బహుబలితో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత వందల కోట్ల సినిమాలకే కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. వరసగా ఈ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ..బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ...కూడా పూర్తి చేశాడు. ఈ సినిమాలన్ని ప్రభాస్ ఇమేజ్‌ను కాపాడేలా వందల కోట్ల బడ్జెట్లో రాబోతున్నాయి.
అయితే..బాహుబలితో..బిగ్ ఇమేజ్ సొంతం చేసుకున్న డార్లింగ్..తర్వాతి సినిమాలతో..నిలబెట్టుకోలేకపోయాడు. సుజీత్ దర్శకత్వంలో అంచానాలతో వచ్చిన ‘సాహో’అశించిన విజయం సాధించలేదు. ప్రేమ కావ్యం రాధేశ్యామ్ అయితే పూర్తిగా నిరాశ పరించింది. అందుకే తర్వాతి సినిమాలతో తన పాన్ ఇమేజ్ కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
అయితే..సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ఆదిపురుష్ టీజర్..రెబల్ స్టార్ ఆశల మీద నీళ్లు చల్లేసింది. టీజర్ మీద ..ఎవరు ఉహించనటువంటి విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నయంటూ...సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురియింది. తర్వాత జూన్ నెలకు ఈ మూవీ వాయిదా పడిన మ్యాటర్ తెలిసిందే. అయితే..ఇప్పుడు రెబల్ స్టార్ మాత్రం తర్వాత బ్లాక్ బస్టర్‌తోనే రావాలని ఫిక్స్ అయ్యాడట. .అందుకోసం..ఆదిపురుష్ ను మరింత ఆలస్యంగా తీసుకురాబోతున్నాడట
ముందుగా కెజియఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ మూవీతో రావాలి అనుకుంటున్నాడట ప్రభాస్. అలాగే చక చక నాగ్ అశ్విన్ కాంబో మూవీ ప్రాజెక్ట్ కే షూటింగ్ కూడా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక ఆదిపురుష్ మూవీని..2024 లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడట. అప్పటి వరకు..ఆదిపురుష్ గ్రాఫిక్‌కు మరింత నాణ్యత తెచ్చేలా ..ఓం రౌత్ కు హుకుం జారి చేసాడట. ఇలా తర్వాతి సినిమాతో ఓ బిగ్ హిట్ పక్కాగా నమోదు చేయలి అని డిసైడ్ అయ్యాడట రెబల్ స్టార్. మరి ప్రభాస్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment