Salaar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయిన సలార్‌.. ట్రైలర్‌ అదిరింది! | Prabhas Salaar Movie Japan Version Release Trailer Goes Viral, Watch Inside| Sakshi
Sakshi News home page

Salaar Japan Version Release: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయిన సలార్‌.. ట్రైలర్‌ అదిరింది!

Published Sat, May 4 2024 2:01 PM | Last Updated on Sat, May 4 2024 3:55 PM

Salaar Japan Release Trailer Out

జపాన్‌లో ఇండియన్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతున్నాయి. గతంలో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాటు కేజీయఫ్‌ పార్ట్ 1, పార్ట్‌ 2 చిత్రాలు కూడా జపాన్‌లో రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. 

తాజాగా మరో ఇండియన్‌ చిత్రం జపాన్‌లో రిలీజ్‌ కాబోతుంది. అదే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సలార్‌’. కేజీయఫ్‌ ఫేం ‍ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌ 22న విడుదలైన ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది.  

చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో ప్రభాస్‌కి ఓ మంచి హిట్‌ లభించింది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఇప్పుడు జపాన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేయడానికి రెడీ అయ్యాడు ప్రభాస్‌. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. 

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా కేవలం యాక్షన్‌ సీన్లతోనే కట్‌ చేసిన ఈ ట్రైలర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో శృతీహాసన్‌ హీరోయిన్‌గా నటించగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement