మీకు సూపర్‌ స్టార్‌తో పోలికా?.. ధనుశ్‌ కామెంట్స్‌పై నెటిజన్స్‌ ఫైర్! | Dhanush receives backlash for calling himself an outsider at Raayan Event | Sakshi
Sakshi News home page

Dhanush: ' ఎలాంటి టాలెంట్‌ లేకపోయినా నెట్టుకొచ్చారు'.. ధనుశ్‌పై నెటిజన్స్‌ కామెంట్స్‌

Published Wed, Jul 24 2024 9:06 PM | Last Updated on Thu, Jul 25 2024 9:35 AM

Dhanush receives backlash for calling himself an outsider at Raayan Event

కోలీవుడ్ స్టార్ ధనుశ్ ప్రస్తుతం రాయన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌ను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాను కిందిస్థాయి నుంచి పైకి వచ్చానని ఈవెంట్‌లో ధనుశ్ మాట్లాడారు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. వీధుల్లో పెరిగిన నేను.. పోయెస్ గార్డెన్‌లో కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశామని వెల్లడించారు. అంతేకాదు సూపర్ స్టార్‌ రజినీకాంత్‌, జయలలిత లాంటి దిగ్గజాలు ఉండే ప్రాంతంలో ఇంటిని కొన్నట్లు పేర్కొన్నారు. నాకు 16 ఏళ్ల వయసులో ఫ్రెండ్‌తో కలిసి రజినీకాంత్‌ ఇంటిని చూసేందుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు రజినీకాంత్ ఇల్లు అని.. ఆ పక్కన జయలలిత ఇల్లు అని చెప్పారని అన్నారు. అప్పుడే నేను చిన్న ఇంటినైనా కొనలేనా? అని మనసులో అనుకున్నానని చెప్పారు.

అయితే ధనుశ్‌ చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మీరు కష్టపడి పైకొచ్చారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ నాన్న డైరెక్టర్‌.. మీ బ్రదర్ కూడా దర్శకుడే.. ‍అలాంటి మీరు ఎలాంటి టాలెంట్ లేకపోయినా కెరీర్‌ తొలి రోజుల్లో నెట్టుకొచ్చావని అన్నారు. మీరు పోయెస్ గార్డెన్‌లో ఇల్లు మీలాంటి వారికి పెద్ద విషయమే కాదన్నారు. అసలు మిమ్మల్ని రజినీకాంత్‌తో ఎలా పోల్చుకుంటారు? కొందరు ప్రశ్నించారు. ఆయన కండక్టర్‌ స్థాయి నుంచి సూపర్ స్టార్‌ స్థాయికి సొంతంగా ఎదిగారని ధనుశ్‌కు గుర్తు చేశారు. ఆయన కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడం వల్లే మీకు గుర్తింపు వచ్చిందని చురకలంటించారు. అయితే మరికొందరేమో ధనుశ్‌ చెప్పిన మాటలు ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.


కాగా.. ధనుష్ దర్శకత్వం వహించిన రాయన్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కుబేరలో ధనుశ్ కనిపించనున్నాడు. నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ కూడా ఇందులో నటిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement