Mahaveerudu Trailer Starring Sivakarthikeyan And Aditi Shankar Out Now! - Sakshi
Sakshi News home page

Mahaveerudu Trailer: శివ కార్తికేయన్‌ ట్రైలర్‌ విడుదల

Published Mon, Jul 3 2023 8:55 AM | Last Updated on Tue, Jul 4 2023 8:15 AM

Official Trailer Sivakarthikeyan And Aditi Shankar Mahaveerudu - Sakshi

రెమో, డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా... మడోనా అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మావీరన్‌'. తెలుగులో 'మహావీరుడు'గా రానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ ఇందులో హీరోయిన్‌. అరుణ్‌ విశ్వ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చివరి దశకు చేరుకుందని దర్శకుడు మడోనా అశ్విన్‌ తెలిపారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను వారు విడుదల చేశారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై 14న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకొస్తోంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. శివ కార్తికేయన్‌, అదితి మధ్య కెమిస్ట్రీ అందరినీ మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు.  కొద్దిరోజుల క్రితమే బంగారు పేటలోన...  అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు. భరత్‌ శంకర్‌తో కలిసి అదితి శంకర్‌ ఆలపించిన ఈ పాటను సంగీత దర్శకులు రెహమాన్‌ రచించడం  విశేషం. ఈ పాట విడుదలైన రోజు నుంచి మంచి క్రేజ్‌ తెచ్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement