ఎమీ శివకార్తికేయన్‌తో ఓకే అంటుందా?
ఐ చిత్రంతో నటి ఎమిజాక్సన్ పాపులారిటీ బాగా పెరిగి పోయింది. అప్పటి వరకూ ఒక్కో చిత్రం చేసుకుంటూ వచ్చిన ఈ విదేశీ భామ ఇప్పుడు వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే సింగ్ ఈజ్ బ్లింగ్ హిందీ చిత్రంతో పాటు తమిళంలో ధనుష్ సరసన వీఐపీ-2, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా గెంతు చిత్రాల్లో నటిస్తున్నారు. తదుపరి విజయ్ 59వ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా ఎమీకి యువనటుడు శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందన్నది కోలీవుడ్ సమాచారం. శివకార్తికేయన్ నటించిన రజనీమురుగన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
తాజాగా నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్‌తో టీమ్ అప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. 24 ఏవీఎం స్టూడియోస్ పతాకంపై నిర్మాత రాజా నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నదే ఇంకా నిర్ణయం కాలేదు. మొద ట ఇందులో సమంత నటించే అవకా శం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఆమెను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయట. అయితే ఆమె కాల్‌షీట్స్ చిక్కే అ వకాశం లేదో ఏమో గానీ మరో పక్క ఎమిజాక్సన్‌ను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. మరి ఎమీ శివకార్తికేయన్‌తో డ్యూయెట్లు పాడడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.