Thalapathy Vijay Father Chandrasekhar Opens Up About Clashes With His Son - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay : విజయ్‌తో నాకు విభేదాలు ఉన్న విషయం నిజమే.. విజయ్‌ తండ్రి కామెంట్స్‌ వైరల్‌

Published Sat, Jan 28 2023 1:50 PM | Last Updated on Sat, Jan 28 2023 2:52 PM

Thalapathy Vijay Father Chandrasekhar Opens Up About Clashes With Him - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌కు తండ్రి చంద్రశేఖర్‌తో విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమధ్య విజయ్‌ తన సొంత తండ్రిపైనే ఫిర్యాదు చేయడం, అప్పట్లో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ వారిమధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. తాజాగా విషయంపై విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ స్పందించారు.

ఓ తమిళ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడుకుతో సరిగ్గా మాటలు లేవని చెప్పారు. తండ్రీ-కొడుకుల మధ్య సాధారణంగా ఉన్నట్లే మా మధ్య కూడా చిన్నచిన్న అభిప్రాయ బేధాలు ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంగా సరిగ్గా మాటల్లేవు. కానీ విజయ్‌ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి. ఆమధ్య విజయ్‌ ఏదో స్టేట్‌మెంట్‌ ఇచ్చాడని మీడియా రచ్చ చేసింది.

కానీ నిజానికి విజయ్‌తో నాకు అంత తగాదాలు లేవు. దీని గురించి చర్చించాల్సిన పెద్ద విషయం కాదు. విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు మొన్నీమధ్య విజయ్‌తో కలిసే వారీసు సినిమా చూశాను. ఇది చాలు కదా.. మా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో చెప్పడానికి అంటూ విజయ్‌ తండ్రి చెప్పుకొచ్చారు.  కాగా విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపైనే తండ్రీ-కొడుకులను విభేదాలు వచ్చాయి. దీంతో తండ్రి నిర్వహించే పొలిటికల్‌ ఈవెంట్స్‌కి తనకు సంబంధం లేదని స్వయంగా విజయ్‌ పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement