అల్లు అర్జున్‌- అట్లీ సినిమాకు విలన్‌గా 'ఆస్కార్‌' నటుడు | Hollywood Actor Will Smith Will Be Entered In Allu Arjun Movie | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌- అట్లీ సినిమాకు విలన్‌గా 'ఆస్కార్‌' నటుడు

Jul 8 2025 2:02 PM | Updated on Jul 8 2025 2:49 PM

Hollywood Actor Will Smith Will Be Entered In Allu Arjun Movie

అల్లు అర్జున్‌ (Allu Arjun),  అట్లీ (Atlee) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోకి (AA22xA6) హాలీవుడ్‌ హీరో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్‌మీడియాలో హ్యాష్‌ట్యాగ్స్‌తో పాటు ఫోటోలు వైరల్‌ కావడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ను దాటి అంతర్జాతీయ రేంజ్‌కు చేరిపోయింది. దీంతో హాలీవుడ్‌ టాప్‌ నటులను కూడా మన సినిమాల్లో భాగం చేసుకుంటున్నారు. తాజాగా AA22  ప్రాజెక్ట్‌ నుంచి ఒక వార్త వైరల్‌ అవుతుంది.

సన్‌ పిక్చర్స్ అధినేత క‌ళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో అల్లు అర్జున్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్స్‌ పనుల కోసం ప్రముఖ హాలీవుడ్‌ సంస్థ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో విలన్‌గా హాలీవుడ్ స్టార్ న‌టుడు విల్ స్మిత్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే వార్త నిజ‌మైతే ఈ సినిమా పాన్ ఇండియా నుంచి ఇంట‌ర్‌నేష‌న‌ల్ వ‌ర‌కు రీచ్‌ కావడం ఖాయం అని చెప్పవచ్చు.  భారతీయ సినీ అభిమానులకు సుపరిచితుడైన విల్‌ స్మిత్‌ ఉత్తమ నటుడిగా అస్కార్‌ అవార్డ్‌ కూడా అందుకున్నారు. ఆయన గతంలో  భారతీయ చిత్రం 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' (హిందీ)లో అతిథిగా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు సినిమాలో ఏకంగా విలన్‌గా నటించబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. త్వరలో షూటింగ్‌కు యూనిట్‌ సన్నద్ధం కానుంది. ఈ క్రమంలో తొలి షెడ్యూల్‌ను ముంబయిలో ప్లాన్‌ చేశారని టాక్‌ ఉంది. సుమారు మూడు నెలల పాటు అక్కడే షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌ తర్వాత వీఎఫ్‌ఎక్స్‌ పనులను ప్రారంభిస్తారని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తుంది. పునర్జన్మల కాన్సెప్ట్‌తో సైన్స్‌ఫిక్షన్‌ సినిమాగా నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement