slap
-
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు చేదు అనుభవం.. చితకబాదిన ప్రయాణికుడు!
ప్రముఖ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్ నుంచి దిగి వస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఉన్నట్టుండి అతన్ని చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బాలీవుడ్ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు పునీత్ సూపర్ స్టార్(అసలు పేరు ప్రకాష్ కుమార్). తాజాగా అతన్ని ఓ విమాన ప్రయాణికుడు చితకబాదాడు. అసలేం జరిగిందో తెలియదు కానీ పునీత్ చితక్కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.గతంలో కూడా పునీత్ సూపర్‌స్టార్‌తో సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్ ప్రదీప్ కూడా గొడవపడ్డారు. ఆ సమయంలో పునీత్‌ను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మరోసారి అదే ఘటన పునరావృతమైంది. అయితే ఇలాంటివి అతను కావాలనే చేస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.Puneet Superstar removed from flight and beaten up again – Watch the video!#PuneetSuperstar #puneetsuperstar pic.twitter.com/ZJ7QSdyuJl— Aristotle (@goLoko77) December 18, 2024 -
థియేటర్లో అసభ్య ప్రవర్తన.. వెంటనే చేయి పట్టుకుని: హీరోయిన్
బాలీవుడ్ నటి ఇషా డియోల్ పరిచయం అక్కర్లేని పేరు. హేమమాలిని వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ టాప్ జోడీ ధర్మేంద్ర-హేమమాలినిల పెద్ద కూతురే ఇషా. కేవలం 21 ఏళ్ల వయసులోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇషా.. గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. పుణేలో తాను నటించిన దస్ మూవీ ప్రీమియర్ షోలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. అందరితో పాటు నేను కూడా ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లాను.. అదే సమయంలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడని ఇషా వెల్లడించింది. దీంతో వెంటనే అతన్ని చేయి పట్టుకుని లాగి అక్కడే చెంపదెబ్బ కొట్టానని.. ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించవద్దని ఆ సంఘటనను గుర్తు చేసుకుంది. నా చుట్టూ బౌన్సర్లు ఉన్నప్పటికీ ఇలా జరిగిందని పేర్కొంది. కాగా.. ఈషా చివరిసారిగా హంటర్ టూటేగా నహీ తోడేగా అనే షోలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ హీరో హీరోయిన్ అనే చిత్రంలో కనిపించనుంది.భర్తతో విడాకులుకాగా.. హీరోయిన్ ఈషా డియోల్ కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకున్న ఈమెకు రాధ్య, మిరాయ అని ఇద్దరు కూతుర్లున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు ప్రకటించారు. -
‘కంగన’కు చెంపదెబ్బపై పంజాబ్ సీఎం కీలక కామెంట్స్
చండీగఢ్: బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ స్పందించారు. పంజాబ్ రైతుల పోరాటంపై కంగన చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను కానిస్టేబుల్ కొట్టిందని చెప్పారు.#WATCH | On Kangana Ranaut-CISF constable incident, Punjab CM Bhagwant Mann says, "That was anger. She (Kangana Ranaut) had said things earlier and there was anger for it in the heart of the girl (CISF constable). This should not have happened. But in reply to it, despite being a… pic.twitter.com/cFhWBw5fxb— ANI (@ANI) June 10, 2024‘అది కోపం. కంగన గతంలో మాట్లాడిన మాటలే కానిస్టేబుల్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడటం తప్పు’భగవంత్‌మాన్ మీడియాతో చెప్పారు. జూన్6వ తేదీన కంగన చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్కు వెళ్లినపుడు అక్కడున్న కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపపై కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొందని, ఆ పోరాటాన్ని కంగన కించపరిచినందుకే కొట్టానని తెలిపింది. -
‘కంగన’కు చెంపదెబ్బ.. సంజయ్‌రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: బాలీవుడ్ నటి, బీజేపీఎంపీ కంగనా రనౌత్‌ను మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ‘కొందరు ఓట్లు వేస్తారు. కొందరు చెంపదెబ్బలు కొడతారు. కంగనా విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆమెపై నాకు సానుభూతి ఉంది.ఆమె ఇప్పుడు ఒక ఎంపీ. ఎంపీపై దాడి జరగకూడదు. ఆ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెబుతున్నట్లు ఆమె తల్లి గనుక రైతుల ధర్నాలో ఉంటే కోపం వస్తుంది. రైతుల పోరాటానికి వ్యతిరేకంగా కంగన మాట్లాడింది. నాకు రైతుల పట్ల గౌరవం ఉంది’అని సంజయ్‌రౌత్ అన్నారు.ఛండీగఢ్ ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం సంచలనం రేపింది. కంగన రైతుల పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడినందునే తాను కొట్టినట్లు కానిస్టేబుల్ తెలిపింది. కాగా, గతంలో మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ అధికారంలో ఉన్నప్పుడు కంగన శివసేనకు వ్యతిరేకంగా తరచూ సవాళ్లు విసురుతూ ఉండేది. ఒక దశలో ముంబైలోని కంగనా స్టూడియో భవనాన్ని మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణమని పేర్కొంటూ కూల్చివేశారు. -
కంగనకు కానిస్టేబుల్ చెంపదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది. తర్వాత దూషించింది. ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా ఆ పని చేశా అని చెప్పింది. పంజాబ్‌లో ఉగ్ర, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి’’ అని కంగనా అన్నారు. ఢిల్లీకి చేరుకున్నాక సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను కలిసి జరిగింది వివరించారు.కానిస్టేబుల్ వాదనేంటి?చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్ అక్కడ వారితో.. ‘‘ నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఆందోళన బాటపట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసినందుకే కంగనను కొట్టా. ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం రూ.100 కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారు. ఆనాడు ధర్నా చేస్తున్న వాళ్లలో మా అమ్మ కూడా ఉంది. మాది రైతు కుటుంబం. మా అన్న కూడా రైతు. కంగనా అలాగే రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా?’’ అని ఆవేశంగా మాట్లాడారు. -
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన దురుసుతనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హవేరి ప్రాంతానికి డీకే వెళ్లారు. అక్కడ కారు దిగగానే ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు.దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్ ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ వీడియో కాంగ్రెస్ పార్టీని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ డీకే పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయి. — BJP Karnataka (@BJP4Karnataka) May 5, 2024 -
పాకిస్తాన్‌ను షేక్ చేస్తున్న 'స్లాప్' కబడ్డీ.. వీడియో వైరల్
మన దేశంలో కబడ్డీ ఆటకు యమ క్రేజ్ ఉంది. ముఖ్యంగా కబడ్డీ వరల్డ్‌కప్ పోటీల్లో మన దేశం మూడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఇండోర్ గేమ్‌గా పిలవబడే కబడ్డీ ఆటలో మనోళ్లు కింగ్ అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నారు. అటు వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ, మెడల్స్‌లోనూ మన దేశమే అగ్రస్థానంలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో కబడ్డీకి ఉన్న క్రేజ్ దృశ్యా ప్రో కబడ్డీ లీగ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రో కబడ్డీ లీగ్ తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్లో స్లాప్ కబడ్డీ(Slap Or Tappad) తెగ వైరల్ అవుతోంది. వినటానికి కొత్తగా ఉన్నా ఆటతీరు మాత్రం కడుపుబ్బా నవ్వుకునేలా ఉంది. సాధారణంగా ఏడుగురు ఉండే కబడ్డీలా కాకుండా ఈ ఆట ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఒక ఆటగాడు కొట్టడం ద్వారా పాయింట్‌ను స్కోరు చేస్తాడు. మరో ఆటగాడు ఈ పాయింట్‌ని కోల్పొకుండా ప్రత్యర్థి నుంచి కాపాడుకుంటాడు. ఇందులో పంచ్‌లను ఫౌల్ లుగా పరిగణిస్తారు. ఇప్పుడు ఈ స్లాప్ కబడ్డీ నెట్టింట వైరల్ అవుతోంది. ఆటను చూడటానికి వచ్చిన వారి నుంచి వచ్చే డబ్బునే విజేతకి ఇస్తారు. ప్రస్తుతం స్లాప్ కబడ్డీకి పాకిస్తాన్లో ఎంతో ప్రజాదరణ ఉంది. ''ఒక ఆటగాడు తన ప్రత్యర్థిని ఎన్నిసార్లైనా కొట్టవచ్చు. ఇక్కడ సంఖ్య అంత ముఖ్యం కాదు. ఆటగాళ్లు గాయాలు తగలకుండా ప్రయత్నిస్తారు.'' అని పాకిస్థాన్ స్లాప్ ఆటగాడు ఒకరు మీడియాకు తెలిపారు. What fighting style is this 😧 pic.twitter.com/D5mNAXEVwK — Woman of Wonder 🐳 (@WonderW97800751) June 29, 2023 చదవండి: Ashes 2023: అండర్సన్‌పై వేటు.. బ్రూక్‌కు ప్రమోషన్; మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే WI Vs IND 2023: దిగ్గజంతో చేతులు కలిపిన రోహిత్, విరాట్.. -
మెట్రోలో యువకుని చెంప చెల్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మెట్రోలో ఇద్దరు యువకులు కొట్టుకున్న ఘటన అనంతరం ప్రస్తుతం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మెట్రోలో ఓ యువతి ఓ యువకున్ని చెంప చెల్లుమనిపించింది. ఏమైందో తెలియదు.. కానీ యువకున్ని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయింది. మిగిలిన ప్రయాణికులు వారికి దూరంగా ఉండి చూస్తూ ఉండి పోయారు. Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) - Girl slaps him too hard just think if it was vice-versa😀 pic.twitter.com/Y0RiKeYWem — Ghar Ke Kalesh (@gharkekalesh) July 3, 2023 మెట్రోలో ప్రయాణికులందరూ ఎవరి పనిలో వారు ఉన్నారు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. పక్కనే ఉన్న ఓ యువకుని వైపు దూసుకొచ్చి... అతని చెంప చెల్లుమనిపించింది. బూతులు తిడుతూ మరల యువకునిపై దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయింది. ఇదంతా చూస్తున్న జనాలు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలా భావించి దూరంగా ఉండిపోయారు. ఈ దృశ్యాలను ఓ ప్రయాణికుడు వీడియో తీసి పోస్టు చేశాడు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. వ్యూయర్స్ రకరకాలుగా స్పందించారు. వారిద్దరి మధ్యలోకి చొరవ తీసుకోనందుకు తోటి ప్రయాణికులకు కొందరు ధన్యవాదాలు తెలిపారు. మెట్రోలో ఇలా ప్రవర్తిస్తే అందరికి ఇబ్బంది కలగదా? అని మరికొందరు కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..! -
విల్ స్మిత్ ప్రదర్శించింది ప్రేమ కాదు..
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఇదేనా ప్రేమ? తానొక ప్రేమ నౌకను అవుతానని చెబుతుంటారు నటుడు విల్ స్మిత్. ప్రేమ అనేది హింసాత్మకంగా ఉండదు. ప్రపంచం మొత్తం గమనిస్తున్న ఆస్కార్ అవార్డుల స్టేజీ మీద స్మిత్ ప్రదర్శించింది ప్రేమ కాదు. – మారియా శ్రివర్, పాత్రికేయురాలు జరగకూడనివి! అదేమీ సరదాగా లేదు. ఆ జోకూ బాలేదూ, అలా చెంపదెబ్బ కొట్టడమూ బాలేదూ. (ఆస్కార్ అవార్డుల ప్రదాన వేడుకలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్య మీద అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ జోక్ చేయడం... స్మిత్ కొట్టడం నేపథ్యంలో.) – రాఖీ త్రిపాఠి, అసోసియేట్ ప్రొఫెసర్ ఇంకా మిగిలేవుందా? తాలిబన్లు అమ్యూజ్మెంట్ (వినోదం కలిగించే) పార్కులకు నిబంధనలు ప్రకటించారు. 4 రోజులు పురుషుల కోసం, మిగిలిన 3 రోజులు మహిళల కోసం. నిజంగా అఫ్గానిస్తాన్‌లో అమ్యూజ్ మెంట్ పార్కులు ఉన్నాయా! – ఇంతియాజ్ మహమూద్, వ్యాఖ్యాత ముందు జాగ్రత్తలు! టీడీపీ వ్యవస్థాపక ఉత్సవాల సంగతేమో కానీ తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసు కుంటున్నారు. అసమర్థులు, చెంచాలకు తండ్రీకొడుకులు పెద్ద పీట వేస్తున్నారని మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తలు రగిలిపోతున్నారు. వారు వెంటపడి తరమకుండా చూసుకోండి. – వి. విజయసాయి రెడ్డి, రాజ్యసభ ఎంపీ కళ్లు తెరవాలి అమెరికాలో నివసించే వారికి వారి నాయకుల వల్ల సులభంగా ఏమారకుండా ఉండాల్సిన నైతిక బాధ్యత ఉంది. అమెరికాకూ మరీ ఎక్కువ వినాశనం గావించే శక్తి ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉక్రెయి న్నుగానీ, మరిదేన్నిగానీ పట్టించుకోదు. అది లాభాలు, అధికారం మీద నడుస్తుంది. అమాయకత్వం పాపం! – అజాము బరాకా, యాక్టివిస్ట్ దృష్టికోణం మారాలి వధించబోయే బాధితురాలిగా ఉక్రెయిన్ను చూడకండి. దాన్ని ఒక యోధురాలిగా చూడండి. ఉక్రెయిన్ త్యాగాల దుఃఖం మీద దృష్టి పెట్టకండి. ఉక్రెయిన్‌కు ఏ సాయం చేస్తే విజేతగా నిలపొచ్చో దాని మీద దృష్టి పెట్టండి. రష్యా అపారతను చూసి భయపడొద్దు. నిలువరించాల్సిన, నిలువరించగలిగే పెళుసైన భారీతనంగా దాన్ని చూడండి. – వొలొదిమిర్ యెర్మొలెంకో, ఉక్రెయిన్ సంపాదకుడు పట్టించుకోదగినది కాదా? అందరి కళ్లూ ఉక్రెయిన్ మీద ఉండగా– యెమెన్ రాజధాని నగరం సనా మీద అమెరికన్, బ్రిటిష్ బాంబులు పడుతున్నాయి. ఆంక్షల విధింపు ఎక్కడ? ప్రపంచ ఆగ్రహం ఎక్కడ? – సారా అబ్దల్లా, కామెంటేటర్ -
కానిస్టేబుల్‌ను చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
-
సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్
నిర్మల్: సర్పంచ్‌పై మహిళా ఉపసర్పంచ్ చెప్పుతో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లలాలో గురువారం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నిర్మల్ జిల్లా మహాగామ్ గ్రామంలో చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణపై గురువారం విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ రాకేష్‌కు, ఉప సర్పంచ్ శారదకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. (చదవండి: వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..) ఈ క్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఉప సర్పంచ్ శారద.. సర్పంచ్ రమేష్‌ని చెప్పుతో కొట్టింది. -
వైరల్: కార్యకర్త చెంప చెల్లుమనిపించిన డీకే శివకుమార్
-
లవ్ ఎఫైర్: వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు
లక్నో: ఈ మధ్యకాలంలో పెళ్లి మంటపాలు వైరల్ సంఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. వీటికి సబంధించిన వీడియోలు, వార్తలు సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి వెలుగు చూసింది. పెళ్లి మంటపం నుంచి బయలుదేరిన వధువు అత్తారింట్లో అడుగుపెట్టకముందే అందరికి షాక్ ఇచ్చింది. వాకిట్లోనే అందరు చూస్తుండగా... వరుడి చెంప చెళ్లుమనిపించింది. ఆ తర్వాత చక్కా ఇంట్లోకి వెళ్లి.. పెళ్లి దుస్తులు మార్చుకుని.. అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం కాస్త ఊరంతా పాకడంతో ఇది కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆ వివరాలు.. ఈ అనూహ్య సంఘటన ఉత్తరప్రదేశ్ జౌన్పూర్ లవయాన్ గ్రామాంలో చోటు చేసుకుంది. వివాహం సదర్భంగా వరుడి తరఫు బందువులంతా పెళ్లి కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అంగరంగ వైభవంగా ఎంతో సందడిగా వివాహ తంతు పూర్తయ్యింది. ఆ తర్వాత నూతన దంపతులిద్దరు కారులో పెళ్లి కుమారుడి ఇంటికి బయలుదేరారు. కారు నుంచి కిందకు దిగి.. అత్తింట్లో అడుగుపెట్టడానికి ముందు వధువు, అందరూ చూస్తుండగా తన భర్త చెంప చెళ్లుమనిపించింది. ఈ ఊహించని ఘటనకు అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. దీన్ని నుంచి తేరుకునేలోపే కొత్త పెళ్లికూతురు లోపలికి వెళ్లి డ్రస్ మార్చుకుని.. చక్కా పుట్టింటికి వెళ్లింది. అక్కడ వారు రిసెప్షన్ వేడుకకు సిద్ధమవుతున్నారు. ఈలోపు ఈ వార్త కాస్త ఊరంతా పాకింది. దాంతో వరుడి కుటుంబ సభ్యులు పెళ్లి కుమార్తె ఇంటి వద్దకు వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో వివాదం కాస్త ముదరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక వారి దర్యాప్తులో తేలింది ఏంటంటే.. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది అన్నారు. చదవండి: పెళ్లిలో ప్రత్యక్షమైన మాజీ ప్రియుడు.. తర్వాత సీన్ ఏంటంటే! -
అధ్యక్షుడికి చెంపదెబ్బ: ‘అతడికి 18నెలల జైలు శిక్ష విధించండి’
వాలెన్స్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తికి 18 నెలల జైలు శిక్ష విధించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. నిందితుడు డామియెన్ టారెల్ చర్య కచ్చితంగా ఆమోదయోగ్యం కానిదని, అది ఉద్దేశ్యపూర్వకంగా హింసకు పాల్పడడమేనని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కారణంగా ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 45వేల యూరోల జరిమానా పడే అవకాశం ఉంది. కాగా, గత మంగళవారం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మాక్రాన్ టేయిన్ ఎల్ హెర్మిటేజ్‌లోని ఓ హోటల్ స్కూల్‌ను సందర్శించారు. మధ్యాహ్నం 1.15 ప్రాంతంలో అక్కడినుంచి వెళ్లిపోవటానికి తన కారులోకి వెళ్లి కూర్చున్నారు. అయితే, ప్రజలు ఆయన్ని చూడాలని అరుస్తుండటంతో జనం దగ్గరకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో బ్యారిగేడ్ల దగ్గర ఉన్న డామియెన్ టారెల్( ఆకుపచ్చ రంగు టీషర్టు వేసుకున్న వ్యక్తి) దగ్గరకు వచ్చారు. ఆ వెంటనే అతడు అధ్యక్షుడు మాక్రన్ చెంపను చెల్లుమనిపించాడు. దీంతో మాక్రాన్ వ్యక్తిగత సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వారు ఆయన్ని పక్కుకు తీసుకెళ్లి, టారెల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. చదవండి : షేక్‌హ్యాండ్ ఇవ్వబోయిన అధ్యక్షుడి చెంప మీద కొట్టాడు! -
ఎయిర్‌లైన్ ఉద్యోగి చెంప చెళ్లుమనిపించిన ఎస్సై
గాంధీనగర్/ అహ్మదాబాద్: ఆలస్యంగా రావడంతో బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఆగ్రహించిన ఎస్సై ర్యాంక్ క్యాడర్ వ్యక్తి విమానాశ్రయ సిబ్బంది చెంప చెళ్లుమనిపించిన ఘటన అహ్మాదాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. వివరాలు.. గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారంతా ఢిల్లీకి వెళ్లడం కోసం స్పైస్‌జెట్ ఎస్జీ-8194 విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే వారు ఆలస్యంగా రావడంతో సిబ్బంది బోర్డింగ్‌కు అనుమతివ్వలేదు. దాంతో పోలీసు అధికారి, స్పైస్‌జెట్ స్టాఫ్‌తో గొడవకు దిగాడు. తమకు బోర్డింగ్ పాస్ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు అధికారి.. సిబ్బంది చెంప పగలకొట్టాడు. (చదవండి: పైలట్‌పై ముసుగు దొంగల దాడి) దాంతో ఎస్సైతో పాటు ఉన్న మిగతా ఇద్దరు ప్రయాణీకులకు, సిబ్బందికి మధ్య గొడవ తీవ్రం అయ్యింది. పరిస్థితిని నియంత్రించడానికి విమానాశ్రయ భద్రతా సిబ్బంది, సీఐఎస్ఎఫ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. అనంతరం విమాన్రాశయ ఉద్యోగిని, సదరు పోలీసు అధికారితో పాటు ఉన్న మిగతా ఇద్దరిని స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఆ తర్వాత వారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. కానీ సదరు పోలీసు అధికారిని మాత్రం విమానంలో ప్రయాణించేందుకు అనుమతించలేదు. -
ఏం పర్లేదు, చెంప చెళ్లుమనిపించు
ముంబై: బాలీవుడ్ నటి అమృతా రావు తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉండాలి. అప్పుడెప్పుడో 'అతిథి' చిత్రంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు జోడీగా నటించారు. ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించలేరు. బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోలతో జత కడుతూ సినిమాలు చేసుకుంటూ పోయారు. అయితే ఈ మధ్య కాస్త వెనకబడ్డ అమృతా రావు తన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన "ఇష్క్ విష్క్" చిత్రం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్‌ను లాగి పెట్టి కొట్టే సీన్ ఉంటుంది. ఈ సీన్ పూర్తి చేసేందుకు తల ప్రాణం తోక్కొచ్చిందంటున్నారు. మరోవైపు దర్శకుడు కెన్ ఘోష్.. షాహిద్‌ను కొట్టినట్లు అతడి మొహంలో రియాక్షన్ కనిపించాలని మరింత ఒత్తిడి తెచ్చారు. (గురుశిష్యులు) ప్రేక్షకులు ఈ సీన్లో లీనమవాలన్నారు. అయితే అంతకు ముందెన్నడూ ఎవరినీ ఒక్క దెబ్బ కూడా వేయని అమృతా రావుకు ఈ సీన్ తన వల్ల కాదేమోనని తెగ భయపడిపోయారు. సరిగ్గా అప్పుడే షాహిద్ తల్లి నీలిమ అజీమ్ కనిపించారు. ఆమే స్వయంగా తన కొడుకును ఎలా కొట్టాలో చెప్తూ ఎంకరేజ్ చేశారు. షూటింగ్ ఆన్ అవగానే ఆమె పక్కనుంచి "నువ్వు చేయగలవు, కొట్టు, గట్టిగా చెంప చెళ్లుమనిపించు" అంటూ ప్రోత్సహించింది. వెంటనే అమృత కూడా షాహిద్‌ను కోపంగా ఒక్క దెబ్బ వేసింది. స్క్రీన్‌పై అది అనుకున్నదానికన్నా బాగా రావడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. (నా సినిమాలు ఫ్లాప్.. అందుకే: నటుడు) -
సహాయకుడిని చెంపదెబ్బ కొట్టిన సిద్ధరామయ్య
-
పోలీస్‌స్టేషన్‌లో మహిళ వీరంగం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని, తనతో సహజీవనం చేసిన వ్యక్తిని మహిళ చెప్పుతో కొట్టారు. అప్పు తిరిగి ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు వనస్థలిపురం పీఎస్‌కు వచ్చారు. ఆమెతో పాటు అప్పు తీసుకున్న వ్యక్తిని పీఎస్‌కు తీసుకొచ్చారు. నువ్వేమైనా నా మొగుడివా అంటూ అతనిపై చెప్పుతో దాడి చేశారు. ఈ ఘటనతో షాక్ తిన్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. -
స్కూల్లో ఘోరం : బాలికకు 168 చెంపదెబ్బలు
ఝబువా, మధ్యప్రదేశ్ : హోం వర్క్ చేయలేదని పన్నెండేళ్ల బాలికను 168 చెంపదెబ్బలు కొట్టించాడో కసాయి టీచర్. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా తాండ్లా పట్టణంలోని నవోదయ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ నెల 11 తేదీ నుంచి 16వ తేదీ వరకూ రోజూ 14 మంది తోటి బాలికలతో తన కూతురిని సైన్స్ టీచర్ చెంపదెబ్బలు కొట్టించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెంపదెబ్బలతో తీవ్రంగా భయపడిన బాలిక అనారోగ్యం పాలైందని ఆమె తండ్రి శివ ప్రతాప్ సింగ్ తెలిపారు. నవోదయలో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న మనోజ్ కుమార్ వర్మ హోం వర్క్ ఇవ్వగా అనారోగ్యం కారణంగా బాలిక చేయలేదని ప్రతాప్ సింగ్ వెల్లడించారు. అయితే, హోం వర్క్ చేయనందుకు శిక్షగా మనోజ్ ఆరు రోజుల పాటు 168 చెంపదెబ్బలు కొట్టించారని చెప్పారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన నవోదయ ప్రిన్సిపాల్ సాగర్... అది కేవలం ఫ్రెండ్లీ పనిష్మెంట్ మాత్రమే అని అన్నారు. బాలికను గాయపర్చాలనే ఉద్దేశంతో టీచర్ అలా చేయలేదని సర్ది చెప్పేందుకు యత్నించారు. బాలిక తల్లిదండ్రులతో ఈ విషయంపై చర్చించి సమస్యను పరిష్కరించుకుంటామని వివరించారు. -
‘రాత్రికి వస్తే రిలీవింగ్ ఆర్డర్ ఇప్పిస్తా’
-
‘రాత్రికి వస్తే రిలీవింగ్ ఆర్డర్ ఇప్పిస్తా’
► ఓ ఉపాధ్యాయురాలితో తోటి టీచర్ అసభ్య పదజాలం ► అందరిముందు చెప్పులతో కొట్టుకున్న టీచర్లు ► పోలీసులను ఆశ్రయించిన బాధిత ఉపాధ్యాయురాలు ► కేసు నమోదు చేసిన పోలీసులు అనంతపురం: ‘ఈ రాత్రికి మున్సిపల్ కమిషనర్ రెస్ట్ రూంకు వస్తే... నీకు రిలీవింగ్ ఆర్డర్ ఇప్పిస్తా’ అంటూ కదిరి మున్సిపల్ పాఠశాలలో పనిచేసే ఓ మహిళా టీచర్ పట్ల మున్సిపాలిటీలోనే మరో స్కూల్లో పనిచేసే మైనుద్దీన్ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళా టీచర్ అతనితో గొడవ పడి, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆదివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ‘ఆనంద ఆదివారం’ పేరుతో మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడికి మున్సిపల్ కమిషనర్ భవానిప్రసాద్‌తో పాటు మున్సిపల్ టీచర్లందరూ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మహిళా టీచర్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె ద్విచక్ర వాహనం వద్ద వేచి ఉన్న మైనుద్దీన్ ‘మీరు యూఎల్బీ(అర్బన్ లోకల్ బాడీ)కోఆర్డినేటర్‌గా బదిలీ కోసం డీఎంఏ ఆఫీస్ నుండి ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని రిలీవ్ చేయలేదని విన్నాను. ఒక పనిచెయ్.. ఈ రోజు రాత్రికి కమిషనర్ రెస్ట్ రూంకు వచ్చి మాతో గడుపు... నీకు రిలీవింగ్ ఆర్డర్ ఇప్పిస్తాను’ అని అన్నాడు. దీంతో కంగుతిన్న సదరు మహిళా టీచర్ వెంటనే ‘నీ భార్యను పిల్చుకెళ్లురా.. నాకు అలాంటి అలవాట్లు లేవు..’ అంటూ చెప్పుతీసుకొని ఆ కామాంధుడిపైకి విసిరింది. అనంతరం ఇద్దరూ చెప్పులతో దాడి చేసుకోగా... అక్కడే ఉన్న ఉపాధ్యాయులు జరిగిన మొత్తం సంఘటనను తమ సెల్ఫోన్లలో బంధించారు. గొడవ అనంతరం బాధిత మహిళా టీచర్ నేరుగా పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పట్ల అసభ్యకర పదజాలం ఉపయోగించడమే కాకుండా తనను కులం పేరుతో దూషించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జ్ డీఎస్పీ కరీముల్లా షరీఫ్ పేర్కొన్నారు. దీనిపై మైనుద్దీన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఆమెపట్ల ఎటువంటి అసభ్యకర పదజాలం ఉపయోగించలేదని ఆమే తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని పేర్కొన్నాడు. -
గుంటూరులో పోకిరీకి బడితెపూజా
-
మరో వివాదంలో మంత్రి అజంఖాన్
రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ నేత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అజంఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ అధికారిపై ఆయన చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంపూర్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ నిర్మాణపు పనుల్లో జాప్యం జరుగుతోందంటూ అజంఖాన్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ఇంజనీర్ చెంపమీద కొట్టారు. మరోవైపు అజంఖాన్ చర్యను నిరసిస్తూ ఇంజనీర్లు నిర్మాణపు పనులను నిలిపివేశారు. తక్షణమే మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ నిర్మాణపు పనులను చేపట్టేది లేదని స్పష్టం చేశారు. గతంలోనూ అజంఖాన్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
పెళ్లిలో ఎంపీతో గొడవపడి..
బార్మెర్: రాజస్థాన్‌లోని బార్మెర్లో ఓ యువకుడు స్థానిక బీజేపీ ఎంపీ సొనారామ్ చౌదరితో గొడవపడి చెంపదెబ్బ కొట్టాడు. ఓ వివాహ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం ఎంపీ సొనారామ్, కలెక్టర్ ఇతర ప్రముఖులు ఓ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్తారామ్ అనే యువకుడు వచ్చి ఎంపీతో ఓ విషయం గురించి మాట్లాడుతూ వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో ఊగిపోయిన ఖర్తారామ్ ఎంపీని చెంపదెబ్బ కొట్టాడు. నిందితుడు వెంటనే అక్కడ నుంచి పారిపోయినట్టు జిల్లా ఎస్పీ పారిస్ దేశ్‌ముఖ్ చెప్పారు. ఎంపీ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఖర్తారామ్తో పాటు అతడితో ఉన్న ప్రేమరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీకి కొద్ది దూరంలో ఉన్నానని కలెక్టర్ సుధీర్ శర్మ చెప్పారు. -
నటి చేయిపట్టి లాగిన రిపోర్టర్.. చెంప చెళ్లు
లాస్ ఎంజెల్స్: తిక్క ప్రశ్న వేయడమే కాకుండా తన చేయిపట్టి లాగినందుకు ఓ రిపోర్టర్ చెంపను చెళ్లుమనిపించింది ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ బెల్. అతడి ప్రవర్తనను చూసి చిర్రెత్తి పోయింది. ఓ ప్రముఖ వెబ్ సైట్ సేకరించిన వీడియో సమాచారం ప్రకారం ది బాస్ అనే చిత్రం ప్రీమియర్ కార్యక్రమానికి క్రిస్టెన్ బెల్ హాజరైంది. అదే కార్యక్రమానికి వచ్చిన డొనెల్లీ అనే రిపోర్టర్ ఆమె రెడ్ కార్పెట్ పై ఉండగా ముఖానికి దగ్గరగా మైక్ పెట్టి ఇబ్బంది పెట్టేలా, ధ్వంధ్వార్ధం వచ్చేలా ప్రశ్నించాడు. ఈ చిత్రిలో బాస్ ఎవరు అని ప్రశ్నించడమే కాకుండా మరో ప్రశ్న కూడా అడిగాడు. అప్పటికే ఆమె ఆగ్రహతం కుతకుతలాడిపోయింది. అతడి నుంచి దూరంగా జరిగి వెళ్లిపోతుండగా ఒక్కసారిగా చేయిపట్టుకొని లాగేందుకు ప్రయత్నిస్తూ 'బేబీ' అంటూ పిలిచాడు. దీంతో ఇక కోపాన్ని ఆపుకోలేక గట్టిగా లాగిపెట్టి ఒక్కటిచ్చింది. అయితే, అతడు ఏం ప్రశ్న వేశాడనే విషయం మాత్రం చెప్పలేదు. అతడి ప్రవర్తనకు ఉలిక్కిపడిన ఆమె కొద్ది సేపటికే కార్యక్రమం కోసం లోపలికి వెళ్లిపోయారు.