ప్రిన్స్‌ నష్టాలు.. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులిచ్చి ఆదుకున్న హీరో | Prince Loss: Sivakarthikeyan Compensation to Distributors | Sakshi
Sakshi News home page

Prince: సినిమా ఫ్లాప్‌.. డబ్బులు వెనక్కిచ్చిన యంగ్‌ హీరో

Published Wed, Jan 4 2023 6:57 PM | Last Updated on Wed, Jan 4 2023 7:02 PM

Prince Loss: Sivakarthikeyan Compensation to Distributors - Sakshi

శివకార్తికేయన్‌ నటించిన ద్విభాషా చిత్రం ప్రిన్స్‌. జాతిరత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ కేవీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, డి.సురేశ్‌ బాబు, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. తెలుగు, తమిళంలో అక్టోబర్‌ 21న రిలీజైన ఈ మూవీ వసూళ్లు రాబట్టడంలో ఫెయిలైంది. ఫలితంగా అంచనాలు తప్పి రెండు చోట్లా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో రూ.12 కోట్ల మేర నష్టాలు వచ్చాయట!

అయితే ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు హీరో శివకార్తికేయన్‌ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు వారు నష్టపోయిన మొత్తంలో సగం వెనక్కు ఇచ్చేశాడట. అంటే దాదాపు ఆరు కోట్ల మేర వారికి తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఉక్రెయిన్‌ నటి మారియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటించగా తమన్‌ సంగీతం అందించాడు.

చదవండి: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వారిసు ట్రైలర్‌
ముంబైలో డూప్లెక్స్‌ ఇల్లు అమ్మేసిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement