![Hero Karthi Meets Thalapthy Vijay On The Sets Of Beast - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/19/VIJAYYY.jpg.webp?itok=8hi5MfVA)
‘బీస్ట్’ సెట్స్‌కు వెళ్లారు ‘సర్దార్’. హీరో విజయ్, దర్శకుడు నెల్సన్ కుమార్ కాంబినేషన్‌లో ‘బీస్ట్’ సినిమా షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. అదే లొకేషన్‌కు సమీపంలో కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్’ సినిమా చిత్రీకరణ జరగుతోంది. పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకుడు. దాదాపు రెండు కోట్ల ఖర్చుతో వేసిన సెట్‌లో సర్దార్ షూటింగ్ చేస్తున్నారు.
ఈ సినిమా షాట్ గ్యాప్‌లో ‘సర్దార్’ గెటప్‌లోనే ‘బీస్ట్’ సెట్స్‌కి కార్తీ వెళ్లారు. ఆ గెటప్‌లో కార్తీని గుర్తుపట్టలేకపోయారు విజయ్. ఆ తర్వాత విజయ్‌తో కార్తీ మాట్లాడటం మొదలుపెట్టాక అసలు విషయం తెలిసి, విజయ్ షాక్ అయ్యారట. కాసేపు హీరోలిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment