ఆమె అతడే..! | Sivakarthikeyan is playing a female nurse | Sakshi
Sakshi News home page

ఆమె అతడే..!

Published Fri, Jun 24 2016 3:38 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

ఆమె అతడే..!

ఆమె అతడే..!

హీరోలు ఆడ వేశాలు వేయటం సౌత్ ఇండస్ట్రీలో తరుచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ జనరేషన్ హీరోలు పెద్దగా అలాంటి రిస్క్ చేయకపోయినా, సీనియర్ హీరోలందరూ అడపాదడపా ఆడ వేషంలో కనిపించిన వారే. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి టాప్ స్టార్లు చిన్న పాత్రలో మెరిస్తే, కమల్ హాసన్, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు సినిమా అంతా ఆడ వేషంలో కనిపించి ఆకట్టుకున్నారు.

ఇప్పుడు ఇదే తరహా ప్రయోగానికి రెడీ అవుతున్నాడు కోలీవుడ్ యంగ్ హీరో. ఇప్పటి వరకు మాస్ మసాలా సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో శివకార్తీకేయన్ ఇప్పుడో ప్రయోగం చేస్తున్నాడు. తన తాజా చిత్రం రెమోలో లేడీ గెటప్లో అలరించనున్నాడు. ఇన్నాళ్లు ఇది రూమరే అని భావించినా ఫస్ట్ లుక్ పోస్టర్తో చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేశారు.

నర్సు గెటప్లో కనిపిస్తున్న శివకార్తీకేయన్ను ఎవరైన చెపితే కాని గుర్తుపట్టలేనట్టుగా తయారు చేశారు. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా భాగ్యరాజ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా అక్టోబర్లో రిలీజ్కు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement