కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అయలాన్. ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా కనిపించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య అయలాన్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా శివకార్తికేయన్ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు.
శివకార్తికేయన్ మాట్లాడుతూ.. 'అయలాన్ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇతర చిత్రాలను బ్రహ్మాండంగా రూపొందించడం శంకర్ తరువాత రవికుమారే ఉంటారు. ఆర్థిక సమస్యల కారణంగా చిత్ర నిర్మాణం కాస్తా ఆలస్యమైంది. అయలాన్ చిత్ర షూటింగ్‌ను 75 శాతం పూర్తి చేసిన తరువాత ఈ చిత్రం ఎలా వస్తుందో మాకు అర్థమైపోయింది. దీంతో చిత్రాన్ని పక్కన పెట్టలేకపోయామని చెప్పారు. ఈ చిత్రాన్ని రాజీ పడకుండా చేశామని చెప్పారు. అయలాన్ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు.
కాగా.. ప్రస్తుతం రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో నటిస్తున్నట్లు శివకార్తికేయన్ వెల్లడించారు. ఈ సినిమాలో నటి సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తైనట్లు తెలిపారు. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు శివకార్తికేయన్ చెప్పారు. ఇందులో మృణాల్ ఠాగూర్ నాయకిగా నటిస్తున్నారని తెలిపారు.
కాగా.. రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో తాను నటించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని శివకార్తికేయన్ తెలిపారు. తాను రజనీకాంత్‌కు అభిమానిని అని వెల్లడించారు. అయితే ఆయనతో కలిసి నటించడం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment