thalapathi
-
విజయ్ కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులు..విందుతో పాటు.. (ఫొటోలు)
-
విజయ్ సినిమాలో రోల్.. ఎందుకు వెనక్కి తగ్గారో తెలీదు: శివరాజ్ కుమార్
ది గోట్ సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం దళపతి69. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నికల పోటీకి ముందు విజయ్ కెరీర్లో ఇదే చివరి చిత్రం కానుంది. అయితే ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ విపిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ఈ వార్త తెగ వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పందించారు. దళపతి69 మూవీ డైరెక్టర్‌తో తాను మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. దర్శకుడు హెచ్ వినోద్ బెంగళూరులో తనను వ్యక్తిగతంగా కలిశాడని.. అంతేకాకుండా నా పాత్రకు సంబంధించి వివరించాడని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అదొక అద్భుతమైన రోల్ అని అన్నారు.అయితే మళ్లీ కొద్ది రోజుల తర్వాత వినోద్ మరోసారి తనతో భేటీ అయ్యారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ రోల్ ప్రస్తుతానికి వర్కవుట్ కాదని వివరించారని.. మీకోసం భవిష్యత్తులో మరో ఆఫర్‌తో వస్తానని చెప్పాడని శివరాజ్ అన్నారు. అయితే అసలేం జరిగిందో.. ఆఫర్‌ను ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో కారణాలు మాత్రం తెలియదన్నారు. ఈ ఆఫర్ రాకపోయినప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని శివరాజ్ కుమార్ తెలిపారు. కాగా.. ఇవాళ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బైరాతి రనగల్ థియేటర్లలో విడుదలైంది.కాగా.. శివరాజ్ కుమార్‌కు కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా పేరుంది. శాండల్‌వుడ్‌తో పాటు తమిళ సినిమాలలో అనేక చిత్రాలలో నటించారు. మరోవైపు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మూవీలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు కన్నడ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం వచ్చేనెల డిసెంబర్లో యుఎస్ వెళ్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. జనవరి 2025లో ఇండియాకు తిరిగి వచ్చాక సినిమాల్లో నటిస్తానని తెలిపారు. -
Actor Vijay: మతతత్వ, అవినీతి శక్తులే... మా శత్రువులు
సాక్షి, చెన్నై: కేంద్రంలో, తమిళనాట అధికార పార్టీలైన బీజేపీ, డీఎంకేలపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. ‘‘మతం, భాష అంటూ ప్రజల్ని చీల్చి రాజకీయం చేసే శక్తులు, ద్రవిడ నమూనా అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిపరులే మా పార్టీకి ప్రధాన శత్రువులు’’ అని ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తమతో కలిసి వచ్చే వారిని అధికారంలో భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. ఆయన 8 నెలల క్రితం సొంత పార్టీ ఏర్పాటు చేయడం తెలిసిందే. టీవీకే తొలి మహానాడు విల్లుపురం జిల్లా వీ సాలై గ్రామంలో ఆదివారం జరిగింది. సభకు అభిమానులు, కార్యకర్తలు అసంఖ్యాకంగా పోటెత్తారు. ఈ సందర్భంగా విజయ్ ఆవేశపూరితంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘‘ద్రవిడ సిద్ధాంతకర్త ఈవీఆర్ పెరియార్, కర్మ యోగి కామరాజ్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, వీర నారీ వేలూ నాచియార్ ఆదర్శంగా టీవీకే సాగుతుంది. లౌకిక, సామాజిక, న్యాయ సిద్ధాంతాలతో పార్టీని నడుపుతాం. అందరం సమానమని చాటే సరికొత్త రాజకీయాలను తమిళనాడులో చూస్తారు’’ అని అన్నారు. ‘‘నన్ను విమర్శించిన వాళ్ల పేర్లను ప్రస్తావించబోను. వాళ్లలా అమర్యాదకరంగా మాట్లాడబోను. సంస్కారయుత రాజకీ యాలు చేస్తా’’ అని చెప్పారు. ఎంజీఆర్, ఎన్టీఆరే స్ఫూర్తి తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయంగా చరిత్ర సృష్టించారని విజయ్ గుర్తు చేశారు. ‘‘ఆ దిశగా తమిళనాడులో మరో కొత్త అధ్యాయం లిఖిస్తాం. శాస్త్రసాంకేతి రంగాల్లో మాత్రమే మార్పు రావాలా? రాజకీయాలూ మారాలి. కానీ నన్ను ఈ స్థాయికి తెచ్చిన ప్రజలకు ఏదోఒకటి చేయాలనే అన్నింటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి అడుగుపెట్టా. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న సినిమా కెరీర్‌ను వదిలి వచ్చా’’. అన్నారు. నీట్ పరీక్ష విధానాన్ని విజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. తన చెల్లెలి మరణం ఎంతగా బాధించిందో ‘నీట్’ కారణంగా అరియలూర్‌లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఉదంతమూ అంతే బాధించిందన్నారు.అశేష జనవాహిని మహానాడుకు నిర్వాహకులే ఊహించని రీతిలో జనసందోహం పోటెత్తింది. సభ సాయంత్రం నాలుగింటికి కాగా ఉదయం నుంచే వేలాదిగా అభిమానుల రాక మొదలైంది. దాంతో సభను ముందుగానే ప్రారంభించారు. రాత్రి ఏడింటికి సభ ముగిసినా రాత్రి 9 దాకా జనం వస్తూనే ఉన్నారు. దాంతో చెన్నై–తిరుచ్చి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింంది. -
వెట్టయాన్ ఫస్ట్ షో వీక్షించిన స్టార్ హీరో.. వీడియో వైరల్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.అయితే రజినీకాంత్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తమిళ అభిమానం గురించి చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ మొదటి రోజే ఫస్ట్ షో చూడాలనే ఆతృత అభిమానులకు ఉంటుంది. కానీ ఒక స్టార్ హీరో మూవీ ఫస్ట్ షో చూడడం చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. ఇవాళ అలాంటి అరుదైన సంఘటనే చోటు చేసుకుంది.ఇటీవల ది గోట్ మూవీ అభిమానులను మెప్పంచిన విజయ్.. రజినీకాంత్ చిత్రం వేట్టయాన్ ఫస్ట్ షోను వీక్షించారు. ఆయనతో పాటు ది గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్.. రజనీకాంత్‌కు అభిమాని కావడంతో మొదటి ఆటను చెన్నైలో ఓ థియేటర్లో చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. வேட்டையன் படம் பார்த்த விஜய்... தலைவருக்காக வந்த தளபதி..!#Chennai #ThalapathyVijay #Vijay #Vettaiyan #VettaiyyanMovie #VettaiyanFDFS #VettaiyanReviews #Rajinikanth #DeviTheatre #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/csFT8A3FUB— News Tamil 24x7 (@NewsTamilTV24x7) October 10, 2024 -
దళపతి సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ..!
దళపతి విజయ్ ఇటీవలే ది గోట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. సెప్టెంబర్ 5న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ నెల 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే విజయ్ మరో చిత్రానికి రెడీ అయ్యారు. హెచ్ వినోత్ డైరెక్షన్లో ఆయన నటించనున్నారు. అయితే ఈ మూవీలో దళపతి సరసన బుట్టబొమ్మ ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ హౌస్ పూజా హెగ్డేకి స్వాగతం పలుకుతూ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతకుముందు పూజా హెగ్డే బీస్ట్ చిత్రంలో విజయ్ సరసన నటించింది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు. రాజకీయాల్లో పోటీకి ముందు ఈ సినిమానే విజయ్ కెరీర్లో చివరి చిత్రంగా నిలవనుంది.(ఇది చదవండి: ఓటీటీలో విజయ్ 'ది గోట్' సినిమా.. అధికారిక ప్రకటన)దళపతి 69 పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లో విజయ్ టార్చ్ పట్టుకుని కనిపించారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 5న షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions) View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions) -
కలిసొచ్చిన వినాయక చవితి.. ది గోట్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. శనివారం వినాయక చవితి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించింది. వీకెండ్ కావడంతో ఒక్క రోజే రూ.33 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.విడుదలైన మూడో రోజే దేశవ్యాప్తంగా కలెక్షన్లలో రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తొలిరోజు రూ.43 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన ది గోట్ చిత్రం రెండో రోజు రూ.25.5 కోట్లు వచ్చాయి. అయితే శనివారం వీకెండ్, వినాయకచవితి పండుగ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.102.5 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది. శనివారం తమిళంలో థియేటర్లలో 72.58 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. రాజకీయాల్లో పోటీకి ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
థియేటర్లలో ది గోట్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'ది గోట్'(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు నుంచే ది గోట్ థియేటర్లలోకి వచ్చేసింది. ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ మార్నింగ్ షోలు పడిపోయాయి. తెల్లవారుజూము నుంచే థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.ఫస్ట్ హాఫ్ ముగియగానే ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. ఫైట్స్, యాక్షన్ సీన్స్‌లో విజయ్ ఫర్మామెన్స్ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని.. విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెబుతున్నారు. అయితే ఇదే కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే..ఈ సమీక్షకు సాక్షి ఎలాంటి బాధ్యత వహించదని తెలియజేస్తున్నాం. #GOAT BLOCKBUSTER 🔥🔥🔥First Half - 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥Second Half - 🔥🔥🔥🔥🔥🔥🤯🤯🔜Different Genre& Screenplay🥵🥶#GOATFDFS #GOATReview#TheGreatestOfAllTime #TheGOATpic.twitter.com/1Sf1ZRbaUQ— Mᴜʜɪʟツ𝕏 (@MuhilThalaiva) September 4, 2024First half Review 🔥#TheGreatestOfAllTime pic.twitter.com/Tn14k2VhFc— Mahi Bro (@Mahi14345) September 5, 2024We Won Thalaivaa @actorvijay 😭💥💥BLOCKBUSTER🔥🔥🔥🔥#GOATFDFS #GOATReview#TheGreatestOfAllTime #TheGOATpic.twitter.com/kdvsXbvrrG— Mᴜʜɪʟツ𝕏 (@MuhilThalaiva) September 5, 2024Unanimous positive response for the first half🔥🔥#TheGreatestOfAllTime #TheGOAT pic.twitter.com/qTWqkhMWzV— Rebel Relangi (@RebelRelangi) September 5, 2024Industry Hit Loading 🥵🔥🔥BLOCKBUSTER champion🏆🏆 ✅#GOATFDFS #GOATReview #GOAT#TheGreatestOfAllTime #TheGoatFromSep5 pic.twitter.com/QDoiQlaeYV— MAHI 𝕏 (@MahilMass) September 5, 2024 -
రజినీకాంత్ సంచలన కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
కోలీవుడ్ సూపర్‌స్టార్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా రజినీకాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయాలను ఉద్దేశించి తలైవా చేసిన వ్యాఖ్యలు మరో స్టార్ హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.తాజాగా ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టులాంటిదని.. దాన్ని ఎవరూ కదిలించలేరని అన్నారు. ఎలాంటి తుఫానునైనా ఈ పార్టీకి ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఎదురైన సమస్యలు మరెవరికైనా వచ్చి ఉంటే కనుమరుగయ్యేవారన్నారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంటసేపు మాట్లాడారంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ అద్భుతంగా పనిచేస్తున్నారని రజినీకాంత్ కొనియాడారు. ఎ.వి.వేలు రచించిన కళైంజ్ఞర్ ఎనుమ్ థాయ్ అనే పుస్తకావిష్కరణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్అయితే కోలీవుడ్ స్టార్హీరో, దళపతి ఇటీవలే తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు విజయ్ పార్టీని ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం తలైనా చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. -
దళపతితో పాటు ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా?
దళపతి విజయ్ ప్రస్తుతం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. లియో సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి విజిలేస్కో అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అయితే విజయ్ మూవీ షూటింగ్ ప్రస్తుతంలో కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రంభను కలిశారు. ఆమె తన కుటుంబంతో కలిసి విజయ్‌తో దిగిన ఫోటోలను తాజాగా ట్విటర్లో పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత నాకు ఇష్టమైన హీరోను కలిశానంటూ రంభ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. It was nice meeting you and catching up after years at @actorvijay :) Congratulations! Wish you the very best #tamilagavetrikalagam #NortherUni #Magickhome #magickhomecanada #Magickwoods pic.twitter.com/Rv2wztbl5q— Rambha Indrakumar (@Rambha_indran) July 17, 2024Shivin with our favourite beloved Thalapathy @actorvijay 🥰 pic.twitter.com/G4XqGDw8ei— Rambha Indrakumar (@Rambha_indran) July 17, 2024 -
ఎన్నాళ్లో వేచిన హృదయం.. ఆ స్టార్ హీరో క్రేజ్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే ఇవాళ దాదాపు 14 ఏళ్ల తర్వాత దళపతి విజయ్ కేరళలో అడుగుపెట్టారు. ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన తిరువనంతపురం చేరుకున్నారు. ఎయిర్ పోర్టు చేరుకున్న దళపతి విజయ్‌కు ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరువనంతపురం ఎయిర్ పోర్టు నుంచి విజయ్ బయటకు రాగానే ఒక్కసారిగా అందరూ కేకలు వేస్తూ సందడి చేశారు. దళపతి.. విజయ్.. విజయ్.. అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. దీంతో కారులో నుంచి సన్‌రూఫ్ ద్వారా నిలబడి అభిమానులను విజయ్ అభివాదం చేశారు. చేతులు ఊపుతూ అభిమానులను పలకరించారు. కేరళలో విజయ్ క్రేజ్ చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో రావడంతో ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో రోడ్లు బ్లాక్ అయిపోయాయి. భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కాగా.. గతంలో 2011లో కావలాన్ మూవీ షూటింగ్ కోసం చివరగా కేరళకు వెళ్లారు. మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి వెళ్లడంతో ఆయనకు స్వాగతం పలికారు. కాగా.. గోట్ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో దళపతి విజయ్ నటించనున్నారు. Road block completely 🙏🙏#VijayStormHitsKeralapic.twitter.com/cjkzEGUdlk — Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) March 18, 2024 HD Video of Thalapathy’s entry in Trivandrum 🥁 #VijayStormHitsKerala pic.twitter.com/Ga6Qc5KZix — Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) March 18, 2024 -
దళపతి కొత్త మూవీ.. టైటిల్ అదేనంటూ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 68వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లియో తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఒక పాత్ర కోసం విజయ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూత్ ఫుల్‌గా తయారవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా ఈ చిత్రానికి బాస్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు న్యూస్ తెగ వైరలవుతోంది. ఇకపోతే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబరు 31వ తేదీన విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు రెడీ అయ్యాయి. దీనిపై గురించి చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అర్చన తెలుపుతూ తమ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారంలో ఏదీ నిజం లేదన్నారు. ముఖ్యంగా చిత్ర టైటిల్ బాస్ అని జరుగుతున్న ప్రచారంలో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు. ఈ చిత్రానికి సంబంధించి వెంకట్ ప్రభు స్పెషల్‌గా ఆలోచించారని.. ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. విజయ్ తన 69, 70వ చిత్రాలకు కూడా కమిట్ అయినట్లు తెలిసింది. తన 69వ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్, 70వ చిత్రానికి దర్శకుడు శంకర్ లేదా అట్లీ గానీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా.. ఈ చిత్రంలో నటి స్నేహ, లైలా, రాఘవ లారెన్స్, ప్రశాంత్, మైక్ మోహన్, ప్రేమ్ జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
విజయ్ను డైరెక్ట్ చేసే లాస్ట్ ఛాన్స్ ఆ దర్శకుడికే..
కోలీవుడ్‌లో వసూళ్ల రారాజు నటుడు విజయ్. ఈయన చిత్రం వస్తుందంటే ఇతర చిత్రాల నిర్మాతల్లో కలవరం. అభిమానుల్లో కోలాహలం కనిపిస్తాయి. ఆ స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్న దళపతి విజయ్ నటకు బ్రేక్ ఇస్తారా? ఇది జరిగే పనేనా? అంశం ప్రస్తుతం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీపావళికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) కాగా విజయ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన 68వ చిత్రం అవుతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. దీన్ని విజయ్ 2024 మే నెలాఖరు కల్లా పూర్తి చేసి నటనకు బ్రేక్ ఇవ్వనున్నారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల విజయ్ ఓటుకు నోటుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు గట్టిగానే హితబోధ చేశారు. కాగా 2025 ఏడాదంతా విజయ్ ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ సేవా కార్యక్రమాలు, రాజకీయ అంశాలపై పూర్తిగా దష్టి పెట్టనున్నట్లు టాక్. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దీంతో విజయ్ చర్యలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ సాగుతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ) -
మళ్ళీ ట్రెండ్ సెట్ చేయబోతున్న విజయ్ దళపతి, అనిరుధ్
-
విజయ్ పాన్ ఇండియా సినిమా రవితేజ చేతుల్లోకి..!
-
'వారీసు' తర్వాత మరో తెలుగు డైరెక్టర్‌తో విజయ్ సినిమా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు తెలుగులో మాంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా ఆయనకు సూపర్ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఇక రీసెంట్గా వారసుడు సినిమాతో తెలుగులో తొలిసారి ఎంట్రీ ఇచ్చారు విజయ్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయనున్నారట విజయ్. బాలకృష్ణతో ‘వీరసింహా రెడ్డి’ మూవీని డైరెక్ట్ చేసిన గోపీచంద్ మలినేనితో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటీవలె గోపీచంద్ మలినేని కథను వినిపించగా, విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
శంకర్ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్? రూ. 900కోట్ల బడ్జెట్!
భారీ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. కమలహాసన్, రజనీకాంత్‌తో భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ అయిన దర్శకుడు ఈయన. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా తొలిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ నటుడు రామ్‌చరణ్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శంకర్ తరువాతి చిత్రం ఏమిటి అన్న ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఆయన రూ.900 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి శస్త్ర అ్రస్తాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి క్రేజీ కాంబినేషన్‌ను సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఆ క్రేజీ కాంబినేషన్ దళపతి విజయ్, బాద్షా షారుక్ ఖాన్. ఎప్పుడూ కొత్త కంటెంట్‌ను తీసుకునే దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి అండర్ వాటర్‌లో జరిగే విజ్ఞానాన్ని కథగా తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కోలీవుడ్‌కు సుపరిచితుడే. ఈయన చాలా కాలం క్రితమే కమలహాసన్ కథానాయకుడిగా నటించిన హేరామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈయన నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక దళపతి విజయ్ ఇంతకుముందే శంకర్ దర్శకత్వంలో నన్బన్ చిత్రంలో నటించారు. విజయ్ తాజాగా నటించిన వారిసు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ విడుదలైంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇకపోతే షారుక్ ఖాన్‌కు విజయ్‌కు మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న హిందీ చిత్రం జవాన్‌లో విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో షారుక్ ఖాన్, విజయ్ కాంబినేషన్లో చిత్రం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
హీరోయిన్ ప్రియా ఆనంద్‌కు లక్కీ ఛాన్స్.. యమ ఖుషీలో నటి
అనుకున్నది జరగకపోవడం, ఊహించనిది జరగడమే జీవితం. అందుకే అంటారు పెద్దలు ఏం జరిగినా అంతా మన మంచికే అని. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు హాట్ టాక్‌గా వరిన విషయం విజయ్ 67 చిత్రం. బీస్ట్ చిత్రం నిరాశపరినా, వారీసు చిత్రంతో నటుడు విజయ్ మళ్లీ విజయబాట పట్టారు. ప్రస్తుతం తన 67వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి మాస్టర్, విక్రమ్ చిత్రాల ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్.లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను నిర్మాతలు వినత్న పద్ధతిలో గంటకో నటుడి చొప్పున పరిచయం చేశారు. ముందుగా నటుడు అర్జున్ పేరును, ఆ తరువాత దర్శకుడు గౌతమ్ మీనన్, మిష్కిన్, మ్యాత్యూ థామస్, మన్సూర్ అలీఖాన్, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, నృత్యదర్శకుడు శాండి, నటి ప్రియా ఆనంద్ తాజాగా బుధవారం త్రిష పేరును ప్రకటించారు. నటి త్రిష ఇంతకు ముందు విజయ్ సరసన మూడు చిత్రాల్లో నటించారు. సుమారు 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు నటిస్తున్నారు. ఇక నటి ప్రియాఅనంద్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఈ అమ్మడికి నటించే అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే ఇంత పెద్ద అవకాశం రావడం ఈమెకు ఇదే తొలిసారి అవుతుంది. వామనన్ చిత్రం ద్వారా 2009లో కథానాయకిగా పరిచయం అయిన నటి ప్రియా ఆనంద్. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా పెద్ద స్టార్స్‌తో ఇప్పటి వరకూ నటించలేదు. తాజాగా విజయ్‌తో జత కట్టే అవకాశం రావడంతో యమ ఖుషీ అయిపోతోందట. కారణం 11 ఏళ్ల క్రితం విజయ్ సరసన తుపాకీ చిత్రంలో ఈ బ్యూటీనే నటించాల్సి ఉందట. ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తొలి చాయిస్ కూడా ప్రియా ఆనంద్‌నే నట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్‌తో జత కట్టే అవకాశం రావడం చెప్పలేనంత ఆనందంగా ఉందంటోంది. -
స్టార్ హీరో విజయ్‌తో నాకు విభేదాలు ఉన్న విషయం నిజమే : తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు తండ్రి చంద్రశేఖర్‌తో విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమధ్య విజయ్ తన సొంత తండ్రిపైనే ఫిర్యాదు చేయడం, అప్పట్లో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ వారిమధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. తాజాగా విషయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందించారు. ఓ తమిళ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడుకుతో సరిగ్గా మాటలు లేవని చెప్పారు. తండ్రీ-కొడుకుల మధ్య సాధారణంగా ఉన్నట్లే మా మధ్య కూడా చిన్నచిన్న అభిప్రాయ బేధాలు ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంగా సరిగ్గా మాటల్లేవు. కానీ విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి. ఆమధ్య విజయ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని మీడియా రచ్చ చేసింది. కానీ నిజానికి విజయ్‌తో నాకు అంత తగాదాలు లేవు. దీని గురించి చర్చించాల్సిన పెద్ద విషయం కాదు. విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు మొన్నీమధ్య విజయ్‌తో కలిసే వారీసు సినిమా చూశాను. ఇది చాలు కదా.. మా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో చెప్పడానికి అంటూ విజయ్ తండ్రి చెప్పుకొచ్చారు. కాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపైనే తండ్రీ-కొడుకులను విభేదాలు వచ్చాయి. దీంతో తండ్రి నిర్వహించే పొలిటికల్ ఈవెంట్స్‌కి తనకు సంబంధం లేదని స్వయంగా విజయ్ పేర్కొన్నారు. -
పెళ్లైన స్టార్ హీరోతో కీర్తి సురేష్ ప్రేమాయణం అంటూ తమిళనాట ప్రచారం
కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ భార్య సంగీతతో విడిపోతున్నాడని, త్వరలోనే వీళ్లు విడాకులు తీసుకోనున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్‌కి బలం చేకూర్చేలా విజయ్‌కు సంబంధించిన ఈవెంట్స్‌లోనూ సంగీత ఎక్కడా కనిపించడం లేదు. 22 ఏళ్ల తమ వివాహ బంధాన్ని విజయ్ తెగదెంపులు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే విజయ్ విడాకులకు స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ కారణమని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో కీర్తి సురేష్ విజయ్‌తో కలిసి ‘భైరవ’, ‘సర్కార్’ వంటి సినిమాల్లో నటించింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అది ప్రేమగా మారిందని, భార్య సంగీత ఎన్నిసార్లు చెప్పినా విజయ్ కీర్తితో క్లోజ్‌గా ఉంటున్నాడని తమిళ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. భార్యతో విడాకుల తర్వాత కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో #JusticeForSangeetha (విజయ్ భార్య పేరు)అనే హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. అదే విధంగా కీర్తి సురేష్‌ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే దీనిపై విజయ్ కానీ, సంగీత కానీ, కీర్తి సురేష్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే వారీసు హిట్‌తో కొందరు ఓర్వలేక ఇలాంటివి తెరపైకి తీసుకొస్తున్నారని, కావాలనే కీర్తి సురేష్‌ను ఇందులోకి లాగుతున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై స్వయంగా విజయ్ స్పందిస్తే తప్పా ఇది ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. Worst Ra da vijay 😤#JusticeForSangeethapic.twitter.com/CIq4q7qxKV — 🇧🇷DILLIᵀʰᵘⁿⁱᵛᵘ⚜️ (@itsdilli0700) January 22, 2023 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ 'వారీసు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్ సహా తెలుగులోనూ పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా భారీ ధరకు అమెజాన్ వారీసు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 10న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది.సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వారీసు సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మూవీ టీం రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే వారీసు విడుదల అవుతుందని, పుకార్లను నమ్మవద్దంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. Meet THE BOSS’s family in 3 days in theatres near you nanba 🤩#3DaysForVarisu#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @iamRashmika @Lyricist_Vivek @7screenstudio @TSeries #Varisu #VarisuPongal pic.twitter.com/RbAsoqrpNS — Sri Venkateswara Creations (@SVC_official) January 8, 2023 -
అజిత్ వర్సెస్ విజయ్.. సూపర్‌స్టార్ ఎవరు? కోలీవుడ్‌లో ఫ్యాన్స్ రచ్చ
తమిళసినిమా: సూపర్‌స్టార్ ఎవరన్న విషయంపై కోలీవుడ్‌లో పెద్ద వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ కథానాయకుడిగా వారిసు చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజు విజయ్‌కు అజిత్ కంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉందని, ఆయనే నంబర్‌వన్ అని ఆ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు. అదే వేదికపై నటుడు శరత్‌కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తు సూపర్‌స్టార్ విజయ్ అని తాను సూర్యవంశం విజయోత్సవ వేదికపైనే చెప్పానని.. అది నిజమైందని పేర్కొన్నారు. అది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో డిబేటింగ్ వరకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఉన్నంత వరకు ఆయనే సూపర్‌స్టార్ అని సీనియర్ నటుడు, నిర్మాత కె.రాజన్ పేర్కొన్నారు. నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ మాత్రం నేటి సూపర్‌స్టార్ విజయ్ అని తెలిపారు. ఈ చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కాగా ఈ విషయమై నటుడు శరత్‌కుమార్ ఒక చానల్లో మాట్లాడుతూ.. తాను విజయ్ సూపర్‌స్టార్ అని సంబోధించానే కాని రజనీకాంత్, అజిత్ సూపర్స్టార్లు కాదని చెప్పలేదన్నారు. రజనీకాంత్‌తో పాటు అజిత్, అమితాబచ్చన్, షారూక్‌ఖాన్ వీళ్లంతా సూపర్స్టార్లేనని శరత్‌కుమార్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా సూపర్‌స్టార్ అన్నది ఒక టైటిల్ కాదని పేర్కొన్నారు. దీని గురించి ఇకపై వివాదం చేయాలన్న ఆలోచన లేదని, దీనిని వివరించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అదే విధంగా తాను విజయ్ ముఖ్యమంత్రి అవుతారనో, మంత్రి అవుతారనో చెప్పలేదని, సూపర్‌స్టార్ అవుతారని చెప్పానని అన్నారు. జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారంతా సూపర్‌స్టార్లే అని పేర్కొన్నారు. సూర్యవంశం చిత్ర వేడుకలలో చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నానని, రియల్ సూపర్‌స్టార్ అంటే ఎప్పటికీ ఎంజీఆర్నే అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
షాకింగ్.. భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్? ఫ్యాన్స్ ఆందోళన
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వనున్నారంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. కొంతకాలంగా ఇద్దరికి విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉన్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. నిజానికి విజయ్‌కు సంగీత వీరాభిమాని. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలా అర్థాంతరంగా విడాకులు తీసుకోవడం ఏంటని విజయ్ ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ విడాకుల రూమర్స్ ఎలా వచ్చాయంటే.. రీసెంట్గా వారీసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంగీత రాకపోవడం, ఆమధ్య డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ సీమంతం వేడకలోనూ విజయ్ ఒక్కడే వెళ్లడంతో వీరిద్దరికి విబేధాలు తలెత్తాయంటూ తమిళవర్గాల్లో వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇందులో నిజం లేదని విజయ్ సన్నిహితవర్గాలు తేల్చేశాయి. ప్రస్తుతం పిల్లలతో కలిసి సంగీత అమెరికాలో ఉందని, త్వరలోనే ఆమె ఇండియాకు రానున్నట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మకండి అంటూ రూమర్స్‌కి చెక్ పెట్టారు. మరోవైపు వారీసు రిలీజ్ నేపథ్యంలో కొందరు కావాలనే ఇలాంటి అవాస్తవాలు పుట్టిస్తున్నారంటూ విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. -
ఆసక్తి రేపుతున్న విజయ్ మీటింగ్.. ఫ్యాన్స్‌తో ముచ్చటించిన హీరో
నటుడు విజయ్ మంగళవారం ఉదయం చెన్నైలో అభిమానులతో సమావేశయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వారీసు. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది. కాగా ఇదే సమయంలో కథానాయకుడుగా నటిస్తున్న తుణివు చిత్రం కూడా విడుదల కానుంది. అభిమానులు పోటీగా భావిస్తున్న సమవుజ్జీలు అయిన ఇద్దరు స్టార్ నటులు నటిస్తున్న భారీ చిత్రాలు ఒకేసారి విడుదల కావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదీ కాకుండా విజయ్ చిత్రం వారిసు గురించి ఇప్పటికే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ మంగళవారం ఉదయం చెన్నై, పనైయూర్‌లోని తన కార్యాలయంలో అభిమానులతో సమావేశమయ్యారు. ఇందులో అరియలూర్, పెరంబలూర్ మూడు జిల్లాలకు చెందిన అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ వారితో వారిసు చిత్ర విడుదల తదితర అంశాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇదేవిధంగా ఇటీవల మరికొన్ని జిల్లాలకు చెందిన విజయ్ మక్తల్ ఇరుక్కం ముఖ్య నిర్వాహకులతో సమావేశమైన విషయం తెలిసింది. Actor vijay meets his fans again in chennai panaiyur residence | #Vijay #VijayFansMeet @actorvijay pic.twitter.com/zmTmqxanHO — Flash Venkat (@flashvenkat7) December 13, 2022 -
'వారిసు' చిత్ర వివాదం.. అభిమానులతో విజయ్ భేటీపై సర్వత్రా ఆసక్తి
తమిళ సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత ఆస్థాయిలో అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఈయన తన అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌కి రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన నేరుగా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకపోయినా ఆయన అభిమానులు కొందరు తమిళనాడులోని పలు నియోజకవర్గాల్లో ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇకపోతే విజయ్ తన అభిమానులను కనీసం ఏడాదికి ఒకసారైనా కలుస్తూ ఉంటారు. అలాంటిది కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన తన అభిమానులతో ప్రత్యేకంగా భేటీ కాలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం విజయ్ స్థానిక పనైయూర్‌లోని తన కార్యాలయంలో అభిమాన సంఘ నిర్వహకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కారణం విజయ్ తాజాగా నటిస్తున్న వారిసు చిత్ర తమిళం, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా అదే సందర్భంగా చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దీంతో థియేటర్ల సమస్య ఏర్పడే పరిస్థితి నెలకొనడంతో తెలుగు సినీ నిర్మాతల మండలి పండగ రోజుల్లో తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రకటనను ఇటీవల చేసింది. ఇది తమిళ చిత్రశ్రమంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ వంటి వారు తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నటుడు విజయ్ తన అభిమానులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏఏ విషయాలను గురించి చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వారిసు చిత్ర విడుదల వివాదం గురించి అభిమానులతో చర్చిస్తారా..? ఈ వ్యవహారంలో వారు ఎలా వ్యవహరించాలనే సూచనలు చేస్తారా? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, వారిసు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఆదివారం తన ట్విట్టర్లో స్పష్టం చేయడం గమనార్హం. -
వారసుడు సినిమా వివాదంపై స్పందించిన అల్లు అరవింద్
-
‘దళపతి’ విజయ్ కేసును ముగించిన హైకోర్టు
సినీ హీరో విజయ్‌కి చెందిన కారు టాక్స్ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2019 జనవరి నాటికి ఎంట్రీ టాక్స్ చెల్లించకపోతే జరిమానా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే నటుడు విజయ్ 2005లో రూ. 63 లక్షల ఖరీదైన కారును విదేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే దీనికి రాష్ట్ర ఎంట్రీ టాక్స్‌ను చెల్లించకపోవడంతో వివాదానికి దారి తీసింది. వాణిజ్యశాఖాదికారులు ఎంట్రీ టాక్స్‌ను చెల్లించాలంటూ విజయ్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై విజయ్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: వాళ్లు ఉన్నంత కాలం సినీ పరిశ్రమ మునిగిపోతుంది: డైరెక్టర్ సాధారణంగా కారును దిగుమతి చేసుకున్న నెల నుంచి రెండు శాతం జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉండగా తన కారుకు 40 శాతం జరిమానా విధించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై పలు మార్లు కోర్టులో విచారణ జరిగింది. కాగా గురువారం న్యాయమూర్తి సురేశ్ కుమార్ తుది తీర్పును వెల్లడించారు. అందులో విదేశం నుంచి దిగుమతి చేసుకున్న కారుకు 2019 జనవరిలోగా విజయ్ పూర్తిగా ఎంట్రీ టాక్స్ చెల్లించినట్లయితే జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని, చెల్లించని ఎడల జరిమానా చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేస్తూ.. కేసు విచారణను ముగించారు. -
విజయ్ బర్త్‌డే: వారసుడు నుంచి విజయ్ సెకండ్ లుక్ పోస్టర్
తమిళ స్టార్ దళపతి విజయ్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక తమిళనాట అయితే విజయ్ పుట్టిన రోజు వేడుకలను ఫ్యాన్స్ గ్రాండ్ సెలబ్రెట్ చేస్తున్నారు. విజయ్‌కి పలువురు సినీ ప్రముఖులు సైతం విషెస్ తెలుపుతున్నారు. అంతేకాదు ఆయన బర్త్‌డే సందర్భంగా విజయ్ సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంతో తెరకెక్కుతున్న విజయ్ 66 మూవీకి సంబంధించిన మరో అప్డేట్ను తాజాగా వదిలారు మేకర్స్. నిన్న ఈమూవీ టైటిల్‌తో పాటు విజయ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చిత్రం బృందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Vijay As Varisu: వారసుడుగా వస్తోన్న దళపతి విజయ్ వారిసు(తెలుగులో వారసుడు) అని టైటిల్ ఖారారు చేశారు ఈ మూవీకి. తాజాగా ఈ చిత్రంలోని విజయ్‌కి సంబంధించిన మరోలుక్ వదిలారు. చూట్టూ పిల్లలు, గాలి పటాలు, చెరుకు గడలు మధ్య ఎండ్ల బండిలో పడుకుని ఆకాశం వైపు చూస్తూ కనిపించాడు విజయ్. ఈ సెకండ్ లుక్ పోస్టర్ చూస్తుంటే సంక్రాంతిని గుర్తు చేస్తుంది. అంటే ఇందులో విజయ్ పలు షేడ్స్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఇందులో సరదాగా నవ్వుతూ కనిపించిన విజయ్ లుక్కు అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో విజయ్ కొత్తలుక్ పలు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. చదవండి: ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే! Sankranthi 2023 is going to be special with the arrival of #Vaarasudu #VaarasuduSecondLook#Vaarasudu#Varisu#HBDDearThalapathyVijay Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/GySYHlT488 — Sri Venkateswara Creations (@SVC_official) June 22, 2022 -
స్టార్ హీరో విజయ్ ఆఫీసులో మృతదేహం కలకలం, ఏం జరిగింది?
Dead Body Found in Vijay Party Office: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి సంబంధించిన ఓ కార్యాలయంలో మృతదేహం లభ్యమైంది. మృతుడు కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రభాకరన్‌గా పోలీసులు గుర్తించారు. కాగా విజయ్ రాజకీయాల్లోకి రాకపోయిన ఆయనకు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పార్టీ ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆఫీసు చెన్నై పనైయార్ శివార్లలో ఉంది. అయితే ఆ పార్టీ ఆఫీసుతో విజయ్‌కి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయిన అతడి ఫ్యాన్స్ ఆఫీసు వ్యవహరాలను చూసుకుంటున్నారు. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? అయితే ఈ పార్టీ ఆఫీసుల ద్వారానే విజయ్ పలు సేవ కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ఉదయం కార్యాలయంలో పెయింటర్ ప్రభాకరన్ శవమై తేలడం కలకలం రేపుతోంది. ఇటీవల ఈ పార్టీ ఆఫీసును ఆధునికరించేందుకు ప్రభాకరన్ అనే పెయింటర్‌ను నియమించారు. అయితే ఇటీవల సొంతూరు వెళ్లొచ్చిన ప్రభాకరన్.. పనిలో భాగంగా గురువారం రాత్రి పార్టీ ఆఫీసుకు వచ్చాడు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు ఈ క్రమంలో ఆకలిగా ఉందని పార్టీ ఆఫీసు సుపర్ వైజర్‌ను రూ. 100 అడిగాడట. ఆ డబ్బుతో ప్రభాకరన్ పరోటా తీసుకుని వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ శుక్రవారం ఉదయం అతడు శవమై కనిపించాడు. అంతే కాకుండా తన చేతిలో, నోటిలో పరోటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆకలితో ఉన్న ప్రభాకరన్.. వేగంగా పరోటాను తినడంతో ఊపిరాడక చనిపోయి ఉండోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ 66వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్ లోకేషన్స్‌కు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఓ నర్సరీలో చిత్రికరించిన సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. దీంతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఆసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ బృందానికి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టాడట. ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు షూటింగ్ స్పాట్లో ఎవరిని మొబైల్ ఫోన్స్ అనుమతించడం లేదని సమాచారం. చదవండి: వెకేషన్లో చరణ్, ఉపాసన.. క్యూట్ పిక్ షేర్ చేసిన మెగా హీరో హైదరాబాద్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలో విజయ్, రష్మికలకు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఇందులో విజయ్ క్యాజువల్ డ్రెస్‌లో ఉండగా.. రష్మిక పోట్టి ఫ్రాక్‌లో కనిపించింది. ఆ నర్సరీ రోడ్డు పక్కనే ఉండటంతో వాహనదారులంతా ఆగి మరి షూటింగ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వంశీ రూపొందిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. చదవండి: ఆ హీరో నన్ను అలా పిలవడం ఇష్టం లేదు: రష్మిక షాకింగ్ కామెంట్స్ #Thalapathy66 - Exclusive Pic 💥🔥 pic.twitter.com/RDFXA0EGdl — M∆HI - Infinity Plus YouTube (@MahilMass) June 10, 2022 #Thalapathy66 Shooting Spot Full Size Image 😍🔥#Beast @actorvijay pic.twitter.com/0JvsS91yHg — Vijay Fans Page (@VijayKWoodKing) June 9, 2022 #Thalapathy66 leaked 🥳 pic.twitter.com/DuhRm1WEbs — Kings😎 (@ikarthik7744) June 8, 2022 -
సంక్రాంతికి వచ్చేస్తున్న విజయ్- రష్మిక
హీరో విజయ్ సంక్రాంతికి సై అంటున్నారు. ఆయన నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ‘దిల్’రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, ప్రభు, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నట్లు చిత్రయూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.. అంతేకాదు.. ఈ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. -
విజయ్ సినిమాలో ఛాన్స్ .. గుడ్‌న్యూస్ షేర్ చేసిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. గతేడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో శ్రీవల్లిగా ఆకట్టుకున్న రష్మిక వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అవుతుంది. పుష్ప సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప ది రూల్ సినిమాతో పాటు మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ మూవీలో రష్మిక నటించనుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రష్మిక ఇంతకంటే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ ఏముంటుందంటూ ట్వీట్ చేసింది. మంగళవారం(ఏప్రిల్5) రష్మిక బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. కాగా గతంలో ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక స్థానంలో వేరే హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినా అవి ఒట్టి పుకార్లేనని అర్థమైపోయింది. What can possibly be a better birthday gift? 🌸@directorvamshi @svc_official @actorvijay#thalapathy66 pic.twitter.com/FvNUkUcgOl — Rashmika Mandanna (@iamRashmika) April 5, 2022 -
పాన్ ఇండియా మూవీ నుంచి రష్మికను సైడ్ చేశారా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్గా పుష్పతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న రష్మిక ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా క్రేజ్‌ను సంపాదించుకుంది. అటు తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోన్న రష్మిక త్వరలోనే కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ఓ సినిమా చేయనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. విజయ్ నటిస్తున్న తొలి తెలుగు స్ట్రైట్ సినిమా కావడంతో తెలుగులో మరింత హైప్ నెలకొంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న ఈ పాన్ ఇండియా సినిమాలో ముందుగా రష్మికను తీసుకున్నట్లు టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మికను సైడ్ చేసి కృతిసనన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారట. ప్రస్తుతం ఈ భామ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విజయ్‌తో పుదుచ్చేరి సీఎం భేటీ
సాక్షి, చెన్నై: సినీ నటుడు విజయ్‌తో పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి భేటీ అయ్యారు. చెన్నై పయనూర్‌లోని విజయ్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గంటపాటు ఇద్దరూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న నగర పాలక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ను కలవడం చర్చకు దారితీసింది. భేటీ అనంతరం వెలుపలకు వచ్చిన రంగ స్వామిని మీడియా ప్రశ్నించగా, మర్యాద పూర్వకంగానే కలిసినట్లు వ్యాఖ్యానించారు. విజయ్ తనకు మంచి మిత్రుడని, ఆయనపై అభిమానంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు. రాజకీయంగా చర్చనీయాంశం ఈ భేటీ ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్– బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం ప్రధాని మోదీని రంగన్న ఇంత వరకు కలవలేదు. అయితే విజయ్ను కలిసేందుకు పుదుచ్చేరి నుంచి రావడం, తనకు మంచి మిత్రుడు అని వ్యాఖ్యానించడాన్ని రాజకీయ వర్గాలు నిశితంగానే పరిశీలిస్తున్నాయి. విజయ్ మక్కల్ ఇయక్కంను పర్యవేక్షిస్తున్న పుదుచ్చేరికి చెందిన పి. ఆనంద్ ఈ భేటీకి ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
వేరే లెవల్.. దిల్‌రాజుకు షాకిచ్చిన విజయ్
Thalapathy Vijay Shocking Remuneration For Vamshi Paidipally Movie: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ త్వరలోనే తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం విజయ్ దాదాపు రూ.100కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. విజయ్‌కి తమిళం తర్వాత తెలుగులోనూ మాంచి మార్కెట్ ఉంది. చివరగా ఆయన నటించిన మాస్టర్ సైతం తెలుగులో సుమారు రూ.15 కోట్లు రాబట్టిందని టాక్. దీంతో తన మేనియాను దృష్టిలో ఉంచుకొని వంద కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. ఇక విజయ్ చేస్తున్న తొలి తెలుగు ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. -
'భారీ' అభిమానం : విజయ్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్
చెన్నై: అభిమానానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపించారు. ఒక్కసారి నచ్చితే వారిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. గుళ్లు కూడా కట్టించి పూజలు చేస్తారు. ఇందుకు ఉదాహరణ కూడా చూశాం. తాజాగా అలాంటి ఉదంతమే నటుడు విజయ్ అభిమానులు చేశారు. కర్ణాటకకు చెందిన విజయ్ అభిమానులు ఆయన భారీ శిలా విగ్రహాన్ని తయారు చేయించి కానుగగా అందజేశారు. కిరీటాన్ని ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన ఈ శిలా విగ్రహాన్ని చెన్నై, పనైయూర్‌లోని విజయ్ ప్రజా సంఘం కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన శిలా విగ్రహాన్ని బహుకరించిన కర్ణాటక అభిమానులకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. -
వందల సినిమాల్లో నటించిన ఈ ‘ఎమోషనల్ యాక్ట్రెస్’ గుర్తుందా?
సినిమా అంటే జనాలకు మాత్రమే రంగుల ప్రపంచమే కాదు.. అవతల నటించే వాళ్లకు కూడా. ‘ఎంత బలవంతులనైనా ఏదో ఒక టైంలో మానసికంగా కుంగుబాటుకు కచ్ఛితంగా గురిచేసేదే సినిమా’ అంటూ స్పీల్‌బర్గ్‌లాంటి దిగ్గజాలు చెప్పడం చూస్తుంటాం. అలా ఎన్నో కలలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన సీనియర్ నటి శ్రీవిద్య జీవితం..విషాదంగా ముగియడం మీలో ఎంత మందికి గుర్తుంది?. ఇవాళ ఆమె జయంతి.. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ.. ఇలా సుమారు 800కు పైగా సినిమాల్లో నటించారు శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా.. అటుపై సపోర్టింగ్ రోల్స్, అక్కా-చెల్లి, అమ్మ, అత్త క్యారెక్టర్లతో అలరించారు. ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలు ఇప్పటికీ జనాలకు గురుతు. అందుకే ఎమోషనల్ యాక్ట్రెస్‌గా ఆమెకు ఓ పేరు ముద్రపడింది. కేవలం నటనతోనే కాదు.. తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు, డబ్బింగ్‌తోనూ దక్షిణాది ప్రేక్షకుల్ని రంజింపచేశారామె. ‘నటన’ కుటుంబంలో జననం 1953, జులై 24న మద్రాస్‌లో పుట్టారామె. తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్‌గా స్థిరపడగా, తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసిక్ సింగర్(ఎంఎస్ సుబ్బలక్క్క్ష్మి, డీకే పట్టమ్మస్ సమకాలికురాలు). అయితే శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్లకే తండ్రి పక్షవాతం బారినపడడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో వసంతకుమారి నానాకష్టాలు పడి సంపాదించింది. ఒకానొక టైంలో తనకు పాలు ఇచ్చే సమయం ఉండేది కాదన్న తల్లి మాటల్ని శ్రీవిద్య పలు ఇంటర్వ్యూలో సైతం గుర్తు చేసుకునేవాళ్లు. ‘బొటాబొటీ’ చదువు కొనసాగించిన శ్రీవిద్య అందగత్తె కావడంతో అమెరికా నుంచి ఓ సైంటిస్ట్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అయితే డబ్బు లేదన్న కారణంతో ఆ సంబంధం అంతే స్పీడ్‌గా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో ఆమె నటనలోకి అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలై.. 1967 తమిళ సినిమా శివాజీ గణేషన్ హీరోగా ‘తిరువరుల్చెల్వర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారామె. ఆ తర్వాత మలయాళ సినిమా ‘కుమార సంభవం’తో, తెలుగులో దాసరి ‘తాతా మనవడు’తో అరంగ్రేటం చేసింది శ్రీవిద్య. దర్శకదిగ్గజం కే బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన ‘నూట్రుక్కు నూరు’(1971) నటిగా ఆమెకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. హీరోయిన్గా ‘ఢిల్లీ టు మద్రాస్’(1972) ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాల ద్వారా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చారామె. మల్టీటాలెంటెడ్ అల్లరి క్యారెక్టర్లతో అలరించినా.. మెచ్యూర్డ్రోల్స్ చేసినా.. ఆ క్యారెక్టర్‌తో ఎమోషనల్‌గా ట్రావెల్ కావడం ఆమెకు ఉన్న నైజం. అందుకే హీరోయిన్గా ఫేడ్అవుట్ అయ్యాక ఆమెకు హుందా పాత్రలెన్నో వచ్చాయి. నటిగానే కాదు.. ప్లేబ్యాక్ సింగర్‌గానూ ఆమె అలరించారు. స్వతహాగా క్లాసికల్ సింగర్ కావడంతో ఆమె గాత్రం పాటలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టేవి. అంతేకాదు పదుల సంఖ్యలో సినిమాలకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పారు. ‘ప్రేమ’ మోసం కెరీర్ తొలినాళ్లలో కమల్ హాసన్‌తో ఆమె నటించింది. ఆ టైంలో ఇద్దరి మధ్య ఎటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. ఒకానొక టైంలో కమల్‌తో పీకలలోతు ప్రేమలో కూరుకుపోయిందామె. అయితే అప్పటికే కమల్ వాణీ గణపతితో ప్రేమలో ఉండడంతో ఆమె పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి మలయాళంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్‌తో ప్రేమలో పడి.. తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకుంది. మతం మార్చుకుని నటనకు దూరమైంది. డబ్బు కోసం తిరిగి నటించాలన్న భర్త ఒత్తిడితో తిరిగి మేకప్ వేసుకుంది. ఆపై భర్త తీరును అర్థం చేసుకుని.. విడాకులిచ్చేసింది. నటన కొనసాగిస్తున్న టైంలో మలయాళ దర్శకుడు భరతన్‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించింది. అయితే భరతన్ మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో భరతన్ తన ఆస్తులు లాగేసుకుని తనను మోసం చేశాడంటూ శ్రీవిద్య కోర్టుకెక్కింది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో విజయం సాధించి తన ఆస్తుల్ని దక్కించుకున్న ఆమె.. చెన్నై నుంచి తిరువంతపురానికి మకాం మార్చేసింది. అపూర్వ రాగంగల్-అపూర్వ సగోదరర్గల్ చనిపోయే ముందు దాకా.. 2003లో అనారోగ్యం పాలైన ఆమెకు.. క్యాన్సర్ అని తేలింది. ఆటైంలో మూడేళ్లపాటు ఆమె చికిత్స తీసుకుంది. ఆ టైంలోనూ ఆమెను వదల్లేదు. అంతేకాదు ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న తాను బతకడం కష్టమనే విషయం అర్థమైయ్యింది ఆమెకు. అందుకే తన పేరు మీద ఒక్క పైసా కూడా ఉండొద్దన్నది నిర్ణయించుకుంది. మొత్తం ఆస్తిని సేవాకార్యక్రమాలకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికే కేరళ ప్రభుత్వం స్కాలర్షిప్ ఆపేయడంతో పేద సంగీత, నృత్య కళాకారులైన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. అందుకని మలయాళ నటుడుని రిజిస్టర్‌గా నియమిస్తూ.. తన ఆస్తులను అప్పజెప్పింది. తద్వారా ఓ ఛారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేయించి అర్హులైనవాళ్లకు స్కాలర్షిప్ అందించే ఏర్పాటు చేయించింది. మిగిలిన ఆస్తిని బంధువుల పేరిట రాసేసింది. తన అన్నల పిల్లలకు ఒక్కొక్కరి ఐదు లక్షలు, చివరికి తన ఇంట్లో పని వాళ్లు.. వాళ్ల ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జమ చేయించింది. మరికొంత ఆస్తిని సొంత వూరికి, ఇంకొంత సొమ్మును రెండో ఇల్లు తిరువనంతపురానికి దానం చేసింది. ఆ తర్వాత కీమో థెరపీకి వెళ్లిన ఆమె.. ఆ ట్రీట్మెంట్ టైంలోనే 2006, ఆగస్టు 17న యాభై మూడేళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఆమె సేవానీరతికి గుర్తుగా తిరువనంతపురం ప్రజలు లాంఛనంగా ఆమె అంత్యక్రియల్ని ఘనంగా జరిపించారు. తల్లిగా ప్రత్యేకం నలభై ఏళ్లపాటు మలయాళం, తమిళంలో వందలకొద్దీ, తెలుగులో నలభై దాకా, కన్నడలో డజను, హిందీలో రెండు.. మొత్తం 800 దాకా సినిమాల్లో నటించారామె. ఇక సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ తొలి హీరోయిన్ శ్రీవిద్యే. ఆయన మొదటి సినిమా అపూర్వ రాగంగల్(1975) రజినీ జోడిగా. అయితే రజినీతో హీరోయిన్‌గానే కాదు.. అక్కగా, చెల్లిగా, తల్లిగా, అత్తగా.. ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్లలో ఆమె నటించడం విశేషం. తల్లి క్యారెక్టర్లో శ్రీవిద్య అద్భుతమైన నటన కనబరిచేవారామె. ముగ్గురు మొనగాళ్లు, గాండీవం, చిన్నబ్బాయ్, వెంకటేష్‌కు తల్లిగా ‘బ్రహ్మపుత్రుడు’, ‘ధర్మచక్రం’ ఆమె మరిచిపోలేని నటనను అందించారు. సుమంత్ హీరోగా వచ్చిన ‘విజయ్ ఐపీఎస్’ తెలుగులో శ్రీవిద్య నటించిన చిట్టచివరి చిత్రం. -సాక్షి వెబ్‌డెస్క్ -
షాక్ : కార్తీని గుర్తుపట్టలేకపోయిన హీరో విజయ్
‘బీస్ట్’ సెట్స్‌కు వెళ్లారు ‘సర్దార్’. హీరో విజయ్, దర్శకుడు నెల్సన్ కుమార్ కాంబినేషన్లో ‘బీస్ట్’ సినిమా షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. అదే లొకేషన్‌కు సమీపంలో కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్’ సినిమా చిత్రీకరణ జరగుతోంది. పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకుడు. దాదాపు రెండు కోట్ల ఖర్చుతో వేసిన సెట్లో సర్దార్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా షాట్ గ్యాప్‌లో ‘సర్దార్’ గెటప్‌లోనే ‘బీస్ట్’ సెట్స్‌కి కార్తీ వెళ్లారు. ఆ గెటప్‌లో కార్తీని గుర్తుపట్టలేకపోయారు విజయ్. ఆ తర్వాత విజయ్‌తో కార్తీ మాట్లాడటం మొదలుపెట్టాక అసలు విషయం తెలిసి, విజయ్ షాక్ అయ్యారట. కాసేపు హీరోలిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారని సమాచారం. -
చెల్లి మరణంతో కుంగిపోయిన విజయ్.. డిప్రెషన్‌తో ఏడాది పాటు..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనూ విజయ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ర్టీకి చెందినవారే. తండ్రి ప్రముఖ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ కాగా తల్లి శోభ గాయనిగా, రచయిత్రిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక తండ్రి డైరెక్షన్లో బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన విజయ్ ఆ తర్వాత నాలయై తీర్పు అనే యూక్షన్ మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాను కూడా ఆయన తండ్రి చంద్రశేఖరే డైరెక్ట్ చేశారు. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న విజయ్ వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎంతో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఆయన జీవితంలో ఓ తీరని విషాదం నెలకొందని చాలా మందికి తెలియదు. విజయ్‌కు విద్య అనే చెల్లెలు ఉండేది. ఇద్దరూ కలిసి ఎంతో అల్లరి చేస్తూ సరదాగా గడిపేవారు. చిన్న వయసులోనే విద్య అనారోగ్యం బారిన పడింది. వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. అలా రెండేళ్ల వయసులోనే విద్య చనిపోయింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 'స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడు. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అప్పటిదాకా ఎంతో చలాకీగా, అల్లరి చేస్తూ గడిపిన విజయ్ విద్య దూరం అయ్యాక ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. వయసుకు మించిన నెమ్మదితనం అలవర్చుకున్నాడు. ఇప్పటికీ అంతే. ఆ బాధలోంచి విజయ్ కాస్త కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది' విజయ్ తల్లి వివరించింది. విద్య మరణంతో కుంగిపోయిన విజయ్ ముఖంలో నవ్వు కనిపించింది దానికి కారణం సినిమాలే అని పేర్కొంది. ఇక చెల్లెలిపై ఉన్న ప్రేమతో విజయ్ తన కూతురికి దివ్య సహాస అనే నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ బీస్ట్‌తో పాటు, తెలుగులోనూ ఈ స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నారు. -
తలపతి తదుపరి చిత్ర దర్శకుడు నెల్సన్
చెన్నె : కోలీవుడ్ సూపర్‌స్టార్ తళపతి విజయ్ నటించనున్న 65 వ చిత్రానికి దర్శకుడు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రతిష్టాత్మక చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నట్లు సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మొదటి చిత్రం ‘కొలమావు కోకిల’తో హిట్ కొట్టిన దర్శకుడు నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రంలో విజయ్ జోడిగా నయనతార నటించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కె చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు సమకుర్చనున్నాడు. కాగా చిత్ర దర్శకుడు నెల్సన్ సినిమాకి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. నా తదుపరి చిత్రం విజయ్‌తో చేస్తున్నందకు చాలా సంతోషంగా ఉందని.. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైన్‌ర్‌గా ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం విజయ్ నటించిన మాస్టర్ చిత్రం 2021 సంక్రాతికి విడుదలకు సిద్ధంగా ఉంది. -
టైటిల్ కష్టాల్లో మరో స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు సూపర్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే తొలి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ తెనండల్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దళపతి అనే టైటిల్ నిర్ణయించారు. అయితే రజనీకాంత్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దళపతి సినిమాను నిర్మించిన జీవీ ఫిలింస్ ను టైటిల్ విషయమై విజయ్ టీం సంప్రదించగా.. జీవీ టీం నో చెప్పిందట. దీంతో మరో దారి లేక వేరే టైటిల్ ను నిర్ణయించే పనిలో పడ్డారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ లోగోను రిలీజ్ చేయనున్నారు. -
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...
సంక్రాంతి అంటేనే పందేల పండుగ. పది రోజుల ముందే పండుగ హడావిడి మొదలైనా... ఆ శోభకు శ్రీకారం జరిగేది మాత్రం ‘భోగి’ నుంచే. భోగిమంటలతో పోటీల పర్వం మొదలవుతుంది. ఇక ముగ్గుల పందేలతో ఆడవాళ్లు... కోడి పందేలతో మగాళ్లు... గాలిపటాల పందేలతో పిల్లలు... ఇలా చెప్పుకుంటూ పోతే... సర్వం పందేల మయం. వీటి మధ్య సినిమాల పందేలు. అప్పుడే బాక్సాఫీస్ దగ్గర వేడి మొదలైంది. మహేష్ ‘1’, చరణ్ ‘ఎవడు’ రిలీజులు ఇప్పటికే జరిగిపోయాయి. కనుమ దాటి ముక్కనుమకు చేరేసరికి విజయం ఎవరి సొంతమో తేలిపోతుంది. ఈ లోపు సరదాగా ‘భోగి స్పెషల్ సాంగ్స్’ని కాసేపు నెమరు వేసుకుందాం. భోగి పండుగ భోగం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఈ పాటలు నిజంగా తెలుగు దనానికి ప్రతికలే. భోగిమంటలు(1981) భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో... తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో... ఆచార్య ఆత్రేయ రాసిన ఈ పాట ఏ రోజు విన్నా... ఆ రోజే భోగి పండుగలా అనిపిస్తుంది. ఇక రమేశ్‌నాయుడు స్వరరచన తెలుగుదనానికి అద్దం పట్టిందనే చెప్పాలి. దీనికి తోడు కృష్ణ, రతి అగ్నిహోత్రిల అభినయం, విజయనిర్మల టేకింగ్ ఈ పాటకు హైలైట్స్. ‘భోగిమంటలు’ సినిమా వచ్చి 33 ఏళ్లు అవుతున్నా... ఇంకా ఈ పాట శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. బాలు, సుశీల, బృందం ఈ పాటను ఆలపించారు. దళపతి (1992) సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంటా పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగ జీవితాలే సాగాలంటా ఆడాలి ఈనాడు.. ఊరంతటా... రాగాల దీపాలటా.. నీకోసం.. వెలిగేనటా.. ఉల్లాసం.. నీవేనటా.. హోయ్ ఈ పాటను అనువాద గీతమంటే ఎవరైనా నమ్ముతారా? అంతగొప్పగా రాశారు రాజశ్రీ. ‘వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని.. కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకోమంటారా హోయ్. మూలబడివున్నా.. బుట్టా తట్టా తీసి.. భోగిమంటల్లోన నీవే వెయ్యరా..’ అంటూ.. భోగి పండుగ పరమార్థాన్ని రెండే ముక్కల్లో చెప్పారాయన. రాజశ్రీ అక్షరాలకు ఇళయరాజా స్వరరచన తోడైతే.. ఇక చెప్పేదేముంది! శ్రోతలు పులకించక ఏంచేస్తారు? నిజంగానే అంతగా ఆకట్టుకుందీ పాట. పైగా ఈ పాట పాడింది ఎవరనుకున్నారు.. కె.జె.ఏసుదాస్, ఎస్పీబాలు. ఇద్దరూ అగ్రగణ్యులే. పాటకు పట్టాభిషేకం చేసినవారే. ఇక చేసింది తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి. తీసింది మణిరత్నం. ఇంతమంది ఘనాపాటీలు కలిశారు కాబట్టే రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఈ పాటను జనాలు ఇష్టపడుతూనే ఉన్నారు. రాముడొచ్చాడు (1996) మా పల్లే రేపల్లెంటా... ఈ పిల్లే రాధమ్మంటా... రేగుతుంటే భోగిమంట.. రేగుపళ్ల విందులంటా రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో మంచుపూల జల్లులంటా మంచెకాడ గిల్లుడంటా మంచమేస్తే సంకురాత్రి తిరునాళ్ళో పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా ఉంటే పండగ. భోగి పండుగ శోభ అంతా ఈ పాటలోనే కనిపిస్తుంది కదూ! మరి వేటూరా మజాకా. సిటీల్లో పరిస్థితి ఎలా ఉన్నా... పల్లెల్లో యువతరానికి సంక్రాంతి అంటే నిజంగా పెద్ద సంబరమే. పట్టు పరికిణీల్లో అమ్మాయిలూ, టిప్పుటాప్పుగా అబ్బాయిలూ... అలకలు, అల్లర్లు, సరదాలు, సరాగాలు అన్నింటికీ వేదిక సంక్రాంతి. ‘రేగుతుంటే భోగిమంట...రేగుపళ్ల విందులంటా... రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో...’ అని వేటూరి రాసింది అందుకే. ఎస్పీబాలు, చిత్ర, బృందం ఆలపించిన ఈ పాటకు స్వరరచన చేసింది రాజ్. ఆయన సంగీతం సమకూర్చిన హిట్ సాంగ్స్‌లో ఇదీ ఒకటి. ఇక నాగార్జున, సౌందర్యల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా! సిందూరం (1997) ఏడుమల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టమొచ్చింది నాయనో.. భోగిపళ్లు పోయాలి బేబికి.. ఏమి దిష్టి కొట్టింది నాయనో.. ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమట్లు పట్టాయిరో... మంచు బొట్లు ఆ బుగ్గలో అగ్గిచుక్కలైనాయిరో... పల్లెల అందాలు ఏ తీరుగా ఉంటాయో ఈ పాట చూస్తే అర్థమైపోతుంది. అలముకున్న మంచు పొరల మాటున పరుచుకున్న పచ్చదనం, భగభగ మండుతున్న భోగి మంటలు, పాలపుంతల్ని తలపించే సంక్రాంతి ముగ్గులు. వీటికి దీటుగా అందమైన అమ్మాయిలు. వాళ్లనే టార్గెట్ చేస్తూ సిరివెన్నెల కలం కదిపారు. ఆ అక్షరాలను స్వరబద్ధం చేసే బాధ్యతను సంగీత దర్శకుడు ‘శ్రీ’ తలకెత్తుకున్నాడు. తండ్రి చక్రవర్తిని తలపించాడు కూడా. కృష్ణవంశీకి తెలుగుదనంపై ఉన్న మమకారం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది. ఇక పరికిణీలో సంఘవి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగమ్మాయి కాకపోయినా.. బాపు బొమ్మనే గుర్తుచేసింది. ఇక రవితేజ గురించి తెలిసిందేగా! ఓవరాల్‌గా అందర్నీ రంజింపజేసేసిందీ పాట. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా పాటలొచ్చాయి కానీ, భోగి పాటలు మాత్రం తక్కువే. అయినా... వచ్చిన ప్రతిపాట అందర్నీ అలరించి, మన సంప్రదాయ విలువలకు అద్దం పట్టింది. కొన్నేళ్లుగా ఇలా పండుగల్ని ప్రతిబింబించే పాటలు సినిమాల్లో కరువయ్యాయి. ‘ట్రెండ్’ అంటూ... క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ, విదేశాల చుట్టూ సినిమా పాట తిరుగుతోంది. మన ‘సోల్’ ఏంటో మనం మరిచిపోతున్న పరిస్థితి ప్రస్తుతం సినిమాల్లో నెలకొని ఉంది. పాశ్చాత్య పోకడలను ప్రతిబింబించే ఈ విధానాలను భోగిమంటల్లో ఆహుతి చేస్తూ... మన సంస్కృతిని ప్రతిబింబించే కొత్తదనాన్ని తెలుగు సినిమా ఆహ్వానించాలని ఆశిద్దాం.