యూట్యూబ్లో రెమో రికార్డ్ | Remo trailer clocks 10 Lakh views in less than 24 hours | Sakshi
Sakshi News home page

యూట్యూబ్లో రెమో రికార్డ్

Published Tue, Sep 20 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

యూట్యూబ్లో రెమో రికార్డ్

యూట్యూబ్లో రెమో రికార్డ్

తమిళ యంగ్ హీరో శివకార్తీకేయన్ లీడ్ రోల్లో నటిస్తున్న రెమో టీజర్ యూట్యూబ్లో రికార్డ్ సృష్టించింది. రెమో లేడి గెటప్లో కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే పది లక్షల వ్యూస్ సాధించింది. నటుడు కావలనుకునే వ్యక్తి ఓ దర్శకుణ్ని ఆకట్టుకోవటం కోసం ఆడవేశం వేసి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

శివకార్తీకేయ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అట్లీ శిష్యుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీ మురుగన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన శివకార్తీకేయన్, ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement