హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం తెలుగులో మహావీరుడు పేరుతో విడుదల కానుంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ భారీ ఎత్తున దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి మండేలా చిత్రం ఫేమ్ మడోనా అశ్విన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలోని సీన్ ఆ సీన్ అనే పాట గ్లింప్సెస్‌ను విడుదల చేశారు.
30 సెకన్ల నిడివితో కూడిన ఈ పాటలో నటుడు శివకార్తికేయన్ ఎనర్జిటికల్ డాన్స్ చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది. కాగా ఈ పాటలో 500కు పైగా నృత్య కళాకారులు 150 మందికి పైగా చిత్ర బృందం పాల్గొనడం విశేషం. గీత రచయితలు కపిలన్, లోకేష్ రాసిన ఈ పాటకు భరత్ శంకర్ సంగీత బాణీలు కట్టారు. శోబీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు.
కాగా ఈ పాటలో చెన్నైకు చెందిన 500కు పైగా నృత్య కళాకారులను నటింప చేయడంపై చిన్ని ప్రకాష్, బాబు తదితరులు మావీరన్ చిత్ర కథానాయకుడు నటుడు శివకార్తికేయన్, దర్శకుడు మడోనా అశ్విన్, నిర్మాత అరుణ్ విశ్వకు అభినందనలు తెలిపారు. కాగా ప్రస్తుతం శివకార్తికేయన్, మిష్కిన్, సునీల్ పాల్గొంటున్న ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment