దిల్రాజు బ్యానర్లో రెమో తెలుగు వర్షన్ | Dil Raju to Release siva karthikeyas remo in Telugu | Sakshi
Sakshi News home page

దిల్రాజు బ్యానర్లో రెమో తెలుగు వర్షన్

Published Tue, Oct 4 2016 2:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

దిల్రాజు బ్యానర్లో రెమో తెలుగు వర్షన్

దిల్రాజు బ్యానర్లో రెమో తెలుగు వర్షన్

స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాల మీద కూడా దృష్టి పెట్టిన ప్రముఖ నిర్మాత దిల్రాజు, మరో తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురానున్నాడు. ఓకె బంగారం సినిమాను తెలుగులో రిలీజ్ చేసి ఘనవిజయం సాధించిన రాజు, ఈ సారి ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ సినిమాతో ఓ కోలీవుడ్ యంగ్ హీరోను గ్రాండ్గా తెలుగులో లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

తమిళనాట వరస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ రెమో. హీరో లేడి నర్స్ గెటప్లో కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

నేను శైలజ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ సాధించిన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన మేడం సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో రెమో కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు దిల్ రాజు. తెలుగులో కూడా రెమో పేరుతోనే రిలీజ్ కానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement