Hero Dhanush With New Beard Shocking Look At Mumbai Airport, Video Viral - Sakshi
Sakshi News home page

Actor Dhanush : షాకింగ్‌ లుక్‌లో హీరో ధనుష్‌.. బాబా రాందేవ్‌లా ఉన్నాడంటూ కామెంట్స్‌

May 30 2023 10:41 AM | Updated on May 30 2023 11:22 AM

Actor Dhanush Shocking Look At Mumbai Airport Seen In Long Hair - Sakshi

వైవిధ్యభరితమైన సినిమాలతో, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ధనుష్‌. కోలీవుడ్‌ హీరో అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రీసెంట్‌ సార్‌ మూవీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ధనుష్‌ ఇప్పుడు కెప్టెన్ మిల్లర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కోసం డిఫరెంట్‌ మేకోవర్‌లో కనిపించనున్న ధనుష్‌ ఇందుకోసం తన లుక్‌ని పూర్తిగా మార్చేశాడు. కొత్త గెటప్‌లో కనిపించి అందరినీ షాక్‌కి గురిచేశాడు. ముంబై ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైన ధనుష్‌ పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ధనుష్‌ లుక్‌ని పలువురు బాబా రామ్‌దేవ్‌తో పోలుస్తున్నారు. అచ్చం ఆయనలాగే ఉన్నారని, ధనుష్‌ అని గుర్తుపట్టడం కూడా కష్టంగా మారిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement