
నటుడు శివ కార్తికేయన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన పేరు ఇప్పుడు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రాచుర్యం పొందింది. కోలీవుడ్లో ప్రముఖ హీరోలలో ఒకరుగా రాణిస్తున్న శివ కార్తికేయన్ ఆరంభ దశలో టీవీ యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఈయన ఆ తర్వాత సినీ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
తొలి చిత్రం మనంకొత్తి పరవై తోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు విజయవంతంతమైన చిత్రాల్లో నటించి స్టార్ డమ్‌ను పెంచుకుంటూ వచ్చారు. ఈయన ఇటీవల నటించిన డాక్టర్, డాన్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత నటించిన తెలుగు చిత్రం ప్రిన్స్ మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ప్రస్తుతం అయిలాన్, మావీరన్ చిత్రాల్లో నటిస్తున్నారు. మావీరన్ చిత్రానికి మడోనా అశి్వన్ దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా శివ కార్తికేయన్ నటుడుగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో మావీరన్ చిత్ర యూనిట్ షూటింగ్ స్పాట్‌లో శివకార్తికేయన్‌ను అభినందిస్తూ యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి సందడి చేశారు. కాగా, ప్రిన్స్ చిత్ర నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. దీని తెలుగు వెర్షన్‌కు మహావీరుడు అనే టైటిల్‌ను నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment