సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
ఇదేనా ప్రేమ?
తానొక ప్రేమ నౌకను అవుతానని చెబుతుంటారు నటుడు విల్ స్మిత్. ప్రేమ అనేది హింసాత్మకంగా ఉండదు. ప్రపంచం మొత్తం గమనిస్తున్న ఆస్కార్ అవార్డుల స్టేజీ మీద స్మిత్ ప్రదర్శించింది ప్రేమ కాదు.
– మారియా శ్రివర్, పాత్రికేయురాలు
జరగకూడనివి!
అదేమీ సరదాగా లేదు. ఆ జోకూ బాలేదూ, అలా చెంపదెబ్బ కొట్టడమూ బాలేదూ. (ఆస్కార్ అవార్డుల ప్రదాన వేడుకలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్య మీద అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ జోక్ చేయడం... స్మిత్ కొట్టడం నేపథ్యంలో.)
– రాఖీ త్రిపాఠి, అసోసియేట్ ప్రొఫెసర్
ఇంకా మిగిలేవుందా?
తాలిబన్లు అమ్యూజ్‌మెంట్ (వినోదం కలిగించే) పార్కులకు నిబంధనలు ప్రకటించారు. 4 రోజులు పురుషుల కోసం, మిగిలిన 3 రోజులు మహిళల కోసం. నిజంగా అఫ్గానిస్తాన్‌లో అమ్యూజ్ మెంట్ పార్కులు ఉన్నాయా!
– ఇంతియాజ్ మహమూద్, వ్యాఖ్యాత
ముందు జాగ్రత్తలు!
టీడీపీ వ్యవస్థాపక ఉత్సవాల సంగతేమో కానీ తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసు కుంటున్నారు. అసమర్థులు, చెంచాలకు తండ్రీకొడుకులు పెద్ద పీట వేస్తున్నారని మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తలు రగిలిపోతున్నారు. వారు వెంటపడి తరమకుండా చూసుకోండి.
– వి. విజయసాయి రెడ్డి, రాజ్యసభ ఎంపీ
కళ్లు తెరవాలి
అమెరికాలో నివసించే వారికి వారి నాయకుల వల్ల సులభంగా ఏమారకుండా ఉండాల్సిన నైతిక బాధ్యత ఉంది. అమెరికాకూ మరీ ఎక్కువ వినాశనం గావించే శక్తి ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉక్రెయి న్‌నుగానీ, మరిదేన్నిగానీ పట్టించుకోదు. అది లాభాలు, అధికారం మీద నడుస్తుంది. అమాయకత్వం పాపం!
– అజాము బరాకా, యాక్టివిస్ట్
దృష్టికోణం మారాలి
వధించబోయే బాధితురాలిగా ఉక్రెయిన్‌ను చూడకండి. దాన్ని ఒక యోధురాలిగా చూడండి. ఉక్రెయిన్ త్యాగాల దుఃఖం మీద దృష్టి పెట్టకండి. ఉక్రెయిన్‌కు ఏ సాయం చేస్తే విజేతగా నిలపొచ్చో దాని మీద దృష్టి పెట్టండి. రష్యా అపారతను చూసి భయపడొద్దు. నిలువరించాల్సిన, నిలువరించగలిగే పెళుసైన భారీతనంగా దాన్ని చూడండి.
– వొలొదిమిర్ యెర్మొలెంకో, ఉక్రెయిన్ సంపాదకుడు
పట్టించుకోదగినది కాదా?
అందరి కళ్లూ ఉక్రెయిన్ మీద ఉండగా– యెమెన్ రాజధాని నగరం సనా మీద అమెరికన్, బ్రిటిష్ బాంబులు పడుతున్నాయి. ఆంక్షల విధింపు ఎక్కడ? ప్రపంచ ఆగ్రహం ఎక్కడ?
– సారా అబ్దల్లా, కామెంటేటర్
Comments
Please login to add a commentAdd a comment