
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది.

ఇకపోతే ఈ సినిమా వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ విఘ్నేశన్ అనే విద్యార్థి చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్లు చేసి విసిగిస్తుండటంతో మానసిక వేదనకు లోనవుతున్నానన్నాడు.

అసలేం జరిగిందంటే?
అమరన్ సినిమాలోని ఓ సీన్‌లో సాయిపల్లవి హీరోకు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. అది నిజంగానే సాయిపల్లవి నెంబర్ అని భావించిన ఫ్యాన్స్ ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలో చూపించిన నెంబర్ తనదేనని విఘ్నేశన్ అనే ఇంజనీర్ విద్యార్థి తెలిపాడు.
ఇది సాయిపల్లవి నెంబర్ అనుకుని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కాల్స్ చేస్తున్నారని వాపోయాడు. వరుస ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందన్నాడు. తన ఫోన్ నెంబర్ ఉపయోగించినందుకుగానూ అమరన్ టీమ్ రూ.1.1 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. మరి ఈ గొడవపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment