కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా సోషల్‌మీడియా ద్వారా తన అక్క గౌరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక ఓమోషనల్ నోట్ రాశారు. ప్రస్తుతం నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా హీరో రేంజ్‌కు చేరుకున్నాడు. తను నటించిన రీసెంట్ హిట్ సినిమా అమరన్ బాక్సాఫీస్ వద్ద రూ. 330 కోట్లకు పైగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
శివకార్తికేయన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయినప్పటికీ చాలా సాధారణమైన జీవనశైలినే ఇష్టపడుతారు. ఈ క్రమంలో తాజాగా తన సోదరి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇలా పంచుకున్నారు. 'నా జీవితంలో ఆదర్శంగా నిలుస్తున్న ప్రియమైన అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత MBBS (డాక్టర్ కోర్సు) పూర్తి చేశావ్.. తల్లిగా నీ బాధ్యతలు చేస్తూనే 38 ఏళ్ల వయసులో MD వంటి ఉన్నతమైన కోర్సును పూర్తి చేసి గోల్డ్‌మెడల్ సాధించావ్.
ఇప్పుడు 42 ఏళ్ల వయసులో FRCP సాధించావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ అధిగమిస్తూ విజయాన్ని అందుకున్నావ్.. ఈ సందర్భంలో మన నాన్న ఉండుంటే చాలా గర్వంగా ఉండేది అక్క' అంటూ తన సోదరి గురించి చెబుతూ ఆయన ఒక నోట్ విడుదల చేశారు.
శివకార్తికేయన్ వివాహం కూడా తన దగ్గరి బంధువుల అమ్మాయి అయిన ఆర్తితో జరిగింది. 2010 ఆగస్టు 27న ఆర్తిని ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నాడు. శివకార్తికేయన్-ఆర్తి దంపతులకు ఒక కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment