బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తమిళంలో ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శివ కార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు కియారా అద్వానీని సంప్రదించి, కథ కూడా వినిపించారట దర్శకుడు. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు కియారా అద్వానీ.
Comments
Please login to add a commentAdd a comment