![Thalapathy 66: Rashmika Mandanna Replaced By Krithi Sanon? - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/1/Rashmika-Mandanna.jpg.webp?itok=LakHywEQ)
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్‌గా పుష్పతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న రష్మిక ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా క్రేజ్‌ను సంపాదించుకుంది. అటు తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోన్న రష్మిక త్వరలోనే కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ఓ సినిమా చేయనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
విజయ్ నటిస్తున్న తొలి తెలుగు స్ట్రైట్ సినిమా కావడంతో తెలుగులో మరింత హైప్ నెలకొంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న ఈ పాన్ ఇండియా సినిమాలో ముందుగా రష్మికను తీసుకున్నట్లు టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మికను సైడ్ చేసి కృతిసనన్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. ప్రస్తుతం ఈ భామ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment