హిట్ ఖాయం..నేను గ్యారంటీ! - ‘దిల్’ రాజు | Dil raju about remo movie | Sakshi
Sakshi News home page

హిట్ ఖాయం..నేను గ్యారంటీ! - ‘దిల్’ రాజు

Published Wed, Nov 2 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

హిట్ ఖాయం..నేను గ్యారంటీ!  - ‘దిల్’ రాజు

హిట్ ఖాయం..నేను గ్యారంటీ! - ‘దిల్’ రాజు

‘‘ ‘రెమో’ చిత్రం హిట్ టాక్‌తో తమిళంలో మంచి వసూళ్లు సాధిస్తోంది. అందుకే, ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు ఆసక్తి చూపా. ఈ నెలలోనే తెలుగులో ‘రెమో’ పేరుతోనే విడుదల చేస్తాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు. శివ కార్తికేయన్, కీర్తి సురేశ్ జంటగా భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెమో’. అనిరుధ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీ, ట్రైలర్‌ను హీరోయిన్ సమంత విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో శివకార్తికేయన్ చేసిన లేడీ గెటప్ అలరిస్తుంది.

శ్రీమణి మీనింగ్‌ఫుల్‌గా లిరిక్స్ రాశారు. అనిరుధ్ చక్కటి సంగీతం అందించాడు. పాటలు డబ్బింగ్‌లా కాకుండా స్ట్రెయిట్ సాంగ్స్‌లా సహజంగా ఉన్నాయి. డబ్బింగ్ చిత్రాలకు కూడా స్ట్రెయిట్ మూవీ ఫీలింగ్ తీసుకురావడం నాకు తెలిసి ఒక్క ఎ.యం. రత్నంగారికే సాధ్యమైంది. ఆ తర్వాత ఈ చిత్రానికి అన్నీ అలా కుదరడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం హిట్ అవుతుంది. అందుకు నాది గ్యారంటీ’’ అన్నారు.

‘‘ఇదొక కలర్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇప్పడొస్తున్న చిత్రాలకు వైవిధ్యంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండనుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని శివ కార్తికేయన్ అన్నారు. ఈ వేడుకలో కీర్తీ సురేశ్, దర్శకులు భాగ్యరాజ్ కణ్ణన్, కేఎస్ రవికుమార్, కెమేరామ్యాన్ పీసీ శ్రీరాం, సంగీత దర్శకుడు అనిరుధ్, నటి శరణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement