Pan India
-
పాన్ ఇండియా మూవీలో...
పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహించనున్నారు. సినిమా టికెట్ ఎంటర్టైన్మెంట్స్– అర్జున్ ఆర్ట్స్‌పై రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 24న హైదరాబాద్‌లోప్రారంభం కానుంది. ‘‘పాయల్ రాజ్‌పుత్ మరో వైవిధ్యమైన పాత్రలో నటించనున్న చిత్రమిది. ఆమె క్యారెక్టర్లో పలు భావోద్వేగాలు ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే!’
న్యూఢిల్లీ, సాక్షి: నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీన్నొక పాన్ ఇండియా సమస్యగా అభివర్ణిస్తూ.. సోమవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశంలో ఏయే నగరాల్లో అత్యధిక కాలుష్యం నమోదు అవుతుందో ఓ జాబితా అందించాలని ఆ ఆదేశాల్లో కేంద్రానికి స్పష్టం చేసింది.‘‘వాయుకాలుష్యం ఏయే నగరాల్లో తీవ్రంగా ఉందో ఓ జాబితా ఇవ్వండి. ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే. కేవలం ఢిల్లీకి మాత్రమే మేం ఈ అంశాన్ని పరిమితం చేయాలని అనుకోవడం లేదు. అలా గనుక విచారణ జరిపితే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. అందుకే ఈ ఆదేశాలిస్తున్నాం’’ అని ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ జరుపుతున్న జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM) ఎలా ఉందో.. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న నగరాల్లో అలాంటి వ్యవస్థలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కేంద్రానికి స్పష్టం చేసింది.దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం కోసం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. అయితే.. ఎన్సీఆర్ పరిధి వెలుపల నగరాలు ఈ విధానం పాటించడం లేదని, పంటలను తగలబెట్టడం ఇతర రాష్ట్రాలకూ ప్రధాన సమస్యగా ఉందని కోర్టు కమిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. పిల్ పరిధిని పెంచుతూ సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గత నెలలో.. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయుకాలుష్యాన్ని నవంబర్ 18వ తేదీ నుంచి సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. అలాగే.. సీఏక్యూఎం ఆదేశాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో పరిశీలిస్తోంది. ఢిల్లీలో మళ్లీ GRAP-3ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో.. GRAP-3 విధానం కఠినంగా అమలు చేయాలని సీఏక్యూఎం ఆదేశించింది. ఈ విధానం ప్రకారం.. విద్యాసంస్థల తరగతులు హైబ్రిడ్ విధానంలో అమలు కానున్నాయి. అంటే.. ప్రాథమిక తరగతుల క్లాసులు ఆన్లైన్లో జరగనున్నాయి. ఇక.. నిత్యావసర వస్తువులకు చెందని డిజీల్ వాహనాలపై నిషేధం అమలు చేస్తారు.చదవండి👉🏼: అమిత్ షాజీ.. రాజధాని ఎలా మారిందో చూడండి! -
‘సంబరాల ఏటిగట్టు’ మూవీ టైటిల్ ఈవెంట్లో రామ్ చరణ్ (ఫొటోలు)
-
తేజ్ ఊచకోత చూస్తారు – రామ్ చరణ్
‘‘సంబరాల ఏటిగట్టు’ తేజుకి 18వ సినిమా. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. డైరెక్టర్ రోహిత్ మొదటి సినిమా చేస్తున్నట్టుగా లేదు.. చాలా అద్భుతంగా తీస్తున్నాడు’’ అని రామ్ చరణ్ తెలిపారు. సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2025 సెప్టెంబర్ 25 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ టైటిల్ టీజర్‌ని రామ్ చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తేజు ఈరోజు ఇక్కడ ఇలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల ఆశీర్వాదాలే. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. అంటే తను మా తేజ్ కాదు.. మీ తేజ్. తనపై ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు నిరంజన్, చైతన్యగార్లను చూస్తే సినిమా పట్ల వారికి ఉన్న ప్యాషన్ తెలిస్తోంది. ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘తేజు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిందంటే నమ్మశక్యంగా లేదు. మా విజయ దుర్గ అదృష్టవంతురాలు. తన పేరును తీసుకెళ్లి తన పేరులో పెట్టుకున్నాడు తేజు(సాయి దుర్గా తేజ్). అలాంటి కొడుకు ఉండటం అదృష్టం. తను మృత్యుంజయుడు’’ అని తెలిపారు. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ–‘‘ఈ వేదికపై నేను ఉండటానికి కారణమైన మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ(అభిమానులు) అందరి ప్రేమను ΄÷ందే అదృష్టం నాకు దక్కింది. బైక్ నడుపుతున్నప్పుడు నేను హెల్మెట్ ధరిస్తాను.. మీరు కూడా హెల్మెట్ ధరించాలి’’ అని కోరారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తేజుగారికి ధన్యవాదాలు’’ అన్నారు రోహిత్ కేపీ. ‘‘సంబరాల ఏటిగట్టు’ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు చైతన్య రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, డైరెక్టర్స్ వైవీఎస్ చౌదరి, దేవా కట్టా, కిషోర్ తిరుమల, మారుతి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ మాట్లాడారు. -
తాత ప్రధానమంత్రి.. హీరోయిన్గా పాన్ ఇండియా క్రేజ్.. అదితీ గురించి తెలుసా? (ఫొటోలు)
-
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ప్రభాస్'.. ఎలా సాధ్యమైంది..?
'ఈశ్వర్'లా వెండితెరపై అడుగుపెట్టి అభిమానుల చేత 'సాహో' అనిపించుకున్నాడు. నేడు ఇండియన్ బాక్సాఫీస్‌కు 'ఛత్రపతి'లా 'ఏక్ నిరంజన్' అయ్యాడు. కేవలం రూ.100 కోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను ఏకంగా రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తా ఏంటో బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. తను పుట్టిన గడ్డపై ప్రకృతి కన్నేర్ర చేస్తే తనవంతుగా 'పౌర్ణమి' లాంటి వెలుగును అందింస్తాడు. సిల్వర్ స్క్రీన్‌పై పౌరుషంతో కదం తొక్కే 'మిర్చి'లాంటి కుర్రాడిగానే కనిపిస్తూనే అమ్మాయిల కలల రాకుమారుడిగా 'డార్లింగ్' అని పిలిపించుకుంటాడు. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌లో 'సలార్' రూలింగ్ మాత్రమే జరుగుతుంది. ఇవాళ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని విషయాలు మీ కోసం..ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. అందరూ ముద్దుగా ప్రభ, డార్లింగ్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి నటుడవ్వాలని ప్రభాస్ ఎప్పుడూ అనుకోలేదు. అయితే, ప్రభాస్ మంచి ఎత్తుతో పాటు చాలా గ్లామర్‌గా ఉండటంతో అందరూ ఆయన్ను 'హీరో... హీరో' అని పిలిచేవారట. కానీ సినిమాలంటే చాలా భయపడేవాడట. తనకు తెలిసిన మొదటి హీరో పెదనాన్న కృష్ణంరాజు. ఆయనకు ప్రభాస్ బిగ్ ఫ్యాన్ కూడా... ఓ రోజు భక్తకన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతుంటే అక్కడికి ప్రభాస్ కూడా వెళ్లాడు.. అలా సినిమా సెట్లోని వాతావరణానికి అలవాటు పడ్డాడు. రోజూ పెదనాన్న కృష్ణంరాజు నటించిన సినిమాలు చూస్తూ అలా తన కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యాడు.వరుసగా ప్లాపులొచ్చినా మళ్లీ.. మళ్లీ తిరిగొచ్చాడుకృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. ఈ రెండు చిత్రాలతో నటన, హావభావాలతో ఆకట్టుకున్నాడనే ప్రశంసలు ప్రభాస్‌కు దక్కాయి. కానీ, చిత్రపరిశ్రమలో తన మార్క్ వేయలేకపోయాడు. దీంతో మూడో చిత్రంతో మంచి విజయం అందుకోవాలని చాలా ఆశలు పెట్టుకుని 2004లో త్రిష కాంబినేషన్‌తో 'వర్షం' తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత పర్వాలేదనే టాక్ మాత్రమే వినిపించింది. దీంతో ఈ చిత్రం కూడా పోయిందని ప్రభాస్ అనుకున్నాడు. అయితే, వారం తర్వాత వర్షంలా కలెక్షన్స్ పెరిగాయి. ఆపై సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాడు. అలా ప్రభాస్ కెరియర్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు అట్టర్ ఫ్లాప్స్ కావడంతో మళ్లీ వర్షం లాంటి సినిమాతో హిట్ కొట్టాలని ప్రభాస్ తపించాడు. అలాంటి సమయంలో ‘ఛత్రపతి’ (2005) బ్లాక్‌బస్టర్ కొట్టాడు. మళ్లీ రెండేళ్ల పాటు ఒక్క హిట్ లేదు. పౌర్ణమి, యోగి, మున్నా వరుసుగా మళ్లీ పరాజయాలే.. ఇలా ఇండస్ట్రీలో పడిపోయిన ప్రతిసారి తిరిగి తానేంటో నిరూపించుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'బుజ్జిగాడు'తో డిఫరెంట్ మ్యానరిజాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 'బిల్లా'తో తనలోని స్టైలిష్ లుక్‌ను పరిచయం చేసిన ప్రభాస్ ఏక్ నిరంజన్‌తో మరో కోణాన్ని పరిచయం చేశాడు. అలా డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో అదరగొట్టేశాడు. బాహుబలి కోసం ఒకేఒక్కడుబాహుబల సమయంలో ప్రతి హీరో ఏడాదికి రెండు సినిమాలు తీస్తున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం 'బాహుబలి' కోసం జక్కన్నకి ఐదేళ్లు పూర్తి కాల్షీట్లు ఇచ్చేశాడు. అప్పుడు దేశంలో ఇదో సంచలనం. అన్ని రోజులపాటు మరో సినిమా ఒప్పుకోకుండా నిలబడిని ఏకైక హీరోగా ఆయన పేరుపొందాడు. ఆ సమయంలో అనుష్క,రానా,తమన్నా వంటి వారందరూ వేరే సినిమాలు చేశారు. ప్రభాస్ ఒక్కడే బాహుబలి మొత్తం అయ్యే వరకు ఒకే సినిమాకి పనిచేశాడు. ప్రభాస్ పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచే ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా కోసం నార్త్ ఇండియా ప్రేక్షకులూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్,సలార్,కల్కి వంటి చిత్రాలు బాలీవుడ్లో దుమ్మురేపాయి. టాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గకుండా అక్కడ కలెక్షన్లు రాబట్టాయి. ఎన్నో ఎళ్ల పాటు బాలీవుడ్‌ను శాసిస్తున్న ఖాన్ హీరోలను ప్రభాస్ వెనక్కు నెట్టేశాడు. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ కిరీటాన్ని ప్రభాస్ ఎప్పుడో అందుకున్నాడు.ప్రభాస్‌కు స్నేహితులు.. ఆ రెండు సినిమాలు 20 సార్లు చూశాడుప్రభాస్కు అభిమాన హీరో కృష్ణంరాజు అయితే, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, రాబర్ట్ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిష నటన అన్నా ఆయనకు చాలా ఇష్టం. తనకు దగ్గరైన దోస్తులు చాలామందే ఉన్నారు. వారిలో గోపిచంద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్‌లు ప్రభాస్‌కు మంచి స్నేహితులు. అయితే, కెరియర్ పరంగా తనను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన డైరెక్టర్‌గా రాజమౌళి అంటే ప్రభాస్‌కి ఎనలేని అభిమానం. ఆయన తర్వాత అంత ఇష్టమైన దర్శకుడు మరొకరు ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. ఆయన సినిమాలను ప్రభాస్ చాలా ఎక్కువగానే ఇష్టపడతాడు. ఆయన డైరెక్ట్ చేసిన త్రీ ఇడియట్స్, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాలను ఇరవైకి పైగా సార్లు చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ప్రభాస్‌లో ఇవన్నీ ప్రత్యేకం► ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్ గుర్తింపు పొందారు.► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం► ప్రభాస్ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్ జాక్సన్'లో అతిథిగా కనిపించారు.► ప్రభాస్‌కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట.► స్టార్డమ్ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.► ప్రభాస్ ఖాతాలో వెయ్యి కోట్లు సాధించిన సినిమాలు రెండు ఉన్నాయి బాహుబలి2, కల్కి 2898AD ► బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది.► మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్► ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు.► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.► ప్రభాస్ నటుడు కాకపోయుంటే..? హోటల్ రంగంలో స్థిరపడేవారు.► ప్రభాస్‌కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం' -
రూ.2 లక్షల బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రం.. ‘మాయా బజార్’ రికార్డులెన్నో!
చరిత్ర గాని, పురాణాలు గాని... వీటిలో మనకు ఏమాత్రం నచ్చని విషయాల్ని మనకు నచ్చిన విధంగా ఓ కల్పిత కథను తయారు చేసుకుని ప్రేక్షకుడ్ని ఆనందింపజేయడాన్ని ఆల్టర్నేటివ్ హిస్టరీ అని అంటారు. ఉదాహరణకు హిట్లర్ని ఓ థియేటర్లో బంధించి కాల్చి హతమార్చడం, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలను బట్టబయలు చేసి వాళ్లని నవ్వులపాలు చేయడం వంటివి. ఇలాంటి ప్రత్యామ్నాయ చరిత్ర కలిగిన కథలు మన అహాన్ని సంతృప్తిపరుస్తాయి కాబట్టి స్వతహాగానే వాటివైపు ఆకర్షితులవుతాం. సరిగ్గా అలాంటి కోవకు చెందినదే ‘మాయాబజార్’ సినిమా. ఈ చిత్రం లక్ష్యం కూడా అదే.మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా...వ్యాస భారతం ప్రకారం బలరాముడుకి శశిరేఖ అని పిలువబడే కూతురే లేదు. మాయాబజార్ నిజానికి శశిరేఖా పరిణయం అనే పేరుతో మన దగ్గర ప్రసిద్ధిగాంచిన ఓ కల్పిత జానపద కథ. దీని ఆధారంగా ‘మాయాబజార్’కి ముందు, తరువాత అనేక చిత్రాలు రూపొందినా కేవీ రెడ్డి రూపొందించిన ఈ ఒక్క సినిమా మాత్రమే అత్యంత ప్రజాదరణకు నోచుకుంది.‘మాయాబజార్’కు తొలుత చాలా పేర్లనే అనుకున్నారు. సినిమాలో ఘటోత్కచుడు పాత్రను ఎస్వీ రంగారావు చేశారు కాబట్టి ముందుగా ఈ సినిమా పేరును ఘటోత్కచుడు అని పెట్టాలని అనుకున్నారట. తర్వాత శశిరేఖా పరిణయం అని పేరు పెట్టారు. ఆ తర్వాత దానిని మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా మార్చారు. చివరికి విడుదలయ్యే సమయానికి అది ‘మాయాబజార్’గా మిగిలింది. ‘మాయాబజార్’ కథకు ఉన్న లక్ష్యం కేవలం శశిరేఖకు, అభిమన్యుడికి పెళ్లి చెయ్యటం కాదు... కొన్ని కారణాల వల్ల వంచించబడ్డ శశిరేఖ తల్లిదండ్రుల మనసు మార్చటం, కౌరవులను నవ్వులపాలు చేసి, వాళ్లని దండించబడటం ఈ కథలోని అంతిమ లక్ష్యం. కృష్ణుడు బలరాముడికి హితబోధ చేసినా, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో యుద్ధానికి దిగినా శశిరేఖా పరిణయం సాధ్యమయ్యేది.. కానీ కథకున్న అంతిమ లక్ష్యం సాధ్యపడేది కాదు.చిన్న కథ... బలమైన స్క్రీన్ప్లేనిజానికి ‘మాయాబజార్’ కథ చాలా చిన్నది. అయితే బలమైన స్క్రీన్ ప్లేతో దీనిని రక్తి కట్టించారు దర్శకులు కేవీ రెడ్డి. ప్రథమార్ధం కేవలం నాటకీయత మాత్రమే ఉంటుంది. ఆ నాటకీయ పరిణామాలు ఇప్పటికీ సమకాలీన పరిస్థితుల్లానే అనిపిస్తాయి. అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడటం, ఆ ప్రేమకి తల్లిదండ్రులు అడ్డు చెప్పటం, తల్లి కూతుర్ని కొట్టడం, డబ్బు పోగానే ముఖం చాటేసే చుట్టాలు, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేని కూతురు... వంటివి ఇప్పటికీ ప్రతీ ఇంట్లో కనిపించేవే. ప్రేక్షకుడిని ఈ వాస్తవిక పరిస్థితులు ముందుగా కథతో కనెక్ట్ చేస్తాయి. ప్రథమార్ధమంతా లక్ష్యానికి పూర్తిగా దూరం చేసి, ఇక ఏ రకమైన ఆశ మిగలని స్థితికి తీసుకెళ్లి, ఘటోత్కచుడు ప్రవేశించడంతో వడివడిగా లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. పూర్తి విషాదం తర్వాత వచ్చే ఆనందానికి విలువ ఎక్కువ ఉంటుంది. కౌరవుల్ని ఏమీ చెయ్యలేం అనుకునే మాన సిక స్థితికి ప్రేక్షకుడ్ని తీసుకొచ్చి, తర్వాత వాళ్లని వెర్రివాళ్లని చేసి ఆడుకోవటం వల్ల వచ్చే కిక్కు మామూలుగా ఉండదు.ఎస్వీఆర్ మీదే ప్రమోషన్!66 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం కెమెరామేన్ మార్కస్ బార్ట్ లీ. గ్రాఫిక్స్ లేని కాలంలో కెమెరా టెక్నిక్స్‌తో సృష్టించిన మాయాజాలానికి అప్పట్లో ప్రేక్షకులు నిశ్చేష్ఠు లయ్యారు. నిజంగా మాయ జరుగుతున్నట్టుగానే భావించారట. ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో లడ్డూలన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం, ఆహార పాత్రలన్నీ వాటికవే కదలడం.. వంటి సీన్లకు మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాలోనే ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతకు ముందు 1954లో వచ్చిన ‘ఇద్దరు పెళ్ళాలు’, 1956లో వచ్చిన ‘సొంతవూరు’ సినిమాల్లో కృష్ణుడిగా కనిపించినప్పటికీ, అవి పూర్తి స్థాయి కృష్ణుడి పాత్రలు కావు. ‘మాయాబజార్’ టైమ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మార్కెట్ కన్నా ఎస్వీఆర్ మార్కెట్ ఎక్కువ. జనాల్లో పాపులారిటీ కూడా ఎక్కువే. అందుకే రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రమోషన్లను ఎస్వీఆర్ పేరు మీదే చేశారట.రెండు లక్షల బడ్జెట్‌తో...‘మాయాబజార్’ను సుమారు రెండు లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. అప్పట్లో తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఇదే. సాధారణంగా 30 వేల బడ్జెట్‌ను మించి సినిమాలు తీయడానికి అప్పట్లో నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ ‘మాయాబజార్’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయా ప్రొడక్షన్స్ ఖర్చుకు వెనకాడలేదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తరువాత ఈ సినిమాను హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో డబ్ చేశారు. విడుదలైన అన్నిచోట్లా విజయాన్ని అందుకుంది. అంటే ఒక విధంగా ‘మాయాబజార్’ని తొలి పాన్ ఇండియా మూవీ అనొచ్చేమో. అందుకే నాటికైనా నేటికైనా మరెప్పటికైనా ‘మాయాబజార్’ అనేది ఓ గోల్డ్ మెమరీ. – ఇంటూరు హరికృష్ణ -
ప్రభాస్ కు చెక్ పెడతామంటున్న తారక్, బన్నీ,చరణ్..
-
పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టేందుకు తారక్ మంత్రం
-
మల్టీస్టారర్ కు మొగ్గు చూపుతున్న బడా హీరోలు
-
నటుడు విజయ్ చెప్పినట్లు..!
ప్రస్తుతం పాన్ ఇండియా కథానాయకిగా మారిన నటి కీర్తీసురేశ్. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించి మెప్పింగల నటి ఈ బ్యూటీ. అపజయాలు విజయాలకు సోపానం అంటారు. అది కీర్తీసురేశ్‌కు చాలా బాగా వర్తిస్తుంది. ఈమె తల్లి మేనక అప్పట్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళియన్ అయిన ఈమె మలయాళ సినీ నిర్మాత సురేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా సినీ కుటుంబం నుంచి వచ్చిన కీర్తీసురేశ్ బాల నటిగానే చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈమె కథానాయకిగా నటించిన తొలి తమిళ చిత్రం ఇదు ఎన్న మాయం. ఈ చిత్రం నిరాశ పరిచింది. ఆ తరువాత నటించిన రజనీ మురుగన్, రెమో వంటి చిత్రాలు హిట్ కావడంతో కీర్తీసురేశ్‌కు తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా అక్కడ నటించిన మహానటి చిత్రం ఆమెను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో కీర్తీసురేశ్ స్థాయి పెరగడంతో పాటు, వదంతులు అధికం అవుతున్నాయి. ఈ బ్యూటీ 20 ఏళ్ల వయసున్న ఓ నటుడి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తాజాగా వైరల్ అవుతున్న ప్రచారం. దీనిపై స్పందించిన కీర్తీసురేశ్ నటుడు విజయ్ చెప్పినట్లు వదంతులకు వివరణ ఇస్తే అది నిజం అవుతుందన్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం అన్నారు. ఇకపోతే నటన గురించి విమర్శలను తాను స్వాగతిస్తానని, ఒక నటిగా అవి తనను మెరుగుపరుస్తానికి ఉపయోగపడతాయని కీర్తీసురేశ్ సమాధానం ఇచ్చారు. ఇకపోతే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం రఘుతాత ఆగస్ట్ 15వ తేదీన తెరపైకి రానుంది. -
పాన్ ఇండియా మార్కెట్ పై..తమిళ హీరోల దండయాత్ర..
-
నా దృష్టిలో పాన్ ఇండియా అంటే అదే: టాలీవుడ్ హీరో ఆసక్తికర కామెంట్స్
మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం శివం భజే. ఈ మూవీని అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో దిగాంగన సూర్యవన్షి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలపై అశ్విన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అశ్విన్ బాబు మాట్లాడుతూ..'తెలుగులో చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. చాలా వరకు హిట్ అయ్యాయి. నేను మాత్రం ఎక్కువగా స్క్రిప్ట్‌ను నమ్ముతాను. కంటెంట్ మాత్రమే పాన్ ఇండియా అనుకుంటా. ఎందుకంటే హిడింబ చిత్రాన్ని మనకంటే హిందీలో ఎక్కువగా చూశారు. ఇది నేను ఊహించలేదు. శివం భజే పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా సరే.. సినిమా రీచ్ అయితే చాలు' అని అన్నారు.ట్రైలర్ చూస్తే ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్‌గా అశ్విన్ బాబు కనిపించనున్నారు. ఆగస్టు 1న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హైపరి ఆది, మురళి శర్మ, సాయిధీనా, బ్రహ్మజీ, తులసి, దేవి ప్రసాద్, షకలక శంకర్, ఇనయా సుల్తానా కీలక పాత్రలు పోషించారు. నాకు ప్యాన్ ఇండియా వద్దు.. సినిమా రీచ్ అయితే చాలు!Hero @imashwinbabu says, "I believe in only content!"💥💥#AshwinBabu #ShivamBhaje #TeluguFilmNagar pic.twitter.com/mFdt7s8Mfs— Telugu FilmNagar (@telugufilmnagar) July 23, 2024 -
సీక్వెల్ సినిమాలులో టాలీవుడ్ టాప్..
-
సై, సై అంటున్న కోలీవుడ్
-
మీ స్థాయికి పాన్ ఇండియా మూవీ కరెక్టేనా?.. యంగ్ హీరో స్ట్రాంగ్ రియాక్షన్!
‘రాజావారు రాణిగారు’మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. 2019లో విడుదలైన ఈ రొమాంటిక్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో రహస్య గోరఖ్ హీరోయిన్గా నటించారు. గతేడాది మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలతో అలరించిన కిరణ్ ప్రస్తుతం క అనే మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సుజీత్ సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా క మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి ఆసక్తికర ప్రశ్న వేశాడు. తెలుగులో మీకు పెద్ద సక్సెస్ రాలేదు.. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా మూవీని ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నించారు.దీనికి కిరణ్ స్పందిస్తూ.. 'నా దృష్టిలో పాన్ ఇండియా స్థాయి అంటే కేవలం కంటెంట్ మాత్రమే.. మొన్న వచ్చిన మలయాళ మూవీ మంజుమ్మెల్ బాయ్స్‌ను మనం పెద్ద హిట్ చేశాం. అందులో యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? అంతే కాదు కాంతార సినిమాకు ముందు రిషబ్ శెట్టి గురించి మనకు తెలుసా? ఇక్కడ ఫైనల్‌గా స్థాయి అంటే కంటెంట్ మాత్రమే సార్. నా స్థాయి పెద్దదా? చిన్నదా? అనేది నెక్ట్స్? మనం సినిమాలో కంటెంట్‌కు స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్. క అనే సినిమాలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నా. కంటెంట్ ఉంటే సినిమాను మీరందరూ ఎక్కడికో తీసుకెళ్తారు. అందుకే ఇతర భాషల్లోనూ తీసుకొస్తున్నాం' అని అన్నారు. దీంతో ఇది చూసిన ఫ్యాన్స్ అతనికి గట్టిగానే ఇచ్చిపడేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.#KiranAbbavaram About PAN INDIA Release✅ STRONG Counter From #KiranAbbavaram 🔥🔥🔥🔥#KA pic.twitter.com/GYyeyhFJQq— GetsCinema (@GetsCinema) July 15, 2024 -
బాహుబలితో మొదలైంది.. ట్రెండ్ సెట్
-
పాన్ ఇండియా.. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి
-
పాన్ ఇండియా ని షేక్ చేస్తున్న స్పిరిట్ రూమర్!
-
పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్ హీరో
పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది టాలీవుడ్. ఇప్పటికే పలు యంగ్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ లిస్ట్‌లోకి తాజాగా యంగ్ హీరో ఈశ్వర్ ప్రసాద్ కూడా చేరాడు. 4లెటర్స్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన ఈశ్వర్ ప్రసాద్.. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సొంతూరు తిరుపతి. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. అయితే సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ.. ఈశ్వర్‌కు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే రెండో సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. పలు కథలు విని.. చివరకు ఓ పాన్ ఇండియా స్టోరీని ఓకే చేశాడు. జులై 11న తన బర్త్‌డే సందర్భంగా లుగు లో పీకాక్ ఇండియన్ సినిమా బ్యానర్ లో ఓ పాన్ ఇండియా సినిమా ను స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను జులై 11న వెల్లడిస్తామని ఈశ్వర్ చెప్పారు. -
పాన్ ఇండియా ని షేక్ చేస్తున్న స్పిరిట్! ఇక ప్రభాస్ రేంజే వేరు.
-
పేరుకే పాన్ ఇండియా మూవీస్.. ఒక్కటి కూడా టైమ్ కి రిలీజ్ అవ్వవు
-
మాజీ ప్రేమికుల కథ
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్నపాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ‘డెకాయిట్’తో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్‌కి జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఈ విషయాన్ని తెలియజేస్తూ... శేష్, శ్రుతి సరదాగా దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు!
‘‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉంది బుజ్జి, భైరవ గ్లింప్స్. ఎంజాయ్ చేశారా? ‘కల్కి..’లో అమితాబ్ సార్, కమల్ సార్‌తో పని చేసే అవకాశం ఇచ్చిన అశ్వినీదత్‌గారికి, నాగీ (నాగ్ అశ్విన్)కి థ్యాంక్స్. హోల్ ఇండియా ఇన్స్పైర్ అయ్యే అమితాబ్, కమల్‌గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. కాగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కల్కి స్పెషల్ క్రియేటివ్ ఈవెంట్’లో సినిమాలోని బుజ్జి (కారు) పాత్రను పరిచయం చేశారు. ఈవెంట్లో ఈ వాహనాన్ని ప్రభాస్ నడిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. నేనేదో మన డార్లింగ్స్‌కి హాయ్ చెప్పి వెళ్లి΄ోదాం అనుకుంటే ఈ కార్లు.. ఫీట్లు ఏంటి సార్ (నవ్వుతూ). బుజ్జి సూపర్ ఎగ్జయిటింగ్. నేను కూడా ‘కల్కి’ టీజర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కమల్ సార్ ‘సాగర సంగమం’ సినిమా చూసి నాకలాంటి బట్టలు కావాలని మా అమ్మను అడిగాను.. అలాంటివి కుట్టించుకుని వేసుకున్నాను. ఇక ఈ వయసులో కూడా అశ్వినీదత్‌గారి ΄్యాషన్ చూసి ఆయన వద్ద ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు తెలిసి 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఆయనొక్కరే. ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలకు కూడా ఆయనలా ΄్యాషన్, ధైర్యం ఉంది. వాళ్లు పని చేసే విధానానికి మేమంతా స్ఫూర్తి ΄÷ందుతాం అని మా సిస్టర్స్‌కి చెబుతుంటాను’’ అన్నారు. ‘‘బుజ్జి కారుని ఎంతో కష్టపడి తయారు చేయించాం. ఇందుకోసం మహీంద్ర ఆటోమొబైల్ ఇంజినీర్స్ ఎంతో శ్రమించారు’’ అన్నారు నాగ్ అశ్విన్. నిర్మాతలు అశ్వినీ దత్, స్వ΄్నా దత్, ప్రియాంకా దత్, కృష్ణంరాజు సతీమణి శ్యామల పాల్గొన్నారు. -
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా.. ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి బంపర్ ఆఫర్ కొట్టేసింది. బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉంటూనే.. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ వెండితెరపై కూడా శ్రీముఖి మెరిపిస్తుంది. తాజాగా ఆమె మరో క్రేజీ ఆఫర్ పెట్టేసిందని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్- అట్లీ కాంబోలో పాన్ ఇండియా రేంజ్లో ఒక సినిమా రాబోతుందని అది కూడా ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటన వస్తుందని ఈ మధ్య జోరుగు ప్రచారం జరుగుతుంది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో శ్రీముఖి నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీకి చెల్లెలుగా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన జులాయిలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మరోసారి వెండితెరపై కనిపించనున్నారని ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో కూడా శ్రీముఖి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఖుషీ నడుము సీన్ రీక్రియేట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు ట్రెండీ డ్రెస్‌లతో ఫోజులు ఇస్తే కుర్రకారులో హీట్ పెంచుతుంది. కొద్దిరోజుల క్రితం యాంకర్ ప్రదీప్‌కు శ్రీముఖికి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తోందని వార్తలు వస్తే.. అలాంటి వాటికి చెక్ పెడుతూ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi)