ఇది మా హీరోకు మంచి ఎంట్రీ! | Siva Karthikeyan, Keerthi Suresh movie remo | Sakshi
Sakshi News home page

ఇది మా హీరోకు మంచి ఎంట్రీ!

Published Tue, Nov 29 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

ఇది మా హీరోకు మంచి ఎంట్రీ!

ఇది మా హీరోకు మంచి ఎంట్రీ!

‘‘రెమో’ చిత్రానికి మొదటి మూడు రోజులు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు పరిస్థితుల్లో కూడా మా ‘రెమో’ మంచి వసూళ్లతో ఆడుతుండటం హ్యాపీ’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. శివ కార్తికేయన్, కీర్తీ సురేశ్ జంటగా భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెమో’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో అందించిన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

టాలీవుడ్‌లో శివకార్తికేయన్ ఎంట్రీకి ఓ మంచి మూవీ అయింది’’ అన్నారు. ఈ చిత్ర సమర్పకుడు ఆర్.డి. రాజా మాట్లాడుతూ-‘‘తమిళంలో ‘రెమో’ సూపర్ హిట్ అయింది. మంచి కథను, కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మక ంతో ‘దిల్’ రాజు సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాం. ఇక్కడ మేము ఊహించిన దానికంటే మంచి స్పందన వచ్చింది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement