శివకార్తికేయన్‌తో రెండోసారి | Keerthi Suresh to pair up with Sivakarthikeyan again | Sakshi
Sakshi News home page

శివకార్తికేయన్‌తో రెండోసారి

Published Thu, Oct 29 2015 2:39 AM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

శివకార్తికేయన్‌తో  రెండోసారి - Sakshi

శివకార్తికేయన్‌తో రెండోసారి

 ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రానికి చెయ్యిచ్చిన కేరళా కుట్టి కీర్తిసురేశ్ నటుడు శివకార్తికేయన్‌తో రెండోసారి డ్యూయెట్లు పాడేందుకు సిద్ధమవుతోంది. కోలీవుడ్‌లోకి ఒక భూమ్‌లా దూసుకొచ్చిన యువ నటి కీర్తీసురేశ్. తొలి చిత్రం ఇదుఎన్నమాయం విడుదలయ్యి ప్రజాదరణ పొందింది. ఆ చిత్రం విడుదలకు ముందే కీర్తీసురేశ్‌ను మణిరత్నం చిత్రంతో సహా పలు అవకాశాలు పలకరించాయి. అయితే అంతకుముందు అంగీకరించిన రజనీమురుగన్ చిత్రం మినహా అవన్నిటినీ ఏదో ఒక కారణంతో వదిలేసింది. ఇక శివకార్తీకేయన్‌కు జంటగా నటించిన రజనీమురుగన్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వివిధ సమస్యల్లో చిక్కుకుని ఇంకా తెరపైకి రాలేదు. అయితే చిక్కులు తొలగాయని త్వరలో విడుదలకు సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది.
 
 కాగా మణిరత్నం చిత్రం నుంచి వైదొలగిన కీర్తీసురేశ్ ఇప్పుడు మరోసారి రజనీమురుగన్ హీరో శివకార్తీకేయన్‌తో జత కడతానికి సిద్ధమయ్యిందన్నది గమనార్హం. వీరిద్దరు కలిసి నటించనున్న తాజా చిత్రం నవంబర్ రెండో తారీఖున ప్రారంభం కానుంది. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని 24 ఏఎం.స్డూడియోస్ పతాకంపై ఆర్‌డీ.రాజా భారీ ఎత్తున్న నిర్మించనున్నారు. పీసీ.శ్రీరాం ఛాయాగ్రహణను అందిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత భాణీలు కడుతున్నారు. ఈయన సంగీతాన్ని అందించిన ఒక పెప్పీ సాంగ్ ను చిత్రంలో ఇంట్రో సాంగ్‌గా చెన్నై లోని మెట్రో రైలులో చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ పాటకు రాజు సుందరం నృత్యదర్శకత్వాన్ని వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement