ఒక్క మెసేజ్‌తో 'సలార్‌' బైక్‌ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు | Salaar Bike Contestant Winner | Sakshi
Sakshi News home page

ఒక్క మెసేజ్‌తో 'సలార్‌' బైక్‌ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు

May 2 2024 7:29 PM | Updated on May 2 2024 7:49 PM

Salaar Bike Contestant Winner

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సలార్‌. గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. కొద్దిరోజుల క్రితమే బుల్లితెరపై కూడా సందడి చేసింది. ఈ క్రమంలో సినిమా చూస్తూ సలార్‌ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని స్టార్‌ మా వారు అవకాశం కల్పించారు. తాజాగా విన్నర్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోన్‌ స్టార్‌ మా షేర్‌ చేసింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగానే కలెక్ట్‌ చేసిన ‘సలార్‌’ రెండో భాగం ‘శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్‌ నీల్‌. ప్రీ ప్రోడక్షన్‌ వర్క్‌ పూర్తి కావస్తుండటంతో కొద్దిరోజుల్లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది.

సినిమా థియేటర్లు, ఓటీటీలో సందడి చేసిన సలార్‌  మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూస్తూ బైక్‌ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్‌ ప్రకటించింది. ఏ విధంగా సలార్‌ బైక్‌ను సొంతం చేసుకోవాలో కూడా హోంబలె ఫిలిమ్స్‌ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విజయవాడకు చెందిన వరప్రసాద్‌ అనే వ్యక్తి సలార్‌ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలను వీడియో ద్వారా మేకర్స్‌ ప్రకటించారు.

ఏప్రిల్‌ 21న సలార్‌ సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలని ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్‌ చేసి పంపించాలని మేకర్స్‌ కోరారు. ఈ ఎస్సెమ్మెస్‌లను డిప్‌ ద్వారా ఎంపిక చేస్తామని ఆ సమయంలో ప్రకటించింది. వారు చెప్పినట్లుగానే సలార్‌ బైక్‌ను విజేత వరప్రసాద్‌కు అందచేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement