు వేటు పడే అవకాశం ఏర్పడనుంది. నటుడు శివకార్తికేయన్ పేరు ఓటరు పట్టికలో లేకపోయినా ఆయన్ని ఓటు వేయడానికి అధికారులు అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా మరో నటుడు శ్రీకాంత్ ఓటు వేయడంపైనా ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రతసాహూ అధికారులను వివరణ కోరారు. వారిపై ఎన్నికల శాఖ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఇక ప్రముఖ నటుడు అజిత్ వరుసలో నిలబడ కుండా నేరుగా బూత్ వద్దకు వెళ్లి ఓటు వేయడం పైనా విమర్శలు వస్తున్నాయి. దీనిపైనా విచారణ జరుపుతామని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.అంతే కాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో జయాపజయాలను ఒక్క ఓటు నిర్ణయంచే పరిస్ధితి సంభవిస్తే వీరి ఓట్లను పరిగణలోకి తీసుకోవడం జరగదని పేర్కొన్నారు. కాగా తన ఓటు హక్కును వినియోగించుకోవడం గురించి నటుడు శ్రీకాంత్ వివరణ ఇస్తూ ఎన్నికల నిర్వాహకులు ఆక్షేపణ లేదని చెప్పడంతోనే స్థానిక సాలిగ్రామంలోని కావేరి పోలీంగ్ బూత్‌లో తాను ఓటు వేసినట్లు తెలిపారు. తన ఆధార్ కార్డులో నూతన ఇంటి చిరునామా ఉండటం వల్లే తన పేరు లేక్ ఏరియా ఓటరు పట్టికలోకి మారిందని, ఈ విషయం గురించి నిర్వాహకులెవరూ వివరించలేదని అన్నారు. ఇలాంటి విషయాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా నటుడు అజిత్,తన భార్య శాలినితో కలిసి పోలింగ్ బూత్‌కు కారులో వచ్చారు. దీంతో వారు వచ్చిన విషయం తెలిసి అక్కడ ఉన్న జనం కారును చుట్టు ముట్టారు.అందువల్ల అజిత్ శాలిని దంపతులు కిందకు దిగకుండా కారులోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు వచ్చి అజిత్,శాలినిలను పోలీంగ్ బూత్ వద్దకు తీసుకెళ్లారు. ఇది విమర్శలకు దారి తీసింది. నటులకో విధానం, సామాన్య ప్రజలకు మరో విధానమా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపైనా ఎన్నికల ప్రధాన అధికారి వివరణ కోరినట్లు తెలిపారు.ఈ వ్యహారం చూస్తుంటే ఎంకి పెళ్లి సుబ్బు చావు కొచ్చినట్లు, ఎన్నికల నిర్వాహకులు చర్యలకు గురైయ్యే పరిస్థితి నెలకొంది. ఇక నటులు ఇవేం పాట్లురా బాబూ అని తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. -
నేనెవరికీ భయపడను!
నేనెవరికీ భయపడను అంటున్నాడు నటుడు శివకార్తికేయన్. వరుత్తపడాదవాలిభర్‌సంఘం నుంచి వేలైక్కారన్ వరకూ వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ఆయన. తాజాగా శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం సీమరాజా. రెమో, వేలైక్కారన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన 24 ఏఎం.స్టూడియోస్ అధినేత ఆర్డీ.రాజా నిర్మించిన చిత్రం సీమరాజా. నటి సమంత హీరోయిన్గా నటించిన ఇందులో నటి సిమ్రాన్ నెగిటివ్ పాత్రలో నటించడం విశేషం. పొన్రాం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియోను ఇటీవలే మదురైలో ఆవిష్కరించారు. చిత్ర పాటలకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా నటి సమంత మాట్లాడుతూ తాను నటించిన ప్రతి చిత్ర విడుదల సమయంలో కొంచెం దడ పుడుతుందన్నారు. అయితే ఈ సీమరాజా చిత్ర విషయంలో ఎలాంటి భయం అనిపించడం లేదన్నారు. ఎందుకంటే ఈ చిత్ర విజయాన్ని ముందే రాసి పెట్టినట్లు సమంత పేర్కొన్నారు. చిత్ర హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ సీమరాజా చిత్ర ట్రైలర్‌లోని మూడు షాట్స్ చూసి సామాజిక మాధ్యమాల్లో బాహుబలి స్థాయిలో ఉందనే ప్రశంసలు రావడం చిత్ర యూనిట్ శ్రమ, ఖుషికి దక్కిన ఘనతగా భావిస్తున్నామన్నారు. చిత్రాన్ని వినాయక చతుర్ధశి సందర్భంగా విడుదల చేయాలని ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని, అయితే చిత్ర పరిశ్రమ బంధ్ వంటి సంఘటనలను ఆటంకంగా మారి, చిత్రాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయగలగడంతో చిత్ర యూనిట్‌కు అభినందనలు అన్నారు. తాను ఇందులో తమిళ రాజాగా నటించడం గర్వంగా ఉందన్నారు. రజనీ మురుగన్ చిత్ర నిర్మాణ సమయంలోనే తాను దర్శకుడు పొన్రామ్ ఈ చిత్ర కథ గురించి చర్చించుకున్నామన్నారు. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలు పిల్లలను అలరించే విధంగా ఎలాంటి హింసాత్మకం లేకుండా జాగ్రత్తపడినట్లు తెలిపారు. చిత్రంలో హాస్య సన్నివేశాలు చాలానే ఉన్నాయన్నారు. మరో విషయం ఏమిటంటే తానెవరినీ పోటీగా భావించడం లేదని, ఎవరిని చూసీ భయపడటం లేదని, అదే సమయంలో ఆసూయ పడడం లేదని అన్నారు. తన తదుపరి చిత్రం ఏమిటన్న విషయం దాని గురించే తన పయ నం సాగుతుందని శివకార్తికేయన్ పేర్కొన్నారు. -
నిర్మాతగా శివకార్తికేయన్
తమిళసినిమా: కథానాయకుడిగా విజయ పథంలో దూసుకుపోతున్న శివకార్తికేయన్ తాజాగా నిర్మాత అవతారమెత్తారు. తన మిత్రుడు అరుణ్రాజా కామరాజ్‌కు దర్శకుడిగా అవకాశం ఇస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈయన కబాలి చిత్రంలోని నెరుప్పుడా పాటతో గీత రచయితగా మంచి గుర్తుంపు తెచుకున్నారన్నది గమనార్హం. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఇందులో సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఆయనకు కూతురిగా ఐశ్వర్యారాజేశ్ నటిస్తున్నారు. ఇది క్రికెట్ క్రీడలో కూతురిని ప్రోత్సహించే తండ్రి ఇతి వృత్తంతో రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శివకార్తికేయన్ చిత్ర వివరాలను తెలుపుతూ తనకు పేరు ప్రఖ్యాతులు అందించింది సినీ రంగమేనన్నారు. ఇక్కడ సాధించాలన్న కలలతో తిరుగుతున్నప్పుడు తనతో ఉన్న తన మిత్రుల కలలను అర్థం చేసుకోవడం తన బాధ్యతగా భావించానని అన్నారు. అరుణ్రాజా కామరాజ్ కథను చెప్పినప్పుడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను చాలా ఉద్వేగానికి లోనయ్యానన్నారు. ఇందులో సత్యరాజ్ తండ్రిగా, ఐశ్యర్యారాజేశ్ ఆయన కూతురిగా నటిస్తున్నారని చెప్పారు. మరో ముఖ్య పాత్రలో నటించడానికి ఒక అందమైన నటుడు అవసరం అయ్యారని, ఆ పాత్రను తన సన్నిహితుడు దర్శన్ పోషిస్తున్నారని తెలిపారు. దీపు నీణన్ థామస్ సంగీతం, ధినేశ్ కృష్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారని చెప్పారు. సంగీతదర్శకుడు దీపు నీణన్, ఈ చిత్ర దర్శకుడు అరుణ్రాజా కామారాజ్, తాను ఒకే కళాశాల్లో చదువుకున్నామని, ముగ్గురిదీ ఒకే ఊరు అనీ అందుకే ఈ చిత్రాన్ని తిరుచ్చి జిల్లాలోని లాల్‌కుడి గ్రామంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించామని శివకార్తీకేయన్ వివరించారు. -
ఆరోజు నయన్‌కు స్పెషల్ అవుతుందా?
సాక్షి, చెన్నై : మంచి అంచనాలు ఉన్న చిత్రాల్లో వేల్లైక్కారన్ ఒకటని చెప్పవచ్చు. కారణం.. వరుస విజయాల జోరు మీదున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. రెమో వంటి సెన్సేషనల్ సక్సెస్‌పుల్ చిత్ర నిర్మాణ సంస్థ 24ఏఎం ఫిలింస్ అధినేత ఆర్డీ.రాజా నిర్మిస్తున్న నూతన చిత్రం వేల్లైక్కారన్. అదే విధంగా తనీఒరువన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న మూవీ ఇదే. ఇక అన్నింటికీ మించి స్టార్ హీరోయిన్ నయనతార నాయకిగా నటిస్తున్న చిత్రం వేల్లైక్కారన్. ఇంకా నటి స్నేహా, ఫాహద్ పాజిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబరు నెలలోనే విడుదల కావలసిన ఈ చిత్రం నిర్మాణంలో జాప్యం కారణంగా వాయిదా పడింది. అయితే ఇటీవల చిత్ర నిర్మాత చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసి పసందైన విందునిచ్చారు. అందులో నటి నయనతార పాల్గొనడం విశేషం. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మాత డిసెంబరు 3వ తేదీన గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు నయనతార కూడా పాల్గొనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని నయనతార వేల్లైక్కారన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటుందా? అన్న సందేహం కలగక మానదు. అప్పుడెప్పుడో నటుడు ఆర్య చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీని ఆ తరువాత ఎలాంటి వేడుకలోనూ చూడలేదు. అలాంటిది వేలైక్కారన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని స్పెషల్ చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. -
శివకార్తికేయన్ సినిమా స్టిల్స్
-
నయన బాధపడ్డారట!
తమిళసినిమా: చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు ఒక్కోసారి మనస్తాపానికి గురవుతుండడం జరుగుతుంటుంది. అందుకు వివిధ కారణాలు ఉండవచ్చు. నటి నయనతార అలాంటి మనస్తాపానికి గురయ్యారట. ఈ విషయాన్ని యువ దర్శకుడు మోహన్‌రాజా స్వయంగా తెలిపారు. కోలీవుడ్‌లో నంబర్‌వన్ కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ఆమె కాల్షీట్స్ కోసం కొత్త దర్శకుల నుంచి ప్రముఖ దర్శకుల వరకూ క్యూలో నిలబడుతున్న పరిస్థితి. అలాంటిది నయనతార మనస్తాపానికి గురవడం ఏమిటనేగా మీ ఆసక్తి. నటుడు జయంరవికి జంటగా ఈ బ్యూటీ తనీఒరువన్ చిత్రంలో నటించిన సంగతి, మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఆ చిత్రం సంచలన విజయం సా«ధించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రంలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని నయనతార మనస్తాపం చెందారట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తాజాగా అదే దర్శకుడి తాజా చిత్రం వేలైక్కారన్లో నటిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్ కథానాయకుడు. 24 ఫిలింస్ స్టూడియో పతాకంపై ఆర్డీ.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 9వ తేదీన వేలైక్కాన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇప్పటికే వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్‌రాజా వేలైక్కారన్ గురించి చెబుతూ పరిస్థితులకనుగుణంగా నువ్వు మారవద్దు. నీకు తగ్గట్టుగా పరిస్థితులను మార్చుకో. ఇది ఈ చిత్ర వన్‌లైన్ స్టోరీ అని తెలిపారు. తనీఒరువన్ చిత్రంలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని మనస్తాపంగా నయనతార ఉందన్నారు. అయితే వేలైక్కారన్ చిత్రంలో ఆమెది చాలా బలమైన పాత్ర అని చెప్పారు. దీంతో తాను ఇంతకు ముందు తప్పుగా భావించానని నయనతార పెద్ద మనసుతో తనతో అన్నారని దర్శకుడు మోహన్‌రాజా ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఆ ఇద్దరి చిత్రం ఎప్పుడు?
శివకార్తికేయన్, నయనతార తొలిసారిగా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి వేలైకారన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు రజనీకాంత్, అమలా జంటగా నటించిన సూపర్‌హిట్ చిత్రం వచ్చిందన్నది గమనార్హం. కాగా ఈ తాజా వేలైకారన్ చిత్రాన్ని మోహన్‌రాజా దర్శకత్వంలో 24 స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కారణం శివకార్తికేయన్, నయనతారల కాంబినేషన్ ఒకటి కాగా శివకార్తికేయన్ రెమో వంటి సంచలన విజయం సాధించిన తరువాత నటిస్తున్న చిత్రం కావడం మరో కారణం. ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాత తాజాగా వెల్లడించిన విషయం ఏమిటంటే వేలైకారన్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందని చెప్పారు. మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. బయ్యర్ల కోరిక మేరకు వేలైకారన్ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇక చిత్ర ఫస్ట్‌లుక్‌ను జూన్ నెల 5వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. -
టార్గెట్ @10
ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళలు బరువు పెరగడం సహజమే. నటి స్నేహ కూడా బరువు పెరిగారు. తర్వాత కాస్త బరువు తగ్గారు కూడా. ఇప్పుడు ఇంకా బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఏదో ప్రెగ్నన్సీ వల్ల పెరిగిన బరువో? డెలివరీ తర్వాత పెరిగిన బరువునో ఆమె తగ్గించాలనుకోవడంలేదు. అసలు తగ్గాలన్న ఉద్దేశం కూడా స్నేహకు లేదు. అయితే క్యారెక్టర్ డిమాండ్ చేసిందని తగ్గుతున్నారు. మొత్తం పది కిలోలు తగ్గాలన్నది ఆమె టార్గెట్. ఆల్రెడీ ఏడు కిలోలు తగ్గారు స్నేహ. మరో మూడు కిలోలు తగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే... ఆమెకంటే వయసులో ఏడాది చిన్నోడైన ఫాహద్ ఫాజిల్‌కి జోడీగా కనిపించనున్నారు స్నేహ. ‘ధృవ’ తమిళ మాతృక ‘తని ఒరువన్’ తర్వాత దర్శకుడు మోహన్ రాజా తీస్తున్న సినిమా ‘వేలైక్కారన్’. శివ కార్తికేయన్, ఫాహిద్ ఫాజిల్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, స్నేహ హీరోయిన్లు. ‘‘ఫాహిద్తో ఓ మలయాళ సినిమా చేశా. కానీ, అందులో మా కాంబినేషన్లో ఎక్కువ సీన్లు లేవు. ‘వేలైక్కారన్’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు స్నేహ. ఈ సినిమాలో వీలైనంత సన్నగా కనిపించాలని ఇంట్లోనే ఉదయం కార్డియో, సాయంత్రం వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేస్తున్నారామె. -
రెమోకు పన్ను మినహాయింపా?
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పెరంబూర్: రెమో చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపును వర్తింపజేయడంపై వివరణ ఇవ్వాల్సిందిగా మద్రాసు హైకోర్టు ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖకు నోటీసులు జారీ చేసింది. శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటించిన చిత్రం రెమో. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రంపై స్థానిక చూలెమైడుకు చెందిన వరదరాజన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అందులో ఆయన పేర్కొంటూ తాను ఈ నెల ఏడో తేదీన రెమో చిత్రం చూడడానికి నగరంలోని ఒక సినిమా థియేటర్‌కు వెళ్లానన్నారు.రూ 120 ధర చెల్లించి టికెట్ కొన్నానన్నారు.అప్పుడే రెమో చిత్రానికి ప్రభుత్వం పన్ను మినహాయింపును వర్తింపజేసిందని తనకు తెలిసిందన్నారు. తమిళ భాషను, తమిళ సినిమాను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2005లో పలు రాయితీలను ప్రకటించిందన్నారు. అప్పటి నుంచి తమిళంలో పేర్లు కలిగిన చిత్రాలకు వినోదపు పన్నును మినహాయిస్తూ వస్తోందన్నారు.కాగా శివకార్తీకేయన్ నటించిన చిత్రం రెమో తమిళ భాషకు చెందిన టైటిల్ కాదన్నారు. అది లాఠిన్ భాషకు చెందిన పదం అని పేర్కొన్నారు. తమిళ ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వహిస్తున్న చంద్రమౌళినే అదే శాఖలో అదనపు ప్రధాన కార్యద ర్శిగానూ వ్యవహరిస్తున్నారని, రెమో అన్న పేరు తమిళ భాషకు చెందింది కాదని తెలిసినా ఆ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపును వర్తింపజేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న ధనాన్ని ప్రభుత్వానికి చేరకుండా చిత్ర నిర్మాతకు లబ్ధిచేకూర్చుతున్నారన్నారు. రెమో చిత్రానికి వర్తింపజేసిన వినోదపు పన్నును రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు శనివారం న్యాయమూర్తి శివజ్ఞానం సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ కేసు విషయంలో ప్రభుత్వ ఆదాయ శాఖ ప్రధాన కార్యదర్శి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసి మరు విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు. -
రెమోకు సూపర్‌స్టార్ ప్రశంసలు
రెమో చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసలు లభించాయి. శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటించిన చిత్రం రెమో. నవ నిర్మాత ఆర్డీ.రాజా నిర్మించిన ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదలై విశేష ప్రజాదరణ పొందుతోంది. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటించిన కబాలి, విజయ్ నటించిన తెరి చిత్రాల తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రెమో రికార్డు సాధించింది. ఈ చిత్రం తమిళనాడులోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరుతుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. కాగా రెమో చిత్రాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ తనను, నటుడు శివకార్తికేయన్‌ను ప్రశంసించారని నిర్మాత ఆర్డీ.రాజా ట్విట్టర్లో పేర్కొన్నారు. రజనీకాంత్ వీరాభిమానినైన తనకు ఆయన ప్రశంసలు దక్కడం జీవితంలో పడిన కష్టాలను మరిపించాయని నిర్మాత పేర్కొన్నారు. కాగా ఆర్డీ.రాజా తాజాగా శివకార్తీకేయన్ హీరోగా మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రారంభం కానుంది. -
కాబోయే అత్తకు విందిచ్చిన నయన
కోడలికి పేరు, ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా అత్తమామలకు మర్యాదలు చేయాల్సిందే. ఇది సనాతన సంప్రదాయం. ఇక ప్రియుడు ఎంత ప్రేమించినా ఆయన అమ్మ అనుమతి లభిస్తేనే ఆ జంట భవిష్యత్ బంగారుబాటగా మారుతుంది. ఈ విషయాన్ని నటి నయనతార గ్రహించినట్లున్నారు. తనకు కాబోయే అత్తగారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో పడ్డారని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. విషయంలోకి వెళితే సంచలన తారగా వాసికెక్కిన నయనతార శింబు, ప్రభుదేవాల తరువాత తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. నానూ రౌడీదాన్ చిత్రం షూటింగ్ సమయంలోనే ఆ దర్శక నటిల మధ్య ప్రేమ చిగురించిందన్నది ప్రచారంలో ఉంది. ఏ కార్యక్రమానికైనా నయనతార, విఘ్నేశ్‌శివ కలిసి హాజరవుతూ వార్తల్లోకెక్కుతున్నారు. అంతే కాదు అలాంటి కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత సంచలనం కలిగిస్తుండడం విశేషం. కాగా వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం జరుగుతోంది.దీన్ని ధ్రువపరచే విధంగా ఇటీవల ఒక సంఘటన జరిగినట్లు సమాచారం. దర్శకుడు విఘ్నేశ్‌శివ తల్లిదండ్రులిద్దరూ పోలీస్ అధికారులుగా పని చేశారట. ముఖ్యంగా ఆయన తల్లి రౌడీలకు స్వప్నసింహంగా ఉండేవారట. ఎంద రో రౌడీల ఆటకట్టించిన ఆమె గురించి తెలిసి నయనతారే కంగుతిన్నారట. అలాంటిది ఎట్టకేలకు తను ప్రియుడు తల్లిని పరిచయం చేయడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందని సమాచారం. దాన్ని మరింత పెంచుకోవడానికి నయనతార ఇటీవల విఘ్నేశ్‌శివ తల్లిని తన ఇంటికి ఆహ్వానించి మంచి విందునిచ్చారని ప్రచారం జరుగుతోంది. నయన్ స్వయంగా తానే వంట చేసి కాబోయే అత్తకు వడ్డించారట. ఇదే ఇప్పుడు మీడియాలో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారిన అంశం. మొత్తం మీద అత్త కోసం నయనతార వంటింటి బాట పట్టారన్న మాట. -
శివకార్తికేయన్‌తో నటించడం సులభం
శివకార్తికేయన్‌తో కలిసి నటించడం చాలా కంఫర్టబుల్‌గా ఉందంటున్నారు నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటించిన మూడు చిత్రాలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అందులో ఇదు ఎన్న మాయం చిత్రం యావరేజ్‌గా కాగా, రజనీమురుగన్ సంచలన విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల విడుదలైన తొడరి సక్సెస్ అనిపించుకుంది. తాజాగా రెండో సారి శివకార్తికేయన్‌తో జత కట్టిన రెమో చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఈ పుత్తడి బొమ్మను సాక్షి పలకరించగా బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. అవేమిటో చూడండి. ప్ర: రెమో చిత్ర విశేషాల గురించి? జ: రెమో చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. శుక్రవారం తెరపైకి రానుంది. కాబట్టి చూడబోతూ ఇప్పుడే రుచుల గురించి చెప్పడమెందుకు. అయితే ఇందులో నాది బబ్లీ పాత్ర. రెమో లవ్ ఎంటర్‌టెయినింగ్ థ్రిల్లర్ కథా చిత్రం. ప్ర: నటుడు శివకార్తికేయన్‌కు జంటగా రజనీమురుగన్ చిత్రం తరువాత ఈ చిత్రంలో జత కట్టడం గురించి? జ: నిజంగా మంచి అనుభవం. శివకార్తికేయన్‌తో ఇంతకు ముందు నటించడంతో రెమో చిత్ర షూటింగ్ చాలా జాలీగా సాగిపోయింది. అందరం చాలా ఎంజాయ్ చేస్తూ నటించాం. ప్ర: విజయ్‌కు జంటగా భైరవా చిత్రంలో నటించడం గురించి ? జ: చాలా సంతోషంగా ఉంది. విజయ్‌తో నటించాలన్నది నా డ్రీమ్. అది ఇంత త్వరగా నెరవేరుతుందని ఊహించలేదు. విజయ్ డాన్స్‌లో ఎంత వేగమో అందరికీ తెలిసిందే. ఆయనతో డాన్స్ చేయడం అంత సులభం కాదు. రెండు రోజుల క్రితమే విజయ్‌తో కలిసి పాటల సన్నివేశాల్లో నటించారు. ముందు కాస్త భయపడ్డాను. తరువాత గాడిలో పడ్డాను. ఏదేమైనా విజయ్‌తో నటించడం తీయని అనుభవం. ప్ర: విజయ్, దనుష్, శివకార్తికేయన్‌లతో నటించారు. వీరిలో ఎవరితో నటించడం కంఫర్టబుల్ అనిపించింది? జ: విజయ్ పెద్ద స్టార్. ఆయనతో నటించే అవకాశం వచ్చినప్పుడే కాస్త ఒంట్లో వణుకు పుట్టింది. అయితే ఆయనతో నటించడంతో చాలా నేర్చుకున్నాను. ఇక ధనుష్ నటనలో ఫర్ఫెక్షన్ చూసుకుంటారు. సహ నటీనటులకు సూచనలు ఇస్తారు. శివకార్తికేయన్‌తో ఇంతకు ముందు నటించాను గనుక ఏ విషయాన్నైనా కలిసి చర్చించుకునే క్లోజ్నె స్ ఉంటుంది. ప్ర: మీ తల్లి మేనక నటి, తండ్రి సురేశ్ నిర్మాత కావడం వల్లే మీరూ నటినవ్వాలనుకున్నారా? జ: నాది సినీ బ్లడ్ కావడం వల్ల నటినవావ్వలన్న కోరిక కలిగి ఉండవచ్చు. చదువు పూర్తి చేసిన తరువాతే నటన గురించి ఆలోచించమని అమ్మానాన్నలు చెప్పడంతో ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ చేశాను. బాల నటిగా కొన్ని చిత్రాలు చేశాను.2013లో గీతాంజలి అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యాను. ప్ర: మీ అక్క రేవతి ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లున్నారు? జ: అవును అక్క పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్క వీఎఫ్ఎక్స్ సెషలిస్ట్. నటుడు షారూఖ్ ఖాన్ చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ కంపెనీలో పని చేశారు. అక్క దర్శకత్వం చేపట్టాలనే ఆలోచనలో ఉంది. ప్ర: మీ అక్క దర్శకత్వం వహిస్తే ఆ చిత్రంలో మీరు నటిస్తారా? జ: ఎందుకు నటించనూ. అలాంటి ఆలోచన మా ఇద్దరికీ ఉంది. ప్ర: మలయాళంలో చిత్ర రంగప్రవేశం చేసి ఆ తరువాత తమిళం, తెలుగు అంటూ దక్షిణాది భాషల్లో వరుస కట్టారు. తదుపరి చూపు బాలీవుడ్పైనేనా? జ: ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. మంచి అవకాశం వస్తే హిందీ చిత్రాల్లో నటించడానికి రెడీ. ప్ర: స్టార్ హీరోలతో అవకాశాలు పొందాలంటే గ్లామరన్గా నటించాలన్న ఒత్తిడి ఉంటుందంటారు. అలాంటి పరిస్థితి ఎదురైతే అందాలారబోతకు సిద్ధమేనా? జ: నిజం చెప్పాలంటే గ్లామరస్ పాత్రలు నా బాడీలాంగ్వేజ్‌కు నప్పవు. అలాంటి పాత్రలను నేను చేయను కూడా. ఇక అవకాశాలను కోల్పోతానని అంటారా’ ఇప్పుడు ప్రేక్షకుల్లో చాలా మార్పు వస్తోంది. మంచి కథా పాత్రలను ఆదరిస్తున్నారు. అందువల్ల నాకు అలాంటి ఒత్తిడి రాదనే భావిస్తున్నా. ప్ర: ప్రస్తుతం హారర్ చిత్రాల టెండ్ నడుస్తోంది. అలాంటి చిత్రాల్లో అవకాశం వస్తే నటిస్తారా? జ: నా తొలి మలయాళ చిత్రం గీతాంజిలి హారర్ కథా ఇతివృత్తంతో కూడుకున్నదే. కాబట్టి పాత్ర నచ్చితే కచ్చితంగా హారర్ కథా చిత్రంలో నటిస్తాను. ప్ర: సాధారణంగా హీరోయిన్లలో పోటీ ఉంటుంది. మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు? జ: నాకు నేనే పోటీ. నా ముందు చిత్రాల కంటే మరింత బెటర్‌గా నటించడానికి ప్రయత్నిస్తాను. ప్ర: ఏ హీరోతో కలిసి నటించాలని ఆశపడుతున్నారు? జ: అలాగని ఏమీ లేదు. విజయ్, ధనుష్, శివకార్తికేయన్‌లతో ఇప్పటికే నటించాను. అలాగే అందరు హీరోలతోనూ నటించాలని కోరుకుంటాను. మణిరత్నం దర్శకత్వంలో నటించాలన్న కోరిక మాత్రం ఉంది. ప్ర: నటుడు సూర్యతో జత కట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజమేనా? జ: అది ఇంకా చర్చల్లోనే ఉంది. ప్రస్తుతానికి విజయ్‌తో నటిస్తున్న భైరవాతో పాటు తెలుగులో నానికి జంటగా ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తున్నాను. నేను లోకల్ క్రిస్మస్కు భైరవా సంక్రాంతికి తెరపైకి రానున్నాయి. -
సూపర్‌స్టార్ తరువాత శివకార్తికేయనేనా?
సూపర్‌స్టార్ తరువాత శివకార్తికేయనే అంటున్నారు. ఎవరలా అంటున్నది? ఏమాకథ? అలాగైతే విశ్వనాయకుడు, ఇళయదళపతి, అజిత్ లాంటి వారి పరిస్థితి ఏమిటి? అనేగా మీ ప్రశ్నలు. ఏదేమైనా వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తికేయన్. తను ఈ స్థాయికి ఎదుగుతాడని ఆయనే ఊహించి ఉండకపోవచ్చు. రజనీమురుగన్ చిత్ర విజయం తరువాత శివకార్తికేయన్ రేంజే మారిపోయింది. నిర్మాతలు ఎంత భారీ బడ్జెట్‌తోనైనా ఆయనతో చిత్రాలను నిర్మించడానికి సిద్ధపడుతున్నారు. బయ్యర్లదీ అదే పరిస్థితి. శివకార్తికేయన్ చిత్రాలను భారీ మొత్తంతో కొనుగోలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.ప్రస్తుతం అంత క్రేజ్‌ను సంపాదించుకున్న చిత్రం రెమో. శివకార్తికేయన్‌కు జంటగా ఆయన లక్కీ నాయకి కీర్తీసురేశ్ నటించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ అందమైన అమ్మాయిగా కూడా మెరవనున్నారు. సతీష్, దర్శకుడు కేఎస్.రవికుమార్, నటి శరణ్య, యోగిబాబు ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి నవదర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. అనిరుధ్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ చాయాగ్రహణం అందించిన రెమో చిత్రాన్ని 24 ఏఎం సంస్థ అధినేత ఆర్డీ.రాజా నిర్మించారు. ఈ చిత్రం ఏడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. కాగా తొలిసారిగా జపాన్ లో విడుదల కానున్న శివకార్తికేయన్ చిత్రం ఇదే. విశేషం ఏమిటంటే రజనీకాంత్ మినహా ఏ ఇతర హీరోల చిత్రాలు జపాన్‌లోని యోకోయమ, టోక్యో ఏరియాల్లోనే ప్రదర్శింపబడతాయట. అలాంటిది శివకార్తికేయన్ రెమో రజనీకాంత్ చిత్రాలకు దీటుగా యోకోయమ, టోక్యో ఏరియాలతో పాటు నగోయా ఏరియాలోనూ ప్రదర్శింపబడనుందట. రెమో చిత్ర జపాన్ విడుదల హక్కులను మెడ్రాస్ మూవీస్ సంస్థ పొందిందట. -
శివకార్తికేయన్ రెమో చూడాలని ఉంది
తన చిత్రానికి పోటీగా విడుదలవుతున్న శివకార్తికేయన్ నటించిన రెమో చిత్రం విజయం సాధించాలని నటుడు విజయ్‌సేతుపతి అన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం రెక్క. రతన్‌శివ దర్శత్వం వహించిన ఈ చిత్రాన్ని కామన్‌మ్యాన్ ప్రొడక్షన్ పతాకంపై బి.గణేశ్ నిర్వించారు.లక్ష్మీమీనన్ నాయకిగా నటించిన ఈ చిత్రంలో సతీష్,హరీష్‌ఉత్తమన్, దర్శకుడు కేఎస్.రవికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆయుధపూజ సందర్భంగా వచ్చేనెల తొలి వారంలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి మట్లాడుతూ రెక్క పక్కా కమర్షియల్ కథా చిత్రం అన్నారు. ఇలాంటి చిత్రం చేయాలన్నది తన కల అని పేర్కొన్నారు. ఈ చిత్రం తనకు చాలా కిక్ ఇచ్చింద న్నారు. నటి లక్ష్మీమీనన్ చాలా సెన్సిబుల్ నటి అని పేర్కొన్నారు. ఈ చిత్రంతో పాటు శివకార్తికేయన్ నటించిన రెమో కూడా విడుదలవుతోంది. మీ చిత్రం దానికి పోటీగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తానేప్పుడూ ఏ చిత్రాన్ని పోటీగా భావించనని, శివకార్తికేయన్ రెమో చిత్రంలో బాగా నటించారని, ఆ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. రెమో చిత్రాన్ని చూడాలన్న ఆసక్తి తనకు కలుగుతోందని పేర్కొన్నారు.అయితే తమ చిత్రం రెక్క కూడా బాగా వచ్చిందని, సెలవు రోజుల్లో విడుదలవుతున్నాయి కనుక రెండు చిత్రాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని విజయ్‌సేతుపతి అన్నారు. నటుడు సతీష్, హరీష్‌ఉత్తమన్, దర్శకుడు రతన్‌శివ, నిర్మాత గణేశ్, ఎడిటర్ ప్రవీణ్ పాల్గొన్నారు. -
నయన చిత్రంలో స్నేహ
స్నిగ్ధ మనోహరి నటి స్నేహను మళ్లీ వరుసగా తెరపై చూడబోతున్నామన్నది సంతోషకరమైన సమాచారం. ఇంతకు ముందు పక్కింటి అమ్మాయిగా మనందర్నీ అలరించిన స్నేహ ఆ తరువాత భక్తిరస పాత్రల్లోనూ అద్భుత నటనతో రక్తికట్టించారు.అలాంటి మంచి నటి మూడేళ్ల క్రితం నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. ఇది ఆమె అభిమానులకు నిరాశ కలిగించిన అంశమే అవుతుంది. అలాంటి వారికి స్నేహ మళ్లీ చిన్న గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది తాజా వార్త. గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్నేహ మళ్లీ రీఎంట్రీ అవుతున్నారు. ఇప్పటికే మలయాళంలో అక్కడి సూపర్‌స్టార్ మమ్ముట్టికి జంటగా గ్రేట్ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తమిళంలో నటించడానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. అయితే ఇందులో స్నేహ కథానాయకిగా నటించడం లేదట. లేడీ సూపర్‌స్టార్ నయనతార నాయకిగా నటించనున్న ఈ చిత్రంలో స్నేహ ఒక ముఖ్యపాత్రను పోషించనున్నారట. వివరాల్లోకెళితే తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మోహన్‌రాజా తాజాగా శివకార్తికేయన్ హీరోగా చిత్రం తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ప్రస్తుతం రెమో చిత్రాన్ని నిర్మిస్తున్న 24 ఏఎం.స్టూడియోస్ అధినేత ఎండీ.రాజా నిర్మించనున్నారు. ఇందులో శివకార్తికేయన్, నయనతార జంటగా నటించనున్నారు. ఈ చిత్రంలో నటి స్నేహ ఒక కీలక పాత్రను పోషించనున్నారట. దీని గురించి నిర్మాత తెలుపుతూ ఇందులో స్నేహ అక్కగానో, చెల్లెలిగానో నటించడం లేదన్నారు. చాలా ముఖ్యమైన పాత్రను చేస్తున్నారని, చిత్రం అంతా ఉండే ఈ పాత్ర ఆమె కెరీర్లో లైఫ్‌టైమ్ పాత్రగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సతీష్, ఆర్జే.బాలాజి ముఖ్యపాత్రలను పోషించనున్నారట. త్వరలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. -
శివకార్తికేయన్‌తో చెన్నై చిన్నది
చెన్నై చిన్నది అనగానే టక్కున గుర్తుకొచ్చేది నటి సమంతనే. నటిగా అతి తక్కువ కాలంలోనే ఎక్కువగా పేరు తెచ్చుకుని ప్రముఖ కథానాయికల పట్టికలో చేరిన నటి సమంత. తమిళం, తెలుగు భాషల్లోనూ వెలిగిపోతున్న ఈ చెన్నై చంద్రం లవ్‌లో పడి ఇటీవల తెలుగు నటుడు నాగచైతన్యను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వెల్లడించి తన అభిమానులకు తేరుకోలేని షాక్ ఇచ్చారు. వివాహానంతరం సమంత నటించరేమోనన్న సందేహం చిత్ర పరిశ్రమలోనూ నెలకొంది. అందుకు కారణం ఆమె కొత్తగా చిత్రాలను అంగీకరించకపోవడమే. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ అనే ఒకే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా సమంత అభిమానులకు శుభవార్త ఏమిటంటే తను మళ్లీ కొత్త చిత్రాలను అంగీకరిస్తున్నారు. తమిళంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా వార్త. ఇంతకు ముందు శివకార్తికేయన్‌తో వరుత్తపడాద వాలిభర్ సంఘం, రజనీమురుగన్ చిత్రాలను తెరకెక్కించిన పొన్రామ్ తాజాగా దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ శివకార్తికేయన్ హీరోగా నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా సమంతను నాయకిగా ఎంపిక చేశారు.ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా రెమో చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్డీ.రాజా అదే హీరోతో మోహన్‌రాజా దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇందులో నయనతార నాయకిగా నటించనున్నారు. ఇదే నిర్మాత మళ్లీ శివకార్తికేయన్‌తో మూడో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలోనే సమంత హీరోయిన్గా నటించాడానికి ఓకే అన్నారట. ఈ చిత్రాన్ని 2017 ప్రథమార్థంలో ప్రారంభించి దీపావళికి విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి నిర్మాత ఆర్డీ.రాజా తన ట్విట్టర్లో పేర్కొంటూ వెల్కమ్ టూ సమంత అని పోస్ట్ చేశారు. ఇక మరికొందరు దర్శక నిర్మాతలు సమంత ముందు క్యూ కట్టే అవకాశం లేకపోలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
రెమో కోసం నవ్వొద్దు
రెమో చిత్రం కొసం నవ్వొద్దు అనగానే ఏదేదో ఊహించుకుంటున్నారా? చాలా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం రెమో. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఆయనకు జంటగా కీర్తీసురేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. 24 ఎఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఒక మీడియో ఆల్బమ్‌ను తయారు చేశారు. అందులో పాట పల్లమే సిరిక్కాదే(నవ్వొద్దే). అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు ఇదే చిత్ర నిర్మాత నివీన్ హీరోగా నిర్మిస్తున్న చిత్ర దర్శకుడు రాధాకృష్ణన్ కాన్సెప్ట్‌ను తమారు చేశారు. అర్జున్ కనుంగ, శ్రీనిధి వెంకటేశ్ పాడిన ఈ పాటలో శివకార్తికేయన్, కీర్తీసురేశ్, సంగీతదర్శకుడు అనిరుద్, గాయకులు అర్జున్ కనుంగ, శ్రీనిధి వెంకటేశ్, ఇన్నో చెంగ, యరియ, శశాంక్, విజయ్, కెబజెరిమియా నటించారు. ఈ ప్రచార మ్యూజిక్ వీడియోను తమిళం,ఆంగ్లం భాషల్లో రూపొందించారు. తమిళ వెర్షన్‌ను ఈ నెల 18 సాయంత్రం ఆరు గంటలకు సోనీ చానల్ వైటీ, ట్విట్టర్ ద్వారాను విడుదల చేయనున్నారు. ఒక వారం తరువాత ఆంగ్ల మ్యూజిక్ వీడియోను ఎంటీవీ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
అతిథిగా లక్కీ నాయకి
సినిమాల్లో హిట్ పెయిర్‌గా కొందరు ముద్ర పడతారు. అలా పేరు తెచ్చుకున్న జంటల్లో శివకార్తికేయన్, శ్రీదివ్య ఒకరు. వీరిద్దరి కెరీర్‌ను అనూహ్యంగా పెంచేసిన చిత్రం వరుత్తపడాదవాలిభర్ సంఘం. అదే విధంగా ఈ జంట కలిసి నటించిన మరో చిత్రం కాక్కీసట్టై. ఇదీ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. దీంతో శివకార్తికేయన్, శ్రీదివ్య హిట్ పెయిర్‌గా ముద్ర పడింది. తాజాగా శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం రెమో. ఇందులో ఆయనకు జంటగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా ఇంతకు ముందు రజనీమురుగన్ చిత్రంలో శివకార్తీకేయన్‌తో జత కట్టారన్నది గమనార్హం. రెమో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవలే చిత్ర నిర్మాత డి.రాజా గ్రాండ్‌గా నిర్వహించి చిత్ర హైప్‌ను ఇంకా పెంచేశారు. ఇందులో శివకార్తికేయన్, లక్కీ హీరోయిన్ శ్రీదివ్య అతిథిగా దర్శనమీయనున్నారన్నది కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలు ఇటీవలే చిత్రీకరించినట్లు తెలిసింది. ఇందుతో శివకార్తికేయన్ అందమైన అమ్మాయిగా కనిపించనున్నారన్న విషయం తెలిసిందే. దర్శకుడు కేఎస్.రవికుమార్ చిత్రంలోనూ దర్శకుడిగానే నటిస్తున్నారు. దీంతో ఇదేదో సినిమా నేపథ్యంలో సాగే చిత్రం అనిపిస్తోంది కదూ. ఈ విషయాలన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రెమో చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా భాగ్యరాజ్కన్నన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
ఆమెను నేనే వద్దన్నాను
రెమో చిత్రంలో కథానాయకిగా నటి కీర్తీసురేశ్‌ను తానే వద్దన్నానని ఆ చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ చెప్పారు. రజనీమురుగన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం రెమో. 24ఏఎం.స్టూడియోస్ పతాకంపై డి.రాజా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ద్వారా దర్శకుడు అట్లీ శిష్యుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక నుంగమ్బాక్కమ్ రోడ్డులో గల నక్షత్ర హోటల్లో జరిగింది. కార్యక్రమానికి స్టార్ దర్శకుడు శంకర్ విచ్చేసి చిత్ర టైటిల్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రజనీమురుగన్ చిత్రం చూసి నటుడు శివకార్తికేయన్ నటనను అభినందించలేకుండా ఉండలేకపోయానన్నారు. ఆయన్ని చూస్తే నాకే అసూయ కలిగింది చిత్ర కథానాయకి కీర్తీసురేశ్ మాట్లాడుతూ దర్శకుడు తనకు కథ వినిపించినప్పుడు ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనీ, అందులో మొదటి హీరోయిన్ శివకార్తికేయనేనీ అనడంతో తాను షాక్‌కు గురయానన్నారు. శివకార్తికేయన్ ఆడ వేషం వేస్తున్నట్లు ఆ తరువాత వివరించారన్నారు. ఈ వేషంలో చూసినప్పుడు తనకే అసూయ కలిగిందనీ కీర్తీసురేశ్ పేర్కొన్నారు. ఆ హీరోయిన్లందరికీ థ్యాంక్స్ చివరిగా చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ తనకీ కథ గురించి మొదట దర్శకుడు అట్లీ చెప్పారన్నారు. కథ విన్నాక ఆడవేషంలో మెప్పించగలమా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశానని అన్నారు.కొన్ని రోజుల తరువాత దర్శకుడితో మరోసారి కథ వినిపించగలరా? అని అడగ్గా మళ్లీ కథ చెప్పారన్నారు. అలా 8 సార్లు కథ విన్నానని తెలిపారు. దర్శకుడేమో ఈ కథలో మీరే నటించాలని పట్టుపట్టాడన్నారు. అలా తన కోసం 10 నెలలు వేచి దర్శకుడి కోసం తాను ఏడాది పాటు కాల్షీట్స్ కేటాయించానని తెలిపారు. రెమో చిత్రంలో ఆడ వేషం చాలా చేస్తుందన్నారు. ఈ పాత్ర చిత్రీకరణనే 42 రోజులు చేసినట్లు వెల్లడించారు. ఇక ఇందులో హీరోయిన్గా నటి కీర్తీసురేశ్ బాగుంటారని దర్శకుడు, కెమెరామెన్ పీసీ.శ్రీరామ్ అన్నారన్నారు. అయితే తాను మాత్రం ఆమెను వద్దని అన్నానని, అందుకు కారణం ఇప్పటికే రజనీమురుగన్ చిత్రంలో తామిద్దరం కలిసి నటించామన్నారు. వరుసగా కలిసి నటిస్తే గాసిప్స్ ప్రచారం అవుతాయనే కీర్తీసురేశ్‌ను వద్దన్నానని వివరించారు. అయితే చాలా మంది ప్రముఖ హీరోయిన్లను సంప్రదించగా ఎవరూ తనకు జంటగా నటించడానికి అంగీకరించలేదన్నారు. వారందరికీ ఇప్పుడు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు.ఎందుకంటే కీర్తీసురేశ్ చాలా బాగా నటించారని శివకార్తీకేయన్ పేర్కొన్నారు. ఏవీఎం.శరవణన్, ఎడిటర్ మోహన్, మోహన్‌రాజా, పీసీ.శ్రీరామ్,అనిరుద్, రసూల్ కుట్టి, విఘ్నేశ్‌శివ పాల్గొన్నారు. -
ఆమె అతడే..!
హీరోలు ఆడ వేశాలు వేయటం సౌత్ ఇండస్ట్రీలో తరుచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ జనరేషన్ హీరోలు పెద్దగా అలాంటి రిస్క్ చేయకపోయినా, సీనియర్ హీరోలందరూ అడపాదడపా ఆడ వేషంలో కనిపించిన వారే. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి టాప్ స్టార్లు చిన్న పాత్రలో మెరిస్తే, కమల్ హాసన్, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు సినిమా అంతా ఆడ వేషంలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇదే తరహా ప్రయోగానికి రెడీ అవుతున్నాడు కోలీవుడ్ యంగ్ హీరో. ఇప్పటి వరకు మాస్ మసాలా సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో శివకార్తీకేయన్ ఇప్పుడో ప్రయోగం చేస్తున్నాడు. తన తాజా చిత్రం రెమోలో లేడీ గెటప్‌లో అలరించనున్నాడు. ఇన్నాళ్లు ఇది రూమరే అని భావించినా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేశారు. నర్సు గెటప్‌లో కనిపిస్తున్న శివకార్తీకేయన్‌ను ఎవరైన చెపితే కాని గుర్తుపట్టలేనట్టుగా తయారు చేశారు. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా భాగ్యరాజ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా అక్టోబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ఆ ఇద్దరితో నటించాలి
ఆ ఇద్దరితో నటించాలని ఆశగా ఉంది అంటోంది వర్ధమాన నటి మృదుల. తమిళ సినిమా విజయ పయనంలో కేరళ రాష్ట్రానికి చెందిన కథానాయికలకు భాగం ఉందని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. నాటి ప్రఖ్యాత నటీమణులు లలిత, పద్మిణి, రాగిణిల నుంచి నేటి ప్రముఖ తారలు నయనతార, కీర్తీసురేశ్‌ల వరకూ పలువురు నాయికలు కోలీవుడ్ విజయాల్లో భాగం పంచుకుంటున్నవారే. తాజాగా ఆ కోవలో వర్ధమాన నటి మృదుల చేరనున్నారు. భరతనాట్యం, మోడలింగ్ రంగాల్లో ప్రవేశం కలిగిన ఈ సుందరి మంచి వ్యాఖ్యాత కూడా. మాతృభాషలో అయాల్ నానళ్ల అనే చిత్రంలో ఫాహత్కు జంటగా కథానాయికగా పరిచయమై పలువురి ప్రశంసలు పొందిన మృదుల తాజాగా కోలీవుడ్‌పై కన్నేశారు. పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావని అడిగిన వారికి నటిని అవుతానని తడుముకోకండా చెప్పాదానినని, అలా బాల్యం నుంచే నటనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతున్న మృదుల తమిళ సినిమాలంటే చాలా మక్కువ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తమిళ సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా చూస్తానంటున్న ఈ కేరళ కుట్టి తమిళ హీరోలపై ప్రేక్షకులు చూపించే ఆదరాభిమాలనకు ఆకర్షితురాలినయ్యానన్నారు. తనకు మాత్రం శివకార్తికేయన్, విజయ్సేతుపతిలకు జంటగా నటించాలని చాలా ఆశగా ఉందన్నారు. వారి నటన, కథలను ఎంచుకుని నటించే విధానం తనకు నచ్చిందన్నారు.ఆ ఇద్దరితో నటించే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని అంటోంది ఈ భామ. -
అజిత్,శివకార్తికేయన్ కలయికలో భారీ చిత్రం?
కోలీవుడ్‌లో మల్టీ స్టారర్ చిత్రాల నిర్మాణం పెరుగుతోందని చెప్పవచ్చు. సంచలన దర్శకుడు బాలా ఐదుగురు హీరోలతో భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నాగార్జున, కార్తీలతో తోళా అనే మల్టీ స్టారర్ ద్విభాషా చిత్రం నిర్మాణంలో ఉంది.తాజాగా స్టార్ నటుడు అజిత్, యువ నటుడు శివకార్తికేయన్‌ల కాంబినేషన్లో భారీ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాచారం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. వేదాళం చిత్రం తరువాత అజిత్ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అజిత్ మరో మూడు నెలల వరకూ నటనకు దూరంగా ఉంటారని సమాచారం. ఆయన విరామం అనంతరం నటించే చిత్రం గురించి ఒక సంచలన ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. అజిత్, యువ నటుడు శివకార్తికేయన్ కలిసి నటించనున్నారన్నదే ప్రచారం. ఇంతకు ముందు అజిత్ హీరోగా వీరం, వేదాళం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివనే ఈ మల్టీ స్టారర్ చిత్రానికి స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. శివకార్తికేయన్ నటించిన రజనీమురుగన్ చిత్రం డిసెంబర్ నాలుగున తెరపైకి రానుంది. ప్రస్తుతం ఆయన నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఆర్డీ.రాజా నిర్మించనున్న నర్సు అక్క(టైటిల్ ఇంకా వెల్లడించలేదు)అనే చిత్రంలో నటిస్తున్నారు. -
శివకార్తికేయన్‌తో శ్రుతీహాసన్
ఈ మధ్య కోలీవుడ్‌లో యువ కథానాయకుల పంట పండుతోందనే చెప్పాలి. ఇంతకు ముందు ప్రముఖ కథానాయికలు యువ కథానాయకులతో నటించడానికి తటపటాయించే వాళ్లు. ఎక్కడ వారి ఇమేజ్ డామేజ్ అవుతుందోనని ఒకింత భయపడేవాళ్లు కూడా. అలాంటిది ఇప్పటి టాప్ నాయికలు నయనతార, హన్సిక, త్రిష, శ్రుతీహసన్ లాంటి వారు కుర్ర హీరోలతో నటించడానికి సై అనడంతో వాళ్లు యమ ఖుషీలో తేలిపోతున్నారనే చెప్పాలి. ఆ మధ్య వర్ధమాన నటుడు ఆరితో మాయ చిత్రం, ఇటీవల నానుమ్ రౌడీదాన్ చిత్రంలో విజయ్‌వసంత్‌తో నటించడానికి స్టార్ నాయకి నయనతార ఏ మాత్రం వెనుకాడలేదు. అదే విధంగా హన్సిక శివకార్తికేయన్‌తో మాన్‌కరాటే చిత్రంలో నటించి ఆ చిత్రానికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇక మరో సంచలన నటి త్రిష నాయకి చిత్రంలో గణేశ్వెంకట్రామన్తో నటిస్తోంది. తాజాగా శివకార్తికేయన్ సరసన క్రేజీ బ్యూటీ శ్రుతీహసన్ నటించడానికి పచ్చజెండా ఊపడం విశేషం. వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంటున్న శివకార్తికేయన్ నటించిన రజనీమురుగన్ విడుదలలో కొన్ని చిక్కులను ఎదుర్కొన్నా ప్రస్తుతం అవి తొలగి త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఆయన తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పీసీ.శ్రీరామ్ ఛాయాగ్రహణ అందిస్తున్న ఇందులో శ్రుతీహాసన్ నటించే ప్రయత్నాలు జరిగాయి. దర్శకుడు కథ చెప్పగానే నచ్చేయడంతో శ్రుతీ హాసన్ వెంటనే నటించడానికి పచ్చజెండా ఊపినట్లు స మాచారం. కాగా ఈ బోల్డ్ అండ్ బ్యూటీ మరో పక్క సూర్య సరసన సింగం-3లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. -
శివకార్తికేయన్‌తో రెండోసారి
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రానికి చెయ్యిచ్చిన కేరళా కుట్టి కీర్తిసురేశ్ నటుడు శివకార్తికేయన్‌తో రెండోసారి డ్యూయెట్లు పాడేందుకు సిద్ధమవుతోంది. కోలీవుడ్లోకి ఒక భూమ్లా దూసుకొచ్చిన యువ నటి కీర్తీసురేశ్. తొలి చిత్రం ఇదుఎన్నమాయం విడుదలయ్యి ప్రజాదరణ పొందింది. ఆ చిత్రం విడుదలకు ముందే కీర్తీసురేశ్‌ను మణిరత్నం చిత్రంతో సహా పలు అవకాశాలు పలకరించాయి. అయితే అంతకుముందు అంగీకరించిన రజనీమురుగన్ చిత్రం మినహా అవన్నిటినీ ఏదో ఒక కారణంతో వదిలేసింది. ఇక శివకార్తీకేయన్‌కు జంటగా నటించిన రజనీమురుగన్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వివిధ సమస్యల్లో చిక్కుకుని ఇంకా తెరపైకి రాలేదు. అయితే చిక్కులు తొలగాయని త్వరలో విడుదలకు సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది. కాగా మణిరత్నం చిత్రం నుంచి వైదొలగిన కీర్తీసురేశ్ ఇప్పుడు మరోసారి రజనీమురుగన్ హీరో శివకార్తీకేయన్‌తో జత కడతానికి సిద్ధమయ్యిందన్నది గమనార్హం. వీరిద్దరు కలిసి నటించనున్న తాజా చిత్రం నవంబర్ రెండో తారీఖున ప్రారంభం కానుంది. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని 24 ఏఎం.స్డూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా భారీ ఎత్తున్న నిర్మించనున్నారు. పీసీ.శ్రీరాం ఛాయాగ్రహణను అందిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత భాణీలు కడుతున్నారు. ఈయన సంగీతాన్ని అందించిన ఒక పెప్పీ సాంగ్ ను చిత్రంలో ఇంట్రో సాంగ్‌గా చెన్నై లోని మెట్రో రైలులో చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ పాటకు రాజు సుందరం నృత్యదర్శకత్వాన్ని వహించనున్నారు. -
ఎమీ శివకార్తికేయన్‌తో ఓకే అంటుందా?
ఐ చిత్రంతో నటి ఎమిజాక్సన్ పాపులారిటీ బాగా పెరిగి పోయింది. అప్పటి వరకూ ఒక్కో చిత్రం చేసుకుంటూ వచ్చిన ఈ విదేశీ భామ ఇప్పుడు వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే సింగ్ ఈజ్ బ్లింగ్ హిందీ చిత్రంతో పాటు తమిళంలో ధనుష్ సరసన వీఐపీ-2, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా గెంతు చిత్రాల్లో నటిస్తున్నారు. తదుపరి విజయ్ 59వ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా ఎమీకి యువనటుడు శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందన్నది కోలీవుడ్ సమాచారం. శివకార్తికేయన్ నటించిన రజనీమురుగన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్‌తో టీమ్ అప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. 24 ఏవీఎం స్టూడియోస్ పతాకంపై నిర్మాత రాజా నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నదే ఇంకా నిర్ణయం కాలేదు. మొద ట ఇందులో సమంత నటించే అవకా శం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఆమెను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయట. అయితే ఆమె కాల్షీట్స్ చిక్కే అ వకాశం లేదో ఏమో గానీ మరో పక్క ఎమిజాక్సన్ను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. మరి ఎమీ శివకార్తికేయన్‌తో డ్యూయెట్లు పాడడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. -
హన్సికతో ఆ కోరిక తీరేనా?
కోరికలు అందరికి ఉంటాయి.అయితే వాటిని నెరవేర్చుకునే దారే వెతెక్కోవాలి. చిత్రపరిశ్రమ విషయానికొస్తే యువ తారలు ప్రముఖ నటీనటులతో నటించాలని ఉవ్విళ్లూరుతుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా అందుకు ప్రయత్నిస్తుంటారు. హీరోయిన్లే కాదు హీరోలు ఇందుకు అతీతం కాదు. మొదట్లో వర్ధమాన నటీమణులతో నటించిన యువ నటులు ఒకటి రెండు విజయాలు దరి చేరగానే క్రేజీ హీరోయిన్లతో జతకట్టాలని ఆశ పడుతుంటారు. నటుడు శివకార్తికేయన్ ఆ మధ్య మాన్‌కరాటే చిత్రంలో నటి హన్సికతో నటించారు.అప్పట్లో హన్సికతో శివకార్తీకేయనా? అంటే ఒక వర్గం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ చిత్రం హిట్ అయి వాళ్లనోళ్లు మూయించింది. అయితే శివకార్తికేయన్‌కు మాత్రం నటి నయనతారతో నటించాలనే కోరికను రేకెత్తించింది. తదుపరి చిత్రం ఆమెతో నటించే ప్రయత్నం చేశారు కూడా. అయితే నయనతారే ఓకే అనలేదు. సరిగ్గా నటుడు విజయ్‌సేతుపతికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. పిజ్జా, నడువుల కొంచెం నడువుల కానోమ్, ఇదర్కుదానే ఆశపట్టాయ్ బాలకుమారా, తదితర చిత్రాల వరుస విజయాలతో నటుడిగా ఎదుగుతున్న ఈయన ఇప్పటి వరకూ రమ్యానంబీశన్, ఐశ్వర్య రాజేష్, నందిని తదితర వర్ధమాన హీరోయిన్లతోనే నటించారు. ఇంకా ఎంత కాలం ఇలా చిన్న హీరోయిన్లతో నటించాలి అని అనుకుంటున్న సమయంలో తాజాగా నయనతారతో రొమాన్స్చేసే అవకాశం వచ్చింది. నటుడు ధనుష్ నిర్మిస్తున్న నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నయనతారతో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ సమయంలో నేను నయనతారకు వీరాభిమానిని అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఫ్లాట్ అయిపోయిన నయనతార ఇతర ప్రముఖ నటులతో నటించినట్లుగానే విజయ్సేతుపతితోనూ సన్నిహితంగా నటించారని కోలీవుడ్ ప్రచారం. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా ఇటీవల నవ నిర్మాతలు విజయ్ సేతుపతితో చిత్రం చేయాలని వెళ్లగా నటి హన్సికను హీరోయిన్గా బుక్ చేయమన్నారట. వేరే దారిలేని ఆ నిర్మాతలు హన్సిక కోసం ప్రయత్నించగా ఆమె సారీ కాల్షీట్స్ లేవని చెప్పారట. ఇదే మాటను నిర్మాతలు విజయ్‌సేతుపతి చెవిలో వేయగా ఓ అలాగా ఓకే టేకిట్ ఈజీ తరువాత చిత్రానికి ట్రై చేద్దాం అని కూల్‌గా అన్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. నయనతారతో నటించాలనే శివకార్తికేయన్ కోరికే ఇప్పటికి తీరలేదు. ఇక విజయ్‌సేతుపతి ఆశ నెరవేరేదెప్పుడో? -
శివకార్తికేయన్‌కు నో చాన్స్
బుల్లితెర నుంచి వెండితెరపై కొచ్చి హీరోగా వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న నటుడు శివకార్తికేయన్. హీరోగా ఎదగడంతో పాటు క్రేజీ హీరోయిన్లతో జతకట్టాలని తెగ ఉబలాటపడుతున్నారని సమాచారం. వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంలో నటి శ్రీదివ్యతో డ్యూయెట్లు పాడిన శివకార్తికేయన్, ఆ తరువాత ప్రియాఆనంద్, హన్సిక అంటూ పాపులర్ హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న రజనీ మురుగన్ చిత్రంలో నయనతారతో రొమాన్స్ చేయాలని ఆశపడ్డారు. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. తాజాగా సమంతాతో స్టెప్స్ వేయాలనుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించడానికి సిద్ధం అయ్యారు. అయితే ఇప్పుడీ చిత్రంలో సమంత నటించడం లేదని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. సమంత ప్రస్తుతం చాలా బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాలున్నాయి. తమిళంలో విక్రమ్ సరసన నటిస్తున్న పత్తు ఎండ్రుదుకుళ్లే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక సూర్యతో అంజాన్ చిత్రం తరువాత 24 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అదే విధంగా వేల్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ధనుష్‌తో నటిస్తున్నారు. ఆ తరువాత మరోసారి ఇళయదళపతి విజయ్ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇవి గాక తెలుగులో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది తన డైరీ పూర్తి కావడంతో శివకార్తికేయన్‌తో జత కట్టే అవకాశం లేదన్నది సమంత సన్నిహిత వర్గాల సమాచారం. -
నిర్మాతగా శివకార్తికేయన్
టీనగర్: నటుడు శివకార్తికేయన్ చిత్ర నిర్మాతగా మారారు. ‘మెరీనా’,‘కేడి బిల్లా కిలాడి రంగా’, ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం’, ‘మాన్ కరాతే’, ‘కాకి చట్టై’ వంటి చిత్రాల్లో నటించిన శివకార్తికేయన్, ప్రస్తుతం హీరోగా ఉన్నారు. ప్రస్తుతం లింగుసామి రూపొందిస్తున్న ‘రజిని మురుగన్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈయన కాల్షీట్స్ పొందేందుకు అనేక మంది నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే తానే నిర్మాతగా మారి నటించేందుకు నిర్ణయించారు శివకార్తికేయన్. ఆయన స్నేహితుడు ఆర్టీ రాజాతో కలిసి చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రాన్ని అట్లి వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన భాగ్యరాజ్ భారతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. శివకార్తికేయన్‌కు జంటగా సమంత నటిస్తున్నారు. -
రజనీ చాయలు ఉండొచ్చు
నానటనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ చాయలు ఉండవచ్చని యువ నటుడు శివకార్తికేయన్ అంటున్నారు. వరుత్త పడాద వాలిబర సంఘం, ఎదిర్ నీశ్చల్, మాన్ కరాటేవంటి వరుస విజయాలతో హేట్రిక్ కొట్టిన ఈయన తాజాగా పోలీసు గెటప్‌లో కాకిసట్టై అంటూ తెరపైకి రానున్నారు. తన ఉండర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిం చిన ఈ చిత్రానికి ఎదుర్‌నీశ్చల్ చిత్రం ఫేమ్ దురై సెంథి ల్‌కుమార్ దర్శకుడు. వరుత్తపడాద వాలిభర సంఘం చిత్రం తరువాత శ్రీ దివ్య మరోసారి శివకార్తికేయన్‌తో జతకట్టిన ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ పి.మదన్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటుడు శివకార్తికేయన్ మాట్లాడు తూ తనగత చిత్రాలు కాస్త భిన్నంగా, కొత్తగా, వాణిజ్య విలువలను పెంచుతూ కాక్కిసట్టై చిత్రాన్ని చేశామని తెలిపారు. తన తండ్రి నిజాయితీ గల పోలీసు అధికారి అని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని తాను పోలీసు అధికారి కావాలని ఆశించానన్నారు. అనివార్య కారణాల వలన ఆ కోరిక నెరవేరలేదని ఇప్పుడా ఆశను ఈ చిత్రం లో పోలీసు అధికారిగా నటించి తీర్చుకున్న ట్లు తెలిపారు. ఒక సామాన్యుడు పోలీసు అధికారిగా ఏమి చే శాడన్నది కాక్కిసట్టై చిత్ర ఇతివృత్తంగా పేర్కొన్నారు. చిత్రంలో యాక్షన్, లవ్, కామెడీ అన్ని తగు పాళ్లలో ఉంటాయన్నారు. తన పాత్రను ఎక్కడ ఓవర్ బిల్డప్ లేకుండా దర్శక, నిర్మాతలు సమాలోచనలు చేసి తీర్చిదిద్దారన్నారు. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంలో మాదిరిగానే ఈ చిత్రంలోను హీరో, హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందన్నారు. అదే విధంగా కొన్ని సన్నివేశాల్లో తన నటనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైల్స్ కనిపిస్తున్నాయని, ఆయన్ని అనుకరిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారన్నారు. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆయన చిత్రాలు చూస్తూ ఎదిగిన వాడిని. అందువలన ఆయన నటనా చాయలు ఉండవచ్చుగానీ అనుకరించ డం లేదని వివరించారు. ఈ సమావేశంలో దర్శకుడు దురై సెంథిల్‌కుమార్, పి.మదన్ తదితరులు పాల్గొన్నారు. -
కొంత ఇస్తే చాలదట!
దక్షిణాది చిత్రాలను పెడచెవిన పెట్టి ఆ మధ్య బాలీవుడ్ మోహంలో పడ్డ తమన్నకు అక్కడ అచ్చి రాలేదు. దీంతో మళ్లీ దక్షిణాదే దిక్కంటూ తిరుగుటపా కట్టింది. టాలీవుడ్లో ఒకటి రెండు చిత్రాలు రావడంతో అమ్మడు మల్లీ చెట్టెక్కి కూర్చొందనే టాక్ వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి జోరు మీదున్న యువ నటుడు శివకార్తికేయన్ దృష్టి తమన్నపై పడిందట. ఈయన నటించనున్న తాజా చిత్రంలో తమన్నతో డ్యూయెట్లు పాడాలని ఆశపడుతున్నారట. రజనీ మురుగన్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి నిర్మించనున్నారు. దీంతో నిర్మాతల వర్గం, ఎంపిక చేసే హీరోయిన్ల జాబితాలో తమన్న పేరు మొదటి వరసలో చోటు చేసుకుందట. అయితే రజనీ మురుగన్ చిత్రం కోసం తమన్నను సంప్రదించగా ‘నాకు బాలీవుడ్లో అంత పారితోషికం ఇస్తున్నారు. టాలీవుడ్లో ఇంత పారితోషికం పుచ్చుకుంటున్నాను. మీరు మాత్రం కొంత ఇస్తే చాలదు.’ అంటూ పెద్ద మొత్తంలో లిస్ట్ ఇచ్చిందట. దీంతో నిర్మాత కళ్లు బైర్లు కమ్మాయట. తమిళంలో మీకంత మార్కెట్ లేదు, బిజినెస్ లేదు. మీరు అడిగిన పారితోషికంతో నయనతారనే ఎంపిక చేసుకోవచ్చు అంటూ రుసురుసలాడుతూ తిరిగొచ్చేశారట. ఈ విషయం అటుంచితే ఈ మిల్కీ బ్యూటీతో రొమాన్స్ చేయాలన్న కోరిక తీరలేదన్న చింత శివకార్తికేయన్‌ను వెంటాడుతోందట.