will smith
-
హాలీవుడ్ నటుడితో మంచు విష్ణు భాగస్వామ్యం
ప్రముఖ హీరో-నిర్మాత మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఓవైపు కుటుంబ సమస్యలతో సతమవుతున్న ఇతడు.. తరంగ వెంచర్స్ పేరుతో మీడియా-ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. 50 మిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టనున్నారు. హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్.. ఇందులో భాగస్వామి అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని స్వయంగా విష్ణునే బయటపెట్టాడు. త్వరలో శుభవార్త వింటారని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మోహన్ బాబు పరారీలో ఉన్నాడా? ట్వీట్ వైరల్)విష్ణు ఆధ్వర్యంలోని తరంగ వెంచర్స్.. ఓటీటీ, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చెయిన్, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్, వీఆర్, ఏఐ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుంది. ఇందులో మంచు విష్ణు, ఆది శ్రీ, ప్రద్యుమన్ ఝాలా, వినయ్ మహేశ్వరి, విల్‌స్మిత్, దేవేష్ చావ్లా, సతీష్ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారు. వీళ్లతో పాటు మరికొందరు కూడా ఆసక్తి చూపుతున్నారట.మంచు విష్ణు లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. రాబోయే ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ ఉంటుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీలో విష్ణుతోపాటు మోహన్‌బాబు, శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు. (ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?) -
స్టార్ హీరోతో ముద్దు సీన్స్.. తప్పుకున్న ఐశ్వర్య రాయ్!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. కెరీర్లో రాణించాలంటే అన్ని రకాల సినిమాలు చేయాల్సిందే. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తేనే ఎక్కువ అవకాశాలు వస్తాయని కొంతమంది నమ్ముతారు. అది కొంతవరకు వాస్తవం కూడా. అయితే అలాంటి సీన్స్ చేస్తేనే అవకాశాలు వస్తాయనుకోవడం తప్పే. ఎలాంటి ఎక్స్‌ఫోజింగ్ చేయకుండా కేవలం తమ నటనతోనే ఆకట్టుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే ఏ సినిమా ఎంచుకోవాలి, ఇండస్ట్రీలో ఎలా నిలబడాలని అనేది సదరు హీరోయిన్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చినా..తమ పాత్ర నచ్చపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. మరికొంత మంది పెద్ద ప్రాజెక్ట్ కదా అని కాంప్రమైజ్ అవుతారు. కానీ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మాత్రం ముద్దు సన్నివేశాలు ఉన్నాయని రెండు భారీ హాలీవుడ్ సినిమాలనే వదులుకుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా.. సున్నితంగా ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది.ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని.. 2000 సంవత్సరంలో ఐశ్వర్యరాయ్‌కి బాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉంది. వరుస సినిమాలు హిట్ కావడంతో హాలీవుడ్లో కూడా నటించే అవకాశం వచ్చింది. బ్రైడ్ అండ్ ప్రిజుడీస్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్ లాంటి హాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో ఆకట్టుకుంది. అదే సమయంలో ఆమె కెరీర్‌ని మలుపు తిప్పే రెండు భారీ హాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చాయట. కానీ కిస్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని రిజెక్ట్ చేసిందట. హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’లో హీరోయిన్గా నటించే అవకాశం ముందుగా ఐశ్యరకే వచ్చిందట. అయితే కథలో భాగంగా ఆమె హీరోతో ఇంటిమేట్ సీన్స్‌తో పాటు ముద్దు సన్నివేశాల్లో కూడా నటించాలని చెప్పారట. హీరోతో కిస్ సీన్ చేయడం ఇష్టం లేక ఐశ్వర్య ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. దీంతో ఆ చాన్స్ ఏంజలినా జోలీ కొట్టేసింది.లిప్ లాక్ సీన్ ఉందని మరో చిత్రం..ఐశ్వర్య మరో హాలీవుడ్ చిత్రాన్ని కూడా ఇలానే వదులకుందంట. హాంకాక్( Hancock) చిత్రంలో విల్ స్మిత్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న చాన్స్ ఐశ్వర్యకు వచ్చిందంట. అయితే అందులో విల్ స్మిత్‌తో లిప్‌లాక్ చేసే సీన్ ఉందంట. అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టంలేక ఐశ్వర్య ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. డేట్స్ కూడా ఖాలీగా లేకపోవడం మరో కారణమని ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. -
ఇండియాలో ముందుగానే రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ!
విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై. ప్రముఖ ఫ్రాంచైజీలో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఒక రోజు ముందుగానే భారతదేశం అంతటా భారీ స్థాయిలో జూన్ 6న విడుదలవుతోంది. ఈ యాక్షన్-అడ్వెంచర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.అత్యంత జనాదరణ పొందిన యాక్షన్-కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన బ్యాడ్ బాయ్స్ నాల్గొ విడత గురువారం రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్ 6వ తేదీన భారతదేశంలో ఒక రోజు ముందుగా విడుదల కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్‌తో టిఫనీ హడిష్, జో పాంటోలియానో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
బ్యాడ్ బాయ్స్ రెడీ
హాలీవుడ్ బ్యాడ్ బాయ్స్ మళ్లీ వస్తున్నారు. హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో ఒకటైన ‘బ్యాడ్ బాయ్స్’ నుంచి రానున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. ‘బ్యాడ్ బాయ్స్’ ఫ్రాంచైజీలో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. మూడో భాగానికి దర్శకత్వం వహించిన అదిల్–శ్రీశ్రీబిలాల్ దర్శకత్వ ద్వయమే ‘బ్యాడ్ బాయ్స్ 4’ను డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సిటీలో జరుగుతున్న డ్రగ్ మాఫియా ఆగడాలను ఇద్దరు డిటెక్టివ్లు ఏ విధంగా అడ్డుకున్నారు? అనే ఇతివృత్తంతో ఈ సినిమా కథనం ఉంటుందని హాలీవుడ్ సమాచారం. -
అందుకే... ఆస్కార్ క్రైసిస్ టీమ్
గత ఏడాది జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్, నటుడు విల్ స్మిత్‌ల మధ్య జరిగిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వేదికపై తన భార్య, నటి జడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ రాక్ జోక్స్ వేయడాన్ని సంహించలేకపో యిన విల్ స్మిత్ అందరూ చూస్తుండగానే క్రిస్‌రాక్ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన ఆస్కార్ చరిత్రలో ఓ బ్లాక్‌మార్క్‌గా నిలిచిపో యిందని కమిటీ పేర్కొంది. 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో విల్ స్మిత్ బెస్ట్ యాక్టర్‌గా నిలిచారు. అయితే ఈ విషయం కన్నా ఎక్కువగా క్రిస్ రాక్‌పై చేయి చేసుకున్న విషయంలోనే వార్తల్లో నిలిచారు విల్ స్మిత్. ఈ నేపథ్యంలో పదేళ్ల పాటు ఆస్కార్ అవార్డు వేడుకలకు విల్ స్మిత్ హాజరు కాకుండా నిషేధం విధించింది కమిటీ. ఇక ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేలా, ఒకవేళ జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా ఈసారి ఆస్కార్ నిర్వాహకులు ‘క్రైసిస్ టీమ్’ను ఏర్పాటు చేయనున్నారు. 94ఏళ్ల ఆస్కార్ అవార్డు చరిత్రలో ఇలా ఒక టీమ్‌ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ‘‘గత ఏడాది జరిగిన ఆస్కార్ వేడుకలో జరిగిన ఓ ఘటన (విల్ స్మిత్ – క్రిస్ రాక్లను ఉద్దేశిస్తూ..) మమ్మల్ని కొత్తగా ఆలోచించేలా, సరికొత్త నిర్ణయాలు తీసుకునేలా చేసింది. ఇందులో భాగంగానే క్రైసిస్ కమ్యూనికేషన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఈ బృంద సభ్యులు అందుకు తగ్గట్లుగా త్వరితగతిన స్పందిస్తారు. ఈ క్రైసిస్ మెంబర్స్ సేవలు వినియోగంలోకి రాకూడదనే (ఆస్కార్ వేడుక సవ్యంగా జరగాలని ఆశిస్తూ...) కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు ఆస్కార్ కొత్త సీఈఓ బిల్ క్రామెర్. ఇక 95వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ వేదికగా భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13న జరగనుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెలిసిందే. -
గదిలోకి సాలెపురుగు, ఏకంగా ఇంటినే అమ్మేస్తానంటున్న హీరో!
ఆస్కార్ వేడుకల్లో కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించి వార్తల్లోకెక్కాడు హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్. ఆ తర్వాత ఆస్కార్ కమిటీ అతడిపై 10 ఏళ్లపాటు నిషేధం విధించడం, ఆస్కార్ కమిటీలో తన సభ్యత్వానికి విల్‌స్మిత్ రాజీనామా చేయడం, క్రిస్రాక్కు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం తెలిసిందే! తాజాగా ఈ స్టార్ హీరో ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన ఇంట్లోకి వచ్చిన పెద్ద సాలీడును చూసి స్మిత్ హడలిపోయాడు. 'వార్నీ, ఎంత పెద్దగా ఉంది, ట్రే.. నేను కుర్చీలో ఉన్నాను కదా, నువ్వు వెళ్లి దాన్ని పట్టుకుని అవతల పాడేయ్. నువ్వు యంగ్ అలాగే స్ట్రాంగ్ కదా, నువ్వైతేనే దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలవు, వెళ్లు' అంటూ సాలీడును పట్టుకునే బాధ్యతను కొడుక్కి పురమాయించాడు. మొత్తానికి తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఎలాగోలా ఆ పురుగును ఓ గ్లాస్ బౌల్లో బంధించారు. 'దీనితో మాకు పెద్ద తలనొప్పి వచ్చింది.. అసలు ఈ ఇంటినే అమ్మేస్తా' అని సరదాగా విసుక్కున్నాడు స్మిత్. ఇది చూసిన ఫ్యాన్స్.. 'ఒక్క పురుగు కనిపిస్తే ఏకంగా ఇంటినే అమ్మేస్తారా? ఇదేదో గమ్మత్తుగా ఉందే', 'మా ఇంట్లోకి ఇలాంటి కీటకాలు చాలానే వస్తాయి, ఒక్కదానికే అంతలా భయపడుతున్నారేంటి?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Will Smith (@willsmith) చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్, ఐశ్వర్య.. ఫొటో వైరల్ ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే! -
Will Smith: చెంప దెబ్బపై బహిరంగ క్షమాపణలు
94వ ఆస్కార్ అవార్డుల ఈవెంట్ వేదికగా కమెడియన్ క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పాడు స్టార్ నటుడు విల్ స్మిత్. ఈ ఘటనపై బహిరంగంగా స్మిత్ స్పందించడం ఇదే మొదటిసారి. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో.. వేదికపైకి వెళ్లి మరీ హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్ చెంప పగలకొట్టాడు విల్ స్మిత్. అయితే క్రిస్ నవ్వులతో అప్పటికప్పుడు ఆ ఘటన ఒక సరదా విషయంగా అంతా అనుకున్నారు. కానీ, కొన్ని గంటల్లోనే అదొక సంచలనం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి.. అకాడమీకి, ఆస్కార్ నామినీలకు మాత్రమే ప్రత్యేకంగా విల్ స్మిత్ క్షమాపణలు తెలియజేసిన విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత క్రిస్ రాక్ పేరును ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో బహిరంగ క్షమాపణలు చెప్తూ ఓ పోస్ట్ ఉంచాడు. అయితే.. ఇప్పుడు నేరుగా క్రిస్ రాక్‌కు క్షమాపణలు చెప్తూ ఒక వీడియోనే ఉంచాడు. ఆస్కార్ స్పీచ్‌లో చెంప దెబ్బ ఘటనపై ఎందుకు స్పందించలేదు అని ఓ ప్రశ్న ఎదురైంది స్మిత్‌కు. దానికి స్పందించిన విల్ స్మిత్.. ఘటన తర్వాత క్రిస్ రాక్తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ, అతను మాట్లాడేందుకు ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని విల్ స్మిత్ తాజా వీడియోలో వివరించాడు. క్రిస్ రాక్ ఇప్పుడు అందరి ముందు చెప్తున్నా. నీకు నా క్షమాపణలు. ఇది చాలదని నాకు తెలుసు. నువ్వు ఎక్కడంటే అక్కడ నీతో మాట్లాడడానికి నేను రెడీ. ఐ యాస్ సారీ. నీకే కాదు నీకుటుంబానికి, ఆస్కార్ కమిటీకి, నామినీలకు, నా వల్ల ఇబ్బంది పడ్డా నా కుటుంబానికి కూడా క్షమాపణలు అని విల్ స్మిత్ తెలిపాడు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ ‘షేవ్తల’ను ఉద్దేశించి.. జీఐ జేన్ అంటూ జోక్ చేశాడు క్రిస్ రాక్. దీంతో మండిపోయిన విల్ స్మిత్.. ఊగిపోతూ స్టేజ్ మీదకు వెళ్లి క్రిస్ రాక్ దవడ పగలకొట్టాడు. ఈ ఘటన విమర్శలకు దారి తీయడంతో ఆస్కార్ కమిటీలో తన సభ్యత్వానికి విల్ స్మిత్ రాజీనామా చేయగా.. మరోవైపు వేడుకలకు హాజరు కాకుండా అతనిపై నిషేధం(కొన్నేళ్లైనా) దిశగా ఆలోచనలు చేస్తోంది అకాడమీ కమిటీ. నటుడు విల్ స్మిత్(53) 94వ ఆస్కార్ వేడుకల్లో ‘కింగ్ రిచర్డ్’ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Will Smith (@willsmith) -
ఒక్క సినిమాకే వెయ్యి కోట్ల పారితోషికం!
సినిమాలో ఎవరి పారితోషికం ఎక్కువ అంటే హీరోలదే అన్న సమాధానం వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే! అయితే రానురానూ షూటింగ్ బడ్జెట్ కంటే కూడా కథానాయకుల పారితోషికానికి పెట్టే బడ్జెటే ఎక్కువవుతూ వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు రూ.40, 50, 100 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే హాలీవుడ్ హీరోలు మాత్రం ఓస్, వందేనా.. మేము వెయ్యి కోట్లు తీసుకుంటున్నాం. అయినా ఇది మాకు చాలా మామూలు విషయమని తేలికగా తీసిపారేస్తున్నారట. హాలీవుడ్లో ఏ హీరో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడనేదానిపై తాజాగా ఓ సర్వే లెక్కలు బయటకు వచ్చాయి. ఇందులో టామ్ క్రూయిజ్ దాదాపు రూ.800 కోట్ల(100 మిలియన్ డాలర్స్) చొప్పున తీసుకుంటున్నాడట! టాప్ గన్: మావెరిక్ సినిమాకు ఇంత మొత్తాన్నే వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు నిర్మాత కూడా టామ్ క్రూయిజే కావడంతో బోనస్‌గా అతడికి మరో రూ.180 కోట్ల దాకా వచ్చాయట. అంటే మొత్తంగా ఒక్క సినిమాకే ఈ స్టార్ హీరో దాదాపు వెయ్యి కోట్ల మేర వెనకేశాడన్నమాట. ఇక ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో హోస్ట్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించి సెన్సేషన్ అయిన విల్ స్మిత్ ఎమాన్సిపేషన్ మూవీకిగానూ రూ.280 కోట్లు (35 మిలియన్ డాలర్స్) అందుకున్నాడట. లినార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్ ఇద్దరూ తాము నటిస్తున్న సినిమాకు రూ.240 కోట్లు(30 మిలియన్ డాలర్స్) అందుకున్నారట. డ్వేన్ జాన్సన్ రూ.180 కోట్లు (22.5 మిలియన్ డాలర్స్), క్రిస్ హేమ్స్‌వర్త్, డెంజెల్ వాషింగ్టన్, విన్ డీజిల్, జాక్విన్ ఫోనిక్స్, టామ్ హార్డీ, విల్ ఫెరల్, ర్యాన్ రెనాల్డ్స్ తలా రూ.160 కోట్లు (20 మిలియన్ డాలర్స్) వెనకేసుకుంటున్నారట. చదవండి: ప్రాణం కాపాడినవాన్నే అణచివేస్తే.. 'పరంపర 2' సిరీస్ రివ్యూ వేదం బ్యూటీ ఇలా అయిపోయిందేంటి? -
ఇండియాకు వచ్చిన విల్‌స్మిత్.. అతని కోసమేనా ? ఫొటోలు వైరల్..
Will Smith In India And Spotted At Mumbai Airport After Slap Controversy: హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అంటే సినీ ప్రియులకు తప్ప ఇంకేవరికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఇటీవల నిర్వహించిన ఆస్కార్ వేడుకల్లో హోస్ట్, కమెడియన్ క్రిస్‌రాక్‌పై విల్ స్మిత్ చేయి చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సంఘటన తర్వాత విల్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మోషన్ పిక్చర్ అకాడమీ విల్‌స్మిత్‌పై 10 ఏళ్ల నిషేధం కూడా విధించింది. ఇదిలా ఉంటే విల్ స్మిత్ తాజాగా ఇండియా బాట పట్టాడు. శనివారం (ఏప్రిల్ 23) ముంబై విమానాశ్రయం వద్ద విల్ స్మిత్ దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చెంపదెబ్బ ఘటన తర్వాత విల్ కెమెరాలకు చిక్కడం ఇదే తొలిసారి. విల్ స్మిత్ జుహులోని జెడబ్ల్యూ మారియట్హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. అయితే విల్ స్మిత్ ఇండియాకు రావడానికి కారణం ఏంటని తీవ్రంగా చర్చ నడుస్తోంది. అందులోనూ ఇలాంటి సమయంలో రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కలిసేందుకే విల్ స్మిత్ వచ్చినట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. చెంపదెబ్బ ఘటనతో విల్ కొద్ది రోజులుగా విచారంగా ఉన్నాడట. దీంతో సద్గురు వద్ద కొంత సమయం గడిపేందుకు వచ్చాడని సమాచారం. ఈ విషయంపై ఎలాంటి అదికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు. గతంలో విల్ స్మిత్ సద్గురుకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. 2019లో కూడా విల్ స్మిత్ భారతదేశాన్ని సందర్శించాడు. అప్పుడు పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి ముచ్చటించాడు. మరీ ఈసారి ఎవర్నైనా కలుస్తాడా ? లేదో ? చూడాలి. చదవండి: విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో చెంపదెబ్బ ఎఫెక్ట్.. ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు ! -
చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో
Academy Ban On Will Smith For 10 Years: ఆస్కార్ అవార్డు గ్రహిత, హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌పై నిషేధం వేటు పడింది. మోషన్ పిక్చర్ అకాడమీ విల్ స్మిత్‌పై చర్యలు తీసుకుంటూ అతడిపై 10 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు శుక్రవారం వెల్లడించింది. ఇది ఒక్క ఆస్కార్ అవార్డులకు మత్రమే కాదు మోషన్ పిక్చర్ నిర్వహించే ఇతర వేడుకలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. శుక్రవారం ఏప్రిల్ 8న సమావేశమైన అకాడమీ గవర్నర్ల బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విల్ స్మిత్‌పై నిషేధం విధిస్తున్నట్లు అకాడమీ ప్రకటించిన అనంతరం విల్ స్మిత్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.తాను అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. చదవండి: వరుణ్ తేజ్ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్, ట్వీట్ వైరల్ ఇదిలా ఉంటే స్మిత్ ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా గత నెల నిర్వహించిన 94వ ఆస్కార్ అవార్డు వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమెడియన్ క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంప దెబ్బ కొట్టాడు. స్మిత్ భార్య జాడా పింకెట్‌కు ఉన్న వ్యాధిని ఉద్దేశించి అతడు జోక్ చేశాడు. దీంతో అగ్రహానికి లోనైన స్మిత్ స్టేజ్‌పైకి వెళ్లి క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. -
చెంపదెబ్బ ఎఫెక్ట్.. ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు !
Will Smith Fast And Loose On Hold After Slapping Chris Rock Oscars 2022: ఆస్కార్ వేదికగా చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌కు టైం సరిగా లేనట్లే ఉంది. తన భార్య జాడా పింకెట్ అనారోగ్యంపై ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ జోక్ వేశాడన్న కారణంతో విల్ అతని చెంపచెల్లుమనించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అందుకంటూ ఈ సంఘటనపై అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు క్షమాపణలు కూడా చెప్పాడు విల్ స్మిత్. అనంతరం సోషల్ మీడియా వేదికగా క్రిస్ రాక్‌ను కూడా క్షమించమని కోరాడు. దీంతో ఈ వివాదం సద్దుమణగకుండా విల్ స్మిత్ రాజీనామా చేసేదాకా వెళ్లింది. హాలీవుడ్ ఫిల్మ్ అకాడమీకి విల్ స్మిత్ రాజీనామా చేస్తూ బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే అని కూడా తెలిపాడు. చదవండి: చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్ రాజీనామా.. ఇదిలా ఉంటే ఈ చెంపదెబ్బ వ్యవహారం విల్ స్మిత్ క్రమశిక్షణ చర్యల పరంగా కాకుండా తన సినీ కెరీర్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. విల్ హీరోగా రాబోయే చిత్రం 'ఫాస్ట్ అండ్ లూజ్'. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఆ మూవీని హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ ఆస్కార్ సంఘటనకు కొన్ని వారాల ముందు డైరెక్టర్ డేవిడ్ లీచ్ రియాన్ గోస్లింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన ఈ చిత్రాన్ని వదిలి 'ఫాల్ గాయ్' సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వినికిడి. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని చూస్తోందట. దీనంతటికి కారణం క్రిస్‌రాక్‌పై విల్ చేయిచేసుకోవడమే అని హాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. చదవండి: వీడియోతో దొరికిపోయిన విల్ స్మిత్.. ఇప్పుడేం అంటాడో మరి? అయితే 'ఫాస్ట్ అండ్ లూజ్' హోల్డ్‌లో ఉన్నప్పటికీ విల్ స్మిత్ చేతిలో ఎమాన్సిపేషన్, యాపిల్ టీవీ ప్లస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే 'బ్యాడ్ బాయ్స్ 4' కోసం చర్చలు జరుపుతున్నప్పటికీ, ఆస్కార్ వ్యవహారంతో ఈ ప్రాజెక్ట్‌ను కూడా సోనీ హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. చదవండి: ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే.. -
చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్ రాజీనామా..
Will Smith Resigns: హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (అకాడమీ అవార్డ్స్)కు రాజీనామా చేశాడు. ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై చేయి చేసుకోవడంపై విల్ స్మిత్ శుక్రవారం (ఏప్రిల్ 1) ఈ విధంగా తెలిపాడు. క్రిస్ రాక్‌ను చెంప దెబ్బ కొట్టండ అనేది 'షాకింగ్, బాధాకరమైనది, క్షమించరానిది' అని పేర్కొన్నాడు. 'నేను అకాడమీ నమ్మకానికి ద్రోహం చేశాను. ఈ వేడుకను అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఇతర నామినీలు, విజేతలు సంతోషంగా జరుపుకునే అవకాశాన్ని నేను కోల్పోయేలా చేశాను, నేను పోగొట్టుకున్నాను. నా గుండె ముక్కలైంది (హార్ట్ బ్రోకేన్). కాబట్టి, నేను అకాడమీ అవార్డ్స్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే. తదుపరి పరిణామాలను అంగీకరిస్తాను.' అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపాడు. చదవండి: ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే.. అంతేకాకుండా 'మార్పుకు సమయం పడుతుంది. హింసను అనుమతించకుండా, అందుకు కారణమయ్యే పరిస్థితులను అధిగమించేలా నా పనికి నేను కట్టుబడి ఉంటాను.' అని విల్ చెప్పుకొచ్చాడు. విల్ స్మిత్ రాజీనామాను ఆమోదించినట్లు అకాడమీ అవార్డ్స్ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్ తెలిపారు. క్షమశిక్షణా చర్యలో భాగంగా అదనపు ఆంక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 18న జరిగే గ్రూప్ బోర్డు సమావేశంలో ఈ విషయం గురించి చర్చించనున్నారు. అయితే గత ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకలో కమెడియన్ క్రిస్ రాక్ హోస్ట్‌గా వ్యవహరించాడు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. చదవండి: విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? 'అలోపేసియా' వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌ను ఉద్దేశించి జోక్ చేశాడు వ్యాఖ్యాత క్రిస్ రాక్. దీంతో ఆగ్రహానికి లోనైనా విల్ స్మిత్.. క్రిస్ రాక్ చెంప చెల్లుమనించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆస్కార్ అందుకునే సమయంలో అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు, తర్వాతి రోజు ఇన్‌స్టా గ్రామ్‌లో క్షమాపణలు కూడా తెలిపాడు విల్. అకాడమీ చర్యల్లో భాగంగా విల్ స్మిత్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. #WillSmith resigns from the #Academy for slapping #ChrisRock at the #Oscars His statement pic.twitter.com/3sDhcAkDuZ — Ramesh Bala (@rameshlaus) April 2, 2022 -
వీడియోతో దొరికిపోయిన విల్ స్మిత్.. ఇప్పుడేం అంటాడో మరి?
Will Smith Old Video: సోమవారం ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఫలానా సినిమాకి అవార్డు రావాల్సిందనో, ఫలానా స్టార్‌కి ఆస్కార్ రాకపోవడం అన్యాయమనో, ఫంక్షన్ బాగా జరిగిందనో... ఇలాంటి చర్చలు జరుగుతాయి. కానీ అలోపేసియా వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్ స్మిత్ భార్య జడా పింకెట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యాత క్రిస్ రాక్ వేసిన జోక్ గురించి, విల్ స్మిత్ అతడి చెంప చెళ్లుమనిపించిన ఘటన గురించీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 30 ఏళ్ల క్రితం అలోపేసియాతో బాధపడుతున్న జాన్ విల్లియమ్స్ బట్టతలపై ‘ది అర్సెనియా హాల్ షో’లో విల్ స్మిత్ వేసిన జోక్‌కి సంబంధించిన వీడియో అది. ‘అతనికో రూల్ ఉంది. అదేంటంటే అతను ప్రతి రోజూ తన తలను వ్యాక్స్ (కవర్ చేయాలనేది ఉద్దేశం) చేయాల్సిందే. అదే రూల్’ అంటూ జోక్ చేసి, ‘ఇది జస్ట్ జోక్’ అని కూడా అన్నాడు విల్ స్మిత్. ఆ వీడియోను ఇప్పుడు ఎవరో బయటపెట్టారు. మరి.. ఇప్పుడు క్రిస్ చేసింది కూడా జోక్‌లో భాగమే కదా అంటున్నారు నెటిజన్లు. ‘క్రిస్ చేస్తే తప్పు... నువ్వు చేస్తే ఒప్పా?’ అంటూ విల్ స్మిత్‌ని విమర్శిస్తున్నారు. 15 రోజుల్లోపు విల్ వివరణ ఇవ్వాలి క్రిస్‌పై విల్ దాడి పట్ల ఆస్కార్ కమిటీ చాలా ఆగ్రహంగా ఉంది. అదే వేదిక సాక్షిగా కమిటీకి, వీక్షకులకు క్షమాపణలు చెప్పాడు విల్. అయితే క్రిస్‌కి చెప్పలేదు. కానీ మరుసటి రోజు ఇన్స్టాగ్రామ్ వేదికగా క్రిస్‌కి క్షమాపణలు చెప్పాడు విల్. తన భార్యపై జోకులు వేయడంతో ఆగ్రహం పట్టలేకే అలా చేశానని కూడా అన్నాడు. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకల్లో విల్ ఇలా దాడి చేయడంపై ఆస్కార్ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనుకుంటోంది. ఈ విషయంపై చర్చించడానికి కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు కూడా. క్రిస్ పై దాడి చేశాక విల్ స్మిత్‌ని వేడుక నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరినా అతను వెళ్లకపోవడంపై కూడా కమిటీ తీవ్ర ఆగ్రహంగా ఉందట. అందుకే తన ప్రవర్తనపై విల్ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించిందట. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఏప్రిల్ 18న కమిటీ మరోసారి సమావేశం కానుందని సమాచారం. “He gotta wax his head every morning.” Now this is a video of Will Smith saying a joke about someone with Alopecia. One reason I love the internet, it never forgets. pic.twitter.com/4OGlgSrcjA — Peter O.K.H (@Peter_OKH) March 28, 2022 -
ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే..
Why Did Will Smith Slapping Chris Rock In Oscar Awards Reason Is Here: ఆస్కార్ అవార్డ్స్ 2022 వేడుకలో హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 92వ అకాడమీ అవార్డుల వేదికపై విల్ స్మిత్, అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో హాలీవుడ్ సినీ లోకం షాక్‌కు గురైంది. పలువురు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వారి ఇరువురి స్థానాల్లో వారు ఉంటే ఏం చేశారో చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ ఘటనపై ఆస్కార్ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. విల్ స్మిత్‌పై త్వరలోనే తగిన చర్యలు తీసుకునే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇదిలా ఉంటే అసలు విల్ స్మిత్.. క్రిస్ రాక్‌ను కొట్టడానికి గల కారణం ఏమైంటుంది ? విల్ భార్య జాడా పింకెట్‌కు ఏమైంది ? ఎందుకు ఆమె గుండుతో కనిపించింది ? చదవండి: హీరో విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డ్స్ 2022 వేడుకకు అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆయన ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించేందుకు ఓ చిన్న కామెడీ ట్రాక్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె జుట్టు పూర్తిగా తొలగించుకొని గుండుతో ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. ఆమెను చూసిన క్రిస్ 'జీఐ జేన్' సినిమాలో 'డెమి మూర్' యాక్ట్ చేసిన పాత్రతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమాలో 'డెమి మూర్' పూర్తి గుండుతో కనిపిస్తుంది. 'జీఐ జేన్' సీక్వెల్లో కనిపించబోతున్నారా ? అని క్రిస్ రాక్ నవ్వించే ప్రయత్నం చేశాడు. చదవండి: 63 ఏళ్ల వయసులో ఎనిమిదోసారి తండ్రి కాబోతున్న నటుడు ఈ మాటలతోనే ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ కోపోద్రిక్తుడయ్యాడు. నిజానికి జాడా పింకెట్ 'అలోపిసియా' అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్న వారిలో జుట్టు ఊడిపోతు ఉంటుంది. అయితే తన భార్య అనారోగ్యంపై జోకులు వేయడాన్ని సహించలేకపోయాడు విల్ స్మిత్. ఆగ్రహంతో నేరుగా వేదికపైకి వెళ్లి క్రిస్ దవడ పగలకొట్టి వెనుదిరిగాడు విల్ స్మిత్. తర్వాత తన కుర్చీలో కూర్చుని క్రిస్‌పై విరుచుకుపడ్డాడు. 'నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు' అంటూ గట్టిగా అరుస్తూ క్రిస్ రాక్‌ను హెచ్చరించాడు విల్. ఈ ఘటనతో ప్రేక్షకులు, అకాడమీ నిర్వాహకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. చదవండి: ఆమెకు ముద్దు పెట్టారా?.. పిల్లాడి ప్రశ్నకు తడబడ్డ స్టార్ హీరో, వీడియో వైరల్ ఈ ఇన్సిడెంట్ తర్వాత 'కింగ్ రిచర్డ్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకునేందుకు విల్ స్మిత్ వేదికపైకి వచ్చాడు. ఘటనపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు తెలిపాడు. తర్వాత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి క్షమాపణలు కోరాడు. ఈ ప్రపంచంలో హింసకు చోటులేదని, తన ప్రవర్తన ఆమోదయోగ్యం కానిదని పేర్కొంటూ.. తనను క్షమించమని క్రిస్ రాక్‌ను కోరాడు విల్ స్మిత్. 'అలోపిసియా' లక్షణాలు: వయోజన మహిళల్లో ఎక్కువగా వస్తుంది 50% శాతం వరకు జుట్టు రాలిపోతుంది చర్మం రాలిపోతూ ఉంటుంది మానసిక ఒత్తిడి విటమిన్లు, మైక్రో ఎలిమెంట్లు ఉన్న పరిమిత ఆహారం తీసుకోవాలి ధీర్ఘకాలిక చికిత్స చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్ -
ఆస్కార్ వేడుకల్లో కమెడియన్‌పై చెంపదెబ్బ.. విల్ స్మిత్‌పై చర్యలు !
Academy Will Take Action Against Will Smith Slap In Oscars: 92వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవంలో జరిగిన చెంపదెబ్బ ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయం చెబుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా చర్చనీయాంశమైంది. అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై ఆస్కార్ విన్నర్, స్టార్ హీరో విల్ స్మిత్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో విల్ స్మిత్‌పై ఆస్కార్ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే విల్ స్మిత్‌పై చర్యలు తీసుకునే అవాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: హీరో విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏఎమ్పీఏఎస్) అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ అకాడమీ సభ్యులకు తాజాగా ఓ లేఖ పంపారు. విల్ చేయి చేసుకోవడంపై అకాడమీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు అందులో తెలిపారు. 2021 సినీ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన అనేక మంది వ్యక్తులను సత్కరించేందుకుగానూ ఆదివారం 94వ ఆస్కార్ వేడుకలు నిర్వహించాం. కానీ ఇలాంటి వేదికపై ఓ నామినీ ఆమోదయోగ్యం కానీ, హానికరమైన ప్రవర్తనతో మేము కలత చెందాం. విల్ స్మిత్ చేయి చేసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. విల్ హద్దు మీరి ప్రవర్తించారు. నియమనింబంధనల్లో భాగంగా అకాడమీ గవర్నర్ల బోర్డు విల్ స్మిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలి. అని అధ్యక్షుడు డేవిడ్ ఆ లేఖలో పేర్కొన్నారు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 చదవండి: ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్ -
నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను, మానసికంగా కుంగిపోయా: సమీరారెడ్డి
ఆస్కార్ అవార్డు 2022 ఈవెంట్ చోటు చేసుకున్న సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన భార్య అనారోగ్యం గురించి కమెడియన్ క్రిస్ రాక్ స్టేజ్‌పై మాట్లాడుతూ హాస్యం చేసినందుకు హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ అతడి చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘనపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీనిపై స్పందిస్తూ ఆ పరిస్థితుల్లో తాను కూడా అలాగే చేసేదాన్ని అంటూ స్మిత్‌కు మద్దతుగా నిలిచింది. ఇక తాజాగా నటి సమీరా రెడ్డి కూడా స్పందించింది. స్మిత్ భార్యను బాధించిన అలోపేసియా ఏరియాటా వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ తను కూడా గతంలో అలోపేసియా వ్యాధితో బాధపడినట్టు సీక్రెట్ రీవిల్ చేసింది. అంతేకాదు ఈ వ్యాధి అంటే ఏంటో కూడా సమీరా వివరించింది. ‘ప్రతి ఒక్కరు జీవితంలో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలతో బాధపుడుతుంటారు. ఇటీవల ఆస్కార్ వివాదం నన్ను దీనిపై మాట్లాడేలా చేసింది. ఇంతకి అలోపేసియా అంటే ఏమిటో తెలుసా? ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీని వల్ల మీ జుట్టు కుదుళ్ల నుంచి ప్యాచ్‌లుగా ఊడిపోతుంది. 2016లో నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను. ఒక రోజు నా తల వెనక భాగంలో 2 ఇంచుల మేర నా జుట్టు ఉడిపోయి ఉండటం నా భర్త అక్షయ్ గమనించాడు. ఒక నెలలోనే రెండు మూడు చోట్ల నా జుట్టు ఊడిపోయి కనిపించింది. చదవండి: ఆగిపోయిన ప్రభాస్ సలార్ షూటింగ్!.. కారణం అదేనా? ఇది అంటూ వ్యాధి కాదు, ఇది మనల్ని ఎలాంటి అనారోగ్యానికి కూడా గురి చేయదు. కానీ చూట్టు రాలిపోవడం అంటే మానసికంగా కుంగదీస్తుంది. ఈ అలోపేసియా ఏరియాటా ఎందుకు వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ.. ఇది మాత్రం పెద్ద వ్యాధి కాదు’ అంటూ సమీరా రాసుకొచ్చింది. అలాగే తను ఈ సమస్య నుంచి బయటపడ్డానని, ప్రస్తుతం తన తలలో ఎలాంటి ప్యాచ్‌లు లేవని ఆమె తెలిపింది. కాగా సమీరా రెడ్డి జై చిరంజీవా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అశోకా వంటి చిత్రాల్లో తన నటన, డాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సమీరారెడ్డి.. అంతే తక్కువ సయమంలో ఇండస్ట్రీకి దూరమైంది. అక్షయ్ అనే వ్యాపావేత్తను పెళ్లి చేసుకుని ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది సమీరారెడ్డి. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ?
Police Visits Will Smith Home Over Drone Sighting Report: హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ గ్రహిత విల్ స్మిత్ ఆస్కార్ 2022 వేదికపై చేసిన పని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై విల్ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా బెస్ట్ డ్యాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇచ్చేందుకు అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ స్టేజ్‌పైకి ఎక్కాడు. అప్పుడు ఏదో మాట్లాడుతూ అనారోగ్యంతో గుండు చేయించుకున్న విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఆగ్రహంతో క్రిస్ రాక్ దవడ పగలకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్ అయితే తాజాగా విల్ స్మిత్ ఇంటిని లాస్ ఏంజిల్స్ పోలీసులు సందర్శించారు. విల్ ఇంటి ఆవరణలో డ్రోన్ కనిపించినట్లు పోలీసులకు ఎవరో సమాచారం ఇచ్చారట. అందుకే విల్ స్మిత్ కాలాబాసాన్ మాన్షన్‌ను పోలీసులు సందర్శించినట్లు సమాచారం. అయితే విల్ ఇంటి ఆవరణలో ఎక్కడా ఎలాంటి డ్రోన్‌ను పోలీసులు గుర్తించలేదట. పోలీసులు వెళ్లే సరికే డ్రోన్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వారు భావించినట్లు తెలుస్తోంది. అలాగే డ్రోన్ గురించి పోలీసులకు ఎవరూ సమాచారం అందించారో కూడా స్పష్టత లేదు. బహుశా ఇరుగుపొరుగు వారు ఎవరైనా కాల్ చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డ్రోన్‌ను గుర్తించడానికి, ఎవరైనా ఫొటోగ్రాఫర్స్ ఉన్నారా ? లేదా అసలు అక్కడా ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే వారి బృందాన్ని పంపినట్లు పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్ -
విల్ స్మిత్ ప్రదర్శించింది ప్రేమ కాదు..
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఇదేనా ప్రేమ? తానొక ప్రేమ నౌకను అవుతానని చెబుతుంటారు నటుడు విల్ స్మిత్. ప్రేమ అనేది హింసాత్మకంగా ఉండదు. ప్రపంచం మొత్తం గమనిస్తున్న ఆస్కార్ అవార్డుల స్టేజీ మీద స్మిత్ ప్రదర్శించింది ప్రేమ కాదు. – మారియా శ్రివర్, పాత్రికేయురాలు జరగకూడనివి! అదేమీ సరదాగా లేదు. ఆ జోకూ బాలేదూ, అలా చెంపదెబ్బ కొట్టడమూ బాలేదూ. (ఆస్కార్ అవార్డుల ప్రదాన వేడుకలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్య మీద అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ జోక్ చేయడం... స్మిత్ కొట్టడం నేపథ్యంలో.) – రాఖీ త్రిపాఠి, అసోసియేట్ ప్రొఫెసర్ ఇంకా మిగిలేవుందా? తాలిబన్లు అమ్యూజ్మెంట్ (వినోదం కలిగించే) పార్కులకు నిబంధనలు ప్రకటించారు. 4 రోజులు పురుషుల కోసం, మిగిలిన 3 రోజులు మహిళల కోసం. నిజంగా అఫ్గానిస్తాన్‌లో అమ్యూజ్ మెంట్ పార్కులు ఉన్నాయా! – ఇంతియాజ్ మహమూద్, వ్యాఖ్యాత ముందు జాగ్రత్తలు! టీడీపీ వ్యవస్థాపక ఉత్సవాల సంగతేమో కానీ తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసు కుంటున్నారు. అసమర్థులు, చెంచాలకు తండ్రీకొడుకులు పెద్ద పీట వేస్తున్నారని మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తలు రగిలిపోతున్నారు. వారు వెంటపడి తరమకుండా చూసుకోండి. – వి. విజయసాయి రెడ్డి, రాజ్యసభ ఎంపీ కళ్లు తెరవాలి అమెరికాలో నివసించే వారికి వారి నాయకుల వల్ల సులభంగా ఏమారకుండా ఉండాల్సిన నైతిక బాధ్యత ఉంది. అమెరికాకూ మరీ ఎక్కువ వినాశనం గావించే శక్తి ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉక్రెయి న్నుగానీ, మరిదేన్నిగానీ పట్టించుకోదు. అది లాభాలు, అధికారం మీద నడుస్తుంది. అమాయకత్వం పాపం! – అజాము బరాకా, యాక్టివిస్ట్ దృష్టికోణం మారాలి వధించబోయే బాధితురాలిగా ఉక్రెయిన్ను చూడకండి. దాన్ని ఒక యోధురాలిగా చూడండి. ఉక్రెయిన్ త్యాగాల దుఃఖం మీద దృష్టి పెట్టకండి. ఉక్రెయిన్‌కు ఏ సాయం చేస్తే విజేతగా నిలపొచ్చో దాని మీద దృష్టి పెట్టండి. రష్యా అపారతను చూసి భయపడొద్దు. నిలువరించాల్సిన, నిలువరించగలిగే పెళుసైన భారీతనంగా దాన్ని చూడండి. – వొలొదిమిర్ యెర్మొలెంకో, ఉక్రెయిన్ సంపాదకుడు పట్టించుకోదగినది కాదా? అందరి కళ్లూ ఉక్రెయిన్ మీద ఉండగా– యెమెన్ రాజధాని నగరం సనా మీద అమెరికన్, బ్రిటిష్ బాంబులు పడుతున్నాయి. ఆంక్షల విధింపు ఎక్కడ? ప్రపంచ ఆగ్రహం ఎక్కడ? – సారా అబ్దల్లా, కామెంటేటర్ -
అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut Reaction On Will Smith Slapping Chris Rock: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తుంది. ఏ అంశంపైనైనా ఆమె చేసే కామెంట్స్ సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. ఈ వ్యాఖ్యలతో వివాదాలు ఎదుర్కొన్న ఈ బ్యూటీకు అభిమానులు కూడా ఎక్కువే. హిందీ పాపులర్ హీరోయిన్లలో ఒకరైనా కంగనా రనౌత్ తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ అవార్డు గ్రహిత విల్ స్మిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతను తన లాకప్‌కు వస్తాడని ఆశిస్తున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేసింది. కంగనా అలా అనడానికి కారణం ఆస్కార్ 2022 అవార్డు ఫంక్షన్లో విల్‌స్మిత్ చేసిన పనే. ఆస్కార్ అవార్డు వేదికపై అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు. చదవండి: ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్ ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ద్వారా స్పందించింది కంగనా. 'కొంతమంది మూర్ఖులను నవ్వించడానికి మా అమ్మ లేదా సోదరిల అనారోగ్యాన్ని ఉపయోగించినట్లయితే నేను కూడా విల్ స్మిత్‌లానే చెంప పగులకొడతాను. ఇలాంటి ప్రవర్తన కనబర్చిన (బ్యాడ్ యాస్ మూవ్) విల్ స్మిత్ తప్పకుండా నా లాకప్‌కు వస్తాడని ఆశిస్తున్నాను.' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కంగనా రనౌత్. కాంట్రవర్సీ రియాలిటీ షో 'లాకప్'కు కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ముఖంపై పిడిగుద్దు ఘటన.. విల్ స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసేసుకుంటారా? ఇదిలా ఉంటే ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా బెస్ట్ డ్యాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇచ్చేందుకు అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ స్టేజ్‌పైకి ఎక్కాడు. అప్పుడు ఏదో మాట్లాడుతూ అనారోగ్యంతో గుండు చేయించుకున్న విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఆగ్రహంతో క్రిస్ రాక్ దవడ పగలకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 -
విల్ స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసేసుకుంటారా?
ఆస్కార్స్ 2022 ఈవెంట్ వేదికగా జరిగిన షాకింగ్ ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నటుడు విల్ స్మిత్, మరో నటుడు క్రిస్ రాక్‌ను స్టేజ్‌పైనే ముఖం పగల కొట్టిన ఘటన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విల్ స్మిత్‌కు దక్కిన బెస్ట్ యాక్టర్ అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. విల్ స్మిత్.. క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటన వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఇన్సిడెంట్ ఈవెంట్ లైవ్‌లో టెలికాస్ట్ కాలేదు. పైగా ఈ ఘటన తర్వాత ఆస్కార్స్ 2022 ఈవెంట్‌ను కాసేపు నిలిపేసినట్లు సమాచారం. అయితే కాసేపటికే ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ ఈవెంట్ వేదికగానే విల్ స్మిత్ బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ ట్రోఫీ అందుకున్నారు.. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అకాడమీ రూల్స్ ప్రకారం.. విల్ స్మిత్ ఆస్కార్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని కొందరు గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమీ స్పందించింది. ‘‘హింస ఏ రూపంలో ఉన్నా అకాడమీ సహించదు. ఈ రాత్రి మా 94వ అకాడమీ అవార్డుల వేడుకలు జరగడం, విజేతల గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహచరులు, సినీ ప్రేమికుల నుండి ఈ క్షణానికి గుర్తింపు పొందారు (sic)’’ అంటూ ట్వీట్ చేసింది అకాడమీ. The Academy does not condone violence of any form. Tonight we are delighted to celebrate our 94th Academy Awards winners, who deserve this moment of recognition from their peers and movie lovers around the world. — The Academy (@TheAcademy) March 28, 2022 ఇక ఇలాంటి సందర్భాల్లో అకాడమీ గట్టి చర్యలు తీసుకోవాలని, సరైన మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని, అసలు ఈ ఉదంతాన్ని ఒక దాడిగా పరిగణించి విల్ స్మిత్ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే అకాడమీ మాత్రం అవార్డు వెనక్కి తీసుకునే వ్యవహారంపై ఇంతవరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయలేదు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 అకాడమీ రూల్స్ ఏం చెబుతోందంటే.. 2017లో విడుదల చేసిన అకాడమీ కండక్ట్ కోడ్.. అకాడమీ విలువలను పరిరక్షించడంతో పాటు అవతలి వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. అంతేకాదు.. అకాడమీ వాతావరణంలో అనైతికంగా వ్యవహరించకూడదు కూడా. అయితే విల్ స్మిత్ దాడి విషయంలో.. స్టేజ్ మీద ఉన్న క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు. ఆమె చూడడానికి జీఐ జేన్ 2(సినిమా.. అందులో లీడ్ రోల్) లాగా ఉందంటూ కామెంట్ చేశాడు. కానీ, జాడా అలోపెషియాతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం వల్లే ఆమె జుట్టు రాలిపోగా.. అలా గుండు లుక్‌తో దర్శనమిచ్చింది. అందుకే భార్య మీద వేసిన జోక్‌కు విల్ స్మిత్‌కు మండిపోయి గూబ పగలకొట్టి ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. విల్ స్మిత్, జాడా పింకెట్లు 1997లో వివాహం చేసుకున్నారు. 2018లో జాడా తనకు ఉన్న అలోపెసియా గురించి ఓపెన్ అయ్యింది. తద్వారా గొంతు సమస్యలు, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. -
తారల ఆనందమానందమాయె.. ఆస్కార్‌ను ముద్దాడిన వేళ.. (ఆస్కార్ 2022 ఫొటోలు)
-
ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్
Shocking Video In Oscars 2022: నటుడు విల్ స్మిత్(53)కు ఎట్టకేలకు ఆస్కార్ దక్కింది. 94వ ఆస్కార్ వేడుకల్లో ‘కింగ్ రిచర్డ్’ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడాయన. అయితే.. ఈవెంట్ సందర్భంగా జరిగిన ఓ ఘటన సినీ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఆస్కార్స్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా.. నటుడు విల్ స్మిత్, స్టేజ్‌పై మాట్లాడుతున్న అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్ ఎక్కిన క్రిస్.. ఏదో మాట్లాడుతూ విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు. అనారోగ్యంతో ఆమె గుండు చేయించుకుని ఉండగా.. ఆమె లుక్ మీద క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు. స్టేజ్ మీదకు సీరియస్‌గా నడ్చుకుంటూ వెళ్లిన స్మిత్.. క్రిస్ దవడ పగలకొట్టాడు. ఆ మరుక్షణమే కిందికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. క్రిస్ వెకిలిగా ఏదో వివరణ ఇవ్వబోతుండగా.. అభ్యంతరకరమైన పదంతో నోరు మూయమంటూ క్రిస్‌కు సూచించాడు విల్ స్మిత్. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 ఆపై క్షమాపణలు ఇదంతా లైవ్ రికార్డులో ప్లే కాలేదు. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుంది. అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో స్పష్టత లేదు. కానీ, క్రిస్ వ్యక్తిగతంగా కలిసి ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.] అంతేకాదు నిర్వాహకులు విల్ స్మిత్‌ను పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పినట్లుగా ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఇక ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్న టైంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న విల్ స్మిత్.. క్రిస్ పట్ల వ్యవహరించిన తీరుకు క్షమాపణలు తెలియజేశాడు కూడా. Here's Will Smith's tearful acceptance speech at the #Oscars. https://t.co/ulvT7fsB57 pic.twitter.com/Uq2krBbBld — Variety (@Variety) March 28, 2022 మూడుసార్లు నామినేట్! అమెరికన్ నటుడు అయిన విల్ స్మిత్(విలియర్డ్ కారోల్ స్మిత్ 2).. మెన్ ఇన్ బ్లాక్, ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, హ్యాంకాక్, ఐ యామ్ లెజెండ్ లాంటి సినిమాలతో విల్ స్మిత్ ఇండియన్ ఆడియొన్స్‌కు సుపరిచితుడే. ఇప్పటిదాకా ‘అలీ’, ‘ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’, ‘కింగ్ రిచర్డ్’కు గానూ మూడుసార్లు ఉత్తర నటుడి కేటగిరీలో నామినేట్ అయ్యారు ఆయన. అయితే ది ఫ్రెష్ ప్రిన్స్‌గా పేరున్న విల్ స్మిత్‌కు ఆస్కార్ 2022లో అవార్డు ముచ్చట తీరింది. కింగ్ రిచర్డ్‌లో వీనస్, సెరీనా విలియమ్స్ తండ్రి పాతర రిచర్డ్ విలియమ్స్ రోల్లో ఆయన కనబర్చిన అద్భుతమైన నటనకు ఆస్కార్ దక్కించుకున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Oscars 2022.. విజేతల పూర్తి లిస్ట్ ఇదే -
డబ్బు పోయింది, కుటుంబం విచ్ఛిన్నమైంది.. 'సమంత మనసులో ఇంత బాధ ఉందా'?
Samantha Shares Cryptic Quote Related To Failure, Loss, Divorce, Humiliation: స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత షేర్ చేస్తున్న పోస్టులపై ఫోకస్ మరింత పెరిగింది. తాజాగా హాలీవుడ్ హాస్యనటుడు విల్ స్మిత్ పుస్తకం నుంచి ఓ కోట్‌ను షేర్ చేసింది. అందులో.. 'గత 30 ఏళ్లుగా అందరిలాగే నేను కూడా వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు వంటి వాటిని ఫేస్ చేశాను. నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు పోయింది. నా ప్రైవసీని అతిక్రమించారు. నా కుటుంబం విచ్ఛిన్నమైంది' అంటూ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో పాటు ప్రతిరోజు ఇటుకను కాంక్రీట్ కలిపి పేర్చాలని మీరు ఏ దారిలో వెళ్తున్నా అక్కడ ఒక ఇటుక పేర్చేందుకు ఉంటుందని.. కానీ ఆ ఇటుకను పేర్చేందుకు నువ్వు లేచి నిలబడాలి అంటూ పేర్కొంది. మరో పోస్టులో.. కష్టపడి పని చేయండి. మీకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రతి రోజూ ఆవిష్కరించుకోండి అంటూ పేర్కొంది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విడాకుల తర్వాత సమంత మనసులో ఇంత బాధ ఉందా అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. -
మరో వ్యక్తితో ఎఫైర్.. అందుకే విడిపోయాం : హీరో షాకింగ్ కామెంట్స్
ప్రముఖ హాలీవుడ్ హీరో, ర్యాపర్ విల్ స్మిత్ తనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఫ్యాన్స్‌తో ముచ్చటించిన విల్ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా విల్ స్మిత్ తాను 16 ఏళ్లలో ఎదుర్కొన పలు సంఘటనలు ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నాడు. 16 ఏళ్లకే తొలి బ్రేకప్ వంటి చేదు అనుభవాలను చూశానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. చదవండి: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట! ఈ మేరకు విల్ స్మిత్ మాట్లాడుతూ.. ‘నా 16 ఏళ్ల వయసులో మెలనియా అనే యువతితో ప్రేమలో ఉన్నాను. కొంతకాలం ఇద్దరం సీరియస్ రిలేషన్లో ఉన్నాం. ఈ క్రమంలో ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో భాగంగా నేను రెండు వారాల పాటు మెలనియాకు దూరంగా ఉన్నాను. అదే సమయంలో ఆమె నన్ను మోసం చేసింది. మెలనియా మరో వ్యక్తితో ప్రేమ, ఎఫైర్ పెట్టుకుంది. దీంతో మేమిద్దరం విడిపోయాం’ అంటూ విల్ చెప్పుకొచ్చాడు. ఇక తనతో బ్రేకప్ తర్వాత తీవ్ర ఒత్తిడికి గురయ్యానంటూ విల్ భావోద్యేగానికి లోనయ్యాడు. ‘మెలనియాతో బ్రేకప్ బాధ, ఒత్తిడి నుంచి బయట పడేందుకు వీపరితంగా శృంగారం చేశాను. అయితే మేం రిలేషన్లో ఉన్నప్పుడు మెలనియాతో మాత్రమే సన్నిహితంగా ఉన్నాను. చదవండి: అరెస్ట్ చేయడానికి వస్తే ఇంటి దగ్గర నా మూడ్ ఇలా.. కంగనా సంచలన పోస్ట్ కేవలం తనతోనే శృంగారంలో పాల్గొనేవాడిని. అయితే తనతో విడిపోయాక చాలా మంది మహిళలతో శృంగారం చేశాను. అది కాస్తా తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు గుర్తు చేసుకుంటే అది నేనేనా అనే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆ బాధలో ఏం చేస్తున్నానో నన్ను నేను గమినించుకోలేదు. ఈ వీపరితమైన శృంగారం నాకు విరుద్దంగా, ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేది. దీంతో ఒకానోక సమయంలో నాకు వాంతులు కూడా వచ్చేవి’ అంటూ వివరించాడు. కాగా ప్రస్తుతం ప్రస్తుతం విల్ స్మిత్ ‘కింగ్ రిచర్డ్’ అనే బయోపిక్‌లో నటిస్తున్నాడు. టెన్నిస్ ప్లేయర్స్ వీనస్, సెరెనా విలియమ్స్‌లకు తండ్రి, కోచ్ రిచర్డ్ విలియమ్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ మూవీకి రీనాల్డో మార్కస్ గ్రీన్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
హాలీవుడ్ స్టార్ సాహసం.. బుర్జ్ ఖలీఫా భవనం ఎక్కి..
హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఓ సాహసకృత్యం చేసి తన అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పైకి ఎక్కాడు. 2,909 మెట్ల ద్వారా 160 అంతస్తును చేరుకున్నాడీ బ్యాడ్ బ్యాయ్స్ హీరో. అతని బరువు తగ్గించే విధానాన్ని డాక్యుమెంట్ రూపంలో చిత్రీకరిస్తున్నాడు విల్. 'బెస్ట్ షేప్ ఆఫ్ మై లైఫ్' అనే కొత్త యూట్యూబ్ సిరీస్‌లో భాగంగా బుర్జ్ ఖలీఫా ఎక్కినట్టు పేర్కొన్నాడు. 2,909 మెట్ల ద్వారా చివరి అంతస్తును చేరుకునే సరికి తన కార్డియో వర్క్అవుట్ పూర్తయిందని తెలిపాడు. 160 అంతస్తులు ఉన్న ఈ భవనం పెకి ఎక్కడానికి 51 నిమిషాలు పట్టిందట. బుర్జ్ ఖలీఫాలో ముందుకు సాగుతున్నప్పుడు చెమటలు పట్టి అలసిపోయాడు. 160వ అంతస్తు చేరుకున్నప్పుడు, అతను సాధించేది ఇంకా ఉందని అనుకున్నాడట. హార్నెస్, హెల్మెట్ కట్టుకుని నిచ్చెన ద్వారా శిఖరంపైకి ఎక్కాడు. శిఖరంపైకి చేరుకున్నాక 'భూమిపై మానవులు నిర్మించిన వాటిలో మనుషులు ఉండగల వ్యక్తిగత స్థానం' అని విల్ అభిప్రాయపడ్డాడు. అలాగే విల్ స్మిత్ యూట్యూబ్ సిరీస్ గ్రామీ అవార్డ్ గెలుచుకున్న నటుడు ఫిట్నెస్, ఆరోగ్యం ప్రయాణంపై ఉంటుందట. 'బెస్ట్ షేప్ ఆఫ్ మై లైఫ్' మొదటి రెండు ఎపిసోడ్లు నవంబర్ 8న విడుదలయ్యాయి. మిగిలిన 4 ఎపిసోడ్లు విల్ స్మిత్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ప్రతిరోజు ప్రదర్శితమవుతాయి. -
వీడియో చూసి ఏడ్చేశాను: జాక్వెలిన్
భూమ్మీద ప్రేమకు, అనుబంధానికి మించిన అమూల్యమైంది ఏదీ లేదు. అయితే ఆ ప్రేమలో అత్యున్నత స్థాయి తల్లిదే. ఆ తరువాత అంతటి ప్రేమను పంచేది సోదరులే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దానికి తార్కాణమే ఈ వీడియో. నిజానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ఎప్పుడో చక్కర్లు కొట్టింది. అయితే దీనిని తాజాగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో మరోసారి ఈ వీడియో వార్తల్లో నిలిచింది. ‘తోబుట్టువుల ప్రేమను మించింది ఏదీ లేదు’ అనే క్యాప్షన్‌తో విల్ స్మిత్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న పిల్లవాడు తన చెల్లెతో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు. చెల్లెతో బంతిని బాస్కెట్లో వేయమని చెప్పగా మొదటి ప్రయత్నంలో ఆమెకు ఆ బంతి గోల్ మిస్ అవుతుంది. దీంతో చిన్నారి ఏడుపు లంకించుకోవడంతో అన్న తనను హత్తుకొని మళ్లీ ప్రయత్నించమని దైర్యం చెప్తాడు. అంతేగాక తనను ఎత్తుకొని మరి మళ్లీ ఆమె బాస్కెట్లో బంతి వేయడానికి సహాయపడతాడు. ఈసారి బంతి సరిగా బాస్కెట్లో పడటంతో చిన్నారి ఆనందంతో మునిగి తేలుతుంది. కాగా వీడియోను ఇప్పటికే కొన్ని లక్షలమంది వీక్షించగా అనేకమంది నెటిజన్లు తమకు ఓ అన్నయ్య ఉంటే బాగుండు అని భావోద్వేగంతో కామెంట్ పెడుతున్నారు. వీరే గాక వీడియో చూసిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా దీనిపై స్పందించారు. వీడియో చూశాక నాకు ఏడుపు వచ్చింది అంటూ.. కామెంట్ పెట్టారు. View this post on Instagram Nothing beats that sibling love :-) 📹 @sarahanne_n_clan A post shared by Will Smith (@willsmith) on Oct 17, 2019 at 2:30pm PDT -
సోషల్ మీడియా తాజా సంచలనం
న్యూఢిల్లీ: ఇవానా క్యాంప్‌బెల్.. సోషల్ మీడియాలో తాజా సంచలనం. ఆరేళ్ల ఈ ఆఫ్రికా చిన్నారి తన డాన్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ముద్దుగా, బొద్దుగా ఉన్న ఈ పాప లయబ్ధంగా అలవోకగా చేస్తున్న నృత్యాలకు హాలీవుడ్ అగ్రతారల నుంచి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె చేసిన డాన్స్ వీడియోను అమెరికాకు చెందిన ప్రముఖ గాయని లిజో జూన్ 8న తన అధికారిక ట్విటర్ పేజీలో షేర్ చేయడంతో ఇవానా రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. హాలీవుడ్ నటులు క్రిస్ ఇవాన్స్, విల్‌స్మిత్ కూడా ఆమెకు అభిమానులుగా మారిపోయాయి. వీరు కూడా తమ వ్యక్తిగత సోషల్ మీడియా పేజీల్లో ఈ చిన్నారి వీడియోలు షేర్ చేయడంతో ఆమెకు ఆదరణ అమాంతంగా పెరిగిపోయింది. ఇవానా వీడియోలకు లక్షల్లో లైకులు, వ్యూస్ రావడంతో ఇంటర్నెట్ టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ నగరానికి చెందిన ఇవానా మే 30న ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. అప్పుడే ఆమె సుమారు లక్షా 90 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె పెట్టిన 12 పోస్ట్‌లను లక్షలాది మంది వీక్షించారు. ఇవానా డాన్స్ సూపర్ అంటూ ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇవానా హావభావాలు అద్భుతమని తెగ పొగిడేస్తున్నారు. -
అరేబియన్ రాజ్యంలో...
అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ కథని ఎన్నిసార్లు సినిమాగా తీసినా చూసిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. అందుకే మరోసారి డిస్నీ వారు ప్రస్తుత సాంకేతికతని వాడుకొని ‘అలాద్దీన్’ కథని ఓ విజువల్ వండర్‌గా తయారు చేశారు. ఈ సినిమాలో జీనీగా విల్ స్మిత్, అల్లాద్దీన్‌గా మేనా మసూద్ నటించారు. గైయ్ రిచాయ్ దర్శకుడు. ఈ సినిమా రేపు తెలుగు, తమిళ్, హిందీ,ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 350 థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇందులోని జీని (దెయ్యం) పాత్రకు వెంకటేశ్, అల్లాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పడంతో తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. -
అలాద్దీన్ ప్రపంచం
అరేబియన్ నైట్స్ కథల్లో అలాద్దీన్ అద్భుత దీపం కథకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ అద్భుత దీపంతో ఎన్నో కథలు వచ్చాయి. ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. అందుకే సరికొత్త హంగులతో ఎప్పటికప్పుడు అలాద్దీన్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు దర్శక–నిర్మాతలు. వాల్ట్ డిస్నీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో జీనీ, అలాద్దీన్‌గా విల్ స్మిత్, నటించారు. గాయ్ రిట్చయ్ దర్శకత్వం వíహించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. జీనీ పాత్రకు వెంకటేశ్, అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. మరోసారి అలాద్దీన్ ప్రపంచంలోకి వెళ్లడానికి ప్రేక్షకులు రెడీగా ఉండాలన్నమాట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది -
హరిద్వార్‌లో హాలీవుడ్ స్టార్ హీరో
భారతీయ సాంప్రదాయాలు, ఆచారాల పట్ల పాశ్చాత్యులు ఆకర్షితులవుతున్నారు. అందుకే పలువురు విదేశీ ప్రముఖులు మన దేశంలోని ఆలయాలు పవిత్ర స్థలాలను సందర్శించేందుకు వస్తుంటారు. వీరిలో హాలీవుడు స్టార్ హీరో విల్‌స్మిత్ కూడా ఉన్నారు. విల్‌స్మిత్ తరుచూ భారత పర్యటన చేస్తుంటారు. తాజాగా మరోసారి ఇండియాలో పర్యంటించిన ఆయన హరిద్వార్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఓ సామాన్యుడిలా నేలపై కూర్చొని హరిద్వార్ విశిష్టతను తెలుసుకున్నారు. తరువాత గంగా హరతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తన హరిద్వార్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విల్‌స్మిత్ ‘మా బామ్మ ఎప్పుడూ చెపుతూ ఉండేది.. దేవుడు మనకు అన్ని అనుభవం ద్వారా తెలియజేస్తాడు. భారత పర్యటన నాకు నా పట్ల, నా కల పట్ల, ఈ ప్రపంచం పట్ల కొత్త అవగాహన కలిగించింది’ అంటూ కామెంట్ చేశారు. విల్‌స్మిత్ ఈ ఫోటోలు పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 19 లక్షలకు పైగా లైకులు రావటం విశేషం. View this post on Instagram My Grandmother used to say, “God Teaches through Experience”. Traveling to India & Experiencing the colors, people and natural beauty has awakened a new understanding of myself, my Art & the Truths of the world. A post shared by Will Smith (@willsmith) on Apr 6, 2019 at 1:51pm PDT -
రణ్‌వీర్‌పై హాలీవుడ్ హీరో ప్రశంసలు
బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ తాజా చిత్రం గల్లీబాయ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాపై హాలీవుడ్ స్టార్ హీరో విల్‌స్మిత్ స్పందించారు. రణ్‌వీర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు విల్ స్మిత్. దీంతో రణ్వీర్ అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. గత ఏడాది విల్ స్మిత్ భారత పర్యటన సందర్భంగా రణ్వీర్ ఆయన్ను కలిసారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్న సూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాలోని ప్రత్యేక గీతం కోసం విల్ స్మిత్ 2018లో ఇండియా వచ్చారు. అదే సమయంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయి. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన గల్లీబాయ్ సినిమాలో రణ్‌వీర్‌కు జోడిగా అలియా భట్ నటించారు. “ Yo Ranveer congrats man I am loving what you’re doing with Gullyboy for me old school hip hop here seeing hip hop all over the world like that I am loving it man congrats “ - Will Smith to Ranveer Singh - OMGGGG!!!!! 😍♥️♥️ pic.twitter.com/AzZWjDmZLk — RanveerSingh TBT💗 (@RanveerSinghtbt) 16 February 2019 -
ఐష్‌ను మిస్సయ్యా
హాలీవుడ్ యాక్టర్స్‌తో వెండితెర పంచుకోవాలని చాలా మంది నటీనటులు కలలు కంటుంటారు. కానీ, ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ మాత్రం అందాలతార ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌తో జరిగిన ఓ సంభాషణలో భాగంగా విల్ స్మిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఐశ్వర్యారాయ్‌ని కలిసి, ఓ సినిమా గురించి మాట్లాడాను. కానీ, కుదర్లేదు. డ్యాన్స్ సీక్వెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమాలో ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాలని ఉంది’’ అని మనసులోని మాటను బయటపెట్టారు విల్ స్మిత్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ప్రపంచ వ్యాప్తంగా ఐశ్వర్యారాయ్‌కి ఎంత క్రేజ్ ఉందో. ఖతర్ దేశంలో జరిగిన ఓ ఫ్యాషన్ ర్యాంపులో పాల్గొన్న ఐశ్వర్యను చూస్తే ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదనే విషయం తెలుస్తోంది. ఇంకా వ్యక్తిగత విషయాల గురించి విల్‌స్మిత్ మాట్లాడుతూ –‘‘ చిన్నప్పుడు నేను హింసాత్మక వాతావరణంలో పెరిగాను. అందుకే నా పిల్లలకు మెరుగైన జీవితాన్ని అందించాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నా’’ అన్నారు. ఇటీవల విల్‌స్మిత్ 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్, నిర్మాత కరణ్ జోహార్లతో కలిసి సందడి చేసి, ఓ సెల్ఫీ దిగారు విల్‌స్మిత్. ఈ ఫొటోలను రణ్వీర్ షేర్ చేశారు. -
ఆ నటితో సినిమా చేయాలని ఉంది : విల్ స్మిత్
న్యూఢిల్లీ : హాలీవుడ్ ‘మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్’ ఎవరూ అంటే ఠక్కున విల్ స్మిత్ అని చెప్పేస్తాం. నటుడిగా, నిర్మాతగా, కమెడియన్‌గా, గేయ రచయితగా స్మిత్ హాలీవుడ్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ నటుడికి, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో సినిమా చేయాలని ఉందట. హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో నటుడు-మ్యూజిషియన్ ఫర్హాన్ అక్తర్‌తో మాట్లాడుతూ.. తన ఇష్టాన్ని విల్ స్మిత్ బయటికి చెప్పారు. దాదాపు 15 ఏళ్ల క్రిందట విల్ స్మిత్, ఐశ్వర్యను కలిశారట. ఆ సమయంలోనే ఇద్దరం కలిసి ఏదైనా చేద్దామని అనుకున్నమని, కానీ అది ఇప్పటి వరకు జరుగలేదని, బహుశా ఆమెతో కలిసి తాను సినిమా చేస్తానేమో అని తన మనసులోన మాటను బయటపెట్టారు. ఇలా ఐశ్వర్య రాయ్‌తో సినిమా చేయాలని ఉందనే ఇష్టాన్ని తెలియజేశారు. ఈ సమయంలోనే విల్ స్మిత్‌తో ఫర్హాన్ అక్తర్, భాంగ్రా స్టెపులను వేయించారు. విల్ స్మిత్‌తో సంభాషించడం చాలా సంతోషభరితంగా ఉందని, విత్ స్మిత్ వేసిన భాంగ్రా స్టెపుల వీడియోను ఫర్హాన్ అక్తర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మహమ్మద్ అలీ బయోపిక్‌లో విల్ స్మిత్, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ ఆన్‌స్క్రీన్‌లో బాక్సింగ్ ఛాంపియన్ క్యారెక్టర్లో నటించడం, నా కెరీర్లోనే ఎంతో నిర్మాణాత్మక సమయం. ఇది నన్ను పూర్తిగా మార్చేస్తుంది’ అని తెలిపారు. ఐయామ్ లెజెండ్, ఐ, రోబోట్, ఇండిపెండెన్స్ డే, మెన్ ఇన్ బ్లాక్ వంటి సినిమాల్లో విల్ స్మిత్ అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. -
హీరో కిస్ చేయబోతే వద్దని వారించిన సోఫియా!
-
రోబో సోఫియాతో హీరో డేటింగ్..!!
కేమన్ ద్వీపం : హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ రోబో సోఫియాతో డేటింగ్‌కు వెళ్లారు. కేమన్ ద్వీపాల్లో సోఫియాతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు స్మిత్. మాటలతో ఆమెను పడేయాలనుకుని స్మిత్ వేసిన ఎత్తులు సోఫియా ముందు పారలేదు. స్మిత్ : చాలా కాలం నుంచి నిన్ను కలవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరిందంటూ వైన్‌ను సోఫియా ఇచ్చేందుకు ప్రయత్నం. సోఫియా : వైన్‌ను తీసుకోలేదు. నాకూ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. స్మిత్ : జోక్ చెప్పడానికి యత్నం.. సోఫియా : హ్యూమర్ నాకు నచ్చదు స్మిత్ : రోబో ఇష్టపడే మ్యూజిక్ ఏంటి? సోఫియా : నన్ను సిలికాన్, ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్లతో తయారు చేశారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. హిప్-హాప్ మ్యూజిక్ కూడా వింటుంటాను. స్మిత్ : నా సినిమాల్లోని పాటలంటే నీకు ఇష్టమేనా? సోఫియా : నేను మీ పాటలు విన్నాను. కానీ అవి నాకు నచ్చలేదు. స్మిత్ : కొద్దిగా ముందుకు జరిగి ముద్దు పెట్టబోయారు. సోఫియా : వద్దని వారించి.. మిమ్మల్ని నేను స్నేహితుడిగా భావిస్తున్నాను అంటూ కన్నుగీటింది. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ సోఫియాను తయారు చేసింది. మనుషుల హావభావాలను తెలుసుకుని మసులుకునేలా అభివృద్ధి చేశారు. -
వారెవ్వా చికెన్ టిక్కా మసాలా
విల్‌స్మిత్ కొత్త సినిమా ‘బ్రైట్’ నెట్‌ఫ్లిక్స్‌లో గత వారమే విడుదలైంది. ఇప్పుడు సినీ అభిమానికి ఒక స్టాప్ పాయింట్లా మారిపోయిన నెట్‌ఫ్లిక్స్‌లో ఇంత పెద్ద సినిమా నేరుగా విడుదలవ్వడం అన్నది ఫిల్మ్ బిజినెస్ పరంగా చూస్తే అతిపెద్ద మార్పుగానే చెప్పుకోవచ్చు. భవిష్యత్‌లో సినిమాలు థియేటర్లలో కాకుండా ఇలా నేరుగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై వస్తాయనడానికి ఇదొక ముందస్తు సూచన. ఇండియాలోనూ నెట్‌ఫ్లిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉండడంతో ఇండియా మార్కెట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది ‘బ్రైట్’ టీమ్. ఈ నేపథ్యంలోనే గతవారం విల్‌స్మిత్ స్వయంగా సినిమాను ప్రమోట్ చేసేందుకు ఇండియా వచ్చాడు. నేషనల్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడిపిన ఆయన ఇండియాతో తన గతానుభవాలు పంచుకున్నాడు. గతంలో తాను బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇచ్చిన పార్టీకి వచ్చానని, ఆ పార్టీలో తిన్న చికెన్ టిక్కా మసాలా వారెవ్వా అని, తనకు ఫేవరెట్ ఫుడ్ అని చెప్పుకొచ్చాడు. ఇక ‘బ్రైట్’ విషయానికి వస్తే ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. -
భగవద్గీత 90 శాతం చదివా : హాలీవుడ్ హీరో
హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్ ముంబైలో సందడి చేస్తున్నారు. తను హీరోగా నటించిన బ్రైట్ సినిమా డిసెంబర్ 22న భారత్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విల్ స్మిత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్ తో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో తనకున్న స్నేహం గురించి వెల్లడించారు. తనకు అక్షయ్ కుమార్ తో సమయం గడపటం చాలా ఇష్టమన్న విల్ స్మిత్, భారత్ లో తనకు నచ్చిన విషయం అక్షయ్ ఇంట్లో భోజనమే అన్నారు. భారతీయ చరిత్ర అంటే తనకు చాలా ఇష్టమని.. భగవద్గీతను 90 శాతం చదివానని తెలిపారు. త్వరలో రిషికేశ్ కు వెళ్లనున్నట్టుగా తెలిపారు విల్ స్మిత్. స్మిత్ తో పాటు మరో హాలీవుడ్ నటుడు జోయెల్ ఎడ్‌గార్టెన్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
బాలీవుడ్ హీరో ఇంటికి స్పెషల్ గెస్ట్
ముంబై: ‘రుస్తుం’ సినిమా సక్సెస్ ను అక్షయ్ కుమార్ ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా? హాలీవుడ్ అగ్ర కథానాయకుడు విల్ స్మిత్‌తో కలిసి అక్షయ్ గ్రాండ్ గా పార్టీ చేసుకున్నాడు. ఈ ఏడాది మూడు వరుస హిట్లు అందుకున్న అక్కి తన ఇంట్లో ఆదివారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు. దీనికి విల్ స్మిత్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా, ఇతర బాలీవుడ్ తారలు ఈ పార్టీలో పాల్గొన్నారు. ‘అతిథులను అక్షయ్ పేరుపేరునా పలకరించాడు. తన అభిరుచికి అనుగుణంగా వంటలు తయారు చేయించాడు. విల్ స్మిత్ ను అతిథులకు పరిచయం చేశాడు. విల్ స్మిత్ కూడా అందరినీ అప్యాయంగా పలకరించాడు. అతిథులతో కలిసి ఫొటోలు దిగాడ’ని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వరుణ్ ధావన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్, రోహిత్ ధావన్, జాక్వెలెస్ ఫెర్నాండెజ్, శ్రద్ధాకపూర్, అలియా భట్, అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. పార్టీ ముగిసిన తర్వాత మీడియా కోసం విల్ స్మిత్, అక్షయ్ కుమార్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఎయిర్ లిఫ్ట్, హౌస్‌ఫుల్ 3, రుస్తుం సినిమాలతో అక్షయ్ వరుస విజయాలు అందుకున్నాడు. ఈ మూడు సినిమాలు రూ. 100 కోట్ల కలెక్షన్లు దాటడం విశేషం. -
ట్రంప్‌పై విరుచుకుపడ్డ స్టార్ హీరో
దుబాయ్: అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ విరుచుకుపడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికన్లలో ఇస్లామోఫోబియాలపై మండిపడ్డారు. తన తాజా సినిమా 'సూసైడ్ స్క్వాడ్' ప్రమోషన్ లో భాగంగా దుబాయ్ వచ్చిన విల్ స్మిత్ ట్రంప్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 'ట్రంప్ మాటలు తీవ్రంగా బాధపెడతాయి. అమెరికన్లు ఆయన చెప్పే మాటలు వింటుండటం విభ్రాంతికరం. అయితే ట్రంప్ వ్యాఖ్యలు వినడం ద్వారా అవి ఎంత క్రూరంగా ఉంటయో తెలుసుకోవచ్చు. తద్వారా ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తారు. చెత్తవాడుగుగాళ్లని దేశం నుంచి ఊడ్చిపారేస్తారు'అని విల్ స్మిత్ అన్నారు. ప్రస్తుతం తాను దుబాయ్ (ఇస్లామిక్ దేశం)లో ఉన్నానని, ఇక్కడ తన సినిమాలను ప్రదర్శిస్తున్నానని, సమయాన్ని ఆనందంగా గడుపుతున్నానని అంటే దీని అర్థం ముస్లింలు నన్ను ద్వేషిస్తున్నట్లా? అని వ్యంగ్యబాణాలు వేశారాయన. -
హీరోయిన్ టాటూ వేస్తానంటే వద్దన్న హీరో
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్ టాటూ వేయించుకోవడానికి నిరాకరించాడు. 'సూసైడ్ స్క్వాడ్' సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ మార్గట్ రాబీ.. స్మిత్ కు టాటూ వేసేందుకు ఉత్సాహం చూపించగా అతడు అయిష్టత వ్యక్తం చేశాడు. షూటింగ్ లో టాటూ గన్ పట్టుకుని పచ్చబొట్టు పొడిచేందుకు ఆమె ప్రయత్నించగా విల్ ఒప్పుకోలేదు. 'నా దగ్గర టాటూ గన్ ఉంది. పచ్చ బొట్టు పొడవమంటావా' అని మార్గట్ రాబీ అడగ్గా.. విల్ స్మిత్ వద్దని వారించాడు. టాటూ స్కిల్ చూపించాలన్న ఉత్సాహంపై స్మిత్ నీళ్లు చల్లాడని రాబీ వ్యాఖ్యానించింది. సహ నటుడు కోయిల్ కినర్మాన్ కు స్మిత్ టాటూ పెట్టడం విశేషం. -
అశ్రునయనాల మధ్య అలీ అంత్యక్రియలు
లూయిస్విల్లే: వేలాది మంది అశ్రునయనాల మధ్య విశ్వవిఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ(74) అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. సొంత నగరం లూయిస్విల్లే వీధుల గుండా సాగిన ఆయన అంతిమయాత్రను చివరిసారిగా తిలకించేందుకు అభిమానులు పోటెత్తారు. ‘అలీ వియ్ లవ్ యూ..’ అనే ప్లకార్డులతో మహాయోధుడికి చివరిసారిగా వీడ్కోలు పలికారు. సీతాకోక చిలుకలా విహరించు.. అనే తన నినాదానికి అనుగుణంగా కాన్వాయ్‌లోని వాహనాలకు బట్టర్‌ఫ్లయ్ గుర్తులను ఉంచారు. 1960లో ఒలింపిక్ స్వర్ణం సాధించిన అనంతరం అలీని ఘనంగా ఊరేగించిన మార్గంలోనే ఆయన చివరి యాత్రను కూడా సాగించారు. కేవ్ హిల్ శ్మశానవాటికలో ముస్లిం సంప్రదాయ పద్దతిలో ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. మాజీ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్‌లు అలీ అంత్యక్రియలకు హాజరై స్వయంగా అలీ భౌతిక దేహాన్ని తమ భుజాలపై మోశారు. సెలబ్రిటీలతో పాటు సామాన్య అభిమానులు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం గత శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. -
అలీ అంత్యక్రియలకు హాలీవుడ్ హీరో
ఇటీవల మరణించిన బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ అంత్యక్రియలు, ఈ నెల 10న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. ఇప్పటికే హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్ అలీ అంత్యక్రియలు హాజరవుతున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఆయన స్వయంగా అలీ భౌతిక దేహాన్ని తన భుజాలపై మోయనున్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్య అభిమానులు కూడ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా 30 వేల పాసులు ఇస్తున్నారు. మహ్మద్ అలీ జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన అలీ సినిమాలో విల్ స్మిత్ టైటిల్ రోల్ లో నటించాడు. ఈ పాత్రకు గాను స్మిత్ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యారు. అలీ మరణంతో తాను ఒ మంచి స్నేహితుణ్ని గురువును కొల్పోయానని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు స్మిత్. -
వస్తా నీ వెనుకా!
హాలీవుడ్ స్టార్ విల్‌స్మిత్ సరదా సన్నివేశంలో ఓ అందాల భామ అలజడి రేపింది. లాస్‌ఏంజెలిస్‌లోని ఇబిజా బీచ్‌లో బిజీ షెడ్యూల్స్కు బై చెప్పి ఈ హీరోగారు సేద తీరుతుండగా జరిగిందా ఘటన. అభిమానులు గుమిగూడగా ఫొటోలు తీసుకుంటూ స్మిత్ ఉల్లాసంగా గడుపుతున్నాడు. అప్పుడే మల్లె తీగ లాంటి చిన్నది టాప్‌లెస్‌గా ప్రత్యక్షమైంది. హీరో, అభిమానులు తీసుకుంటున్న ఫొటో ఫ్రేమ్ల్లోకి చొరబడింది. అక్కడితో ఆగక హీరోగారి వెంటపడింది. ‘వస్తా నీ వెనుకా’ అంటూ సతాయించింది. స్మిత్ స్పానిష్ వెకెషన్‌లో ఇలా అనుకోని ఘటన చోటుచేసుకుంది. నా ఫోన్ 24/7 మొబైల్ ఫోన్ విలాసం కాదు అవసరం అంటున్నాడు బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్‌కపూర్. సినిమా షూటింగ్‌లతో రోజంతా బిజీగా ఉండే తనను సేద తీర్చేది సెల్ఫోనేనన్నాడు. ‘ఇషాక్జాదె’తో తెరంగేట్రం చేసిన బోనీకపూర్ తనయుడు అర్జున్ ‘గండే’, ‘2స్టేట్స్’ సినిమాలతో పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. టెక్నాలజీ చెరుపు కాదని మంచివాళ్ల చేతిలో బాగా ఉపకరిస్తుందని చెప్పాడు. అలాగే సామాజిక బంధాలు, నైపుణ్యాలకు కూడా అది అడ్డంకి కాదన్నాడు. ట్విట్టర్ ద్వారా తను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పాడు అర్జున్‌కపూర్.